గాంధీజీ మహాత్ముడైన విధం -4
ప్రభుత్వాధికారులు నౌక ప్రయాణీకులను నిర్బంధించటం లో వచ్చే కష్టనష్టాలు ఆలోచించలేదు .పోర్ట్ కు చేరిన వేలాది తెల్లవారు తమ ఆందోళన సక్సెస్ అని సంబర పడ్డారు .ఇలా నౌకా నిర్బంధంలో భారతీయులను 23 రోజులుంచారు . వలస వాదులను భయపెట్టి దక్షణాఫ్రికాలో ప్రవేశించకుండా చేయవచ్చుననే వ్యూహమూ వాళ్ళ మనసులో ఉంది .తెల్లమూక తోకముడవగానే ఇండియన్ లు నౌకదిగి డడర్బాన్ లో కాలుమోపారు .
గాంధీని మరో రోజు షిప్ లోనే ఉండిపొమ్మని ,లేకపోతె తెల్లవారి ఆగ్రహజ్వాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదేశించారు .మిగిలిన పాసెంజర్ లతోపాటు గాంధీ కుటుంబం కూడావెళ్ళిపోయింది .గాంధీ ఒక్కడే ఓడలో ఉన్నాడు .గాంధీ లాయర్ స్నేహితుడు మిస్టర్ లాటన్ వచ్చి,రాత్రిదాకా షిప్ లో ఉండకుండా తనతో కాలినడకన రుస్తు౦ భాయి ఇంటికి రమ్మని కోరాడు .అలాగే అని వెడుతుండగా గాంధీ టర్బన్ గుర్తించిన తెల్లమూక ఆగ్రహం తో వొంగోపెట్టి దెబ్బలతో చంపే ప్రయత్నం చేసింది .మీదకు చేపలు విసిరి అవమాన పరచి ,దాడి చేశారు .స్పృహ కోల్పోయి అచేతనంగా రోడ్డుపై పడిపోయాడు గాంధీ .కసి తీరక మళ్ళీ కొట్టి చంపే వాళ్ళేకానిపోలీస్ సూపరిం టే౦ డెంట్ అలేక్సాండర్ భార్య అడ్డుపడి,గాంధీకి, తెల్లమూకకు మధ్య రక్షణ కవచంలా నిలబడి పోయింది .ఇంతలో పోలీసులు వచ్చి గాంధీని రుస్తుంజీ పాలెస్ కు చేర్చారు .కానీ కోపోద్రేకాలతో ఊగిపోయిన తెల్లమూక రుస్తుమ్జీ ఇంటిని చుట్టు ముట్టారు .అక్కడి నుంచి గాంధి మారువేషం లో ఒక పోలీస్ సాయంతో తప్పించుకొన్నాడు .
ఈ దౌర్జన్య కాండ వార్త ఇంపీరియల్ గవర్నమెంట్ ను రెచ్చగొట్టింది .గాంధీపై దాడి జరిపిన వారిని గుర్తించి శిక్షించి అరెస్ట్ చేయమని నటాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది .ఇలా చేస్తే నటాల్ తెల్లజాతి వారి నుంచి తీవ్ర ఇబ్బందులేర్పడి ,యూరోపియన్ వోటర్లపై ప్రభావం చూపిస్తుందని భయపడ్డారు కానీ గాంధీ తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టదలచుకోలేదని నిర్ణ ఇంచు కొన్నాక అటార్నీ జనరల్ హారీ ఎస్కామ్బే ,భావి నటాల్ ప్రధాని ఊపిరి పీల్చుకొన్నారు .కనీసం కాగితం పైన అయినా ఫిర్యాదు చేయమని కోరగా గాంధీ ‘’నేను ఇక్కడ కాలుపెట్టగానే నన్ను గాయపరచినవారిపై బాధపెట్టే పని ఏదీ చేయకూడదని మనసులో నిర్ణయించుకొన్నాను .కనుక దాడి చేసిన వారిని ప్రాసిక్యూట్ చేయటం అనేది జరగనిపని ‘’అని రాశాడు .దీనితో మొదటి సారిగా సౌతాఫ్రికా, గాంధీ గారి సంస్కృతీ ,మానవత్వం ,హుందాతనం అర్ధం చేసుకొన్నది ..
బోయర్ యుద్ధం
అప్పుడే ట్రాన్స్ వాల్ ,ఆరంజ్ ఫ్రీ రాష్ట్రాలు ఖనిజ సంపదకు నిలయాలుగా రూపొందాయి . .కనుకసహజం గా బ్రిటిష్ వారికళ్ళు వీటిపై పడ్డాయి .ఇది క్రమ౦గా ఆంగ్లో – డచ్ శత్రుత్వానికి దారి తీసి,చివరకు 1899-1901మధ్య యుద్ధం ఆర౦భమైంది బోయర్ ల చాలెంజి వలన యూరోపియన్ సామ్రాజ్యం ఉనికికే ప్రమాదం వాటిల్ల బోతోందని గాంధీ గ్రహింఛి బ్రిటిష్ పక్షాన నిలిచాడు .ఇందులోని తర్కాన్ని ‘’నేను బ్రిటిష్ పౌరుడిగా హక్కులకోసం పోరాడు తున్నాను కనుక బ్రిటిష్ ప్రభుత్వ రక్షణకోసం సాయం చేస్తున్నాను ‘’అని చెప్పాడు 11వేలమంది సుశిక్షితులైన వాలంటీర్ల తో’’అంబులెన్స్ కార్ప్స్’’ తయారు చేశాడు .దీనితో దక్షిణాఫ్రికా భారతీయులకు కొద్దిగా గౌరవం, గుర్తింపు లభించాయి .
బోయర్ యుద్ధం పూర్తయ్యాక బ్రిటిష్ వారిలో ఇండియన్లపట్ల సుహృద్భావం ,ఏర్పడి నిత్య సంఘర్షణ వాతావరణం ఉండదని భావింఛి మళ్ళీ ఇండియా వెళ్లాలని నిర్ణయించాడు .ఏడాది లోపల తన అవసరం ఉందని తెలియ జేస్తే వచ్చి వాలుతానని ఇండియన్స్ కు అభయమిచ్ఛి ఇ౦డియాకు బయల్దేరాడు .ఇండియాలో స్థిరపడ్డాక ఇండియన్ కమ్యూనిటి నుంచి చా౦బర్లేన్ పర్యటనకు వస్తున్నాడని , అర్జెంట్ గా దక్షిణాఫ్రికా బయల్దేరి రమ్మనే కేబుల్ అకస్మాత్తుగా అందుకొన్నాడు. .ఆగ మేఘాలమీద సౌతాఫ్రికాలో వాలిపోయాడు .కాని అతను ఇండియన్ ప్రతినిది వర్గానికి పుర్ర చెయ్యి చూపింఛి ,కాలనీ ప్రభుత్వాలపై ఇంపీరియల్ ప్రభుత్వానికి నామమాత్రపు నియంత్రణ మాత్రమే ఉందని చేతు లేత్తేశాడు .దీని భావం గ్రహించిన గాంధీ ,సహ చరులు మళ్ళీ కొత్తగా తమ పని ప్రాంభించాల్సిందే నని భావింఛి దీనికోసం జోహేన్స్ బర్గ్ లో గాంధీ తన ఆఫీసు ప్రారంభించాడు .
మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక –
సశేషం
రేపు 29-9-19ఆదివారంనుంచి ప్రారంభమయే శరన్నవరాత్రి -దసరా శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-9-19-ఉయ్యూరు

