గౌతమీ మహాత్మ్యం-60
86-కలపిలాతీర్ధం
అంగీరస తీర్ధం ,కపిలాతీర్ధం అనే ఈ తీర్ధం గౌతమికి దక్షిణాన ఉన్నది. దీనికే ఆదిత్య ,సైమ్హికేయ తీర్ధలని కూడా పేర్లున్నాయి .అన్గిరసులు ఇక్కడ యజ్ఞం చేసి ,ఆదిత్యులకకు భూమిని దక్షిణగా ఇచ్చారు .ఈ భూమి సై౦హిక అంటే సింహపుపిల్లలాగా జనుల్ని భక్షిస్తోంది .తర్వాత అన్గిరసులు తపస్సుకై వెళ్ళారు .జనం భయపడి అన్గిరసులవద్దకు వెళ్లి మొరపెట్టారు .ఇది సైమ్హిక పనే అని తెలిసినవారు ఆదిత్యునికి నివేదింఛి తామిచ్చిన భూమిని తీసేసుకోమన్నారు .ఆయన అంగీకరించక తిరిగి తీసుకొంటే వాళ్ళు అరవై వేలఏళ్ళు కీటకంగా జీవిస్తారని చెప్పి ,యజ్ఞ దక్షిణగా వారిచ్చిన భూమిని కొని తీసుకొంటామని ఆదిత్యులు చెప్పగా,అన్గిరసులు సరే అన్నారు .
ఆదిత్యులు శుభలక్షణ లక్షిత యైన కపిల ధేనువును వారికిచ్చి ,భూమిని తీసుకొన్నారు .కపిల దేవునిలో సాక్షాత్తు నారాయణమూర్తి ఉంటాడు .ఈ స్థానమే కపిలా సంగమం ,సకలపాప స౦హారకం .దానము చేయబడిన నీటి తో ఏర్పడిన దే కపిలా నది .ఇలా వస్తు వినిమయం తో ఆదిత్యులు భూ లోక రక్షణ చేశారు .ఇదే గోతీర్ధం .కపిలానది గంగానదితో కలిసిన చోటు కపిలా సంగమ తీర్ధం అని నారదునికి బ్రహ్మ ఉవాచ .
87-శ౦ఖ హ్రదతీర్ధం
గదాధరుడు శంఖ చక్రాలతో వెలసిన తీర్ధమే ఇది .ఇక్కడి పుణ్య స్నానం భవ బంధ విమోచకం .పూర్వం కృత యుగ ప్రారంభం లో బ్రహ్మ సామగానం చేస్తుండగా ,బ్రహ్మాండం అనే గృహం లో పుట్టిన రాక్షసులు బలోన్మత్తులై ఆయుధాలతో బ్రహ్మను తినేయ్యటానికి వచ్చారు .బ్రహ్మ విష్ణువును ప్రార్ధించగా ,ఆయన చక్రధారియై రాక్ష సంహారం కోసం వచ్చి ,చక్రం తో రాక్షసులను నిశ్శేషంగా సంహరించి, విజయ విలాసంగా శంఖం పూరించాడు.ఇదంతా జరిగిన చోటునే శంఖు తీర్ధమని చక్రతీర్ధమని ప్రసిద్ధి చెందింది .ఇది సర్వాభీష్ట ప్రదాయకం పుణ్యకరం,లక్ష్మీ ప్రదం ఆరోగ్యదాయకం ,పుత్ర సంతాన దాయకం .ఇందులో పది వేలతీర్దాలున్నాయి .అన్నీ పాపహరాలే అని బ్రహ్మ నారదునికి వివరించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-11-19-ఉయ్యూరు

