ప్రపంచ దేశాలసారస్వతం
69- కోసోవో దేశ సాహిత్యం
దక్షిణ యూరప్ లోని కొసొవో రిపబ్లిక్ దేశం .రాజధాని ప్రిస్టిన.కరెన్సీ-యూరో .బోస్నియన్ టర్కిష్ ,రోమాని ఇక్కడి భాషలు. అధికారభాషలు అల్బేనియన్ ,సెర్బియన్ .జనాభా సుమారు 18న్నర లక్షలు .రెండవ పరపంచయుద్ధం తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సెర్బియా ఆక్రమించాక స్కూలు పరీక్షలన్నీ సెర్బియన్ భాషలోనే జరపాల్సి వచ్చింది.అల్బేనియన్ భాష చదువు ముద్రణ అన్నీ అణగ దొక్కారు .కాని 1940లో అండర్ గ్రౌండ్ సాహిత్యం మాత్రం ప్రవహించింది .అలేగ్జాండర్ రాంకో విక్ అల్బెనియన్ లో రాసి ప్రచురించాడు .అల్బేనియన్ భాషలో దినపత్రిక ‘’రిలిండ్జా’’ సీక్రెట్ పోలిస్ సహకారం తో స్థాపించి నడిపాడు .పూర్తి అల్బేనియన్ భాష సంస్కృతీ సదుపాయాలూ 1974యుగోస్లావ్ రాజ్యాంగ సవరణవలన లభించి కొసొవో అల్బేనియన్ సాహిత్య సంస్కృతులు పరిఢవిల్లాయి
కొసొవో లోని పూర్వ సెర్బియన్ రచయితలలో 20వ శతాబ్దికి చెందిన నవలాకారుడు ఉకాసిన్ ఫిల్పోవిక్ ,కవులు – డార్నికా జేర్విక్ ,,పీటర్సారిక్ ,రడోసావ్ సోజ్ఞావిక్ ,కధారచయిత లజార్ ఉక్కో విక్.
అట్టో వాన్ కాలం లో –పిజెటర్ బొగ్దాని,చరిత్రకారుడు సెలాల్జేడ్ సాలిహా సేలిబి ,హాస్యాత్మక అట్టో వాన్-టర్కిష్ కవి ప్రిస్టినసి మేసిహి ,బయ గ్రాఫర్ , అనువాదకుడు ఆశిక్ సేలిబి ,బెజ్టేహింగ్ ఉద్యమకవి తాహిర్ ఎఫెండిజకోవ .
రెండవ ప్రపంచయుద్ధం తర్వాతకవి ఎసాద్ మేకులి సాహిత్యపత్రిక జేటా యి రే ను 1949లో స్థాపించి సాహితీ సేవ చేస్తే ,ఆడెం డేమసి 28ఏళ్ళుయుగోస్లేవియన్ ప్రభుత్వంలో రాజకీయ ఖైదీగా ఉంటూనే పై మాగజైన్ నిర్వహణకు సాయపడ్డాడు .దాన్ని ఒకపుస్తకంగా జిఫైల్ నెడర్మేల్ రాసిన ఎ ఫ్లూట్ ఇన్ ది మౌన్టేన్స్ ,సాంగ్ ఆఫ్ ది లోలాండ్ పాశ్చర్ రచనలతో మహా విద్యావేత్త మార్టిన్ కమాజ్ పబ్లిష్ చేశాడు .వచనరచనలో అంటాన్ పషుకు,రెక్స్ హెప్క్వోస్జా ముఖ్యులు .రెక్స్ రాసినరాజకీయనవల –డెత్ కమ్స్ ఫ్రం సచ్ ఐస్ ఉత్తమం .నజ్మి రేహ్మని. టేకి డేర్విషి నవలలురాశారు .సృజనాత్మక ,ప్రయోగాత్మక కవులుగా డిన్మెహమేటి,బెసిం కోక్షి ,రహ్మాన్ డేడజ్,ఆలి పొడ్రిమాజ,ఎక్రేం బాషా ,సబ్రి హమిటి,అశ్రి కప్రికి ప్రసిద్ధి చెందారు
యుద్ధం జాతి స్వాతంత్ర్యం కోసం ఉద్యమించినకవి ఈసాద్ మేకులి .ఇతని ‘’పేర్ టి’’ఎందరో రచయితలకు ప్రేరణగా నిలిచింది. రూసా రమడాని న్యూరోసిస్ అంటే సమ్మరి ఆఫ్ పోయెట్రి రాశాడు .అలీ పోడ్రిమేన్జా ‘’లుం లుమీ ‘’లో 20వ శతాబ్దిలోని 8వ దశకం ఈ దేశ వచనరచనను సంప్రదాయ ,ఆధునిక అనే రెండుమార్గాలను ఏర్పరచింది అన్నాడు .సాంప్రదాయం లోరోమాన్టిజం వస్తే ఆధునికం లో ఐరోపా ఆధునిక భావ ధారా వచ్చింది .ఆంటన్ పషుకు సింబాలిక్ రచనకు ఆద్యుడు .రోమన్ డబుల్ కోడ్ ప్రోజ్ రాశాడు రేస్జ్ హెప్కోస్జా .కొసొవో సాహిత్య విమర్శలో నిష్ణాతులు రెక్స్ హెప్, కోస్జా ఇబ్రహీం, రుగోవా శబ్రి హమిటి త్రయం .అల్బేనియన్ సాంగ్స్ రిడిల్స్ టేల్స లను ఎపిక్ క్రియేషన్స్ ,లిరికల్ క్రియేషన్స్ గా విభజించారు .
ప్రముఖపుస్తకాలు , రచయితల–కిస్సాని జుగోస్లేవియా –పెయిజ్ తిం స్టాతోవికి,ది డే ఆఫ్ దిపెలికాన్ –కేధరిన్ పాటర్సన్ ,కొసొవో ఏ షార్ట్ హిస్టరీ –నాయిల్ మాల్కం ,దిహెమింగ్వే బుక్ క్లబ్ –పాలాహన్ట్లి,హౌ టుబి కోసోవాన్ బ్రైడ్-నవోమిహామిల్
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-20-ఉయ్యూరు