విద్వన్మహాకవి బ్రహ్మశ్రీ హరి పద్మనాభ శాస్త్రి గారి సంస్కృత మహాకావ్యం –శ్రీహరి చరితం ‘’

విద్వన్మహాకవి బ్రహ్మశ్రీ హరి పద్మనాభ శాస్త్రి గారి సంస్కృత మహాకావ్యం –శ్రీహరి చరితం ‘’

రామాయణ మహాకావ్యమే శ్రీహరి చరితం .13 సర్గల ,994శ్లోకాలకావ్యం .కవి తూగోజి కోటిపల్లి నివాసి .తండ్రికామ శాస్త్రి, తాత పద్మనాభ శాస్త్రి ,ముత్తాత మల్లావధాని .కోటిపల్లి శ్రీ సోమేశ్వరస్వామి ఉత్సవ సందర్భం లో ఈకవి రాసిన ‘’త్రిపుర విజయ వ్యాయోగం ‘’ప్రదర్శిచేవారు . హరి వారి కుటుంబం లో మరొక పద్మనాభశాస్త్రి ‘’మదన లీలా భాణం’’రాసినట్లు తెలుస్తోంది .శ్రీహరి చరిత కావ్యాన్ని మద్రాస్ అడయార్ లైబ్రరి 1972లో అందం గా ముద్రించి ప్రచురించారు .కెనడా టొరంటో యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ డా.టి.వేంకటాచార్య అమూల్యమైన పీఠిక, నోట్స్ రాశారు .ఈయన పగొజి నరసాపురం వాసి .వేమూరి రామచంద్ర శాస్త్రి గారి వలన తెలుగు లిపి లో ఉన్న తాటాకు ప్రతి పొందారు .శాస్త్రిగారు ప్రసిద్ధ సంస్క్రుతపండితులు ,అలంకారికులు .అయిన రామగోవింద శాస్త్రి గారి కుమారుడు .పండిత వంశం వారు కనుకనే కావ్యాన్ని భద్రంగా కాపాడారు.

కవి గారు శ్రీహరి చరితకావ్యం లో ‘’వితరతు మతి మతివిమలాం –సోమా సోమావతంస వామాన్గాం ‘’అనే మొదటి శ్లోకం తో పార్వతీదేవిని స్తుతించి ,రెండో శ్లోకం లో ‘’కరివరదం తమ్ కలయే ‘’శ్లోకం తో గణపతిని ,స్తుతించి తర్వాత సరస్వతీ  దేవి ని స్తుతించారు ..నాలుగవ శ్లోకం నుంచి కథ ప్రారంభించి ఇందులో రామాయణ కథ చెబుతున్నట్లు తెలియజేశారు .

ఇది 16 సర్గలకావ్యం .అన్ని సర్గలలోనూ ఆర్యాచంద,స్సు వాడారు . చివరిశ్లోకం పృధ్వీ వృత్తం ‘’లో ఉంటుంది .13 వ సర్గ వరకు యుద్ధకాండ శ్రీరామపట్టాభి షేకం రాసి,చివరి మూడు సర్గలలో ఉత్తర కాండ కథ చెప్పారు  .14 వ సర్గలో పార్వతి పరమేశ్వరుడిని శ్రీరామరాజ్యం ‘’గురించి చెప్పమని కోరినట్లున్నది –‘’శ్రీశైలజాధ నాథంశ్రీశైర్వర్యం సమున్మనాః శ్రోతుం –అహ ప్రణయ ప్రణతా మహాత్మ్యం బ్రూహి రామ రాజ్యస్య ‘’.ఇందులో రావణ జనననం, శూద్రకుని తపస్సు ,లవణాసురవధ ,కుశలవులకు రాజ్యం అప్పగించి రాముడు స్వర్గప్రస్థానం చేయటం ఉన్నాయి .

కవి శబ్దాలంకార ప్రియుడు .దాదాపు ప్రతిశ్లోకం లోనూ అనుప్రాస ఉంటుంది .సున్నితమైన అలంకార రచన ,.క్రియాపదప్రయోగంలో గొప్ప నేర్పు చూపారు .అహల్యను శపించి శాపా౦తాన్నికూడా అనుగ్రహించిన గౌతమమహర్షి గురించి చెబుతూ –‘’స్మృశతి యదా రామస్వాం దాశరధిః పాదపంకజేన తదా-శాపా౦తస్తె పునరపి శాపాంతే మాముపేష్యతి స్వస్తాః’’అనే శ్లోకం చాలు కవి ఎంతసరళ౦గా రాశారో చెప్పటానికి .దీనికి ముందు మాట రాసిన టొరంటో యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ ఎ.కె.వార్డర్ ‘’ఇలాంటి సంపాదకుడు తన గ్రంథానికి లభించినందుకు అమరలోక వాసి అయిన కవి హరి పద్మనాభశాస్త్రి గారు ఎంతో అదృష్టవంతులు ‘’అన్నారు .

ఆధారం –శ్రీ బులుసు వెంకట రమణయ్య గారి వ్యాసం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-26-ఉయ్యూరు    —

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.