మొదట్లో ఏరువాకా” లేదు -వహీదాలేదు ”రోజులు మారాయిలో

మొదట్లో ఏరువాకా” లేదు -వహీదాలేదు ”రోజులు మారాయిలోrojulu1 001 rojulu2 001 rojulu3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నీటి పొదుపు – భావితరాలకు మనం ఇవ్వవలసిన వారసత్వ సంపద

నీటి పొదుపు – భావితరాలకు మనం ఇవ్వవలసిన వారసత్వ సంపద img103

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎక్కడ కాలు తోక్కేస్తానోనని నరేష్ భయ పడేవారు -నటి గీతా సింగ్ –

gita1 001 gita2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చట్టానికో నాటకం ఉంది

చట్టానికో నాటకం ఉంది

ఒక కథలో పోలీసు శాఖలోని లొసుగులను ప్రశ్నిస్తారు. ఇంకో కథలో చట్టంలోని లొసుగుల్ని వెలికి తీస్తారు. నాటకం ఏదైనా ఆయన కథా వస్తువు అంతా చట్టం, న్యాయం చుట్టూనే తిరుగుతుంది. వృత్తిపరంగా న్యాయవాది కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. మూడు దశాబ్దాలుగా తన రచన, నటనా పటిమతో ఎన్నో బహుమతులు సొంతం చేసుకున్న దిట్ట విశాఖపట్టణానికి చెందిన పి.టి.మాధవ్‌.
‘‘మాది తూర్పుగోదావరి జిల్లా భీమవరం. విశాఖపట్టణంలో పుట్టి పెరిగాను. చదువంతా ఇక్కడే సాగింది. పదో తరగతి నుంచి నాటకాలు వేయడం ప్రారంభించాను. ఆ ఆసక్తితోనే దర్శకత్వం, నటనలో శిక్షణ తీసుకున్నాను. కేవలం నటనకే పరిమితం కాకుండా రచయితగా సమాజానికి మేలు చేసే అంశాలను జోడించి.. ప్రదర్శించాలన్నది నా ఆలోచన. ఒక వైపు నటిస్తూనే రాయడం మొదలు పెట్టాను. న్యాయవాదిగా పట్టా పుచ్చుకుని 1988లో ప్రాక్టీస్‌ ప్రారంభించాను. నగరమంతా నిద్రపోయాక రచనకు పూనుకునేవాడిని. న్యాయశాస్త్రంలోని అంశాలతో సమాజానికి మెసేజ్‌ ఇచ్చేలా రచనలు చేశాను. చట్టంలోని లొసుగులు, దర్వినియోగం అవుతున్న తీరు తదితర అంశాలతో ప్రజల్ని చైతన్యపరిచే నాటికలను రచించి సొంత దర్శకత్వంతోపాటు, పాత్రధారుడిగా కూడా బాధ్యతను నిర్వర్తించేవాడిని. అలాగే విశాఖ రత్నం అవార్డు, కూరెళ్ల సోమేశ్వరరావు ట్రస్టు ద్వారా ఉత్తమ రచయిత పురస్కారం, కళా జగతి పత్రిక ద్వారా ఉత్తమ రచయిత పురస్కారం ఎంతో సతృప్తినిచ్చాయి. స్వర్గీయ సుత్తివేలు, రాధాకుమారి, సాక్షి రంగారావు, పొట్టిప్రసాద్‌ వంటి ప్రముఖ నటులతో కలిసి ‘లేదు దుఃఖం జగతిలో’ పేరిట రూపొందించిన టీవీ సీరియలో నటించడంతోపాటు ఓ ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించడం గర్వంగా భావిస్తాను.
విశాఖలో మోడ్రన్‌ థియేటర్‌
కళారంగానికి జీవం పోయాలని, నా ఊపిరి ఉన్నంత వరకు నాటక రంగానికి సేవ చేయాలని మోడ్రన్‌ థియేటర్‌ను స్థాపించాను. ఇప్పటి వరకు ఎంతో మందికి నటనలో శిక్షణ ఇచ్చాను. యాక్టింగ్‌లో ఓనమాలు రానివారిని కూడా ఉత్తమ నటులుగా తీర్చిదిద్దాను. నాటికల్లో చట్టపరమైన సమస్యలను చర్చిస్తూ పరిష్కార మార్గాలను చూపుతూ, కథా గమనాన్ని అనుసరించి ఖర్చుకు వెనుకాడకుండా అవసరమైన ఆర్టిస్టులతో ప్రదర్శించడం మా మోడ్రన్‌ థియేటర్‌ ప్రత్యేకత. అందుకే ప్రజలంతా దీనిని ‘నేచురల్‌ థియేటర్‌’ అని పిలుస్తారు. ఇప్పటి వరకు ఇరవై నాటికలను రాశాను. నాలుగు నాటకాలు, ఏడు రేడియో నాటకాలు, నాలుగు టీవీ నాటికలు కూడా రచించాను. మొత్తంగా వెండితెరపై నాలుగు తెలుగు చిత్రాల్లో కూడా నటించాను. నేను కథ, మాటలు సమకూర్చిన ‘కోయిల’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏడాదికి కనీసం 60 ప్రదర్శనలకు తక్కువ లేకుండా సుమారు 30 ఏళ్లపాటు రాష్ట్రమంతటా ప్రదర్శనలు ఇచ్చాను. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గినా ప్రదర్శనలు కొనసాగిస్తున్నాను. హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి నాటక పోటీల్లో ఉత్తమ నటుడు, రచయిత, హాస్యనటుడు, వంటి అవార్డులు దక్కాయి. ‘నన్కెక్కించండి బోను’ నాటకానికి యువకళావాహిని అక్కినేని పరిషత్‌లో ఉత్తమ రచయితగా పలుమార్లు అవార్డులు రావడం సంతోషకరం.
‘నన్నెక్కించండి బోను’
పోలీస్‌ శాఖలో ఉండే లొసుగులు తెలియజేస్తూ స్టాక్‌ విట్నె్‌సల మీద వారు ఎందుకు ఆధారపడుతున్నారో, సెర్చి వారెంట్‌ వారి చేతుల్లో ఎలా రూపుమారిపోతుందో, గ్రామీణ వాతావరణంలో యధార్థ సంఘటనల ఆధారంతో రాసిన నాటకం.
నల్లకోటు నవ్వింది..’
ప్రామిసరీ నోటుకున్న కాలపరిమితి, చట్టపరమైన లావాదేవీల గురించి తెలియకుండా అప్పుచేస్తే ఎన్ని పాట్లు పడాలో.. తెలిపే హాస్య నాటిక ఇది.
‘వెళ్లిపోకే చిన్నమ్మ…’
ఐపీసీ 498ఎ సెక్షన్‌ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నందున ఎన్ని కుటుంబాలు నాశనమవుతున్నాయో తెలియజేసే నాటిక ‘వెళ్లిపోకే చిన్నమ్మ’. అన్ని ప్రముఖ రేడియో స్టేషన్లలో నాటకంగా ఇది ప్రసారమైంది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ కిక్ గంటసేపే-డైరెక్టర్ త్రివిక్రమ్ మనసులోమాట –

ఆ కిక్ గంటసేపే

త్రివిక్రమ్‌ అంటే ఓ బ్రాండ్‌… ఈ మాటలను వింటే నాకు భయమేస్తుందంటారాయన.
త్రివిక్రమ్‌ మాటల మాంత్రికుడు.. ఈ మాటలను గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు అని అంటారు.
త్రివిక్రమ్‌ సినిమాలకు ఓ స్థాయి ఉంటుంది… ఈ మాటలను అందరూ అంటుంటే వినడమే అని అంటారు.
ఏదేమైనా తెలుగు సినిమా మాటలను మలుపు తిప్పిన కొంత మంది రచయితల్లో త్రివిక్రమ్‌ ఒకరు. ఆయన కలంలోని సిరా వెటకారాన్నీ పలికిస్తుంది. అత్యంత ఘాటైన విమర్శలనూ చేస్తుంది. అన్నిటినీ మించి ఆత్మీయమైన మాటలతో ఆలోచింపజేస్తుంది. ‘అవును నిజమే కదా’ అని అబ్బురపోయేలా చేస్తుంది. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన
‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ విడుదలైంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ మాటల మూటలు..
‘‘సన్నాఫ్‌ సత్యమూర్తికి రెస్పాన్స్‌ బావుంది. సత్యమూర్తి కొడుకు కథ అని ముందు నుంచే చెప్పాం. మనిషి ముందు మాట్లాడటానికి, లేనప్పుడు అతని గురించి మంచిగా మాట్లాడటానికీ చాలా తేడా ఉంటుంది. ఈ సినిమాలో నేను తండ్రి గురించి చెప్పాలనుకున్నా. అందుకే తండ్రి గురించి కొద్దిగా చూపించి, చనిపోయిన తర్వాత, ఆయన పరోక్షంలో కథను నడిపించాం. నా మిత్రుల జీవితాల్లో జరిగిన ఘటనలనే సినిమాటిగ్గా చెప్పే ప్రయత్నం చేశాను. తండ్రి పోయాక కొడుకు మాటల్లో పంచ్‌ ఉండదు. కాసింత పెయిన్‌ ఉంటుంది. దాన్నే ఈ సినిమాలో చెప్పాం. తొలి సగానికి డల్‌ రెస్పాన్స్‌ వస్తుందేమోనని అనుకున్నా. అప్పటికీ
ఫస్టా్‌ఫలో పార్టీ సాంగ్‌ పెట్టా. అంతకన్నా అల్లరి చేయొద్దని, ఈ కథను ఇలాగే చెప్పాలనీ, ప్రేక్షకుల్ని మోసం చేయొద్దనీ అనుకున్నా. కానీ హీరో సంతకం చేసే సన్నివేశం, ఆటో నుంచి దిగే సన్నివేశానికి నేను క్లాప్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. అందరికీ ఆ సెన్సిబిలిటీ కనెక్ట్‌ అయింది. హీరోయిన్‌ని డయాబెటిక్‌ పేషెంట్‌గా చూపించాం. మన దేశంలో షుగర్‌ ఉన్నవారు ఎక్కువ. కమల్‌హాసన్‌, గౌరవ్‌కపూర్‌, వసీమ్‌ అక్రమ్‌.. డయాబెటిక్‌ ఉన్నవారు. అయినా డిగ్నిటీతో హ్యాండిల్‌ చేస్తున్నారు. అదే ఓ అమ్మాయి డయాబెటిక్‌ పేషెంట్‌ అయి, ఆ విషయాన్ని క్యూట్‌గా హ్యాండిల్‌ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఆ పాత్రను పెట్టాను. హీరోయిన్లంటే దేవతలు కాదు, మనలాంటి వాళ్లేనని చెప్పే ఉద్దేశంతోనే అలా చేశా.’’
ప్రాసె్‌సలోనే మజా
‘‘ఈ సినిమాలో సంపత్‌ విలన్‌. అతను ఉపేంద్రను చంపాలనుకుంటే, యాక్సిడెంటల్‌గా హీరో ఫాదర్‌ పోతాడు. అలాగే హీరో కూడా కావాలని విలన్‌ని చంపడు. యాక్సిడెంటల్‌గా జరుగుతుంది. నేనెప్పుడూ హీరోతో విలన్‌ని చంపించాలని అనుకోను. అందులో నాకు కిక్‌ ఉండదు. బేసిగ్గా నేను ఒక మనిషిని డైరెక్ట్‌గా చంపడాన్ని నమ్మను. మనుషులు ఊరికే కొట్టుకుంటారని నేననుకోను. ఒకడు ఒకడిని కొట్టాలంటే నాకు చాలా పెద్ద కథ కావాలి. రీజన్‌ కావాలి ఆర్గ్యుమెంట్‌ ద్వారా ఒపీనియన్‌ మారదు. ఒక మనిషిని ఫిజికల్‌గా కొట్టడం ద్వారా ఒపీనియన్‌ మారదు. సిస్టమూ మారదు. ఆ విషయం మీకు నా అన్ని సినిమాల్లోనూ కనిపిస్తుంది..’’
ఏమనుకోవాలి?
‘‘ఖలేజా లాంటి సినిమా టీవీల్లో అమితంగా ఆడుతున్నందుకు ఆనందపడాలా? బాధపడాలో తెలియదు. ఒక రకంగా బాధగానే ఉంటుంది. ఆనందంగా అనిపించదు. టీవీల్లో ఆడుతోంది కాబట్టి దాన్ని గొప్ప సినిమా అనలేం. టీవీల్లో సినిమా చూసేటప్పుడు మనకు చాలా వెసులుబాటు ఉంటుంది. కావాల్సినప్పుడు ఫోన్లు మాట్లాడుకోవచ్చు. పక్కకెళ్లి పనులు చేసుకోవచ్చు. మరోవైపు యాడ్స్‌ వస్తుంటాయి. టీవీల్లో నచ్చని సీన్లు వస్తే అవాయిడ్‌ చేయొచ్చు .కానీ థియేటర్లో అవాయిడ్‌ చేయలేం. థియేటర్లో చూసే వ్యక్తులు వేరే ఎక్స్‌పీరియన్స్‌తో చూస్తుంటారు. అప్పుడే కొన్న టిక్కెట్ల వేడి కూడా దానికి తోడవుతుంది.’’
నేను చదవను
‘‘నేను వెబ్‌సైట్లు చూడను. ఈ మధ్య రాజమౌళి హీరోలతో నేనూ, నా హీరోలతో ఆయన సినిమాలు చేయలేదని ఓ ఆర్టికల్‌ వచ్చిందట. అలాంటి వార్తలు చదవకపోవడం వల్ల జీవితం ఎంతో సుఖంగా ఉంది. అయినా అందరు హీరోలతో పనిచేయాలని నాకూ ఉంటుంది. హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాయను అని అనడం అబద్ధం. నేను తప్పకుండా హీరోని దృష్టిలో పెట్టుకుంటాను. దానికి తగ్గట్టు నేను చెప్పాల్సిన విలువలను గురించి కూడా ఆలోచిస్తాను. వాటి రెండిటి మధ్య ఓ బ్యాలెన్స్‌ను కుదుర్చుకుంటాను. కాకపోతే కథ, కాల్షీట్లు కుదరాలంతే. స్ర్కిప్ట్‌ పూర్తయిన తర్వాతే బడ్జెట్‌ అనేది లెక్కలోకి వస్తుంది. నిర్మాతతో కూర్చుని స్టార్స్‌ ఎవరు? సినిమా పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది? వంటి వివరాలను గురించి ఆలోచించినప్పుడే బడ్జెట్‌ ఎంతనేది తెలుస్తుంది. అదే స్టోరీ కొత్తవాళ్లని డిమాండ్‌ చేస్తే మొత్తం లెక్కలన్నీ మారిపోతాయి.’’
మార్పు సహజమే
‘‘ఖలేజా తర్వాత త్రివిక్రమ్‌లో గొప్ప మార్పు వచ్చిందని అంటున్నారు. ఒక్కొక్క సీజన్‌లో ఒక్కో రకంగా ఉంటామేమో. త్రివిక్రమ్‌ ఓ బ్రాండ్‌ అని ఎవరైనా అంటే భయమేస్తుంది. టెన్షన్‌ వస్తుంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌కి దూరంగా ఉండేది అందుకే. నేనేదో నాకు వచ్చింది, నచ్చింది రాస్తా. తీస్తా. అది అందరికీ నచ్చితే హ్యాపీ. నచ్చకపోతే తిట్టండి. తెలుసుకుని ఇంకో రకంగా రాస్తా. అంతేగానీ నన్ను నేను అంత ఎక్కువ సీరియ్‌సగా తీసుకోను. నేను ఇలా సింపుల్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టే నచ్చుతానేమో. అయినా అందరికీ ఉన్నట్టు నాక్కూడా చాలా ప్రాబ్లమ్స్‌ ఉంటాయి. నాకూ ఈగో ఉంటుంది. కాంప్లెక్స్‌ ఉంటుంది. జెలసీ ఉంటుంది. నా సినిమాలే ఆడాలని ఉంటుంది. అవతలి వాళ్ల సినిమాలు పోవాలనీ ఉంటుంది. కానీ బయటికెళ్లి బాగా మాట్లాడాలనీ ఉంటుంది. అందరూ ఎలా ఉంటారో, నేనూ అలాగే ఉంటా. కాకపోతే వాటన్నిటినీ నాలో నుంచి తొలగించి మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తుంటా. నేను సినిమాకు వెళ్లేటప్పుడు చాలా ప్రిపేర్‌ అయి వెళ్తా. ఎక్కువ తెలివి తేటలు వాడకుండా ఓపెన్‌గా సినిమాలు చూడాలని అనుకుంటా. ‘అందరి సినిమాలు పోతే నీతో సినిమా చేయడానికి ఎవరొస్తాడ్రా?’ అని ప్రశ్నించుకుంటా. ఏడాదిలో ఒక వారం మాత్రమే నా సినిమా ఆడి, మిగిలిన వారాలు ఇంకే సినిమాలూ ఆడకపోతే సినిమాలు ఎవరు తీస్తారు? అని నాకు నేను చెప్పుకుంటూ ఉంటా. సినిమాకు వెళ్లేటప్పుడు భీమవరంలో ఉన్నప్పుడు సినిమాలు ఎలా చూసేవాడినో అలా చూడాలనుకుంటా. హ్యాపీగా చూడాలనుకుంటా. ఇదొక ఎక్సర్‌సైజ్‌. బేసిగ్గా ఏ ట్రేడ్‌లో ఉండేవారికైనా కొన్నాళ్లకు ఒక లగేజ్‌ వచ్చి చేరిపోతుంది. కొన్ని ఒపీనియన్స్‌ వస్తాయి. తెలియకుండా సి్ట్రక్ట్‌ అవుతాం.ఫ్లెక్సిబులిటీ పోతుంది. ఒక మేకర్‌గా నాక్కూడా అంతే. బావుందా? అని ఎవరైనా అడిగితే బావుంది.. ‘కానీ’ అని ఒక మాట అంటా. ‘కానీ ఎందుకురా?’ అంటే ఏమనాలి? ఏమీ చెప్పలేం. నార్మల్‌ ఆడియన్స్‌ భలే నవ్వుతారు. భలే ఏడుస్తారు. కానీ మనకలా కాదు. సినిమా మనకింకా నేక్డ్‌గా కనిపిస్తుంది. ‘దీని వెనకాల ఇలా జరిగి ఉంటుందా? అలా జరిగి ఉంటుందా?’ ఇలాంటి ఒపీనియన్స్‌తో సీన్‌ని చూస్తున్నప్పుడు తెలియకుండానే మనం ఆ సినిమాకు బయట ఉంటాం. అయినా సినిమాను చూస్తుంటాం. బట్‌ యు హావ్‌ బి ఇన్‌ ద ఫిల్మ్‌. అందుకే నేను ఫస్ట్‌డే మల్టీప్లెక్స్‌లకు వెళ్లను. అక్కడ ప్రతి రీల్‌కీ ఒపీనియన్‌ చెప్పేస్తుంటారు. నేను ‘ఛత్రపతి’ చూసి చాలా బాగా ఎంజాయ్‌ చేశా. కానీ ఒకడు అలా వెళ్తూ.. ‘ఫస్టాఫ్‌ బావుంది. సెకండాఫ్‌ చూడాలి?’ అని అన్నాడు. ఫస్టాఫ్‌ బావుందని చెప్పడానికి కూడా సుఖంగా లేదు అతనికి. ఇంటర్వెల్‌ పావుగంట సమయం ఉంది కదా? ఎంజాయ్‌ చేయొచ్చు కదా? కానీ అలా చెప్పరు. అతని మాటలు విన్నాక నాకే అంత విరక్తి వచ్చిందంటే రాజమౌళి అయితే ఏడ్చి ఉండేవాడు. ఎవరికైనా ఆ సిట్చువేషన్‌లో విరక్తి వస్తుంది. అందుకే నేను పస్ట్‌ డే ఉదయం మారుమూల థియేటర్లను వెతుక్కుని వెళ్తా. సినిమా విడుదలైన రోజు ఉదయాన్నే ఫోన్లు కూడా ఎత్తను. సినిమాకి వెళ్లకముందే మొత్తం చదివించేసేవాళ్లు ఉన్నారు. బావున్న విషయాన్ని బావుందని చెప్పడం వేరు. అవతలివాడికి ఇరిటేట్‌ తెప్పించేలా బావుందని చెప్పడం వేరు. అందుకే నా దృష్టిలో ఈజీగా ఉండటం ఈజీ కాదు. దాన్ని ప్రాక్టీస్‌ చేయాలి.’’
సిగ్గుతో తిరుగుతుంటా
‘‘ సినిమాను రూపొందించిన తర్వాత నేను చూసుకోలేను. నాకు బేసిగ్గా ఏ సినిమానూ నచ్చి చావదు. తీసిన వెంటనే నాకు లక్ష తప్పులు కనిపిస్తుంటాయి.. నాలో కూడా కొంత వెటకారం ఉంటుంది. నాకు నేనే పెద్ద విమర్శకుడిని. అందుకే సినిమా విడుదలైనప్పటి నుంచీ నేను సిగ్గుతో తిరుగుతుంటా థియేటర్ల బయట. ఇక్కడ ఇదే కరెక్ట్‌ అని నిక్కచ్చిగా చెప్పడానికి ఏదీ ఉండదు. ప్రతి దానికీ ఆప్షన్స్‌ ఉంటూనే ఉంటాయి. చిన్న ప్రెస్‌మీట్‌ సీన్‌ చేయాలంటే ఎన్నెన్నో ఆప్షన్లు
ఉంటాయి. కాకపోతే కొన్ని చేయకపోవడానికి కారణం బడ్జెట్‌ కావచ్చు. మరికొన్ని చేయకపోవడానికి కారణం ఎక్కడో ఆపాల్సిన అవసరం అయి ఉండవచ్చు. జర్నలిస్టులైనా తాము రాసింది చదువుకున్నాక, ఇంకేదో రాసి ఉంటే బావుంటుందని అనుకుంటారుగా? మేకర్‌గా నేను కూడా అంతే. అందుకే సినిమా ఎలా ఉందని మా ఆవిడని ఎప్పుడూ అడగను’’
సీరియ్‌సగా తీసుకోను
‘‘నేను బేసిగ్గా చాలా విషయాలను సీరియ్‌సగా తీసుకోను. కలెక్షన్ల గురించో, మారోదాని గురించో నెర్వస్‌ కాను. సినిమా హిట్‌ అవుతుందా? కాదా? అని ఎవరికీ తెలియదు. మనం బాల్‌ వేస్తామంతే. అది సిక్స్‌ కావచ్చు. ఫోర్‌ కావచ్చు. వైడ్‌ కావచ్చు. బౌన్స్‌ కావచ్చు. ఏదయినా కావచ్చు. మజా అనేది ప్రాసె్‌సలోనే ఉంటుంది. ఎవరైనా సినిమా సూపర్‌హిట్‌ అంటే ఆ కిక్‌ గంట సేపు ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. నాకు ఆనందంగా ఉందని అరవలేను కదా. సినిమా హిట్‌ అని తెలియగానే నేను బయటికొస్తే రకరకాల మనుషులు రకరకాల పనుల మీద వెళ్తుంటారు. వాళ్లని ఆపి నా ఆనందాన్ని చెప్తే అవతలి వాడు మంచి మూడ్‌లో ఉంటే ‘మంచిది’ అంటాడు. ఇంకొకడు చిరాకుగా ఉంటే కొడతాడు. ఒకవేళ ఫ్లాప్‌ అనుకో అప్పుడు కూడా బయటికెళ్లి ఏడవలేను. ఎవడినన్నా ఆపి ఏడ్చాననుకోండి, అవతలి వాడు వాడి కష్టాలు ఏకరువు పెడితే ఇద్దరం కూర్చుని ఏడవాలి. అందుకే ఎప్పుడూ ప్రాసె్‌సలోనే మజా ఉంటుంది. రిజల్ట్‌లో కానే కాదు. మంచి సీన్‌ రాసినప్పుడు కలిగే ఆనందం ముందు ఇంకేదీ నిలబడదు. ‘సన్నాఫ్‌ సత్యమూరి’్తతో ఓ డైనింగ్‌ టేబుల్‌ సీన్‌ ఉంటుంది. అందులో కామెడీ ఉండదు. కానీ కామెడీ పండాలి. అది రాయడం కష్టమైంది. తీరా సీన్‌ రాయడం పూర్తయ్యేసరికి వచ్చిన ఆనందం ముందు ఏదీ నిలబడలేదు.’’
పరభాషల్లో..
‘‘ఇతరులు పరభాషల్లో సినిమాలు చేస్తున్నారు కదా అని మనం చేయకూడదు. ఇతర భాషల్లో సినిమాలు చేయాలంటే ముందు స్ర్కిప్ట్‌ అనుకూలించాలి. రాజమౌళి యూనివర్శల్‌ కాన్సె్‌ప్టలతో సినిమాలు చేస్తున్నారు. ‘ఈగ’, ‘బాహుబలి’ అలాంటివే. ఆ తరహా స్ర్కిప్ట్‌లకు మల్టీలాంగ్వేజ్‌సలో చేయడమే కరెక్ట్‌. నిజాయతీగా అలాంటి కథ దొరికి… రాసి, దానికి ఇంత కేన్వాస్‌ కావాలని అనుకుంటేనే చేయాలి తప్ప ఆషామాషీగా చేయకూడదు. బేసిగ్గా యూనివర్శల్‌ అప్పీల్‌ ఉన్న స్టోరీని చెప్పడానికే అందరూ ఇష్టపడతారు. ప్రతి ఫిల్మ్‌ మేకర్‌ తన స్టోరీ చాలా మందికి రీచ్‌ కావాలనే అనుకుంటారు. నా వరకు నేను నా సినిమాల పట్ల హానె్‌స్టగా ఉంటాను. స్ర్కిప్ట్‌ని బలంగా, స్ర్టెయిట్‌ ఫార్వర్డ్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తాను’’
ఫ చల్లా భాగ్యలక్ష్మి

 

సన్నాఫ్ సత్యమూర్తి (09-Apr-2015)

‘రేసు గుర్రం’ తర్వాత అల్లు అర్జున్, ‘అత్తారింటికి దారేది’ తర్వాత త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’. అంతేకాదు…. ‘జులాయి’ సినిమా తర్వాత వీరిద్దరూ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కూడా ఇదే! దాంతో సహజంగానే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి… మరి విలువలే ఆస్తి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యమూర్తి తనయుడు వాటిని ఏ మేరకు నిలబెట్టుకున్నాడో చూద్దాం.
కోట్లకు పడగలెత్తినా మానవీయ విలువల్ని మరిచిపోని వ్యక్తి సత్యమూర్తి (ప్రకాశ్ రాజ్). అతనికో అందమైన కుటుంబం. ఏ కష్టం లేకుండా ఇద్దరు కొడుకుల్నీ పెంచి పెద్ద చేస్తాడు. అయితే… ఊహించని విధంగా యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతాడు సత్యమూర్తి. దాంతో కుటుంబ బాధ్యతలన్నీ చిన్న కొడుకు విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) మీద పడతాయి. తండ్రికి వ్యక్తిత్వానికి మచ్చ పడకూడదనే ఉద్దేశ్యంతో ఆయన స్నేహితుడు సాంబశివరావు (రాజేంద్ర ప్రసాద్) ఐ.పీ. పెట్టమని సలహా ఇచ్చినా… ఉన్న 300 కోట్ల ఆస్తితో అప్పులు తీర్చేస్తాడు. కుటుంబ పోషణ కోసం చివరకు ఉద్యోగాల వేటలో పడతాడు. కోట్ల ఆస్తిని విరాజ్ చిన్న సంతకంతో వదిలేయడంతో… అప్పటికే పల్లవి (అదాశర్మ)తో జరిగిన నిశ్చితార్థాన్ని ఆమె తండ్రి (రావురమేశ్) కాన్సిల్ చేసేస్తాడు. స్నేహితుడి సహకారంతో వెడ్డింగ్ ప్లానర్ గా కొత్తజీవితాన్ని ప్రారంభించిన విరాజ్… పల్లవి పెళ్ళికే ఆ బాధ్యతలను నిర్వహించడానికి వెళతాడు. అక్కడే ఆమె స్నేహితురాలు సమీర ఉరఫ్ సుబ్బలక్ష్మి (సమంత)తో ప్రేమలో పడతాడు. ఇదిలా ఉంటే సాంబశివరావుకు తన తండ్రి అమ్మిన స్థలాన్ని ధనరాజ్ (ఉపేంద్ర) అనే తమిళనాడుకు చెందిన గూండా కబ్జా చేశాడని తెలుస్తుంది. ధనరాజ్ నుండి ఆ స్థలం తనకు దక్కేలా చేసే బాధ్యత కూడా నీదే అంటూ విరాజ్ కు చెబుతాడు సాంబశివరావు. దాంతో ఐదు వేల అనుచరణ గణం, ఆరు వందల ప్రైవేట్ సైన్యం ఉన్న ధనరాజ్ ను విరాజ్ ఎలా ఎదుర్కొన్నాడు? సాంబశివరావు దానిని ఎలా అప్పగించాడు? సమీరాతో విరాజ్ వివాహం జరిగిందా లేదా అన్నది మిగతా కథ.
కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడి కొడుకు… ఓ సామాన్యుడిగా మారి సమస్యలను ఎదుర్కొనడం… శత్రువు మనసు మార్చడం కోసం సతమతమవడం చూస్తే… మనకు ‘అత్తారింటికి దారేది’ సినిమానే గుర్తొస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్, అతని పక్కన ఉండే అలీని, కథానాయిక సమంతాను చూస్తే… పదేపదే ఆ మూవీనే మదిలో మెదులుతుంది. అయితే… అక్కడ విలన్ కోట చిత్తూరులో ఉంటే… ఇక్కడి విలన్ దేవరాజ్ రాష్ట్ర సరిహద్దు దాటి తమిళనాడులో ఉంటాడు. రాయలసీమ కక్షలు రొటీన్ అయిపోయాయని భావించాడేమో దర్శకుడు త్రివిక్రమ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు రౌడీని విలన్ గా ఎంచుకున్నాడు. కన్నుమూసిన తండ్రికి చెడ్డపేరు తీసుకురాకూడదని ఓ కొడుకు చేసే ప్రయత్నమే సినిమా అంతానూ. దాంతో టైటిల్ దానికి పెట్టిన కాప్షన్ కు బాగానే జస్టిఫికేషన్ జరిగింది!
ఇక నటీనటుల విషయానికి వస్తే… అల్లు అర్జున్, సమంత జోడీ బాగుంది. ప్రకాశ్ రాజ్ కనిపించేది కాసేపే అయినా తనదైన శైలిలో మెప్పించాడు. ‘జులాయి’లో అవుట్ అండ్ అవుట్ కామెడీ పండించిన రాజేంద్ర ప్రసాద్… ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రను పోషించాడు. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఉపేంద్ర నటన గురించి. కన్నడలో ఇప్పటికీ హీరోగానే నటిస్తున్న ఉపేంద్ర గత కొంతకాలంగా పరభాషా చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు చేయడానికీ వెనకాడటం లేదు. అలా ఉపేంద్ర చేసిన ఒకటి రెండు సినిమాలు కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదు. అయినా… వెనకడుగు వేయకుండా ఇందులో దేవరాజ్ పాత్ర చేసి మెప్పించాడు. అతని భార్యగా స్నేహ సైతం చక్కగా నప్పింది. రావు రమేశ్ కుమార్తెగా అదాశర్మ, దేవరాజ్ చెల్లిగా నిత్యామీనన్ ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. అదాశర్మ ఓకే గానే… నిత్యామీనన్ పాత్ర ఎంట్రీ, ముగింపు కూడా కంగాళీగానే ఉన్నాయి. తండ్రి విలువల్ని కాపాడుకునే ప్రయత్నం ఓ వైపు… ప్రేమలో ఎదురయ్యే ఊహించని మెలికలు మరోవైపుతో సన్నాఫ్ సత్యమూర్తి కాస్తంత తడబడ్డాడు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు, వాటిని తెరకెక్కించి తీరు పర్వాలేదు… నిర్మాత ఎస్. రాధాకృష్ణ చిత్ర నిర్మాణంలో మాత్రం రాజీపడలేదు. ఆ విషయం తెరమీద కనిపిస్తోంది. ఏ సన్నివేశానికి అది బాగానే ఉన్నా… మొత్తం సినిమాగా చూసుకుంటే మాత్రం సమ్ థింగ్ మిస్సింగ్ అనే భావన కలుగుతుంది. బహుశా నిడివి ఎక్కువ కావడం… అదాశర్మ, నిత్యమీనన్ తో అల్లు అర్జున్ ట్రాక్ ఆసక్తికరంగా లేకపోవడంతో పాటు త్రివిక్రమ్ సినిమాల్లో ఉంటే ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాలో బాగా మిస్ కావటం కారణాలు కావచ్చు… అయితే తాను మాటల మాంత్రికుడినేనని ఈ సినిమా ద్వారా త్రివిక్రమ్ మరోసారి నిరూపించుకున్నాడు.
అటు ‘అత్తారింటికి దారేది’తోనూ, ఇటు ‘రేసు గుర్రం’తోనూ పోల్చుకుంటే… సత్యమూర్తి కొడుకు కాస్తంత నిరాశ పరుస్తాడు. మరి వేసవి సెలవుల్లో వచ్చాడు కాబట్టి… ఫ్యామిలీ ఆడియెన్స్ ఏమైనా ఈ కుర్రాడిని ఆదుకుంటారేమో చూడాలి!
3/5
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శుద్ధ సాహిత్యకారుడు జయకాంతన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి ఆత్మీయ సమావేశం స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారి శతజయంతి

11-4-15 శనివారం సాయంత్రం 6 గం కు సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి గారింట సరసభారతి ఫ్లోరా కలిసి 78 వ సమావేశం గా తెలుగు కధకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారి శతజయంతి ,మరియు ఆత్మీయ సమావేశాన్నిజరిపాం .ప్రముఖ కదానికులు డా .శ్రీ వేదగిరి రాంబాబు ”,తెలుగు రధం ”అధ్యక్షులు శ్రీ కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ .ప్రసిద్ధ కార్టూనిస్ట్ శ్రీ బాలి గార్లు ఆత్మీయ అతిధులు గా విచ్చేశారు జరిపాం .ప్రముఖ కదానికులు డా .శ్రీ వేదగిరి రాంబాబు ”,తెలుగు రధం ”అధ్యక్షులు శ్రీ కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ .ప్రసిద్ధ కార్టూనిస్ట్ శ్రీ బాలి గార్లు ఆత్మీయ అతిధులు గా విచ్చేశారు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆ-లయ కారుడి విలవిల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎన్కౌంటర్ రాజకీయాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంట్లో ప్రారంభమైన రసం మామిడిపళ్ళ సీజన్

DSCN0570 DSCN0571

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సుప్రసిద్ద నటుడు , రచయిత శ్రీ రావి కొండల రావు గారి తో రెండు సాయంత్రాలు – గబ్బిట కృష్ణ మోహన్

DSC00057 DSC00059 DSC00060 rk-1 rk-2

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉగ్రవాది కి స్వేచ్చ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాగంటి రవీంద్ర గారి లేఖ

maganti1 001 maganti2 001 maganti3 001 maganti4 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొత్త రాజధాని రూపు రేఖలు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

Nehru ;s spy eye on Netaji

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -32

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -32

 

14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-4(చివరిభాగం )

టాల్ స్టాయ్ అనుచర గణం

 

టాల్ స్టాయ్ చాలా నిష్టగా ఉన్నాడుకాని భోగాలమధ్యే జీవిస్తున్నాడు .పూర్వానుభవాలు, బలహీనతలకు లో౦గి పోతున్నాడు .తనను తానూ నియంత్రించుకోలేక పోతున్నాడు .యాత్రికుల సందర్శన పెరిగింది .అడపాదడపా పుస్తకాలు  బూట్లు రిపైర్ చేసే బెంచి పై  కూర్చుని రాస్తున్నాడు .ఇలా అనేక విధాల స్థిమిర జీవితం లేకపోయినా కుటుంబంలోను బయటా ఆయన ప్రతిభా కీర్తి పెరుగుతూనే ఉన్నాయి .ప్రజలకు ఆయన బోధలపై విపరీతమైన గురి ఏర్పడింది .ఆయన బోధనలను అమలు పరచటానికి కాలనీలు ఏర్పడ్డాయి .రష్యా యువకులు తమ గురూజీ టాల్ స్టాయ్ అనే చెప్పుకొన్నారు .తమను ‘’టాల్ స్టాయన్స్ ‘’గా పిలుచుకొన్నారు .ఆయన రచనలు ప్రపంచ భాషల్లోకి అనువాదం పొందాయి .వాటి ప్రభావం ఇంకా పెరిగింది .

కరువు –సహాయ పనులు

1891 లో రష్యాలో వచ్చిన భయంకర కరువును ఎదుర్కోవటానికి బాధితులకు సహాయ సహకారాలు అందజేయటానికి నడుం బిగింఛి అంకిత భావంతో రిలీఫ్ వర్క్ ను చేబట్టాడు . .దేశ విదేశాలనుండి కరువు నివారణకు అందు తున్న నిధులను గ్రామాలకు గ్రామాలకే ఆహారం సరఫరా చేయటానికి ఖర్చు పెట్టాడు .దీనితో టాల్ స్టాయ్ సేవానిరతి ప్రపంచమంతా పాకిపోయి ప్రపంచం లోనే గొప్ప గౌరవ నీయుడు ఆరాధనీయుడయ్యాడు

అరిస్టోక్రసికి సింహ స్వప్నం .

ఆయన జీవితం లో చివరి ఇరవై ఏళ్ళు రష్యన్  అరిస్టోక్రసి కి  సింహ స్వప్నమే అయ్యాడు  .ఆయన రచనలనేకం నిషేధించబడ్డాయి .దొంగచాటుగా ప్రింట్ చేసి సొమ్ము చేసుకొన్నారు .ఆయన సమర్ధకులను జైల్లో పెట్టి హింసించారు . ఆయననూ పోలీసు నిఘాలో ఉంచారు .75 వ ఏట చర్చి కూడా బహిష్కరించింది ఆయనను .సంప్రదాయ క్రిస్టియన్ మతాన్ని కాదన్నాడనేదే అభియోగం .ఆయనకున్న పరపతిని తగ్గించాలన్నదే ఆశయం .

అహింసా పరమో ధర్మః

ప్రభుత్వం  పెట్టె హింసలను చూపించే దౌర్జన్యాలను ఆయన పరమ ప్రశాంత చిత్తం తో అహింసా మార్గం లో  ఎదుర్కొన్నాడు .ఆయన విప్లవానికి పూర్తీ వ్యతిరేకి .ప్రభుత్వ చేష్టలను తీవ్ర స్వరం తో నిరసించాడు .అన్యాయాలను అడ్డుకున్నాడు .ప్రతిపనిపైనా పూర్తిగా విచారణ జరిపి మాత్రమె చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియ జెప్పాడు .ఆ నాటి ప్రజల మనోభావాలకు టాల్ స్టాయ్ అద్దంపట్టాడు .విప్లవానికి టాల్ స్టాయ్ యెంత వ్యతిరేకి అయినా ఆయన మరణం తర్వాత 7 ఏళ్ళకు చివరి రివల్యూషన్ రష్యాలో జరిగింది .

మహాత్ముడికి ఆదర్శం

రష్యాలోని యాస్నాయ పోల్యానా దక్షిణ అమెరికాకు అర్ధ ప్రపంచం దూరం లో ఉంది .అక్కడ మోహన్ దాస్ కరం చంద్ గాంధి ‘’the kingdom of God is within you ‘’అని  ప్రకటించాడు .టాల్ స్టాయ్ కి జాబు రాస్తూ తాను  ఆయన విశ్వాసపాత్రుడైన అనుచరుడిని అని చెప్పుకొన్నాడు .ఇద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు చాలాకాలం జరిగాయి .1910 చివరలో టాల్ స్టాయ్ మహాత్ముడికి ఒక సుదీర్ఘమైన లేఖ రాశాడు .అందులో క్రిష్టియానిటి  క్రీసు బోధనలను అనుసరించటం లేదని బాధ పడ్డాడు .అందులోనే చాలా తీవ్రంగా ‘’the longer I live ,and especially now when I vividly feel the nearness of death ,I want to tell others what I feel so very clearly and what to my mind is of great importance –namely that which is called passive resistance ,but which in reality is nothing less than the teaching of love ,uncorrupted by false interpretations. A s soon as force was admitted into love ,love was no longer the law of life .And as there was no law of love ,there was no love at all, except violence –that is the power of the strongest .Thus Christian mankind has lived for nineteen centuries ‘’అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పాడు .ఇవే మహాత్ముడికి ప్రేరణ మంత్రాలైనాయి భారత దేశ స్వతంత్ర సాధనకు .అవే మార్టిన్ లూధర్ కింగ్ కు ఆదర్శాలూ అయ్యాయి .

సందర్శకుల సందడి

ఈ ముసలివయసులో అన్నిరకాల అభిప్రాయాల వారి సందర్శన తో టాల్ స్టాయ్ క్షణం తీరిక లేకుండా గడిపాడు .ప్రముఖ కవులు ,భక్తులు ,రాజకీయ నాయకులు ,రాజ్య పాలకులు అందరూ క్యూకట్టి దర్శనాలు చేసుకొని సర్వ సంగ పరిత్యాగి అయిన ఆ మహాను భావుడిని అర్చి౦చేవారు .సన్మానించి గౌరవించేవారు .’’సత్యం కోసం బాహ్య విషయాలను త్యాగం చేయటమే పరమార్ధం అని బోధించాడు లియో .

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత లాగా   తయారైంది టాల్ స్టాయ్ బతుకు .ప్రపంచమంతా ఆరాదిస్తూ పూజిస్తున్న మహా రచయితా దార్శనికుడికి ఇంటిపోరు అదే దామాషాలోఅనులోమంగా  పెరిగి ఇంట్లో పరువు విలోమంగా తగ్గిపోయింది సంతానాన్ని గారాబం గా చూసుకొంటూ వాళ్ళతో ఆటలాడుకొంటూనే  ఉండే వాడు ఒకప్పుదు  .వారికీ తండ్రిపై వల్లమాలిన గౌరవ ప్రేమలుండేవి .కాని ఇప్పుడు అంతా ‘’ఉల్టా సీదా ‘’అయి పోయింది .పిల్లల్లో స్వార్ధం పెరిగింది  .తండ్రి త్యాగనిరతిని వాళ్ళు అర్ధం చేసుకోలేక గొడవ పడ్డారు .పలకరింపులే లేవు .సానుభూతి ఎండమావి అయిపోయింది .కుటుంబం లో .చిన్న కూతురు అలేక్సా౦డ్రా మాత్రమె తల్లినెదిరించి తండ్రి పక్షాన నిలిచింది .మిగతావారంతా బద్ధ విరోదులైపోయారు

సుఖము లేదంతే.

సాధారణం గా మానవ జీవిత చరమాంకం లో సుఖ శాంతులతో వర్ధిల్లటం అందరూకోరుకొనే వరం పాపం ఈ ముసలాయనకు అది శాపంగా మారింది .అందరూ ఆయన్ను వ్యక్తిగతంగా బాధించారు హింసించారు ,పీడించారు .భార్య సోన్యాకు లియో అనుచరుడు వి. జి .చేర్కొవ్ కు మధ్య’’ టగ్ ఆఫ్ వార్ ‘’కొనసాగింది .చేర్కొవ్ పెద్ద లాండ్ లార్డే .సంస్థానం లో ఉండే రైతుల జీవితాలను బాగు చేయాలనుకోన్నవాడే .రెండు విషయాలే తగాదాకు కారణాలైనిలిచాయి .మొదటిది తన రచనల మీద కాపీ రైట్  హక్కులు ప్రజలకు ఇవ్వకుండా భార్యకు దఖలు పరచటం .చరమాంకం లో ఉన్న మాస్టర్ లియో  ను ఆ హక్కులు ప్రజలకు దక్కెట్లు వీలునామా లో పొందుపరచమని చిలక్కి చెప్పినట్లు చెప్పాడు ,ఇలా చేస్తే సోన్యాకు ,ఆమె వారసులకు  హక్కులు దక్కవు .రాయల్టీలు రావు .టాల్ స్టాయ్ చాలా రహస్యం గా భద్ర పరచిన డైరీలు చేర్కొవ్ అధీనం లో ఉండటం .చివరికి చిలికి చిలికి గాలివానైంది ఈ డైరీల విషయం లోనే .

సోన్యా మానసిక స్థితి

ఇంటిలోని పోరు గురించి ఆయన రాసుకొన్న ఎనిమిది డైరీలున్నాయి .సోన్యా మానసిక పరిస్తితికూడా బాగా లేదు .మెనోపాజ్ బాధలెక్కువైనాయి .హిస్టేరికల్ గా మారిందికూడా .భర్త రాసుకొన్న డైరీలలో తన అనారోగ్య విషయాలేమైనా ఉన్నాయేమోనని ఆమె అనుమానం  అపోహ  .భర్త చనిపోతే వాటిని ప్రచురించే హక్కు ఎవరికి దక్కుతుంది అనేదానిపై సందిగ్ధం ఆమెను పీడిస్తోంది .ఎప్పుడూ ఇంట్లో ఆమె ఏడుపులు పెడ బొబ్బలుగా గా ఉంది. ఇల్లు నరకప్రాయమై పోయింది .తరచుగా ఆత్మహత్యా ప్రయత్నాలూ చేసింది .భర్త ప్రతికదలిక పైనా నిఘా పెట్టింది .చెప్పరాని రాయలేని అనేక నేరాలు ఘోరాలు ఆయనపై మోపి మానసిక క్షోభ పెట్టింది .82 ఏళ్ళ ముదుసలి భర్తకు చేర్కొవ్ తో అక్రమ సంబదాన్నీ అంట గట్టింది .ముప్ఫై ఏళ్ళు భార్యకు లొంగి బతికాడు .ఇక ఏమాత్రమూ సహించలేక పోయాడు స్వేచ్చ కావాలని పించింది .రాజీ ప్రశ్నే లేదన్నాడు .

ఇంటి నుంచి బయటి ప్రపంచం లోకి –అటునుంచి అనంత లోకాలకు

28-10-1910 ఉదయం 6 గం లకు అక్టోబర్ చలిగాలిలో తెల్లవారుజాముననే టాల్ స్టాయ్ లేచి తన స్వంత ఎస్టేట్ యాస్నా పోల్యానా వదిలి బాహ్య ప్రపంచం లోకి వచ్చేశాడు .ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎక్కడికి వెడుతున్నాడో తెలియదు .తన ఇంట్లో ఇంక ఒక క్షణం కూడా ఉండలేనని ,ఉండరాదని మాత్రం నిశ్చయించుకొని బయట పడ్డాడు ఆమహా రచయిత.అయనను అమితంగా ఆరాధించే కూతురు అలేక్సా౦డ్రా తండ్రిని ఆయన సోదరి ఉండే ఒక కాన్వెంట్ దగ్గర కలుసుకోగలిగింది . మర్నాడు తండ్రీ కూతురు కలిసి తెలియని దూర తీరాలకు ప్రయాణం చేశారు .లియో చలితో వణికి పోతున్నాడు .జ్వరం తీవ్రంగా ఉంది వీళ్ళు ఎక్కిన రైలు  ఆష్టా పోవో స్టేషన్ లో ఆగింది .స్టేషన్ మాస్టర్ దయ తలచి తను ఉంటున్న ఇంటిలో ఆతిధ్యమిచాడు .అప్పటికే న్యుమోనియా సోకి బాధపడుతున్నాడు .టాల్ స్టాయ్ ఇల్లు వదిలి వేల్లిపోయాడన్న వార్త  గుప్పుమన్నది .ప్రపంచం అంతా ఆయన పక్షాన నిలిచింది .ఆస్టా పోవోగ్రామం అంతా జనసముద్రమై ఉప్పొంగింది .విలేకరులు ,ఫోటోగ్రాఫర్లు ,అధికారులు ,గూఢచారి పోలీసులు ,శిష్యులు ,కొడుకులు ,కూతుళ్ళు బంధుజనం అభిమానులు ఆసక్తి పరులతో అంతా హడావిడిగా ఉంది .భార్య సోన్యా కూడా చూడటానికి వచ్చింది కాని భర్త ఆమెను తన రూమ్ లోకి రానివ్వ వద్దని ఆంక్ష విధించాడు  .మర్నాడు నవంబర్ 7 ఉదయం టాల్ స్టాయ్ స్పృహ కోల్పోయే దాకా ఆమెను లోనికి రానివ్వలేదు .ఆ తర్వాతే అనుమతించారు .కొన్ని గంటల తర్వాత ఆయన ఆయాస పడి గాలి పీల్చుకోవటానికి చాలా కష్టపడి చివరికి అంతిమ శ్వాస వదిలాడు .

టాల్ స్టాయ్ తప్పులేమీ చేయని వాడూ ,మహోన్నతుడూ కాకపోయినా ఆయన రష్యాసాహిత్య చరిత్రలో ఒక విస్తృత విశాల మానవుడు ,అంతకు మించి అత్యంత గొప్ప నైతిక బలమున్నవాడు అనటం లో సందేహం లేదన్నాడు రచయిత లూయీ అంటర్ మేయర్ .

టాలెస్ట్ రైటర్, ఫిలాసఫర్ పసిఫిస్ట్   టాల్ స్టాయ్

నవలాకారులలో అత్యున్నతుడు లియో అంది వర్జీనియా ఉల్ఫ్ .జేమ్స్ జాయిస్ ‘’he is never dull ,never tired ,never pedantic ,never theatrical ‘’అన్నాడు .డాస్తో విస్కీ ‘’సజీవనవలాకారుల్లో గొప్పవాడు ‘’అంటే, ఫ్లాబర్ట్ వార్ అండ్ పీస్ చదివి ‘’ఆయనలో కళాకారుడు ,సైకాలజిస్టూ’’ఉన్నారన్నాడు .’’seldom art work so much like nature’’అనిపోగిడాడు ధామస్ మాన్ .ప్రౌస్ట్ ,ఫాక్నర్ ,నబకోవ్ లదీ ఇదే అభిప్రాయం .

టాల్ స్టాయ్  ప్రైవేట్ ప్రాపర్టీ కింద భూములు ఉండటానికి ఇష్టపడలేదు .ఫాదర్ సేర్జియాస్ ను చెకోవ్ కు గోర్కీ కి చదివి వినిపిస్తూ చివర్లో టాల్ స్టాయ్ కన్నీళ్లు ఆపుకోలేక కార్చేశాడు .ఆయన గాంధీగారికి రాసిన ఉత్తరం ‘’ఏ లెటర్ టు ఎ హిందూ ‘’పేరున ప్రసిద్ధి చెందింది .మహాత్ముడు ఆయనను ‘’the greatest apostle of non violence that the present age has produced ‘’అని శ్లాఘించాడు .దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేసిన రెండవ కాలనీకి గాంధీగారు ‘’టాల్ స్టాయ్ కాలని ‘’అని గౌరవ నామ కరణం చేశాడు .అంతర్జాతీయం గా భాషలన్నిటికి ఏక భాష  ‘’ఎస్పరాంటో ‘’ఉండాలని ఆశించాడు లియో .డొకో భోర్ 1895లో తమ వద్ద ఉన్న ఆయుధాలను తగల బెట్టి శాంతి ఉద్యమాన్నిచేయటాన్ని  సమర్ధించాడు .వారి భావాలను అంతర్జాతీయ వేదికపై చర్చి౦చాడు కూడా.డొకో బోర్లు కెనడాకి వలసపోవటానికి సహాయ పడ్డాడు లియో . 1904జపాన్ –రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించన శాంతి కాముకుడు టాల్ స్టాయ్ .

Image result for tolstoy

మరో ప్రముఖవ్యక్తితో కలుద్దాం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-15 –ఉయ్యూరు

 

.

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -31

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -31

 

14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-3

కరేనిన ప్రాముఖ్యత

వార్ అండ్ పీస్ లాంటి విస్తృత కాన్వాస్ లేకపోయినా అన్నా కేరేనినా తక్కువ పాత్రలతో ,నగరంలోని అపరిశుభ్రత మొదలైన విషయాలకు ప్రాదాన్యమిచ్చాడు లియో .ఇందులో అంతర్గత సంఘర్షణలున్నాయి . నైతికతపై ఆలోచనలున్నాయి .రష్యా ఉన్నత వంశానికి చెందిన ఒక మహిళ విషాద గాధ ఇది .యవ్వనంలో అందంగా ఉన్న సున్నితమనస్కతకల ఒక అమ్మాయికి  తనకంటే చాలా పెద్ద వయస్కుడైన వాడితో పెళ్లి జరిగింది .పరిస్తితుల ప్రాబల్యం వలన ఆమె ఒక యువ ఆఫీసర్ ను ప్రేమించింది .ఇటు ప్రేమ అటు భర్త తో సంసారం .ఈ రెండిటి మధ్య నలిగిపోతుంది .తేల్చుకోలేక ,ముందుకు సాగలేక ,సమాజాన్ని ఎదిరించలేక నిరాశా నిస్పృహలతో రగిలిపోయే కేరేనినా పాత్రను చిరస్థాయిగా నిలిచేట్లు మలచిన తీరు అసదృశం గా కనిపిస్తుంది .’’Anna Karenina is all encompassing stern and compassionate ,understanding ,yet merciless ,one of the supreme novels of the century ‘’.

 

టాల్ స్టాయ్ కొత్త మతం

నిజ జీవితం లోకూడా టాల్ స్టాయ్ అంతసంఘర్షణ  కు లోనయ్యాడు .తప్పు చేస్తున్నానేమోనని చింతించాడు చావు భయం వెన్నాడుతోంది .మానసులోని భావాలను అణచుకోలేక పోతున్నాడు .జీవించటానికి ఆధారమూ గోచరి౦చటం లేదు  .సమైక్యత,కనీస న్యాయం ,నైతికతస్తిరత్వం  వైపు మొగ్గు పైనే ద్రుష్టి పెట్టాడు .మతం లో సామాన్య రైతుకు అభయం ,మరణానికి సంసిద్ద మయ్యే ప్రశాంతత ఉన్నాయనుకొన్నాడు .దీనికి తనకు పూర్తీ ఆధ్యాత్మిక భావాలే శరణ్యమని పించింది .మొదట సంప్రదాయ చర్చి పై ఆధార పడాలనుకొన్నాడు .కాని వారిలోని చాందస భావాలు ,కర్మకాండలు నచ్చలేదు .చివరికి తన ధోరణిలో ఒక కొత్త మతాన్ని గురించి ఆలోచించాడు .ఈ విషయాలన్నీ ‘’కన్ఫెషన్స్ఆఫ్ సెయింట్ ఆగష్టిన్  ‘’లో చర్చించి రాశాడు.ఆయన మతం లో దేవుడు అంటే దేవుడు అంటే అన్నిరకాల నమ్మకలున్నవారికీ చెందినవాడు .ఏదో ఒక భావానికి మాత్రమె చెందినవాడుకాదు .అంటే ‘’యూని వర్సల్ గాడ్ ‘’ .. జీసస్ అంటే ఒక లిజే౦డరి ఫిగర్ మాత్రమె .అన్నికాలాలకు గొప్ప బోధకుడు .విజ్ఞానానికి పరాకాష్ట .ఆయన చెప్పిన’’ సేర్మాన్ ఆన్ ది మౌంట్ ‘’ లో ఉత్తమజీవికా విధానాలున్నాయి .అందులో చెప్పిన ‘’resist not him that is evil ‘’అనేది శాంతికి ప్రవచనం గా భావించాడు

టాల్ స్టాయ్ ని రూసో తోపోల్చటం ఉంది ఇద్దరి జీవన విధానాలు వేరే . ‘’మనిషి లోని దైవానికి’’సేవ చేయాలనే తత్త్వం లియో ది .వ్యక్తిగతమైన ఇష్టం బలహీనత అన్నాడు .పనిలో మనమెవరమో మర్చిపోవాలి .కళ మానవ సహోదరత్వానికి మాధ్యమంగా ఉండాలి అన్నాడు .ప్రతిదీ కళాత్మకం గా ఉండాలని అంటాడు .చదువులో ,పనిలో ,వ్యక్తిగత భావాలలో ,ప్రభుత్వం లో పబ్లిక్ సెంటిమెంట్ అన్నిటిలో కళ కనపడాలి .కళతోనే అన్నిటినీ కొలిచేవాడు .వీటినే దిలివింగ్ కార్ప్స్’’,దిపవర్, ఆఫ్ డార్క్ నెస్ మొదలైన  నాటకాలలో నిక్షిప్తం చేశాడు .ప్రసిద్ధమైన కధలు’’ దిడెత్ ఆఫ్ ఇవాన్’’’’ ఇల్యోవిచ్ ,ది క్రాత్రడ్జ్ర్ సోనాటా ‘’లలో కూడా పోదిగాడు ‘’.రిసరేక్షన్ ‘’అనే నవల ‘’వాట్ ఈజ్ ఆర్ట్ ‘’లు పూర్తిగా నైతికతను సంర్ది౦చేవే .

మారిన మనిషి

టాల్ స్టాయ్ లో అంతులేని  మార్పులు వచ్చాయి .వస్త్రదారణా మారింది ముతక బట్టలు కట్టటం మొదలు పెట్టాడు .పాద రక్షలు లేకుండా నడిచాడు .ఇతరుల శ్రమ మీద జీవించటం నేరంగా భావించాడు .అన్నిరకాల వ్యసనాలకు ,’’ఆకళ్ళ’’కు దూరంగా ఉన్నాడు .పొగ తాగటం మానేశాడు .శాకాహారం పైనా,తీవ్ర శిక్షల రద్దు పైనా  పుస్తకాలు రాశాడు .డబ్బు బంధాలనుండి ,ఆస్తి సంకెళ్ళ నుండి విడిపడాలని ఆలోచించాడు .ఇవన్నీ ‘’అయ్యవారికి’’ బాగున్నా ‘’అమ్మవారు సోన్యా’’ కు నచ్చలేదు .వీటిపై ఆలోచించటానికే ఆమె ఇష్ట పడలేదు .భార్య పూర్తిగా మతాన్ని చర్చిని సమర్ధించే వ్యక్తీ .అందువల్ల టాల్ స్టాయ్ ఊగిసలాట ధోరణి భార్యకు అసలు నచ్చలేదు .ఆమె స్వతహాగా రైతు కాకపోవటం ‘’ కౌం టేస్’’’’కావటం ,ఆస్తిని విస్త్రుతపరచాలనే ఆలోచనలో ఉండటం ,ఎస్టేట్ ను సంపన్నం చేయటానికి ,పిల్లలకోసం ఎస్టేట్ రాబడి ,సంపద వృద్ధి చేయాలనే ఆలోచనా ఆమెది .స్వచమైన తల్లిగా ఉండటమే ఆమె ఆదర్శం .ఆమెకు విరుద్దం గా ప్రవర్తించలేక తన భావాలను ఒదులుకోలేక సతమతమవుతున్నాడు .నిర్ణయాలను వాయిదాలపై వాయిదాలు వేస్తున్నాడు .తన ఆస్తినంతా ఆమె పేరున రాసేశాడు .తన పుస్తకాలపై వచ్చే ఆదాయం హక్కులు జనానికి ఇవ్వటానికి బదులు  ,ఆమెకే చెందేట్లు రాయటంచేసేశాడు .సోన్యా స్వంతం గా పబ్లిషింగ్ హౌస్ ఏర్పాటు చేసి భర్త రచనలను స్పెషల్ ఎడిషన్స్ గా ముద్రించింది .వ్యాపార ధోరణి బాగా ఉన్న ఆమె దీనితో  డబ్బు బాగా గడించి లాభాలు తీసింది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అది చాలు మన్మధా మరియు స్మార్ట్ మన్మధ కవితలు -మూసీ -ఏప్రిల్

జీవనోద్భాషి ఆంద్ర భాష -బలివాడ అప్పారావు కవిత -మూసి ఏప్రిల్bhasha 001bhasha 001manmadha 001

Posted in కవితలు | Tagged | Leave a comment

సత్య నాష్


 


 
 


 
 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యోగ సంప్రదాయం అంటే ఏమిటి?

యోగ సంప్రదాయం అంటే ఏమిటి?
 
యోగశాస్త్రం అనాదిగా మన దేశంలో ఉన్న సంప్రదాయం. ఉపనిషత్తుల్లో చాలా చోట్ల యోగం యొక్క ప్రస్తావన ఉంది. మనస్సును పవిత్రం చేసుకోవడానికి ఉపయోగించే మార్గంగా దీన్ని ఉపాసనలతో జోడించి చెప్పారు. భగవద్గీత ఆరవ అధ్యాయం అంతా యోగాభ్యాసానికి సంబంధించినదే. నాస్తిక సంప్రదాయాలైన బౌద్ధ, జైన మతాల్లో కూడా చాలా నిశితంగా వీటిని అభ్యాసం చేశారు. బహుశా బౌద్ధుల కాలంలోనే యోగశాస్త్రం మనదేశం ఎల్లలు దాటి టిబెట్‌, చైనా తద్వారా మిగతా ఆసియా దేశాలకు కూడా విస్తరించింది. అన్ని భారతీయ సంప్రదాయాలూ యోగాన్ని అంగీకరించినా ముఖ్యంగా దీనికి సంబంధించిన అంశాల్ని సూత్రాల రూపంలో పతంజలి అనే ఋషి వ్రాశాడు. వీటినే పతంజలి యోగసూత్రాలు అంటారు. ప్రపంచంలోని మేధావులందరూ ప్రశంసించిన గ్రంథమిది.
యోగం అనే పదానికి కలయిక అని అర్థం. ఇది వరకు లేనిదాన్ని పొందడం, లేదా ఇది వరకూ తెలియనిదాన్ని తెలుసుకోవడం. భగవద్గీతలో ప్రతి అధ్యాయం పేరులో యోగ అనే పదం ఉంటుంది. అది ఆ అధ్యాయంలో చెప్పబడిన విషయాన్ని సూచిస్తుంది. ప్రస్తుత వ్యాసం అలాకాక యోగశాసా్త్రనికి సంబంధించినది. దీన్ని అభ్యాసం చేసే వ్యక్తి ఇది వరకు తెలియనిదాన్ని తెల్సుకోవడం ఇందులోని విషయం. జీవుడు తాను కేవలం శరీరం, ఇంద్రియాలు  కాదనీ, చైతన్యం తన నిజరూపమనీ తెలుసుకోవడం.
శరీరానికి, మనస్సుకు ఉన్న సంబంధాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రం యోగశాస్త్రం. సాధారణంగా యోగమంటే ఏవో ఆసనాలు వేయడం, శరీరాన్ని అనేక రీతుల్లో వంచడం, గాలిని బిగబట్టడం మొదలైనవేనని భావిస్తూ ఉంటాం. ఈ విధమైన ఆసనాలు, గాలిని బిగబట్టడం లాంటివి యోగశాస్త్రంలో ప్రాథమిక అభ్యాసాలు మాత్రమేనని యోగసూత్రాల్ని చూస్తే గమనించగలం. మరి ఇందులో అసలైన విషయమేమిటి అని పరిశీలిద్దాం.
చైతన్యం అనే రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి చర్చ అన్ని భారతీయ దర్శనాల్లో చూడగలం. జడం నుండి చైతన్యం వచ్చిందని కొందరు, చైతన్యమే జడంగా మారిందని కొందరు, చైతన్యం జడంగా కనిపిస్తుందని మరికొందరు ప్రతిపాదించారు. ఈ సమస్యకు సమాధానానికై ఈనాటికీ భౌతిక శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు కలిసి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఆధునిక మనస్తత్వశాస్త్రజ్ఞులు మన యోగశాస్త్రం చేసే ప్రతిపాదనల్ని స్వీకరించి ఈ యోగ విధానాల్ని అభ్యాసం చేసే సాధువులు, బౌద్ధభిక్షువులు మొదలైన వారితో కూడా కలిసి పనిచేస్తున్నారు.
ఇలాంటి ప్రయోగాలకు మనిషి(అన్ని జీవుల) శరీరమే ప్రయోగశాలలాంటిది. దీనిలో ఒక ఆలోచనాశక్తి ఉంది, శరీరం, ఇంద్రియాలు, అవయవాలు ఉన్నాయి. ఆలోచనాశక్తి చైతన్యానికి సంబంధించిన అంశం. శరీరం, ఇంద్రియాలు జడానికి చెందిన అంశాలు. ఈ రెండూ కలగాపులగంగా విడదీయరానివిగా శరీరంలో ఉన్నాయి. ఏది దేనిపైన ఆధారపడి ఉంది, ఏది ప్రధానమైనది అని తెలియాలంటే శరీరము, మనస్సు అనే లేబొరెటరీతోనే పరిశీలన చేయాలి.
శాస్త్రవేత్తలు దేన్నీ నిర్ధారించి చెప్పనప్పటికీ వేదాంతం. సాంఖ్యము, యోగశాస్త్రమూ చైతన్యమే ప్రధానమైనదని చెపుతాయి. ప్రాణుల శరీరం, ఇంద్రియాలు, మనస్సు అనేవి సృష్టిలో ఉన్న పృథివి, జలం, అగ్ని మొదలైన ఐదు భూతాల పరిణామంగా ఏర్పడినవే (్ఛఠిౌజూఠ్ఛి) అని ఇది వరకు వ్యాసాలలో గమనించాం. శరీరం, అవయవాలు స్థూలమైనవి, అంటే బండవి, చైతన్యం లేనివి అని చెప్పవచ్చు. మనస్సు వీటికన్నా మెరుగైనది. దీనికి విషయాల్ని గ్రహించే శక్తి ఉంది. అందుకే దీన్ని సూక్ష్మమైనది అన్నారు. మనిషికి ‘నేను’ అనే భావన ముఖ్యంగా స్థూలమైన శరీరంపై ఉంటుంది. దీనికి ఆకలి, దప్పికతో పాటు, ఇంద్రియాల సంతోషానికై అనేక కోరికలు ఉంటాయి. మనస్సు వీటి వెంబడి పరిగెడుతూ ఉంటుంది. ఈ కోరికలు తీరనప్పుడు మనస్సు తీవ్రంగా కలత చెందుతుంది. దాని ప్రభావం శరీరంపై ఉంటుంది. కానీ మనిషి స్వరూపం శరీరం, ఇంద్రియాలు కాదు, చైతన్యం అని ఉపనిషత్తులు చెప్పినట్లే పతంజలి కూడా చెబుతాడు. అందువల్ల సాధన మార్గంలో ఉన్న వ్యక్తి ‘నేను’ అనే భావనను స్థూల శరీరం నుండి తీసివేసి తన స్వరూపం చైతన్యమే అని గమనించాలనేది యోగం యొక్క ముఖ్య లక్ష్యం. ఇలా గమనించడానికి మనస్సుకు చాలా అభ్యాసం కావాలి. ఇలాంటి అభ్యాసాన్నే యోగశాస్త్రం చెప్తుంది.
మనస్సు శరీరంపై ప్రభావం చూపుతుందని మనకు తెలుసు. ఏదైనా ఎక్కువ సంతోషాన్ని, దుఃఖాన్ని కలిగించే వార్తలు విన్నప్పుడు మనిషి ఉద్వేగానికి లోనౌతాడు. కానీ శరీరాన్ని నియంత్రించడం ద్వారా మనస్సును ప్రభావితం చేయగలం అనేది యోగశాస్త్రంలో మౌళికమైన సూత్రం.పతంజలి తన యోగసూత్రాల్లోని మొదటి మూడు సూత్రాల్లోనే విషయాన్నంతా సంగ్రహంగా చెప్పాడు. యోగమంటే మనస్సులోని అన్ని ఆలోచనల్నీ నిరోధించడం అని, అలా చేసినపుడు సాధకుడు తన అసలు స్వరూపమైన చైతన్యంలో ఉంటాడని, అలా చేయలేనప్పుడు బయటి ప్రపంచంతో మమేకమై కష్టసుఖాలు అనుభవిస్తుంటాని మొదటి మూడు సూత్రాలు. మిగతా గ్రంథమంతా ఈ మూడింటిపైన వచ్చిన వ్యాఖ్య. మనస్సును అదుపులో తేవడానికి ఎనిమిది మెట్లు చెప్పారు. దీన్నే అష్టాంగయోగం అన్నారు. మొదటగా శరీరానికి సంబంధించిన అభ్యాసాలు. ఒక విషయంపై కోరిక కలిగినపుడు బలవంతంగా శరీరాన్ని నిగ్రహించుకోవడం మొదటి మెట్టు. మంచి, చెడులు విచారించి, మనస్సును కోరికలవైపు వెళ్ళకుండా చేయడం రెండవ మెట్టు. మూడవమెట్టు మనందరికీ తెలిసిన ఆసనాలు. ఇవి శరీరానికి కష్టం కలిగించేటట్టుగా లేకుండా ఆలోచించడానికి అనువైన పద్ధతిలో ఉండాలి. ఆ తర్వాత గాలిపై నియంత్రణ మొదలైన మెట్లు చెప్పబడ్డాయి. వీటిని పుస్తకాల ద్వారానే కాక ఒక మంచి సాధకుడైన గురువు పర్యవేక్షణలో అభ్యాసం చేయడం ముఖ్యం.
యోగశాస్త్రంలో దేవుడి ప్రస్తావన కేవలం ఒకే సూత్రంలో ఉంది. మనిషికున్న క్లేశాలు, కర్మఫలం మొదలైన వాటికీ, దేశకాలాలకూ అతీతంగా ఉన్న సర్వజ్ఞుడైన వ్యక్తి అని మాత్రమే చెప్పబడింది. కావున ఇది ఏ మతవిశ్వాసానికీ, ఏ దేవుడికీ చెందింది కాదు. ప్రపంచంలో ప్రతి మనిషికీ శరీరం, ఇంద్రియాలు, మనస్సు ఒకటే. అందువల్లే ఈ శాస్త్రంలోని విశ్లేషణపై మనకన్నా ఎక్కువగా ఇతరులు శ్రద్ధ చూపుతున్నారు. పాశ్చాత్య మనస్తత్వశాసా్త్రనికి మూల పురుషుడు అని పిలవబడే గిజీజూజూజ్చీఝ ఒ్చఝ్ఛట (హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం) వివేకానందుని శిష్యుడు. వివేకానందుడు ఇతని ఆతిథ్యంలో ఉండేవాడు. ఇతడు చెప్పిన టఛిజీౌఠటుటట అనే భావన యోగసూత్రంలోనిదే. గిజీజూజూజ్చీఝ ఒ్చఝ్ఛట హిందూ, బౌద్ధ సంప్రదాయాల్ని క్షుణ్ణంగా చదివాడు. అలాగే ఇ్చటజూ ఒఠుజ కుండలిని యోగంపై అనేక సెమినార్లు నిర్వహించాడు. బ్రిటీష్‌ పరిపాలన సమయంలో కలకత్తాలో జడ్జిగా ఉండిన ఖిజీట ఒౌజిు గిౌౌఛీటౌజజ్ఛ అనే అతను శరీరంలోని వివిధ చక్రాలు, కుండలిని మొదలైనవాటి గూర్చి ఖీజ్ఛి ఖ్ఛిటఞ్ఛు మొదలైన పుస్తకాలు వ్రాశాడు. యోగంలో చెప్పే ధ్యానాన్ని అనే పేరిట మనస్తత్వవేత్తలు బోధిస్తున్నారు. ప్రస్తుతం యోగవిధానాల్ని హిందూ సంప్రదాయంలో కన్నా బౌద్ధులు ఎక్కువ అభ్యాసం చేస్తూండడం, ఆదరణ పొందడం ఒక విశేషం.
యోగం అనే పదానికి కలయిక అని అర్థం. ఇది వరకు లేనిదాన్ని పొందడం, లేదా ఇది వరకూ తెలియనిదాన్ని తెలుసుకోవడం. భగవద్గీతలో ప్రతి అధ్యాయం పేరులో యోగ అనే పదం ఉంటుంది. అది ఆ అధ్యాయంలో చెప్పబడిన విషయాన్ని సూచిస్తుంది. ప్రస్తుత వ్యాసం అలాకాక యోగశాసా్త్రనికి సంబంధించినది. దీన్ని అభ్యాసం చేసే వ్యక్తి ఇది వరకు తెలియనిదాన్ని తెల్సుకోవడం ఇందులోని విషయం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
 
సుగుణ మూర్తి స్వరూపమే విగ్రహారాధన!
స్పందన
చివరగా మానవునిలో లౌకిక ప్రయోజనములకు ఆధారభూతమైన మాంత్రిక, యాంత్రిక, తాంత్రిక ప్రధానమైన అధర్వణం ఆవిర్భవించింది. ఆ తరువాతి క్రమంలో ’’సత్యం-శివం- సుందరం’’ అనే ఉపనిషత్తుకి స్ఫూర్తిగా మానవుని మనో విక్షేపాన్ని తొలగించి, ఆత్మ ప్రత్యగాత్మ, ఆధ్యాత్మలను, పరమాత్మలో సాయుజ్య మొనరించే విగ్రహారాధన ప్రారంభమైంది.
మార్చి 27 వ తేదీ శుక్రవారం భారతీయంలో విగ్రహారాధన ప్రధానాంశంగా రిటైర్డ్‌ డి.జి.పి డాక్టర్‌ అరవిందరావు గారి వ్యాసం ఆలోచనాత్మకంగా బాగుంది. దానికి మరి కొంచెం వివరణే ఈ వ్యాసం.
మన భారతీయతత్వ చింతన జ్ఞాన ప్రధానమైనది కేవలం విశ్వాస ప్రధానమైనది కాదు. తత్వం అంటే మూలతత్వం. – ‘ఈ అనంత విశ్వశకి ్తరహస్య తత్వం. ఆ తాత్విక జ్ఞానాన్నే వేదం అన్నారు.‘‘ వేత్తీఆవేదః వేదమతీతివేదః ’’
అని వేద నిర్వచనం. తెలిసేది- తెలుసుకునేది- తెలుసుకున్న జ్ఞానమే వేదం. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవలసినదే చాలా ఉంటుంది. అందుకే ‘‘అనంతావైవేదాః’’ . అయితే ఈ వేద విజ్ఞానాన్ని నాల్గు వేదాలుగా వింగడించాడు వ్యాస మహర్షి. ‘‘వేదాన్‌ వివ్యాస ఇతివేదన్యాసంః’’ అని సంగీత వాక్యము. వేదములు మూడు అని ‘‘త్రయోవేదాః’’ అని కూడా అంటారు. సరే అది ప్రస్తావాంశమే కానీ ప్రధానాంశం కాదు. ప్రస్తుతం విగ్రహారాధనకు వేద నాగరికతా పరిణామం ఎలాగో ఆలోచిద్దాం.
మొదటిగా..
మొట్టమొదటి ఋగ్వేద కాలంలో మానవ నాగరికతలో మనస్సే ప్రధానంగా భావించారు. ఋక్కు అంటే మంత్రం. మను తేత్రాయతీతి మంత్రః అని, మన్య తేత్రాయతేతిమంత్రః అని, మీననాల్‌త్రామతే ఇతిమంత్రః అని నిర్వచనాలున్నాయి. ‘‘మన ఏవ మనుష్యాణాంకారణంబంధవేలూక్షమోః’’ అని మనసునే ప్రధానాంశంగా జపయోగాన్ని, తపోయోగాన్ని సంకల్ప ప్రధానంగా తపోభవ’ అని ఉపదేశించాడు అగస్త్య మహర్షి. అందుకే రుగ్వేద కర్మకాండల్లో క్రియ కంటే ఎక్కువ సంకల్ప ప్రధానంగా ఉంటాయి .‘‘యజ్ఞారాంజపయజ్ఞోస్మి’’ గీతా వాక్యం. కానీ కాలక్రమంలో మనస్సే కాకుండా క్రియకు కూడా ప్రాధాన్యమివ్వాలనే దృష్టిలో యజుర్వేద యుగం ప్రారంభమైంది. ‘‘ కామేనవాచామనసేంద్రియైుః బుద్ధ్యాత్మనా’’- చేసిన కర్మలే సంపూర్ణ సాఫల్యాన్నిందిస్తాయని యజ్ఞయాగాది కర్మలను ప్రబోధించింది. ‘‘యజ్యతీతియజ్ఞం’’ ,దేవేభ్యోయజ్ఞందేవయజ్ఞం’’, ‘‘భూతేభ్యోయజ్ఞః’’, ‘‘ భూతయజ్ఞః’’ అని దేవతలకు, పితరులకు, తనచుట్టూ ఉన్న చరాచర భూత ప్రపంచానికి మేలు చేకూర్చే కర్మలను యజుర్వేదంలో నిర్దేశించారు- యజుర్వేదమైన నమకచమకాదులలో అంతా కూడా ప్రకృతి లోని సర్వవస్తువులను ప్రస్తుతించారు. ముఖ్యంగా మానవజీవనానికి ఆధారభూతమైన నదులను(నద్యామచ), ప్రవాహములను(ప్రవాహ్యమచ), సముద్రపు నురుగును(ఊర్మ్యామచ), శిలలను ( శిలామచ) , రహదారులను(ప్రపధ్యామచ) అన్నింటినీ దేవతా స్వరూపంగా భావించి ప్రస్తుతించింది. ’’ఆపోవాఇదగుంసర్వం… భూర్భువస్సవరోం’’ అనే మంత్రంలో నీటి ప్రాధాన్యాన్ని వివరించింది. అదే ఋగ్వేదంలో జ్ఞానప్రధానంగా భావించి ‘‘అగ్నిమేలే పురోహితం.. హోతారంరతృధాతమమ్‌ ’’ అని అగ్నిని ప్రధానదైవత్వంగా జ్ఞానాన్ని లక్ష్యంగా మనస్సంకల్పాన్ని లక్షణంగా భావించింది ఋగ్వేదం. యజుర్వేదంలో అన్నిప్రాధాన్యాన్ని గుర్తించినా శన్నుదేవరభష్టయతో నీటి ప్రాధాన్యాన్ని ప్రకృతి శక్తుల ప్రాధాన్యాన్ని మానవుని ఐహిక ఆముష్మిక కర్మల్లో అవసరమని గుర్తించింది. అందుకు మానవుడు మనస్సంకల్పంతో పాటు క్రియాత్మకంగా ఉండాలని యజ్ఞయాగాది కర్మలను నిర్దేశించింది. మానవుడు- ప్రకృతి- సంకల్పశక్తి- ఇచ్ఛాశక్తి- క్రియాశక్తుల సమహార సుస్వరూపమే యజుర్వేదం. తరువాత క్రమంలో ’ఆనందో బ్రహ్మ’ అనే లక్ష్యంతో నాద ప్రధానము, సుస్వర ప్రధానమూ అయిన సామవేదం నిష్పన్నమైంది- ఉపవేదంగా గాంధర్వవేదం ఆవిష్కృతమైంది. చివరగా మానవునిలో లౌకిక ప్రయోజనములకు ఆధారభూతమైన మాంత్రిక, యాంత్రిక, తాంత్రిక ప్రధానమైన ఽఅధర్వణం ఆవిర్భవించింది. ఆ తరువాతి క్రమంలో ’’సత్యం-శివం- సుందరం’’ అనే ఉపనిషత్తుకి స్ఫూర్తిగా మానవుని మనో విక్షేపాన్ని తొలగించి, ఆత్మ ప్రత్యగాత్మ, ఆధ్యాత్మలను, పరమాత్మలో సాయుజ్య మొనరించే విగ్రహారాధన ప్రారంభమైంది.
సుగుణనిర్గుణలు..
సుగుణనిర్గుణోపాసనల పరంగా చర్చించినపుడు సగుణోపాసకమైన విగ్రహం ఒక బొమ్మకాదు- మనస్సంకల్ప సిద్ధి పూర్వకమైన మంత్ర పరిపుష్టి(మంత్రాధీనంతుదైవతం) అక్షరము- ధ్వని- స్వరబంధోనియమ బద్ధమైన మంత్రసిద్ధి రేఖాప్రమాణ శాస్త్ర నియమబద్ధమైన యంత్రము. శిల్ప శాస్త్ర ప్రధానమూ ఆగమమంత్ర ప్రమాణమైన విగ్రహమూ, వీటన్నింటిని సమాహార స్ఫూర్తి స్వరూపమే. దేవతామూర్తి అంటే కాని ఏదో ఒక రీతిన చెక్కిన బొమ్మ కాదు. ఇక ఆరాధన, అర్చన విషయానికి వస్తే- కామేన( శరీరం చేత), మనసా (మనస్సు చేత), బుద్ధ్యా (బుద్ధి చేత), ఆత్మనా (ఆత్మ చేత) చేసిన క్రియా కర్మమే సంస్కార భూతంగా సూక్ష్మబుద్ధిలో ప్రవేశించి మానవుని ఉన్నత స్థాయికి, ఉపాసనాస్థితికి చేరుస్తుంది. అదీ ఆరాధన అంటే. వెరసి విగ్రహారాధన భగవత్స్వరూపం- ఈ గంభీర సుశాస్ర్తీయ ఆలోచనా సరళిని విమర్శకులు గ్రహించవలెనని మనవి చేస్తున్నాను.
ఇక నిర్గుణము అనే మాటకు వస్తే వేదాంత పరిభాషలో నిర్గుణ ం అంటే గుణరహితం అని అర్థం కాదు. సంస్కృత వ్యాకరణరీత్యా నిర్‌ అనే ఉపసర్గ రహితం- అని కాకుండా విశేష సంజ్ఞాగుణ వాచకంగా వర్తిస్తుంది. ఉదా: నిరుక్తం- నిర్దేశం – నిర్వచనం- నిర్దిష్టం- నిర్ణయం- వంటి పదములు. అందువల్ల నిర్గుణం అంటే విశేష సౌంజ్ఞాగుణ వాచక శూన్యం అని చెప్పుకోవాలి. అంటే వ్యవహార భాషలో గుణం అనే మాట సంకుచితమైంది. సర్వశక్త్యాత్మక, సర్వవిశ్వాత్మక, సర్వ జ్ఞానాత్మక గుణం కూడా గుణ తత్వమే కానీ అది విశేష సౌంజ్ఞాగుణ వాచకం నిర్గుణం అని అర్థం చేసుకోవాలి. అందుచేత నిర్గుణ తత్వాన్ని మనం చేరుకోలేము కనుక దానినే మంత్ర యంత్ర, తంత్ర సహితంగా సంక్షీప్తికరీంచి సగుణాత్మక దృశ్య మానమూర్తిగా నిర్ధేశించారు. శ్రీ చక్రాది యంత్రాలు – దేవతామూర్తుల విగ్రహాలు దేహా దేవాలయ ప్రోక్తో అని చెప్పబడిన విధంగా దేవాలయాలు – పూజా స్థానాలుగా నిర్ణయించారు. ఈ గంభీరతత్వమే విగ్రహారాధన – ఈ తాత్విక రహాస్యాన్ని తెలుసుకోవలసినదిగా విమర్శకులకు మనవి.
ఉమాపతి బి శర్మా
9246171342
 
స్ఫూర్తే ముఖ్యం!
 
మనం యంత్రాలం కాదు. మనుషులం. అందువల్ల భావోద్వేగాల ప్రభావం మనపై ఉంటుంది. సిబ్బంది పట్ల కరుణతో వ్యవహరించాలి. అయితే ఇది క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా ఉండకూడదు. అతి సర్వత్రా వర్జియేత్‌ అనే విషయం మీకందరికీ తెలుసు కదా! ఇప్పుడు సిబ్బందిని ఎలా కలుపుకొని ముందుకు వెళ్లాలో చూద్దాం. వాళ్ల సమస్యలను వినటం, మన సమస్యలను వారికి వివరించటం ద్వారా ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఈ అనుబంధమే వారిని సంస్థలో కొనసాగేలా చేస్తుంది. ఈ అనుబంధం లేకపోవటం వల్లే – 20, 30 ఏళ్లు పనిచేసినా తర్వాత కూడా చాలా మందిలో నిబద్ధత ఏర్పడదు.
జీవితంలో ప్రోత్సాహకాలు, స్ఫూర్తి- ఈ రెండింటిలో ఏది ముఖ్యం? స్పూర్తే అంటారు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు రవిశంకర్‌. ఇటీవల జపాన్‌లో పర్యటించినప్పుడు – ఆయనను అక్కడి వాణిజ్యవేత్తలు అనేక ప్రశ్నలు అడిగారు. వాటికి రవిశంకర్‌ చెప్పిన సమాధానాలు..
జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కోగలం?
ఆహారం, విశ్రాంతి, ధ్యానం, వ్యాయామం- ఈ నాలుగు మన శరీరానికి అత్యవసరం. ఇవి క్రమం తప్పకుండా శరీరానికి అందిస్తే మనకు శక్తి లభిస్తుంది. ఆ శక్తి మనను ముందుకు నడిపిస్తుంది. కానీ చాలా సార్లు మనం మన శరీరానికి ఈ నాలుగు తగిన పాళ్లలో అందివ్వం. దీని వల్ల మన శరీరం అలసిపోతుంది. అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధపడదు. సవాళ్లను ఎదుర్కోవాలంటే పైన చెప్పిన నాలుగు అత్యవసరం.
నా కంపెనీ కోసం సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవటం చాలా కష్టంగా ఉంది.. దీనికి పరిష్కారమేమిటి?
దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి- ఏదైనా రిక్రూట్‌మెంట్‌ కంపెనీకి ఆ బాధ్యత అప్పచెప్పటం. కానీ ఈ బాధ్యతను ఇతరులకు అప్పచెప్పటం సరికాదు. మనకు కావాల్సిన వ్యక్తులను మనమే ఎంపిక చేసుకోవాలి. దీనికి పరిష్కారం ఒకటే. సమాజాన్ని జాగ్రత్తగా గమనించటం. వారిలో మనకు కావాల్సిన వ్యక్తులను ఎంపిక చేసుకోవటం.
నాకు రెండు కంపెనీలు ఉన్నాయి. వాటిలో వేల మంది పనిచేస్తున్నారు. మా ఆవిడ- ఇంత సంపాదించాం కదా.. జపాన్‌ వదిలి వెళ్లిపోదాం అంటోంది. అది నాకు ఇష్టం లేదు. ఒక వైపు కంపెనీలను, ఒక వైపు ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్‌ చేయాలి?
ఒక చక్రంతో సైకిల్‌ తొక్కగలమా? జీవితం కూడా అంతే. కుటుంబం, పని- ఇవి రెండూ మన జీవితమనే సైకిల్‌ చక్రాలు. ఏ ఒక్కటి పంక్చర్‌ అయినా ముందుకు వెళ్లలేం. పని మీద మనం ఎంత శ్రద్ధ పెడతామో.. అంతే శ్రద్ధ కుటుంబం మీద కూడా పెట్టాలి. అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
నూడిల్స్‌ తింటే చైనీయులం అయిపోం. డానిష్‌ బిస్కట్లు తింటే డానిష్‌ అయిపోం. అలాంటిది- పరాయి సంస్కృతికి చెందిన భావాలను ఎందుకు ఆదరించలేకపోతున్నాం? వాటిని ఎందుకు సహించలేకపోతున్నాం?
దీనికి ఎకైక పరిష్కారం ఇతరుల భావాలను గౌరవించటం. వారు చెప్పే విషయాలను వినటం. ఈ రెండు ఉంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరుల అభిప్రాయాలతో మనం ఏకీభవించకపోవచ్చు. కానీ వాటిని వింటే తప్పులేదు కదా!
నాకు ఒక కంపెనీ ఉంది. నా సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలంటే ఏం చేయాలి?
ముందు ఒక విషయాన్ని స్పష్టం చేస్తాను. మనం యంత్రాలం కాదు. మనుషులం. అందువల్ల భావోద్వేగాల ప్రభావం మనపై ఉంటుంది. సిబ్బంది పట్ల కరుణతో వ్యవహరించాలి. అయితే ఇది క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా ఉండకూడదు. అతి సర్వత్రా వర్జియేత్‌ అనే విషయం మీకందరికీ తెలుసు కదా! ఇప్పుడు సిబ్బందిని ఎలా కలుపుకొని ముందుకు వెళ్లాలో చూద్దాం. వాళ్ల సమస్యలను వినటం, మన సమస్యలను వారికి వివరించటం ద్వారా ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఈ అనుబంధమే వారిని సంస్థలో కొనసాగేలా చేస్తుంది. ఈ అనుబంధం లేకపోవటం వల్లే – 20, 30 ఏళ్లు పనిచేసినా తర్వాత కూడా చాలా మందిలో నిబద్ధత ఏర్పడదు. ఇక టాప్‌ మేనేజిమెంట్‌ విషయానికి వద్దాం. సిబ్బంది చేత బాగా పనిచేయించుకోవటానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి- ప్రోత్సాహకాలు ఇవ్వటం. రెండోది- వారికి స్పూర్తి ఇవ్వటం. ప్రోత్సాహకాలు తాత్కాలికమైనవి. వాటి విలువ కూడా తాత్కాలికంగానే ఉంటుంది. స్ఫూర్తిని ఒక సారి ఇస్తే చాలు. జీవితాంతం పనిచేస్తుంది. దీనికి ఉదాహరణ గాంధీజీ. ఏనాడు ఆయన ప్రోత్సాహకాల గురించి మాట్లాడలేదు. స్ఫూర్తిని నింపటానికే ప్రయత్నించాడు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మచిలీ పట్నం లో ఆంద్ర సారస్వత సమితి ఉగాది పురస్కార ఆహ్వాన పత్రిక

మచిలీ పట్నం లో ఆంద్ర సారస్వత సమితి ఉగాది పురస్కార ఆహ్వాన పత్రికass1 001 ass2 001 ass3 001 ass4 001 ass5 001 ass6 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతి 78 వ సమావేశం -11-4-15 శనివారం సాయంత్రం 5 గం లకు

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

Inline image 1 My Photo
                                 డా    శ్రీ కొంపెల్ల శర్మ
సరసభారతి 78 వ సమావేశం రేపు అనగా 11-4-15 శనివారం సాయంత్రం 5 గం లకుఉయ్యూరులో  ఫ్లోరా స్కూల్ ప్రిన్సిపాల్ మరియు  సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి స్వగృహం (ఫ్లోరా స్కూల్ దగ్గర )నందు ఆత్మీయ సమావేశం గా జరుగుతుంది . ప్రముఖ కదా రచయిత డా.  శ్రీ వేదగిరి రాంబాబు గారు ,”తెలుగు రధం ” అధ్యక్షులు డా  శ్రీ కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య  శర్మ గారు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటారు . ఈ వేసవిలోఏర్పాటు చేసిన  ఈ చల్లని ఆత్మీయ సాహితీ కార్యక్రమం లో  సాహిత్యాభిలాషులందరు  పాల్గొని సేద దీరవలసినదిగా   ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాము  .పాల్గొని   జయప్రదం చేయ ప్రార్ధన . 

జోశ్యుల శ్యామలాదేవి  మాదిరాజు శివలక్ష్మి గబ్బిట  వెంకట రమణ  గబ్బిట దుర్గాప్రసాద్

-గౌరవాధ్యక్షులు –         కార్య దర్శి                     కోశాధికారి         అధ్యక్షులు -సరసభారతి

10-4-15 -ఉయ్యూరు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -30

. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -30

 

14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-2

ఆర్మీకి రాం రాం

విపరీత భావాలతో విసిగిపోయి ,మిలిటరీ కేడేట్ గా ఉండలేక మిలిటరీ మాన్ అని పించుకోటానికి ఇష్టపడక సమయాన్ని చదవటం లో రాయటం లో గడిపాడు టాల్ స్టాయ్ .అనేక భాషల్లో ప్రావీణ్యం సాధించాడు .ఫ్రెంచ్ భాషలో హాయిగా రాశాడు .గ్రీక్ ను స్వయం గా అభ్యసించి ,ఆ భాషలో చేసిన అనువాదాలు మహా మహా గ్రీకు ప్రొఫెసర్ల అనువాదాలకంటే మిన్నగా ఉన్నాయని పించుకొన్నాడు .రష్యా టర్కీ యుద్ధ సమయం లో తనను బదిలీ చేశారని తెలుసుకొని  విభ్రాంతి చెందాడు .సేవేస్టపోల్   రక్షణ బాధ్యతలో ఉన్నాడిప్పుడు .ఈ కాలం లో పొందిన అనుభవాలతో సైన్యం అన్నా యుద్ధం అన్నా అసహ్యం కలిగింది .27 వయసులో సైన్యానికి రాజీనామా చేశాడు .యుద్ధ అనుభవం తో ‘’సేవేస్ట పోల్ కధలు ‘’రాశాడు .ఇప్పటికే రచనలో ప్రసిద్ధు డనిపించుకొన్నాడు .బోహీమియా అరిస్టాక్రటిక్ గా లేదు. తన అభిరుచులకు అనుకూలంగా లేదని భావించి మళ్ళీ పీచే మూడ్ గా యసన్యా పోల్యానాకు చేరాడు .కుర్రవయసులో ప్రశాంత జీవితాన్ని అనుభవించే స్తితిలో లేడు.మనసు స్థిమితంగా లేదు .ఏమి చేయాలో పాలు పోవటం లేదు అస్తిమితత్వం బాధిస్తోంది .చివరికి యూరప్ టూర్ చేయటానికి బయల్దేరాడు .తిరిగి వచ్చి పెళ్లి చేసుకోవాలనుకొన్నాడు .తనకు కావాల్సిన భార్య కోసం ప్రయత్నించాడు .అలాంటివారెవరూ తారసడ లేదు .దాదాపు కాలమంతా డెస్క్ దగ్గరే గడుపుతూ రాసుకొంటూ కూర్చున్నాడు .రాత విసుగని పించి రాత మానేద్దామనుకొన్నాడు .టాల్ స్టాయ్ ఊహించిన  తీరులో రచనలు చేయటం  అసాధ్యం అన్నారు విమర్శకులు .వాళ్ళ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నమేమీ చెయ్యలేదాయన .

పిల్లల   స్కూల్ ఏర్పాటు  -విద్యపై అభిప్రాయాలు

31 వయసులో తన సంస్థానం లోని పిల్లలకోసం ఒక స్కూల్ ప్రారంభించాలను కొన్నాడు .అంతకు ముందు చదువురాని కూలీలను  విద్యా వంతుల్ని చేసే ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు .తనకు ఈ విషయాలలో ఉన్న సామర్ధ్యం తక్కువ అని తెలుసుకొన్నాడు .మళ్ళీ యూరప్ ట్రిప్ చేసి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు .విద్య ఉచితంగా స్వచ్చందం గా అందించాలనే అభిప్రాయానికి వచ్చాడు .విద్యవలన నైతికత పెరగాలని ఆశించాడు .శీల సంపదను పెంచి స్వయం అభివృధికి తోడ్పడాలి .స్వీయ ప్రతిభకు ఊతమివ్వాలి .సృజనను ప్రోత్సహించాలి .తరగతిగది స్వేచ్చకు ,విముక్తికి ఆధారమై ప్రయోగ శాలగా ఉండాలని భావించాడు .

మలుపు తిరిగిన జీవితం

1862 లో టాల్ స్టాయ్ జీవితం అనూహ్యమైనపూర్తీ  మలుపు తిరిగింది .బెర్స్ కుటుంబం చాలాకాలంగా ఆయనకు తెలుసు .తండ్రి డాక్టర్ తల్లి ఆతిధ్యం లో సమర్ధురాలు .పిల్లలు ఉత్సాహ వంతులు . సంతానం లో మధ్య పిల్ల పద్దెనిమిదేళ్ళ  సోన్యా బెర్స్ పై మనసుపడ్డాడు .31 వయసులో అకస్మాత్తుగా ఆమెపై ప్రేమలో పడ్డానని గ్రహించాడు .చాలాకాలం సందేహం ,ఊగిసలాట సాగి చివరికి ఆమెను ప్రొపోజ్ చేయటం ఆమె అంగీకరించటం జరిగిపోయాయి .టాల్ స్టాయ్ అప్పటికే సోన్యా అభిమాన రచయిత.ఆయన్నే ఆరాదించేది .ప్రేమలేఖలతో బాటు డైరీలూ మార్చుకొన్నారు .ఇద్దరి మధ్య రహస్యాలేలేవు .ఆదర్శ దాంపత్యం అనిపించారు .ఒకరికోసం ఒకరు అన్న భావన ఏర్పడింది .ఈ హాయైన అనుబంధం 16 ఏళ్ళపాటు దివ్యం గా కొనసాగింది .భార్య సోన్యా భర్త టాల్ స్టాయ్ రచనకు ప్రేరణగా నిలిచింది .ఆయన రాసిన అనంత సాహిత్యాన్ని  స్వదస్తూరీతో కాపీ చేసింది .ఆయన్ను  సామాన్య విధులనుండి రిలీఫ్ కలిగించి తానె బాధ్యతలు చేబట్టింది .టాల్ స్టాయ్ కి 13 మంది పిల్లలను ‘’కని’’పెట్టింది .ఏడాది కేడాది గర్భిణీగా ఉండటం తో బాహిర ప్రణయ సౌఖ్యాన్ని అందించ లేక పోయింది .ఆయన సెక్స్ దాహాన్ని తీర్చలేక పోయేది .

యుద్ధము-శాంతి .-అన్నా కేరేనీనా

.కాని ఆయన రచనా వ్యాసంగం నిర్విఘ్నం గా కోన సాగుతూనే ఉంది .ఎన్నో రాసిన తర్వాత మనసులో ‘’యుద్ధము –శాంతి ‘’నవలకు బీజం పడి మొలకెత్తి మహా వ్రుక్షమైపోయింది .ఈ నవలలో టాల్ స్టాయ్ పియర్రీగా ప్రిన్స్  ఆండ్రీ గా రెండు విభిన్నపాత్రాలు పోషించాడు .కాని అందరు మగ వాళ్ళూ మెచ్చిన,ప్రేమించిన  నతాషా  పాత్ర మాత్రం భార్య సోన్యాకు పోలిక లేకుండా ఆమె చెల్లెలు తాన్యా లాతీర్చి దిద్దాడు  .దీన్ని రాయటానికి ఏడేళ్ళు పట్టింది .ప్రచురణ పొందిన తర్వాత ఈ నవల బృహత్తర మహా రచనగా ఆధునిక ఇతిహాసం గా  గుర్తింపు పొందింది .రష్యా సాహిత్య చరిత్రలో డి.ఎస్ .మిర్క్సి రాస్తూ  ‘’చాలాముందు చూపున్నమహా రచన అని ,కాల్పనిక సాహిత్యపు అవధిని పెంచిందని ,యుద్ధం అవా౦చనీయమని ,సాధారణ మానవుని మహోన్నతంగా మలిచాడు ‘’అని కీర్తించాడు .మనుషుల సాధారణ స్వభావాలను చాలా చక్కగా చిత్రించాడు ఇందులో . ‘’war and piece is a panoramic  spectacle and social drama .The horror of battle ,the death throe struggle of great armies ,the accidents of war and the sense of fatality are depicted on the largest scale ever attempted by a novelist .but here also are superbly detailed domestic situations ,illuminations of a society which is both effete and barbarous  and the intricately tangled lives of human beings who are un forgettable .వ్యక్తిలోని సమాజం లోని నిజ జీవితాన్ని వైరుధ్యాలను ప్రతిబి౦బి౦ప జేశాడు . చరిత్ర వేదాంతపు లోతులను తరచాడన్నారు .చరిత్రలో జరిగే సంఘటనలునెపోలియన్ లాంటి  ఏ ఒక్క వ్యక్తీ కోరిక  ననుసరించి జరగవని ,అవి ముందే నిర్ణయించబడి ఉంటాయని అంటాడు .చరిత్ర అనేది రాజుకు బానిసకాదని అన్నాడు .చరిత్ర సంఘటన  వెనుక ఎప్పుడూ ఒకే  ఒక కారణం ఉండదు ,అనేక కారణాలు ఉండచ్చు .అవన్నీ ఏ ఒక్క వ్యక్తీ అధీనం లోనూ ఉండవు .

ఈ చారిత్రాత్మక  నవల రాస్తూనే అనేక కధలను,వ్యాసాలను  రాశాడు టాల్ స్టాయ్ . ఫస్ట్ గ్రేడ్ విద్యార్దులకోసం పుస్తకం రాశాడు .ఇందులో రష్యా జానపదకధలను చేర్చాడు .దీనిని  సంప్రదాయ వాదులు అడ్డుకొన్నారు .రష్యన్ మెసెంజర్ పత్రికలో అన్నా కేరేనీన నవల ధారావాహికం గా రాస్తున్నాడు .అయిదేళ్ళ తర్వాతా ఇదంతా నవలగా వెలువడింది .

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు

మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు

ఎంతో ప్రతిభ ఉన్నా ఎన్నో గ్రంధాలు రాసి పేరు తెచ్చుకొన్నా ,బిరుదు లెన్నో అందుకున్నా   బహుభాషా పాండిత్యం ఉన్నా కొందరిని కాలం మర్చిపోతుంది .వారి చరిత్ర ఏ ఇంటర్ నెట్ కో పరిమితమై పోతుంది .అలాంటి వారిలో తెలుగు వారు గర్వించదగిన త్రిభాషాకవి  న్యాయ వేత్త ,శ్రీ చింతకుంట సూర్యనారాయణ రావు గారు .న్యాయశాస్త్ర పాండిత్యం  వారికవిత్వానికి రచనలకు సొబగు కూర్చింది  .రావు గారిని  ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నమే ఇది .

అవధాన ఆశుకవితా ప్రభావం

1924 లో జన్మించిన సూర్యనారాయణ రావు గారికి  ఆశుకవి సార్వభౌములైన కొప్పరపు సోదర కవుల పరిచయ భాగ్యం 12వ ఏట కలిగింది .ఆంద్ర పత్రిక సంపాదకులు శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు గారి భవనం లో వారి సమక్షం లో సోదరకవుల ఆశుకవితావదానాన్ని కవితా విందుగా అనుభవించిన రావు గారు ఆశుకవిత్వం వైపుకు మొగ్గారు . సోదరులలో ఒకరు ఒక పాదం చెబితే రెండవ వారు రెండవ పాదాన్ని చెప్పి ఆశుకవితకే పట్టం కట్టారు .కాని వారు  శాశ్వతం గా నిలిచిపోయే గ్రంధాలను రాయకపోవటం  దురదృష్టం . కొప్పరపు కవులతో ఢీ అంటే ఢీ  అని సవాలు చేసి ఆశుకవిత్వావదానాలు చేసిన తిరుపతి కవులు మాత్రం శాశ్వత రచనలు చేసి సరస్వతీ సమార్చనం చేశారు . ఈకవుల విధానం నచ్చిన సూర్య నారాయణ రావు గారు ఇదే బాటలో నడిచి సద్గ్రంధ రచన చేసి కీర్తి సాధించారు .ఆనాటి యువ కవులకు తిరుపతికవులే స్పూర్తి ప్రేరణ .తెలుగు వారికి మాత్రమె స్వంతం  ఆశుకవిత్వం ,అవధాన ప్రక్రియ అని భావిస్తాం .రావుగారు ఏం ఏ. బి .ఎల్.

జాన్ మిల్టన్ ఆశుకవిత్వం

ఆంగ్లకవి జాన్  మిల్టన్ కనులు కోల్పోయి గుడ్డివాడై ‘’పారడైజ్ లాస్ట్ ‘’మహా కావ్యాన్ని ఆశువుగా చెబుతూంటే ఆయన కుమార్తె గ్రంధస్తం చేసిన విషయం మనకు తెలుసు .దీన్ని ఒక రకంగా ఆశుకవిత్వం గా భావించవచ్చు .ఆశు కవిత్వానికి గొప్ప ఊహ ,కవితా సామర్ధ్యం ,సందర్భాన్ని బట్టి కవిత అలవోకగా జాలువారి సహృదయ స్పందన కలిగించటం లక్షణాలు .ఆశుకవి తనకు వాగ్దేవీ  అనుగ్రహం లభించటం వలన కవిత్వం వస్తోందని నమ్ముతాడు .మిల్టన్ కూడా అనేక దేవీ దేవతలా అనుగ్రహమే తన కవిత్వానికి శ్రీరామ రక్షగా భావించాడు .

రావు గారి కవితా భ్యుదయం –బిరుద సత్కారం

సూర్య నారాయణ రావు గారు 1970లో కాన్పూరు లో ఉద్యోగం చేస్తూ ఒంటరిగా  ఉన్నప్పుడు సంస్కృత కవిత్వం పైన ద్రుష్టి పడింది .పిల్లల చదువుకోసం కుటుంబాన్ని కలకత్తాలో ఉంచేసి తానోక్కరే కాన్పూరు లో ఉన్నారు .కాన్పూరు రాదా కృష్ణ మందిరం పవిత్రత ,ప్రశాంతత ఆయనకు మహా నచ్చటం వలన రోజూ దైవ దర్శనం చేసుకొనేవారు .కృష్ణ భక్తీ ఆయన మనసులో నిండిపోయి ‘’కృష్ణ కదా సుధ’’రాయటం ప్రారంభించారు అప్పటికే మొదలు పెట్టి రాస్తున్న ‘’గీతాంజలి గానామృతం ‘’వెనక బడింది .కృష్ణ కద ముందే ముద్రణ పొందింది .రాదా కృష్ణ మందిరం లో దర్శనానుభూతి పొందుతుండగా ఆయన మనసులో భావాలు ప్రవాహాలై కవితా ఝరులై ప్రవహించి కావ్యాన్ని పూర్తీ చేయించాయి .దీని తర్వాత చాలా రచనలు చేశారు .కవిత్వాన్ని గుణ ప్రధానం గా ఎంచాలని అభిప్రాయపడేవారు. అశాశ్వత మైన ,పనికిమాలిన కవిత్వం శాశ్వత ఆనందాన్నవ్వదంటారు .మంచి కవిత్వం ఉత్తమ విలువలతో కూడి ఉండి వ్యక్తికీ సమాజానికి మేలు చేసేదిగా  ఉండాలి .ఇవే భావాలను ఆంగ్ల కవి ‘’హాబ్స్ ‘’కూడా చెప్పాడు .భక్తి  భావాలతో పులకించిన సూర్య నారాయణ రావు గారు అనేక రచనలు చేసి ఉత్తమకవిగా వినుతి కెక్కారు .అందుకనే ‘’ 1998లో  మద్రాస్ కు చెందిన’’అఖిల భారత విష్ణు సహస్ర నామ ఫెడరేషన్ ‘’శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు గారికి తిరుమలలో  శ్రీ వారి ఆస్థాన మండపం లో వెయ్యి మంది ప్రనిధులు పాల్గొన్న సదస్సు లో ‘’ భక్తి సాహిత్య  భాస్కర ‘’మరియు ‘’కవి హృదయ విశారద ‘’బిరుదులను  ప్రదానం చేసి గౌరవించారు .సరస్వతీ పుత్రులైన ఆ విజ్ఞాన మూర్తి శ్రీ చింతగుంట సూర్య నారాయణ రావు గారు  91 సంవత్సరాల వయసుతో ఆరోగ్యంగా మనముందున్నారు .స్పూర్తిని కలిగిస్తున్నారు .వారి సమకాలీనులుగా  ఉండటం వలన మనం ధన్యులం .అదృష్ట వంతులం .

త్రిభాషా రచన

రావు గారు ఆంగ్ల, ఆంద్ర, సంస్కృత భాషలలో అరుదైన రచనలు చేసి తన విద్వత్తును ప్రదర్శించారు .

ఆంగ్ల రచనలు

న్యాయ శాస్త్రం తో సంబంధం ఉన్నసీనియర్ లాయర్ ,ప్రభుత్వ విధానాలలో అనుభవం ఉన్న  సూర్యనారాయణ రావు గారు రాజ్యాంగం పై గొప్ప రచనలే చేశారు .1999లో రాసిన ‘’Constitution of conventions ‘’ గ్రంధానికి సుప్రీం  కోర్ట్ జస్టిస్ ఒ.చిన్నపరెడ్డి ముందుమాట రాశారు .భారత రాష్ట్ర పతి విధి విధానాలను ఇందులో రావు  గారు విపులంగా చర్చించారు .ఇది ప్రతి పౌరుడికి కరదీపిక .రెండవ పుస్తకం ‘’Role of directors in company laws ‘’1970లో ప్రచురించారు .సుప్రీం కోర్ట్ జస్టిస్ శ్రీ కోకా సుబ్బారావు గారు దీనికి ముందుమాట రాశారు .ఆంగ్లం లోనే ‘’త్యాగరాజ గీత ‘’రాసి అందులో త్యాగయ్య గారి 27 అమర కీర్తనలపై విపులమైన వ్యాఖ్యానం వచనం లో రాశారు .రామాయణ భాగవత ,కాళిదాస గ్రంధాలనుండి విషయ సేకరణ చేసి ‘’Tales from  ancient India ‘’రచించారు .అధర్వ వేదం లోని ‘’ఆదిత్య మండలం ‘’ను సాదికారికం గా ఆంగ్లం లోవచనం గా  తర్జుమా చేసి తన విద్వత్తును ,ప్రతిభను నిరూపించుకొన్నారు .ఆంగ్ల మహాకవి షేక్స్ పియర్ రాసిన ‘’సానేట్స్’’పై  ‘’Shakespeare;s sonnets- their purport and significance in the Indian perspective ‘’గా రాశారు  .అన్నమాచార్యులు సంస్కృతం లో రాసిన అతి తక్కువ సంస్కృత ‘’పదాలను ‘’ఆంగ్లం లోకి ‘’Annamacharya;  Sanskrit  Lyrics on Lord Venkateshwara ను 1996లో వెలువరించారు .

తెలుగు రచనలు

మహాకవికాళిదాసు రచన ‘’మేఘ దూతం  ‘’ను మేఘ సందేశం గా తెలుగులో1946లోనే  కవిత్వీకరించారు .సంస్కృత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ‘’రసాలవాలం ‘’పేరిట తెలుగు అనువాదం చేశారు .ఇందులో వివిధ దేవీ దేవతలపై స్వీయ కవితలూ ఉన్నాయి .1994లో ‘’గోపికాగీతం ‘’రచించి ప్రచురించారు .వ్యాస విరచితమైన భాగవతం లోని 19 శ్లోకాలకు మధుర మంజుల అనువాదమే ఇది .కృష్ణ ప్రేమ పై విపుల వ్యాఖ్యానం రాసి వన్నె తెచ్చారు .1990లో శంకారాచార్య స్వామివారి ‘’శివానందలహరి ‘’కి భక్తి  ప్రపత్తులతో అలౌకిక అనువాదం చేసి కావ్య వస్తు విషయాలపై గొప్ప ఉపోద్ఘాతమూ రాశారు .జగద్గురువుల’’ సౌందర్య లహరి’’కీ  సుస్పష్ట అర్ధ అనువాదం చేశారు .ఇది ఇంకా ప్రచురణకాలేదు . సఖ్య-ఆసక్తి అనేది షేక్స్పియర్ రాసిన 154 సానెట్ లకు తెలుగు అనువాదం1977లో రాశారు . .ఒకే ఛందస్సులో రాసిన రచన ఇది సానేట్లన్నిటిలో ఏక సూత్రత గమనించిన రావు గారు వీటిని భారతీయ ఆధ్యాత్మిక ద్రుష్టి తో అనువదించి వైశిస్ట్యాన్ని చూపారు .ఇలా ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఇదొకఅద్భుత సృష్టి .రావు గారి నూతన దృష్టికోణం .భారతీయ వేదాంత పరమార్దానికి ఇదొక మచ్చు తునక .

సంస్కృత రచనలు

మొదటి సంస్కృత కావ్యం గా ‘’గీతాంజలి గానామృతం ‘’రాశారు రావు గారు దీనిపై శ్రీ బెజవాడ గోపాల రెడ్డి స్పందిస్తూ ‘’రవికవి గీతా౦జలి ప్రపంచ భాషలలోకి అనువదింపబడింది .దీనికే గురు దేవులకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది .ప్రాచ్యభాషా సౌధం లోకి పాశ్చాత్యులకు ప్రవేశం గీతాంజలి వలన కలిగింది .శ్రీ సూర్యనారాయణ గారి సంస్కృత గీతాంజలి అనువాదం సుందరం గా సాగింది ప్రసిద్ధలైన నాలుగైదు  వృత్తాలలో రవీంద్రుని హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు .ఆంగ్లం లో లేని లయా ,శయ్యా సౌ భాగ్యం  .సంస్కృతం లో రావు గారు కలిగించారు .బెంగాలీ గీతాంజలి పాటల్లాగా ఉండి దాని ప్రత్యేకత నిల్పింది .రావు గారు రవీంద్రుని ఆంగ్లానువాదాన్నే అనుసరించారు .బెంగాలీ గీతాంజలి చూసి ఉన్నట్లు లేదు .సంస్కృత విద్యార్ధులకు రావు గారివలన గీతాంజలి పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉన్నది .రావు గారు దీన్ని రవీ౦ద్రునికే అంకిత మివ్వటం గంగా జలం తో గంగా నదికే  అర్ఘ్యమివ్వటం లాగా ఉందని చమత్కరించారు .భారత సాహిత్యం లో ఏ  గ్రంధానికి లభించని నోబెల్ బహుమతి గీతాంజలికే వచ్చింది ‘’అని గురుదేవ్ టాగూర్ ప్రతిభను ప్రస్తుతించారు .

గోపాల రెడ్డిగారు శాంతినికేతన్ కు అధిపతిగా ఉండేవారు .ఒక సారి నెల్లూరు లో ఒక సభ జరిపి శ్రీ సూర్య నారాయణ రావు గారిని ఆహ్వానించి రవీంద్రుని స్మారక ఉపన్యాసం చేయించి  సన్మానించారు .దీనితర్వాతే రావు గారి సంస్కృతగీతాంజలి అనువాదం 1996 సెప్టెంబర్ లో హైదరాబాద్ లో ప్రచురింపబడి విడుదలయింది

రావు గారి అముద్రిత గ్రందాల లిస్టు కూడా పెద్దదే .’సూర్య సన్నుతి’’ అందులో ఒకటి .మయూరుని సూర్యశతకం లాంటిది .’’శ్రీ కృష్ణ కదా సుధ’’ ఇంకారావాలి .శ్రీకృష్ణుని జీవిత చరిత్ర అంతా కావ్య రూపంగా రాసిన గ్రంధం .అమ్మవారి దివ్య విభూతి పై రాసిన ‘’మాతృ సహస్రనామ స్తోత్రం  ‘’ముద్రి౦పబడాలి  . ‘’జ్యోతిర్లేఖ ‘’కూడా వెలుగు చూడాలి .

రావు గారి రచనలను స్వంత సంస్థ అరుణ్ పబ్లిషర్స్ ద్వారా  ప్రచురించారు .దీని అధ్యక్షులు రావుగారే .అడ్రస్ –అరుణ్ పబ్లిషర్స్ బంజారా కాటేజ్ బి 747-ఎల్లారెడ్డి గూడా –హైదరాబాద్ -500073.-ఫోన్ నంబర్ -040-23732315.రావు గారి పుస్తక ప్రచురణకు , ముద్రితమైనవాటి పునర్ముద్రణకు ఎవరైనా స్పాన్సర్లు ముందుకు వస్తే ఆహ్వానిస్తున్నామని పబ్లిషర్లు తెలియ జేశారు .ఆసక్తి ఉన్నవారు సంప్రది౦చ వచ్చు .

రావుగారి మెయిల్ అడ్రస్ chsrao63@rediff.mail .com

ఈ వ్యాసానికి ఆధారం –డా.రాచకొండ నరసింహ శర్మ ఏం డి .గారు పంపిన ఆంగ్ల వ్యాసం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-4-15 ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆచార్య శ్రీ ఇప్పగుంట సాయిబాబా ”గీర్వాణం ” పై ప్రసరింప జేసినవెలుగులు

సాహితీ బంధువులకు శుభ కామనలు -”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”గ్రంధాన్ని అందుకొని ఆచార్య ఇప్పగుంట సాయిబాబా (హైదరాబాద్ )గారు పూర్తిగా చదివి అందులో దొర్లిన అచ్చుతప్పులను ,కవుల, కావ్యాల ,కాలాల విషయం లో నేను పడిన భ్రమప్రమాదాలను  నేను ఇంకా” రిఫర్” చేయాల్సిన గ్రంధాలను ,వాటి చిరునామాలను సవివరంగా తెలియ జేస్తూ ,ముద్రణా, అక్షరాలూ ,బాగా ఉన్నాయని ”ముఖ చిత్రం అద్భుతం”గా ఉందని ,పేజీలలోని బాక్సులు కట్టిన తీరు  బాగాలేదని క్షుణ్ణంగా అధ్యయనం చేసినిర్మొహమాటం గా  పేజీ వరుసలో వివరంగా చూపి 8 పేజీల సుదీర్ఘ ఉత్తరం రాసి” వెలుగులు వెదజల్లిన సమీక్ష”  ఈ రోజే అందింది . అందులోని విషయాలను మీ అందరికి తెలియ జేసుకొనటానికి వీలుగా దీనితో” అటాచ్” చేస్తున్నాను .చూడండి .ఒక మహా సంస్కృత విద్వాంసుని చేతిలో గీర్వాణ గ్రంధం పడి అందులోని మెరుగులను తరుగులను అందరి దృష్టిలోకి తెచ్చినందుకు శ్రీ సాయిబాబా గారికి కృతజ్ఞతలు తెలియ జేసు కొంటున్నాను  .వారి సహృదయతకు క్రుతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను  
ippagunta1 001
ippagunta2 001 ippagunta3 001 ippagunta4 001 ippagunta5 001 ippagunta6 001 ippagunta8 001

   వారు అన్నట్లు అతి త్వరలో అంటే రెండు నెలలలో గ్రంధం ముద్రణ జరగటం ,చివరి స్టేజిలో మరొక్క సారి తప్పులు దిద్దే అవకాశం కలగక పోవటం  వలన ముద్రా రాక్షసాలు దొర్లాయి దీనికి పూర్తీ బాధ్యతనాదే.  గ్రన్ధమ్  లోని విషయం లో నేను పడిన పొరబాట్లు నా దృష్టికి తేవటం సాయిబాబాగారు చేసిన మహోపకారం  అవి తప్పని సరిగా దిద్దుబాటు చేసుకోవాల్సినవి .ఇదీ నాదే బాధ్యత.ippagunta8 001
 మొదటివ్యాసం శ్రీ శంకరాచార్యుల వారిది అక్కడేవెంటనే  రిపీట్ అయింది అదీ  నా దోషమే .వీటి నన్నిటి కీ బాధ్యత వహిస్తున్నాను శ్రీ సాయిబాబా గారి ఆత్మీయతకు మరొక్క సారి పొంగిపోతూ నా కృతజ్ఞతను తెలియ జేసుకొంటు న్నాను .వారు సూచించి రిఫరెన్స్ గ్రంధాలను వీలయితే సేకరించి మరొక సారి కవుల  రచనలపై ,కాలం పై ద్రుష్టి పెడతాను .ఇంకా రాయాల్సిన కవుల గురించి రాసే ప్రయత్నమూ చేస్తాను.వారి సమీక్ష నాకు గొప్ప ప్రోత్సహాన్నిచ్చిందని మనస్పూర్తిగా తెలియ జేసు కొంటున్నాను  -దుర్గాప్రసాద్ -8-4-15-రాత్రి 10-30
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -29

. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -29

 

14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్

పరస్పర విరోధభావాల లియో

 

‘’తన సుఖం మాత్రమే కోరే మనిషి చెడ్డవాడు ,ఇతరుల అభిప్రాయమే తనది అని చెప్పేవాడు బలహీనుడు,ఇతరుల సుఖాన్ని కోరే వాడు ఉత్తముడు ,అన్నిటా భగవంతుడే అని భావించేవాడు మహా గొప్ప వాడు ‘’.అని ఇరవై అయిదవ ఏటనే ఈ మహా వాక్యాలు రాసిన మహా రచయిత లియో టాల్ స్టాయ్.ఆయన నీతి మార్గామేమిటో దీనిలో కన్పిస్తుంది .యుద్ధము –శాంతి ,అన్నా కేరీనీనా అనే రెండు నవలలతో ప్రపంచ ప్రసిద్ధి చెందాడు .ఆయన చెప్పినవన్నీ ఆయనకే వర్తించటం బహు తమాషా .జూదం ,విలాసం ,అధికారం చెలా యించటం లో ఆయన చాలా చెడ్డవాడు .కీర్తికోసం తాపత్రయం ,తప్పు చేస్తున్నానని తెలిసినా అదే దారిలో నడవటం ఆయన బలహీనత .తోటి వారి పట్ల ప్రేమ ,దయ, సానుభూతి కలిగి ఉండటం ఉత్తమ లక్షణం. దైవం పై ఆరాధన, ఆయన రచనలన్నిటా చూపటం టాల్ల్ స్టాయ్ ని మహోన్నతుని చేసింది .తాను  ఎవరైనా కానీ ఆయనే అన్నిటా ఉండటం ప్రత్యేకత .వీటికి తానె వ్యతి రికి అవటం పారడాక్స్ .విరుద్ధ భావాలు ఆయన నరనరానా వ్యాపించి ఉన్నాయి .సుఖం పై మోజు ,తిండిపై వ్యామోహం ఆత్మ తిరస్కారం అన్నిటా ఆయనే ముందు .లాజిక్ తో మేజిక్ చేసే దమ్మున్నవాడు .తనదే రైట్ అని ఇతరులను నమ్మించే పట్టుదల ఉన్నవాడు .ఆడవాళ్ళను చడపురుగులులాగా తిరస్కరించటం ఉన్నా రచనలో కాంతి ప్రసరించి మిరుమిట్లు గొల్పే చాకచాక్యమున్నవాడు .దూకుడు స్వభావం ఉన్నా ప్రపంచ కధకుల్లో అగ్రస్థానాన నిలచిన ఉత్తమ కధకుడు టాల్ స్టాయ్.సృజనాత్మక రచనలతో నైతికత స్థాయి పెంచిన దార్శనికుడు .1899 లో టాల్ స్టాయ్ తీవ్రంగా జబ్బు పడ్డప్పుడు మరో రష్యన్ కదకుడు చెకోవ్ ‘’ఆయన బతికి ఉన్నప్పుడు సాహిత్యం లో చెడు జుగుప్స ,కన్నీరు ,అనాగరక భావాలనన్నిటినీ దూరంగా పెట్టాడు .టాల్ స్టాయ్ రాకతో రచయితలు  కావలసినవారికి మహదానందం ,తేలిక అయింది అన్నీ కస్టపడి టాల్ స్టాయ్ చేసి ఉంచాడు కనుక మా లాంటి రచయితల పని సులువైంది ‘’అన్నాడు   .

తండ్రి దివాలా-తల్లితో మళ్ళీ మహా రాజ భోగం

కౌంట్ లియో నికోలావిచ్ టాల్ స్టాయ్ 28-8-1828 మాస్కో కు ముప్ఫై మైళ్ళ దూరం లో ఉన్న బహు సంపన్నమైన యాస్నాయ పోలియాన ఎస్టేట్ లో జన్మించాడు .అప్పటికి వీరి కుటుంబం లో ఇరవై తరాలు గడిచి పోయాయి .వీరిలో 17 వ శతాబ్దికి చెందిన ఆండ్రియో విచ్ టాల్ స్టాయ్ రష్యా రాజు’’ పీటర్ ది గ్రేట్ ‘’కు గొప్ప అభిమాని .టాల్ స్టాయ్ తండ్రి అదే రాచమర్యాదాలతో పెరిగాడు .నెపోలియన్ ను ఓడించిన  యుద్ధ దళం లో సభ్యుడుకూడా .ఖైదీగా పట్టుబడి పారిస్ జైలు లో ఉండి ,విడుదలై వచ్చాక తండ్రి చనిపోయాడు  .ఎస్టేట్ అప్పుల ఊబిలో కూరుకు పోయింది .అ అప్పులతో తనకేమీ సంబంధం లేదన్నాడు టాల్ స్టాయ్ తండ్రి  .తల్లి పోషణ భారాన్ని మాత్రం స్వీకరించి ఆనాటి రష్యా సంపన్న కుటుంబీకుల మాదిరి బాగా డబ్బు ,సంపదా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .భార్య ధనికురాలేకాదు రాయల్ ఫామిలీకి చెందింది .ఆమె పేరు ప్రిన్సెస్ మార్యా నికోలా యేవ్నా  వోల్ కోన్స్కి.అందగత్తె కాదు . భర్త కంటే అయిదేళ్ళు పెద్దదికూడా .పెళ్ళి నాటికి ఆమె వయస్సు ‘’ముప్పీ రెండు ‘’.ఐదు భాషలలో నిష్ణాతురాలు .యాస్నాయా  పోల్యానా లో ఉన్న ఎనిమిది వందల శేర్ఫ్ లను, కౌలు దార్లను చాలా తేలికగా మేనేజ్ చేసే సామర్ధ్యం ఉన్నది .భర్త  కు అయిదుగురు  సంతానాన్ని ‘’కన్నది ‘’. అందులో లియో నాలుగోవాడు .చివర గా  కూతురుపుట్టింది .  .

బాల్యం –పరాయి పెంపకం

టాల్ స్టాయ్   రెండేళ్లప్పుడు తల్లిని ,తొమ్మిదో ఏట తండ్రినీకోల్పోయాడు . బంధువుల మహిళలే పెంచారు ఇంటి దగ్గర ట్యూషన్ ఏర్పరచి చదివించారు .బాగా చదివి టీచర్ల మెప్పు పొందాడు .మనిషి అందం గా ఉండడు.అది మనసులో కెలుకుతూ ఉండేది .వయసు పెరిగినకొద్దీ పెడసరం గా ,గర్విష్టిగా మారాడు.వీటితో పాటు ఆత్మ పరిశీలనా దృష్టీ పెరిగింది .అందంగా ఉండే తండ్రిపోలిక రాకుండా అందవిహేనురాలైన తల్లి పోలిక వచ్చినందుకు మనసులో ఎప్పుడూ బాధ పడేవాడు .దీనితో సిగ్గు వచ్చి మనుషులకు దూరంగా ఉండేవాడు . అంతరాత్మ ప్రబోదానికి  లోనై హుందా తనం లేకుండా ఉండేవాడు .వీటివలన స్నేహితులను సంపాదించుకోలేక పోయాడు .తనకున్న కొన్ని ప్రత్యేకతల వలన అతి కొద్దిమందిమాత్రమే టాల్ స్టాయ్ కి సన్నిహితులు కాగలిగారు  .

విద్య

లియోకు గార్డియన్ గా వ్యవహరించిన అలేక్సాండ్రియా- లియో 13వ ఏట చనిపోయింది .దీనితో ఆంట్ పెలగేయా వీరి కుటుంబాన్ని తన స్వగ్రామం కజాన్ కు మార్చింది .లియో కజాన్ యూనివర్సిటి లో చేరి ,టౌన్ లో బాగా పేరు ప్రఖ్యాతులు పొందాడు 17 ఏళ్ళకే .దసరా బుల్లాడి లాగా  డ్రెస్ ల గొడవే కాని అందాల రాముడిలాగా అడ పిల్లలను ఆకర్షించలేక పోయాడు .పెళ్లి అయినవారితోకాని , కాని వర్జిన్స్ తో కాని ‘’లవ్వాయణం’’లాగించలేదు .డబ్బు, అధికారం ,రాజరికం ఉన్నవాడు కనుక ‘’పడుపు కత్తేల ‘’తో పడక సుఖం అనుభవించేవాడు .19 ఏళ్ళప్పుడే సుఖాన్ని కొనుక్కోన్నానని డైరీలో రాసుకొన్నాడు .దీనిఫలితమైన ‘’గనేరియా ‘’తగులు కొని  బాధ పడ్డాననీ నిజాయితీగా డైరీలో నోట్ చేశాడు .రెండో సంవత్సరం చదువు పూర్తికాకుండానే యూని వర్సిటీ వదిలేశాడు .చాలా తక్కువ మార్కులు రావటం, అక్కడ తను నేర్చుకొన్నది అతి తక్కువ అని భావించటమే నిష్క్రమణకు కారణం .తాను  ఉండాల్సినది తన ఎస్టేట్ అయిన యాస్నయా పోల్యానా లో మాత్రమె అనే భావం బలమైనది .అక్కడికి వెళ్లి తన సమర్ధత చూపించి గొప్ప లాండ్ లార్డ్ గా రుజువు చేసుకోవాలనుకొన్నాడు .వేదాంత పరమైన ఆలోచనలూ దీనికి దోహదం చేశాయి .తనకు నచ్చిన రీతిలో ప్రయోజనాత్మకమైన అర్ధ వంతమైన జీవితం గడపాలనుకొన్నాడు టాల్ స్టాయ్ .

టాల్ స్టాయ్ ఎస్టేట్

తన ఎస్టేట్లో సెర్ఫ్ ల విస్తరణ ప్రారంభించాడు .దీనికోసం డబ్బు చాలాఖర్చు పెట్టాడు .అప్పుల్లో చిక్కుకొన్నాడు .ఇదికాదు అనుకోని మరో కొత్త విధానం ప్రవేశ పెట్టటం చేతులు కాల్చుకోటం  మళ్ళీ మరోదానికి పాకులాట ఇలా గడిచింది ఎస్టేట్ లో .తనమనోభావాలన్నిటినీ డైరీలో భద్రం చేశాడు .లోపల్లోపల యెంత కుమిలిపోయే వాడో అవి చదివితెతెలుస్తుంది .

యుద్ధ అనుభవం –సెక్స్ అనుభవం

23 వయసులో ‘’జెంటిల్మన్ వాలంటీర్ ‘’అయ్యాడు సోదరుడు నికోలాయ్ అప్పటికే యుద్ధ సైనికుడు గా ఉన్నాడు .కకాసాస్ కు కేడేట్ గా వెళ్ళాడు .యుద్ధ కాంప్ లో ఉన్నా పాత అలవాట్లు మార్చుకోలేదు .సరైన విధానాలలో నడవ లేదు .జూదం ఆడి పోగొట్టుకొనిఅప్పుల అప్పారావు అవతారం ఎత్తి  ఎస్టేట్ లో కొంత భాగం అమ్మాడు .కకాసియన్ అమ్మాయిలతో సెక్స్ జరిపి సుఖ వ్యాధి బాధించి తగ్గటానికి మందు పుచ్చుకొన్నాడు  .తనకున్న మూడు దుర్గుణాలను వదిలించుకోటానికి తీవ్ర యత్నం చేస్తున్నట్లు గురూగారు డైరీలో రాసుకొన్నారు .ఆ మూడు మోహాలే జూదం  ,ఇంద్రియ లోలత్వం ఆడంబరం (gambling sensuality and  vanity )యుద్ధ భూమిలో ప్రత్యక్షం గా యుద్ధ భీభత్సాన్ని చూశాడు .శత్రువులపై తుపాకి గురిపెడుతుండగా ఒక బులెట్ వచ్చి తుపాకికి తగిలి దాదాపు ప్రాణం పోయేంత ప్రమాదం జరిగి బయటపడ్డాడు .ఇంకోసారీ ప్రమాదం అంచుమీద నుండి తప్పించుకొన్నాడు ప్రానాపాయాన్ని .అందుకే ధైర్య సాహసాలు చూపినందుకు సెయింట్ జార్జ్ క్రాస్ ను బహూకరించాలని ప్రభుత్వం న్ర్నయించింది మర్నాడు ఉదయమే బహుమతి ప్రదాన ఉత్సవం .కాని   బాగా నిద్ర పోయి ఫంక్షన్ కు వెళ్ళలేక పోయాడు .అ అవార్డ్ ను ఇవ్వకుండా గార్డ్ హౌస్ కు పంపారు .సైనికుల౦దరితో చాలాకలుపుగోలుగా ఉండేవాడు .పొట్టి బుడం కాయలా ఉన్నా  బలిస్టం గాఉండేవాడు  . నేల మీద పడుకొని రెండు చేతులూ సాచి వాటిమీద ఇద్దరు సైనికులను నిల బెట్టుకొని పైకి లేపెవాడట అంతటి సామర్ధ్యం ఉండేది .గురూగారి ముక్కు చాలా వెడల్పు .పెదిమలు మొద్దుగా పెద్దగా ఉండేవి .కళ్ళు చిన్నవి.కాని ఆకళ్ళు మహా పవర్ ఫుల్ .ఎన్నోభావాలకు ఆలవాల౦గా  ఉండేవి .నవ్వే పెదిమలతో అందరికీ ఆకర్షణీయం గా ఉండేవాడు టాల్ స్టాయ్ .

రచయిత టాల్ స్టాయ్

అప్పటికి ఇంకా రచన వ్యాసంగం పై ద్రుష్టి పెట్టలేదాయన .ఈవిషయాలు డైరీలో రాశాడు .తన ఆంట్ కు ఉత్తరం రాస్తూ ఆమె తనను నవల రాయమని కోరిన సంగతి గుర్తు చేశాడు .1852 జూలై లో ‘’కాంటెంపొరరి ‘’అనే ప్రముఖ సాహిత్య పత్రికా సంపాదకుడికి ‘’చైల్డ్ హుడ్ ‘’అని తాను  రాసిన జీవిత చరిత్ర భాగాన్ని పంపాడు .వెంటనే అది ప్రచురణ పొంది అభిమానుల్ని సంపాదించింది .ఇరవై నాలుగేళ్ల ఈ కుర్ర రచయితను చూసి అతనిలో ‘’un known and remarkable talent ‘’ఉందని మెచ్చుకొన్నారు .కొద్దిగా కల్పన ఉన్నా అది టాల్ స్టాయ్ జీవితమే .అ తర్వాత ఏది రాసినా స్వీయ జీవిత చరిత్రయే అయింది .ఇప్పటికే గొప్ప శైలి అలవడింది. అది అంతటా హాయిగా ప్రవహించింది .సంఘటనలన్నీ యదార్ధమైనవే కావటం తో రియలిస్టిక్ రచయితగా మంచి గుర్తింపు వచ్చింది .

 

L.N.Tolstoy Prokudin-Gorsky.jpg

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-15 –ఉయ్యూరు

 

 

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’గోపీ నాద’’ పృధ్వీ సూక్తం -‘’పద్య ప్రసూనాలు ‘

‘’గోపీ నాద’’ పృధ్వీ సూక్తం

‘’ గోపీనాద్ ప్రత్యేకత

శ్రీ ఎరుకలపూడి గోపీ నాద రావు గారితో నాకు మూడేళ్ళ పరిచయమే ఉంది .ఒకటి రెండు సార్లు సరసభారతి ఉగాది కవి సమ్మేళనానికి వచ్చారు .మరో రెండుసార్లు రాలేకపోయారు .కాని విజయవాడ సభలలో తరచుగా కలుస్తాం .ముభావం గానే ఉంటారు .’ ‘’పని ఉండి రాలేక పోయాను సార్ ‘’అని ముందే ఆయన నా దగ్గరకొచ్చి సంజాయిషీలా చెప్పే సంస్కారం ఆయనది . సభల్లో నేను కొంచెం హడావిడి చేస్తాను .కాని ఆయన నిండుకుండ .తొణక్క బెణక్క  బుద్ధిగా కూర్చుంటారు .ఇంతకు మించి పరిచయం లేదు .కాని సుమారు పదిరోజుల క్రితం తన రచన ‘’పద్య ప్రసూనాలు ‘’పంపి అందులో’’అభిప్రాయార్ధం ‘’అని అన్నారు .కనుక జాగ్రత్తగా చదివా .నేను పద్యాలు రాయను .ఛందస్సు రానివాడిని .నన్ను అభిప్రాయం కోరడం లో ‘’మతలబు’’ నాకు అర్ధం కాలేదు .రాయటానికి రెండు మూడు కారణాలు కనిపించాయి .మొట్టమొదటిది ఆయన మహారాష్ట్ర లోని పూనా లో ‘’కిర్కి ‘’లో పుట్టటం .అక్కడే మా తమ్ముడు మోహన్ ఆర్డినెన్స్ ఫాక్టరీ లో పని చేస్తూ కిర్కీ లోని ‘’సిపోరేక్స్ క్వార్టర్స్’’ లో ఉండటం .మేము 45ఏళ్ళ క్రితం ఒక వారం అక్కడే గడపి రావటం .రెండవది ఆయన మహా రాష్ట్రలో పుట్టి ,ఇంటర్ దాకా ఆంగ్ల మాధ్యమం లో చదివి ఆంద్ర ప్రాంతానికొచ్చి తెలుగు నేర్చి పద్యాలు అల్లటం .మూడవది ఆ పద్యాలు రసస్పోరకం గా ఆపాత మధురంగా ఉండటంఅనేక ప్రముఖ సాహిత్య  సంస్థల పురస్కారాలు లభించటం   .ఆయనకు పృథ్వి ఆరాధ్యమవటం ,దానిపైనున్న జీవరాసి పై ప్రేమస్పదనలు౦డటం ,జీవావరణ ,పర్యావరణాల పరి రక్షణ పై ద్రుష్టి ఉండటం ,దేవతల ఆశీస్సులు మానవ జాతికి అవసరమని భావించటం ,ఇలలో జన్మించిన మహాను భావులను సంస్మరించటం  జీవన దాతలైన నదీ సాగరాల స్తుతి చేయటం అన్నీ చూస్తె  ఈ’’ పద్య ప్రసూనమాల ‘’పృధ్వీ మాతకు అల౦కార మవటం నా దృష్టిలో ‘’ఆధునిక పృధ్వీ సూక్తం ‘’గా ఉండటం వలన నా భావాలను తెలియ జేయటానికి ‘’గోపీ నాద పృధ్వీ సూక్తం ‘’అన్నాను .

సీసాల గోపీనాధ కవి

గోపీనాధ రావు గారికి’’ సీసా’’లంటే మత్తు ఎక్కువ .’’సీ- సా ‘’బల్లపై ఊగినంత హాయిగా  ఆటగా ఆయనకు సీసపద్యాలు పలుకుతాయి .పలకటం కాదు పదాలు వచ్చి కూర్చుని పొదగమని ప్రాధేయ పడతాయి .తర్వాత సార్ధకమై విలువను పొందుతాయి .ఏది రాసినా ఆయన రచనలో ఎక్కడా తడుముకోవటం ,తడబాటు ఉండదు .సరైన పదం అక్కడ చేరి తిష్ట వేస్తుంది .అది వాణి శ్రీ ప్రసాదమే .వాణీ నాధుడైన విరించి లా పద్య సృష్టి జరుగుతుంది .ధన్యులు ఆయన ..ఇందులో ఎన్నో సంస్థల అవార్డులు పొందిన కవిత లున్నాయి .అవి వారి పద్య పాటవానికి  బహుమతులే .భావ సౌందర్యానికి అలంకారాలే .ఊహా సౌభాగ్యానికి ఊతాలే .కదిల్తే సీసం మెదిల్తే సీసం .అవి చెవిలో పోసిన సీసం లాకాకుండా మధురాతి మధురం గా ఉండటం ,శ్రీనాధుని పోకడ మనకు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి .

ఛందో వైవిధ్యం

విద్దెల దేవికి విన్నపాలు ,జన్మభూమికి కృతజ్ఞత ,లక్ష్య సిద్ధి ,భాష వేదన ,దుఖితుల జీవన దృశ్యం ,కలికల్మషాలు ,మేఘ సంస్తుతి ,వర్షం, హర్షం మొదలైన 69 శీర్షికలతో అల్లబడిన పద్య ప్రసూన మాల ఇది .దేనికదే సాటి .ప్రతి దానిలో గోపీనాధీయం దర్శన మిస్తుంది .దీర్ఘ చంపక ,ఉత్పల మాలలూ కూర్చి వాగ్దేవిని అలంకరించారు .సరదాగా ‘’ఆట వెలదుల’’తో ఆడుకొన్నారు . తేట గీతులతో సేద దీర్చా(రా)రు .

శారదా స్తుతి –ఎరుక గల కవి

‘’నిత్య సత్కావ్య నిర్మాణ నిష్ట నిమ్ము ‘’అంటూ పంచ భూతాత్మకమై శ్రేయమిమ్ము ,శుద్ధ చేతమ్ము నందించి వృద్ధి నిమ్ము ‘’అని’’ సకల కళా నీరద’’ శారదను ప్రార్ధించారు ముందుగా .స్వా౦తాన్ని వెలిగించే సంక్రాంతి (some క్రాంతి కాదు సంపూర్ణ క్రాంతి )ఇమ్మన్నారు .ఆత్మకు పరమాత్మ అండ కలిగించమని వేడారు .తనను గుర్తించి దరి చేర్చి వన్నె లద్ది  భావ చిత్రాలకు భవ్యాక్షరా కృతులిచ్చి ,తెలుగు భాషను పూజించే దీక్ష నిమ్మని వేరొక చోట ప్రార్ధించి తన ఆరాటాన్ని అమ్మకు ఎరింగించారు . ‘’ఎరుక’’ గల కవి .కనుక ఎరుకల కూడి(పూడి)అని సార్ధక మైంది ఇంటిపేరు .

ప్రకృతి పాఠాలు

ప్రకృతిని చూసిఆత్మ శుద్ధి , పరహితం సమతామార్గం రుచిర  సౌందర్యం వంటివి ఎన్నో నేర్చుకొన్నానని కృతజ్ఞత చెప్పారు .ప్రపంచీకరణం యాంత్రిక ఉన్మత్తం కలగ జేసిందని ,స్వేచ్చ మితిమీరి ద్వేషాలు పెచ్చరిల్లాయని ఆవేదన చెందారు .మతాల  మధ్య మారణ హోమానికి కలత చెందారు .’’దైవీ దత్త మనోజ్ఞ ధాత్రి నొక దైత్య స్థావర స్థాయికి ‘’తీసుకురావటం బాధాకరం అన్నారు .సిరులన్నీ వస్తు చయ దాహాన్నిపెంచే శ్రీలే –‘’అంటూ పుణ్యం ఒక్కటే ‘’చిర సుఖ శాంతి నిచ్చేది యశేష విశేష ములున్న కల్మి’’అని బుద్ధి చెప్పారు .అంత్యకాలం లో అండగా నిలిచేది పుణ్యం ఒక్కటే అని నిర్ద్వందం గా చెప్పారు .అన్నీ చేజేతులా నాశనం చేసుకొంటున్న మానవుడికి ‘’సుకమొక స్వప్న లోకమున సోకే  హృష్టి గ  మారిపోయే ‘’అన్నారు .తృష్ణ మృగ తృష్ణ వంటిదని దాని వెంబడి పరిగెత్తితే ఆయాసప్రయాసమే తప్ప సుఖ శాంతులు ఉండవు .’’ధ్వజమై మానవ జాతి రక్షణ’’నిర్వర్తించే వారు లేరని ,ఇదంతామారిపోయి ‘ప్రేమ సంహిత మయి ,జీవ కోటి సుఖ హేతువు కావలె ‘’అని ఆశించారు .

సామాజిక స్పృహ

కవి ,కళాకారుడు ,శిల్పిఒకరేమిటి సకల వృత్తుల వారు సుఖమయ ఆనందమయ సంతృప్తికర జీవితం గడప లేక పోతున్నారని బాధ పడ్డారు .సామాజిక స్పృహ కు ఇవి అద్దం పట్టే రచనలే  .’’జడముకుజీవ మండించు శాస్త్ర వేత్త –జీవనోపాధి లేక నిర్జీవమై ‘’పోతున్నందుకు హృదయ భారం తో నొచ్చుకొన్నారు ‘’తాడఘము ‘’లిడే  వ్రుత్తికిన్ తాడనములు ‘’అని శాబ్దిక చమత్కారం చేశారు .ఈ నాటి చదువుల హైటెక్కు లగురించి ‘’ప్రతి ఇంట బీటేక్కు ,ప్రతి ఇంట ఎంటెక్కు ‘’అని మొదలు పెట్టి జనని భాష నేర్చే చదువు కనిపించటం లేదని ,ఆధునికత అందించే అభ్యుదయం లో మూల్యాలను త్రెంచే మూఢత అయిందని ,రోజు గడిస్తే చాలన్న భావం మానవ ప్రగతి కాదన్నారు .’’సాగర ఘోష ‘’కవిగా గరికపాటి వారు ప్రసిద్ధులు  .వీరూ అదే శీర్షికతో సాగారాగ్రహానికి మానవ తప్పిదాలే నని చెబుతూ ‘’వృత్తుల రెక్కలన్ తొడిగి ,వృద్ధి నొసంగు విదేశ సీమ సం –పత్తుల కోసమై సుతులు వారధులు దాటు ‘’తున్నారని ఈ రోజుల్లో ‘’సింధువులు చెలంగి దైహికపు దూరం బెంచెను వారి వారికిన్ ‘’ అని సమకాలీన సత్యాన్ని చాటారు .ఎన్ని నదులొచ్చి చేరినా సముద్రం చెలియలి కట్ట దాటదు.మనవ ఆత్మ మాత్రం అంత  సహనం విశాల మైనదికాదు .’’శోక వాహినీ క్రమ గతులన్ని మోయుచు స్తిరంముగా నుండుట సాధ్యమా ?’’అని మనస్తస్త్వాన్ని ఆవిష్కరించారు .

మానవీయ విలువలు

దయ, సానుభూతి ,సహవేదన, ప్రేమ, కరుణ  , మానవీయత  మానవులలో మృగ్యం అవటాన్ని జీర్ణించు కోలేకపోయారు గోపీనాధ కవి .’’బీడులలో మొక్క మొలిపించెడి ఆ వనమాలు లేరయా ?”’అని ప్రశ్నించి జనాన్ని ప్రేమగా చూసే దయాళువులు ,కూలిజనానికి రక్ష నిచ్చే వారు లేక ‘’పాడు వడెన్ , స్వతంత్ర పరిపాలన పాలక వర్గ భోజ్యమై ‘’అని విమర్శ చేన్నాకోల్ తో బాదేశారు .

తెలుగు భాషపై మక్కువ

తెలుగు భాషా సంస్కృతుల పట్ల అపార ఆరాధనా భావం ఉన్న ‘’రావుకవి’’ నేటి భాష దుస్తితికి చింతించారు ,.’’తెలుగు తనజాతి గుర్తింపు గనెను గాని –సొంత పేరును కోల్పడి చి౦తమునిగే ‘’అని ‘’అమ్మభాష గరళమై పోయిందని ,ఏ జాతి అయినా ‘’విధుల నాచరించిన జాతి వినుతికెక్కు –జాతి నిల్పున దొక్క భాషా విభూతి ‘’అని జాతి ని నిలబెట్టేది భాషా వైభవం విస్తృతి మాత్రమె నని ఘంటా పధం గా చెప్పారు .’’బోధన లేదు ఆంధ్రమున పోడిమి నిచ్చెడిశాస్త్ర బద్ధ సంశోధన లేదు తెల్గున ‘’అని బాధపడి ‘’రాస్ట్రాధిపు  కార్య శాలలను సైతము వాడుక లేదు తెన్గుకున్ ‘’అని కుంగిపోయారు .దేశ భాషలలో తెలుగు లెస్స పోయి,’’తెలుగు  less ‘’అవటం మింగుడుపడని వ్యవహారం అయింది ఆయనకు. ఆయనతో బాటు మనందరికీ కూడా .రత్నాలను వదిలి రాళ్ళను కోరుకొనే మానవ మనస్తత్వం ఆయనకు వింతగా తోచింది .స్వార్ధం వదిలి ,భావి తరం క్షేమం కోసం వ్యర్ధపు జీవిత విధానాలని త్యజించి ,జన్మ సర్వార్ధాన్ని గ్రహించి తే ‘’విశ్వ మంతటన్ తీర్ధపు క్షేత్రముల్ వెలసి ‘’దివ్య పరిస్తితులోస్తాయి అని హితవు చెప్పారు .

దిక్కు లేని దీన స్థితి

’’తూర్పులో కూర్పు ,ఆగ్నేయం లో ఆశ ,దక్షిణం (యామ్య దిశ )లో సంతోషం ఇచ్చేఊర్పు ,నైరుతిలో నచ్చే మార్పు ,పడమట పరితోషాల పేర్పు,వ్యాయవ్యం లో  బతుకు పొల్పు ,ఉత్తరాన కరుణ తో నిండిన పిలుపు ,ఈశాన్యం లో మేలు వేల్పు ,పైన ఒప్పు ,కింద నేర్పు గోపీ గారికి కనిపించనే లేదు .ఆదుకోవటానికి ఇంకేది దిక్కు ?అని కలత చెందారు .

ఏదిఉన్నా లేకపోయినా మనిషికి జాతికి శీలం ముఖ్యం .’’శీలము చేతనే బ్రతుకు శ్రేయము నొందును ‘’అని ప్రేయస్సునోదిలి శ్రేయస్సు వైపుకు కదలమని బోధించారు .పూలను చూసి విద్య,చెట్లను చూసి బ్రతికే ధర్మం ,నేర్చుకోవచ్చు అని ‘’తరతమ భేదభావములు  ,తామస భావనము ,స్వార్ధ నైజమున్ ‘’వదులుకొని వినాశం నుంచి బయటపడమని హితోపదేశం చేశారు .ఇవి జాతికి వ్యక్తికీశ్రేయోదాయకాలే కదా .కనుక ‘’గోపీ కవి ‘’సమాజ జాతి హితైక  కవి కాదా ?

వియద్గంగకు విన్నపం చేస్తూ ఆమె అలిగి తే బతుకు నరకం అవుతుందని ,’’జలకణ మొక్క టోక్కటిగ సంకలనమ్మొనరించి గుండెలో నిలిపి –వసు౦ధరాస్థలికి నిర్మల వారి శుభాభి షేకముల్’’చేసే మేఘ ప్రసారం ప్రశస్తమైనది .ఇది తెలియని మూర్ఖులే ‘’పుడమి దేవత పాలిటి వైరులయ్యేడిన్ ‘’అని ప్రుద్వికి శత్రువులెవరో చెప్పారు .ఆమె అలౌకిక మహా గుణ శీల అని స్తుతించి ,ఆమె క్షమా అనే నీడనిచ్చి కరుణించి ‘’మిన్నువాక ‘’గా మారి సువర్ష దారలు కురియుమని ప్రార్ధించి పృధ్వీ తాపానికి ఉపశమనం వాంచించారు .

జైకిసాన్ –జైజవాన్

రైతే రాజు ,అన్నదాత అనిపిలువ బడే హాలికుడిని  పద్య సుమాలతో అర్చించారు .భూమి పుత్రుడైనా ,ఆవాసం లేక ,ఆకాశానికి ఆత్మీయుడైనా వికాసం లేక ,జలదేవతా భక్తుడైనా శుష్క జీవనం ,పవనానికి పరమాప్తుడైనా ఆశ్వసించలేక నిశ్వ సించి  ‘’చిత్ర వధలకు చిక్కాడు క్షేత్ర జీవి ‘’అని రైతు పక్షాన నిలిచారు .కాలం అతన్ని కసిదీరా కాటేసింది అన్నారు .విఫల సేద్యం ‘’అరకాని వెన్ను విరిచింది ‘’అని ,’’మట్టి పూజారి ‘’ప్రార్ధనలన్నీ వట్టి పోయాయని సానుభూతి చూపారు .ఈ సందర్భం లో రాసిన పద్యం చాలా హృద్యంగా ఉంది –చూడండి –

‘’అ౦బు జాసను వోలె నన్నమ్ము సృష్టించు రైతుకు నిత్యమ్ము త్రాసమేల ? –ఘర్మ జలాభి షిక్త హరస్వరూపికిన్ భిక్షాటనా వస్థ శిక్షలేల ?-వసుమతికి హరిత వసనమ్ము లందించు హరి వంటి హలదారి కార్తి ఏల?’’అని రైతు కున్న త్రిమూర్తి స్వరూపాన్ని మహాద్భుతం గా వర్ణించిన తీరు , అయినా బాధలు తప్పని వేదనా  అసదృశం అనిపించింది .రైతుకున్న చాలాపేర్లనిక్కడ సందర్భా శుద్ధితో  చక్కగా వాడారు . .’’శతృ శేషం లేనట్టి శాంతి కోరి ,దేహం రక్త తీర్ధమైనా దేశం కోసం దేహాన్ని త్యాగం చేసే జవాన్ కు జై జై అన్నారు.

నవమానవ గుణాలు

‘’నవ మానవ గుణాలు ‘’వర్ణిస్తూ బాంధవ్యాలు పట్టు దప్పాయని ,అంతా అంధ వ్యాపనం గా ఉందన్నారు .వ్యక్తికీ వ్యక్తికీ అనుబంధం ఉంటె వజ్ర వైడూర్యాలు పోతాయా ,కూర్మితో నరజాతి ఉంటె గోమేధిక రాశి గుల్ల అవుతుందా,ఇచ్చి పుచ్చుకొంటే పుష్యరాగాలు హరించుకు పోతాయా ,ఒకరి క్షేమం మరొకరు కోరుకొంటే మరకతాలుకొండ తరిగి పోతుందా   ,చేతులు కలిపితే కెంపు గుట్ట తరిగిపోతుందా ,మమత పూయిస్తే నీలాలు రాలిపోతాయా ,మంచిమాట మాట్లాడితే పగడాలు ముత్యాలు పారిపోతాయా అని అతి విలువను అతి విలువైన వజ్ర వైదూర్యాలతో పోల్చి సొగసుగా చెప్పి చివరికి ‘’మంచి పెంపారగన్ జేయు మనిషి తనము ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు .

వేదనా వాసుదేవం –స్త్రీ శక్తికి చేయూత

గాయమే గేయమై ,ప్రతిగాయం జీవన కావ్యమౌతుందని షెల్లీ లాగా, కృష్ణ శాస్త్రి లాగా చెప్పారు .’’కామము లేమల ప్రాణ మానములనవలీలగా దోచే ‘’దుస్టకాలాన్ని చూసి వ్యధ చెంది చూస్తూ ఊరుకోవద్దని మహిళలకు హితవు చెప్పి ‘’సత్తువ కూడ దీయుచు ‘’అసంగతమైన అసభ్య ప్రేమలను అణచి వేసి శిక్షల పాలు చేయమని ధైర్యం బోధించారు .’’చక్కనౌ పొత్తుల నిచ్చు ప్రేమమును పొంది శుభమ్ముల నొందగావలేన్ ‘’అని పూర్తి ఆశా భావం కనబరచారు .

విహంగ వేదం

‘’విహంగ గానం’’ ఒక సూక్తి సుధ.స్వేచ్చ మూల్యాన్ని ,విశ్వ గానామృతాన్ని ,సహన ధర్మాన్ని ,ప్రేమశీలతను .విఘ్నాల దాడి నెదిరించే లక్షణం ,వివిధ వర్ణాలు ,విమల ప్రకృతి ,సహజ సుఖ జీవనం ,విశ్వ సందేశ వాహకత్వం ,వెతలకు వెరవని ధర్మం ,విహగ గతులలో గీపీనాధకవి దర్శించారు .ఇది ఒక అలౌకిక దర్శనమే .చివరికి ‘’–

విదిత సుర వాహనమ్ము లీ విహగ తతులు –అహిత మహి రక్షణన్ ,గోరు విహగ తతులు –వేదన మాన్పి రహి పెంచు విహగ తతులు –వేకువకు స్వాగతమ్ము పల్కు విహగ తతులు ‘’అని మానవులకు విహ౦గాలిచ్చే స్పూర్తిని మహా మహితాత్మకం గా చెప్పారు .

జగద్ధితం

ఉగాది లాంటి పర్వ దినాలు ‘’ఉర్వికి శాంతి సౌఖ్య మహితోపక్రుతుల్ ఘటించా’’లని మనసారా కోరుకొన్నారు .ఏదైనా ఆయనకు జగద్ధితం కావాలి .తర్వాతే ఏదైనా .మానవుడు యాంత్రిక జీవనం గడుపుతున్నాడని కుజగ్రహం పైకి కాలు దువ్వుతున్నాడని ‘’యంత్రములాయె మానవాత్మలున్ ‘’అని యంత్రితమైన మానవుని ఆత్మ ఎప్పుడు మేలు కొంటుందో? నని అన్నారు అంటే త్వరగా మేల్కోవాలని ఆశ .

దేశ భక్తి

భారత దేశమంటే పరమ ఆరాధనా భావం ఉన్న కవిగారు ‘’ఇన కిరణమ్ము ప్రప్రధమ మీ ధర ముద్దిడు తుంది ‘’అని మురిసిపోతారు ..తన సంగీతం విశ్వ మానవతకు నాట్యం నేర్పించాలని ,తన సంసర్గం తో జగము జ్ఞానైశ్వర్యం పొందాలని ,తన సందేశం చేత ఈశ్వర జ్ఞాన కాంక్ష లభించాలని విశ్వ చేతనాభావం తో కమనీయంగా కవిత చెప్పారు .భారత దేశ కార్మికులే స్వదేశ ,విదేశాలలో  భర్మ్యరమ్య భవన నిర్మాణం చేస్తున్నారని ,’’భారత బుద్ధి జీవుల ప్రభావము చేతనే సర్వ దేశ వృద్ధి ‘’జరిగిందని మెచ్చుకొంటారు .అన్నిరంగాలలో భారతం అగ్రగామిగా వెలిగి పోతూఉండగా  ‘’భారతారాధన మిన్ను ముట్టి అలరారెను విశ్వ మంత ‘’అని పొంగిపోయి ‘’నిష్ట  యే మా ధనమన్న నా జనుల మాటలు నక్షర సత్యముల్ ‘’అని కీర్తించారు .జననీ జన్మ భూమిశ్చ స్వర్గా దపి గరీయసి ‘’అన్న శ్రీ రామవాక్యాన్ని గుర్తు చేశారు .

గ్రామ సౌభాగ్యం

‘’గ్రామమే అన్నపూర్ణ ప్రతి కర్షక బంధువు అన్నదాతయున్ –‘’అని చెప్పి ‘’పల్లె శ్రమైక్య జీవనారామము ,పంచ భూత పరిరక్షణ చక్రము ‘’అని గ్రామజీవనాన్ని కొనియాడి ‘’ఉల్లము దోచు ప్రక్రుతి సమున్నత ధామమే గ్రామ సీమ ‘’ అన్నారు .నరుడే భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకొని నశిస్తున్నాడని ఆవేదన చెంది ‘’నరుడు కాలపు చక్రమ్ము నడత మార్చె.’’అని విచారించారు .

స్పూర్తి దాతల కు ప్రస్తుతి ప్రసూన మాల

జాతికి స్పూర్తి దాతలైన జాషువా ,మాడపాటి ,ప్రకాశం లను పద్య ప్రసూనాలతో పూజించి గౌరవించారు గీపీనాద్ రావు .జాషువా సమకూర్చిన కావ్య రత్నాలు తెలుగు గుండెలను పిండేశాయని  పీడకాత్మలను పిప్పి చేశాయని చెప్పి ‘’మేదిని నేలెడి కీర్తి నొందె’’అని ఘన నివాళులర్పించారు .’’నిత్యము  సంఘ సేవ ,అను నిత్యము  సంస్కరణాభిలాష,నిత్యము  సాహితీ కృషి  ‘’చేసే మాడపాటి ఆంద్ర పితామహుడని స్త్రీ విద్యా పోషకుడని ,’’ప్రస్తుతించారు ‘’.సురవరమే’’ ప్రతాప రెడ్డి అని ,తెనుగు లిపిని సంస్క రి౦చాడని ,ఆంధ్ర చరిత్రరాసి ‘’సాంఘిక జీవన విధానాలను’’ వెలుగు లోకి తెచ్చాడని ,మెచ్చి’’ వైతాళికుడు’’ అనే పెద్దసార్ధక  గౌరవాన్ని కల్పించారు .ఇక పీ .వీ .ఠీవి ని మెచ్చి ఆయన బహుభాషా ప్రతిభ ,లౌకికభావన ,రాజనీతి, జ్ఞానధనం ,దూరదృస్టి  ,వాగ్ధాటి లకు అబ్బురపడ్డారు .’’గుండుకు గుండె  చూపిన మొనగాడు ‘’ఆంధ్రకేసరి ప్రకాశం .’’మాతృ భూమికి తనువూ ,మనమ్ము ,సంపదలు ‘’త్యాగం చేసిన జాతిని మేలుకోల్పిన మహా నాయకుడన్నారు.యేసును అల్లాను కూడా పద్య పుష్పాలతో అర్చించారు .పరమత సహనాన్ని చాటి చెప్పారు గోపీనాద్ .

–                         జ్ఞానదీపారాధన

.. బయటి చీకట్లను పోగొట్టటానికే కాదు దీపం ‘’హృది దేహళి ‘’లో పెట్టాలని మనస్తాపం అనే మహాన్ధకారాన్ని దాంతో త్రుంచాలని కోరారు .’’దివ్వియ –జ్ఞానదీప్తికొక తిన్నని చిన్నియ ‘’అన్నారు పరమ భావుకం గా .’’చిత్తం చీకటింట బడి చేతన కోల్పోరాదు’’అని సందేశ మిచ్చారు .’’దివ్వె తో దివ్వె వెలిగించమని జ్ఞాన బోధ చేశారు .

కవి రవి

కవి కాలానికి రెండుకళ్ళు  ,విశ్వ చేతనకు కదలిక  ధర్మానికి నాల్గు కాళ్ళు,అని నిజం చెబుతూ ‘’కవిభావ దేవియై కవితాత్మరశ్మియై ,కావ్య భారతి ‘’తనను కాపాడాలని కమ్మని తెలుగు తన హృదయ స్పందనై  జీవభాషై,వర్ధిల్లాలని వా౦చి౦చారు .చివరగా ‘’ పూర్వ పుణ్యమై ,నాజాతి జీవమై కాంతిల్లు తెంగు నన్ కావుగాత –నారాష్ట్ర తేజమై నా జీవ నాడియై కలి (ల)కాల మీ తెల్గు వెలుగు గాత’’ అని గోపీనాధకవి ఆశాభావం వ్యక్తం చేశారు . ఇదే మనందరి ఆకాంక్ష .అది తప్పక తీరగలదని ఆశిద్దాం .మరిన్ని పద్యకావ్యాలు రచించి ఆంద్ర సరస్వతిని అలంకరించాలని గోపీనాధ రావు గారిని కోరుతున్నాను .

ఈ పద్య సుమమాలను ‘’ యువ కవి పాదుషా ‘’శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారికి  అంకితమివ్వటం, ‘’కవితా మడుగు ‘’ .రామడుగు వెంకటేశ్వర శర్మ గారు విపుల , మనోహర సమీక్ష చేయటం ,పుష్పగిరి సంస్థాన పండితులు శ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజులు శర్మగారు ఆశీఃపూర్వక ప్రశంసలు అందించటం  అదనపు ఆకర్షణలు .

 

 

శ్రీ గోపీనాధ రాగారు రాసిన ”పద్య ప్రసూనాలు ”లభించే చోటు
శ్రీ ఎరుకల పూడి గొపీ నాధ  రావు

— డోర్ నంబర్     -23-17-8-   బడి వీధి

  సత్యనారాయణ పురం
  విజయవాడ -11
సెల్ నంబర్ -98482-93119

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-4-15 –ఉయ్యూరు

 

 

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

తృతీయ నాడు మా పెరటి” సువర్ణ సుమ దరహాసం

DSCN0474 DSCN0475 DSCN0476 DSCN0477 DSCN0478 DSCN0479 DSCN0480 మా పెరటి” సువర్ణ సుమ దరహాసం’

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మానవతా కధకుడు -(శశిశ్రీ)-రాచపాళెం రామ చంద్రా రెడ్డి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దండాలు -అరదండాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేడియో అక్కయ్యే స్టేషన్ డైరెక్టర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -28

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -28

 

13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్-2(చివరిభాగం )

మొదటి రియలిస్టిక్ డ్రామా

 

మొట్టమొదటి రియలిస్టిక్ డ్రామా ‘’పిల్లర్స్ ఆఫ్ సొసైటీ ‘’ఇది ‘’ఐరానిక్  టైటిల్ ‘’.అందులో సమాజం లోని అసహ్యమైన వంచనను బహిర్గతం చేసే కదఉంది . చీకటి వ్యాపారులు ,డబ్బే ప్రధానం గా జీవించేవారు ,అబద్ధాల కోరులు వగైరా నీతిబాహ్యుల బండారం బయట పెట్టాడు .మధ్యతరగతి గౌరవం మీద ఇబ్సెన్ కు గౌరవం లేదు .పై ముఠా ద్రుత రాష్ట్ర కౌగిలిలో గిజ గిజా తన్నుకుంటున్న సామాన్యుడి గురించిన ఆరాటమే ఇబ్సెన్ ది .ఇది ఆనాటి దేశ రాజకీయ పరిస్తితికి ప్రతి బింబమే .సామాన్యుడికి శత్రువైన ప్రభుత్వ తీరు తెన్నులపైనే ఇబ్సెన్ ద్రుష్టి పెట్టాడు .తనకు సంప్రదాయసిద్ధమైన కానుక లేదన్నాడు .స్వేచ్చ అన్నిటికంటే ప్రధమ౦, ఉత్తమం అన్నాడు .’’destroy the false ideal –the State –make willingness and spiritual kinship the only essentials of unity –and you have the beginning of a liberty that has the same value ‘’అని సమాజానికి తెలియ జేశాడు .

తర్వాత రాసిన ‘’ఏ డాల్స్ హౌస్ ‘’,ఘోస్ట్స్ ‘’నాటకాలు రెండూ సమాజం లో పాతుకు పోయిన సంప్రదాయాలను మరింత తీవ్రం గా అధిక్షేపించినవే .’’పెళ్లి ఒక పవిత్ర కార్యం ‘’అన్న భావానికి విరుద్ధమైనవే .డాల్స్  హౌస్ లో హేల్మేర్స్  హాయిగా సెక్స్ సుఖాలను పొండాడు  .  నిజాయితీ ఉన్న లాయరు అయినా ,మంచి కుటుంబం లోను౦చి వచ్చినా భార్య నోరా   ఆదర్శ భార్యగా  కొంచెం చిలిపి గా   చూపాడు.భర్తకు తనమీద కంటే సంప్రదాయం మీదే ఆసక్తి ఎక్కువ అని ఆమె భావించింది .తాను ఇక ఏమాత్రం ‘’వుమన్లీ వుమన్ ‘’గా ఉండ దలచుకోలేదు .’భర్త మనస్తత్వానికి ’అద్భుతాలకే అద్భుతమై’’న విషయమై తన వ్యక్తిత్వాన్ని గుర్తి౦చె దాకా తిరిగి రాను అన్నది . భర్త భార్యను అర్ధం చేసుకొని అన్యోన్యం గా మెలగితేనే దాంపత్య జీవితం ఆనందమయం అనే భావన తెలియ జేశాడు ఇబ్సెన్. మనుష్యులలో పరి వర్తన రావాలని ఆశించాడు ..

రెండవ నాటకం ఘోస్ట్స్ విషాదాంత నాటకం .ఒక భార్య బిడ్డకు తల్లిఅయిన ఒక స్త్రీ ఆల్వింగ్  తన కుటుంబ బంధం సంప్రదాయ ఉక్కు కౌగిలిలో నలిగి నశించటం ఇందులో కద.’’లోకం ఏమనుకొంటుందో ‘’అనే భయం ఆమెను వెంటాడి కొడుకును రక్షించుకోలేక కోల్పోతుంది ..భర్తమీద కుటుంబం మీద ఒక తీవ్రమైన అపనింద మోపితే ,న్యాయం గా కొడుకునైనా రక్షించుకోవాల్సిన ఆమె తండ్రినుండి సంక్రమించే సిఫిలిస్ వ్యాధి తోకొడుకు  బతక రాదనుకోన్నది  .అది ఆనాడు సంఘం లో నిషేధమైనదే .

విమర్శల జడివాన

ఈ రెండు నాటకాలను పత్రికలూ ,ప్రజలూ తీవ్రం గా వ్యతిరేకి౦చినవే .డాల్స్ హౌస్ ను ‘’ఇమ్మోరల్ ‘’అన్నారు .సంఘం లోని అన్ని మర్యాదలను మంట గలిపింది అన్నారు .జర్మనీలో నాటకం తప్పనిసరిగా సుఖాంతం అవ్వాలి . బెర్లిన్ ,హాం బర్గ్ ,వియన్నా లలోని నాటక ప్రియులు ఆ నాటకాన్ని తమకోసమైనా సుఖాంతం చేయమని ప్రాధేయ పడ్డారు .తప్పని సరి పరిస్తితిలో ప్రింట్ లో మార్పు తెచ్చాడు ఇస్బెన్ .విమర్శకులు ఘోస్ట్ నాటకం పైన కురిపించిన విమర్శల జడివాన ,వాడిన అసభ్య పదజాలం భయంకరం గా ఉందని ఇబ్సెన్ జీవిత చరిత్రకారుదు ఇబ్సెన్ కు ఆంగ్ల అనువాదకుడు విలియం ఆర్చేర్  వాటిని సేకరించి వీటిని ‘’dictionary of Abuse ‘’లో చేర్చటానికి దాచిపెట్టాడు .దీనికి ‘’ఘోస్ట్స్ అండ్ గిబ్బరింగ్స్ ‘’అని పేరు పెట్టాడు .ఇది తర్వాత పాల్మాల్ గెజిట్ లో1891 లో అచ్చయింది .

వ్యంగ్య వైభవం

వివాహం  సంప్రదాయ విధానాలు పై తన కున్న అభిప్రాయాలను ఇబ్సెన్  ఖచ్చితంగా చెబుతూనే ‘’యాన్ ఎనిమీ ఆఫ్ ది పీపుల్ ‘’అనే మరో నాటకం రాసి మరికొన్ని సంప్రదాయాలను చీల్చి చెండాడాడు ..శీర్షిక వ్యంగ్య వైభవం తో విషాదం గా ఉన్నది .దీనిపై వాద ప్రతివాదాలు తారా స్తాయిలో జరిగాయి .జార్జ్ బ్రాండ్స్ మెజారిటీప్రజల అభిప్రాయాలు సరైనవి ,వాటినే అనుసరించాలి అని ఇబ్సెన్ కు హితోపదేశం చేస్తే ‘’the minority is always right ‘’ అని ప్రతిగా సమాధానమిచ్చాడు ఇబ్సెన్ .యాభై లో ప్రవేశించాడు .,.ఇబ్సెన్ సాహిత్య ప్రయాణం రొమాంటిక్ మలుపు దాటి రియలిస్టిక్ దారిలో ప్రయాణిస్తోందిప్పుడు .’’వైల్డ్ డక్’’నాటకం రాశాడు .ఇందులో దంపతులు తమ పాత జీవితాలను రోజూ తవ్వుకొని పోట్లాడుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకొనే ఆలోచనలో ఉంటారు దీనిలోంచి బయటపడి ఐక్యత తో జీవించాలనే సందేశమిచ్చాడు .ఇందులోని స్త్రీ’’most impassioned ,purposeful ,and enigmatic woman ‘’అన్నారు విమర్శకులు .జనం బాగానే రిసీవ్ చేసుకొన్నారు .  మరోనాటకం ‘’ది లేడీ ఫ్రం ది సీ ‘’లో చక్కని సుఖాంతం ఉంది .ఇలా రాసినవి తక్కువ నాటకాలే ఉన్నాయి .’’హెడ్డా గేబ్లెర్ ‘’అనే మరోనాటకం లోని స్త్రీ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది .ఒంటరితనం తో బోర్ కొట్టి ,అసూయ పీడిస్తూ ,పెత్తనం కోసం పాకులాడుతూ ఉండే స్త్రీని గొప్పగా చిత్రించాడు .ఆమె ‘’నార్వీజియన్ లేడీ మేక్ బెత్  .’’అని పిస్తుంది .ఈ నాటకం తో మరింత తీవ్ర విమర్శకు గురయ్యాడు .

ముసలాయనకు దసరా పండగ

ముసలాయనకు అరవై మీద పడ్డాయి .పది హేడేళ్ళపడుచు పిల్ల ఎమిలీ బార్డాక్ తో మొహం లో పడి ముసిలోడికి దసరా పండగ అనిపించుకొన్నాడు .ఆమెను ‘’The May sun of my September life ‘’అని చెప్పుకొని జీవితం లోకి ఆహ్వానించాడు .పెళ్లి ,వెంటనే పెటాకుల్లా విడాకులు  అయిపోయి ముసలాయన ప్రపంచ యాత్రకు బయల్దేరాడు .అక్కడక్కడ ప్రేమ భామలు తగిలినా వెటపడకుండా జాగ్రత్త పడి కొంపకు తిరిగి వచ్చాడు .

ప్రపంచ ప్రసిద్ధి

ఇంకా పదిహేనేళ్ళు బతకాల్సి ఉంది ఇబ్సెన్ .ఈ కాలం లో రాసినవి మూడే మూడు నాటకాలు .’’దిలిటిల్ యియోల్ఫ్ ‘’,జాన్ గేబ్రియల్ బార్క్ మన్ ‘’వెన్ వు డెడ్ అవేకేన్ ‘’.మూడూ ట్రాజేడీలే .మొదటిది దిక్కుమాలిన విరమణ .రెండోది మృత్యు నాట్యం .మూడోది పునరుద్ధానికి ఆశగా కనిపించినా చివరికి విషాదమే ,ఇప్పటికే ఇబ్సెన్ కు ప్రపంచ ప్రసిద్ధ నాటక కర్తగా గుర్తింపు వచ్చేసింది .పంతర్జాతీయంగా అయన నాటకాలు అన్నిభాషల్లోకి అనువాదం పొందాయి .లండన్ లో ఇబ్సెన్ నాటకాలుప్రేక్షకులచేత  క్రోధాగ్ని కురిపించాయి .ఇస్బెన్ ను వెనకేసుకొచ్చి బెర్నార్డ్ షా సుదీర్ఘమైన సమాధానాలు చెప్పి వాటిలోని గొప్పతనాన్ని ఆవిష్కరించాడు .తనకు మించిన ప్రసిద్ధ నాటక కర్త ప్రపంచం లోనే లేడనే తిరుగు లేని నిజాన్ని ఇబ్సెన్ చాలాకాల విన్నాడు .

చరమ దశ

72 వయసులో మొదటిసారి గా గుండె పోటు వచ్చింది .రెండవ సారి స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడు ,శరీరమూ దెబ్బ  తిన్నాయి .దేనిపైనా  ద్రుష్టి పెట్టలేక పోయాడు .రోజుకు అయిదారు పేజీలకంటే చదవ లేక పోయాడు .రాయటం అనేది అసాధ్యమే అయింది .అక్షరాలను కూడబలుక్కోవలసి వస్తోంది .మూడవ సారి గుండె పోటు వచ్చి ఇది కూడా దూరమై 78 వ ఏట మే నెల 23 న 1906లో ఇబ్సెన్ మరణించాడు .

నార్వేజియన్ నవలాకారుడు ,విమర్శకుడు కౌంట్ హామ్సేన్ ‘’A book keeper of dramatic art ‘’అన్నాడు .ఇబ్సెన్ మరణానంతరం ఎవరూ ఆయన స్థానాన్ని గురించి కామెంట్ చేయనే లేదు .మానవ అంత రాత్మకు సూటిగా సోకిన నాటకాలు ఇబ్సెన్ రాశాడు .సంఘం లో అప్పటిదాకా గౌరవింప బడ్డ నైతిక విలువలను సంప్రదాయాలను ప్రశ్నించాడు .’’Ibsen disturbed the accepted concepts of conduct ,proposed new moral values ,and in his very dramas of disaster and defeat ,suggested the imperative need as well as the inevitable triumph of truth ‘’ అన్నాడు గ్రంధ కర్త లూయీ అంటర్ మేయర్ .

 

నాటక శాలలో ఆధునికతను ప్రవేశ పెట్టిన మొట్ట మొదటి వాడు ఇబ్సెన్ .షేక్స్ పియర్ నాటకాలు ఆడినంత గొప్పగా ప్రపంచం మొత్తం మీద ఇబ్సెన్ నాటకాలే  ఆడాయి .డాల్స్  హౌస్ నాటకం ఇరవై వ శతాబ్దం లో ప్రపంచం మొత్తం మీద అనేక ప్రదర్శనలు పొంది రికార్డ్ సృష్టించింది .ఐరోపా సంప్రదాయం లో గొప్ప నాటక కర్త గా గుర్తింపు పొందాడు .పీర్ గింట్ నాటకం లో సర్రియలిజ ధోరణి కూడా ఉంది .షేక్స్పియర్ తర్వాత ఇబ్సెన్ కు మాత్రమెప్రసిద్ధ  నాటక రచయితగా గుర్తింపు వచ్చింది .ఇబ్సెన్ ప్రభావం బెర్నార్డ్ షా ,ఆస్కార్ వైల్డ్ ,ఆర్ధర్ మిల్లర్ ,జేమ్స్ జాయిస్ ,యూజీన్ ఒ నీల్ వంటి ప్రసిద్ధ నాటక కర్తలపై అమితం గా ఉంది .1902 ,1903 ,1904  లలో అంటే మూడేళ్ళూ ఇబ్సెన్ పేరు నోబెల్ ప్రైజ్ కోసం నామినేట్ చేయ బడింది .కాని దక్కలేదు .

ఇబ్సెన్ తన రచనలు డేనిష్ భాష అంటే నార్వే ,డెన్మార్క్ దేశాల భాషలోనే రాశాడు .ఆ భాషలోనే ముద్రణ పొందాయి .డ్రామా నిబంధనలను రియలిజం తో తిరగ రాసిన సాహసి ఇబ్సెన్ . దీన్నే చెకోవ్మొదలైన వారు  అనుసరించారు అవే ఇప్పుడు దియేటర్ లో రూల్స్ గా చెలామణీ అవుతున్నాయి వినోదాన్ని మించి సాంఘిక ప్రయోజనాన్ని నాటకాల ద్వారా అందించాలన్న ధ్యేయమే ఇబ్సెన్ కుండేది .జేమ్స్ జాయిస్ పై అమిత ప్రభావం కలిగించాడు .ఇబ్సెన్ నుపాత్ర చేసి జాయిస్ ‘’స్టీఫెన్ హీరో ‘’నవల రాశాడు నార్వే సమాజం లో ప్రముఖ మైన మంచి మార్పులన్నిటికీ ఇబ్సెన్ కారణ భూతుడయ్యాడు . .ఆధునికత నాటక రంగానికే కాదు జీవితం లోను రావటానికి ప్రధాన కారణం ఇబ్సెన్ .

2006 లో ఇబ్సెన్ శత జయంతి జరిగింది దాన్ని ‘’ఇబ్సెన్ యియర్ ‘’గా గౌరవించారు .ఇబ్సెన్ మ్యూజియం మళ్ళీప్రారంభమైంది  .మొత్తం 27 రచనలు చేశాడు .ఎడ్మండ్ గూస్ కు స్వదస్తూరితో ఇంగ్లీష్ లో ఇబ్సెన్ రాసిన ఉత్తరం .

 

 

Letter from Ibsen to his English reviewer and translator Edmund Gosse: “30.8.[18]99. Dear Mr. Edmund Gosse! It was to me a hearty joy to receive your letter. So I will finally personally meet you and your wife. I am at home every day in the morning until 1 o’clock. I am happy and surprised at your excellent Norwegian! Your amicably obliged Henrik Ibsen.”

Inline image 1   Inline image 2  Inline image 3

Inline image 4   

 

మరో ప్రముఖ వ్యక్తితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘ లీ క్వాన్ యు ”ది సింగం ఆఫ్ సింగపూర్ ‘

‘ లీ క్వాన్ యు ”ది సింగం ఆఫ్ సింగపూర్ ‘lee1 001 lee2 001 singam1 001 singam2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ రామ కృష్ణ ప్రభ -ఏప్రిల్

akshaya 1 001 akshaya 2 001 nrusimha 1 001 nrusimha2 001 shankara 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిత్రకళకు రాణువ తెచ్చిన రామారావు దామెర్ల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శివుని మూడో కన్ను జ్ఞానానికి సంకేతం -డా అరవింద రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ విహారి పద చిత్ర రామాయణ విహారం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హస్తిన లో తెలుగు ఠీవీ-పీవీ-

imggallery

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనగనగ గాయకుడు

అనగనగ గాయకుడు
సీన్‌ సితారే
సినిమా అంటే 24 కళలు కదా.. మీరు ఎప్పుడూ హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు- వీళ్ల కథలే చెబుతారెందుకు? మిగతా కళాకారులు గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు?’’ అని గురువుగారిని సూటిగా ప్రశ్నించాడు శిష్యుడు. అప్పటి దాకా ధ్యానం చేసుకుంటున్న గురువుగారు నెమ్మదిగా కళ్లు తెరిచారు. శిష్యుడు వైపు చూసి చిరునవ్వు నవ్వి- ‘‘ఈ ప్రశ్న నువ్వు ఎప్పుడు అడుగుతావా? అని ఎదురుచూస్తున్నాను.. అని ఆగాడు. ఇప్పుడు నీకో కథ చెబుతాను. ఆ కథలో ఒక చిక్కు ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు నువ్వు సరైన సమాధానం చెప్పలేకపోతే- వచ్చే వారం వరకూ నాతో మాట్లాడకూడదు..’’ అని సవాలు విసిరాడు. శిష్యుడు ఆ సవాలును స్వీకరించినట్లు తలూపి- చెప్పండి.. గురుదేవా అన్నాడు.
కథాక్రమం..
మన ఇండసీ్ట్రలో ఒక గాయకుడు ఉండేవాడు. ఆయన పాడితే- తేనె కారినట్లు ఉంటుందని అందరూ అనుకొనేవారు. ఎంత కఠినమైన పాటనైనా సునాయాసంగా పాడేసేవాడు. దాంతో సంగీత దర్శకులకు పని చాలా సులువయ్యేది. అందువల్ల చాలా మంది సంగీత దర్శకులు ఆయనే కావాలనుకొనేవారు. ఏడాదికి 100కి పైగా సినిమాలు నిర్మిస్తే- ప్రతి దాంట్లో ఆయనవి కనీసం రెండు,మూడు పాటలైనా ఉండేవి. ఔత్సాహిక గాయకులందరూ ఆయన రికమెండ్‌ చేస్తే చాలని ఎదురుచూస్తూ ఉండేవారు. దానికి తగినట్లుగా ఆయన ఆంధ్రదేశమంతా తిరిగి- ఔత్సాహిక గాయకుల చేత పాడిస్తూ ఉండేవాడు. అందరూ ఆయన శిష్యులే. అయినా ఎవ్వరికీ అవకాశాలు వచ్చేవి కావు. ఇలా కథ సాగుతున్న సమయంలో- ఒక కుర్రాడు హఠాత్తుగా రంగం మీదకు దూసుకువచ్చాడు. జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాలన్నింటిలోను అతని ప్రొగ్రాములే. ప్రతి మ్యూజిక్‌ డైరక్టర్‌ ఏదో ఒక సందర్భంలో అతనిని పొగిడిన వారే. చిన్న వయస్సులో అంత సులువున్న గాయకుడు మరొకరు లేరని ప్రస్తుతించినవారే. ఆ కుర్రవాడు మన గాయకుడి దృష్టిలో పడ్డాడు. ఒక సారి అతనిని పిలిచి- ుూనీది జిల్లా స్థాయి కాదు. మద్రాసు స్థాయి.. నా దగ్గరకు వచ్చేయి..’’ అని ఆహ్వానించాడు. ఆ కుర్రవాడు పొంగిపోయాడు. మూటాముళ్లు సర్ధుకొని మద్రాసు వెళ్లిపోయాడు. గాయకుడు- ఆ కుర్రవాడిని అమితంగా ఆదరించాడు. ఎక్కడికి వెళ్లినా- వెంటబెట్టుకొనే వెళ్లేవాడు. ఒక రోజు గాయకుడికి బాగా జ్వరం వచ్చింది. పాట రికార్డింగ్‌ చేయటం తప్పనిసరి. ఆ సమయంలో మ్యూజిక్‌ డైరక్టర్‌ ఫోన్‌ చేసి- ుూమీ దగ్గరున్న కుర్రాడి చేత పాడిద్దాం. బాగా పాడుతున్నాడు కదా..’’ అన్నాడు. అప్పుడా గాయకుడు- ుూవాడిది మన స్థాయి కాదు. బాలీవుడ్‌ స్థాయి. వాడికి అక్కడే గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నా..’’ అన్నాడు. అన్నట్లే కొద్ది కాలం తర్వాత తన పలుకుబడి ఉపయోగించి- ఒక సినిమాలో ఛాన్స్‌ కూడా ఇప్పించాడు. బొంబాయిలో తన స్నేహితుడి గెస్ట్‌ హౌస్‌లో ఉంచాడు. ఆ కుర్రాడు చాలా కాలం ఛాన్స్‌ల కోసం ప్రయత్నించి విఫలమయి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాడు. అప్పటికి ఇక్కడి ట్రెండ్‌ కూడా మారిపోయింది. దాంతో అతనికి ఇక్కడ కూడా ఛాన్స్‌లు దొరకలేదు..
 
ఉపసంహారం
బాలీవుడ్‌లో ఛాన్స్‌లు దొరకటం చాలా కష్టమనే విషయం తెలిసి ఆ గాయకుడు కుర్రావాడిని బొంబాయి ఎందుకు పంపాడు?’’ అని ప్రశ్నించాడు గురువుగారు. దీనికి సమాధానం చెప్పటం చాలా సులువు గురువుగారు.. అన్నాడు శిష్యుడు. ‘‘ఆ కుర్రాడి టాలెంట్‌ను గాయకుడు గుర్తించాడు. అతను టాలీవుడ్‌లో ఉంటే తనకు ప్రమాదమనే విషయం అతనికి తెలుసు. అందువల్ల అతనిని బాలీవుడ్‌కు పంపాడు. బాలీవుడ్‌ ఒక మహాసముద్రమని- అక్కడ నిలదొక్కుకోవటం కష్టమని అనుభజ్జుడైన గాయకుడికి తెలుసు. అందుకే ఆ పన్నాగం పన్నాడు..’’ అని సమాధానాన్ని చెప్పాడు శిష్యుడు. ఆ సమాధానానికి గురువు చిరునవ్వు నవ్వి- ‘‘నువ్వే గెలిచావు..’’ అని మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోయాడు.
చౌరా నీతి
ఇండసీ్ట్రలో టాలెంట్‌ ఉంటే సరిపోదు. దృతరాష్ట్ర ప్రేమ కూడా ఉంటుందని గ్రహించాలి.
ఏడాదికి 100కి పైగా సినిమాలు నిర్మిస్తే- ప్రతి దాంట్లో ఆయనవి కనీసం రెండు,మూడు పాటలైనా ఉండేది. ఔత్సాహిక గాయకులందరూ ఆయన రికమెండ్‌ చేస్తే చాలని ఎదురుచూస్తూ ఉండేవారు. దానికి తగినట్లుగా ఆయన ఆంధ్రదేశమంతా తిరిగి- ఔత్సాహిక గాయకుల చేత పాడిస్తూ ఉండేవాడు. అందరూ ఆయన శిష్యులే. అయినా ఎవ్వరికీ అవకాశాలు వచ్చేవి కావు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒరిగిన సాహస శిఖరం -మస్తాన్ బాబు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి పక్కదారి అంటున్న గవర్నర్ –


 

నరసింహన్‌ ఇంటికి!

మోత్కుపల్లి, శేషగిరిరావులకు చాన్స్‌!
మినీ మంత్రివర్గ విస్తరణకూ అవకాశం
రామ్‌ మాధవ్‌కు కేబినెట్‌ బెర్త్‌?
స్మృతికి స్థాన చలనం లేదా ఉద్వాసన!
పలువురు సహాయ మంత్రులకు ప్రమోషన్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంటికి పంపనుందా!? యూపీఏ నియమించిన ఆయనను తొలగించాలని ఎన్డీయే భావిస్తోందా!? తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి గవర్నర్‌ చాన్స్‌ దక్కనుందా!? కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకూ ముహూర్తం ఖరారైందా!? ఈ ప్రశ్నలు అన్నిటికీ ‘ఔను’ అనే జవాబిస్తున్నాయి ఢిల్లీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 9న ఫ్రాన్స్‌ పర్యటనకు వెళుతున్నారు. అక్కడి నుంచే ఆయన నేరుగా కెనడా, జర్మనీ వెళతారు. తిరిగి 16వ తేదీన ఢిల్లీ వస్తారు. ఆ తర్వాత 20వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, విదేశాలకు వెళ్లడానికి ఒకటి రెండు రోజుల ముందే పలు రాషా్ట్రల్లో గవర్నర్ల మార్పు, కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గవర్నర్ల మార్పుల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాషా్ట్రల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి కొత్త గవర్నర్‌ నియామకాన్ని ఖరారు చేస్తారని తెలిపాయి. గత కొద్ది కాలంగా గవర్నర్‌ పనితీరుపై కేంద్రంలోనూ చర్చ సాగుతోందని, దీనికి కొనసాగింపుగానే ఆయన రాజీనామా కోరే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు వివరించాయి. మరో 9 రాషా్ట్రలకు కూడా గవర్నర్లను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో పంజాబ్‌, అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, మణిపూర్‌, బీహార్‌, పాండిచ్చేరి, త్రిపుర ఉన్నాయి. ఇక, కొత్తగా గవర్నర్‌ పదవులు పొందనున్న వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పరును చంద్రబాబు కేంద్రానికి సూచించినట్లు చెబుతున్నారు. అలాగే, సీమాంధ్ర నుంచి బీజేపీ సీనియర్‌ నేత ప్రొ ఫెసర్‌ శేషగిరిరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నిజాని కి, గతంలో విద్యాసాగర్‌రావును నియమించినప్పుడే ఆర్‌ఎస్‌ ఎస్‌ వర్గాలు శేషగిరిరావు పేరును మోదీకి సూచించాయి. రాష్ట్రంలో ఏబీవీపీని నిర్మించడమే కాకుండా పలు పుస్తకాలను ఆయన రచించారు. రెండు రాషా్ట్రలకు చెందిన మేనిఫెస్టోలను కూడా ఆయనే రూపొందించారు. గవర్నర్లుగా బీజేపీ, సంఘ్‌ నేపథ్యం ఉన్న వారినే నియమించాలని మోదీ భావిస్తే శేష గిరిరావుకు అత్యధిక అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గంలోనూ మార్పులు జరగనున్నాయి. పాలనను మెరుగుపరచడం, మిత్రులను సంతృప్తిపరచడం అనే ద్విము ఖ లక్ష్యాలతో ఈ మార్పులు చేపడతారని చెబుతున్నారు. మంత్రివర్గం నుంచి మరికొందర్ని తొలగించి వారిని గవర్నర్లు గా పంపవచ్చని తెలు స్తోంది. మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా, చిన్నతరహా పరిశ్రమల మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా పేర్లు ఇందు కు వినిపిస్తున్నాయి. ఈనెల 8న మంత్రి వర్గ పునర్వ్యసీ ్థకరణ జరగవచ్చని, శివసేన, పీడీపీ, బీజేపీల నుంచి మరికొంత మందిని చేర్చుకోవచ్చని తెలుస్తోంది. ఎన్ని కలు జరగనున్న బీహార్‌ నుంచి ఒకరికి స్థానం కల్పిస్తారంటున్నారు. జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా సీట్లు సాధించడంతోపాటు అనంతరం బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభు త్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన రామ్‌ మాధవ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక, మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీకి స్థానచలనమో, ఉద్వాసనో జరిగే అవకాశాలు లేకపోలేదు. శివసేన నుంచి ఆనంద్‌రావు అడ్సుల్‌, లేదా అనిల్‌ దేశాయ్‌, పీడీపీ నుంచి ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ లేదా తారిఖ్‌ హమీక్‌ కర్రా, బీజేపీ నుంచి షానవాజ్‌ హుస్సేన్‌లకు అవకాశం లభించవచ్చని సమాచారం. రైల్వే శాఖ సహాయ మంత్రి, యూపీకి చెందిన మనోజ్‌ సిన్హా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి, నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ తదితరులకు కేబినెట్‌ హోదాలో ప్రమోషన్‌ లభిస్తుందని తెలుస్తోంది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హాకు అదనంగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖను అప్పగించే అవకాశాలున్నాయి.

గోల భక్తులది.. వేడుక నరసింహన్‌ది!

క్యూ లైన్లలోనే మగ్గుతున్న భక్తులు
అధికారులు, ప్రోటోకాల్‌ అధికారుల యాతన
తిరుపతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి సంబంధించి ‘గోల గోవిందుడిది.. వేడుక వెంకన్నది’ అనే సామెత ఉంది! భక్తులు ‘గోవిందా గోవిందా’ అనుకుంటూ వెళ్లి ముడుపులు వెంకన్నకు వేస్తారని, అక్కడ ఆయనకే కల్యాణం జరుగుతుందనే అర్థంలో ఈ నానుడి పుట్టింది! కానీ, గవర్నర్‌ నరసింహన్‌ పుణ్యమా అని ఈ నానుడికి మరెన్నో పేరడీలు పుట్టాయి! ‘గోల భక్తులది.. వేడుక నరసింహన్‌ది’ అని అంటున్నారు. ఇందుకు కారణం.. గవర్నర్‌ నరసింహన్‌ రాచమర్యాదలతో శ్రీవారి దర్శనం చేసుకుంటుంటే.. క్యూలైన్లలో గంటల తరబడి భక్తులు అవస్థలు పడుతున్నారు! అలాగే, ‘గోల అధికారులది.. వేడుక గవర్నర్‌ది’ అనే పేరడీ కూడా ఉంది! గవర్నర్‌ వస్తున్నారంటే తహసిల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ నుంచి తిరుమల జేఈవో వరకూ అటెన్షన్‌లో ఉండాల్సి రావడమే ఇందుకు కారణం! అంతేనా.. ‘నిధులు ప్రజలవి.. వేడుక నరసింహన్‌ది’ అని కూడా ప్రచారంలో ఉంది. ప్రజా ధనాన్ని ఆయన తన వ్యక్తిగత విశ్వాసాలకు పెట్టుబడిగా వాడుకోవడమే ఇందుకు కారణం! తిరుమల శ్రీనివాసుడి దివ్యరూపాన్ని ఎన్నిసార్లు.. ఎంతసేపు చూసినా తనివి తీరదని చెబుతూ ఉంటారు. అందుకే, తిరుమల కొండకు భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అయితే, ఏడాదికో ఆరు నెలలకో ఒకసారి చుట్టం వస్తే ఆ కుటుంబ సభ్యులకు ఆనందం. కానీ, అదే పనిగా వస్తూ ఉంటే ఎంత దగ్గరి వాళ్లకు అయినా విసుగు పుడుతుంది. గవర్నర్‌ నరసింహన్‌ తిరుమల పర్యటనలకు సంబంధించి ఉద్యోగులు, భక్తుల్లో ఇటువంటి భావనే వ్యక్తమవుతోంది. సంప్రదాయబద్ధంగా తిరుమలకు వచ్చే నరసింహన్‌ను తొలి రోజుల్లో భక్తులు ఆసక్తిగా గమనించారు. శ్రీవారిపై ఆయనకున్న అచంచల భక్తిని చూసి మురిసిపోయారు. అయితే, ఆయన పదే పదే తిరుమలకు వస్తుండడంతో సేవలు చేయలేక కొందరు, గంటలకొద్దీ నిరీక్షించలేక మరికొందరు నొచ్చుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి దాకా ఏ గవర్నరూ రానన్నిసార్లు తిరుమలను దర్శించుకున్న గవర్నర్‌గా నరసింహన్‌ రికార్డు సృష్టించారు. దేవదేవుడిపై ఆయనకున్న భక్తి ఎంత తీవ్రమైనదంటే ఒకే నెలలో మూడు నాలుగుసార్లు తిరుమలకు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవల ఒకసారి గవర్నర్‌ తిరుమలకు వచ్చి వెళ్లారు. ఆ తర్వాతి రోజు అప్పట్లో బెంగాల్‌ గవర్నర్‌, నరసింహన్‌కు సన్నిహితుడు ఎంకే నారాయణన్‌ వచ్చారు. దాంతో తర్వాత రోజు మళ్లీ నరసింహన్‌ తిరుమల వెళ్లి ఆయనతోపాటు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. భక్తులు పోటెత్తే పర్వదినాల్లోనూ మందీ మార్బలంతో ఆయన శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలున్నాయి.
అధికారుల వేల పని గంటలు వృధా
ప్రొటోకాల్‌ ప్రకారం గవర్నర్‌కు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉంటుంది. ఆయన కాన్వాయ్‌లో మూడు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కార్లు, ఒక పైలెట్‌ వాహనం, రెండు టైలెండ్‌ వాహనాలు, రెండు ఎస్కార్ట్‌ వాహనాలు ఉంటాయి. వీటిలో పోలీసులు, రిజర్వు పోలీసులు, సీఐ స్థాయి అధికారులు ఉంటారు. ఒక అంబులెన్స్‌, ఒక రక్తనిధి వాహనం ఉంటుంది. వీటిలో 12 మంది డాక్టర్లు, ఆరుగురు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇద్దరు అటెండర్లు ఉంటారు. గవర్నర్‌ రాత్రి బస చేస్తే పదిమంది గార్డులు కాపలా ఉంటారు. ఒక్కో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు గవర్నర్‌ వచ్చినప్పటి నుంచీ తిరిగి వెళ్లే వరకు మరో పని ఉండదు. టీటీడీలో ఈవో లేదా జేఈవో స్థాయి అధికారులు గవర్నర్‌ వెంట ఉంటారు. తహసీల్దార్‌, ఆర్‌ఐ వరకు అందరూ ఒకరోజు ముందు నుంచే తిరుమలలో తిష్టవేసి గవర్నర్‌ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. గవర్నర్‌ వరుస పర్యటనల కారణంగా అత్యంత బిజీగా ఉండే ఈ అధికారుల పని గంటలు అన్నీ వృథా అవుతున్నాయి. గవర్నర్‌ పర్యటన సందర్భంగా సుమారు 70 మంది రాష్ట్ర ఉద్యోగులు ప్రొటోకాల్‌ విధుల్లో ఉంటారు. పరోక్షంగా ఈ సంఖ్య మరీ ఎక్కువ. వీరందరికీ టీఏ, డీఏ చెల్లించాలి. వాహనాలకు ఆయిల్‌ ఖర్చులు ఇవ్వాలి. తిరుమలలో బస, భోజన ఖర్చులు అదనం. గవర్నర్‌ వచ్చారంటే డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ అసిస్టెంట్లు రుయా ఆస్పత్రి నుంచే వెళ్లాలి. అసలే డాక్టర్ల కొరతతో కునారిల్లుతున్న రుయా ఆస్పత్రిలో వీవీఐపీలు వచ్చారంటే ఇక ఆరోజుకు ఓపీలకు హాలిడే ప్రకటించినట్లే!
ఈ విషయం తెలియక ఆస్పత్రికి వచ్చే రోగులకూ ఇబ్బందులు తప్పవు. ఇక, రుయా ఆస్పత్రికి ఉన్నది ఒక్కటే అంబులెన్స్‌. అది కాస్తా వీవీఐపీల వెంట వెళితే ఇక ఆరోజు ప్రాణాపాయ స్థితిలోని రోగులు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇక ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా వాహనదారుల ఇక్కట్లు చెప్పాల్సిన పని లేదు. నగరంలో ఎక్కడైనా రోడ్డు బ్లాక్‌ చేస్తే, ‘గవర్నర్‌ వచ్చాడేమో’ అని అంటున్నారంటే ఆయన రాక జనం దృష్టిలో ఎంత అసహనాన్ని సృష్టిస్తోందో ఊహించుకోవచ్చు.
తిరుమలకు 37 సార్లు.. దర్శనానికి 60 సార్లకుపైగా

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నరసింహన్‌ బాధ్యతలు చేపట్టి దాదాపు ఐదున్నరేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం గవర్నర్‌ హోదాలో నరసింహన్‌ 37 సార్లు తిరుమలలో పర్యటించారు. ఒకే నెలలో వరుసబెట్టి రెండు, మూడు సార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే, ఒకే పర్యటనలో రెండుసార్లు (సాయంత్రం, ఉదయం), ఒక్కోసారి మూడుసార్లు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తంమీద ఇప్పటి వరకు ఆయన 60 సార్లకుపైగా శ్రీవారిని దర్శించుకున్నారు. అత్యధిక సందర్భాల్లో సతీసమేతంగా వస్తే, కొన్నిసార్లు మాత్రం బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చారు. నరసింహన్‌ సాధారణంగా సాయంత్రం, ఉదయం దర్శనాలకు వెళుతూ ఉంటారు. దాంతో, ఆరోజు రాత్రి ఆలయం మూసివేసేలోగా శ్రీవారిని దర్శించుకొని బయటపడాల్సిన వేలాదిమంది భక్తులు… గవర్నర్‌ వంటి వీవీఐపీల కోసం క్యూలైన్లు నిలుపు చేయడంతో ఆ రాత్రికి దేవదేవుని దర్శనం కాకపోగా మరుసటి రోజు ఉదయం సర్వదర్శనం ఆరంభమయ్యే వరకు (శని, ఆది, సోమ వారాల్లో 7 గంటల వరకు, మంగళ, బుధ, గురు వారాల్లో 9 గంటల వరకు, శుక్రవారం 10 గంటల వరకు) క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తోంది. ఇక, గవర్నర్‌ వస్తే ఘాట్‌ రోడ్డు ప్రయాణికులకూ ఇబ్బందులు తప్పవు. గవర్నర్‌ వాహనం కొండెక్కే వరకు అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేస్తారు. కొండ దిగే సమయంలోనూ ఇంతే. అలిపిరిలో అర్ధగంట వాహనాల రాకపోకలు నిలిపితే ఆ ప్రభావం కొండెక్కే యాత్రికులపై సుమారు గంటన్నర ఉంటుంది. అప్పటికే పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరతాయి. తనిఖీలు ముగించుకొని టోల్‌గేటు దాటే సమయానికి కొండ కిందే యాత్రికులకు దేవుడు కనిపిస్తాడు!

విజ్ఞత అంటే అదీ..!

తిరుమల వేంకటేశ్వరస్వామి పేరు చెప్పగానే ఆ వెనువెంటనే గుర్తుకొచ్చే పేరు మరొకటి ఉంది. అదే శంకర్‌ దయాళ్‌ శర్మ. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా, దేశానికి ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా విశిష్ఠ సేవలందించిన వివాదరహితుడు ఆయన. తన పదవీ కాలంలో అనేక పర్యాయాలు తిరుమలేశుని దర్శించుకుని రికార్డులకెక్కారు. ఒకరోజు ఆయన రాష్ట్రపతి హోదాలో తిరుమలేశుని దర్శించుకుని, తిరిగి వెళుతూ తిరుపతి విమానాశ్రయంలో విలేకరులను హడావుడిగా పిలిపించారు. ఇందుకు కారణం అంతకు ముందురోజు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనమే. శంకర్‌ దయాళ్‌ శర్మ తరచూ తిరుమలకు వస్తుండడంతో భక్తుల ఇబ్బందులను అందులో వివరించారు. దాంతో, సదరు పత్రిక ప్రతినిధి తనంతట తానే సంజాయిషీ ఇచ్చారు. ఆ వార్తను తామంతట తాము రాయలేదని, వార్తా సంస్థ ఇచ్చిన కథనాన్నే ప్రచురించామని, మన్నించాలని కోరారు. అందుకు శంకర్‌ దయాళ్‌ శర్మ చిరునవ్వుతో స్పందిస్తూ.. ‘‘నేను ఫలానా అన్నిసార్లు తిరుమలకు వచ్చారని రాశారు. అది తప్పనుకుంటున్నా. ఇంకా ఎక్కువసార్లే వచ్చాను. బహుశా, మీరు గమనించలేదేమో! ఇప్పుడు నేను మీడియాను పిలిచింది ప్రజలకు క్షమాపణ చెప్పడానికి. స్వామివారంటే నాకు వల్లమాలిన భక్తి. రాకుండా ఉండలేను. చనిపోయాక ఎలాగూ రాలేను కదా! బతికున్నన్నాళ్లు ఆయనకు సేవ చేసుకుందామనే వస్తున్నా. అధికారం ఉందని దర్పం చెలాయించడం లేదు. నావల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతోందన్న విషయాన్ని నేను గుర్తించాను. అందుకే మీ ద్వారా భక్తకోటికి క్షమాపణ చెప్తున్నా. అలాగే, టీటీడీ అధికారులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను దర్శనానికి వచ్చినప్పుడు క్యూను ఆపవద్దు. మహా అయితే, గర్భ గుడిలో ఉన్న రెండు మూడు నిమిషాలు మాత్రం ఆపి, మిగతా సమయాల్లో యథావిధిగా భక్తులను అనుమతించండి. ఘాట్‌ రోడ్డులోగానీ, క్యూలోగానీ భక్తులెవరికీ అసౌకర్యం కలిగించవద్దు. దయచేసి ఇకపై నా కారణంగా భక్తులను ఇబ్బంది పెట్టవద్దని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. తాను మాత్రమే కాకుండా తన సతీమణి విమల కూడా భక్తులకు అసౌకర్యం కలుగుతోందని తెలిసి నొచ్చుకున్నారని, ఇకపై భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. శర్మ ఆ మాటలు అన్నప్పుడు అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. అదీ ఒక విజ్ఞత గల రాజనీతిజ్ఞుడికి ఉండాల్సిన లక్షణమని వ్యాఖ్యానించారు.


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్నేహం – ఓ త్రికాల వేదం – ఈ బందా నాదం.

img078

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మారణకాండలో వెలసిన మానవత్వం – మిసిమి – గబ్బిట కృష్ణ మోహన్

scan017

 

0001 0002 0003 0004

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27

13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్

పరిచయం

ఆదునికులకు ఇబ్సెన్ రచనలలో సమకాలీన సమాజం లో పాతుకు పోయిన వాటిని కూల్చే సెన్సేషన్ కనిపించాడు ఆయన తీర్చిన పాత్రలు  తన ప్రభావానికి లోనైన బెర్నార్డ్ షా ,చెకోవ్ ,పిరా౦డేల్లో సృస్టించిన పాత్రల్లకు భిన్నం గా సర్వ  సాధారణం గానే ఉంటాయి . సంప్రదాయానికి బద్ధుడుగా కనిపిస్తాడు అంగీకరించిన నిజాలకు నిజరూపాలుగా మాత్రలను మలిచిన నేర్పు ఇబ్సెన్ స్వంతం .కాని19 వ శతాబ్దపు చివరి భాగం లో  ఇవే మిరుమిట్లు గొలిపాయి ఊహాతీత విజయాలకు కారణమయ్యాయి .

సంకీర్ణ కుటుంబనేపధ్యం

హెన్రిక్ ఇబ్సెన్ 20-3-1828ననార్వే దేశపు దక్షిణభాగాన ఉన్న స్కీన్ లో జన్మించాడు .అతని కుటుంబం స్కాండినేవియన్, ట్యుటోనిక్,  గేలిక్ మిశ్రమ సంజాతం .తండ్రి తరపు పూర్వీకుడోకాయనడేనిష్ జాతికి చెందిన  నౌకా కెప్టెన్ .ఇంకోకాయన స్కాటిష్  రక్త సంబంధీకుడు.తల్లి జర్మన్ జాతికి చెందింది .మొదటి నుండీ ఇబ్సెన్ కుటుంబం సంపన్న తరగతికి చెందిన వారే . ఇబ్సెన్ తండ్రి సమాజం లో గౌరవ ప్రతిష్టలున్న ముఖ్య వ్యక్తీ .ఆర్ధికంగా సుస్తిరుడు .

తండ్రి దివాలా –కుటుంబ ఆర్ధికం చిద్రం

దురదృష్ట వశాత్తు ఇబ్సెన్  ఎనిమిదవ ఏట తండ్రి దివాలా తీశాడు .భవిష్యత్తు కోసం వేసిన ప్రణాలికలు దెబ్బతిని జీవితం అంధకార బందురమైంది .గత్యంతరం లేక విలాస వంతమైన భవనం నుండి కుటుంబాన్ని మురికి కూపం గా ఉండే వ్యవసాయ క్షేత్రానికి  మార్చాల్సి వచ్చింది . కుర్రాడైన ఇబ్సెన్ మనస్సులో ఈ ఆర్ధిక కల్లోలం ,అసమానత ముద్రగా పడ్డాయి .వీటినే ఆధారం గా చేసుకొని తార్వాతి కాలం లో .’’డాల్స్ హౌస్ ‘’,జాన్ గేబ్రియల్ బార్క్ మన్ ‘’’’దివైల్డ్ డక్ ‘’నాటకాలు రాశాడు .

మందులషాపు లో పని –సెటైర్ కవిత్వ రచన

తండ్రి అసమర్ధత పై ఇబ్సెన్ కు కోపంగా ఉండేది. కుటుంబ పునాదులు కూలి పోవటానికి తండ్రే కారణం గా భావించాడు .

ఇంటి దగ్గర ఉండాలనిపించలేదు .ఇల్లు వదిలి వెళ్లి పోయాడు .మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన దాఖలాలు లేవు .16 ఏళ్ళ వయసులో గ్రిం స్టాడ్ చేరాడు .ఇది నార్వే లో దక్షిణ తీరపు చిన్న నౌకాశ్రయం .అక్కడ మందుల దుకాణం లో అప్ర౦టిస్ గా చేరాడు. అయిదేళ్ళు అక్కడే ఉండి కవిత్వం రాశాడు .అందులో గ్రామస్తుల ప్రవర్తనపై సెటైర్  దట్టించేవాడు .పోయిన కుటుంబ ప్రాభవం మరలా దక్కాలని ఆశించేవాడు .తనకన్నా పదేళ్ళ పెద్దదైన పని అమ్మాయికి కడుపు చేసి ఒక బిడ్డకు తన 18 ఏట జన్మనిచచ్చి తండ్రి అయ్యాడు .ఇది తెలిసిన కుటుంబం మండిపడింది .ఉత్తర ప్రత్యుత్తరాలు బందయ్యాయి .ఇబ్సెన్ ను సాంఘిక బహిష్క్రుతుని చేసింది కుటుంబం  . బిడ్డ సంరక్షణ బాధ్యత స్వీకరించినా జీవితాతం ఈ తప్పు అతన్ని  వెంబ డిస్తూనే ఉంది  గిల్టీగా ఫీల్ అయ్యేవాడు

తిరుగు బాటు –నాటక ప్రక్రియ –దర్శకత్వం

సంప్రదాయ జీవనం లో ఇబ్సెన్ చేసింది తప్పు అయింది. అందరు అతన్ని ద్వేషించ సాగారు దీ.నితో సంఘం పై తిరుగు బాటు చేశాడు మెజారిటీ తీరకుండానే  .ఈ భావాలతో తాను కీర్తి పొందాలని ‘’కేటిలిన్ ‘’అన్న నాటకం రాశాడు .పెద్దగా ఆదరణ పొందక పోయినా అతని భావావేశాలకు నిలయమైంది .ఒక స్నేహితుడు దీన్ని ప్రింట్ చేశాడు .ఎవరూ కొనలేదు .చిత్తుకాగితాల క్రింద అమ్మేయాల్సోచ్చింది .దీనిపై స్పందిస్తూ ఇబ్సెన్ ‘’ఒక రచయిత ఈ రకంగా కూడా డబ్బు సంపాదించి పోతట్టగడుపుకోవచ్చునని ఆడబ్బుతో తర్వాత పుస్తకాన్ని ప్రింట్ చేసుకో వచ్చు నని తెలిసింది ‘’అని చమత్కరించాడు . ఈ సంఘటన అతనిని క్రిస్టియానా కు వెళ్ళేట్లు చేసి యూని వర్సిటీలో చేరటానికి  దోహద పడింది .పరీక్ష’’గుంట కొట్టి గంట వాయించింది ‘’లాభం లేదని జర్నలిజం వైపు కదిలాడు .ఇరవై మూడవ ఏట నార్వీజియన్ నాటకశాల మేనేజర్ గా ఉద్యోగం లో చేరి బీదరికపు అ౦చులనుండి బయటపడ్డాడు ఇబ్సెన్ .క్రమంగా డైరెక్టర్ అయ్యాడు .34 ఏళ్ళు వచ్చేదాకా ఇక్కడే అదే పదవిలో క్రిస్టి యానాలో ఉన్నాడు .

పెళ్లి-నాటక ప్రయోగం –నేచురల్ రైటర్

29 వ ఏట సుసానా తోరేసేన్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఒక గొప్ప రచయిత కు మారుటి కూతురు .ఇబ్సెన్ నాటక రచనలో ప్రయోగాలతో బిజీ గా 25 ఏళ్ళ వయసు నుండి 34 వ ఏట వరకు గడిపాడు .అరడజను జానపద నాటకాలు రాశాడు .దీనితో స్వాభావికత కు అద్దంపట్టి ‘’నేచురల్ రైటర్ ‘’గా పేరు తెచ్చుకొన్నాడు . వీటిలో  హీరోయిజం ఎక్కువ .రొమాంటిక్ టచ్ కూడా జోడించాడు .వీటిలో ‘’లవ్స్ కామెడి ‘’ఒక్కటి మాత్రమె ఇబ్సెన్ ప్రతిభకు నిదర్శనం గా నిలిచింది .ఇదులో ప్రేమ ,పెళ్లి ల  ఐరని ఉండటం కొత్త గా అనిపిస్తుంది .సెటైర్ ,సెంటిమెంట్ ,త్యాగం వగైరాలన్నీ ఉన్నాయి .

దియేటర్ ,ఆదాయం లేని డైరెక్టర్ ,రచయిత

35 ఏళ్ళు వచ్చాయి .డైరెక్టర్ అని పించుకోన్నాడుకానిస్వంత దియేటర్ మాత్రం లేదు . దాని వలన నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్ళే పరిస్తితి మాత్రం పూజ్యం .తండ్రిగా ,పుట్టిన కొడుకు పోషణ,రచయితగా ఏది రాసినా చూసే వారు కరువైన స్థితి .ఇక ఇక్కడ ఉండటం నిరర్ధకం అనుకొన్నాడు .జెండా పీకాలని పించేసింది .తన సృజనకు ఇక్కడ ఆదరణ లేదని ఇక్కడి జనం హృదయాలు ఇరుకు మురికి కూపాలని అనిపించింది .సరాసరి రోమ్ నగరానికి చేరుకొన్నాడు .

రోమ్ నగర అనుభవం

రోమ్ చేరి అయిదేళ్ళున్నాడు.జీవన భ్రుతికోసం నాటకాలు రాసిపారేస్తూనే ఉన్నాడు .డ్రమాటిక్ పోయెం ,పోయేటిక్ డ్రామా లను రాశాడు .ఇబ్సెన్ కొత్త ఆగంతకుడు . అతని వేషం ఆహార్యం జనాలకు నచ్చాయి .’’నత్త తన గుల్ల లోకి శరీరాన్ని ముడుచుకున్నట్లు ‘’కనిపించేవాడని చూసిన వారన్నారు .బిగ్గరగా మాట్లాడితే మాత్రం చీకటి లో  చెట్టు మీద  కూర్చుని బిగ్గరగా కూసే గుడ్ల గూబ అరుపులా వినిపించేదిట.రోమ్ చేరిన కొత్తలో రెండు  ప్రసిద్ధ నాటకాలు’’ బ్రాండ్ ‘’ పీర్ గింట్ ‘’లు రాసి ప్రదర్శించి మాస్టర్ పీసెస్ అని పించుకొన్నాడు .ఇదే మొట్టమొదటి విజయం .రెండిటిని వచనం లోనే రాశాడు .కాని ఆర్ధికం గా గిట్టుబాటు కాలేదు .తర్వాత ‘’ఆల్ ఆర్ నధింగ్ ‘’కర్క్ గార్డ్ రాసిన ‘’యైదర్ ఆర్’’కు సమానం అన్నారు .కొందరు  బ్రాండ్ నాటకం కర్క్ గార్డ్ ను దృష్టిలో పెట్టుకొని రాసిందే అన్నారు .పీర్ గింట్ మాత్రం బ్రాండ్ కు వ్యతిరేకం .ఇది చట్టం న్యాయం లేని మనసుకు ఏది తోస్తే అది చేసే పాత్ర . బ్రాండ్  మాత్రం ఇబ్సెన్ నడవడికలో ఉన్నదే అన్నారు .ఆయనా దాన్ని ఒప్పుకొన్నాడు. బ్రాండ్ తన భావాలను ఆడ మగా అందరిపై రుద్దే స్వభావం ఉన్న పాత్ర .పీర్ గింట్ మాత్రం తన భావాలను తనలోనే ఉంచుకొనే పాత్ర .

జర్మనీ యాత్ర-  ప్రపంచ చారిత్రాత్మక నాటకం

రోమ్ వదిలి నలభై వ ఏట జెర్మనీ చేరాడు ఇబ్సెన్ .మ్యూనిచ్ లో కాపురం .అప్పుడప్పుడు ఇటలి వెళ్లి వచ్చ్చేవాడు .డ్రెస్ డ్రెయిన్ లో మూడవ కవిత్వ రచన చేశాడు .రోమ్ లో ఉండగా ప్రారంభించిన ‘’ఎమ్పరర్ అండ్ గలీలియన్ ‘’జర్మనీలో పూర్తీ చేశాడు .ఇందులో నాలుగవ శతాబ్దానికి చెందిన పాగానిజం –క్రిష్టియానిటి మతాల మధ్య ఉన్న విద్వేషమే కద.దీన్ని ‘’ప్రపంచ చారిత్రాత్మక నాటకం ‘’అన్నాడు ఇబ్సెన్ .(world historic al drama ) .చారిత్రక నేపధ్యం ఉన్నా నైతిక ఐక్యతను బోధించాడు ఇందులో .మనిషి తనను తానూ నమ్మనంత వరకు ఇతరులను నమ్మలేడు అన్న సిద్ధాంతాన్ని  తెలిపాడు .ఇందులోని పాత్రలన్నీ తమను తాము మోసం చేసుకొని అపరాదులైనవే  .Ibsen was a self divided person .,an idealist who distrusted abstract ideals ,an iconoclastic truth –teller who forced himself to see the destructive power of the truth .’’ అని ఇబ్సెన్ ను ఆవిష్కరించాడోక విమర్శకుడు .

యాభై వయసులో ఈ రకమైన రేటరిక్ రొమాంటిక్ కవిత్వ డ్రామాలను వదిలేశాడు .వాస్తవిక వచన  రచనలపై ద్రుష్టి పెట్టాడు .ఆధునిక ప్రపంచ జీవితం లోని విషయాలను కదా వస్తువులుగా స్వీకరించాడు .ఈ మార్పునే బెర్నార్డ్ షా ‘’exposing the mischief  of idealism ‘’అన్నాడు .ఇక్కడి నుండి ఇబ్సెన్ రచనా ప్రస్తానం కొత్త పుంతలు తొక్కి మార్గ దర్శనం చేసింది.

సశేషం

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షేక్స్ పియర్ 54 వ’’ సానెట్ ‘కు డా.రాచకొండ నరసింహ శర్మఏం. డి .గారి అనువాదం

షేక్స్ పియర్ 54 వ’’ సానెట్ ‘కు డా.రాచకొండ నరసింహ శర్మఏం. డి .గారి అనువాదం

 

షేక్స్ పియర్ 54 వ’’ సానెట్ ‘కు

O! how much more doth beauty beauteous seem
By that sweet ornament which truth doth give.
The rose looks fair, but fairer we it deem
For that sweet odour, which doth in it live.
The canker blooms have full as deep a dye
As the perfumed tincture of the roses,
Hang on such thorns, and play as wantonly
When summer’s breath their masked buds discloses:
But, for their virtue only is their show,
They live unwoo’d, and unrespected fade;
Die to themselves. Sweet roses do not so;
Of their sweet deaths are sweetest odours made:
And so of you, beauteous and lovely youth,
When that shall vade, my verse distills your truth.
–William Shakespeare

 

 

’  డా.రాచకొండ నరసింహ శర్మఏం. డి .గారి అనువాదం

      ‘’ సత్యమను ముత్య మొకటి ‘’

 సత్య శీలతా లంకార ముత్య మొకటి

సుందరాధికత నొసగు సుందరతకు

ఆ గులాబి ప్రసవమ్ము అంద మేను

కాని రుచిర మనోజ్నమై కానబడును

సౌరభ మిళితమై యున్న కారణమున

కల  దితర పూలకును గాఢమైన రంగు

వేసవిని వాటి మొగ్గలు విచ్చినపుడు

ముళ్ళతో నిండి గాలిలో తేల గలవు

కాని ఆ సుమ శోభ ఆకారమందే !

వరలు గౌరవములు లేక వాడిపోయి

మృతిని చెందు –కాని గులాబి స్థితియె  వేరు

మధురమౌ తన మరణ సమయము నందు

మధురతరమౌ పరీమళమ్ము  మన కొసంగు

అవును –నీ వట్లే సౌందర్య యువ మనోజ్ఞ

అంద చందములన్నియు  డిందు నపుడు

కవితలో నుంతు సత్య సార మంత .

 

Inline image 1    View photo in message

Posted in అనువాదాలు | Tagged | Leave a comment