|
జ్యోతిర్లింగాలు పరమ శ్రేయో సాధకాలు – మహాశక్తి కేంద్రాలు – సద్గురు
|
|||||
భారతీయ సంస్కృతి ఈ ప్రపంచంలోని అతి కొద్ది ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి. భౌగోళిక విస్తారం పరంగా చూస్తే ఈ ప్రపంచంలో ఇటువంటి సంస్కృతి బహుశా ఇది ఒక్కటే అయ్యుంటుంది. వేలాది సంవత్సరాలుగా ఈ గడ్డ మీది జనావళి అంతా మానవాళి అంతిమ శ్రేయస్సు కోసమే పరితపిస్తూ వస్తోంది. భౌతికపరమైన శ్రేయస్సును కేవలం జీవితంలోని ఓ చిన్న అంశం మాత్రంగానే ఇక్కడి ప్రజానీకం పరిగణిస్తూ వచ్చారు. ఇంతకు ముందు ఈ భారతావనిలో జన్మించిన వారికి జీవితమంటే వ్యాపారమో, భార్యో, భర్తో, కుటుంబమో కానే కాదు వారి జీవితమంతా కేవలం ముక్తి పొందడం కోసమే జీవితంలోని ప్రతి అంశమూ ముక్తి సాధనకు అనువుగా మలచబడింది. ఈ సమాజ వ్యవస్థ మొత్తం ఇదే విధంగా రూపుదిద్దబడింది.
అందువల్ల ఇక్కడ వారు సహజంగానే తాము రూపొందించిన ప్రతి పరికరాన్ని జీవితంలోని ప్రతి పరిస్థితిని మోక్ష సాధనకు అనువుగా మలచుకోవాలనుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం మీ వివాహం జరిగితే ఈ వివాహ క్రతువు నడిపించే సందర్భంగా పురోహితుడు ‘ఇక్కడ మీరు మీ జీవిత సహచరుల కలయిక ముఖ్యం కాదు. ఈ క్రతువు కేవలం మీకు వివాహం జరగడానికి సంబంధించినది మాత్రమే కాదు. మీరు ఉభయులూ కలిసి ఈ వివాహబంధాన్ని మీ అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగించుకోండి. మీలోని కొన్ని పరిమితులు, నిర్భందతలను అధిగమించే స్థితిలో లేరు కాబట్టి వాటిని ఈ వివాహం ద్వారా మీ అంతిమ శ్రేయోసాధనకు, పరమాత్మను చేరుకోవడానికి సాధనాలుగా మలచుకోండి’ అని చెబుతాడు. ప్రతీదీ దేశంలో ఇలాగే ఉంటుంది. ఇదే ఉద్దేశ్యంతో మరెన్నో శక్తివంతమైన సాధనాలు ఈ సంస్కృతిలో సృజించబడ్డాయి. ఇలానే జ్యోతిర్లింగాలు కూడా చాలా శక్తివంతమైన సాధనాలుగా సృష్టించబడ్డాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ కూడ సజీవంగా , చాలా శక్తివంతంగా విరాజిల్లుతున్నాయి. అవి ఎంతో ప్రయోజనకరమైనవి. ఒక వ్యక్తి తనంతట తాను ధ్యానంలో నిమగ్నుడవగలిగితే అప్పుడు వెలుపలి సాయం అనేది అంత అవసరం ఉండకపోవచ్చు. కానీ, ఆ స్థితికి ఇంకా చేరని వారికి మాత్రం ఈ సాధకాలు చాలా అవసరమవుతాయి. ఇటువంటి శక్తి రూపాల సన్నిధిలో చాలా శక్తివంతమైన అనుభూతి కలుగుతుంది. జ్యోతిర్లింగాలు పరమ శక్తివంతమైనవి. ఎందుకంటే వాటిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రతిష్టీకరించి నెలకొల్పారు. ఈ ప్రపంచంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. భౌగోళికంగా, ఖగోళపరంగా ఎంతో విశిష్టత ఉన్న కేంద్ర బిందువుల్లో వాటిని ప్రతిష్టించారు. ఈ ఉనికిలో ఉన్న కొన్ని శక్తులకు అనుగుణంగా ఈ కేంద్రాలున్నాయి. చాలాకాలం కిందట ఎంతో మహత్తరమైన జ్ఞానం గల మహానుభావులు గ్రహ, నక్షత్ర గమనాల ఆధారంగా ఈ ప్రాంతాలను గణించి ఈ కేంద్రబిందువులను నిర్ధారణ చేశారు. మానవ శక్తియుక్తులనే కాకుండా , ప్రాకృతిక శక్తులను కూడా ప్రాంతాల్లోనే ఏర్పరచారు. మూర్తులను శక్తివంతం చేసే శాస్త్రం నిర్దేశించిన నియమ నిబంధనలు పద్ధతుల ప్రకారం ఈ జ్యోతిర్లింగ క్షేత్రాల ప్రతిష్టాపన జరిగింది. చాలా అసాధారణ అద్భుతమైన రీతిలో మానవ జీవనాన్ని పరిపుష్టం చేయడానికి జీవ శక్తులను వినియోగించే శాస్త్రమిది. మట్టిని ఆహారంగా మారుస్తున్న ప్రక్రియను వ్యవసాయం అంటాం. ఆహారాన్ని మాసం , ఎముకలుగా రూపాంతరం చెందిస్తున్న విధానాన్ని జీర్ణప్రక్రియ అంటాం. ఈ మాంసాన్ని అంటే ఈ మాంసాయుతమైన శరీరాన్ని మట్టిగా మార్చే ప్రక్రియను దహనం అంటాం. అలాగే శరీరాన్ని , ఓ రాతిని లేదా ఖాళీ స్థలాన్ని ఓ దివ్యశక్తిగా మార్చే ప్రక్రియను ప్రతిష్టీకరించడం లేదా ప్రతిష్టాపన అంటాం. ఇది పరమాద్భుతమైన శాస్త్రం దురదృష్టవశాత్తూ , ఇప్పుడు ప్రతిష్టాపన అంటే అసలేమిటో మనం మరచిపోయాం. అందువల్ల ఈ పేరుతో అర్థంపర్థంలేని పరిహాసాత్మకమైన కార్యకలాపాలు ఎన్నో సాగిపోతున్నాయి. దీనితో జనం దీనిని వ్యాపారంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. నేను సాధారణంగా గుడులకు వెళ్లను కానీ ఉజ్జయిని లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్లడం జరిగింది. ఈ దేవాలయాన్ని అనేకమార్లు ధ్వంసం చేశారు. మనదేశం మీద దండెత్తిన వాళ్లు ఈ దేవాలయాన్ని కూలగొట్టారు. ఈ కారణంగా ఇప్పటికీ రెండు, మూడు మార్లు తిరిగి నిర్మించి పున:ప్రతిష్ట చేయటం జరిగింది. ఏదేమైనా ఇప్పటికి కూడా మీరు అక్కడికి వెళ్లి ఆ జ్యోతిర్లింగ సన్నిధిలో కూర్చున్నారంటే … వేలాది సంవత్సరాలుగా అక్కడ ఉన్న ఆ చిన్న స్వరూపం . ఆ చిన్న రాతిముక్క మిమ్మల్ని ఒక అద్భుతమైన అనుభూతిలో ముంచేస్తుంది. ఆ మహాశక్తి స్వరూపం కేవలం నిన్ననే ప్రతిష్టింపబడిన దానివలె మహాశక్తి తరంగాలను వెదజల్లుతూ ఉంది. జీవితంలో వీటి మహత్తును పరిపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకోగలిగిన వారికి జ్యోతిర్లింగాలు మహాశక్తివంతమైన సాధనాలు మీ శారీరక, మానసిక వ్యవస్థను పరిపూర్ణంగా పున:వ్యవస్థీకరించుకోగలిగే నేర్పు మీకు తెలిస్తే , ఈ జ్యోతిర్లింగాల సన్నిధిలో మీ వ్యవస్థను సమూలంగా మార్చుకోగలగుతారు. ఈ భూమిమీద ప్రతిష్టించిన ప్రతి లింగానికీ, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సాధన ప్రక్రియ అనేది మాత్రం ఈ రోజుల్లో పూర్తిగా మాయమైపోయింది. అందువల్ల దేవాలయాలు ఇప్పుడు చాలా కాలం కిందట చనిపోయిన వారి స్మృత్యర్థం నిర్మించిన స్మారక చిహ్నాలుగా మిగిలిపోయాయి. జ్యోతిర్లింగాల్లో కొన్ని సజీవంగా లేవు. కాని మిగిలిన వాటిలో చాలా లింగాలు ఇప్పటికీ మహాశక్తి వంతమైన సాధకాలే.
– సద్గురు
|
వీక్షకులు
- 1,146,234 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం.10 వ భాగం.6.5.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.190 వ భాగం.6.5.26.
- సంస్కృతి – ఒక కుట్రా?(త్రివేణి)
- బెంగాలీ ఆశుకవి కవులు(త్రివేణి )
- మహానుభావుడైన అశోకుడు(త్రివేణి)
- అమరజీవి డాక్టర్ బి. విజయ లక్ష్మి గారి జీవిత చరిత్ర.7 వ భాగం.3.5.26.
- మహోపాధ్యాయ, కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వేంకట రాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర.6 వ భాగం.3.5.26.
- శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం.8 వ భాగం.3.5.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య. 188 వ భాగం.3.5.26.
- నూతన యుగానికి నూతన సిద్ధాంతమా?(త్రివేణి )
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,975)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


