శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.46 వ భాగం.24.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.46 వ భాగం.24.10.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.15 వ భాగం.24.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.15 వ భాగం.24.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.72 వ భాగం.24.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.72 వ భాగం.24.10.25.

Posted in రచనలు | Leave a comment

ఎస్వి రామారావు చిత్రకళపై సంజీవదేవ్ వ్యాఖ్యానం

ఎస్వి రామారావు చిత్రకళపై సంజీవదేవ్ వ్యాఖ్యానం

 సంజీవ దేవ్ సుమారు 1956లో అంటే 69ఏళ్ల క్రితం ‘’స్మృతి బింబాలు ‘’లో రాసిన వ్యాసం మీకోసం  

కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించిన శీరం శెట్టి వెంకటరామారావు బిఏ బికాం లు గుడివాడలో పూర్తిచేసి మద్రాస్ లో స్కూలఫ్ ఆర్ట్స్ లో చిత్రకళలో డిప్లమో పొందాడు .

ఆయన చిత్రకళ ఇండియాలోనే వాస్తవ వాదం నుంచి కల్పనా వాదానికి రూపాంతరం చెందింది ,రిప్రె జెంటేషన్(సారూప్య )వాదం నుంచి నైరూప్యానికి -అబ్స్ట్రాక్ట్ కు పరిణతిచెందింది.తర్వాత పాశ్చాత్య దేశాలలో పూర్తిగా నైరూప్యానికి పరివర్తన చెందింది .లండన్ లో ఉండగా గ్రాఫిక్ కళలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు .లండన్ లోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు .విశిష్ట వ్యక్తులు విశిష్ట సంస్థలు ఆయన చిత్రాలను సేకరించారు .అంతర్జాతీయ పత్రికలూ ఆయనను’’ నైరూప్య చిత్రకళా కు ప్రధాని ‘’అయిన ‘’కా౦డిన్ స్కి’’ తో పోలిస్తే ,ఆక్స్ఫర్డ్ యూని వర్సిటి జర్నల్ విశ్వ విఖ్యాత నైరూప్యచిత్రకారుడు ‘’పాల్ క్లీ’’ తో  పోల్చింది .కొన్ని భారతీయ విషయ వస్తువులను తీసుకొని నైరూప్య పద్ధతిలో అనేక చిత్రాలు చిత్రించి పాశ్చాత్య చిత్రకారులను ,చిత్ర రసికులను సంతోషపెట్టాడు .

  రామారావు ఉన్నతస్థాయికి చెందిన వర్ణ కారుడు .వర్ణాల వ్యతిరేకతలను సృష్టించటం లో ఆయన తూనిక -బ్రష్ అద్వితీయమైనది .అందుకే క్రిస్టియన్ సైన్స్ మానిటర్ పత్రిక కళా సమీక్షకులు ‘’Rao ;s harmonies of madder ,ultramarine ochre ,cobalt and a fantastic orchid pink enrich ‘’Festival ‘’,one of the best paintings in the present exhibition ‘’అంటే ఈప్రదర్శనలో ఉత్తమ చిత్రాలలో ఒకటైన ‘’పండుగ ‘’అనే చిత్రాన్ని రామారావు సృష్టించిన మ౦జిష్టవర్ణం ,గాఢనీలం కావిరంగు ,మృదుల నీలం కొట్టొచ్చినట్లు కనిపించే పాటల వర్ణం మొదలైన వాటి సమ్మేళనాలు ఎంతగానో రక్తి కట్టిస్తున్నాయి .

  అమెరికాలోని కెంటకి లో జెబి స్పీడ్ ఆర్ట్ మ్యూజియం లో రామారావు చిత్రించిన తైల నీటిచిత్రాలు లితోగ్రాఫులు ,ఉడ్ కట్ లు ప్రదర్శించాడు.వాటిలో మేఘసందేశం, ఉండవల్లి గుహలు ,చలికాలం ,జెన్ బౌద్ధం,హిమాలయాలు ,రాగోదయం మొదలైనవి నిపుణులచేత విశేషంగా ప్రశంసలు పొందాయి .ఇండియానా రాష్ట్రం ఇవాన్సువిల్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో రామారావు రావు ప్రదర్శించిన చిత్రాలు  విశిష్ట రీతిలో ప్రశంసలు పొందాయి వేలాది మంది ఆయన నైరూప్య చిత్రాలకు ఫిదా అయ్యారు .

రామారావు నైరూప్య చిత్రణ అమెరికన్ నైరూప్య చిత్రణకు అనుకరణ కాదని అమెరికన్ చిత్ర నిపుణులు అభిప్రాయ పడ్డారు .ఆయన విషయాలను విరూపపరచి ,నైరూప్యం  లో చిత్రి౦చినందున ఎవరికీ అర్ధం కానట్లు అగమ్య గోచరంగా ఉంటాయి .కృష్ణానది ని చిత్రిస్తే మనంరోజూ  చూసే ఆనది కనిపించక నైరూప్య౦గా  గోచరించి అది కృష్ణానదే కాదు అసలు యేనది కూడా కాదు  అనిపిస్తుంది .

 దాదాపు అర్ధ శతాబ్దం నుంచి అమల్లో ఉన్నా ,నైరూప్య చిత్రకళా ఇప్పటికీ ప్రజలకు దురూహ్య౦ గానే ఉంది.అయినా నైరూప్య చిత్ర స్రవంతిని ప్రవహింప జేస్తూనే ఉన్నారు .అయితే రామారావు చిత్రాలు ఇతరులవాటికంటే భిన్నంగా ఒక విశిష్టత కలిగి ఉంటాయి .అవి రంగుల ముద్దలు మాత్రమేకాక ,ఆ రంగుల వెనుక లయాత్మక సూక్ష్మ రేఖలు నరాల కూడిక లాగా గోచరిస్తాయి .సూక్ష్మ రేఖలు లతలు లాగా పెనవేసుకొని ఉంటాయి .అందుకే ఆయన చిత్రాలలో రంగుల రాగాలు వినిపించటమే కాక  ,రేఖల లయలు కనిపిస్తాయి .

  ఆయన  ఆయిల్ ,నీటి చిత్రాలను కూడా సమాన దక్షతతో చిత్రిస్తాడు .జలచిత్రాలు తైల వర్ణ చిత్రాలలాగా ఉండవు .కానీ తైలవర్ణ చిత్రాలు జలవర్ణ చిత్రాలులాగా  కని పించటంవిశేషం .ఈ మధ్యతైల వర్ణ చిత్రాలను కూడా ఒక విశిష్ట రీతిలో చిత్రిస్తున్నాడు. తైల వర్ణాలను జలవర్ణాల వాష్ పద్ధతిలో వాడటమే ఈ ప్రత్యేకత .రంగుల్ని చాలా పల్చగా కలిపి ,కుంచెతో తెలుపు చేయబడిన కాన్వాస్ పై పూసి ,ఒకగుడ్డ పేలికతో ఆ భాగాలను రుద్దటం వలన  ,తెలుపు భాగం లో ఈ శుద్ధ రంగులు కలిసిపోయి ఒక విధమైన పింగాణీ మెరుపు ప్రకాశిస్తుంది .రాజుల చిత్రాలు నీటి రంగుల్లో చిత్రించినా ఈ పింగాణి మెరుపు గోచరించి ఆశ్చర్యపరుస్తుంది  .

 తెలియని విషయాన్ని తెలిసే రూపాల్లో చిత్రించడం కాదు రామారావు పని  .తెలిసిన విషయాలను  తెలియని రూపాల్లో చిత్రించడమే ఆయన పని.అంటే ఆయనచిత్రాల్లో పరిచిత వస్తువులు అపరిచిత రూపాల్లో రూపొందుతాయి .గుప్త వస్తువులను వ్యక్తం చేయటంకాక ,వ్యక్త వస్తువులను గుప్త పరుస్తాడు రామారావు . ఇదంతా రామారావు 36 ఏళ్ల వయసులో ఉన్న నాటి విషయాలు .

స్వవిషయం -శ్రీ ఎస్వి రామారావుగారిని సుమారు 30ఏళ్ళక్రితం కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాన్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు నిర్వహించిన నేతాజీ జయంతిలో మొదటి సారి చూశాను మాట్లడాను.అడ్రస్, ఫోన్ నంబర్  కూడా తీసుకొన్నాను .ఆయన అమెరికాలో ఇలినాయిస్ రాష్ట్రం లో ఉంటారని తెలిసింది .ఆతర్వాత కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమాలలో  ఆయన నాలుగైదు సార్లు పాల్గొనగా చూశాను .ఆతర్వాత సుమారు పదేళ్ళ క్రితం సరసభారతి ఆధ్వర్యం లో ఉయ్యూరులో శ్రీనివాస అక్షరాలయం లో ఆయన్ను ఆహ్వానించి సరస భారతి ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అందజేయించిన పట్టు వస్త్రాలు,  11000 రూపాయల నగదుకానుకతో సత్కరించాం .ఆయనను’’ఆధునిక పికాసో’’ ఆని సభకు పరిచయం చేశాను .వ్యాసం కూడా రాశాను .ఒక ఆరునెలలు ఇండియాలో ఉండగా తరచూ ఫోన్ లో మాట్లాడుకొనే వాళ్ళం .2017 నుంచి జరగలేదు .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.45 వ భాగం.23.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.45 వ భాగం.23.10.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.14 వ భాగం.23.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.14 వ భాగం.23.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.71 వ భాగం.23.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.71 వ భాగం.23.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.9 వ భాగం.22.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.9 వ భాగం.22.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.9 వ భాగం.22.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.44 వ భాగం.22.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.44 వ భాగం.22.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.8 వ భాగం.21.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.8 వ భాగం.21.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ. తుమ్మపూడి.43 వ భాగం.21.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ. తుమ్మపూడి.43 వ భాగం.21.10.25.

Posted in రచనలు | Leave a comment

తెలుగు వాడైన ఫ్రెంచ్ సాహిత్య నిష్ణాతుడు ,సినిమాటోగ్రఫీ లో అందెవేసిన చేయి ,,’’మాన్సూన్ ‘’డాక్యుమెంటరి ఫిలిం ఫేం -డా.పి.వి.పతి

తెలుగు వాడైన ఫ్రెంచ్ సాహిత్య నిష్ణాతుడు ,సినిమాటోగ్రఫీ లో అందెవేసిన చేయి ,,’’మాన్సూన్ ‘’డాక్యుమెంటరి ఫిలిం ఫేం  -డా.పి.వి.పతి

పి.వి .పతి అంటే పిట్టమండలం వెంకటాచలపతి .నెల్లూరు జిల్లా వాడు .చిన్నతనంలోనే ఫ్రాన్స్ దేశం వెళ్లి అక్కడ ఫ్రెంచ్ సాహిత్యం చదివి సినిమాటోగ్రఫీ ,స్టిల్ ఫోటోగ్రఫిలలో నిష్ణాతుడయ్యాడు ..సార్బాన్ యూని వర్సితిలో ప్రసిద్ధ ప్రాచ్య శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ సిల్వరీ మార్గదర్శిగా భారతీయ నాటకకళ గురించి  పరిశోధన చేసి డి.లిట్ డిగ్రీ పొందాడు .ఫ్రెంచ్ వనితను వివాహమాడి ఇద్దరబ్బాయిలకు జన్మనిచ్చాడు .తల్లీ ,పిల్లలూ ఫ్రాన్స్ లోనే ఉండి పోయారు .చిన్న కొడుకు డాక్ ఇంజనీర్ .భార్యా పిల్లలను ఇండియా తీసుకొని రావాలని పతి నిర్ణయం .వారికి ఇష్టం ఉన్నట్లు కనిపించదు .ఈయన ఫ్రాన్స్ కు వెళ్ళడు, వాళ్ళు ఇక్కడికి రారు.’’విడాకులు తీసుకోకపోయినా అనుకూల దంపతులుగానే ఉన్నాం .భౌతికంగా వేరుగా ఉన్నా ,మానసికం గా కలిసే ఉంటున్నాం .ఉత్తరాలద్వారా మా ప్రేమ అభి వ్యక్తం చేసుకొంటున్నాం .కొన్ని ఏళ్లనుంచి మాది ‘’పోస్టల్ లవ్ ‘’‘’అన్నాడు పతి సంజీవదేవ్ తో . భార్య పారిస్ లో ఒక విద్యాసంస్థకు డైరెక్టర్ .

1951లో మద్రాస్ లో బ్రిటీష కౌన్సిల్ లో ‘’ఆధర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘’ప్రదర్శనలను ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీమతి మార్సేలా హార్ది ఏర్పాటు చేసింది అందులో సంజీవదేవ్ ,పివి పతి గార్ల ఫోటోగ్రాఫులు మాత్రమె ప్రదర్శించ బడ్డాయి .డా.పతి గారివి శిల్పాలకు తీసిన ఫోటోలు .ప్రపంచ నిపుణ డాక్యుమెంటరి ఫోటోగ్రాఫర్లలో డా.పతి ఒకరు .ఎన్నో డాక్యుమెంటరి ఫిల్మ్స్ తీసిన అనుభవం ఆయనది .మార్సెల మద్రాస్ నుంచి ‘’చక్ర’’అనే ఇంగ్లిష్ మాసపత్రిక నడుపుతోంది .

 బర్మాషెల్ కంపెని కి ప్రసిద్ధ రచయిత ముల్కరాజ్ ఆనంద్ ‘’మాన్సూన్’’అనే కధ రాసి ఇస్తే దాన్ని డాక్యుమెంటరి ఫిలిం నిర్మాత డా .పతి వర్ణ చిత్రంగా1956జనవరి లో  దాన్ని తీయాలనుకొని ,ఆకధ లో  కొంత ఆంధ్ర పల్లెటూరి నేపధ్యం లో సాగినందువల్ల పల్లెటూరి షాట్స్ గుంటూరుజిల్లా సంజీవదేవ్ స్వంతవూరు తుమ్మపూడిలో తీయాలనుకొని సంజీవ దేవ్ కు చెప్పి అందరి అనుమతి పొంది సంజీవదేవ్ ఇంటికి ఆబృండం వచ్చింది .అందులో ప్రముఖ హిందీ సినీనిర్మాత దర్శక నటుడు గురుదత్ తమ్ముడు ఆత్మారాం కూడా ఉన్నాడు .ఆత్మారాం కు పెళ్ళికాలేదు .బెజవాడ రేడియో స్టేషన్ నుంచి శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి ఇద్దరు స్త్రీలు బుర్రకధ చెప్పటానికి వచ్చారు .పతిగారి తమ్ముడు సుబ్రహ్మణ్యం  మూవీ ఫోటోగ్రాఫర్ .

డా.పతి ఫ్రెంచ్ సాహిత్యం లో డాక్టరేట్ ,స్టిల్ ఫోటోగ్రఫీ సిద్ధ హస్తుడు .తుమ్మపూడిలో బావి దగ్గర బుర్రకధ సన్ని వేశాలు తీశారు .బకి౦గ్ హాం కాలువ ,రాదారిపదవలు తెరచాపల సౌందర్యం ,తాళ్ళతో పడవలను లాగుతూ ‘’జోర్సేయ్ బార్సేయ్ ‘’అంటూ ఉత్సాహంగా పాటలుపాడే వారిని అద్భుతంగా చిత్రీకరించారు .జనుముచేలు ,జనుం కోస్తున్న రంగురంగుల చీరలు కట్టుకొన్న ఆడ కూలీలు  దృశ్యాలు నయన మనోహరంగా చిత్రీకరించాడు డా.పతి .

 మంగళగిరి కొండ సంజీవదేవ్ బృందం ఎక్కుతుంటే  కి౦ది మెట్టు నుంచి డా.పతి లాంగ్ షాట క్లోజప్ లలో గొప్పగా ఫోటోలు తీశాడు .వారం రోజులు తుమ్మపూడిలో ‘’మాన్సూన్ ‘’డాక్యుమెంటరి నిర్మాణంతో  సందడి చేసిన   డా.పతి బృందం సంజీవదేవ్ సులోచన దంపతులు అందించిన సహకారానికి ఆతిధ్యానికి ధన్యవాదాలు చెప్పి మద్రాస్ వెళ్ళిపోయారు .

 తెలుగువాడైన ఇంతటి గొప్ప ఫ్రెంచ్ భాషా  సాహిత్యకారుదు , ,మాన్సూన్ లాంటి ఎన్నెన్నో డాక్యుమెంటరీ చిత్రాలు తీసి మెప్పుపొందిన సినిమాటోగ్రఫీ నిష్ణాతుదు  అయిన డా.పతి అంటే పిట్టమండలం వెంకటాచలపతి ని మనం మర్చిపోయాం .ఆయన గురించి వీకీపీడియాలో,తెలుగు వెలుగులు లో కనిపించలేదు .ఫోటో కూడా లేదు.శ్రీ సంజీవదేవ్ తన ఆత్మకధ ‘’తుమ్మపూడి’’ లో  ఈ విషయాలు రాయకపోతే మనకు అస్సలు తెలిసేదికాదు .

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-25-ఉయ్యూరు . 

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.13 వ భాగం.21.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.13 వ భాగం.21.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.70 వ భాగం.21.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.70 వ భాగం.21.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.7 వ భాగం.20.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.7 వ భాగం.20.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.42 వ భాగం.20.10.25

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.42 వ భాగం.20.10.25

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.12 వ భాగం.20.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.12 వ భాగం.20.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.69 వ భాగం.20.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.6 వ భాగం.19..10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.6 వ భాగం.19..10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.41 వ భాగం.19.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.41 వ భాగం.19.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.41 వ భాగం.19.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.41 వ భాగం.19.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.41 వ భాగం.19.10.25.

Posted in రచనలు | Leave a comment

18వ శతాబ్ది  ఇంగ్లాండ్ ఇంప్రెషనలిస్ట్ ,రొమా౦టిక్ కళకు మార్గదర్శకుడు ‘’,హి౦సాత్మక సముద్ర చిత్రాలకు’’ ప్రసిద్ధి చెంది జాన్ రస్కిన్ ప్రశంస పొందిన ప్రింట్ మేకర్ -జె.ఎం.డబ్ల్యు.టర్నర్

18వ శతాబ్ది  ఇంగ్లాండ్ ఇంప్రెషనలిస్ట్ ,రొమా౦టిక్ కళకు మార్గదర్శకుడు ‘’,హి౦సాత్మక సముద్ర చిత్రాలకు’’ ప్రసిద్ధి చెంది జాన్ రస్కిన్ ప్రశంస పొందిన ప్రింట్ మేకర్ -జె.ఎం.డబ్ల్యు.టర్నర్

జోసెఫ్ మల్లోర్డ్ విలియం టర్నర్ RA (23 ఏప్రిల్ 1775 – 19 డిసెంబర్ 1851), అతని కాలంలో విలియం టర్నర్ అని పిలుస్తారు,   ఆంగ్ల రొమాంటిక్ చిత్రకారుడు, ప్రింట్ మేకర్ మరియు జలవర్ణ చిత్రకారుడు. అతను తన వ్యక్తీకరణ రంగులు వేయడం, ఊహాత్మక ప్రకృతి దృశ్యాలు మరియు అల్లకల్లోలమైన, తరచుగా హింసాత్మక సముద్ర చిత్రాలకు ప్రసిద్ధి చెందాడు. అతని కళాత్మక శైలి అతని జీవితకాలంలో అభివృద్ధి చెందింది, రొమాంటిసిజం నుండి దూరంగా వెళ్ళింది – వాస్తవికత యొక్క క్రింది పెరుగుతున్న శైలిని దాటింది – మరియు, బదులుగా, అతని తరువాతి రచనలు అతని మరణం తరువాత దశాబ్దాలలో ఉద్భవించిన తరువాతి ఇంప్రెషనిస్ట్ మరియు వియుక్త కళ ఉద్యమాలకు ముఖ్యమైన పూర్వగామి మరియు పూర్వగామిగా ఉన్నాయి.  అతను 550 కంటే ఎక్కువ ఆయిల్ పెయింటింగ్‌లు, 2,000 జలవర్ణాలు మరియు కాగితంపై 30,000 రచనలను వదిలి వెళ్ళాడు.  అతను 1840 నుండి ప్రముఖ ఆంగ్ల కళా విమర్శకుడు జాన్ రస్కిన్ చేత సమర్థించబడ్డాడు మరియు నేడు ల్యాండ్‌స్కేప్ పెయింటింగ్‌ను చరిత్ర చిత్రలేఖనానికి పోటీగా ఉన్నత స్థాయికి పెంచినట్లు పరిగణించబడ్డాడు.

టర్నర్ లండన్‌లోని కోవెంట్ గార్డెన్‌లోని మైడెన్ లేన్‌లో ఒక నిరాడంబరమైన దిగువ-మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు.  విజయం  కీర్తి యొక్క ఉచ్చులను జాగ్రత్తగా తప్పించుకుంటూ తన దిగువ తరగతి యాసను నిలుపుకున్నాడు. బాల  మేధావి అయిన టర్నర్ 1789 నుండి రాయల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్‌లో చదువుకున్నాడు, 14 సంవత్సరాల వయసులో చేరాడు మరియు 15 సంవత్సరాల వయస్సులో తన మొదటి పనిని అక్కడ ప్రదర్శించాడు. ఈ కాలంలో, అతను ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మన్‌గా కూడా పనిచేశాడు. అతను కమీషన్లు మరియు అమ్మకాల నుండి స్థిరమైన ఆదాయాన్ని సంపాదించాడు, అతని సమస్యాత్మక మరియు విరుద్ధమైన స్వభావం కారణంగా అతను తరచుగా దానిని అంగీకరించలేదు. అతను 1804లో తన సొంత గ్యాలరీని ప్రారంభించాడు  1807లో అకాడమీలో దృక్పథం ప్రొఫెసర్ అయ్యాడు, అక్కడ అతను 1828 వరకు ఉపన్యాసాలు ఇచ్చాడు. అతను 1802 నుండి యూరప్ చుట్టూ పర్యటించాడు, సాధారణంగా భారీ స్కెచ్‌బుక్‌లతో తిరిగి వచ్చాడు.

తీవ్రంగా ప్రైవేట్, అసాధారణ మరియు ఏకాంతంగా ఉండే టర్నర్ తన కెరీర్ అంతటా వివాదాస్పద వ్యక్తి. అతను వివాహం చేసుకోలేదు, కానీ వితంతువు సారా డాన్బీ ద్వారా ఎవెలినా (1801–1874) మరియు జార్జియానా (1811–1843) అనే ఇద్దరు కుమార్తెలకు తండ్రి అయ్యాడు. అతను పెద్దయ్యాక మరింత నిరాశావాదిగా మరియు దిగులుగా మారాడు, ముఖ్యంగా 1829లో తన తండ్రి మరణించిన తర్వాత; అతని దృక్పథం క్షీణించినప్పుడు, అతని గ్యాలరీ శిథిలావస్థకు చేరుకుంది మరియు నిర్లక్ష్యం చేయబడింది మరియు అతని కళ తీవ్రమైంది. 1841లో, టర్నర్ థేమ్స్‌లోకి ఒక పడవను నడిపాడు, తద్వారా ఆ సంవత్సరం జనాభా లెక్కల్లో అతను ఏ ఆస్తిలోనూ ఉన్నట్లు లెక్కించబడలేదు.  అతను 1845 నుండి పేదరికంలో మరియు అనారోగ్యంతో నివసించాడు మరియు 1851లో లండన్‌లో 76 సంవత్సరాల వయస్సులో మరణించాడు. టర్నర్‌ను లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్‌లో ఖననం చేశారు.

“అతను కొన్నిసార్లు నెపోలియన్ మరియు డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ జన్మించిన సంవత్సరంలోనే జన్మించాడని మాట్లాడాడు” ఇది టర్నర్ జన్మ తేదీని 1769గా ఉంచుతుంది.

“టర్నర్ జన్మస్థలం ఇటీవల కొంతమందికి సందేహాస్పదంగా కనిపించినందున, అతను బార్న్‌స్టాపుల్‌లో జన్మించాడని, మైడెన్-లేన్‌లో లేదా సౌత్ మోల్టన్‌లో జన్మించలేదని నేను ఇక్కడ గమనించవచ్చు, అతని స్వంత మాటలకు ఏదైనా సరిపోతుంటే.” సైరస్ రెడ్డింగ్ ఫ్రేజర్ మ్యాగజైన్ ఫిబ్రవరి 1852.

టర్నర్ తండ్రి విలియం టర్నర్ (1745–1829) 1770లో డెవాన్‌లోని సౌత్ మోల్టన్ నుండి లండన్‌కు వెళ్లారు.

జోసెఫ్ మాల్లోర్డ్ విలియం టర్నర్ 1775 ఏప్రిల్ 23న జన్మించాడు మరియు మే 14న బాప్టిజం పొందాడు. అతను లండన్‌లోని కోవెంట్ గార్డెన్‌లోని మైడెన్ లేన్‌లో జన్మించాడు. అతని తండ్రి క్షురకుడు మరియు విగ్ తయారీదారు.అతని తల్లి, మేరీ మార్షల్, కసాయిల కుటుంబం నుండి వచ్చింది. ఒక చెల్లెలు, మేరీ ఆన్, సెప్టెంబర్ 1778లో జన్మించింది కానీ ఆగస్టు 1783లో మరణించింది.

టర్నర్ తల్లి 1785 నుండి మానసిక రుగ్మతకు గురయ్యారు మరియు 1799లో ఓల్డ్ స్ట్రీట్‌లోని సెయింట్ లూక్స్ హాస్పిటల్ ఫర్ లూనాటిక్స్‌లో చేరారు. ఆమెను 1800లో బెత్లెమ్ హాస్పిటల్‌కు తరలించారు, అక్కడ ఆమె 1804లో మరణించింది. టర్నర్‌ను అతని మామ, బ్రెంట్‌ఫోర్డ్‌లోని కసాయిదారుడు  జోసెఫ్ మల్లోర్డ్ విలియం మార్షల్ వద్దకు [ఎప్పుడు?] పంపారు, అప్పట్లో లండన్‌కు పశ్చిమాన థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం, టర్నర్ అక్కడ చదువుకున్నాడు. టర్నర్ చేసిన తొలి కళాత్మక వ్యాయామం ఈ కాలం నాటిది – హెన్రీ బోస్‌వెల్ యొక్క పిక్చర్స్క్యూ వ్యూ ఆఫ్ ది యాంటిక్విటీస్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ నుండి చెక్కబడిన ప్లేట్ల యొక్క సాధారణ రంగుల శ్రేణి]

1786 ప్రాంతంలో, టర్నర్‌ను ఈశాన్య కెంట్ తీరంలోని మార్గేట్‌కు పంపారు. అక్కడ అతను పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాల డ్రాయింగ్‌ల శ్రేణిని గీశాడు, అది అతని తదుపరి పనిని ముందే సూచిస్తుంది. ఈ సమయానికి, టర్నర్ డ్రాయింగ్‌లు అతని తండ్రి దుకాణంలో ప్రదర్శించబడ్డాయి మరియు కొన్ని షిల్లింగ్‌లకు అమ్ముడయ్యాయి. అతని తండ్రి కళాకారుడు థామస్ స్టోథార్డ్‌తో ఇలా ప్రగల్భాలు పలికాడు: “నా కొడుకు, సర్, చిత్రకారుడు కాబోతున్నాడు”. 1789లో, టర్నర్ మళ్ళీ సన్నింగ్‌వెల్ (ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో భాగం) కు పదవీ విరమణ చేసిన తన మామతో నివసించాడు. బెర్క్‌షైర్‌లోని ఈ సమయం నుండి వచ్చిన మొత్తం స్కెచ్‌బుక్ అలాగే ఆక్స్‌ఫర్డ్ యొక్క వాటర్ కలర్ మిగిలి ఉంది. తరువాత పూర్తయిన చిత్రాలకు పునాదిగా, ప్రదేశంలో పెన్సిల్ స్కెచ్‌లను ఉపయోగించడం, అతని మొత్తం కెరీర్‌కు అవసరమైన పని శైలికి ఆధారం అయ్యింది.

టర్నర్ చేసిన అనేక ప్రారంభ స్కెచ్‌లు వాస్తుశిల్ప అధ్యయనాలు లేదా దృక్పథంలో వ్యాయామాలు, యువకుడిగా, అతను థామస్ హార్డ్‌విక్, జేమ్స్ వ్యాట్ మరియు జోసెఫ్ బోనోమి ది ఎల్డర్‌తో సహా అనేక మంది వాస్తుశిల్పుల కోసం పనిచేశాడని తెలుసు. 1789 చివరి నాటికి, అతను లండన్ వీక్షణలలో ప్రత్యేకత కలిగిన టోపోగ్రాఫికల్ డ్రాఫ్ట్స్‌మన్ థామస్ మాల్టన్ వద్ద అధ్యయనం చేయడం ప్రారంభించాడు. టర్నర్ అతని నుండి బ్రిటిష్ కోటలు మరియు అబ్బేల అవుట్‌లైన్ ప్రింట్‌లను కాపీ చేయడం మరియు రంగులు వేయడం వంటి వ్యాపారం యొక్క ప్రాథమిక ఉపాయాలను నేర్చుకున్నాడు. తరువాత అతను మాల్టన్‌ను “నా నిజమైన మాస్టర్” అని పిలిచాడు.  టోపోగ్రఫీ ఒక అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ, దీని ద్వారా ఒక యువ కళాకారుడు తన అధ్యయనాలకు డబ్బు చెల్లించవచ్చు.

కెరీర్

టర్నర్ 1789లో 14 సంవత్సరాల వయస్సులో రాయల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్‌లో ప్రవేశించాడు, మరియు ఒక సంవత్సరం తర్వాత సర్ జాషువా రేనాల్డ్స్ అకాడమీలో చేరాడు. అతను ఆర్కిటెక్చర్‌పై తొలి ఆసక్తిని కనబరిచాడు కానీ హార్డ్‌విక్ పెయింటింగ్‌పై దృష్టి పెట్టమని సలహా ఇచ్చాడు. టర్నర్ 15 సంవత్సరాల వయసులో 1790లో రాయల్ అకాడమీ వేసవి ప్రదర్శనకు అతని మొదటి వాటర్ కలర్, ఎ వ్యూ ఆఫ్ ది ఆర్చ్ బిషప్ ప్యాలెస్, లాంబెత్‌ను అంగీకరించారు.

అకాడమీ ప్రొబెషనర్‌గా, టర్నర్ పురాతన శిల్పాల ప్లాస్టర్ కాస్ట్‌ల నుండి డ్రాయింగ్ నేర్పించారు. జూలై 1790 నుండి అక్టోబర్ 1793 వరకు, అతని పేరు అకాడమీ రిజిస్ట్రీలో వందకు పైగా కనిపిస్తుంది. జూన్ 1792లో, నగ్న నమూనాల నుండి మానవ శరీరాన్ని గీయడం నేర్చుకోవడానికి అతను లైఫ్ క్లాస్‌లో చేరాడు. టర్నర్ ప్రతి సంవత్సరం అకాడమీలో శీతాకాలంలో పెయింటింగ్ చేస్తూ మరియు వేసవిలో బ్రిటన్ అంతటా, ముఖ్యంగా వేల్స్‌కు విస్తృతంగా ప్రయాణిస్తూ నీటి రంగులను ప్రదర్శించాడు, అక్కడ అతను అధ్యయనాలు మరియు నీటి రంగులను రూపొందించడానికి విస్తృత శ్రేణి స్కెచ్‌లను రూపొందించాడు. ఇవి ముఖ్యంగా వాస్తుశిల్ప పనిపై దృష్టి సారించాయి, ఇది డ్రాఫ్ట్స్‌మన్‌గా అతని నైపుణ్యాలను ఉపయోగించింది. 1793లో, అతను ది రైజింగ్ స్క్వాల్, హాట్ వెల్స్ (2024 వరకు కోల్పోయింది) అనే తైల చిత్రాన్ని చూపించాడు, ఇది అతని తరువాతి వాతావరణ ప్రభావాలను ముందే సూచించింది. బ్రిటిష్ రచయిత పీటర్ కన్నింగ్‌హామ్, టర్నర్ సంస్మరణ పత్రంలో, దీనిని ఇలా వ్రాశాడు: “ల్యాండ్‌స్కేప్ కళను మచ్చిక చేసుకున్న జడల నుండి బయటకు తీసుకురావడానికి ఒక గొప్ప ప్రయత్నంగా తెలివైన కొద్దిమందిచే గుర్తించబడింది … అతను ఇప్పుడు న్యాయంగా జరుపుకోబడుతున్న ప్రభావ నైపుణ్యాన్ని మొదటిసారిగా చూపించాడు”.

1796లో, టర్నర్ ఫిషర్‌మెన్ ఎట్ సీని ప్రదర్శించాడు, ఇది ఐల్ ఆఫ్ వైట్ నుండి నీడిల్స్ యొక్క రాత్రిపూట చంద్రకాంతి దృశ్యం, ఇది ప్రమాదంలో ఉన్న పడవల చిత్రం.ఈ చిత్రం “18వ శతాబ్దపు కళాకారులు సముద్రం గురించి చెప్పిన ప్రతిదాని సారాంశం” అని విల్టన్ చెప్పాడు మరియు క్లాడ్ జోసెఫ్ వెర్నెట్, ఫిలిప్ జేమ్స్ డి లౌథర్‌బోర్గ్, పీటర్ మోనామీ మరియు ఫ్రాన్సిస్ స్వైన్ వంటి కళాకారుల బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది,

టర్నర్ రచనలు సమకాలీనుల నుండి విమర్శలను ఎదుర్కొన్నాయి. 1840 రాయల్ అకాడమీ ఎగ్జిబిషన్ యొక్క అనామక సమీక్ష, తరువాత జాన్ ఈగల్స్ గా గుర్తించబడింది, ప్రదర్శించబడిన చిత్రాలను “ప్రదర్శనను అవమానించే అసంబద్ధమైన దుబారా” అని పిలిచింది.  ల్యాండ్‌స్కేప్ చిత్రకారుడు మరియు రాయల్ అకాడమీ సహ సభ్యుడు సర్ జార్జ్ బ్యూమాంట్ అతని చిత్రాలను “మచ్చలు”గా అభివర్ణించారు.

ప్రింట్‌మేకింగ్‌లో టర్నర్ యొక్క ప్రధాన ప్రయత్నమే లిబర్ స్టూడియోరం (బుక్ ఆఫ్ స్టడీస్), అతను 1806 నుండి 1819 వరకు డెబ్బై ప్రింట్‌లపై పనిచేశాడు. లిబర్ స్టూడియోరం అనేది ల్యాండ్‌స్కేప్ కళ పట్ల అతని ఉద్దేశ్యాల వ్యక్తీకరణ. ఈ ఆలోచన క్లాడ్ లోరైన్ యొక్క లిబర్ వెరిటాటిస్ (బుక్ ఆఫ్ ట్రూత్) ఆధారంగా ఉంది, అక్కడ క్లాడ్ తన పూర్తి చేసిన చిత్రాలను రికార్డ్ చేశాడు; అప్పటికి డెవాన్‌షైర్ హౌస్‌లో ఈ డ్రాయింగ్‌ల ప్రింట్ కాపీల శ్రేణి భారీ ప్రచురణ విజయాన్ని సాధించింది. టర్నర్ యొక్క ప్లేట్‌లను విస్తృతంగా వ్యాప్తి చేయడానికి ఉద్దేశించబడింది మరియు శైలిని ఆరు రకాలుగా వర్గీకరించారు: మెరైన్, మౌంటెనస్, పాస్టోరల్, హిస్టారికల్, ఆర్కిటెక్చరల్ మరియు ఎలివేటెడ్ లేదా ఎపిక్ పాస్టోరల్. అతని ముద్రణ అతని ఉత్పత్తిలో ప్రధాన భాగం, మరియు దీనికి అంకితం చేయబడిన మ్యూజియం, ఫ్లోరిడాలోని సరసోటాలో టర్నర్ మ్యూజియం, 1974లో డగ్లస్ మాంట్రోస్-గ్రేమ్ తన టర్నర్ ప్రింట్ల సేకరణను ఉంచడానికి స్థాపించారు.

టింటెర్న్ అబ్బే (1795) వంటి అతని ప్రారంభ రచనలు ఇంగ్లీష్ ప్రకృతి దృశ్యం యొక్క సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నాయి. హన్నిబాల్ క్రాసింగ్ ది ఆల్ప్స్ (1812)లో, ప్రకృతి యొక్క విధ్వంసక శక్తిపై ప్రాధాన్యత ఇప్పటికే అమలులోకి వచ్చింది. అతను ఆయిల్ పెయింట్స్‌తో వాటర్ కలర్ టెక్నిక్‌ను ఉపయోగించిన అతని విలక్షణమైన చిత్రలేఖన శైలి తేలిక, నిష్ణాతులు మరియు అశాశ్వత వాతావరణ ప్రభావాలను సృష్టించింది.

టర్నర్ యొక్క తరువాతి సంవత్సరాల్లో, అతను నూనెలను మరింత పారదర్శకంగా ఉపయోగించాడు మరియు మెరిసే రంగును ఉపయోగించడం ద్వారా దాదాపు స్వచ్ఛమైన కాంతిని ప్రేరేపించడానికి మారాడు. అతని పరిణతి చెందిన శైలికి ప్రధాన ఉదాహరణ రెయిన్, స్టీమ్ మరియు స్పీడ్ – ది గ్రేట్ వెస్ట్రన్ రైల్వేలో చూడవచ్చు, ఇక్కడ వస్తువులు గుర్తించబడవు. రంగు తీవ్రత మరియు ఎవన్సెంట్ లైట్ పట్ల ఆసక్తి టర్నర్ రచనలను ఇంగ్లీష్ పెయింటింగ్‌లో అగ్రగామిగా ఉంచడమే కాకుండా ఫ్రాన్స్‌లోని కళపై ప్రభావం చూపాయి; ఇంప్రెషనిస్టులు, ముఖ్యంగా క్లాడ్ మోనెట్, అతని పద్ధతులను జాగ్రత్తగా అధ్యయనం చేశారు. అతను సాధారణంగా నైరూప్య చిత్రలేఖనానికి పూర్వగామిగా కూడా పరిగణించబడ్డాడు.

1816లో, “వేసవి లేని సంవత్సరం” సందర్భంగా వాతావరణంలో అధిక స్థాయిలో అగ్నిపర్వత బూడిద (మౌంట్ టాంబోరా విస్ఫోటనం నుండి) ఈ కాలంలో అసాధారణంగా అద్భుతమైన సూర్యాస్తమయాలకు దారితీసింది మరియు టర్నర్ యొక్క కొన్ని రచనలకు ప్రేరణగా నిలిచింది.

జాన్ రస్కిన్ మాట్లాడుతూ, బెడ్లాం ప్రిన్సిపల్ ఫిజీషియన్ మరియు కలెక్టర్ మరియు అమెచ్యూర్ కళాకారుడు అయిన థామస్ మన్రో టర్నర్ శైలిపై గణనీయమైన ప్రభావాన్ని చూపాడని చెప్పాడు:

అతని నిజమైన గురువు డాక్టర్ మన్రో; ఆ మొదటి పోషకుడి ఆచరణాత్మక బోధన మరియు అతని స్నేహితుడు గిర్టిన్ అతనిచే క్రమశిక్షణ పొంది, అతని స్నేహితుడు గిర్టిన్ తోడుగా ఉన్న వాటర్ కలర్ అధ్యయన పద్ధతి యొక్క తెలివైన సరళత కారణంగా, గ్రేటర్ పవర్ యొక్క ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన అభివృద్ధి ప్రధానంగా ఆపాదించబడుతుంది; శక్తి యొక్క గొప్పతనాన్ని అతిగా అంచనా వేయడం అసాధ్యం.

అనేక మంది యువ కళాకారులతో కలిసి, టర్నర్ మన్రో లండన్ ఇంట్లో, తన కాలంలోని ప్రధాన స్థలాకృతి చిత్రకారుల రచనలను కాపీ చేయగలిగాడు మరియు డ్రాయింగ్‌లో తన నైపుణ్యాలను పరిపూర్ణం చేసుకోగలిగాడు. కానీ జాన్ రాబర్ట్ కోజెన్స్ వాటర్ కలర్స్ యొక్క ఆసక్తికరమైన వాతావరణ ప్రభావాలు మరియు భ్రమలు, వాటిలో కొన్ని మన్రో ఇంట్లో ఉన్నాయి, స్థలాకృతి యొక్క చక్కని రెండరింగ్‌ల కంటే చాలా ముందుకు వెళ్ళాయి. అతని ఆల్పైన్ వీక్షణల యొక్క గంభీరమైన వైభవం యువ టర్నర్‌కు ప్రారంభ ద్యోతకం మరియు అతనికి వాటర్ కలర్ మాధ్యమం యొక్క నిజమైన సామర్థ్యాన్ని చూపించింది, సమాచారానికి బదులుగా మానసిక స్థితిని తెలియజేస్తుంది.

మెటీరియల్స్

టర్నర్ అనేక రకాల వర్ణద్రవ్యాలతో ప్రయోగాలు చేశాడు.అతను కార్మైన్ వంటి సూత్రీకరణలను ఉపయోగించాడు, అవి ఎక్కువ కాలం ఉండవు అని తెలిసినప్పటికీ, మరియు మరింత మన్నికైన వర్ణద్రవ్యాలను ఉపయోగించాలనే సమకాలీన నిపుణుల సలహాకు వ్యతిరేకంగా. ఫలితంగా, అతని రంగులు చాలా వరకు ఇప్పుడు మసకబారాయి. రస్కిన్ తన పని ఎంత త్వరగా క్షీణించిందో ఫిర్యాదు చేశాడు; టర్నర్ సంతానం పట్ల ఉదాసీనంగా ఉన్నాడు మరియు తాజాగా వర్తించినప్పుడు మంచిగా కనిపించే పదార్థాలను ఎంచుకున్నాడు. 1930 నాటికి, అతని నూనె చిత్రాలు మరియు నీటి రంగులు రెండూ వాడిపోతున్నాయనే ఆందోళన ఉంది.

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య 11 వ భాగం..19.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య 11 వ భాగం..19.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.68 వ భాగం.19.10.25


ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.68 వ భాగం.19.10.25.

https://youtu.be/xdcGbuSxBhg

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.5 వ భాగం.18.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.5 వ భాగం.18.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.5 వ భాగం.18.10.25.
https://youtu.be/SzuZRb6ApzI

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి. లో 40 వ భాగం 18.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి. లో 40 వ భాగం 18.10.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.10 వ భాగం.18.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.10 వ భాగం.18.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.67 వ భాగం.18.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.67 వ భాగం.18.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.67 వ భాగం.18.10.25.

Posted in రచనలు | Leave a comment

  సుప్రసిద్ధ  వాగ్గేయ కారులు శ్రీ హరి నాగభూషణం గారి చేతులమీదుగా ‘’సువర్ణ ఘంటా కంకణం ‘’పొందిన ప్రముఖ హార్మోనిస్ట్ -శ్రీ అంబా ప్రసాద్

  సుప్రసిద్ధ  వాగ్గేయ కారులు శ్రీ హరి నాగభూషణం గారి చేతులమీదుగా ‘’సువర్ణ ఘంటా కంకణం ‘’పొందిన ప్రముఖ హార్మోనిస్ట్ -శ్రీ అంబా ప్రసాద్

 గారి గురించి మనం మర్చే పోయాం .చిన్నప్పుడే పెద్దన్న గారు వెంకట రావు గారి వద్ద హార్మోనియం లో అక్షరాభ్యాసం చేశారు అంబా ప్రసాద్ .నిజాం  రాష్ట్ర ఆస్థాన విద్వాంసులు శ్రీ హరిరామ చంద్ర రావు గారి వద్ద హార్మోనియం మెళకువలు నేర్చారు .విశేష శ్రమ చేసి హార్మోనియం విద్య ను కైవశం చేసుకొన్నారు .అంతటి విద్వాంసుడు లేడు ఆని పించుకొన్నారు .

  హిందూ స్థానీ సంగీతం లో  ఉద్దండులైన శ్రీఅబ్డుల్ కరీం ఖాన్ ,శ్రీ ఉస్తాద్ సయ్యద్ ఖాన్ లకు హార్మోనియం సహకారం అందించి ఎన్నో కచేరీలలో అంబా ప్రసాద్ పాల్గొని మెప్పు పొందారు .అప్పటికి శిష్టులు హార్మోనియం ‘’శాస్త్రీయ వాయిద్యం కాదు ‘’ఆని గగ్గోలు పెట్టి ఘోషిస్తున్నా , అంబా ప్రసాద్ హార్మోనియం తోనే రసజ్ఞుల ను అలరించి హార్మోనియం ఘనతను లోకాని చాటి చెప్పి తానూ పేరు ప్రఖ్యాతులు పొందారు .

  హార్మోనియం పై అంబా ప్రసాద్ కృషికి గుర్తింపుగా మచిలీ పట్నానికి చెందిన సుప్రసిద్ధ వాగ్గేయ కారులు శ్రీ హరి నాగభూషణం గారి  అధ్యక్షతన ‘’సువర్ణ ఘంటా కంకణం ‘’పొంది ఘనంగా  సన్మానించ బడ్డారు .అనేక ఆస్థానాలలో సన్మానాలు పొందారు .చాలా సంగీత సంస్థలతో  అంబా ప్రసాద్ సంబంధం కలిగి హార్మోనియం సంగీతాభి వృద్ధికి విశేష కృషి చేశారు .హార్మోనియం శాస్త్రీయ సంగీతం ఆని నిరూపించి ,ప్రపంచ స్థాయి గౌరవాన్ని ,నాటకాలలో ముఖ్య స్థానాన్నీ కల్పించిన శ్రీ అంబా ప్రసాద్ గురించి ఈ తరానికే అస్సలు తెలియక పోవటం దురదృష్టం .ఆయన జనన  మరణాలు చదువు ,ఇతర జీవిత విశేషాలు మనకేమీ తెలియవు .ఈ మాత్రమైనా తెలిశాయంటే అది డా వెలగా వెంకటప్పయ్య గారి వలననే .

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

117వ నూతన మూలక౦ ‘’టేన్నేస్సిన్ ‘’ ఆవిష్కరించిన శాస్త్రవేత్త డా.శ్రీ ఆకునూరి వెంకట రామయ్య

117వ నూతన మూలక౦ ‘’టేన్నేస్సిన్ ‘’ ఆవిష్కరించిన శాస్త్రవేత్త డా.శ్రీ ఆకునూరి వెంకట రామయ్య

గారు నిన్న 16-10-25-గురువారం ఉదయం  అమెరికాలో టేన్నేస్సి రాష్ట్రం నాష్ విల్ లో స్వగృహం లో మరణించారు .వారి ఆత్మకు శాంతి కలగాలని ,వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను –

 డా .రామయ్య గారి గురించి వివరాలు –

  జననం విద్యాభ్యాసం

15-8-1938 న శ్రీ ఆకునూరి వెంకటరావు శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.వీరిది ఉయ్యూరు దగ్గర ఆకునూరు .తాతగారు వెంకట రామయ్య గారు ఆకునూరు నుంచి గోదావరిజిల్లా కొవ్వూరు లోని ఆకునూరి వారికి దత్తత వెళ్లారు .గ్రామకరణాలు .తండ్రి బెజవాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడు డా.రామయ్యగారు సివి ఆర్ హైస్కూల్ లో చదివి 1950 లో ఎస్ ఎస్ ఎల్సి పాసై ,ఎస్ ఆర్ ఆర కాలేజిలో ఇంటర్ పాసై ,విశాఖ ఆంధ్రా యూని వర్సిటిలో 1957లో బీస్ సి ఆనర్స్ ,1958లో న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం ఎస్సి ఫస్ట్ క్లాస్ సెకండ్ రాంక్ లో పాసయ్యారు .

 అమెరికాలో ఉద్యోగం

అప్పటి న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ డా .స్వామి జ్ఞానానంద సలహా రికమండేషన్ తో అమెరికా వెళ్లి ఇండియానా యూని వర్సిటిలో న్యూక్లియర్ స్ట్రక్చర్ అంటే అణునిర్మాణం పై పరిశోధన చేసి పిహెచ్ డి పొందారు.1964వాండర్ బిల్ట్ యూని వర్సిటిలో హామిల్టన్ తోకలిసి పరిశోధనలు చేశారు .రాజమండ్రికి చెందిన శ్రీమతి కృష్ణమయి ని వివాహమాడి ఒకమ్మాయి అబ్బాయిఅలకు జన్మ నిచ్చారు .రిసెర్చ్ అసోసియేట్ గా ,ప్రొఫెసర్ గా విజిటింగ్ ప్రొఫెసర్ గా 198౦నుంచి  నేటి వరకు వాండర్ బిల్ట్ యూనివర్సిటి ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు .

  రచనలు

  రామయ్యగారి రచనలు ప్రపంచ వ్యాప్తంగా 4వేల లైబ్రరీలలో స్థానం పొందాయి .జర్నల్ పబ్లికేషన్స్ వందల సంఖ్యలో ఉన్నాయి పరిశోధకులకు కల్ప వృక్షం గా ‘’కర్రిక్యులం విటే’’(సి..వి .)రాశారు .

పొందిన గౌరవాలు

రామయ్యగారు ఉంటున్న  టేన్నేస్సి రాష్ట్ర ఆరుగురు ప్రముఖులలో రామయ్య గారు ఒకరు .అమెరికన్ ఫిజికల్ సొసైటీ ఫెలో .సిగ్మ ఎక్స్ రె ప్రెసిడెంట్ .రుమేనియా బుఖారెస్ట్ యూని వర్సిటీలనుంచి ‘’అనోరియా ‘’పొందారు .వాండర్ బిల్ట్ యూని వర్సిటి ఉత్తమ భౌతిక శాస్త్ర బోధనా పురస్కారం అందించింది .ఈస్టర్న్ కెంటకి యూని వర్సిటి ,గురుఘాసీ యూని వర్సిటీలు గౌరవ డి ఎస్ సి అందించాయి .గె అండ్ రెబెక్కా  సంస్థ ఫిజిక్స్ లోఎక్సేలేంట్ టీచింగ్ కు ఫాల్మన్ అవార్డ్ ప్రదానం చేసింది .

  రామయ్య గారి ప్రత్యేకత

  భారతదేశం లో ఏ ఒక్క సైంటిస్ట్ కూడా పీరియాడికల్ టేబుల్ లో ఒక్క మూలకం ఎలిమెంట్ ను కూడా కనుక్కోలేదు. అలాంటిది మన ఆంధ్రుడైన ఈ సైంటిస్ట్ 117వ మూలకం టేన్నేస్సిన్ (Ts)కనిపెట్టి జగద్విఖ్యాతిపొందారు .ఆయన గురించి ఆంధ్రులకు ,మన దేశానికీ పెద్దగా తెలియదు ఎవరు గుర్తించి నట్లు కనబడదు .వారిపై నేను కరదీపిక లాంటి పుస్తకం రాయటంనా అదృష్టం .అంతకుముందు  మా ఉయ్యూరు శాస్త్రవేత్త  రష్యాలో స్థిరపడ్డ కేమటాలజి పిత డా కోలాచల సీతారామయ్య గారి గురించి , 117వమూలకం ‘టేన్నిస్సిన్ ‘’ఆవిష్కరించిన డా.ఆకునూరి వెంకట రామయ్య  గారి గురించి ,ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధన పిత గుంటూరు లో జన్మించి అమెరికాలో స్థిరపడిన  డా.పుచ్చ వెంకటేశ్వర్లు గారి గురించి పుస్తకాలు రాసి సరసభారతి ద్వారా ప్రచురించటం  నా సుకృతం .పుచ్చా వారి పుస్తకాన్ని డా రామయ్య గారికి అ౦కితమిచ్చాం .

  రామయ్య గారి పుస్తకం మూడు చోట్ల ఒకే వ్యక్తితో ఆవిష్కరణ

 డా.రామయ్య గారి పుస్తకం అమెరికా లో టేన్నేస్సి రాష్ట్రం  నాష్ విల్ లో రామయ్య గారి స్వగృహం లో సరసభారతి అభిమాని స్పాన్సర్ శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి ద౦పతుల ఆధ్వర్యంలో 16-10-1918 ,న,మొదటిసారి ,అలబామా రాష్ట్రం మైనేని వారి  హ౦ట్స్ విల్ దగ్గరలోని మాడిసన్ లోన్17-10-1918న రెండవసారి , మూడవ సారి ఉయ్యూరులో సరసభారతి శ్రీ వికారి సంవత్సర ఉగాది వేడుకలలో 30-3-1919 న రామయ్య గారి బంధు మిత్రుల సమక్షం లో శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించి రికార్డ్ సృష్టించారు .

రామయ్య గారిపై పుస్తకం రాయటం ప్రారంభించిన దగ్గరనుండి రామయ్య కృష్ణమయి  దంపతులతో అనేక సార్లు ఫోన్ లో మాట్లాడి విషయ సేకరణ చేశాను .ఆతర్వాత నుంచి తరచుగా మా మధ్య ఫోన్ సంభాషణ జరుగుతూనే ఉంది.కృష్ణమయి గారు సరసభారతి బ్లాగ్ ఫాలోయర్ .సరసభారతి ఫేస్ బుక్  లైవ్ ప్రోగ్రాం వ్యూయర్ కూడా.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-10-25-ఉయ్యూరు

  రామయ్య గారి పరిశోధనా విశేషాలు

శ్రీ ఆకునూరి రామయ్య ,20 మంది బృందం కలిసి 2010 లో పీరియాడిక్ టేబుల్ లో 11 7 వ మూలకం కనిపెట్టారు .ఇటీవలే దానికి ‘’టేన్నేస్సిన్ ‘’అని నామకరణం చేశారు .దీని సింబల్  ‘’Ts’’.ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ రామయ్యగారు  వాండర్ బిల్ట్ యూనివర్సిటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్ .ఈ ఆవిష్కరణకు ఆయనను, ఆయన తోపాటు పనిచేసిన జోసెఫ్ హామిల్టన్ నూ టెన్నెస్సీ కాంగ్రెస్ మన్  జిమ్ కూపర్  ఈ మధ్యనే ఘనంగా సత్కరించారు .వారు పని చేస్తున్న యూనివర్సిటి టెన్నెస్సీ రాష్ట్రం లో ఉన్నందున అ మూలకానికి ఆ రాష్ట్ర గౌరవార్ధం  ‘’టేన్నేస్సిన్ ‘’అని పేరు పెట్టి తమకూ, తమ రాష్ట్రానికి ఘనకీర్తి నార్జి౦చి పెట్టారు .

ఆంద్ర విశ్వ విద్యాలయం లో చదివి బాచిలర్,  మాస్టర్ డిగ్రీలు  పొంది శ్రీ ఆకునూరి రామయ్య,అమెరికా వెళ్లి  ఇండియానా యూని వర్సిటి లో 1960 లో పి. హెచ్ .డి. సాధించారు .అతిభార మూలకాల ఉనికిపై అత్యంత ఆసక్తి కల ఆయన నిరంతర పరిశోధనల ఫలితమే తాను ఈ ఘన విజయాన్ని సాధించగలిగానని చెప్పారు .ఓక్ రిడ్జ్  నేషనల్ లాబొరేటరి ,రష్యాలోని ఫియర్రోవ్ లాబరేటరి ఫర్ న్యూక్లియర్ రియాక్షన్స్ ,కాలి ఫోర్నియాలోని లారెన్స్ లివర్ మోర్ నేషనల్ లాబరేటరి ,నాక్స్ విల్ లోని యూని వర్సిటి ఆఫ్ టెన్నెస్సీ కి చెందిన రామయ్య ,హామిల్టన్ ,20 మంది రిసేర్చర్స్ కలిసి సాధించిన అతి నూతన మూలకం ఆవిష్కరణ  ఇది .ఈ పరిశోధన ఎక్కువ భాగం రష్యాలో సాగిందని కారణం అక్కడ సైక్లోట్రాన్,రీకాయిల్ మాస్ సర్క్యులేటర్ లు ఉండటమేనని రామయ్య చెప్పారు .ఒకటిన్నర సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనాఫలితం ఇది అన్నారు .

ఈ ఏడాది జులై లో ‘’టేన్నేస్సిన్ ‘’ గా నామకరణం పొందిన ఈ కొత్త మూలకం జీవితకాలం 100 మిల్లి సెకన్లు .రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఉన్న  ఈ కొత్తమూలకాన్ని ‘’హై ఎక్సైటేడ్ స్టేట్ ‘’లోఅంటే అత్యధిక ఉత్తేజిత స్థితి లో  తయారు చేశామని రామయ్య ఉవాచ .ఈ ఆవిష్కరణ  2000 సంవత్సరం లో సూపర్ హెవీ ఎలిమెంట్  ఉండవచ్చు ,దాన్ని కనుగొనవచ్చు అనే ముందస్తు ఊహ అంటే ప్రేడిక్షన్ తో  ప్రారంభమైంది .కాని రామయ్యగారి బృందం ఇటీవలి సంవత్సరాలలోనే దీనిపై పరిశోధించి సాధించారు .’’వర్క్ ఎథిక్’’అయిన తన భర్తకు ఇది అసాధ్యమేమీకాదని రామయ్యగారి భార్య అన్నారు .తమ 51 ఏళ్ళ వైవాహిక జీవితం లో రామయ్యగారిని ఎప్పుడూ  సీరియస్ సైంటిస్ట్ గానే చూశానని భార్య శ్రీమతి కృష్ణ తెలియ జేశారు .రామయ్యగారు తెల్లవారుజామున 2 గంటలకే లేచి లాబరేటరికి వెడతారని ,పరిశోధనలకోసం ప్రపంచమంతా పర్యటిస్తారని ముఖ్యంగా జర్మనికి చాలా సార్లు వెళ్ళారని ,19 82 లో స్ప్రింగ్ సెమిస్టర్ అంతా అక్కడే గడిపారని గుర్తు చేసుకున్నారామే  .తమ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కనుక తానిప్పుడు భర్తతో రిసెర్చ్ ట్రిప్ లకు వెడుతున్నానన్నారు.ఈ ట్రిప్ లలో అనేక దేశాలు చూసే వీలు కలుగుతోందని   తనకు చాలా ఉత్తేజంగా ఉంటున్నాయని రామయ్యగారు పని అంటే తీవ్రమైన భావావేశం, అభిరుచి ఉన్నవారని అంటారు .

తమ ప్రాంతం లో సమావేశాలు జరిగినపుడు వచ్చేవారికి ఆతిధ్యం ఇవ్వటం తమ దంపతులకు ఎంతో ఇష్టంగా ఉంటుందని ,అలాగే ఇతర దేశాలలోనూ తమకు ఆత్మీయ ఆతిధ్యం లభిస్తుందని చెప్పారు  పాక్షిక రిటైర్మెంట్ లో ఉన్న 76 ఏళ్ళ ఈ ఫిజిక్స్ ప్రొఫెసర్ ను ,   వా౦డర్ బిల్ట్ సహచరుడు హామిల్టన్ నూ కలిపి  ఈ యునివర్సిటి  నూతన మూలకా ఆవిష్కకరణకు  గాను ఆగస్ట్ లో జిమ్ కూపర్ ,డి .టేన్న్  లచేత ఘనంగా సత్కరి౦పజేసింది  .దీనితోపాటు ఇండియన్ అమెరికన్ సంఘమూ గుర్తించి సన్మా నించింది .ఇటీవలే ‘’ఇండియా దినోత్సవం ‘’నాడు నాష్ విల్ ఇండియన్ అసోసియేషన్ కూడా సత్కారం చేసింది . . ఆసందర్భంగా ఐ. .ఎ .యెన్ .ప్రెసిడెంట్ హెటేల్ మెహతా’’మాసమక్షం లో ఇంతగొప్ప సైంటిస్ట్ ఉన్నందుకు మేము అదృష్టవంతులం .ఇక్కడి భారతీయ సంతతి కి గర్వకారణం డా రామయ్య గారు .అతి సాధారణ౦ గా   ,నిరాడంబర౦తో మూర్తీభవించిన వినయ సౌజన్య సద్గుణ మూర్తి మత్వం తో  అందరి హృదయాలను ఆకర్షిస్తారు ,గెలుస్తారు ,స్పర్శిస్తారు ‘’అని శ్లాఘించారు      .       ఇండియన్ కమ్యూనిటి సీనియర్ సపోర్ట్  సర్వీసెస్ సంస్థ కూడా రామయ్యగారి కృషికి అభినందన సత్కారం చేసింది .ఐ .సి .ఎస్ .ఎస్ .ఎస్ .సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డా.ప్రమోద్ వాసుదేవ్ ‘’వృత్తిలో నిబద్ధత రామయ్యగారి సుగుణం .వృత్తికి ఎంతటి న్యాయం చేస్తారో మిగిలిన విషయాలలోనూ అలాగే ఉంటారు .పదేళ్ళ క్రితం తండ్రిగారు మరణిస్తే, కుటుంబ బాధ్యత తీసుకొని తమ్ముళ్ళ అభి వృద్ధికి కృషి చేశారు .తమ మనోభావాలకు తగిన అతి సాధారణ జీవితం గడుపుతూ ,వృత్తికీ, కుటుంబానికి అంకిత భావం తో సేవలందిస్తున్న సత్పురుషులు డా రామయ్య ‘’అని మెచ్చుకున్నారు .  తాము ఆవిష్కరించిన కొత్తమూలకం టేన్నేస్సిన్ అత్యంత అస్థిర మూలకం అయినందున ,పీరియాడిక్ టేబుల్ లో స్థిర అటామిక్ నంబర్ ఉన్న హీలియం ,ఆక్సిజన్ లాంటి మూలకాన్ని ఆవిష్కరించే  ప్రయత్నం లో ఉన్న నిర౦తర ప్రయోగ, పరిశోధన శీలి రామయ్యగారు .’’ఎంతకాలం లో కనుక్కోగలుగుతారు ‘’అని ప్రశ్నిస్తే , ‘’మరి కొన్నేళ్ళ లోనే ‘’అని   ఆశావహం గా బదులిచ్చారు .’’ఇలాంటి ఆవిష్కరణలకు నిర్దేశ కాలపరిమితి అంటూ ఉండదు .నేనూ నా బృందం 120 వ మూలకం  తయారు చేసే   ప్రయత్నం లో ఉన్నాం’.దీనికీ టైం టేబుల్ లేదు .ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది ‘’అన్నారు చిరునవ్వుతో.తాను ఇప్పుడు కొందరు గ్రాడ్యుయేట్ విద్యార్ధులతో కలిసి పని చేస్తున్నానని కానీ 2018 స్ప్రింగ్ సెమిస్టర్ తర్వాత పూర్తిగా రిటైరౌతానని తన మనో నిశ్చయాన్ని నిస్సంకోచంగా తెలిపారు  .మన దేశం రామయ్యగారు విదేశాలలో అద్భుతాలు సాదిస్తున్నదుకు గర్వపడదాం .వారు త్వరలో  కొత్తగా ఆవిష్కరించ బోయే మూలకం కోసం ఎదురు చూస్తూ స్వాగ తీద్దాం .

 ‘’ డా. రామయ్య గారి పైరాసిన పుస్తకం ఇంగ్లీష్  అనువాదం-శుభవార్త  

–సాహితీ బంధువులకు శుభకామనలు  – ప్రముఖ అణుశాస్త్ర వేత్త ,117 వ మూలకం టెన్నిస్సిన్ ను ఆవిష్కరించిన  ఆంద్ర శాస్త్రజ్ఞులు డా ఆకునూరి వెంకటరామయ్య గారి జీవితం పై నేను రాసిన పుస్తకం సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు స్పాన్సర్ చేసి సరసభారతి ద్వారా ప్రచురించటం ,ఆపుస్తకం అమెరికాలో రెండుసార్లు ,ఉయ్యూరులో రామయ్యగారి బంధు మిత్రుల సమక్షం లో సరసభారతి ఉగాది వేడుకలలో మూడవ సారి , మన శాసనమండలి సభ్యులు శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన సంగతి మీకు తెలిసిన విషయమే . 

  డా రామయ్య గారి పుస్తకాన్ని ఇంగ్లీష్  లోకి అనువాదం చేయించామని ,దాన్ని రామయ్య గారు వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా 5గంటలు నిశితంగా పరిశీలించి సవరించి ఆమోదించగా  హై క్వాలిటీ లో  ప్రింటింగ్ కు హైదరాబాద్ లో ఇచ్చినట్లు ,పది రోజులలో పుస్తకాలు రెడీ అవుతాయని మైనేనిగారు సెప్టెంబర్ 25 న నాకు మెయిల్ రాశారననే శుభ వార్త  మీకు తెలియ జేయటానికి సంతోషంగా ఉంది-దుర్గాప్రసాద్  -2-10-20

అమెరికాలో సరసభారతి ఆధ్వర్యంలో గబ్బిట దుర్గాప్రసాద్ రచించిన” అణు శాస్త్రవేత్త డా శ్రీ ఆకునూరు వెంకట రామయ్య ”గ్రంథాన్ని   15-10-18 సోమవారం సాయంత్రం టేనస్సీ రాష్ట్రం నాష్ విల్ లోని  డా రామయ్యగారి స్వగృహం లో  మన శాసన మండలి సభ్యులు వైవిబి రాజేంద్ర ప్రసాద్,ఆవిష్కరించారు .  శాస్త్రవేత్తశ్రీ  వేంకట రామయ్య, దంపతులు, స్పాన్సర్  శ్రీమైనేని గోపాలకృష్ణ  శ్రీమతి భ్రమరాంబ గారు పాల్గొన్నారు -దుర్గా ప్రసాద్

అణు  శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో రెండు చోట్ల ఆవిష్కరణ

సరస భారతి  సాహితీ బంధువులకు దసరా శుభా కాంక్షలు –

నేను రాసి, శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల ప్రాయోజకత్వం లో ,,సరస భారతి చేత  శ్రీ కర్రీ శివ ప్రసాద్, డా  ద్రోణవల్లి రామమోహన రావు గార్ల  నేతృత్వం లో ప్రచురింపబడిన

”అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో టెన్నెస్సీ రాష్ట్రం ” నాష్ విల్ ”లో డా రామయ్యగారి స్వగృహం లో 15-10-18 సోమవారం సాయంత్రం

ఆంద్ర ప్రదేశ్ శాసనమండలి  సభ్యులు శ్రీ వై వి బి రాలేంద్ర ప్రసాద్ గారిచే శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీ కాకాని బాబూరావు  శ్రీమతి యలమంచిలి భ్రమరాంబ మొదలైన ఆత్మీయ అతిధులు ,బంధుమిత్రుల సమక్షం లో ఆవిష్కరింపబడుతుంది .

  16-10-18 మంగళవారం ఉదయం అలబామా  రాష్ట్రం లోని శ్రీ మైనేని గారుండే ” హంట్స్ విల్” దగ్గరున్న” మాడిసన్ కౌంటి” ”లో కూడా ”మీట్ అండ్ గ్రీట్ ”సమావేశం లో డా రామయ్య గారి పుస్తకాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తారు . .

ఇలా సరసభారతి పుస్తకం అమెరికాలో ఒక రోజు తేడాతో రెండు చోట్ల ఒకే గౌరవ వ్యక్తిచేత ఆవిష్కరింపబడటం విశేషం . సరసభారతి దక్కిన అరుదైన గౌరవం .

ఈ రెండు కార్యక్రమాలు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సంపూర్ణ  సౌజన్య ,సహాయ, సహకారాలతో జరగటం విశేషం . శ్రీమైనేని గారి సహృదయత కు నిదర్శనం సరసభారతికి శ్రీమైనేని గారు అందిస్తున్న సంపూర్ణ సహకారానికి కృతజ్ఞతలతో నమోవాకములు .

డా రామయ్య గారి కీ ,సతీమణి శ్రీమతి కృష్ణమయి  కుటుంబ సభ్యుల సహకారానికీ  నమస్సులు .

 డా రామయ్య గారి పుస్తకం ఈ డిసెంబర్ చివరి వారం లో ఉయ్యూరులో డా రామయ్య గారి కుటుంబ సభ్యుల సమక్షం లో కూడా ఆవిష్కరింపబడుతుంది అని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది

   శ్రీ విళంబి  ఉగాదికి ఒక వారం ముందు ఉయ్యూరు లోను ,ఉగాది నాడు అమెరికాలోని షార్లెట్ లోను నేను రాసిన ,సరసభారతి ప్రచురించిన ‘షార్లెట్ సాహితీ మైత్రీ బంధం”పుస్తకం రెండు చోట్లా  ఆవిష్కరింపబడిందన్న సంగతి  గుర్తు ఉండే ఉంటుంది  -దుర్గా ప్రసాద్ -13-10-18 -ఉయ్యూరు 

 మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-18 -ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.9 వ భాగం.17.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.9 వ భాగం.17.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయ

ణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.9 వ భాగం.17.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.66 వ భాగం.17.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారిముత్యాలముగ్గు వెండితెర నవల.4 వ భాగం.16.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారిముత్యాలముగ్గు వెండితెర నవల.4 వ భాగం.16.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారిముత్యాలముగ్గు వెండితెర నవల.4 వ భాగం.16.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.39 వ భాగం.16.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.39 వ భాగం.16.10.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.8 వ భాగం.16.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.8 వ భాగం.16.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.65 వ భాగం.16.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.65 వ భాగం.16.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.65 వ భాగం.16.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.3 వ భాగం.15.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.3 వ భాగం.15.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.38 వ భాగం.15.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.38 వ భాగం.15.10.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.7 వ భాగం.15.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.7 వ భాగం.15.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.64 వ భాగం.15.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.64 వ భాగం.15.10.25.

Posted in రచనలు | Leave a comment

జీవన సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’

జీవన సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’

డా.రాచకొండ నరసింహ శర్మ ఎం.డి.గారు మా మైనేని గోపాలకృష్ణ గారి బావగారు అంటే అక్కయ్యడాక్టర్  అన్నపూర్ణ గారి భర్త .దంపతులిద్దరూ డాక్టర్లు .గుంటూరులో చదివారు .శర్మగారు ప్రముఖ కవి రా.వి శాస్త్రి గారి తమ్ముడు .కుమారుడు కుమార్తె అమెరికాలో ఉంటారు .శర్మగారు సతీమణి గారితో విశాఖ లో ఉంటారు.రెండేళ్లక్రితం అన్నపూర్ణ  గారు మరణించారు . శర్మగారి 90వ పుట్టిన రోజు నేను రాసి సరసభారతి ప్రచురించి శర్మగారికి అంకితం ఇచ్చిన ‘’పూర్వా౦గ్లకవుల ముచ్చట్లు ‘’ఉయ్యూరులో అవిష్కరి౦చా౦. ఇపుడు . వృద్ధాప్యం లో  కూడా ప్రతి యేడూ అలుపెరు౦గక ఏదో ఒక పుస్తకం రాసి ప్రచురిస్తూనే ఉన్నారు .నిరుడు బెజవాడలో కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల సభల్లో కూడా శర్మగారు 101 జన్మదినోత్సవ సందర్భంగా వారు రాసిన పుస్తకం ఆవిష్కరించాం .శర్మగారికి ఎన్నెన్నో సన్మానాలు జరిగాయి .మంచిమనిషి  ఉదారహృదయులు ,సరసభారతికి అత్యంత ఆప్తులు శర్మగారు .తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాం..మైనేని గోపాల కృష్ణ గారి ఆర్ధిక సహాయంతో  నేను కన్వీనర్ గా  ఉయ్యూరు లో దక్షిణ భారతం లోనే మొట్టమొదటి  సారిగా నిర్మింపబడిన  ఏ.సి లైబ్రరీ ప్రారంభోత్సవానికి విచ్చేశారు శర్మగారు గోపాలకృష్ణ గారు .2017మార్చి 15న డా శర్మ దంపతులను  విశాఖలో వారింటిలో దర్శించాం .సరసభారతి బ్లాగ్ లో నేను రాసే ప్రతివ్యాసం శర్మగారికి పంపుతూనే ఉన్నాను .

 అంతటి మహోన్నత సాహితీ మూర్తి శర్మగారు ఇవాళ ఉదయం విశాఖలో మరణించి నట్లు తెలిసింది .వారి ఆత్మకు శాంతికలగాలని కోరుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ  వారి సాహితీ వైదుష్యానికి దర్పణంగా వారు రాసిన పుస్తకం పై నేను 2019 లో రాసిన సమీక్ష మీముందు ఉంచుతున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్-15-10-25-ఉయ్యూరు  

‘’జీవన సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’’

‘’పంచనవతి వర్ష’’(95) యౌవనులు డా రాచకొండ నరసింహ శర్మగారు తమకున్న ఆంగ్లకవితాభిరుచికి దర్పణంగా తాను  చదువుతున్నకాలంలో తనకు అత్యంత ప్రీతికరమైనఅ ఆంగ్ల  కవితలను ఎంచుకొని , మరో ఆంగ్లకవితానువాద సంపుటిని సప్తతి(70) కవితల అనువాదంతో ఈ సెప్టెంబర్ లో ‘’మైదానం లో సూర్యోదయం ‘’గా వెలువరించారు  .ఆంగ్ల కవిత్వం చదివితే ‘’చిత్తము నిలవదు సుంత యైన ‘’అన్నట్లు ఆయన అనుభవించి ఆ ఆన౦దానుభూతిని మనకూ పంచిపెట్టే హృదయమున్న భిషగ్వరులాయన .ఇప్పటికే ‘’పడమటి సంధ్యారాగం ‘’లో 41,’’అయితే ‘’లో 46ఆంగ్లకవితల్ని అనువదించి ,స్మైల్స్ ,టియర్స్ అండ్ మోర్’’ ఆంగ్లకవితల ను ,’’సానెట్స్ ఫ్రం పోర్చుగీస్’’ అందించిన అనుభవం వారిది .తెలుగు కవితలను ఆంగ్లంలోకీ అనువాదం చేసిన నేర్పు వారిది .అంటే ద్విభాషా కవి .ఈ పుస్తకాన్ని తమప్రియతమ అర్ధాంగి డా .అన్నపూర్ణా హారతి దేవికి ,ఆమె మైదానం లోకి రాలేనందున ఆమెగదిలోకే ‘’మైదానం లో సూర్యోదయం ‘’తెచ్చి పరమానంద భరితురాలిని చేసి ,తమ సతీ ప్రేమను వర్షించారు .పుస్తక శీర్షికకు తగిన మైదానం ,సూర్యోదయం ,పశువులు, నీటి చెలమ ,పచ్చ గడ్డిలతో ముఖ చిత్రం ముద్దులొలికింది .ఆంగ్లకవితలు పేజీకి ఎడమవైపు ,తెలుగు సేత కుడివైపు ,అనుబంధంగా ఆకవుల చరిత్ర సంక్షిప్తంగా అందించారు .దాదాపు స్కాలిత్యం లేని పెద్ద  అక్షరాలతో.పుస్తకం చూడగానే మైదానం అంటే ‘’ఫ్లాటై ‘’పోతాం .శర్మగారు ఆత్మీయంగా పంపిన ఈపుస్తకం నిన్న మధ్యాహ్నం నాకు అందింది .రాత్రి 20,ఈ రోజు ఉదయం మిగిలిన 50 ఆబగా జుర్రేశాను .నిన్న పుస్తకం ఒక సారి తిరగేసి ‘’టైటిల్ ‘’విషయం లో ముందుమాటలు రాసినవారు ఎవరైనా మార్గ దర్శనం చేశారేమో అని వెతికితే దొరకలేదు .శర్మగారికే ఫోన్ చేసి పుస్తకం అందిన సంగతిచెప్పి  ,శీర్షిక ఔచిత్యాన్ని గురించి అడిగాను .వారు చెప్పిన సమాధానం సంతృప్తి కలిగించింది .ఈ కవుల జననకాలం 1554నుంచి 1896వరకు .అంటే దాదాపు 350సంవత్సరాల కాలవ్యవధిలోని  కవులు, వారికవిత్వ దర్శనం అన్నమాట .కనుక అద్భుతమైన వైవిధ్యం ,ఆలోచనలలో పరిపక్వత ,అనుభవసారం ఉన్నకవితలు .ఈ కవులు రాజకవులు ,కవిరాజులు ,రాజాస్థాననకవులు అనే పొయెట్ లారియట్స్ , జన హృదయసామ్రాజ్యాన్ని గెలిచినవారు.భగవదన్వేషకులు ,మాటలతోకాక చేతలతో మంచి చేయమని బోధించే తత్వ వేత్తలు ,జర్నలిస్ట్ లు ,సైంటిస్ట్ లు ,నవలా, కథా రచనలలోఅరితేరినవారు,వివిధ దేశాలకు చెందినవారు,’’ఆకాశంలో సగభాగమైన ‘’స్త్రీలు కూడా ఉన్నారు .ఒకరకంగా’’ డెబ్భై మనో ప్రపంచ దర్శనం ‘’చేయించారు శర్మగారు ఈపొత్తం లో .ఈ కవుల్లో కొందరు పులిట్జర్ ప్రైజ్ వంటి ప్రఖ్యాత బహుమతులు అందుకొన్నవారే . వివరాలు తెలీని ఒకకవి ,మరో అజ్ఞాతకవి ఇందులో చోటు చేసుకోన్నారుకూడా . ఇక కవితా మైదానంలో సూర్యోదయ దర్శనం చేసి పులకిద్దాం .

   విల్లా కేథర్’’అనే కవయిత్రి రాసిన ‘’ప్రయరీ డాన్’’కవిత శర్మగారి చేతిలో ‘’మైదానం లో సూర్యోదయం ‘’గా, ఈ పుస్తకం శీర్షికగా మారి దర్శన మిచ్చింది .ఈమె అమెరికాలో చాలాకాలం కొండలు గుట్టలు ఉన్నప్రాంతం లో ఉండి,ఒక్కసారిగా మైదాన ప్రాంతాన్ని చూసి అక్కడి ప్రకృతి సోయగం , సూర్యోదయాలకు పులకించి రాసిన కవిత అది .పులిట్జర్ ప్రైజ్ పొందినకవి .ఈ మైదానం లో ఆమె ‘’తారలు తరలించిన రక్తారుణజ్వలనం ,ధూళి నిండిన ‘’సేజాకు’’ ఘాటుపరిమళం ఆలమందల హఠాత్ చలనం, దూర పీఠభూముల క్రమ దర్శనం వెలుగులో వెండి మడుగుల  భాసురం ,కాంతి శూలం ఒకటి అతివేగంగా వచ్చి అవనిని గుచ్చటం చూసి తనవూరి పర్వత శ్రేణి కై తృటిలోనే ,కన్నీరు చిమ్మింది .ఆమె మధురానుభూతి మనమనసులను సేద తేరుస్తుంది .’’వాటర్ డిచేస్ సిల్వర్ ఇన్ దిలైట్ ‘’అన్న ఆమె మాటలను శర్మగారు ‘’వెలుగులో వెండి మాడుగుల భాసురం ‘’అని చక్కగా అనువదించారు .’’ఎ సడన్ సిక్ నెస్ ఫర్ ది హిల్స్ ఆఫ్ హోమ్’’ను ‘’తనూరి పర్వత శ్రేణికై తృటిలోనే కన్నీరు చిమ్ము ‘’అన్న అనువాదం  భేషు గ్గా ఉండి,పుస్తక శీర్షికకు గొప్ప న్యాయం చేకూర్చింది .ప్రభాత సూర్యోదయ కాంతికిరణాల నులి వెచ్చని ఆహ్లాదం భాసించింది .

 ఈ కవితా కదంబం సర్ ఫిలిప్ సిడ్నీ కవిత ‘’టు స్లీప్ ‘’ తోప్రారంభమై అజ్ఞాతకవి ‘’మినిట్స్ ఆఫ్ గోల్డ్ ‘’తో పూర్తవుతుంది .సిడ్నీకవి నిద్రను ‘’శాంతినిచ్చే ముడి ,దుఖానికి ఉపశమనం ,నిరుపేదకు భాగ్యం పక్షపాతం లేని న్యాయ నిర్ణేత (తగవరి ) అంటాడు .ఈకవి ఎలిజబెత్ కా లం లో 108సానెట్ ల ‘’ఆస్టోఫెల్ అండ్ స్టెల్లా’’కావ్యం రాసి ఆదర్శ పురుషుడుగా గుర్తి౦పు పొందాడు .అందుకే చివరగా ‘’లైవ్ లియర్ డాన్ఎల్స్ వేర్   స్టెల్లాస్ఇమేజెస్ సీ’’అని ఫినిషింగ్ టచ్ ఇవ్వగా శర్మగారు ‘’ఉల్లాస౦గా చూడగలవు –నాలో స్టెల్లా ప్రతిబింబమును ‘’అని ముగించారు అందంగా .70వ కవిత అజ్ఞాతకవి రాసిన ‘’మినిట్స్ ఆఫ్ గోల్డ్ ‘’ను శర్మగారు ‘’నిజంగా బంగారు నిమిషాలు ‘’గా అనువదించారు .నిమిషాలు గంటలు కాలపరిమాణ౦ లో అర్ధం లేనివి –కానీ అవే బంగారు నిమిషాలు మహత్తర ఘడియలు .ఒకరికి సంతోషం కలిగించటం లో ,చిర్నగవు తెప్పించటం లో  కన్నీరు తుడవటం లో  నైరాశ్యాన్ని అంతం చేయటం లో స్నేహాన్నివ్వటం లో  వాటిని ఉపయోగిస్తే సార్ధకం .అనికాలం మహత్తరమైన విలువకలదన్న బోధ చేశాడుకవి  .

  శర్మగారికి ఉన్న కవితాభిమానం కవులపై ఆరాధన నిరుపమానం .అందుకే ఆ అభిమానాన్ని చాటుతూ ,షేక్స్ పియర్ వి 3,ఎమిలి డికిన్సన్ వి 10,ఎల్లావీలర్ విల్కాక్స్ వి 3,సారా టెసల్డేల్ వి అత్యధికంగా 18,ఎడ్నాసెయింట్ విన్సెంట్ మిల్లేవి 2 కవితలను ఎంచుకొని అనువదించారు .ఎమిలీ ,తారా ఇద్దరూ కవయిత్రులే అవటం విశేషం.’’తలపు నీపైనమరల  సంతోషంకలిగి ,మృదుమధురమైన ప్రేమ స్మృతి ని మెదలి నృపతి పదవినైనా తృణీకరిస్తాను-‘’అని ,’’గులాబీ స్థితి వేరే అని ,అది మరణించినా మధుర పరిమళాలనిస్తుందని ,అందుకే అడవిపూలకంటే భిన్నమైనదని ,సత్కవిత వడబోతు నీ సత్యమహిమ ‘’అని ,సుఖాన్ని కోరితే దుఖం ,సంతోషంకోరితే మిగిలేది స్వప్నమే –నరకానికి బాట ఐన నాకసుఖం రాయటం ఎవరికీ వీలుకావటం లేదని షేక్స్ పియర్ తన మూడు  సానెట్ లలో చెప్పాడు .’’ఏ లిలీ ఆఫ్ ఏ డే –ఈజ్ ఫైరర్ ఫార్ ఇన్ మే’’అన్న బెంజాన్సన్ కవిత అందరికీ తెలుసు .’’ఇన్ స్మాల్ ప్రోపోర్షన్స్  వుయ్ జస్ట్  బ్యూటీస్  సీ –అండ్ ఇన్ షార్ట్ మెజర్స్ లైఫ్ మే పెర్ఫెక్ట్ బి ‘’అన్న గొప్ప జీవితసత్యాన్ని ‘’సూక్ష్మ పరిమితి లోనే –చూడగలము సౌందర్యమును –తక్కువ పరిమాణం లోనే లోపరహితంగా ఉండవచ్చు మనిషిజీవితం ‘’అని అదే జీవితానికి నిజమైన కొలత అని అర్ధవంతమైన  అనువాదం చేశారు శర్మాజీ.అదే మనతెలుగుకవి  ‘’కాకి చిరకాలమున్న నేకార్య మగును ?’’ అన్నాడెప్పుడో.’’వసుధలో వస్తువులన్నీ కడతేరాల్సిందే –గతవైభవప్రదర్శన తర్వాత గోరీలోకి జారాల్సిందే ‘’అంటూ పువ్వుల్ని అంత తొందరగా రాలిపోవటం ఎందుకు –మేము చదివే అందమైన పత్రాలు మీరు ‘’అని ‘’టు బ్లాసమ్స్ ‘’కవిత లో   రాబర్ట్ హార్రిక్ అన్నదాన్ని శర్మగారు ‘’విరులకు ‘’విన్నపంగా చెప్పారు .’’ఈలోకం సుందరమైనది ,ప్రేమ మహత్తరమైనది ,జీవితం సంక్లిష్టమైనది ‘’అనే సందేశం ఇచ్చాడు హార్రిక్ కవి .మనపదవీ ,వంశగౌరవాలన్నీ ముందో వెనకో విధికి వశమవ్వాల్సిందే .సన్మార్గుల కృత్యములే సౌరభాలు వెదజల్లి ,మట్టిలో వికసిస్తాయి ‘’అని తాత్విక సందేశమిచ్చాడు జేమ్స్ షిర్లి.

  మూడు దేశాల చక్రవర్తి మూడు సార్లు పార్లమెంట్ ను రద్దు చేసి ఇంగ్లాండ్ లో    అంతర్యుద్దానికి కారకుడై, చివరికి పార్లమెంట్ కు లొంగిపోయి , ఆలివర్ క్రామ్వేల్ తో ఓడిపోయి ఉరితీయబడ్డ   మొదటి చార్లెస్ ‘’క్వయట్ స్లీప్ ‘’కవితలో ‘’నెమ్మదికల అంతరాత్మకు  శాంతి విశ్రా౦తులు౦ టాయని ,భద్రంగా నిద్రపొమ్మని –నిద్రకంటే మధురమైనది లేదని ‘’తన అనుభవ సారంగా చెప్పాడు .మొదటి చార్లెస్ రాజు తరఫుకవి అంటే ‘’కావిలియర్ పొయెట్ ‘’ రిచార్డ్ లవ్ లేస్ సైన్యంలో కెప్టెన్ .’’విమల పవిత్ర వక్షస్థలతపస్వినీ గృహాన్ని వదిలి యుద్ధానికి వెడుతూ ,తాను  దయావిహీనడనుకానని,రణరంగం లో మొదటి శత్రువు ఖడ్గ, కవచాన్ని, అశ్వాన్ని  అధికతర విశ్వాసంతో కౌగలి౦చుకొంటానని,అప్పుడు ఆమెకూడా తనను పొగడాల్సిందే నని తన నిలకడ లేనితనం పేరు ,ప్రతిష్ట లను తాను  ప్రేమించకపోతే ఆమెనుకూడా అంతగా ప్రేమించి ఉండలేనని సందేశమిచ్చాడు .హెన్రి వాన్ కు పొదపొదలో పూలహారాలు ఫలహారాలుగా కనిపించి మహీతలం నీరవ నిశ్శబ్దంగా భాషా యోష అశ్రుగీతం వినిపించింది ‘’విశాలాకాశం లో ‘’.’’డి చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మాన్ ‘’అని ప్రకృతి,కవి వర్డ్స్ వర్త్ అన్నమాట వర్దీ మాట .రైన్బో కవితలో ఆమాట చెప్పి మరణమే మేలు –పిల్లలే పెద్దలకు తండ్రులు .నా రోజులన్నీ ఒకదానితో ఒకటి ముడి పడి ఉండాలని ఆశించాడు .

  వాల్టర్ సావేజ్ లాండర్ కవి ‘’ఆన౦ద  క్షణాలు రాలిపోతున్నాయని చి౦తఎందుకు ? మళ్ళీ రమ్మనటానికి నేను ఉండను అవి ఎక్కడో మళ్ళీ వెలుగుతాయి ‘’అని భరోసా ఇస్తాడు .’’ఆబూ బెన్ ఆడం ‘’కవిత చదవని, వినని, విని మురిసిపోని వారుండరు .లీహంట్ రాసిన ఈకవిత ‘’తోటిమానవులను ప్రేమించినవారినే దైవం తనవాడిగా భావిస్తాడు’’అన్న గొప్ప సత్యాన్ని చాటిన కవిత .నేను తొమ్మిదో తరగతిలోనే చదువుకొన్న దానినే విద్యార్ధులకు పాఠంగా చెప్పినకవిత కవిత .టెన్నిసన్ మహాకవికి ‘’ప్రథమ ప్రేమ మధురం ,ప్రగాఢం.వెళ్ళిపోయిన రోజులు శోకభరితం విషాదం  వినూతనం .మాయమైన రోజులు సజీవమరణమే అనిపించాయి కవికి .రాబర్ట్ బ్రౌనింగ్ కు ‘’నేనుఎవర్ని ?’’అనే ప్రశ్న వచ్చి ‘’వెనుతిరిగి చూడని వాడిని –మంచి ఓటమి పొందినా చెడు గెలుస్తుందని కలలో కూడా అనుకోని వాడిని –నిద్రించటం మేల్కొవటానికే అని నమ్మినవాడిని –కస్టేసుఖీ  అని నమ్మి చివరిదాకా పోరాడేవాడిని –ఇక్కడిలాగానే ‘’అక్కడా ‘’అలాగే జీవితం సాగించమని కోరేవాడు .ఆర్ధర్ హఘ్ క్లో కు ‘’ఆశలు నిరాశాలైతే భయాలు భ్రా౦తు లౌతాయి .ప్రభాకరుడు నెమ్మదిగా పైకి వస్తున్నా ,పడమట నేల౦తా శాంతి మయంగా కనిపించింది .

  ఎమిలి డికిన్సన్ అమెరికాలోని మాసాచూసెట్స్ లోని  ఆంహెర్స్ట్  కవయిత్రి.1800కవితలురాసింది  .ఒంటరిజీవితమే గడిపింది .ఎమెర్సన్ సరసన నిలువగలిగిన కవి .ఆమె మరణం తర్వాత నే కవితలు, లేఖలు చెల్లెలు లవినియాకు దక్కి ప్రచురించింది .దాదాపు మిస్టిక్ పోయెట్.ఆమెవి’’ గాస్పెల్ పోయెమ్స్’’ గాగుర్తి౦పుపొందాయి . శర్మగారు ఎంచుకొన్న 10కవితలలో కొన్ని ముఖ్యభావనలు –‘’చిన్న యెదలో ప్రశాంతంగా   పారే సెలయేరు ఉందా ?అందులోని ప్రాణజలం తాగు .ఈ సెలయేరు ఎండకుండా జాగ్రత్త పడు .గుండెల్లో బాధ దాచుకోటానికి మనస్తైర్యం కావాలి .ఈ ప్రపంచం పరిసమాప్తికాదు .అవతల ఏదో ఉంది .ఆత్మనుకొరికే దంతాన్ని మతబోధకుల అభినయాలు’’ హలలూయాలు ‘’నిద్రమందులు అంతం చేయలేవు .ఆకాశం కన్నా విశాలమైంది,మహోదధికన్నా లోతైనది  భగవంతునితో సరితూగేది  మానవ మస్తిష్కం .ఒకపెద్ద బాధతర్వాత ఒకవిధమైన అనుభవం కలుగుతుంది .ఏటవాలుగా పడేకాంతి ని చూసి నీడలుకూడా ఊపిరితీయటం మానేస్తాయి .హృదయం మొదటకోరేది ఆనందం.తర్వాత నిద్ర .చివరికి చనిపోయే స్వేచ్చ .ఆత్మీయులను తానె ఎంచుకొని  ఆత్మ తలుపు వెంటనే మూసేస్తుంది .అందరికీ ఒకమర్యాద ఏదోరోజువస్తుంది .ఆ వైభవం చెప్పనలవికానిది .అదే చావు సంబడం అన్నమాట .జయం ఎప్పుడూ పొందనివారికి విజయం లో మాధుర్యం అతిఎక్కువగా గా అనిపిస్తుంది .విజయకేతనాన్ని ఎగరేసిన సైనికుడు కూడా విజయం నిర్వచనం చెప్పలేడు.

 సారా టేస్ డేల్కవితలను    శర్మగారు 18ఎంచుకొని తర్జుమా చేశారు .అమెరికా సెయింట్ లూయీ కి చెందిన ఈమే 14వ ఏడువచ్చేదాకా బడిలో చదవలేదు కాని 19ఏట పట్టభాద్రురాలైంది .తీవ్రభావోద్వేగంతో ,సంప్రదాయబద్ధంగా ,సరళంగా కవితలురాసింది .ఈమె రాసిన ‘’లైక్ బార్లీ ‘’కవితను హో లింగ అనే చైనా అమ్మాయి చిన్నతనం లోనే అనువాదం చేసింది .సహజత్వం కవితలలో స్పష్టం .కొన్ని భావనలు –‘’కంచల అ౦చు లపైనా ,గడ్డికట్టల   పైనా ,వైఢూర్యాలను వెదజల్లుతూ ,దార౦లొ తారలను ధరించిన సాలె గూళ్ళను మంచు వీడింది .గి౦జగింజలో హరివిల్లు ధరించిన కలుపు మొక్కలను తళతళలాడిస్తోంది .నీప్రేమ వేకువలాగా నవనూతనం .నాపూర్వీకులు నాకు ఆత్మజ్యోతి నిచ్చారు .కానీ నా ప్రేమికులే వివిధవర్ణ శోభామయ చంచలజ్వాల ప్రసాదించారు .గడియ సేపు స్వర్గాన్నిచ్చిన కవితను ప్రేమించాను .వజ్రోదయం తెల్లని ఎండలో భాసించింది .నగలుమార్చినట్లు నీనుండి చూపులు మార్చుకొంటాను.కాలం అనే నేస్తం ముదిమినొసగి మరపిస్తుంది .బార్లీ వెన్నులు కిందకి వంగి తిరిగి మీదకు లేచినట్లు వేదన –లోతులనుంచి పైకొచ్చింది .ప్రకృతి పరిశీలన ఇది . విశ్వనాథగుర్తుకొస్తాడు .గాలి రెండంచులకత్తిలా ఉంది .ఇల్లులేని బాలుడిలాగా నాయెద రోదిస్తోంది .నువ్వుగాలిఅయితే నేను కడలిని .తుఫానులో నీటి గుంట క్షేమంగా ఉన్నా ,సంద్రంకంటే ఎక్కువ చేదుగా అవుతుంది .’’ప్రేముడి’’ గట్టిగా అరచి౦ది నాలో .నాకు శక్తి ఉంది స్వేచ్చనియ్యకపోతే నీ ఎదను విదలించగలను.కాఠిన్యం  కంటే కమనీయతే హృదయ విచారకరం .ఈ విశ్వం లో ఒకే గొంతుమాత్రమే నాకు విశ్రాంతి నివ్వగలదు .ప్రేమించు ప్రేమించు .ప్రేమతోనే జీవితం సార్ధకం .ప్రేమవల్లనే స్వర్గం చేరగలవు .చెరువుమీద మంచు నీటమునిగిన కత్తుల వలేమెరుస్తున్నాది .సౌందర్యం శకలం జ్వలించే టప్పుడు సౌందర్యమా నువ్వు చాలునాకు .గానం నన్ను వీడితే మరచిన గీతంలో మృత్యువే కోరుకొంటా .నేనుగతి౦చినా  నా గాన౦  నాప్రాణం లో జీవిస్తుంది .నా హృదయ చషకం అందమైనదే .నిర్జీవమైన నిర్వేదమద్యాన్ని సజీవంగా సవర్ణంగా మార్చుట ఎలాగోనాకు తెలుసు .ఇలాతలం పై రాత్రి రెక్కలు పరుచుకొ౦టో౦ది .నాహృదయం చెట్టులోని పక్షిలాగా .పిలుస్తూనే ఉంది .అని హృదయావేదన ,ప్రేమ తపన వ్యక్తం చేసింది సారా .

  విశ్వాసం కోసం ప్రార్ధన చేసింది  మార్గరెట్ సాంగ్ స్టర్.ఎదలో ప్రార్ధన సమసిపోతే ఏకాకి నైపోతాననని వాపోయింది .ఏదో ఒక శుభప్రదమైన ఆశ రాత్రిగీతం లో వినిపిస్తుందని ఆశ ధామస్ హార్డీకి .జేమ్స్ విట్కాంబ్ రిలే కి యెంత లోతుగా దిగజారినవారినైనా ప్రేమ ఉద్ధరిస్తుందనే నమ్మకం .ఎల్లా వీలర్ విల్కాక్స్ కు కోరికలు జయించేమనోబలమున్నవారు ,చిరునవ్వులో దుఖాన్ని దాచగలిగేవారు గౌరవపాత్రులుగా కనిపించారు .అవనిలో ని ఆన౦ద౦  శోభా,సౌందర్యాలు సర్వం తిరిగిరాని కథ, శేషజీవితం కేవలం ఒక విధిమాత్రమెఅనిపించింది .నిన్నటి దినాలనుపాతిపెట్టి ఈరోజు గురించి ఆలోచించి ,ఇద్దర్నీకలిపేది దైవమని అన్నది.ఈమె కవితలో అంద౦ ఆశాభావం కనిపిస్తాయి  .రుడ్యార్డ్ కిప్లింగ్ కు   తాను ఉరితీయబడ్డప్పుడు తల్లిప్రేమ తనను అనుసరిస్తుందని ,లోతు సముద్రంలో మునిగినప్పుడు ఆమె కన్నీరు తన చెంతకు చేరుతుందని ,శరీరం ఆత్మ పాపభూయిస్టమైనపుడు ఆమె ప్రార్ధనలు తన్ను ఉద్ధరిస్తాయని ఎరుగును .లయోనేల్ జాన్సన్ మొదటి చార్లెస్ విగ్రహం దగ్గర కూర్చుని  రాసిన దీర్ఘకవితలో జీవితం లో పరాజితుడైనా చనిపోయి సౌందర్యం సాధించాడని ,అతని ఆత్మకళలలో  ఆనందం పొందుతుందని ,జనమంతా ఆయనకృపకు’’ ఆకొని’’ఉన్నారని ఆవేదన చెందాడు .

  జోసెఫ్ బి స్ట్రాస్ ఆశావాది .దెబ్బపై దెబ్బతిన్నా కస్టాలకడలిలో ఈదుతున్నా బాధతప్ప ఏదీ లేదు అనుకోడు .వసంత స్పర్శ ,ఎగిరే పక్షి,చల్లని చిరునవ్వు ,ఒకరిద్దరు నమ్మిన నేస్తాలు జీవితానికి విలువ నిస్తాయనినమ్మాడు  .రాబర్ట్ ఫ్రాస్ట్ కుదూరటానికి కూడా వీలులేని చీకటి వనం లో పక్షిగానం చీకటిలోకి శోకం లోకి రారమ్మని  వినిపించి౦ది. కాని నక్షత్రాలకోసం బయటే ఉండిపోయాడు .మన ల క్ష్యాన్ని అతిదూరం గా ఉంచమని కోరాడు ఫిలిప్ ఏం రాస్కిన్ రష్యన్,జ్యూయిష్ అమెరికన్ కవి . మార్గరెట్ యి బ్రూనేర్ కు కుక్క మానవ హృదయాన్నే అర్ధం చేసుకోగలది అనిపించింది .దానికి కావలసింది అర్ధం చేసుకోగలమిత్రుడే అని నమ్మింది ఆమె. .మన చెట్టు కవి ఇస్మాయిల్ లాగా జాయిస్ కిల్మార్ కు చెట్టంత అందమైన కవిత కనిపించలేదు. అది రోజంతా ఆకులవంటి చేతులు పైకెత్తి దైవ ప్రార్ధన చేస్తుంది .తనలాంటి మూర్ఖులే కవితలు రాస్తారని కాని దేవుడుమాత్రమే చెట్టును చేయగలడని నమ్మాడు .సున్నిత శ్రావ్యత సౌందర్య౦  ఎలినార్ మార్టాన్ వైలీ కవితలలో ఉంటుంది-ఏదో ఒక చోటుకి మఖమల్ పావులు వేసుకొని నీరవ నిశ్శబ్ద నీహారం లోకి నడుద్దాం రమ్మంటుంది.పడకగది గోడమీద తనపొడవును సగర్వంగా కొలిచిన తల్లి కొలిచిన వైనం గుర్తొచ్చింది రోజా జగ్ నోనిమరియాని కి .జోసెఫ్ మార్రిస్ కు యెద కు౦గినపుడు చిరునవ్వే పలకరిస్తుందని నమ్మకం .కారుణ్యం ఎక్కడ అంతం అవుతుందో చూడలేకపోయినా అది శాశ్వతకాలాన్ని చేరుతుంది అంటాడు .అందుకే విలువైన తన 400ఎకరాల భూమిని మయామీ యూని వర్సిటీకి దానంగా ఇచ్చాడు.

 విలియం యి హేన్లి అజేయమైన ఆత్మను తనకిచ్చినదుకు దేవతలకు కృతజ్ఞతలు చెప్పాడు .భయాలకు ప్రమాదాలకు వెరువనివాడు. తన ఆత్మకు తానె అధిపతిని ,తానె నాయకుడిని అని నమ్మాడు’’ ఇన్విక్టస్ ‘’అంటే అజేయత కవితలో .ఈకవితను దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా తనతోపాటుజైల్ లో ఉన్నవాళ్ళకు ఈకవిత వినిపించి ధైర్యం, పోరాటపటిమ కలిగించాడు .తనతల్లికి ఉన్న ధైర్యం ఆమెతో వెళ్ళిపోయిందని ,ఆమె ధైర్యమే తనకు ఉంటె యెంత బాగుండును అని బాధపడింది ఎడ్నావిన్సెంట్ మిల్లె .కాలం బాధను పోగొడుతుంది అన్నది నిజంకాదు అంటుంది .ఈమెధైర్యసాహసాలకు మేధా శక్తికి ‘’అమెరికన్ మహిళా బైరన్ ‘’ గా కీర్తిపొందింది  .కార్రీ మే నికొలాస్  కు ధుమ ధుమలను చిరునవ్వు మాయం చేస్తుందని తీయని చూపు కోపాన్ని చల్లారుస్తుందని అనిపించింది .డోరోతి క్విక్ కు పాతదేవుళ్ల పాలన అంతమైందని గుడిలో’’ కొత్తా దేవుళ్ళు’’ఉండరని ,జీవితసారాన్నీ గ్రహించిన నిమ్నోన్నతాలకు తాను  బంధువునని అనిపించింది .ఈమె 11ఏళ్ళ వయసులో మహా నవలారచయిత మార్క్ ట్వేన్ ను పడవ లో కలిసి స్పూర్తి పొందింది .నార్మన్ వి పియర్స్ కవి కి గులాబీ తోటలు కనిపించకపోయినా వాసన ఇష్టం .పర్వత శిఖరాలు కనిపించకపోయినా  వాటి నుంచివచ్చే చల్లనిగాలి సౌఖ్యం అనుభవించగలడు .పక్షుల్ని చూడలేకపోయినా వానకోయిల గాన సుఖం అనుభవిస్తాడు .దారిలో పిల్లల్ని చూడలేకున్నా వారి హాసాన్ని ఆస్వాది౦చ గలడు .సముద్రంపై చంద్రకాంతి చూడలేకపోయినా కెరటాల సంగీతం వినగలడు.ప్రకృతి సమర్పించే శ్రావ్య ధ్వనులన్నీ వీనులవిందు అతనికి .అందుకే దైవానికి వందనాలు సమర్పించి ఇంతకంటే ఎక్కువఏదీ కోరను అని సంతృప్తి పడ్డాడు ‘’బ్లైండ్ ‘’అంటే అందుడుకవితలో .

  ఇన్ని అద్భుతఆంగ్ల  కవితలను తెలుగులో బంగారపు పోత పోసి అందించిన రాచకొండ శర్మగారికి ఆంద్ర సాహితీ లోకం ఎంతో రుణపడి ఉంది .ప్రతికవిత ఆకవి హృదయాన్ని ఆవిష్కరించే తీరులో అనువాదం సాగి అనుభూతి నిచ్చింది .ఇన్ని హృదయాలలో పరకాయ ప్రవేశం చేయటం మాటలుకాదు .చేసి చూపించి తమ సమర్ధత చాటారు డా.శర్మగారు .మిక్కిలి అభిన౦దనీయులు .వారి పూనిక ధైర్యం దీక్ష ,నిరంతర సాహితీ సేవ అందరికీ ఆదర్శం .భగవంతుడు వారికి, వారి శ్రీమతిగారికీ శతాధిక ఆయుస్సు ,ఆరోగ్యం కలిగించాలని ,మరిన్ని అందమైన ఆంగ్లకవితల అనువాదాలు వారి లేఖిని నుండి వెలువడాలని కోరుతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-10-19-ఉయ్యూరు   .

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.2 వ భాగం.14.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.2 వ భాగం.14.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.2 వ భాగం.14.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.37 వ భాగం.14.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.37 వ భాగం.14.10.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.6 వ భాగం.14.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.6 వ భాగం.14.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.63 వ భాగం.14.10.25.

ఆచార్య రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.63 వ భాగం.14.10.25.

Posted in రచనలు | Leave a comment