వీక్షకులు
- 1,195,987 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి.షెల్లీ జీవిత చరిత్ర -6
- మహాకవి కాళిదాసు మాళవికాగ్నిమిత్ర నాటకం.1 వ భాగం.26.9.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా.వేదవ్యాస వ్యాఖ్యానం.12 వ భాగం .26.9.26.
- మరాటీ కవి మాధవ్ జూలియన్ కవితలు కొన్ని(triveni)
- –సోషలిజం మరియు పరోపకారం(త్రివేణి)
- ప్రయోజనానికి బానిసలు(త్రివేణి)
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి. షెల్లీ జీవిత చరిత్ర-5
- జోళదరాశికెదొడ్డణ్ణ గౌడ గారి అనుభవాలు జ్ఞాపకాలు.6 వ భాగం.25.9.26
- హాకవి కాళిదాసు నాటకం విక్రమో ర్వ శీ యం.15 వ చివరి భాగం.25.9.26.
- శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా.వేదవ్యాస వ్యాఖ్యానం.11 వ భాగం.25.9.26
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,492)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు. 3 వ భాగం.17.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.18 వ భాగం.17.10.24.
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.18 వ భాగం.17.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
పరాశర స్మృతి.2 వ భాగం.17.10.24.
పరాశర స్మృతి.2 వ భాగం.17.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.13 వ భాగం.17.10.24.
శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.13 వ భాగం.17.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.2 వ భాగం.16.10.24.
శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.2 వ భాగం.16.10.24.
Posted in రచనలు
Leave a comment
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.17 వ భాగం.16.10.24.
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.17 వ భాగం.16.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
పరాశర స్మృతి.1 వ భాగం.16.10.24.
పరాశర స్మృతి.1 వ భాగం.16.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.12 వ భాగం.16.10.24.
శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.12 వ భాగం.16.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
ప్రసిద్ధ జ్యోతిష ,ఆయుర్వేద పండితులు –సాహిత్యరత్న ,కవి సింహ శ్రీ గొల్లాపిన్ని రామ కృష్ణ శాస్త్రి
ప్రసిద్ధ జ్యోతిష ,ఆయుర్వేద పండితులు –సాహిత్యరత్న ,కవి సింహ శ్రీ గొల్లాపిన్ని రామ కృష్ణ శాస్త్రి
కర్నూలు జిల్లా కోడుమూరు లో వెలసిఉన్న ‘’పల్లెలా౦బా దేవి’’ని ఇల వేల్పుగా ఆరాధించే గోల్లాపిన్ని పండిత వంశం లో జన్మించారు శ్రీ గొల్లాపిన్ని రామ కృష్ణ శాస్త్రి .ఆవంశం వారందరికి ‘’కవేశ్వర ‘’బిరుదు వారసత్వంగా లభించింది .అక్ష విద్య ,జ్యోతిర్విద్య లలో వారంతా సుప్రసిద్ధులు .గోల్లాపిన్నిమల్లికార్జున శాస్స్త్రి గారు ఈ వంశంలో లబ్ధ ప్రతిష్టులు .గొల్లాపిన్ని సోదర త్రయం లో వాసుదేవ శాస్త్రి ,రామ చంద్ర శాస్త్రి ,రామ కృష్ణ శాస్త్రి ఆధ్యాత్మిక సంపన్నులు ,విద్వాంసులు అయిన శ్రీ గోల్లాపిన్ని సీతారామ శాస్త్రి ,శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు జన్మించారు .వీరిలో మన రామకృష్ణ శాస్త్రి గారు ఉభయభాషలలో ,ఆయుర్వేద జ్యోతిషాలలో ఉద్దండ పండిత వరేణ్యులు .
రామకృష్ణ శాస్త్రిగారు 1922లో జన్మించి 79వ ఏట 2001లో స్వర్గస్తులయ్యారు .సర్వ తంత్ర స్వతంత్ర ,కవిసింహ ,విద్యానిధి బిరుదాంకితులు .తమ్ముడు రామ చంద్ర శాస్త్రిగారు మంచికవి ,జ్యోతిశ్శాస్త్ర పారంగతులు .శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారు రచించిన ‘’రఘునాథీయం ‘’ కావ్యానికి రామకృష్ణ శాస్త్రి గారు కృతి భర్తలు .రాష్ట్ర ఎక్సైజ్ శాఖాలో కడపలో ఆఫీసర్ గా పని చేసి రిటైర్ అయ్యారు .నిత్యం ఊపిరి సలపని కార్యక్రమంలో ఉంటున్నా ,రోజూ కొంత సమయం సాహిత్యానికి కేటాయించేవారు .ఏపని అయినా ప్రతిఫలం ఆశించకుండా చేయటం ఆయన ప్రవృత్తి .అనంతపురంజిల్లా తాడిపత్రి లో ‘’రాయల కవితా కళా సమితి ‘’స్థాపించి మహాకవి గడియారం వెంకట శేష శాస్త్రి, సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణా చార్యులు మొదలైన వరిష్ఠ కవిపండితులను గజారోహణం ,గండ పెండేర ప్రదానం ,పౌరసన్మానం చేయించి ఘనంగా సత్కరించారు .పుట్టపర్తి వారి ‘’పాద్యం ‘’కావ్యావిష్కరణ రాయల కళా సమితి లోనే గొప్పగా జరిగింది .కడప అనంతపురం జిల్లాల రచయితల సంఘాలు అనంతపురం విశ్వ కళా పరిషత్తు ,కర్నూలు జిల్లా బనగానపల్లి అరుణ భారతి ,అనంతపురం హిందూపురం స్వర్ణభారతి మొదలైన ప్రసిద్ధ సాహితీ సంస్థల లో శాస్త్రిగారు విశిష్ట సభ్యులై ఎన్నెన్నో విశేష కార్యక్రమాలు నిర్వహించారు .
రామకృష్ణ శాస్త్రి గారికి అనంతపురం లోని ఇల్లే కార్యాలయంగా ,డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారితో కలిసి స్థాపించిన ‘’రాయల కళాసమితి ‘’తాడిపత్రిలో తమ కుటుంబ సభ్యులద్వారా ప్రముఖ జ్యోతిశ్శాస్త్ర పండితులు వశ్యవాక్కుఅయిన శ్రీ గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రిగారు రచించిన అపురూప గ్రంథాలు ‘’వాసు దేవానందం ‘’’’పురుషోత్తమశతకం’’. సవ్యాఖ్యానంగా ప్రచురించారు .రామకృష్ణ శాస్స్త్రి గారి సాహితీ సేవకు హిందూపురం స్వర్ణభారతి ‘’సాహితీ రత్న ‘’బిరుదునిచ్చి ఘనంగా సత్కరించింది .2000లో కడప ‘’అల్లసాని పెద్దన సాహిత్య పీఠం ‘’శాస్త్రిగారిని మహోత్క్రుష్టంగా గౌరవించి సత్కరించింది .రాష్ట్రమంతా శాస్త్రిగారికి పలు సన్మానాలు పెద్ద ఎత్తున జరిగాయి .
రామకృష్ణ శాస్త్రి గారు ‘’నాకవన కదంబం ‘’కవితాఖండికలను హైదరాబాద్ లోని విన్నకోట మాధవ రావు ట్రస్ట్ ప్రచురించింది..వీరు వచన కావ్యంగా ‘’హంసానంద యతీంద్రుల జీవిత చరిత్ర ‘’రాశారు .వీరు రాసిన ఎన్నో సాహిత్యవ్యాసాలు విమర్శలు అనేక పత్రికలలో ప్రచురితాలు .గడియారంవారి ‘’శివ భారతం ‘’పై వచ్చిన విమర్శలపై శాస్త్రి గారు శరపరంపరగా రాసిన ప్రతి విమర్శ వ్యాసాలు విద్వజ్జన ప్రశంసలు అందుకొని గడియారం వారి కీర్తి కిరీటం లో కలికి తురాయి లాభాసించాయి . .
కడప, అనంతపుర౦ ఆకాశ వాణి కేంద్రాలనుండి శాస్త్రిగారి పురాణ కాలక్షేపాలు సాహిత్యోపన్యాసాలు ,సామెతలు బహుళంగా ప్రచారమై కీర్తికిమరింత వన్నెలు చిన్నెలు తెచ్చాయి ,ఎన్నో గ్రంథాలకు ,పరిశోధన వ్యాసాలకు ,సిద్ధాంత వ్యాసాలకు శాస్త్రి గారు తనవంతు సహకార౦ పరోక్షంగా అందించారు.వాటికి మెరుగులు పెట్టటం ,పీఠికలు అభిప్రాయాలు రాయటం తో ఆయనకు చేతి నిండా ఎప్పుడూ పని ఉండేది .ఆధ్యాత్మిక రంగం లో ,జ్యోతిర్దర్శన విద్యలో ,ఆధునిక యోగాభ్యాసం ‘’రేకీ’’విధానంలో ఆయన గొప్ప సాధన చేశారు .
కర్నూలు జిల్లాలోకోడుమూరు లోని తమ కులదేవత ‘’పల్లెలాంబా దేవి ‘’ఆలయాన్ని అన్నగారు రామ చంద్ర శాస్త్రి గారితో కలిసి జీర్ణోద్ధరణ చేశారు రామకృష్ణ శాస్త్రి గారు .దాదాపు 80ఏళ్ల జీవితాన్ని అత్యంత సార్ధకం చేసుకొన్నపుణ్యపురుషులు సాహితీ రత్న ,కవి సింహ శ్రీ గొల్లాపిన్ని రామకృష్ణ శాస్త్రి గారు .ఈ విషయాలన్నీ శ్రీమతి గొల్లాపిన్ని వసుంధర గారు తెలియ జేశారు .చివరగా మచ్చుకు శాస్త్రిగారి పద్యాలు రెండు రుచి చూద్దాం
1- సీ. కాకతి క్ష్మాపతి కాంచుచున్నాడు హ
ర్షాశ్రు ముక్తామాల సంతరించి
హరిహర బుక్కరాయలు కాంచుచున్నారు
తెలినవ్వు చలువ వెన్నెలల బరసి
ఘనుడు విద్యారణ్యముని పలుకుచున్నాడు
సిరిలొల్క వైదికాశీస్సు గురుసి
శ్రీకృష్ణరాయలు వాకొనుచున్నాడు
శక్రుతో నాంధ్ర ప్రశస్తియేమొ
గీ. గురుని కెఱిగించు చుండె తిమ్మరుసుమంత్రి
ఆంధ్రమంత్రుల సాహసౌదార్యములను
గతచరిత్రకు నీకు దార్కాణవారె!
వచ్చియున్నారు నీయుత్సవంబుఁజూడ.
(మహాంధ్రోదయము నుండి)
2- కొనకొమ్మ కోయిల –కొసరు కూతలలోన –ప్రియురాలి పిల్పు –విన్పిమ్పలేదే ?
నిండు జాబిల్లి పండించు వెన్నెలలోన –వేల్లనౌ మోము కాన్పింప లేదే ?
చేరువ సరసి లో –చెంగల్వ రేకులో –చమరించు కనుల లక్షింప లేదే ?
రాయంచ నడకలో ,రవళించు పల్కులో –నినదించు నందెల వినగా లేదే ?
నీవు తపియించు చుండ ,మై నీడ వోలె –ప్రకృతి లో లీనమౌచు నద్వైత భక్తి
జంట బాయక నీ వెను వెంటనున్న –నీ యశోధర నైన మన్నింప లెమ్ము ‘’( శాస్త్రి గారి ‘’నా కావన కదంబం ‘’లోని బుద్ధ దేవా! నమః ‘’అనే శీర్షికలోని పద్యం )
మీ- గబ్బిట దుర్గా ప్రసాద -16-10-24-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
శ్రీ బుచ్చి బాబు( శివరాజు వెంకట సుబ్బారావు ) గారి సాహిత్య వ్యాసాలు.1 వ భాగం.15.10.24.
శ్రీ బుచ్చి బాబు( శివరాజు వెంకట సుబ్బారావు ) గారి సాహిత్య వ్యాసాలు.1 వ భాగం.15.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
అభ్యుదయకవి రచయిత,పండితుడు -వట్టి కొండ రంగయ్య
అభ్యుదయకవి రచయిత,పండితుడు -వట్టికోట రంగయ్య
వట్టికోట రంగయ్య 1914లో జన్మించి 19 98లో మరణించారు ఆయన పాండిత్యం నివురు కప్పిన నిప్పు .అంత పాండిట్యాం ఉండీ తెరమరుగైన పండితులు ఆంధ్ర సాహిత్య లోకంలో ఎవ్వరు లేరు నిర్దిష్టమైన భాష శైలి అభ్యుదయ భావాలు ఆయన సాహితీ పరికరాలు . ఆ పాండిత్యం ఆయన మృతితో తెరమరుగైపోయింది ఆంధ్రదేశంలో అభ్యుదయ సాహిత్య ఉద్యమం ప్రారంభకులలో ఈయన ఒకరు . 19 43 ఫిబ్రవరిలో తెనాలిలో ఏర్పడిన అభ్యుదయ రచయితల సంఘం తొలి కార్యవర్గంలో వీరు , వీరి సతీమణి విశాలాక్షి సభ్యులుగా ఉన్నారు ఈ తొలి కార్యవర్గంలో తాపీ ధర్మారావు అధ్యక్షులు. చదలవాడ పిచ్చయ్య కార్యదర్శి చాగంటి సోమయాజులు అశ్విని కుమార్ దత్తు మహీధర జగన్మోహన్రావు ప్రయాగ కోదండ రామ శాస్త్రి రాటకొండ నరసింహారెడ్డి ఎం సర్వేశ్వరరావు పత్తికొండ రంగయ్య విశాలాక్షి తాపి మోహన్రావు శెట్టి ఈశ్వరరావు ఉన్నారు
ఈ చారితరాత్మక ఉద్యమ ప్రారంభంలో ఆ కార్యవర్గం వర్గంలో దంపతులిద్దరూ ఉండటం వీధి ఘనతకు తార్కాణ ఆ రోజుల్లో వీరు ‘’ రంగ కవి ‘’ అనే పేరుతో చాలా పద్యాలు అభ్యుదయ భావ గేయాలు రాశారు. వాటిలో మధు దయం అరుణోదయం అభ్యుదయ కవి ,విప్లవ జ్వాల అభ్యుదయ గీతాలు ముఖ్యమైనవి విశాలాక్షి గారు మంచి నవలలు కథలు రాసేవారు .ఆమె నవలలు భారత నారి యుగధర్మం ఖైదీ స్వప్న భంగం నిష్కామయోగి ఆత్మబలి ప్రసిద్ధమైనది తర్వాత ఇద్దరు రాయటం మానేశారు. అలా మానకుండా ఉండి ఉంటే ఎంతో ఉత్తమ సాహిత్యం వారి ద్వారా లోకానికి అందేది .దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నివురు కప్పి ఉన్న రంగయ్య గారి పాండిత్యాన్ని చేరా , బిఎస్ఆర్ కృష్ణ కొద్దిగా బయటపెట్టారు.
రంగయ్యలోని హిందీ పాండిత్యాన్ని గురించి ఇంకా లోకానికి పెద్దగా తెలియలేదు పండితలోకల్లో వారికి రావాల్సిన గుర్తింపు లభించలేదు రెండేళ్లపాటు చెన్నైలో అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ పత్రిక ‘’ కాంగ్రెస్’’ కు సంపాదకులుగా ఉండి ఆ తరువాత 1954లో గుంటూరు వెళ్లి కొన్నాళ్లపాటు ‘’ ప్రజావాణి’’ వార పత్రిక నడిపి , దానిని మూసేసి పూర్తిగా సాహిత్య రంగాన్ని వదిలి వ్యాపార రంగంలో ప్రవేశించి బాగా రాణించారు . సరదాగా ఆయనతో ‘’ మీరు సరస్వతి కి విడాకులు ఇచ్చి లక్ష్మిని చేపట్టారు’’ అని అంటే ముసి ముసి నవ్వులు మాత్రం విసిరేవారు . రంగయ్య గారు 84 వ ఏట 3-6- 1998 గుంటూరులో మరణించారు .ఈ విషయాలన్ని బి ఎస్ ఆర్ కృష్ణ తెలియచేశారు.
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్- 15 10 -24- ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.16 వ భాగం.15.20.24.
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.16 వ భాగం.15.20.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.36 వ చివరి భాగం.15.10.24.
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.36 వ చివరి భాగం.15.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.11 వ భాగం.15.10.24.
శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.11 వ భాగం.15.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
గురు సహస్రావధాని డా. కడిమిళ్ళ వర ప్రసాద్.గారి శతకం. తప్పు కాదు!?2 వభాగ0 .14.10.24.
గురు సహస్రావధాని డా. కడిమిళ్ళ వర ప్రసాద్.గారి శతకం. తప్పు కాదు!?2 వభాగ0 .14.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వేంకేశ్వర.15 వ భాగం.14.10.24.
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వేంకేశ్వర.15 వ భాగం.14.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.35 వ భాగం.14.10.24.
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.35 వ భాగం.14.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.10 వ భాగం.14.10.24.
శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.10 వ భాగం.14.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
గురు సహస్రావధాని డా. కడిమిళ్ళ వర ప్రసాద్.గారి శతకం. తప్పు కాదు!?.1 వభాగ0 .13.10.24.
గురు సహస్రావధాని డా. కడిమిళ్ళ వర ప్రసాద్.గారి శతకం. తప్పు కాదు!?.1 వభాగ0 .13.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.14 వ భాగం.13.10.24.
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.14 వ భాగం.13.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.34 వ భాగం.13.10.24.
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.34 వ భాగం.13.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.9 వ భాగం.13.10.24.
శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.9 వ భాగం.13.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3)30 వ భాగం.12.10.24.
డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3)30 వ భాగం.12.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.13 వ భాగం.12.10.24.
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.13 వ భాగం.12.10.24.
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.13 వ భాగం.12.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శ్రీ అక్కిరాజు రమా పతి రావు గారు ( మంజు శ్రీ) కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి .33 వ భాగం.12.10.24.
శ్రీ అక్కిరాజు రమా పతి రావు గారు ( మంజు శ్రీ) కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి .33 వ భాగం.12.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శూద్రక మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.8 వ భాగం.12.10.24.
శూద్రక మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.8 వ భాగం.12.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3)
29 వ భాగం.11.10.24.
Posted in రచనలు
Leave a comment
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.12 వ భాగం.11.10.24.
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.12 వ భాగం.11.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.32 వ భాగం.11.10.24.
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.32 వ భాగం.11.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శూద్రక మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.7 వ భాగం.11.10.24.
శూద్రక మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.7 వ భాగం.11.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
భారత తొలి మహిళా శాస్త్ర వేత్త – కమలా సోహోనీ (వ్యాసం ) – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్
భారత తొలి మహిళా శాస్త్ర వేత్త – కమలా సోహోనీ (వ్యాసం ) – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్
01/10/2024
గబ్బిట దుర్గాప్రసాద్

కమలా సోహోనీ ఒక మార్గదర్శక భారతీయ బయోకెమిస్ట్, ఆమె సైన్స్‌కు గణనీయమైన కృషి చేసింది . పరిశోధనలో మహిళలకు తలుపులు తెరిచింది. సైంటిఫిక్ విభాగంలో పీహెచ్‌డీ పొందిన తొలి భారతీయ మహిళగా ఆమె ప్రయాణం భవిష్యత్ తరాల మహిళా శాస్త్రవేత్తలకు మార్గం సుగమం చేసింది.
కమలా సోహోనీ యొక్క ప్రారంభ జీవితం మరియు విద్య:
కమలా సోహోనీ 18 జూన్ 1911న ప్రస్తుతం భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లో భాగమైన ఇండోర్‌లో జన్మించారు. ఆమె తండ్రి, నారాయణరావు భగవత్ మరియు ఆమె మేనమామ, మాధవరావు భగవత్, ఇద్దరూ రసాయన శాస్త్రవేత్తలు మరియు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో పూర్వ విద్యార్థులు, ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)గా మారింది. కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి, కమల 1933లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ లో BSc పూర్తి చేసింది.
IIScలో అడ్డంకులను అధిగమించడం 1933లో, కమల IIScలో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసింది. ఆమె అర్హతలు ఉన్నప్పటికీ, ఆమె దరఖాస్తును మొదట అప్పటి డైరెక్టర్ మరియు నోబెల్ గ్రహీత, ప్రొఫెసర్ సి.వి.రామన్ మహిళలు పరిశోధనలకు సరిపడరని నమ్మారు. అధైర్యపడకుండా, కమల రామన్ కార్యాలయం వెలుపల సత్యాగ్రహం చేసింది, చివరికి ఆమె కఠినమైన షరతులతో ప్రవేశానికి దారితీసింది. ఆమె గణనీయమైన పక్షపాతాలు మరియు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన మొదటి మహిళ.
భారతదేశంలో మొదటి మహిళా శాస్త్రవేత్త పరిశోధన మరియు విజయాలు:
IIScలో, కమలా పరిశోధనలు పాలు, పప్పులు మరియు పప్పుధాన్యాలలోని ప్రొటీన్లపై దృష్టి సారించాయి, ఇవి భారతీయ సందర్భానికి కీలకమైనవి. ఇన్‌స్టిట్యూట్‌లోకి ఎక్కువ మంది మహిళలను అనుమతించాలనే ప్రొఫెసర్ రామన్ నిర్ణయాన్ని ఆమె పని గణనీయంగా ప్రభావితం చేసింది.
1937లో, ఆమె డాక్టర్. డెరెక్ రిక్టర్ మరియు తరువాత డాక్టర్. రాబిన్ హిల్ వద్ద పనిచేయడానికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళింది. కేంబ్రిడ్జ్ వద్ద, కణాలలో శక్తి ఉత్పత్తికి అవసరమైన సైటోక్రోమ్ సి అనే ఎంజైమ్‌ను ఆమె కనుగొంది. ఈ విషయంపై ఆమె సంక్షిప్త థీసిస్, కేవలం 14 నెలల్లో పూర్తి చేసింది, ఇది కట్టుబాటు నుండి గుర్తించదగిన నిష్క్రమణ. కమలా సోహోనీ నిశ్శబ్ద, నిరాడంబరమైన వ్యక్తి.
భారతీయ విజ్ఞాన శాస్త్రానికి కమలా సోహోనీ అందించిన సేవలు:
1939లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, కమల లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ హెడ్‌గా చేరారు. ఆమె కూనూర్‌లోని న్యూట్రిషన్ రీసెర్చ్ లాబొరేటరీలో విటమిన్లపై దృష్టి సారించింది.
1947లో ఆమె ఎం.వి. సోహోనీ మరియు ముంబైకి వెళ్లారు. ఆమె రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ప్రొఫెసర్‌గా చేరి ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు, అయినప్పటికీ లింగ వివక్ష కారణంగా ఆమె నియామకం ఆలస్యమైంది. నీరా అని పిలవబడే చిక్కుళ్ళు మరియు పామ్ సాప్ యొక్క పోషక అంశాలపై కమల చేసిన పరిశోధన ప్రత్యేకించి ప్రభావం చూపింది. ఆమె పని నీరా యొక్క అధిక పోషక విలువలను మరియు పోషకాహార లోపం ఉన్న జనాభాకు దాని ప్రయోజనాలను ప్రదర్శించింది.
మొదటి మహిళా భారతీయ శాస్త్రవేత్త వారసత్వం మరియు గుర్తింపు:
కమలా సోహోనీ కన్స్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియాలో క్రియాశీల సభ్యురాలు మరియు 1982-83కి అధ్యక్షురాలిగా పనిచేశారు. నీరాపై ఆమె చేసిన కృషికి ఆమె చేసిన కృషికి రాష్ట్రపతి అవార్డుతో గుర్తింపు లభించింది.
కమల 28 జూన్ 1998న న్యూఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సన్మాన కార్యక్రమం తర్వాత కొద్దిసేపటికే కన్నుమూసింది. ఆమె మార్గదర్శక ప్రయత్నాలను 18 జూన్ 2023న ఆమె 112వ జన్మదినోత్సవం సందర్భంగా Google ఒక డూడుల్‌తో స్మరించుకుంది, భారతదేశపు మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్తగా ఆమె శాశ్వతమైన వారసత్వాన్ని జరుపుకుంది.
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Posted in రచనలు
Leave a comment
డా. నాగసూరి వేణు గోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).28 వ భాగం.10.20.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.11 వ భాగం.10.10.24.
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.11 వ భాగం.10.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.31 వ భాగం.10.10.24.
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.31 వ భాగం.10.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.6 వ భాగం.10.10.24.
శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.6 వ భాగం.10.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).17 వ భాగం.9.10.24.
డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).17 వ భాగం.9.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే oకటేశ్వర.10 వ భాగం.9.10.24.
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే oకటేశ్వర.10 వ భాగం.9.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ). గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం. సాహితీ వైజయంతి.30 వ భాగం.9.10.24.
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ). గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం. సాహితీ వైజయంతి.30 వ భాగం.9.10.24.
శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ). గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం. సాహితీ వైజయంతి.30 వ భాగం.9.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.5 వ భాగం.9.10.24.
శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.5 వ భాగం.9.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శ్రీ సుశర్మ రాసిన ‘’శ్రీ మట్టపల్లి నృసింహస్వామి దేవాలయ చరిత్ర ‘’
శ్రీ సుశర్మ రాసిన ‘’శ్రీ మట్టపల్లి నృసింహస్వామి దేవాలయ చరిత్ర ‘’
మట్టపల్లి అనగానే సుమారు ముప్ఫై ఏళ్ల క్రితం హుజూర్ నగర్ లో కాపురం ఉన్న మా శ్రీమతి చెల్లెలు దుర్గ ,ఒకసారి మా ఆవిడ వాళ్ళ ఇంటికి వెడితే దగ్గరుండి మట్టపల్లి క్షేత్రానికి తీసుకొని వెళ్ళి కృష్ణ వేణీ స్నానం చేయించి నరసింహస్వామి దివ్య దర్శనం చేయించటం అక్కడి వాతావరణం పవిత్రత ఆవిడ చాలాకాలం చెబుతూ ఉండటం గుర్తుకు వస్తుంది .మరొకటి –ఉయ్యూరులో ఆయుర్వేద మందుల షాపు నిర్వహిస్తూ ఉయ్యూరు దగ్గర గండి గుంటలో ఉన్న శ్రీ దత్త క్షేత్రం యాజమాయిషీ చేస్తూ ,ప్రతి ఉగాదికి సాయంత్రప్ అక్కడ నాతో పంచాంగ శ్రవణం చేయిస్తున్న శ్రీ పురుషోత్తమా చార్యులు గారు పదేళ్ళ క్రితం నేను బెజవాడనుంచి బస్ లో ఉయ్యూరు వస్తూంటే నాతో పాటు ప్రయాణిస్తూ మాటల సందర్భంగా తను మట్టపల్లి నుంచి వస్తున్నానని అక్కడి క్షేత్ర అర్చకస్వామి స్వయానా తనకు బావమరది ఆని చెప్పటం గుర్తుకు వచ్చింది .
పుస్తకం తెరిస్తే డా.తట్టా వారి ఆముఖం చూడగానే కొన్నేళ్ళ క్రితం ఆయనా ఆయన కుమార్తె శ్రీదేవి కలిసి ‘’శ్రీ శుభం ‘’అనేఆధ్యాత్మిక మాసపత్రిక నడపటం ,అందులో నేను వ్యాసాలూ రాయటం జ్ఞాపకానికి వచ్చింది . డా సర్వా వారి ముందుమాట చూడగా ఆయనతో సాహితీ స్నేహం ,తరచూ బెజవాడ సభలలో కలవటం ,ఒకసారి సరసభారతి సభలకు కూడా ఆయన్ను ఆహ్వానించటం ,ఆయన రాసిన పుస్తకాలు నాకు పంపుతూ ఉండటం నేను రాసిన సరసభారతి పుస్తకాలు ఆయనకు పంపటం ,సుమారు ఏడు ఎనిమిదేళ్ళ క్రితం ఆయన మృతి చెందటం విషాదంగా గుర్తుకొచ్చింది .
ఆలయ చరిత్ర
ఈఆలయచరిత్ర బహుళ ప్రయోజనంగా ఉండాలని రచయిత సంకల్పించి ,చరిత్రతోపాటు పూజా విధానం స్తోత్రాలు కూడా చేర్చారు .ముందుగ నరసింహావతారం గురించి సంక్షిప్తంగా తెలియ జేశారు .తెలంగాణా లో హుజూర్ నగర్ దగ్గర కృష్ణానదీ తీరాన ఉన్న ఉన్న మట్టపల్లి నరసింహస్వామి మాచి రెడ్ది అనే నరసింహునికి దర్శనమిచ్చాడు మొదటి సారిగా .కేశవ తీర్ధులు అనే నారసింహ హృదయంలో స్వామి తిష్ట వేశాడు .ఆయనతోనే నృసింహ ఉపాసనను బుర్రకథ రూపం లో ప్రకటింప జేసుకొన్నాడు .మరో నరసింహుడు నరహరి గోపాలునితో సుప్రభాత సేవ లిఖింప జేసుకొన్నాడు .అపర విశ్వ నాథుని చె ‘’శ్రీరామ కవచం ‘’తొడిగించుకొన్నాడు .అచ్యుత నరసి౦హునిచే కరావలంబ స్తోత్రాన్ని కరతామలకం చేయించాడు హరినామస్మరణతో నిరంతరం పరవశించే సోమయాజుల లక్ష్మీ నరసింహుని చే కళ్యాణ వైభవాన్ని చెప్పించుకొని వీనుల విందుగా అనుభవించాడు .ముక్కూరి నారసి౦హు నిచే నరహరి అష్టోత్తర శత నరసింహ యాగాలు నిర్వర్తింప జేసుకొన్నాడు భరతుని వచో వైభవాన్ని శ్రవణ పేయంగా విన్నాడు .ఈ సుబ్రహ్మణ్య వాచాలతతో తన ఆలయ చరిత్ర రాయించి ధన్యుణ్ణి చేశాడు .అంటే స్వామి ప్రతివారి హృదయ సీమలో ప్రవేశించి తనకు కావలసింది చేయించు కొన్నాడన్నమాట .
కృష్ణా తీరాన ఉన్న పంచ నరసింహ క్షేత్రాలలో మట్టపల్లి రెండవది నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ కు 24కిలో మీటర్లదూరం లో కృష్ణవేణీ తీరంలో పెద్ద అడవి మధ్య గుహాలయం లో వెలసిన స్వామి ఈనార సింహుడు .భారద్వాజాది మహర్షులు సేవించిన పవిత్ర క్షేత్రం.త్రేతాయుగ ద్వాపర యుగాలలో దేవతలు మునులు గుహాలయం లోకి వెళ్ళి స్వామిని దర్శించి తరించేవారు .కలియుగంలో స్వామి దర్శనం సామాన్యులకు గగన కుసుమం అయింది .
కృష్ణకు అవతలి ఒడ్డున ‘’తంగెడ ‘’గ్రామ ప్రభువు మాచి రెడ్డికి స్వామి కలలో కన్పించి కీకారణ్యంలో స్వయం వ్యక్తుడనైన తనను సేవించి తరించమన్నాడు .మర్నాడు రాజు మందీ మార్బలం తో స్వామి చెప్పిన గుర్తులను బట్టి వెతుకుతూ పోగా ఎంతసేపటికి స్వామికనిపి౦చక పొతె అలసి నిద్రిస్తే స్వామి కలలో సాక్షాత్కరించి ,ఒక ఆరె చెట్టు కనిపిస్తుంది.దానికి సూటిగా ప్రయాణిస్తే నదీ తీర గుహాలయం చేరుకోవచ్చు ఆని భరోసా ఇచ్చాడు .మర్నాడు మళ్లీ ప్రయాణం సాగించి గుహాలయం దర్శించి అందులో ద్వారం పై గజలక్ష్మి శిలా విగ్రహం,,కింద రాజ్యలక్ష్మి శిలా విగ్రహం స్పష్టంగా కనిపించాయి .ప్రహ్లాదుని రూపం లో తిరునామాలు ,రెండు కాళ్ళు ఉన్నస్వామి నయనానందంగా మాచి రెడ్ది ప్రభువుకు దర్శన మిచ్చాడు. దేవతలు మునుల తర్వాత మానవ మాత్రుడుగా స్వామి దర్శనం పొందిన రెడ్ది ప్రభువు చిరస్మరణీయుడు .తర్వాత దేవాలయ ముఖమండపం మొదలైన నిర్మాణాలు చేసి అజరామరం చేశాడు .ఇప్పటికి వెయ్యేళ్ళ నాటి చరిత్ర ఇది .తర్వాత మట్టపల్లి దగ్గర ఉన్న పెదవీడు గ్రామానికి చెందిన’’చెన్నూరు ‘’వంశస్తులు ఆలయ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు .
వేద పండు శ్రీమాన్ మక్కూర్ నరసింహా చార్యుల వారు అహోబిల సింహాచల విజయవాడ క్షేత్ర వేద సభలలో ప్రసంగించి ఒకసారి మంగళగిరి పానకాలస్వామిని దర్శించి గా, ఒక రోజు స్వామి స్వప్నం లో వృద్ధ బ్రాహ్మణ రూపం లో దర్శనమిచ్చి స్వాతీ నక్షత్ర యుక్త మహాయజ్ఞం చేసి సమర్పించమని ఆదేశించగా ,మొదటి సారి 1981లో అలాగే చేసి స్వామిని సంతృప్తి పరిస్తే ,కలలో కనిపించి ,మట్టపల్లి లో కూడా యాగం నిర్వహించమని ఆజ్ఞాపిస్తే ,,మట్టపల్లి చేరి శతాధిక నృసింహ యాగాలు నిర్వహించారు .
చెన్నైలో ఆయన శిష్యబృందం ‘’స్వాతీ మహాయజ్ఞ ట్రస్ట్ ఏర్పాటు చేయగా దానికి చైర్మన్ గా ఉన్నారు .ట్రస్ట్ ఆధ్వర్యం లో మట్టపల్లి లో గోశాల ,ధ్యాన మందిరం ఏర్పడ్డాయి .ఆచార్యశ్రీ 1981నుంచి 2000 వరకు 121 నృసింహ యాగాలు నిర్వహించి 4-5-2000 న విష్ణు సాయుజ్యం పొందారు .
రచయితపరిచయం –తమ్మర సుబ్రహ్మణ్య శర్మ (సు శర్మ )నల్గొండ జిల్లా కోడాడు తాలూకా తమ్మర బండ పాలెం శ్రీ సీతారామాంజనేయ శర్మ ,శ్రీమతి సువర్చల దంపతులకు జన్మించారు. పితామహులు శ్రీ త్యాగరాజన్ గణపతి ,మాతామహులు శ్రీ నందుల అచ్యుత రామ శాస్త్రి సిద్ధాంతి (శ్రీ రామోదహరణ కావ్యకర్త .దీనినే శర్మగారు 2014లో పునర్ముద్రించారు )
శర్మాజీ గుడిబండ ,కోదాడ ,నేలకొండపల్లి ,హైదరాబాద్ లలో చదివి తెలుగు సంస్కృతం లో ఎం .ఎ .సంస్కృతంలో ఎంఫిల్ కూడా చేసి జర్నలిజం లో డిప్లమో సాధించి అధ్యాపకత్వం లో ఉన్నారు .నేను –వచన కవితా సంపుటి ,మూషిక దౌత్యం –సందేశ కావ్యం ,కార్తీక కృష్ణం –స్మృతి వీచిక ,అమృత సిద్ధి –ఎంఫిల్ వ్యాసం ,మాతామహుల కృతులపై పరిశీలన రచన ,ఉపనయన విధి ,లోగుట్టు –పెరుమాళ్ళకె కాదు ,మీనాక్షి సుందరేశ్వరులు రాశారు .
కోదాడలో శారదా సాహితీ సమాఖ్య తన అధ్యక్షతన ఏర్పరచి పుస్తకముద్రణ సాహితీ సేవాకార్యక్రమాలు విరివిగా చేస్తున్నారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-24-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
డా నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).16 వ భాగం.8.10.24.
డా నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).16 వ భాగం.8.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.9 వ భాగం.8.20.24.
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.9 వ భాగం.8.20.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.4 వ భాగం.8.10.24.
శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.4 వ భాగం.8.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
డా నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).15 వ భాగం.7.10.24.
డా నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).15 వ భాగం.7.10.24.
డా నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).15 వ భాగం.7.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే 0కటేశ్వర.8 వ భాగం.7.10.24.
బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే 0కటేశ్వర.8 వ భాగం.7.10.24.
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment


