శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము .2 వ భాగం.7,12,23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము .2 వ భాగం.7,12,23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.25 వ భాగం.7.12.23

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.25 వ భాగం.7.12.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్టబాణ కవి చండీ శతకం.

భట్టబాణ కవి చండీ శతకం.

https://youtu.be/BxxvxaN4GxM

https://www.youtube.com/watch?v=BxxvxaN4GxM

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.117 వ భాగం.7.12.23.

శ్రీ హర్ష నైషధం.117 వ భాగం.7.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుఫు గారి ఆత్మచరితం.1 వ భాగం.6.12.23

శ్రీ రాయసం వెంకట శివుఫు గారి ఆత్మచరితం.1 వ భాగం.6.12.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.14 వ భాగం.6.12.23.

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.14 వ భాగం.6.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి శ్రీ కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని గారి చరిత్ర .23 వ చివరి భాగం.6.12.23.

మహా తపస్వి శ్రీ కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని గారి చరిత్ర .23 వ చివరి భాగం.6.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

హర్ష నైషధం.116 వ భాగం.6.12.23.

హర్ష నైషధం.116 వ భాగం.6.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛంఘీజ్ ఖాన్.28 వ చివరి భాగం.5.12.23.

ఛంఘీజ్ ఖాన్.28 వ చివరి భాగం.5.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామకృష్ణారావు కథలు.13 వ భాగం.5.12.23.

శ్రీ అవసరాల రామకృష్ణారావు కథలు.13 వ భాగం.5.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి శ్రీ కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని గారి చరిత్ర.22 వ భాగం.5.12.23.

మహా తపస్వి శ్రీ కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని గారి చరిత్ర.22 వ భాగం.5.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రేపటి నుంచి శ్రీ రాయసం వేంకట శివుడు గారి” ఆత్మ చరితము ”ప్రారంభం

 రేపటి నుంచి శ్రీ రాయసం వేంకట శివుడు గారి” ఆత్మ చరితము ”ప్రారంభం

సాహితీ బంధువులకు శుభ కామనలు .ఇవాళ సాయంత్రం 28 వ ఎపిసోడ్ తో శ్రీ తెన్నేటి సూరి గారి ”చంఘీజ్ ఖాన్ ”నవల ప్రత్యక్ష ప్రసారం పూర్తి అవుతోంది .రేపు 6-12-23 బుధ వారం సాయంత్రం నుంచి శ్రీ రాయసం వేంకట శివుడు గారి ”ఆత్మ చరితం ”ప్రారంభిస్తున్నాము .

 అలాగే శ్రీ గణపతి ముని మనుమడు శ్రీ మైత్రావరుణ రాసిన ”మహాతపస్వి కావ్య క౦ఠ వాసిష్ఠ గణపతి ముని జీవితం ”ఒకటి రెండు రోజుల్లో పూర్తి కాగానే ఉదయ౦ పూట బాణ భట్ట కవి రచించిన  ”చండీ శతకం ”ప్రారంభిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాం – గబ్బిట దుర్గా ప్రసాద -5-12-23–

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛంఘీజ్ ఖాన్.27 వ భాగం.4.12.23.

ఛంఘీజ్ ఖాన్.27 వ భా

గం.4.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.12 వ భాగం.4.12.23.

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.12 వ భాగం.4.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి శ్రీ కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని గారి చరిత్ర.21 వ భాగం.4.12.23

మహా తపస్వి శ్రీ కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని గారి చరిత్ర.21 వ భాగం.4.12.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.114 వ భాగం.4.12.23

శ్రీ హర్ష నైషధం.114 వ భాగం.4.12.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛంఘీజ్ ఖాన్.26 వ భాగం.3.12.23.

ఛంఘీజ్ ఖాన్.26 వ భాగం.3.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.11 వ భాగం.3.12.23

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.11 వ భాగం.3.12.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ లక్ష్మీ నృసింహ –శారదా చంద్ర శేఖర పీఠం

శ్రీ లక్ష్మీ నృసింహ –శారదా చంద్ర శేఖర పీఠం

ఉత్తర కర్నాటకలో గోకర్ణ పుణ్య క్షేత్రానికి కులువే గ్రామానికి మధ్య పచ్చని ప్రకృతిలో ఏలకులు ,మిరియాలు వక్కలు మొదలైన సుగంధ ద్రవ్యాలు విరివిగా పండే చోట’’ శ్రీ లక్ష్మీ నృసింహ-శారదా  చంద్ర శేఖర పీఠం ‘’ఉంది .శివ –కేశవనామాలతో ఉన్న ఈ క్షేత్రం నిజానికి శంకర మఠం.’’సో౦దా –స్వర్ణ వల్లీ ‘’సంస్థానాధీశులు ఈ పీఠానికి ధర్మ కర్తలు ,పోషకులు .

  1939  వేసవిలో ఎండలు బాగా ఉండటంతో అరుణాచలం లో ఉంటున్న మహాతపస్వి శ్రీ కావ్య క౦ఠ గణపతి మునిగారిని  ,సముద్ర మట్టానికి సుమారు రెండు వెల అడుగుల ఎత్తున ఉన్న  చల్లని ప్రదేశమైన కళువె గ్రామానికి తీసుకు రమ్మని భాద్రానదీ తీరాన తపస్సు చేస్తున్న కుమారుడు దైవ రాతుడు వేసవి విశ్రాంతి స్థలమైన ‘’శిరిసి ‘’  గ్రామానికి తీసుకు  రమ్మని తమ్ముడు శివరామ శాస్త్రిని  తోడుగా మరో శిష్యునిపంపాడు  .నాయన గారు అపీత కుచాంబ  దర్శనం చేసి ,శ్రీ రమణ మహర్షి అనుగ్రహంపొంది బయల్దేరారు.,మధ్యలో గోకర్ణ క్షేత్ర దర్శనం చేసి ,చాలాదూరం కారులో కూర్చోవటం చేత బడలిక కలిగి కాసేపు విశ్రాంతి తీసుకొందామని ఒక చోట ఆగారు .అదే పైన చెప్పిన పీఠం.

  ఆపీఠం లో ఇద్దరు దేవతల అర్చన జరుగుతుంది .ఈపీఠాన్ని శ్రీ విశ్వా నంద సరస్వతి స్వామి వారు నెలకొల్పారు .ప్రక్కనే శాల్మలీ నది ప్రవహిస్తూ ఉంటుంది .నాయన గారు అక్కడి చేరిన కాలం లో శ్రీ మత్సర్వజ్ఞే౦ద్ర సరస్వతి ‘’పీఠాధిపతులు గా ఉన్నారు .ఆయన గణపతి ముని పేరు ప్రతిష్టలు విని ఉండటం చేత ఆహ్వానించి పాద పూజ చేసి ,సపర్యలు చేశారు .కొంచెం సేపు విశ్రమించి పీఠం బాగోగులు వారిని అడిగి తెలుసుకున్నారు నాయన.ఆయన చాలా దీనంగా ‘’బాగా పురాతన వైభవం ఉన్న పీఠం ఇది .రాజపోషకులలో వారసత్వ తగాదాలు వచ్చి,కోర్టు కెక్కగా మూడేళ్ళ నుంచి ధూప దీప నైవేద్యాలకే  కటకటగా ఉంది .భక్తులిచ్చే కానుకలతో ఏదో విధంగా లోపం లేకుండా నెట్టు కోస్తున్నాం’’అని వివరించారు .నాయన కనులు చమర్చగా ,బలహీన ఆరాజవంశాలను తలచి శోకించి ‘’ఈ దేశానికి పట్టిన దుర్గతి ఇది .లేకపోతె పరాయి పాలనలో మనం బానిసలమా ?’’అన్నారు .కండ్లు మూసుకొన్నారు కాసేపటికి నాయన గారినోట  శ్లోకాలు వెలువడ్డాయి –

1-‘’ఉదిత విరోధా  స్వయుతభి దాసు  -చతసృషు జాతి శ్వబలత మాసు ‘’

భావం –నాలుగు జాతులలో అవాంతర భేదాలు అన౦తాలు .కాబట్టి పరస్పర విరోధాలు కూడా ఎక్కువే .

2-‘’ముహ్మురపి లోకే క్షితి సుర శీలే –అజగణ కల్పేభుజ భువ సంఘే ‘’

భావం –విప్రులు మోహ వశంతో శీలం పోగొట్టుకొన్నారు రాజులు అజా యుద్ధులయ్యారు .

3-‘’చతుర విరోధి వ్రత హృత సారాం-విరత నేత్ర సుత జలాధారాం’’

 భరత ధరిత్రీం భువన న్రుపాలహః-అవటు దయాళుః సిత గిరి శాలా ‘’

భావం –నిపుణులైన శత్రువుల వలన సారం కోల్పోయి ,సంతత అశ్రు ధారల చే నిండిన నేత్రాలతో ఉన్న ఈ భారతావని ని దయామతుడైన ఆ వెండి కొండ దేవుడు రక్షించు గాక ‘’

అని   ప్రార్థించ గానే అరుణాచలేశ్వరుడు నాయనగారి కి దర్శన మిచ్చాడు .నాయన ఆయనతో ‘’స్వామీ!ఈ యావద్భారత ప్రజల దూతగా నేను ప్రార్ధిస్తున్నాను ‘’అని –

1-శ్లోకం –‘’అరుణ ధరిత్రీ ధర హరదూనాం-భరత ధరిత్రీ మవశివః దీనాం’’అన్నారు

భావం –ప్రపంచానికే దీపం అయిన భారత ధాత్రిని రక్షించు అరుణాద్రి వాసా .

2-‘’హర ! భరత క్ష్మాజనవర దూతం –కురు చరితార్ధం గణపతి మేతం’’

భావం –భారత ప్రజల దూతగా వచ్చి నీకు ఈ వార్త చెబుతున్నాను . నా మాట విని నా దేశ రక్షణ చేసి నన్ను చరితార్ధుని చేయి .

 నాయన గారి ప్రార్ధన వినేసరికి సాక్షాత్తు హర –కేశవులే నాయన రూపం లో వచ్చారా అనిపించింది అక్కడి పీఠాధిపతి గారికి .ఆయన మనసులో ఇంతచిన్న పీఠం యొక్క బాధలు ఆ మహనీయునికి చెప్పానే .రక్షకులైన హర –కేశవులే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని తెలిసికూడా అజ్ఞానం లో పడ్డాను .సమస్యల పరిష్కారానికే గణపతి ముని ఇక్కడికి వచ్చి నాకు హిత బోధ చేశారు .ఈశ్వర శరణ్యమే సర్వ సమస్యలకు పరిష్కారం అని ఆమహాముని బోధించారు ‘’అనుకొన్నారు .నాయన గారికి నమస్కరించి ఆ పీఠాధిపతి గారు ‘’ ఆచార్యా  !మీ ప్రార్ధనా శ్లోకాలను మీ ఆశీస్సులుగా భావిస్తున్నాను .ఆది శంకరుల కోవలో దేశ క్షేమాన్ని ధ్యేయంగా హైందవ తత్వ బోధలను ప్రచారం చేసి ప్రజా సేవ చేసి తరిస్తాను ‘’అంటూ ఆనంద బాష్పాలతో పలికారు .మందహాస ముఖార   వింద౦ తో నాయన ‘’ఆది శంకరుల ఆశయమే అది .అందుకే ఈపీఠాలు వెలిశాయి ‘’అన్నారు .

  నాయన ఆ రాత్రి అక్కడే పీఠం లో విశ్రమించి ,మర్నాడు ఉదయం  బయల్దేరి వెడుతూ ఒక కాగితంపై హర –కేశవ స్తుతి ‘’రాసి ‘’దీన్ని పూజా పీఠం లో ఉంచండి .సంస్థ త్వరలోనే అభి వృద్ధి చెందు తుంది ‘’అన్నారు .ఆ నోటి మాట మహాత్మ్యం ప్రకారం కొద్దిరోజుల్లోనే పోషకుల కోర్టు తగాదా తీరి ,పీఠం అభి వృద్ధికి పోషకులు ముందుకు వచ్చి ధన సాయం చేయటం,మళ్లీ పీఠం పూర్వ వైభవం పొందింది .నాయన గారి ఆశీస్సులే దీనికి కారణం అని భావించి నాయన రాసి ఇచ్చిన శ్లోకాన్ని అద్దం ముందు గోడలో స్థాపించారు .

శ్రీ స్వర్ణవల్లి పీఠం

శ్రీ స్వర్ణవల్లి మఠం, సిరిసికి 16 కి.మీ దూరంలో, శాల్మల ఒడ్డున ఉంది, చుట్టూ అరేకా మరియు కొబ్బరి తోటలు, పచ్చని అడవులు, కొండలు, లోయలు, వరి పొలాలు, వాగులు మరియు అనేక చారిత్రక కట్టడాలు-మఠాలు, దేవాలయాలు, చెరువులు. , కోట, రాతి శాసనాలు మొదలైనవి. స్వర్ణవల్లి మఠం ప్రాముఖ్యంలోకి వచ్చినప్పటికీ, స్వాది రాజు రెండవ అరసప్ప నాయకుడు హొన్నెహళ్లి గ్రామంలో శ్రీ స్వర్ణవల్లి మఠాన్ని స్థాపించి, సహస్రలింగ మఠానికి చెందిన చంద్రశేఖర సరస్వతికి మంజూరు చేశాడు.

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-23-ఉయ్యూరు —

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మహా తపస్వి శ్రీ కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని జీవిత చరిత్ర.20 వ భాగం.1.3.12.23.

మహా తపస్వి శ్రీ కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని జీవిత చరిత్ర.20 వ భాగం.1.3.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.113 వ భాగం.3.12.23

శ్రీ హర్ష నైషధం.113 వ భాగం.3.12.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మద్రాస్ లెజిస్లేటివ్ సభ్యురాలు ,వ్యక్తిగత సత్యాగ్రహి ,రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి ,సంస్కర్త,పార్లమెంట్ మెంబర్ –శ్రీమతి చోడగం అమ్మన్న రాజా- గబ్బిట దుర్గాప్రసాద్ 01/12/2023 గబ్బిట దుర్గాప్రసాద్

కృష్ణాజిల్లా మచిలీ పట్నం లో శ్రీ గంధం వీరయ్య నాయుడు ,శ్రీమతి నాగరత్నమ్మ దంపతుల పదకొండు మందిలో  ఏడవ సంతానంగా శ్రీమతి అమ్మన్నరాజా 6-6-1909 లో జన్మించారు .తండ్రి కృష్ణాజిల్లాకైకలూరు లో  బోర్డ్ స్కూల్ టీచర్ .అక్కడ స్కూలు లేదు.ఊళ్ళో ఉండి చదువుకోవటానికి చాలా ఇబ్బందులు పడి ,చివరకి రాజమండ్రి  వెళ్ళి హైస్కూల్ లో చేరి ,హాస్టల్లో ఉంటూసంపన్నులైన  శ్రీ  కంచుమర్తి  రామ చంద్రరావు గారు తమ కుమార్తె పేరిట ఇచ్చే స్కాలర్షిప్ తొ చదివి  స్కూల్ ఫైనల్ పాసయ్యారు .  అప్పుడు హాస్టల్ లో హైస్కూల్ పిల్లలు ముగ్గురో నలుగురో మాత్రమె ఉండేవారు .

  మద్రాస్ వెళ్ళి ప్రభుత్వ ఉపకార వేతనంతో కాలేజిలో చేరి ,ప్రిన్సిపాల్ మిస్ దిలాహే అనే బ్రిటీష్ వనిత తల్లిలాగా ఇచ్చిన ప్రోత్సాహక సహకారాలతో చదివి ,1932లో డిగ్రీ పాసై ,విల్లింగ్టన్ ట్రెయినింగ్ కాలేజి లో  టీచర్స్  ట్రేయినింగ్ పొంది ఎల్ .టి.పాసై ,తండ్రి రిటైర్ అవగా కుటుంబానికి ఆదాయం లేక ఇబ్బందులు పడుతుంటే తాను  ఈ మహానగరం లో హాయిగా ఉండటానికి ఇష్టం లేక ,సికందరాబాద్ గరల్స్ హైస్కూల్ లో కొంతకాలం టీచర్ గా పనిచేసి ,బాపట్లలో శ్రీ వెలగపూడి సుబ్బారావు నెలకొల్పిన  ట్రేయినింగ్  స్కూల్ లో హెడ్ మిస్త్రేస్ గా పని చేశారు .

 మౌంట్ ఫర్డ్ సంస్కరణల ఫలితంగా దేశం లో ఎన్నికలు జరిగి ,మద్రాస్ ప్రేసిడేన్సిలో ఉన్నఆంధ్రదేశంలో స్త్రీలకు  కేటాయింపబడిన ఏలూరు నియోజక వర్గానికి పోటీ చేయటానికి ఎవరూ ము౦దుకు రాకపోతే కాంగ్రెస్ పార్టి అమ్మన్న రాజాను నిలబెట్టగా ,శ్రీమతి సరోజినీ నాయుడు ,శ్రీ భూలాభాయ్ దేశాయ్ వంటి ప్రముఖులు ప్రచారం చేయగా శాసన సభ్యురాలుగా ,అతి చిన్న వయసులోనే గెలిచారు .అప్పటికి రాజకీయ అనుభవం ఏమాత్రం లేకపోయినా శ్రీ మతి ఆచంట రుక్మిణీదేవి ,కుట్టిమాల్ అమ్మ వంటి వారి సహకార ,సాహచర్యంతో రాజ నీతిజ్ఞు రాలయ్యారు .ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం రావటం బ్రిటీష ప్రభుత్వం భారత ప్రజల అభీష్టం తెలుసుకోకుండా యుద్ధంలో పాల్గొనటం వలన అవమానంగా భావించిన కాంగ్రెస్ తీర్మానం ప్రకారం 1939లో అమ్మన్నరాజాతో సహా కాంగ్రెస్ సభ్యులంతా  రాజీనామా చేసి బయటికి వచ్చారు.

 పోల్లాచిలో మునిసిపల్ ఇంజినీర్ గా ఉన్న శ్రీ చోడగం జనార్ధనరావు తొ అమ్మన్న రాజా వివాహం 27-8-1940 న జరిగి కాపురానికి పొల్లాచి వెళ్లారు .వెళ్ళిన రెండు నెలలకే  ప్రభుత్వ నిరంకుశత్వానికి ,అరెస్ట్ లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టి వ్యక్తి సత్యాగ్రహాలు ప్రారంభించగా ,దేశ జనులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో హాయిగా కూర్చోటానికి ఇష్టం లేక భర్తను ఒప్పించి ,ఏలూరు చేరి , స్వంతవూరు కైకలూరులో 1940లో వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గొని అరెస్ట్అయి , ఒక ఏడాది రాయవెల్లూరు జైలులో కఠీన శిక్ష , 500రూపాయల జరిమానా సత్కారం పొందారు బ్రిటీష ప్రభుత్వం చేత .   ఆ జైలులో ఆచంట రుక్మిణీదేవి ,కృష్ణాబాయ్ నీమ్బ్ కర్,ఉప్పల మెల్లీ షోలింగర్ అనే స్విస్ మహిళ మొదలైన స్త్రీలు 80మందితో సరదాగా గడిపారు .సాయంత్రం ఆరులోపలె భోజనాలు ఆతర్వాత గదులకు తాళాలు వేసేవారు అధికారులు .ఒక రోజు  జైళ్ళ ఇన్స్పెక్టర్ జనరల్  తనిఖీకి వస్తే అమ్మన్నరాజా ‘’మేమంతా సాధారణ నేరస్తులంకాదు. దేశం కోసం వచ్చాం .మీరు పొమ్మన్నా బయటికి పోము ఎందుకు మమ్మల్ని రాత్రంతా తాళాలు వేసి బంధిస్తారు ?“’అని అడిగితె సబబే అని పించి ,రాత్రిళ్ళు తాళాలు వేయటం మాన్పించాడు .తమలో తాము హిదీ, ఇంగ్లిష్ క్లాసులు నిర్వహిస్తూ ,చదరంగం, బాడ్ మింటన్ ఆడుకొంటూ ,నూలు వడ కటం లో పోటీలు పెట్టుకొనే వారు .శ్రీమతి వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ అతి సన్నని నాజూకు దారం తీస్తే,అమ్మన్న రాజా  అతి వేగంగా దారం తీసేవారు .జైలు జీవితాన్ని పండుగలాగా గడిపారు అందరూ .

  1941లో విడుదలై ,అమ్మన్నరాజా 1946ఎన్నికలలో ఏలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి ,డాక్టర్ కొమర్రాజు అచ్చమా౦బగారిని ఓడించి శాసన సభ్యురాలై ,అసెంబ్లీ డిప్యూటీ స్పెకర్ గా1952 వరకు  ఉన్నారు .దేవదాషీ విధానాన్ని నిరశిస్తూ ,నిర్మూలనకు చట్టం తీసుకు రావాలని తీర్మానం ప్రవేశపెట్టిన డాక్టర్ ముత్తు లక్ష్మీ రెడ్డిగారితో కలిసి ,సాధించారు .పదకొండేళ్ళ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో 1950లో వరకట్న నిరోధక చట్టం ప్రవేశ పెట్టి సాధించారు .ఇవన్నీ ఆమె శక్తి సామర్ధ్యాలకు ,సంఘ సేవానిరతికి,సంస్కార భావాలకు  దర్పణాలు .ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగి 1955లో వచ్చిన మధ్యంతర ఎన్నికలలో పశ్చిమ గోదావరిజిల్లా అత్తిలి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచి ,1960లో రాజ్యసభ  మెంబర్ అయ్యేవరకు ఉన్నారు  .ముఠారాకీయాలకు విసిగి  వేసారి ఆమె 1968లో బయటికి వచ్చేశారు .ఆంధ్రరాష్ట్ర స్త్రీశిశు  విద్యా సమితికి చైర్మన్ గా చాలాకాలం పని చేశారు .ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ చేంజి లో స్త్రీలను కూడా నమోదు చేసుకొనే అవకాశం కల్పించారు .స్త్రీలకు సాయంకాల కాలేజీలు ,ఫిజికల్ ఎడ్యుకేషన్ శిక్షణకు ప్రత్యేకకాలేజీల ఏర్పాటుకు కృషి చేశారు .90ఏళ్ళ వయసులో శ్రీమతి అమ్మన్నరాజా 22-2-1999  న మరణించారు .

 –గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~

Posted in పుస్తకాలు, రచనలు | Leave a comment

చంఘీజ్ ఖాన్.25 వ భాగం.2.12.23.

చంఘీజ్ ఖాన్.25 వ భాగం.2.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణారావు గారి కథలు

20 వ భాగం.2.12.23.

శ్రీ అవసరాల రామ కృష్ణారావు గారి కథలు

20 వ భాగం.2.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి శ్రీ కావ్య కంఠ వాసిష్ట గణపతి . ముని జీవిత చరిత్ర.19 వ భాగం.2.12.23.

Posted in రచనలు | Leave a comment

శ్రీ హర్ష నైషధం.112 వ భాగం.2.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛంఘీజ్ ఖాన్.24 వ భాగం.1.12.23.

ఛంఘీజ్ ఖాన్.24 వ భాగం.1.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామకృష్ణారావు కథలు.9 వ భాగం.1.12.23.

శ్రీ అవసరాల రామకృష్ణారావు కథలు.9 వ భాగం.1.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.111 వ భాగం.1 .12.23.

శ్రీ హర్ష నైషధం.111 వ భాగం.1 .12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఇవాళ కార్తీక గురు వారం ఉదయం ఉసిరి చెట్టు కింద రుద్రాభిషేకం

ఇవాళ కార్తీక గురు వారం ఉదయం ఉసిరి చెట్టు కింద రుద్రాభిషేకం

https://www.youtube.com/post/Ugkx0Ust8jXeFWyv-6B3KFoaSAJlU3CURIxR

https://www.youtube.com/post/Ugkxt-7GMOmtkcnZDGeCOM-R1FnnhIJsGWgm

Posted in రచనలు | Leave a comment

చెంఘీజ్ ఖాన్.23 వ భాగం.29.11.23.

చెంఘీజ్ ఖాన్.23 వ భాగం.29.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణారావు గారి కథలు.8 వ భాగం.29.11.23.

శ్రీ అవసరాల రామ కృష్ణారావు గారి కథలు.8 వ భాగం.29.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అలనాటి ఆంధ్ర మహాను భావులు-10

   అలనాటి ఆంధ్ర మహాను భావులు-10

· 10- దక్షిణాఫ్రికా భారత ప్రతినిధి వర్గ నాయకులు ,మద్రాస్ రాష్ట్ర ప్రధాని ,గవర్నర్ ,అన్నామలై యూనివర్సిటి వైస్ చాన్సలర్ -రావుబహదూర్ సర్ కూర్మా వేంకట రెడ్ది నాయుడు గారు

· నల్లగా ఉన్నా మంచి ముఖ వర్చస్సు ,ఆంధ్ర,ఆంగ్లాలలో ధారాళంగా మాట్లాడే నేర్పు ,బంగారు చట్రం కళ్ళజోడు ,ప్రకాశవంతమైన కళ్ళు ,నిడివిన దేహం తొ చూపరులకు ఆకర్షణగా ఉండేవారు రావు బహదూర్ సర్ కూర్మా వేంకట రెడ్ది నాయుడు గారు.పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రముఖ న్యాయవాది .స్థానిక సంస్థలలో పాలనానుభావం ,దేశ హిఅతికకార్యాలపైఅమితాసక్తి ఉన్నవారు .ఆకాలం లో డాక్టర్ నాయర్ ,సర్ పిటి త్యాగరాయ శెట్టి గార్లు లేవ దీసిన బ్రాహ్మణేతర ఉద్యమం జస్టిస్ పార్టీ లు దేశంలో ఇరవైయేళ్ళు తీవ్ర అలజడి సృష్టించాయి .కులతత్వాలు తారాస్థాయిలో విజ్రుమ్భించాయి .జాతీయ వాదులైన పానగల్లు రాజా ,పాత్రో, కూర్మాలుకులతత్వ వాదులుగా మారిపోయారు .బ్రాహ్మణులకు తీవ్ర నష్టం కలిగింది .సామాన్య బ్రాహ్మణేతరులు కూడా బాగా దెబ్బ తిన్నారు .

· అప్పుడే వచ్చిన మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ ల సంస్కరణలు ఈవిభేదాలను పూర్తిగా అణచి వేసి ఎన్నికలలో సమైక్యత ఏర్పడింది .ప్రజలు ఉద్యోగాన్వేషణలో పడ్డారు .మంచి వక్త అయిన కూర్మా నాయుడుగారు 1920లో పానుగల్లు రాజా మంత్రివర్గం లో స్థానం సంపాదించి ఆంధ్రులకు గర్వ కారణమయ్యారు .అయినా కులం బాగా పని చేసి ఆయన కు మంత్రివర్గంలో నామమాత్రం అయ్యారు .లాభం లేదని ప్రతిపక్షంలో చేరి సమర్ధతచాటి ఒక ఊపు ఊపారు నాయుడుగారు .మంత్రి వర్గం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు యే వైపుకు మొగ్గక తటస్థంగా ఉన్నారు .సమయం కోసం ఎదురు చూస్తున్న నాయుడుగారికి ,కోయంబత్తూరు బ్రాహ్మణేతర మహా సభ వారు గోషెన్ ప్రభువుపై నిరసన చూపితే కొమ్ముకాశారు .అందరూ కాదన్న సైమన్ కమీషన్ ను సమర్ధించారు .ఇంగ్లాండ్ లో సైమన్ కు విందు జరుగుతుంటే సందు చూసుకొని వెళ్ళి బ్రిటీష ప్రభుత్వం చేసిన మేళ్ళ ను బాకా బజాయించి మహాబాగా ఊదారు .స్తోత్ర పాఠకుని మించిపోయారు .వీరి ప్రభు భక్తీ గమనించి ఆంగ్లప్రభుత్వం నాయుడుగారిని జెనీవా లో అంతర్జాతీయ సమావేశానికి ,రైటానరబుల్ శ్రీని వాస శాస్త్రి గారి తర్వాత భారత ప్రతినిధిగా పంపింది.1933-34 స్టేట్ కౌన్సిల్ సభ్యునిగా నియమింపబడ్డారు .మద్రాస్ ప్రభుత్వ లా మెంబర్ సర్ ఎం కృష్ణ నాయర్ మరణించాక ,నాయుడు గారికి ఆచాన్స్ దక్కించింది ప్రభుత్వం.వీర విధేయతకు వీర తాడు వేసింది .ఆయన ఆంధ్రుడు అని మనం గర్వంగా కాలరు ఎగరేసినా కొల్లాయి గుడ్డ స్వరాజ్య గాళ్లను నాయుడు గారు ‘’ఖైదీలకు మజ్జిగ అడిగేరు సుమా .నేను లేదనాల్సి వస్తుంది ‘’లాంటి లేకిమాటలు మాట్లాడి హృదయాలను గాయ పరచారు .

· నాయుడుగారిజీవితం నల్లెరుమీద బండిలా సాగింది .సర్ హోప్ టన్ స్టోక్స్ పదవి నుంచి విరమించుకోన్నాక ప్రభుత్వ కార్య నిర్వాహక సంఘ ఉపాధ్యక్షులై ,శాసన సభ నాయకుడు కూడా అయ్యారు నాయుడు గారు .గవర్నర్ ఎర్కిన్సన్ సెలవుపై వెళ్ళటంతో గవర్నర్ హోదాకూడా పొందారు .ఠీవిగా దర్జాగా ఉన్నతంగా,సామర్ధ్యంగా పదవిని నిర్వహించి మంచిపేరు తెచ్చుకొన్నారు .బ్రిటీష ప్రభుత్వ గవర్నర్ ,కార్య దర్శి మంత్రి,అయిన ఆనాటి మేటి ఆంధ్రులలో పానగల్లురాజా ,సర్ బి ఎన్ శర్మ ,సర్ కూర్మా నాయుడు,ఈడుపుగంటి రాఘవేంద్రరావు గార్లున్నారు .

· ఇరవై ఏళ్ళు కులరాజకీయాలతో లాభం పొందిన జస్టిస్ పార్టి 1936ఎన్నికలలో ఇక ఎన్నడూ కోలుకోలేని చావుదేబ్బతిన్నది .నాయకులు ,మంత్రులు జమీందార్లు మట్టి కరిచిపోయారు .కాంగ్రెస్ వారు మంత్రి పదవులు తీసుకోవాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు .బొబ్బిలిరాజా ,శ్రీనివాసశాస్త్రి సర్ మహమ్మద్ ఉస్మాన్ వంటి వారు భారం మోయటానికి వెనక్కి తగ్గారు .దక్షిణాఫ్రికాలో ప్రభుత్వఏజేంట్ గాఉన్న కూర్మా నాయుడు గారు ముందుకు వచ్చి ఆనడ మంత్రపు సిరిని నెత్త కెత్తుకున్నారు .కానీ కొల్లాయి మూకల శివ తాండవం ముందు నిలవలేక పోయారు .

· అయినా బ్రాహ్మణేతరుల పక్షాన నాయుడుగారు పొందాల్సిన రాచ మర్యాదలన్నీ పొందారు .జాయింట్ కమిటీ పార్లమెంటరి వర్గానికి నాయకుడు గా లండన్ వెళ్లారు ‘’మద్రాస్ కాన్ష్టి ట్యూషనల్ లా’’ లో లెక్చరర్ అయ్యారు .ఆంధ్రయూని వర్సిటి స్నాతకోత్సవంలో ఉపన్యసించారు .నాట్యకళ ,కళాపరిషత్ లను ప్రోత్సహించారు .ఇప్పుడు వారి జనన ,విద్యాది విషయాలు తెలుసుకొందాం.

· కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు (1875 – 1942) ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ప్రొఫెసర్, రాజకీయవేత్త ప్రజా సేవకులు. మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు.

· వీరు రాజమండ్రిలో ప్రఖ్యాత తెలగ సైనిక యోధుల కుటుంబీకులగు బాపనయ్య నాయుడు దంపతులకు జన్మించారు. వీరు యునైటెడ్ హైస్కూలులో చదివి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో బి.ఎ.పరీక్షలో 1894లో కృతార్థులయ్యారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకునిగాను, అమలాపురం బోర్డు హైస్కూలులో ఉపాధ్యాయునిగా కొంతకాలం పనిచేసి, వీరు 1900 సంవత్సరంలో బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై రాజమండ్రిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అచిరకాలంలోనే మంచి పేరుతెచ్చుకున్నారు. గోదావరి జిల్లా విభజన తర్వాత ఏలూరుకు నివాసాన్ని మార్చి అక్కడి న్యాయవాదులలో అగ్రశ్రేణికి అందుకున్నారు. కొంతకాలం రాజమండ్రి, ఏలూరు పురపాలక సంఘాలకు అధ్యక్షులుగా పనిచేశారు.

· గ్రామ ప్రజల శ్రేయోభివృద్ధికి, వారి ఇబ్బందులను తొలగించడానికి, ప్రారంభ విద్యా వ్యాప్తికి మిక్కిలి కృషిచేస్తూ స్థానిక సంస్థలలో తన పలుకుబడిని వినియోగించి ప్రజల ఆదరానికి పాత్రులయ్యారు.

· వీరు 1929లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ మహాసభా సమావేశానికి భారత ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్ళారు. దక్షిణాఫ్రికాలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యారు. తరువాత మద్రాసు ప్రభుత్వ లా మెంబరుగా నియమించబడ్డారు. ప్రభుత్వ కార్యనిర్వహక సభ్యులై శాసనసభకు నాయకులయ్యారు. మద్రాసు గవర్నరు ఎర్ స్కిన్ సెలవు పుచ్చుకున్నప్పుడు వీరు మద్రాసు గవర్నరు పదవిని అలంకరించారు.

· 1936లో ఎన్నికలకు తరువాత, కాంగ్రెస్ పరిపాలన నిరాకరించిన రోజులలో ఉమ్మడి మద్రాసు మధ్యంతర మంత్రి మండలిని ఏర్పరచి మూడు నెలలు ప్రధానిగా పరిపాలన నిర్వహించారు.

· 1940లో చిదంబరంలో అన్నామలై విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులయ్యారు. సుప్రసిద్ధ నాటక విమర్శకులు, న్యాయవాది కూర్మా వేణుగోపాల స్వామి వీరి కుమారుడు.

సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర 17 వ భాగం.28.11.23.

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర 17 వ భాగం.28.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.110 వ భాగం.28.11.23.

శ్రీ హర్ష నైషధం.110 వ భాగం.28.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.27.11.23.

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.27.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర 16 వ భాగం.27.11.23.

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర 16 వ భాగం.27.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.109 వ భాగం.27.11.23.

శ్రీ హర్ష నైషధం.109 వ భాగం.27.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛంఘీజ్ ఖాన్.21 వ భాగం.26.11.23.

ఛంఘీజ్ ఖాన్.21 వ భాగం.26.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కధలు.6 వ భాగం.26.11.23.

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కధలు.6 వ భాగం.26.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర 14 వ భాగం.25.11.23.

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర 15వ భాగం.26.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.108 వ భాగం.26.11.23.

శ్రీ హర్ష నైషధం.108 వ భాగం.26.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

చెంఘీజ్ ఖాన్.20 వ భాగం.25.11.23.

చెంఘీజ్ ఖాన్.20 వ భాగం.25.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు గారి కథలు.25.11.23.