శ్రీ హర్ష నైషధం.107 వ భాగం.25.11.23.

శ్రీ హర్ష నైషధం.107 వ భాగం.25.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

చెంఘీజ్ ఖాన్.19 వ భాగం. 25.11.23

చెంఘీజ్ ఖాన్.19 వ భాగం. 25.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అలనాటి ఆంధ్ర మహాను భావులు-9 -కవి పండిత పోషక ,దాన కర్ణ ,సంస్కర్త ,విద్యా వినయ ఔదార్యశీలి  జమీందారు గాంధి , ,కళాప్రపూర్ణ -పిఠాపురం మహా రాజా శ్రీ రావు వేంకట మహీమతి సూర్యారావు బహద్దర్

·         ,  అలనాటి ఆంధ్ర మహాను భావులు-9

·         9-కవి పండిత పోషక ,దాన కర్ణ ,సంస్కర్త ,విద్యా వినయ ఔదార్యశీలి  జమీందారు గాంధి , ,కళాప్రపూర్ణ -పిఠాపురం మహా రాజా శ్రీ రావు వేంకట మహీమతి సూర్యారావు బహద్దర్

·         ధోవతిపై మోచేతులు దాటని చొక్కా తొ సాధారణంగా కనిపించే పిఠాపురం మహా రాజా శ్రీ రావు వేంకట మహీమతి సూర్యారావు బహాద్దర్

·         ఆంధ్ర దేశంలో సేవావిధానానికి అంతటికీ కర్తా ,కర్మ క్రియ .ఉత్తమోత్తమ సంస్కారి .సంస్కారం మాటలతోకాదు చేతల్లో చూపాలని, చేసి చూపినవారు .కానీ ఆకాలం లో సంఘ సంస్కరణ పేరు చెప్పినా ,బాల్య వివాహాలు వద్దన్నా ,వితంతు వివాహాలు చేయాలన్నా ,అస్పృశ్యత వద్దు అన్నా పూర్వా చార పరాయణులు కస్సుమని ఒంటికాలిపై లేచి సంఘం నుంచి వెలి వేసేవారు .బిపిన్ చంద్ర పాల్ తొ కలిసి టీ తాగినా వెలి ,సముద్రయానం చేసి వచ్చినా ,ఆవచ్చిన వారింట భోజనం చేసినా వెలి ,ఆడపిల్లల్ని బడికి పంపితే వెలి .అలాంటి గడ్డుకాలం లో పిఠాపురం రాజా అందరికి అండగా నిలబడి సంస్కరణలు జరగటానికి పెద్ద ఎత్తున సాయం చేశారు .యువకుడు విద్యావంతుడు సేవానిరతుడు సంస్కరనాభి లాషి అవటంతో సంస్కరతలకు వెన్ను దన్నుగా నిలబడ్డారు కొండంత బలం వచ్చింది సంస్కరణ వాదులకు ఆర్ధికంగా హార్దికంగా వారిని ప్రోత్సహించారు. ఆయన చేతికి ఎముక లేని దీనజన బాంధవులు .శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి అమోఘ ప్రభావం పడి ,ప్రజాభిమానం ,పరోపకార పారీణత ,దేశ సేవా దురంధరులుగా మారారు .మొక్కపాటి సుబ్బారాయుడు అనే సుగుణ సంపన్నుడు రాజావారికి దివాన్ గా ఉంటూ మరింత కార్య శూరుల్ని చేశారు .ప్రాచీన విద్యలకు ఆదరణ ,దీన జనోద్ధరణ ,జ్ఞానవ్యాప్తి దాదాపు ముప్పై ఏళ్ళు  నిరాటంకంగా కొనసాగించిన మహాను భావులు ఆయన .

·           మహారాజా వారికాలం లో పిఠాపురం మహా గొప్ప పుణ్య క్షేత్రమైంది కవి పండితులకు నిలయమైంది , సకల కళోద్ధరణ జరిగింది.అభినవ భోజ ,అభినవ కృష్ణరాయలు అని ఆయన్ను అందరూ కీర్తించారు .పిఠాపురం ళో , రాజమండ్రిలో  ఉన్నత పాఠశాలలు స్థాపించి విద్యా వ్యాప్తి చేశారు .కాకినాడలోని తమకాలేజీని సెకండ్ గ్రేడ్ నుంచి ఫస్ట్  గ్రేడ్ గా మార్చారు .ఉన్నత విద్యాభ్యాసలకోసం విదేశాలకు వెళ్ళే విద్యార్ధులకు ప్రోత్సాహంకల్పించి ఆర్ధిక సాయం చేశారు .రవీంద్రుని ఆహ్వానించి సన్మానించి పుష్పవర్షంతోపాటు కనక  వర్షాన్నికురిపించి  శాంతినికేతన అభి వృద్ధికి తోడ్పడ్డారు .

·          అప్పటికి ఇంకా గాంధీకి అస్పృశ్యతా నివారణపై దృష్టికలగలేదు ఆయన  కంటే ముందే ఆలోచించి రాజాగారు ,నిమ్నజాటి ఉద్ధరణకు పూనుకొని మహోపకారం చేశారు .హరిజన విద్యార్ధులకు సవర్నులతోపాటు సమాన స్థాయి  కల్పించారు .హరిజన విద్యార్ధులకోసం కాకినాడలో ,పిఠాపురంలో హాస్టళ్ళు నిర్మించి భోజన వసతులు కల్పించి హరిజనోద్ధరణ నిండు మనసుతో చేశారు .రాత్రి పాఠశాలలు స్థాపించి వయోజన విద్యకు ప్రోత్సాహం కల్పించారు .గాంధీ హరిజనోద్ధారణం ప్రారంభించగా తనవంతు పూర్తి సహకారం అందించి హరిజన బాంధవుడు అని పించుకొన్నారు .డాక్టర్ బార్నాడో లాగా రాజావారు అనాధ శరణాలయాలు నెలకొల్పి అధోజగత్ సహోదరులకు కూడు నీడ విద్య అందించి ప్రగతి పధంలో నడిపించారు .దిక్కు లేనివారికి దేవుడే దిక్కు అన్నట్లు ఆ దేవుడే తామే అయ్యారు .స్త్రీసంక్షేమం ఆయన ఆదర్శం .రాజమండ్రిలో వీరేశలింగం గారు స్థాపించి అనాధ శరణాలయం ఒక్కటే ఉంది .పంతులుగారు చనిపోయాక తామేదాన్ని స్వీకరించి .ఖర్చు అంతా భరిస్తూ ,స్త్రీలకూ వితంతువులకు విద్యా విద్యలను ఉచితంగా అందించిన దేశోద్ధారకులాయన .పిఠాపురం లో బెత్సడా విద్యాలయానికి అనుబంధంగా స్త్రీలకూ శిశువులకు ఒక ప్రత్యెక వార్డు నిర్మించారు .అక్కడికి చికిత్స కోసం వచ్చే వారికి భోజన వసతి కలిగించటానికి ఒక ధర్మ సత్రం కట్టించి చక్కగా నడిపించారు .సంఘం లో కులటలుగా  పిలువబడే వేశ్యలకు వివాహాలు చేయించి వారికి జీవన స్రవంతిలోకి మళ్ళించి సానులను సంసారినులను చేసిన మహోన్నత వ్యక్తి రాజావారు .ఇలాస్త్రీల క్షేమాన్ని సంక్షేమాన్ని కాపాడిన మానవోత్తములాయన .   ఒక్కపూట అయినా తిండికి దిక్కులేక మాడిన డొక్కలతో కళేబరాల్లాగా ఉన్న దీనజనులకు సకల సదుపాయాలతో గృహాలు నిర్మించి ,పర్వదినాలతో పిండి వంటలతో సహా భోజనాలు పెట్టించిన దరిద్రజన రక్షకులు .బీదలకు మహిళలకు ఆరోజులూ ఈ మహారాజు చేసిన సేవ వేరెవరూ చెయలేదు.ఐరోపా యుద్ధ సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడి ధన సాయం చేసి ,పేదలకు ఉచితంగా బియ్యం ఇప్పించారు .భారతీయ యుద్ధ నిధికి ,చెన్నపురియుద్ధనిదికి భూరి విరాళాలు అందించారు .దక్షిణాఫ్రికా భారతీయ సహాయ నిధి ,క్వెట్టా భూకంప నిధి ,ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తి సహాయ నిధి ,జార్జి చక్రవర్తి జూబిలీ నిధి,జ్ఞాపక నిధి ,క్షయ నివారణ నిధి మొదలైన వాటికి పుష్కలంగా ధన సహాయం చేసిన సుగుణ నిధి రాజావారు .

·           పిఠాపురం రాజా వారి భాషాసేవ అమూల్య మైనది .మహాభాష్యానికి ఆంధ్రీకరణ చేయించారు .సీతా నాద తత్వ భూషణ్ గారి అమూల్య గ్రంధాలను ముద్రి౦పించారు . తెలుగు నిఘంటువును పునరుద్ధరించారు .పరిశుద్ధాస్తిక ధర్మ ప్రచారానికి చాలాపెద్ద మొత్తం లో మూల నిధి ఏర్పాటు చేశారు .బ్రహ్మ సమాజ ఉపాసకులకు కాకినాడలో దివ్య మందిరం కట్టించారు .పండిత శివనాద శాస్త్రి, హేమ చంద్ర సర్కార్ వంటి వారిని ఆహ్వానించి సత్కరించారు .విసుగు పుట్టే పరిస్తితుల్లోనూ నవ్వుతూ దానాలు చేశారు ,,పుచ్చుకొని పుచ్చుకొని విసుగు చెందేవరకు, ,సంస్కర్తలు తీసుకొని తీసుకొని సిగ్గుపడే దాకా పిఠాపురం మహారాజా ఇస్తూనే ఉన్నారు ఆ అభినవ దాన కర్ణులు. రాజాగారి మూర్తి మత్వాన్ని ఆవిష్కరించే పద్యరాజాలు  –

·         1-‘’సీ-‘’వేదముల్ లాభము లేదంచు వదలిన- బ్రాహ్మణుల్ మరల జేబట్టినారు – శాస్త్రంబు లెల్ల నిష్ఫలములే యనుకొన్న –భూసురుల్  బఠియింప బూనినారు  -కావ్య౦బు లింకకొరగావంచు విడిచిన –విప్రసత్తములు సేవి౦చినారు- కవిత ముమ్మాటి కక్కరకురాదనుకొన్న –ద్విజ వరుల్ దాని  నర్ధించినారు 

·         తే- గానము వృధా యటంచు మాను కొన్న –పుడమి వేల్పులు నేర్వంగ గడగినారు –నీ కటాక్షంబు కలిమిని నేడు మరల –సూరిజన  రక్షణోపాయ సూర్యరాయ ‘’.

·         2-సీ-‘’స్థాపించు చున్నావు శరణాలయము ల నాథ – జనంబులకు నెల్ల దయ దలిర్ప –నెలకొల్పు చున్నావు నిశి పాఠశాలల నిరుపేదలకు నెల్ల నెనరు మిగుల –బాలించు చున్నావు బ్రసవ శాలల స్త్రీల – కష్టముల్ గట్టెక్క కరుణ దనర  -గట్టించు చున్నావు ఘన వైద్య శాలల –నోరు లేనట్టి జంతువులకెల్ల

·         తే-నిలుపు చున్నావు సత్రముల్ నిండు వేడ్క –నార్తులకు నెల్ల నిత్యంబు నన్న మిడగ-నీ యుదారత వర్ణన సేయ దరమె-యారయ జనగేయ శ్రీరావు సూర్యరాయ .’’

·         3-సీ—‘’హూణ విద్యా పరితోషకుండవనంగ –నీ కళాశాలలే నిత్య సాక్షి –సరస గీర్వాణ భాషాభిమాని వనంగ –శాస్త్ర విద్యాపరిషత్తు సాక్షి –ఆంధ్రకవిత్వా హ్లాదుడవనంగ-నవ్య ప్రబందావనంబె సాక్షి  -మానినీ విద్యాభిమాన మాన్యుడ వన-బాలబాలికాజన పాఠశాల సాక్షి-

·         టీ- నిర్మలాస్తిక్య పదవుడవు నీ వనంగ –బ్రహ్మమతతత్పరంబె ప్రబల సాక్షి –నీకు సరి సేయ దగు నట్టినృపతులెవరు-సూరిజన గేయ శ్రీ రావు సూర్య రాయ ‘’

·         4-‘’ఇనుడ !నీ సాయమ్మపేక్షింప కుండ  నే –పాఠశాలయు గట్ట బడుట లేడు –అనఘ !నీ తోడ్పాటు నంద కుండంగ నే –భోజనాలయము నిల్వ బడుటలేదు –ధర్మజ్ఞ!నీ దాన ధనము లేకుండ నే పఠన మందిరము నేర్పడుట లేడు – జనమిత్ర!నీదు బాసట లేకయుండనే –పరిషత్తు స్థాపింప బడుట లేదు

·         తే-భూప రత్నమ ! యేప్రతిష్టాపనమును –సాగుటయె లేదుప్రేక్ష్యంబు లేక –చినుకులను ,జుక్కలను లెక్క చేయ వచ్చు –నీదు ధర్మంబుల గణియి౦ప రాదు సుమ్ము .’’

·         5- తే-‘’గాయకు౦ డైన బుధుడైన గవియు నైన –వాయువును బీల్చకుండిన వాడు ,నీదు –సాయ మొ౦దనివాడు  భూస్థలిని లేడు – బళిర! శ్రీ సూర్యరాయ !విద్వద్విధేయ ‘’  

·         ఇప్పుడు రాజావారి జననాదులు తెలుసుకొందాం .

·         రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు పిఠాపురం సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివారు.

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

చెంఘీజ్ ఖాన్.18 వ భాగం.23.11.23.

చెంఘీజ్ ఖాన్.18 వ భాగం.23.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు గారి కథలు.3 వ భాగం.23.11.23.

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు గారి కథలు.3 వ భాగం.23.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర 12 వ భాగం.23.11.23.

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర 12 వ భాగం.23.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.105 వ భాగం.23.11.23.

శ్రీ హర్ష నైషధం.105 వ భాగం.23.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.17 వ భాగం.22.11.23

ఛ౦గిజ్ ఖాన్.17 వ భాగం.22.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర 11 వ భాగం.22.11.23.

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర 11 వ భాగం.22.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.104 వ భాగం.22.11.23

శ్రీ హర్ష నైషధం.104 వ భాగం.22.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.16 వ భాగం.21.11.23

ఛ౦గిజ్ ఖాన్.16 వ భాగం.21.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.12 వ భాగం.21.11.23.

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.12 వ భాగం.21.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర 10 వ భాగం.21.11.23.

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర 10 వ భాగం.21.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.103 వ భాగం.21.11.23.

శ్రీ హర్ష నైషధం.103 వ భాగం.21.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.15 వ భాగం.20.11.23

ఛ౦గిజ్ ఖాన్.15 వ భాగం.20.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.11 వ భాగం.20.11.23.

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.11 వ భాగం.20.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి శ్రీ కావ్య కంట గణపతి ముని గారి చరిత్ర.9వ అధ్యాయం.20.11.23.

మహా తపస్వి శ్రీ కావ్య కంట గణపతి ముని గారి చరిత్ర.9వ అధ్యాయం.20.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.102 వ భాగం.20.11.23.

శ్రీ హర్ష నైషధం.102 వ భాగం.20.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.14 వ భాగం.19.11.23

ఛ౦గిజ్ ఖాన్.14 వ భాగం.19.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.10 వ భాగం.19.11.23.

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.10 వ భాగం.19.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి శ్రీ కావ్య కంట గణపతి ముని గారి చరిత్ర.8 వ అధ్యాయం.19.11.23.

Maha తపస్వి శ్రీ కావ్య ktha గణపతి ముని గారి చరిత్ర.8 వ అధ్యాయం.19.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.101 వ భాగం.19.11.23.

శ్రీ హర్ష నైషధం.101 వ భాగం.19.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.13 వ భాగం.18.11.23

ఛ౦గిజ్ ఖాన్.13 వ భాగం.18.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.9 వ భాగం.18.11.23.

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.8 వ భాగం.17.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి శ్రీ కావ్య కం tha వాసిస్ట గణపతి ముని గారి చరిత్ర.7 వ భాగం.18.11.23.

మహా తపస్వి శ్రీ కావ్య కం tha వాసిస్ట గణపతి ముని గారి చరిత్ర.7 వ భాగం.18.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.100 వ భాగం.18.11.23.

శ్రీ హర్ష నైషధం.100 వ భాగం.18.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

  అలనాటి ఆంధ్ర మహాను భావులు-8

  అలనాటి ఆంధ్ర మహాను భావులు-8

8-ప్రముఖ న్యాయమూర్తి ,సాంఘిక సేవాకర్త సంస్కర్త ,దాత – సర్ ముత్తా వేంకట సుబ్బారావు గారు

ఎక్కడో ఒరిస్సాలోని కటక్ లో జన్మించి కృష్ణా జిల్లా బందరులో పర్ర మీద పెరిగిన ముత్తా వేంకట సుబ్బారావు గారు ఆ గాలి మహాత్మ్యం ఏమో ‘’ధర్మపాలనలో ఇంతటి వారు లేరు ‘’అని ఆనాటి మద్రాస్ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ,లయోనేల్ లీచ్ ,అడ్వకేట్ జనరల్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ,న్యాయమూర్తి పి వెంకటరమణారావు ,మద్రాస్ న్యాయవాదుల సంఘాధ్యక్షులు ఎస్.శ్రీనివాస అయ్యంగార్ వంటి న్యాయ కోవిదుల చేత ప్రశంసలు పొందారు .

 ముత్తావారు మద్రాస్ చేరి ,ప్రముఖ లాయర్ రాదాకృష్ణయ్యర్ గారితో కలిసి లా ప్రాక్టీస్ చేశారు .తనంత వారు లేరని కొద్దికాలం లోనే నిరూపించుకొన్నారు .అతి కొద్దికాలం లోనే న్యాయమూర్తి పీఠం అధిష్టించారు .’’ధర్మ శాస్త్ర పాలనం అంటే కళ్ళు మూసుకొని,నడిచిన దారిలో నడవటం కాదు .నాగరక సంఘానికి ధర్మ ప్రతిష్టాపనమే ఆధారం ‘’అనే ఉత్కృష్ట భావంతో ప్రతి చర్యలో, వేసిన ప్రతి అడుగులో ఆశయాలను ఆచరణలోకి తెచ్చారు .అనేక మానసిక ప్రవృత్తులు ఉన్న సంఘం లో ,సాధ్యమైనంతవరకు నిజాన్ని గ్రహించి న్యాయం స్థాపించటమే తమ ధ్యేయం అనే వారు .న్యాయ స్థాపన కోసం అధికారుల ప్రాపకాన్ని కోరలేదు ,ఆగ్రహానికి బెదరలేదు .అప్రతిహతమైన స్వాతంత్ర్యాభిలాష ,సర్వ జనాదారణమైన ధర్మానురాగం ,నిరుపమాన మేధాసంపద ఆ న్యాయమూర్తి సుగుణ సంపదలు .

 న్యాయాన్ని తవ్వి న్యాయ ,ధర్మ ప్రతిష్ట చేయటంలోనే  న్యాయమూర్తి గొప్ప తనం ప్రతిఫలిస్తుందని నమ్మారు .ఈ సద్గుణాలన్నీ సుబ్బారావుగారి ప్రతి తీర్పులోనూ స్పష్టంగా రుజువైంది .ఇరు పక్షాలవాదాలు సమగ్రంగా విని ఖచ్చితమైన న్యాయ నిర్ణయం చేసేవారు .హిందూ  ధర్మ శాస్త్రాలు ఈ కాలానికి పనికి రావు అని ఆయన భావించలేదు .వాటిని పూర్తిగా అవలోడనం చేసుకొని, న్యాయ మూర్తిగా రాణించారు .వ్యాపార పరిశ్రమ వలన కలిగే మార్పులను మనసులో పెట్టుకొని హిందూ న్యాయ సూత్రాలకు సంబంధించిన వారసత్వ౦ లో అనుకూల నియమాలు చేస్తూ వచ్చారు .ఆధ్యాత్మిక ఉద్దేశ్యం తొ  దత్తతచేసుకొన్నా ,అది భౌతిక కార్యంగానే ఉండాలన్నారు .స్త్రీల హక్కులను ఎంతవరకు కాపాడాలో అంతవరకూ శక్తి వంచన లేకుండా కాపాడారు .హిందూ మతం వదిలి వేరొక మతం లో చేరి ,మళ్లీ హిందూ మతం లోకి చేర్చుకోవటం శాస్త్ర విరుద్ధం కాదన్నారు .హిందూ మతంలో పంచమ వర్ణం , అస్పృశ్యత లేవన్నారు .సర్ సుబ్రహ్మణ్య అయ్యర్ వంటి వారు ప్రారంభించిన ‘’రైతు హక్కు రక్షణ ‘’ను మనస్పూర్తిగా కొనసాగించారు .

  ‘’సుబ్బారావు గారి కంటే ఎక్కువ చదివినవారు ,ఎక్కువ తెలివిగలవారు,ఎక్కువ గొప్పతనం ఉన్నవారు  ఉంటే ఉండచ్చు కాని,ఈ మూడు సుగుణాలు సుబ్బారావు గారిలో త్రివేణీ సంగమం గా కలిసి ఉన్న వారు మాత్రం ఎవ్వరూ లేరు ‘’అంటారు .జస్టిస్ వేంకట రమణా రావు  గారు  .గొప్ప న్యాయమూర్తిగా మాత్రమేకాక ,గొప్ప సంఘ సంస్కర్తగా ,,సాంఘిక సేవాకర్తగా ,దాత గా ప్రసిద్ధిపొందారు .మద్రాస్ లో  సుబ్బారావు ,శ్రీమతి ఆండాలమ్మదంపతులు స్థాపించిన ‘’సేవాసదనం ‘’వారి సేవకు దాతృత్వానికి గొప్ప ఉదాహరణ .ఇందులో భర్తలు లేని స్త్రీలు ,దిక్కు లేని వారు హరిజన బాలబాలికలు చక్కని వసతి భోజన ,వస్త్ర సౌకర్యాలతో విద్య ను అభ్యసిస్తున్నారు .వృత్తి విద్య నేరుస్తూ తమ కాళ్ళపై తాము నిలబడుతున్నారు .అన్ని రకాల వినోదకార్య క్రమాలు వారికి మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి .ఆ నాడే ఆ భవననికి వారు సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేశారు .దంపతులు అతి సున్నిత హృదయులు .ఉదారభావం ఉన్నవారు హిందూ ధర్మ శాస్త్రాలపై అపార గౌరవం ఉన్నవారు  .

1903లో మద్రాస్ లో వకీలుగా నమోదై ,1921లో మద్రాస్ హైకోర్ట్ జడ్జి గా నియమింపబడ్డారు .అంత చిన్నవయసులో ఈ పదవి పొందిన వారిలో సుబ్బారావు గారే మొదటి వారు .1936లో ‘’నైట్ హుడ్ ‘’గౌరవం పొందారు ..శ్రీమతి ఆ౦డాలమ్మ ను వివాహమాడారు .’’కాన్సీక్వెంషియల్ ట్రూత్ ‘’కు నిబద్ధులు .ప్రతి విషయంలో పరిపూర్ణత కోరేవారు .ఆయన మరణానంతరం , గౌరవ సూచకంగా మద్రాస్ టి.నగర్ లో ‘’సర్ ఎం .వేంకట సుబ్బారావు మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరి స్కూల్ ‘’ను 1971లో స్థాపించారు .1987లో శ్రీమతి ఆండాల్ స్కూల్ స్థాపించారు .సేవాసదన్ లో సుమారు 1200వందలమంది కూర్చునే ఆడిటోరియం సకల సౌకర్యాలతో నిర్మించారు .ఇంతకంటే వివరాలు లభ్యం కాలేదు .

  మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తిగా 17 సంవత్సరాలు పని చేసి న్యాయ ధర్మాలకు ఆలవాలంగా ఉన్నారు జస్టిస్ ముత్తాసుబ్బారావుగారు.భారతీయ స్కౌట్ సంఘానికి  స్వాతంత్ర్య ,సాహస ,స్వదేశాభిమానాలు నూరిపోసిన మానవీయ మూర్తి వారు .వారిని కీర్తిస్తూ శ్రీ పురాణం సూర్యనారాయణ తీర్ధుల వారు రచించిన పద్యం అక్షర సత్యం .అక్షర లక్షల విలువ కలది –

‘’సీ- ‘’న్యాయశాస్త్రాబ్దిఅంతస్సారము గ్రహించు- తలపుతోలెస్సగా తడిసి నావు – ఆంధ్రు లందరును గా కఖిలదేశము గర్వ –పడన్యాయమూర్తితన్ పడసినావు –తీర్పు చెప్పుట యందు ,మార్పుచేయుట యందు –ధర్మ దేవత కింత దడిసినావు –సచ్చరిత్రాదులౌ సద్గుణమ్ముల చేత –విహితుల మదులలో విడిసి నావు

తే-నీదు యోగ్యత గుర్తించి,నిను నుతించి-సర్ బిరుదమిచ్చికొనలేదె చక్రవర్తి –అశ్రితాప్త విధేయ ,నిరంతరాయ –సూరిజన గేయ వేంకట సుబ్బరాయ ‘’

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-23- ఉయ్యూరు

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.8 వ భాగం.17.11.23.

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.8 వ భాగం.17.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి శ్రీ కావ్య కం tha వాసి స్ట గణపతి ముని గారి చరిత్ర.6 వ భాగం.17.11.23.

మహా తపస్వి శ్రీ కావ్య కం tha వాసి స్ట గణపతి ముని గారి చరిత్ర.6 వ భాగం.17.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.99 వ భాగం.17.11.23.

శ్రీ హర్ష నైషధం.99 వ భాగం.17.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆంధ్ర మహాను భావులు (నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం)-7

,  అలనాటి ఆంధ్ర మహాను భావులు (నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం)-7

7-ఆంధ్రభోజ ,సాహితీ వల్లభ ,కళాప్రపూర్ణ , గ్రంథ కర్త ,పారిశ్రామిక వేత్త ,రైతు నేస్తం తణుకు తాలూకా బోర్డ్ అధ్యక్షులు  శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజుగారు

మహా భాగ్యవంతమైన భూస్వామి కుటుంబం లోజన్మించినా ,సామాన్యరైతుగానే నీరుకావి పంచ ,మోచేతులు దాటని ముతక చొక్కా బుజంపై ఏదో ముతక ఖద్దరు పైపంచ  ధరించేవారు .మంచి సాహిత్య పరిజ్ఞానమున్నవారు తెలుగు సంస్కృతాలలో .ఆయన తన సాహితీ మిత్రులు నారాయణ శాస్త్రి ,సూర్య నారాయణా రాజు గార్లతో  ఊరుకు దూరంగా ఉన్న తమ మామిడి తోటలో తరుచు కలుసుకొంటూ’’మృచ్ఛ కటికం ‘’లాంటి నాటకాలు చదువుతూ విశ్లేషించుకొంటూ ,ప్రాచీన కవులు సృష్టించిన పాత్రలను ,మానసిక ప్రవృత్తులను ,ఈకాలం వారి మనో  వృత్తులకు  ఉన్న భేదాలను క్షుణ్ణంగా చర్చించి అవగాహన చేసుకొనేవారు .తణుకు లాంటి పట్టణం లో ఉన్నా ఆర్భాటం లేని సాహిత్యోపజీవిగా తిమ్మరాజు గారు ఆంధ్ర దేశం లో ఆదర్శ ప్రాయులు .

  ఆయన జీవితం గ్రామ పునరుద్ధరణకే అంకితం చేశారు .ఇర్రిగేషన్ అడ్వైజరీ బోర్డ్ ,,జిల్లా ఎడ్యుకేషన్ కౌన్సిల్ ,,ప్రాధమిక విద్యాసంఘం వంటి ఎన్నో సంస్థలతో సంబంధం కలిగి తమ అదికారాన్నీ ,పలుకుబడిని ఉపయోగించి ప్రజోపయోగ కార్యక్రమాలు లెక్కలేనన్ని చేశారు .ప్రజాభిమానమే ఆయన ను తణుకు తాలూకా బోర్డ్ అధ్యక్షులుగా తొమ్మిదేళ్ళు పని చేయటానికి తోడ్పడింది .ఆ తాలూకా అభి వృద్ధి అంతా తిమ్మరాజు గారి వల్లనే సాధ్యమయిందని ప్రజలు ఘనంగా చెప్పుకొనేవారు .గ్రామాలలో పాఠశాలలు,వైద్యాలయాలు నెలకొలి విద్యా వైద్య సదుపాయాలూ కల్పించి ఎంతో పురోగతిని సాధించారు .

  తణుకు పంచాయితీ బోర్డ్ అధ్యక్షులై ,మురుగు కాల్వలను త్రవ్వించి మురుగునీరు పారుదలకు ఏర్పాట్లు చేసి ప్రజారోగ్యం కాపాడారు .స్త్రీలకు  ప్రసూతి చికిత్సాలయాలు స్థాపించి  స్త్రీ, శిశు సంక్షేమానికి గొప్ప కృషి చేశారు .తమ వద్ద ఉన్న అపార గ్రంథ సముదాయ భాండాగారాన్ని  తాలూకా బోర్డ్ వశం చేసిన వదాన్యులు .సంచార గ్రంధాలయాలను ఏర్పాటు చేసి గ్రామీణస్త్రీలకు వృద్ధులకు చదువుకొనే గొప్ప అవకాశం కల్పించారు .తణుకులో వివేకానంద పుస్తక భాండాగారం ,వార్తాపఠన మందిరం నెలకొల్పి యువతకు గ్రంథ పఠనాభి వృద్ధికి ,జ్ఞాన,వినోద , విజ్ఞానాభి వృద్ధికి దోహదం చేశారు .గ్రంథాలయ ఉద్యమాన్ని మనసా వాచా కర్మణా ముందుకు తీసుకు వెళ్లారు రాజుగారు పూనికతో అంతులేని ఉత్సాహంతో అంకిత భావంతో .

ఉండ్రాజవరం సంస్థానం తణుకు సమీపంలోని కాల్దరి గ్రామానికి చెందిన పెద్ద “జమీందారీ కుంటుంబం” నుంచి వచ్చిన ముళ్ళపూడి తిమ్మరాజు తండ్రి, ఉండ్రాజవరం సంస్థానాధీశులు,తణుకు జమీందారులు, రైతు రాయడు “శ్రీ ముళ్ళపూడి వెంకట్రాయుడు” గారు. “ఆంధ్రభోజ శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు గారు” తణుకు పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త. సాహిత్యాభిలాషి. సాహితీ పోషకుడు.దేశసేవకుడు.విద్యాపోషకుడు.ముళ్ళపూడి తిమ్మరాజు సాహితీప్రియులు, కళాపోషకులు, జాతీయోద్యమం పట్ల అభిమానం కలిగిన ఆయన తాలూకా బోర్డు అధ్యక్షునిగా పని చేశారు. ఇతడు 1901 అక్టోబరు 10వ తేదీన ముళ్ళపూడి వేంకటరాయుడు, అక్కమాంబ దంపతులకు జన్మించారు. మరణించిన కుమారుడి పేరిట “శ్రీ నరేంద్రసాహిత్యమండలి”, “రాయల ప్రెస్” స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో సాహిత్యకార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా పెన్మెచ్చ సత్యనారాయణరాజు గారి రాజానందము, వేదుల సత్యనారాయణశర్మ గారి బుద్ధగీత, ఆర్యచాణక్యుడు, కాకతి ప్రోలరాజు, తెన్నేటి కోదండరామయ్యగారి మాబడి, గోకులపాటి కూర్మనాథ కవి రచించిన సింహాద్రి నారసింహ శతకము, భద్రభూపాలుడి నీతిముక్తావళి, చల్లా పిచ్చయ్య వ్రాసిన ఉద్యానము ఇంకా గోస్తనీ మాహాత్మ్యము, శివయోగసారము, ముసునూరి కాపయ, సోమదేవరాజీయము మొదలైన గ్రంథాలను ప్రకటించారు. ఇతనికి “ఆంధ్ర భోజ, సాహితీవల్లభ, కళాప్రపూర్ణ” అనే బిరుదు ఉంది.[1]. ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇతని కుమారుడు. ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు, జిల్లా ఎడ్యుకేషనల్ కౌన్సిల్, ప్రాథమిక విద్యాసంఘము మొదలైన సంస్థలెన్నింటితోనో సంబంధం కలిగి తన అధికారాన్ని, పలుకుబడిని ప్రజాక్షేమానికే వినియోగించారు. వరుసగా తొమ్మిదేండ్లు తణుకు తాలూకా బోర్డు అధ్యక్షుడిగా ఉన్నాడురు. తన స్వంత గ్రంథాలయాన్ని “కళాప్రపూర్ణ శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు స్మారక గ్రంథాలయం, సాంస్కృతిక కేంద్రము” తాలూకా బోర్డుకు అప్పగించి గ్రంథాలయోద్యమంలో పాలుపంచుకున్నారు[2].

రచనలు

·         ఈడ్పుగండి రాఘవేంద్రరావుగారి సంగ్రహచరిత్ర

·         ముళ్లపూడి తిమ్మరాజుగారి ఐతిహాసిక యాత్రలు

·           సశేషం

·         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-23—ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.12 వ భాగం.16.11.23.

ఛ౦గిజ్ ఖాన్.12 వ భాగం.16.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.7 వ భాగం.16.11.23.

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.7 వ భాగం.16.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి శ్రీ కావ్య కం tha వాసిస్ట గణపతి ముని గారి చరిత్ర.5 వ భాగం.16.11.23

మహా తపస్వి శ్రీ కావ్య కం tha వాసిస్ట గణపతి ముని గారి చరిత్ర.5 వ భాగం.16.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.98 వ భాగం.16.11.23.

శ్రీ హర్ష నైషధం.98 వ భాగం.16.11.23.

శ్రీ హర్ష నైషధం.98 వ భాగం.16.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.11 వ భాగం.15.11.23.

ఛ౦గిజ్ ఖాన్.9 వ భాగం.13.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.6 వ భాగం.15.11.23.

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.6 వ భాగం.15.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని.4 వ భాగం..15.11.23. గబ్బిట దుర్గా ప్రసాద్

మహా తపస్వి కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని.4 వ భాగం..15.11.23. గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.97 వ భాగం.15.11.23.

శ్రీ హర్ష నైషధం.97 వ భాగం.15.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

చెంఘీజ్ ఖాన్.10 వ భాగం.14.11.23

చెంఘీజ్ ఖాన్.10 వ భాగం.14.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.5 వ భాగం.14.11.23.

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.5 వ భాగం.14.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహతపశ్వి శ్రీ కావ్య కంత వాసిస్ట గణపతి ముని చరిత్ర .3 వ భాగం.14.11.23

మహతపశ్వి శ్రీ కావ్య కంత వాసిస్ట గణపతి ముని చరిత్ర .3 వ భాగం.14.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.96 వ భాగం.14.11.23.

శ్రీ హర్ష నైషధం.96 వ భాగం.14.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మద్రాస్ లెజిస్లేటివ్ సభ్యురాలు ,వ్యక్తిగత సత్యాగ్రహి ,రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి ,సంస్కర్త,పార్లమెంట్ మెంబర్  –శ్రీమతి చోడగం అమ్మన్న రాజా (విహంగ కు ప్రత్యేకం )

మద్రాస్ లెజిస్లేటివ్ సభ్యురాలు ,వ్యక్తిగత సత్యాగ్రహి ,రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి ,సంస్కర్త,పార్లమెంట్ మెంబర్  –శ్రీమతి చోడగం అమ్మన్న రాజా (విహంగ కు ప్రత్యేకం )

కృష్ణాజిల్లా మచిలీ పట్నం లో శ్రీ గంధం వీరయ్య నాయుడు ,శ్రీమతి నాగరత్నమ్మ దంపతుల పదకొండు మందిలో  ఏడవ సంతానంగా శ్రీమతి అమ్మన్నరాజా 6-6-1909 లో జన్మించారు .తండ్రి కృష్ణాజిల్లాకైకలూరు లో  బోర్డ్ స్కూల్ టీచర్ .అక్కడ స్కూలు లేదు.ఊళ్ళో ఉండి చదువుకోవటానికి చాలా ఇబ్బందులు పడి ,చివరకి రాజమండ్రి  వెళ్ళి హైస్కూల్ లో చేరి ,హాస్టల్లో ఉంటూసంపన్నులైన  శ్రీ  కంచుమర్తి  రామ చంద్రరావు గారు తమ కుమార్తె పేరిట ఇచ్చే స్కాలర్షిప్ తొ చదివి  స్కూల్ ఫైనల్ పాసయ్యారు .  అప్పుడు హాస్టల్ లో హైస్కూల్ పిల్లలు ముగ్గురో నలుగురో మాత్రమె ఉండేవారు .

  మద్రాస్ వెళ్ళి ప్రభుత్వ ఉపకార వేతనంతో కాలేజిలో చేరి ,ప్రిన్సిపాల్ మిస్ దిలాహే అనే బ్రిటీష్ వనిత తల్లిలాగా ఇచ్చిన ప్రోత్సాహక సహకారాలతో చదివి ,1932లో డిగ్రీ పాసై ,విల్లింగ్టన్ ట్రెయినింగ్ కాలేజి లో  టీచర్స్  ట్రేయినింగ్ పొంది ఎల్ .టి.పాసై ,తండ్రి రిటైర్ అవగా కుటుంబానికి ఆదాయం లేక ఇబ్బందులు పడుతుంటే తాను  ఈ మహానగరం లో హాయిగా ఉండటానికి ఇష్టం లేక ,సికందరాబాద్ గరల్స్ హైస్కూల్ లో కొంతకాలం టీచర్ గా పనిచేసి ,బాపట్లలో శ్రీ వెలగపూడి సుబ్బారావు నెలకొల్పిన  ట్రేయినింగ్  స్కూల్ లో హెడ్ మిస్త్రేస్ గా పని చేశారు .

 మౌంట్ ఫర్డ్ సంస్కరణల ఫలితంగా దేశం లో ఎన్నికలు జరిగి ,మద్రాస్ ప్రేసిడేన్సిలో ఉన్నఆంధ్రదేశంలో స్త్రీలకు  కేటాయింపబడిన ఏలూరు నియోజక వర్గానికి పోటీ చేయటానికి ఎవరూ ము౦దుకు రాకపోతే కాంగ్రెస్ పార్టి అమ్మన్న రాజాను నిలబెట్టగా ,శ్రీమతి సరోజినీ నాయుడు ,శ్రీ భూలాభాయ్ దేశాయ్ వంటి ప్రముఖులు ప్రచారం చేయగా శాసన సభ్యురాలుగా ,అతి చిన్న వయసులోనే గెలిచారు .అప్పటికి రాజకీయ అనుభవం ఏమాత్రం లేకపోయినా శ్రీ మతి ఆచంట రుక్మిణీదేవి ,కుట్టిమాల్ అమ్మ వంటి వారి సహకార ,సాహచర్యంతో రాజ నీతిజ్ఞు రాలయ్యారు .ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం రావటం బ్రిటీష ప్రభుత్వం భారత ప్రజల అభీష్టం తెలుసుకోకుండా యుద్ధంలో పాల్గొనటం వలన అవమానంగా భావించిన కాంగ్రెస్ తీర్మానం ప్రకారం 1939లో అమ్మన్నరాజాతో సహా కాంగ్రెస్ సభ్యులంతా  రాజీనామా చేసి బయటికి వచ్చారు.

 పోల్లాచిలో మునిసిపల్ ఇంజినీర్ గా ఉన్న శ్రీ చోడగం జనార్ధనరావు తొ అమ్మన్న రాజా వివాహం 27-8-1940 న జరిగి కాపురానికి పొల్లాచి వెళ్లారు .వెళ్ళిన రెండు నెలలకే  ప్రభుత్వ నిరంకుశత్వానికి ,అరెస్ట్ లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టి వ్యక్తి సత్యాగ్రహాలు ప్రారంభించగా ,దేశ జనులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో హాయిగా కూర్చోటానికి ఇష్టం లేక భర్తను ఒప్పించి ,ఏలూరు చేరి , స్వంతవూరు కైకలూరులో 1940లో వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గొని అరెస్ట్అయి , ఒక ఏడాది రాయవెల్లూరు జైలులో కఠీన శిక్ష , 500రూపాయల జరిమానా సత్కారం పొందారు బ్రిటీష ప్రభుత్వం చేత .   ఆ జైలులో ఆచంట రుక్మిణీదేవి ,కృష్ణాబాయ్ నీమ్బ్ కర్,ఉప్పల మెల్లీ షోలింగర్ అనే స్విస్ మహిళ మొదలైన స్త్రీలు 80మందితో సరదాగా గడిపారు .సాయంత్రం ఆరులోపలె భోజనాలు ఆతర్వాత గదులకు తాళాలు వేసేవారు అధికారులు .ఒక రోజు  జైళ్ళ ఇన్స్పెక్టర్ జనరల్  తనిఖీకి వస్తే అమ్మన్నరాజా ‘’మేమంతా సాధారణ నేరస్తులంకాదు. దేశం కోసం వచ్చాం .మీరు పొమ్మన్నా బయటికి పోము ఎందుకు మమ్మల్ని రాత్రంతా తాళాలు వేసి బంధిస్తారు ?“’అని అడిగితె సబబే అని పించి ,రాత్రిళ్ళు తాళాలు వేయటం మాన్పించాడు .తమలో తాము హిదీ, ఇంగ్లిష్ క్లాసులు నిర్వహిస్తూ ,చదరంగం, బాడ్ మింటన్ ఆడుకొంటూ ,నూలు వడ కటం లో పోటీలు పెట్టుకొనే వారు .శ్రీమతి వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ అతి సన్నని నాజూకు దారం తీస్తే,అమ్మన్న రాజా  అతి వేగంగా దారం తీసేవారు .జైలు జీవితాన్ని పండుగలాగా గడిపారు అందరూ .

  1941లో విడుదలై ,అమ్మన్నరాజా 1946ఎన్నికలలో ఏలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి ,డాక్టర్ కొమర్రాజు అచ్చమా౦బగారిని ఓడించి శాసన సభ్యురాలై ,అసెంబ్లీ డిప్యూటీ స్పెకర్ గా1952 వరకు  ఉన్నారు .దేవదాషీ విధానాన్ని నిరశిస్తూ ,నిర్మూలనకు చట్టం తీసుకు రావాలని తీర్మానం ప్రవేశపెట్టిన డాక్టర్ ముత్తు లక్ష్మీ రెడ్డిగారితో కలిసి ,సాధించారు .పదకొండేళ్ళ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో 1950లో వరకట్న నిరోధక చట్టం ప్రవేశ పెట్టి సాధించారు .ఇవన్నీ ఆమె శక్తి సామర్ధ్యాలకు ,సంఘ సేవానిరతికి,సంస్కార భావాలకు  దర్పణాలు .ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగి 1955లో వచ్చిన మధ్యంతర ఎన్నికలలో పశ్చిమ గోదావరిజిల్లా అత్తిలి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచి ,1960లో రాజ్యసభ  మెంబర్ అయ్యేవరకు ఉన్నారు  .ముఠారాకీయాలకు విసిగి  వేసారి ఆమె 1968లో బయటికి వచ్చేశారు .ఆంధ్రరాష్ట్ర స్త్రీశిశు  విద్యా సమితికి చైర్మన్ గా చాలాకాలం పని చేశారు .ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ చేంజి లో స్త్రీలను కూడా నమోదు చేసుకొనే అవకాశం కల్పించారు .స్త్రీలకు సాయంకాల కాలేజీలు ,ఫిజికల్ ఎడ్యుకేషన్ శిక్షణకు ప్రత్యేకకాలేజీల ఏర్పాటుకు కృషి చేశారు .90ఏళ్ళ వయసులో శ్రీమతి అమ్మన్నరాజా 22-2-1999  న మరణించారు .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-23-ఉయ్యూరు 

Posted in సేకరణలు | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.9 వ భాగం.13.11.23.

ఛ౦గిజ్ ఖాన్.9 వ భాగం.13.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment