శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.4 వ భాగం.13.11.23.

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.4 వ భాగం.13.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

6-ప్రత్యేక ఆంధ్ర కు  పునాదులు వేసిన న్యాయవాది ,సహకార రంగం పై ప్రత్యేకదృష్టిపెట్టి ,అంతర్జాతీయ సహకార సభకు ప్రతినిధి, స్టేట్ కౌన్సిల్ సభ్యులు  అయిన- శ్రీ వేమవరపు రామదాసు పంతులు గారు

6-ప్రత్యేక ఆంధ్ర కు  పునాదులు వేసిన న్యాయవాది ,సహకార రంగం పై ప్రత్యేకదృష్టిపెట్టి ,అంతర్జాతీయ సహకార సభకు ప్రతినిధి, స్టేట్ కౌన్సిల్ సభ్యులు  అయిన- శ్రీ వేమవరపు రామదాసు పంతులు గారు

హానరబుల్ వేమవరపు రామదాసు పంతులు (1873 – 1944) ప్రముఖ న్యాయవాది, సహకారోద్యమ ప్రముఖుడు. అఖిల భారత సహకార సంస్థల సంఘానికి అధ్యక్షుడు. 1935 నుండి 1944లో మరణించేవరకు ఇండియన్ కో-ఆపరేటివ్ రివ్యూ పత్రికకు సంపాదకత్వం వహించారు.[1]

వేమవరపు రామదాసు కృష్ణా జిల్లాలోని వేమవరంలో 1873 అక్టోబరు నెలలో జన్మించారు. ఈయన పసికందుగా ఉండగానే సంతానం లేని ఈయన పినతండ్రి రామదాసును దత్తతు తీసుకున్నాడు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో, మద్రాసు న్యాయ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, రామదాసు అనతికాలంలోనే స్థానిక న్యాయవాద సంఘంలో (బార్) తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

1926 లో రెండవ వైస్రాయి కౌన్సిల్లో మద్రాసు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు.

రామదాసు 1913లో బాపట్లలో జరిగిన తొలి ఆంధ్ర మహాసభ సమావేశాల్లో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1936లో కాకినాడలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడరు. రామదాసు రాష్ట్ర సహకార సంఘానికి అధ్యక్షునిగాను, అఖిలభారత సహకార పత్రికాధిపతులుగాను ఉన్నారు

 కృష్ణా జిల్లా సంఘం ,కృష్ణా జిల్లా సభ ,కృష్ణా పత్రికలతో ఆయనకు అనుబంధం ఎక్కువ .సామాన్యుల ,రైతులకు సేవ చేసిన మహానుభావులాయన. ఆయన విశాల భావాలకు ఇక్కడి రాజ కీయం సంకుచితం అని పించి మద్రాస్ చేరారు .వస్తూత్పత్తి విక్రయపద్దతి,సహకార పరపతి మొదలైన విషయాలను మద్రాస్ లో క్షుణ్ణంగా అధ్యయనం చేశారు .వీటన్నిటికి ఆర్ధిక విధానం ముఖ్యమని గ్రహించారు భూస్వామి, గొప్ప న్యాయవాది, రైతు బాంధవులు అయిన పంతులుగారు దృష్టినంతా సహకార పరపతి సంఘాలపై కేంద్రీకరించి రాష్ట్రానికేకాక యావద్దేశానికీ దిక్సూచి అయ్యారు. ఆంధ్ర ,ఆంగ్ల భాషలలోఅపార పాండిత్యం ఉన్న ఆయన యేది చెప్పినా రాసినా ,పరమ ప్రామాణికంగా ఉండేది .వాటితో సహకారోద్యమానికి ఊపిరులూది ,నిలబెట్టి ,వ్యాపింపజేసి అభి వృద్ధిలోకి తెచ్చారు .ఎలాంటి మారుమూల కుగ్రామం లో నైనా ,,ఎక్కడ సహకార నిధి ఏర్పడినా ,సంఘం  స్థాపించ బడినా పంతులులు గారు రావాల్సిందే, వారి వాక్కు వినబడాల్సిందే వారి అమృత హస్తాలతో నెలకొల్పాల్సిందే .

  హైదరాబాద్ వంటి స్వదేశ సంస్థానాలు కూడా రామదాసు పంతులు గారిని ఆహ్వానించి వారి సేవలను వినియోగించు కోనేవి .ఇలా భారత దేశ సహకారోద్యమానికి పంతులుగారు ప్రధాన ఆచార్యులయ్యారు .ఆయన ఎన్నో రాష్ట్రీయ ,దేశీయ సహకార సంఘాలకు అధ్యక్షులు .అంతర్జాతీయ సహకార సాంఘ సమ్మెళన సభ్యులు కూడా .లండన్ లో జరిగిన అంతర్జాతీయ సహకార  సహకార మహా సభకు భారత దేశ ప్రతినిధి పంతులుగారు .సహకార సంఘ విచారణ ,,బ్యాంకింగ్ సంస్థల కేంద్ర విచారణ సంఘాల సభ్యులు ఆయన .మొదట మద్రాస్ ప్రేసిడేన్సి ‘’సహకార  భీమా  సంఘం’’స్థాపించిన ఘనులు పంతులుగారు .ఆంధ్రదేశ స్వరాజ్య పార్టీ అద్ద్యక్షులు .మద్రాస్ మహా జనసభ  ఉపాధ్యక్షులు .స్టేట్ కౌన్సిల్ సభ్యులు .ఇలా  వివిధ హోదాలలో ఆయన సహకార సంఘాలకు చేసిన సేవ చిరస్మరణీయం .స్టేట్ కౌన్సిలో స్వరాజ్య పార్టీ నాయకులై .ప్రజాభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించి ,తమ అనుభవాన్ని ప్రజాహితం కోసం ధారపోసిన త్యాగ మూర్తి ఆనరబుల్ శ్రీ వేమవరపు రామదాసు పంతులుగారు .74 వ ఏట మద్రాస్ లో మరణించారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-23-ఉయ్యూరు  

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర.2వ భాగం.13.11.23.

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర.2వ భాగం.13.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.95 వ భాగం.13.11.23.

శ్రీ హర్ష నైషధం.95 వ భాగం.13.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

, నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం-55-గద్వాల సంస్థానం, పాలకులు

, నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం-5
5-గద్వాల సంస్థానం, పాలకులు
గద్వాల సంస్థానంరెండు నదుల సంగమ స్థలానికి పశ్చిమాన గల సారవంతమైన నేల అది. పచ్చని పంటలు పండాల్సిన ఆ నేలపై కొన్ని శతాబ్దాల పాటు నెత్తురు పారింది. విజయనగర చక్రవర్తులకు, బహమనీ సుల్తానులకు మధ్య వైరానికి కారణమైన భూమి దోబ్ గద్వాల సంస్థానంలోనే ఉండేది. గద్వాల సంస్థానానిది అంతటి చరిత్ర మరి. గద్వాల సంస్థానం తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య గల నడిగడ్డ ప్రాంతంలో దాదాపు 864 చ.కి.మీ.ల మేర విసర్తించి ఉండేది. దీనికే కేశవనగరం అనే పర్యాయ నామం కూడా ఉంది. ఈ సంస్థానం 214 గ్రామాలు, లక్షకుపైగా జనాభాను కలిగి ఉండేది. గద్వాల సంస్థానాధీశులు పాకనాటి రెడ్ల వంశానికి చెందినవారు. వీరిది మిడిమిళ్ల గోత్రం. వీరి ఇంటి పేరు ముష్టిపల్లి వారు. కాకతీయుల కాలంలో ముష్టిపల్లి వారు నడిగడ్డ ప్రాంతంలోని కొన్ని సీమలపై నాడగౌడ అధికారం కలిగి ఉండేవారు. 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం కొంతకాలం విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్నారు.

ఆ సామ్రాజ్య పతనంతో సార్వభౌమాధికారం చేతులు మారింది. దీంతో గద్వాల వారు బీజాపూర్ సుల్తానుల ఆధీనంలోకి వెళ్లారు. వారి నుంచి నాడగౌడు, సర్ నాడగౌడు అధికారం పొంది పాలన సాగించారు. మూలపురుషుడు పెద్దనకాణాదం పెద్దన సోమయాజి రాసిన ప్రబంధం ముకుంద విలాసము ద్వారా గద్వాల సంస్థానాధీశుల మూలపురుషుడు పెద్దన అని తెలుస్తున్నది. ఈయనకే పెద్దన నృపుడు, పెద్దభూవిభుడు, పెద్ద భూపాలుడు, పెద్దారెడ్డి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇతని భార్య పూడూరి నాడగౌడు వీరారెడ్డి కుమార్తె బక్కమాంబిక.

పెద్దన ఇల్లరికపు అల్లుడిగా పూడూరి నాడగౌడు అధికారం చేపట్టాడు. బక్కమాంబిక, పెద్దనల కుమారుడు ప్రసిద్ధుడయిన పెద సోమభూపాలుడు. ఈయన గొప్పతనం, శౌర్యపరాక్రమాలు ప్రామాణిక సాహిత్యం ద్వారానే కాకుండా, జానపద సాహిత్యం ద్వారా కూడా తెలుస్తున్నాయి. జానపద గాథల్లో ఈయనను శోభనాద్రి, సోమనాద్రిగా కీర్తించారు. ఇతనికే నల్ల సోమనాద్రి, నల సోమభూపాలుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. గద్వాల దుర్గాన్ని క్రీ.శ. 1663 -1713 మధ్య కాలంలో నిర్మించింది ఈయనే. గద్వాల కోట మహబూబ్‌నగర్ జిల్లాలోని కోటలన్నింటిలోకెల్లా ప్రసిద్ధి చెందింది. ఇదిప్పుడు జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణం నడి బొడ్డున చెక్కు చెదరకుండా ఉంది.

గద్దపల్లె అనే గ్రామం వద్ద నిర్మించిన దుర్గం చుట్టూ ఏర్పడిన పట్టణం కాబట్టి, దానికి గద్వాల అనే పేరు వచ్చినట్లు కొందరు చరిత్రకారులు చెబుతారు. ఇంకొందరేమో, ఈ సంస్థానం పూర్వీకులు యుద్ధాల్లో ఆయుధాలుగా గదను, వాలమును ప్రయోగించేవారు, అందుకే ఈ ప్రాంతానికి గదవాల (గద+వాల=గద్వాల) అనే పేరొచ్చిందని చెబుతుంటారు. వీరాధివీరుడు సోమనాద్రిసోమనాద్రి అనే పెద సోమభూపాలుడు గద్వాల సంస్థానానికి ఘనకీర్తిని తెచ్చిపెట్టాడు. గద్వాల కోట నిర్మాణంలో ఉప్పేరు, కర్నూలు, రాయచూరు నవాబుల నుంచి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాడు. వీటి గురించి స్థానికులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిపై విజయం సాధించి సోమనాద్రి కోట నిర్మాణం పూర్తి చేశాడు. అటు తర్వాత పూడూరి నుంచి రాజధానిని గద్వాలకు మార్చి పాలన సాగించాడు. ఇదే కోటలో చెన్న కేశవస్వామి దేవాలయాన్ని సోమనాద్రియే అత్యంత సుందరంగా నిర్మించాడు. దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటాయి. పూడూరి నుండి కేశవస్వామిని తెచ్చి సోమనాద్రి ఇక్కడ ప్రతిష్టించాడు. ఈ స్వామియే అటు తర్వాత గద్వాల సంస్థానాధీశుల కులదైవమయ్యాడు. ఈ స్వామి పేరు మీదనే గద్వాల కేశవనగరంగా కూడా పేరొందింది. సోమనాద్రి సర్వతోముఖ ప్రజ్ఞ కలిగిన పాలకుడు.

బీజాపూరు సుల్తానులను జయించడంలో సోమనాద్రి మొఘల్ బాద్‌షా ఔరంగజేబుకు సహకరించాడట. ఇతని ధైర్యసాహసాలకు, శౌర్యపరాక్రమాలకు మెచ్చిన ఔరంగజేబు క్రీ.శ.1704లో రాజా బిరుదునే కాక, గద్వాల ప్రాంతంపై ఆధిపత్యపు సన్నదును కూడా ఇచ్చి సత్కరించాడు. నిడ్జూర్ యుద్ధంఢిల్లీ పీఠంపై బహదూర్ షా బలహీన పాలన సాగుతున్న కాలంలో దక్షిణ సుబేదార్ నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. అయితే, హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న గద్వాల సంస్థానాధీశుడు సోమనాద్రి మాత్రం బహదూర్ షాకు అనుయాయిగానే పాలన కొనసాగించాడు.

ఇది సహించని నిజాం తన సేనాని అయిన దిలీప్ భానుడిని ఉసిగొల్పి గద్వాల సంస్థానంపై దండయాత్రకు పంపించాడు. దిలీప్ భానుడి సేన, సోమనాద్రి సేనలు కర్నూలు సమీపంలో నిడ్జూర్ దగ్గర భీకరంగా తలపడ్డాయి. చివరికి ఈ యుద్ధంలో సోమనాద్రి వీరమరణం చెందాడు. Chennakeshava రాణుల పాలనపెద సోమభూపాలునికి అమ్మకాంబ, లింగాంబ, రామాంబ అని ముగ్గురు భార్యలు. లింగాంబ, పెద సోమభూపాలునికి తిరుమలరాయలు, రామరాయలు అని ఇద్దరు పుత్రులు. అమ్మకాంబకు సంతానం లేకపోవడం వల్ల పెద సోమభూపాలుని తర్వాత తిరుమలరాయలు కొంతకాలం పాలన సాగించాడు. ఇతని పరిపాలన సంతృప్తికరంగా లేకపోవడం వల్ల సోమభూపాలుని పట్టపురాణి అమ్మకాంబ (అమ్మక్కమ్మ), ఇంకొంత కాలం లింగాంబ (లింగమ్మ) సంస్థాన పాలనా బాధ్యతలు చేపట్టారు.

వీరి తర్వాత తిరుమలరాయల తమ్ముడు రామరాయలు (క్రీ.శ. 1724-1762) పాలించాడు. రామరాయలుకు సంతానం కలుగలేదు. దీంతో అన్న తిరుమలరాయల కొడుకు చినసోమభూపాలుడిని దత్తత తీసుకున్నాడు. రామరాయలు తర్వాత ఈయనే క్రీ.శ. 1762 నుంచి 1793 వరకు సంస్థానాన్ని పాలించాడు. ఈయన భార్య రామాంబ. కొడుకు శ్రీరామరాయలు. ఇతడు తండ్రి తర్వాత క్రీ.శ. 1793లో సంస్థాన పాలన బాధ్యతలను స్వీకరించాడు. అటు తర్వాత వీరి కోవలో రాజా రామభూపాల రావు ప్రసిద్ధి. ఈయన క్రీ.శ. 1844 1902 వరకు పాలన సాగించాడు. 1902లో రాజా రామభూపాల రావు మరణించాడు. అప్పటికి ఆయన వెంకట్రామిరెడ్డిని దత్తపుత్రునిగా స్వీకరించి సీతారామ భూపాల్ అని నామకరణం చేశాడు. రామభూపాల రావు మరణించే నాటికి ఈయన పిన్న వయస్కుడు.

దీంతో సంస్థానం పదేండ్ల పాటు కోర్ట్ ఆఫ్ వార్డ్స్ పాలనలోకి వెళ్లింది. మేజర్ అయిన తర్వాత రాజా సీతారామ భూపాల్ బల్వంత్ బహద్దూర్ క్రీ.శ. 1912లో పాలనాధికారం చేపట్టాడు. నిజాం ఈయనకు మహారాజా అనే బిరుదును ప్రధానం చేశాడు. పన్నెండేండ్ల పాటు పాలించిన ఈయన క్రీ.శ. 1924లో అకాల మరణం చెందడంతో సంస్థానం చిక్కుల్లో పడింది. అయినా మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ చాకచక్యంగా వ్యవహరించి సంస్థానానికి పూర్వ వైభవం తీసుకొచ్చింది. మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మమహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ రాజా సీతారామ భూపాల్ బల్వంత్ బహద్దూర్ భార్య. భర్త మరణానంతరం మహారాణి పాలనా బాధ్యతలు చేపట్టి క్రీ.శ. 1949 వరకు పాలించారు.

ఈమే ఈ సంస్థానపు చివరి పాలకురాలు. ఈమె పెద్ద కుమార్తె రాణీ సత్యవరలక్ష్మీ దేవి. ఈవిడ దోమకొండ ప్రభువు సోమేశ్వరరావును పెండ్లాడింది. రాణి ఆదిలక్ష్మీదేవమ్మకు మగ సంతానం లేకపోవడంతో తన మనుమడు సత్యవరలక్ష్మీ దేవి కొడుకైన రాజా కృష్ణరామభూపాల్‌ను దత్తత తీసుకుంది. ఈయనకు గద్వాల కోట బాధ్యతల్ని అప్పగించి అతడి పేరుతో ఆదిలక్ష్మీదేవమ్మ సంస్థాన బాధ్మతల్ని కొనసాగించింది. మహారాణీ ఆదిలక్ష్మీదేవమ్మ నిజాం నవాబును ఎదురించిన ధీరవనిత. గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటించి పాలించిన ధీశాలి.

సీతారామభూపాలునికి మగ సంతానం లేకపోవడంతో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ తమ రాజ్యంలో సంస్థానాన్ని కలుపుకొన్నాడు. దీంతో రాణి న్యాయ పోరాటం చేసి సంస్థానాన్ని తిరిగి చేజిక్కించుకున్నది. 1948లో సంసాన్థాలు, జాగీర్దారుల పాలన రద్దు కావడంతో రాణి సంస్థానపు ఆస్తులను, చారిత్రక కోటను ప్రభుత్వ పరం చేసింది. ఈమె పేరు మీదుగా గద్వాల కోటలో మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ (మాల్డ్) ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇది పాలమూరులో ఏర్పాటైన మొదటి డిగ్రీ కళాశాల.

మహారాణి ఆగస్టు 18, 1953న మరణించారు. మహారాణి వారసులు ఇప్పుడు హైదరాబాద్‌లో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. వచ్చేవారం : అమరచింత సంస్థానంGadwal_Fort శత్రు దుర్భేద్యమైన గద్వాల కోట గోడలపై సంస్థాన పురాతన చరిత్ర ఇప్పటికీ ప్రతిబింబిస్తుంటుంది. గోడలను మట్టితో కట్టినా పునాది మాత్రం పెద్ద రాళ్లతో పొందికగా ఉంటుంది. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఈ కోట ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. 16 బురుజులతో వృత్తాకారంలో నిర్మించిన ఈ కోట గోడ సుమారు 20 అడుగుల మందంతో ఉంటుంది. కోట చుట్టూ సుమారు 30 అడుగుల లోతైన కందకాన్ని రాతి గోడలతో నిర్మించారు. మట్టితో నిర్మించిన ఇంతటి పెద్ద కోట, మహా కందకం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదని చరిత్రకారులు చెబుతుంటారు. కోటలోపల రాజసౌధం, సోమనాద్రి వారసుల విగ్రహాలు, పెద్ద బావి, దశమికట్ట, అశ్వశాల ఇతర కట్టడాలు సంస్థానాధీశుల చరిత్రను ఇప్పటికీ తెలియజేస్తున్నాయి. ఇటీవలే గట్టు ఎత్తిపోతల పథకానికి గద్వాల సంస్థానాధీశుల్లో వీరాధివీరుడైన సోమనాద్రి పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
సశేషం
దీపావళి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-11-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.8 వ భాగం.12.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.3 వ భాగం.12.11.23.

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.3 వ భాగం.12.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర.1 వ భాగం.12.11.23.

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర.1 వ భాగం.12.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.94 వ భాగం.12.11.23.

శ్రీ హర్ష నైషధం.94 వ భాగం.12.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

చం ఘి జ్ ఖాన్.7 వ .భాగం.11.11.23.

చం ఘి జ్ ఖాన్.7 వ .భాగం.11.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.2 వ భాగం.11.11.23.

శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.2 వ భాగం.11.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కోనసీమ ఆహితాగ్నులు.7 వ చివరిభాగం.11.11.23.

కోనసీమ ఆహితాగ్నులు.7 వ చివరిభాగం.11.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.93 వ భాగం.11.11.23

శ్రీ హర్ష నైషధం.93 వ భాగం.11.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

నేను ఇప్పుడేతెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం-44- ప్రజాహిత కార్యాలలో ,సహకార సంఘాలలో ముందుంటూ ‘’నేషనల్లిబరల్ ఫెడరేషన్, అధ్యక్షులై ,సంస్కరణలకు ఆద్యులై ‘’దక్షిణ భారత గోఖలే ‘’అనిపించుకొన్న,ఆంధ్ర మహాసభ అధ్యక్షులు ,శాసన సభ్యులు ,రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ – దివాన్ బహాద్దర్ సర్మోచర్ల రామ చంద్రరావు పంతులుగారు

నేను ఇప్పుడేతెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం-44- ప్రజాహిత కార్యాలలో ,సహకార సంఘాలలో ముందుంటూ ‘’నేషనల్లిబరల్ ఫెడరేషన్, అధ్యక్షులై ,సంస్కరణలకు ఆద్యులై ‘’దక్షిణ భారత గోఖలే ‘’అనిపించుకొన్న,ఆంధ్ర మహాసభ అధ్యక్షులు ,శాసన సభ్యులు ,రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ – దివాన్ బహాద్దర్ సర్మోచర్ల రామ చంద్రరావు పంతులుగారు

నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం-4

4- ప్రజాహిత కార్యాలలో ,సహకార సంఘాలలో ముందుంటూ ‘’నేషనల్ లిబరల్ ఫెడరేషన్, అధ్యక్షులై ,సంస్కరణలకు ఆద్యులై  ‘’దక్షిణ భారత గోఖలే ‘’అనిపించుకొన్న,ఆంధ్ర మహా సభ అధ్యక్షులు ,శాసన సభ్యులు ,రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ – దివాన్ బహాద్దర్ సర్ మోచర్ల రామ చంద్రరావు పంతులుగారు

ఆంధ్ర దేశం లో నూతన ప్రజాహిత జీవనానికి పునాది శ్రీ న్యాపతి సుబ్బారావు గారు వేస్తె ,దాన్ని పరిపక్వం చేసి సక్రమ రూపం కల్పించి మన కళ్ళ ఎదుట నిలబెట్టిన వారు దివాన్ బహాద్దర్ సర్ మోచర్ల రామ చంద్రరావు పంతులుగారు.1868లో పశ్చిమ గోదావరిజిల్లా బాదంపూడిలో పుట్టిన వీరు న్యాపతి గారికంటే పన్నెండేళ్ళు చిన్న వారు .ఈయన పెరిగి పెద్ద వారయ్యే సరికి న్సుబ్బారావు గారు దేశీయ స్థానిక సంస్థలకు కొంత పునాది వేశారు .వాటి సమస్యలూ పెరిగాయి .వాటి గురించి తెలుసుకొని పరిష్కార మార్గాలు ఆలోచించి ఆచరణ చేయటానికి మోచర్ల వారికి గొప్ప అవకాశం కలిగింది .ఈయన తిరువలిక్కేణి హిందూ హై స్కూల్ లో ,,ప్రేసిడేన్సి కాలేజీ ,లా కాలేజి లో చదువు పూర్తి చేసి ,’’ఆండ్రూ లాంగ్ ‘’ అనే సొలిసిటర్ దగ్గర కొంతకాలం అప్రెంటిస్ చేసి , గోదావరి జిల్లా రెండుగా విడిపోయినప్పుడు, ఏలూరులో స్థిరపడి అక్కడ బార్ అసోషియేషన్ అధ్యక్షునిగా పదిహేనేళ్లకు పైగా పనిచేశారు. అక్కడే నగరపాలిక యొక్క తొలి ఛైర్మన్ గా ఎన్నికై పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగాడు. ఏలూరులో ఈయన చేసిన  సేవలకు ఒక పేటకు ‘’రామ చంద్రరావు పేట ‘’అని గౌరవంగా పేరు పెట్టారు  ఏలూరు వచ్చి  . జిల్లా రాజధాని నిడుదవోలుకు బదలుగా ఏలూరును చేయటానికి రామచంద్రరావే ప్రధాన కారణం. కొన్నాళ్ళు ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా బోర్డులకు అధ్యక్షునిగా పనిచేశారు. మోచర్ల రామచంద్రరావు 1914-4-10 నుండి 1919-11-15 వరకు విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయానికి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం నకు తొలి అధ్యక్షుడిగా ఉన్నారు [1].

దీనితో ప్రజా సమస్యలు వారి పరిష్కార మార్గాలు గురించి పుష్కలంగా తెలుసుకో గలిగారు .వ్యవసాయం నీటిపారుదల ,అడవులు ,శిస్తులు ,విద్య, ప్రజారోగ్యం మొదలైన సమస్యలను క్షుణ్ణంగా  అర్ధం చేసుకొని పరిష్కార మార్గాలు రూప కల్పన చేశారు .

  ఎవరికీ ఏవిషయం చెప్పిన సూటిగా మెత్తగా చెప్పటం పంతులుగారి అలవాటు .ఆయన చేసిన సూచనలకు ప్రతి సూచనలు చేయటానికి ఎవరికీ వీలు ఉండేది కాదు .ఇంతటి విషయ గ్రహణం అమూల్యమైన పాండిత్యం ఉండటం చేత ప్రభుత్వం వారికి అనేక కమితీలల్లో సభ్యులను చేసి వారి అమూల్య సలహాలు తీసుకోనేది .లిట్తాన్ కమిటీ ,స్కీన్ కమిటీ సా౦డర్స్ కమిటీ ,రౌండ టేబుల్ కాన్ఫరెన్స్ వంటి అనేక సాబ్ కమిటీలలో ఆయన ఉండాల్సిందే .అనేక రిఫారం స్కీమ్స్ లో నూ ఆయన సభ్యులే .అనధికార సభ్యులుగా ఆయన ప్రజోపకారమైన అనేక సూచనలు ప్రభిత్వానికి చేసి అమలు పడేట్లు చూసేవారు .ప్రజల తరఫున సాక్ష్యం ఇవ్వటానికి 1919లో జాయంట్ పార్లమెంటరి కమిటీలు మొదలైన వాటి లో వెళ్ళి సాక్షమిచ్చి ప్రజోపకారం చేశారు . జాతీయ కాంగ్రెస్‌లో మితవాద వర్గంలో ఉండేవారు. మద్రాసు రాష్ర్ట శాసన సభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న కాలంలో ప్రజలకు అండగా ఉంటూ రైతుల సమస్యలు పరిష్కారానికి ప్రత్యేకంగా కృషిచేశారు . 1924లో సాధారణ శాసన నిర్మాణ సభ సభ్యుడిగా నియమితులయ్యారు.

1927లో స్వదేశీ సంస్థానాల ప్రజల  డిప్యు టేషన్ ను ఇంగ్లాండ్ తెసుకు వెళ్లారు మోచర్ల పంతులుగారు . రిజర్వు బ్యాంకు గవర్నరుగా అనేక ప్రభుత్వ కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు ఆయన ఆంధ్రోద్యమ నాయకుల్లో ఒకరు. 1916లో కాకినాడలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. ఆయన కార్యదీక్షత, నమ్రత, సేవానిరతిని గుర్తించిన ఆంధ్ర ప్రజలు ఆయనకు ‘దక్షిణ దేశపు గోఖలే’ 1932లో ‘’నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ‘’కు అధ్యక్షులయ్యారు .ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ సూచనా ప్రభుత్వానికి చేసినా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్య తీస్సుకోనేది .ఆయన చెప్పిన సంస్కరణ అమలు జరగాల్సిందే .ఇలాంటి విషయాలలోమోచర్ల వారు రాష్ట్రానికే కాదు యావద్భారత జాతికి ఆదర్శమైన మణి పూస.దేశ నాయకులు ఆయన్ను ‘’దక్షణ దేశ గోఖలే ‘’అనే వారు మర్యాదగా .మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కృష్ణా గోదావరి జిల్లాల తరఫు సభ్యులుగా 12ఏళ్ళు ఉన్న ఘనత పంతులుగారిది .1924లో ‘’ఇంపీరియల్ కౌన్సిల్ ‘’సభ్యులుగా ఎన్నికయ్యారు .సహకార సంఘాలకు నిధులు పెద్ద ఎత్తున రాబట్ట టానికి తీవ్ర కృషి చేశారు .వారి సేవా నిరతి గమనించిన ప్రభుత్వం రాజబహద్దర్ ,కేయిజరే హింద్ స్వర్ణపతకం ,సర్ బిరుదు అత్యంత విశిష్టమైనవి  ‘.మోచర్ల రామ చంద్రరావు గారు 1936 మే నెలలో తన 68వ యేట మద్రాసులో పరమపదించారు. సంతాపసభలో రైట్ హానరబులు వి.ఎస్.శ్రీనివాసశాస్త్రి ఈయనను దక్షిణభారత గోఖలేగా అభివర్ణించారు .  రిజర్వు బ్యాంకు గవర్నరుగా అనేక ప్రభుత్వ కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు . ఆయన ఆంధ్రోద్యమ నాయకుల్లో ఒకరు. 1916లో కాకినాడలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు .

 మనవి-, ‘’నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం’’అన్న ఈ ధారావాహికకు ఆధారం –ఆంధ్రులైన శ్రీ ఆవట పల్లి నారాయణ రావు గారు బర్మాలోని రంగూన్ లోస్థిరపడి , 1940లో రచించి ,మద్రాస్ లో ముద్రించిన  ‘’విశా లాంధ్రము ‘’పుస్తకం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-10-11-23-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

చంఝీజ్ ఖాన్.7 వ భాగం.10.11.23

చంఝీజ్ ఖాన్.7 వ భాగం.10.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.1 వ భాగం. 11.10.23.

శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.1 వ భాగం. 11.10.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కోనసీమ ఆహితాగ్నులు.6 వ భాగం.11.10.23.

కోనసీమ ఆహితాగ్నులు.6 వ భాగం.11.10.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.92 వ భాగం.11.10.23.

శ్రీ హర్ష నైషధం.92 వ భాగం.11.10.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.6 వ భాగం.9.11.23.

ఛ౦గిజ్ ఖాన్.6 వ భాగం.9.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.28 వ భాగం.9.11.23.

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.28 వ భాగం.9.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కోన సీమ ఆహితాగ్నులు.5 వ . భాగం.9.11.23.

కోన సీమ ఆహితాగ్నులు.5 వ . భాగం.9.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.91 వ భాగం.9.11.23.

శ్రీ హర్ష నైషధం.91 వ భాగం.9.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అతి నవ్య కవిత్వానికి  ఆద్యుడు  ,కవిత్వ రౌడి అని పించుకొని ‘’నవమి చిలుక ‘’వంటి ఖండకావ్యాలతో ప్రసిద్ధుడైన ‘’డోంట్ కేర్’’కవి –శిష్ట్లా ఉమామహేశ్వర రావు .

అతి నవ్య కవిత్వానికి  ఆద్యుడు  ,కవిత్వ రౌడి అని పించుకొని ‘’నవమి చిలుక ‘’వంటి ఖండకావ్యాలతో ప్రసిద్ధుడైన ‘’డోంట్ కేర్’’కవి –శిష్ట్లా ఉమామహేశ్వర రావు .

‘’ శ్రీ శ్రీకవిత్వాన్ని ఎందుకు ఒప్పుకోరు ‘’?అని ప్రశ్నించిన  శిష్ట్లా ఉమామహేశ్వరరావు 1912 లో గుంటూరు జిల్లా మంచాల బ్రాహ్మణ అగ్రహారం లో శిష్ట  వైదిక కుటుంబం లో జన్మించాడు.బాల్యం లోనే పురాణ గాథలను ,జానపద సాహిత్యాన్ని అర్ధం చేసుకొన్నాడు .ఇంగ్లీస్ లిటరేచర్ లో ఎం. ఏ .చదివి పాసై ,ఆంగ్ల కవిత్వం లో నూతన  ప్రస్తావనలన్నీ ఆకలి౦పు చేసుకొన్నాడు .కొంతకాలం దివ్యజ్ఞాన సమాజం లో ఉన్నాడు .మరికొన్నాళ్ళు ఒక యతీశ్వరుని వద్ద చేరి శుశ్రూషచేశాడు .జ్యోతిష శాస్త్రాన్నీ మధించాడు ,అధ్యాత్మ రామాయణ కీర్తనలు ,వాగ్గేయ కారుల కృతులు అంటే విపరీతమైన మక్కువ ఉండేది .లయలో, ఛందస్సులలో ,పద ప్రయోగాలలో తనురాసిన కవితల్లో నూతన ప్రయోగాలు చేస్తూ ‘’విష్ణు ధనువు ‘’,’’నవమి చిలుక ‘’అనే రెండు ఖండ కావ్య సంపుటులు రాసి,ఆనాటి తెలుగు కవితా జగత్తు ను దిగ్భ్రాంతిలో ముంచే శాడు .అచ్చు వేయటంలోనేకాక కాపీల సంఖ్యలోనూ అత్యంత నవ్యత ప్రదర్శించిన నవ్యకవి .

 శిష్ట్లా కొంతకాలం ఒక కాలేజి లో ,ఆతర్వాత ఒక ఫరం లో పని చేశాడు .తర్వాత సైన్యం లో చేరి చిత్ర విచిత్ర అనుభవాలు పొంది ,ఆ అనుభవాలతోమౌలికమైన  ‘’సిపాయీల కథలు ‘’రాశాడు .భావ కవిత్వం మొదలు అధి వాస్తవికత వరకు వివిధ కవితా మార్గాలలో ప్రకటిత మైన ప్రేమను ‘’ఉద్భ్రాంత ‘’ప్రేమ అన్నాడు .శిష్ట్లా రాసిన ‘’కాళింది పాటలు ‘’తెలుగు కవిత్వానికి నూతన భా౦డాగారాలుఅని ప్రసిద్ధికెక్కాయి .పిల్లల కథలుగా ‘’గోరింట రాక్షసుడు ‘’రాశాడు .’’మహేశ్వర ,వినాయక పండిత ,ఉమా ,విజయ ,మహేశ్వరం’’ అనే కలం పేర్లతో వివిధ పత్రికలలో వ్యాసాలూ వగైరా రాశాడు .గుంటూరు నుంచి ప్రచురింప బడిన ‘’శాంతిని ‘’పత్రికకు కొంతకాలం సంపాదకుడు గా పని చేశాడు .

  శిష్ట్లా కవిత్వాన్ని విశ్వనాథ మెచ్చుకొంటూ –‘’శిష్ట్లా కవి .గొప్ప ప్రతిభా వంతుడు ,మనసులో జరిగే కొన్ని విచారాలను ,ఉన్మేషాలను అంత చక్కగా ,ఆరోపించి చెప్పటం మిక్కిలి కష్టమైన పని ‘’అన్నారు  .శ్రీ నోరి నరసింహ శాస్త్రి ‘’శ్రీ శ్రీ ,నారాయణ బాబు వగైరాల  లాగ, శిష్ట్లా కవిత్వం విదేశాలనుంచి దిగుమతి అయిన కవిత్వం కాదు .తెలుగు గడ్డలో పుట్టి ,,తెలుగు జీవితం లో పెరిగిన నవ్య కవిత్వం శిష్ట్లా కవిత్వం ‘’అని కితాబిచ్చారు .ఇంతటి కవితా ప్రభావ శీలి శిష్ట్లా ఉమామహేశ్వర రావు కేవలం 41 ఏళ్లకే 1953లో మరణించటం ఆంధ్రుల దురదృష్టం .  

సిపాయి కథలు – శిష్ట్లా ఉమామహేశ్వరరావు వ్రాసిన విలక్షణమైన తెలుగు కథలు

ఆధునిక తెలుగు సాహిత్యంలో సైనిక, యుద్ధ వాతావరణాల ప్రస్తావన చాలా అరుదుగా కనిపిస్తుంది. రెండవ ప్రపంచయుద్ధంలో విశాఖపట్నం మీద బాంబులు పడడం వంటి చారిత్రక ఘటనలు ఉన్నా, సరిహద్దులకు దూరంగా ఉండటం, సైన్యంలో చేరే తెలుగువారి సంఖ్య తక్కువ కావడం కారణాలు అనుకోవచ్చేమో. రెండవ ప్రపంచయుద్ధపు మాంద్యపు రోజుల్లో ఆరుద్ర, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖరచయితలు చాలామంది మిలటరీలో కొంతకాలం ఉద్యోగం చేసినవారే. ఐనా మిలటరీ జీవితం కథావస్తువుగా వచ్చిన రచనలు తక్కువే. అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు కొన్నిటిలో నేవీ ఉద్యోగుల జీవితం గురించి ఉన్నట్లు గుర్తు. మునిపల్లె రాజుగారి కొన్ని కథల్లో మిలటరీ జీవితం ఉంటుంది. నాకు గుర్తున్నంతవరకూ, అంగర వేంకట కృష్ణారావుగారి విరామం ఒక్కటే నిజమైన మిలటరీ జీవితం నేపధ్యంగా సాగిన నవల. యద్దనపూడి వంటి రచయితల నవలల్లో, కథల్లో కొన్నిసార్లు మిలటరీ జీవితం నేపథ్యం కనిపించినా, వాటిలో వాస్తవికత తక్కువ.

మిలటరీ జీవితం గురించే ప్రత్యేకంగా కథలు వ్రాసిన వాడు తెలుగులో ఆధునిక కవితా వైతాళికులలో ముఖ్యుడిగా చెప్పబడే కవి కావటం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన కవితలు ఇప్పుడు సకృత్తుగానే లభ్యమౌతున్నా, గత శతాబ్దపు పూర్వార్థపు కవితా చరిత్ర తెలిసినవారు శిష్ట్లా ఉమామహేశ్వరరావుని “అతి నవ్యులలో అతి నవ్యు”నిగా, “వైచిత్రికీ, విచిత్ర ప్రయోగ పరతకీ పేరు మోసిన”వాడుగా కీర్తిస్తారు. ఇప్పుడు లభ్యం కాని శిష్ట్లా కవిత “మారో మారో మారో” (1928) మహాప్రస్థానం కవితకు ప్రోద్బలమని శ్రీశ్రీయే స్వయంగా చెప్పాడు. శిష్ట్లా ఉమామహేశ్వరరావు గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అతను ‘ఉన్మత్త భావశాలి’, “సాహిత్యరంగంలో ‘స్వైర విహార ధీరుడు”. కె.వి.రమణారెడ్డిగారి మాటల్లో, “జీవితంలోనూ, సాహిత్యంలోనూ ‘అరాచకం’ (anarchy) శిష్‌ట్లాకు పర్యాయ వాచకం.”

సిపాయి కథలు 1946లో ‘యువ’ ప్రచురణగా గ్రంథరూపంలో వచ్చాయట. ఇంకొన్ని సిపాయి కథలు 1947-48 మధ్య నెల్లూరునుండి వచ్చే జమీన్‌రైతు పత్రికలో కూడా వచ్చాయట. ఈ కథల్ని మళ్ళీ 1984లో, కె.వి.రమణారెడ్డి గారు సంకలించగా, విజయవాడ నవోదయా పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఈ సంకలనంలో 21 కథలున్నాయి.

ఈ సంకలనంలో మొదటి కథ గురకానందం మార్పు మిలటరీ జీవితానికీ, మిలిటరీ వ్యక్తులకీ సంబంధించిన కథ కాదు. కథా వస్తువులోనూ, శైలిలోనూ మిగతా కథలతో ఏసంబంధమూ లేని ఈ కథను, ఈ సంకలనంలో, అందునా మొదటికథగా ఎందుకు చేర్చారో, నాకు అర్థం కాలేదు. ఆఖరు కథ శాంతమూ, సౌఖ్యమూ కూడా మిలటరీ జీవితపు కథ కాదు. సంకలనకర్త సిపాయికథలకు అటూ ఇటూ అట్టల్లా ఈ కథలు వాడుకున్నారేమో. ఇంకో కథ లెఫ్టినెంట్ తులసి మిలటరీ వ్యక్తుల కథే ఐనా, మిగతా కథల్లా ఒక సిపాయి చెప్పిన కథ గాదు; సిపాయి జీవితపు కథా కాదు; నిడివిలో పెద్దది – ఐదు అధ్యాయాల కథ; ముఖ్యకథా వస్తువు ప్రేమ. లెఫ్టినెంట్

ఈ మూడు కథల్నీ కాసేపు పక్కకి పెట్టేస్తే, మిగతా 18 కథలూ ఒక సిపాయి ఉత్తమ పురుషలో చెప్పినట్లుగా ఉంటాయి. తెలుగు సిపాయిలు ఎక్కువగా ఉన్న పటాలంలో జరిగిన (లేక ఒకరికొకరు చెప్పుకున్న) కథలు. ఒక కథకు మాత్రం కథాస్థలం అరేబియా. మిగతా కథల్లో చాలావరకూ అస్సోం (కొమిల్లా, గౌహతి) ప్రాంతాల్లో బ్రహ్మపుత్రకు అటో ఇటో జరిగిన కథలు. కొన్ని కథలు సిపాయిలు సెలవుల్లో ఉన్నప్పుడు జరిగినవి. చాలాకథల్లో కథ చెప్పే సిపాయి పేరు అబ్బాయిగారి సుబ్బాయి. లమ్డీకే లచ్చన్న చాలా కథల్లో ముఖ్య పాత్రధారి. ఇంకా పెదబొండాయి, గన్నరు గుర్నాధం, గూబ గోసాయి చాలా కథల్లో కనిపిస్తారు. ఈ అబ్బాయిగారి సుబ్బాయికే అగ్రహారబ్బడితె అని కూడా పేరు ఉన్నట్టుంది.

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

చంఘి జ్ ఖాన్.5 వ భాగం.8.11.23.

చంఘి జ్ ఖాన్.5 వ భాగం.8.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.27 వ భాగం.8.11.23.

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.27 వ భాగం.8.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కోనసీమ ఆహితాగ్నులు.4 వ భాగం.8.11.23.

కోనసీమ ఆహితాగ్నులు.4 వ భాగం.8.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.90 వ భాగం.8.11.23.

శ్రీ హర్ష నైషధం.90 వ భాగం.8.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం -3

నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం -3

 రైతు బాంధవుడు ,కాకినాడ లిటరరీ ట్రస్ట్ సెక్రెటరి ,జిల్లాబోర్డ్ వైస్ ప్రెసిడెంట్ ,మద్రాస్ శాసన సభ్యులు , వితరణ శీలి ,లాయర్ ,మన పట్టాభి గారి మామగారు -శ్రీ గంజాం వేంకట రత్నం పంతులుగారు

ఆంధ్ర దేశం లో శ్రీ న్యాపతి సుబ్బారావు గారు ,మోచర్ల రామచంద్రరావు గారు శ్రీ గంజాం వెంకటరత్నం పంతులుగారు గురుస్థానం లో ఉన్నారు .వీరిలో స్వయం కృషి సామర్ధ్యం ,స్వార్జిత జ్ఞానం చేత గంజాం పంతులు గారు పరిస్థితులకు ఎదురీది ప్రాముఖ్యాన్ని పొందిన మహా పురుషులు .

  పూర్వకాపు మెట్రిక్ మాత్రమె పాసై ,,పాశ్చాత్యులైన మెకాలే ,ఎడిసన్ ,గోల్డ్ స్మిత్ ల వ్యాసాలూ క్షుణ్ణంగా చదివి ,జీవం కళ శైలి,సలక్షణమైన భాషా పాటవంతో ,తన కలాన్ని ఎలాపడితే అలీ తిప్పు గొప్ప రచనలు చేసిన అసాధారణ రచయిత.సామాన్య కుటుంబం లో పుట్టి ఆ తరగతి వారు అనుభవించే అష్ట కష్టాలన్నీ అనుభవించి ,అత్యున్నత పదవి అధిష్టించి మార్గ దర్శి అయ్యారు ..తూర్పు గోదావరి జిల్లా నరసాపురం లో చదివి ఆజిల్లా కేంద్రమైన ,అక్కడ ఉత్తరాలను గూళ్ళలో వేసే అంతే సార్టింగ్ ఉద్యోగం లో చేరారు ..మనసులో మాత్రం కోరిక తహసీల్దార్ ,ప్లీడర్ ఉద్యోగాలపై ఉండేది .

   అదృష్టం అకస్మాత్తుగా తలుపుతట్టినట్లు  ఈయన ముత్యాలకోవ వంటి దస్తూరి  నిబద్ధత గల వృత్తీ జీవనం గమనించి విశాఖ కలెక్టర్ ‘’కోరాపుట్టిలో డిప్యూటీ తహసీల్ పని ఇస్తాను  వెడతావా ?’’అని అడిగితె ,,సరే అని తలూపి ,మూటా ముల్లె సర్దుకొని బయల్దేర బోతుంటే ప్రభుత్వం ఆయనకు ‘’మొదటి తరగతి ప్లీడర్ సనదు ‘’ .మంజూరు చేసినట్లు శుభ వార్త వచ్చింది .బాక్ టు పెవిలియన్ అన్నట్లు వెనక్కి మళ్లి, కాకినాడ చేరి ,నల్లకోటు ,తలగుడ్డ కొనుక్కొని ఇంటికి ప్లీదరి బోర్డ్ తగిలించి ,న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి కొద్దికాలం లోనే పేరు మోసిన వకీలు అయ్యారు .బాగానే సంపాదించే వారు .

  అయన దృష్టి ప్రజా సంక్షేమం ,దేశం మీదనే ఉండేది .ఆరోజుల్లో బాగా వ్యాప్తిలో ఉన్న బాల సంఘాలు ,,లిటరరీ సొసైటీలు,స్ట్రీ పునర్వివాహాలు ,సముద్ర యానాలపై చర్చలు పెద్ద ఎత్తున జరుగు తుండగా  బాగా ఆకర్షింప బడి ,నెమ్మదిగా కాకినాడ లిటరరీ సొసైటీలో చేరి కార్య దర్శిగాఎదిగి ‘’వారం హేస్టింగ్స్ గొప్పవాడా ,కారన్ వాలీసు ‘’గొప్పవాడా?అనే శుష్క వాదాలతో తృప్తి చెందక ,ప్రజల కస్ట నష్టాలను అవగాహన చేసుకొని ,ఆ విషయాలను మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వానికి ,స్థానిక కాకినాడ కలెక్టర్ కు ఇంగ్లీష్ లో రాస్తూ ,మంచి రచయితగా పేరు తెచ్చుకొన్నారు .ఒకానొక సందర్భంలో మద్రాస్ అసెంబ్లి ఆనరబుల్ వెబ్ స్టార్  కాకినాడ లిటరరీ సొసైటీ నుంచి వస్తున్న వ్రాతల శైలిని హేతువాదాన్నీ అసెంబ్లి లో మెచ్చుకోవటం తొ గంజాం వేంకట రత్నం పంతులు గారి పేరు  రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా మారు మోగింది .

  గంజాం పంతులు గారు క్రమంగా తన శక్తి సామర్ధ్యాలకు ,సేవాభి లాషకు తగిన పదవి లో ఎదుగుతూ 1887లో కాకినాడ జూబిలీ కమిటీ కార్యదర్శి యై ,ప్రజల ,ప్రభుత్వ మన్ననలు విశేషంగా పొందారు .కాకినాడలోని పిఠాపురం మహారాజా వారి కాలేజిలో మేనేజర్ అయి ,కాలేజి కౌన్సిల్ ను రిజిస్టర్ చేయించి ,పై తరగతులు శాంక్షన్ చేయించి కొత్త కోర్సులు ప్రవేశ పెట్టించి విద్యా వ్యాప్తికి అవిరళ కృషిచేశారు .గంజాం పంతులు గారంటే సేవా విద్యా వ్యాప్తి అనే పేరు బాగా వ్యాపించి ఆనాటి కలెక్టర్ ‘’బ్రాడీ దొర ‘’కన్ను పంతులు గారిపై పడి,జిల్లా బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ పదవి నిచ్చారు .బ్రాడీ అంటేసమర్ధత సుపరిపాలన అన్న పేరు ఉండేది .ప్రజా హృదయాలను జూరగొన్న సమర్ధ మండలాధికారి .1995-96 ,1997-98 తన రిపోర్ట్ లో వైస్  ప్రెసిడెంట్  గంజాం పంతుల గారి గురించి ఇలా రాశాడు రీడ్ దొర –‘’పంతులుగారు జిల్లాబోర్డ్ పనులను అంకిత భావంతో సమర్ధంగా సంతృప్తి కరంగా నిర్వహించి ప్రజా దృష్టి నాకర్షిం చారు .వారి సహాయ సహకారాలు సలహాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందించేవారు .నా అధికారాలుచాలాభాగం పంతులు గారికే ఇచ్చేశాను .ఇతర శాఖలకు సంస్థలకు ఉన్న పనులన్నీ పంతులుగారికే అప్ప గించాను ఆయన సామర్ధ్యం మీద నాకు అపార నమ్మకం ..ఈ బోర్డ్ లో ఆయన లాగా ఎవ్వరూ అంత గొప్పగా కృషి చేయలేదు ‘’అని రాశాడు రీడ్ దొర.

  1889లో గంజాం పంతులుగారు ఉత్తర ప్రాంత మున్సిపాలిటీలు జిల్లా బోర్డు పక్షాన శాసన సభకు పోటీ చేశారు .ఆయన్ను అఖండమైన మెజారిటీ తొ గెలిపించి మద్రాస్ అసెంబ్లి సభ్యులను చేశారు ఆప్రాంత ప్రజలు .శాసన సభలో రైతుల కస్టాలు ,గ్రామాల స్థితిగతులు ప్రస్తావిస్తూ సాయం కోసం ప్రాభుత్వ  దృష్టికి  తెచ్చి అవసరమైన సహకారం అంది౦ప జేశారు .మండల సభలలో, దేశీయ మహా సభలలో ,శాసన సభలో రైతుల పక్షాన నిలబడి రైతు వాణి వినిపిస్తూ వారిని చైతన్యవంతులను చేసిన  మహాను భావులాయన .భూమి శిస్తు ,లోకల్ బోర్డ్ యాక్ట్ ,ఇమ్మిగ్రేషన్ బిల్ ,లపై పత్రికలలో గణాంక వివరాలతో విపులమైన వ్యాసాలూ రాసే వారు .అవన్నీ సాధికారమైన వే .అత్యంత ప్రమాణాలతో రాసినవే .

  జిల్లా రైతు సంఘాలు పెట్టి ,వారి గోడు ప్రభుతావ్నికి వినిపించే వారు .రైతులకు విద్యా వంతులకు సత్సంబంధాలు కల్గించారు .విద్యా వంతుడు ,కాంగ్రెస్  నాయకుడు ఆర్ధిక వేత్త బెంగాలీ నాయకుడు రమేష్ చంద్ర దత్ ను’’ఆరట్ల కట్ట ‘’కు ఆహ్వానించి తమతోట లో చెట్ల నీడ న ఇద్దరూ కూర్చుని చక్రకేళీలు ,బత్తాయిలు ఆస్వాదిస్తూ డెల్టా సమస్యలు చర్చిస్తూ ,ఆయన అభిప్రాయాలతో తన అభిప్రాయాలకు సాన బడుతూ పంతులుగారు రైతు లోకానికి అపారసేవ చేశారు ..ఆయనతో ఆతరం అంతరించింది .పంతులుగారి శిష్యుఅలైన పెన్మత్స సుబ్బరాజు ,కాళ్ళకూరి నరసింహం గార్లు ఆయన కృషిని కొంతవరకు కొనసాగించారు .

 న్యాయవాదిగా శాసన సభ్యునిగా ,రైతు శ్రేయోభిలాషిగా గంజాం పంతులుగారు ,తాను  శ్రమించి సంపాదించిన ధనాన్ని చాలాభాగం    ప్రజోపకార కార్యాలకే ఖర్చు చేసిన త్యాగమూర్తి .

  సంఘ సంస్కరణ పై అభిలాష ఉన్న పంతులుగారు వీరేశలింగం ,హావలాక్  దొర గార్ల పేర్ల మీద స్థాపించిన విద్యార్ధి వేతనాలు ,దాదాభాయ్ నౌరోజీ గారిపేరు మీద ఉన్న స్వర్ణపతకం లకు పెద్ద ఆర్ధక సాయం అందించి  సద్వినియోగం చేశారు .దేశీయ మహా సభలకు, కాకినాడ పుర మందిరానికి విశేషంగా విరాళాలు అందించారు .భూమిశిస్తుపై ఇంగ్లాండ్ లో ఆందోళన చేసిన వారికి ఆర్దిక సాయమందించారు .కత్తిరించిన మీస కట్టు ,నల్లటి పూర్వకాలపు కోటు ,వదులుగా ఉండే తలపాగా ,నల్లంచు ఉత్తరీయం ,చిరునవ్వు పంతులుగారి మూర్తి మత్వం .ఈపంతులు గారి కుమార్తెయే మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి  భార్య శ్రీమతి రాజేశ్వరమ్మ .

  ఇంతకంటే ఎక్కువ విషయాలు లభించలేదు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-11-23-ఉయ్యూరు     ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’ఏలూరు నగరాభి వృద్ధి కారకులు, జూట్ మిల్ స్థాపకులు,మహాదాత ,ఆననరి మేజిస్ట్రేట్ ,శాసన సభ్యులు – రావు బహాద్దర్ శ్రీ మోతే గంగరాజు గారు

’ఏలూరు నగరాభి వృద్ధి కారకులు, జూట్ మిల్ స్థాపకులు,మహాదాత ,ఆననరి మేజిస్ట్రేట్ ,శాసన సభ్యులు – రావు బహాద్దర్ శ్రీ మోతే గంగరాజు గారు

‘’పొ ద్దుటిపూట ఎనిమిది గంటల ప్రాంతం లో , ఒక ఎర్ర  చెంగావిబట్ట కట్టుకొని, కఫ్పు పెట్టినషర్టు తొడుక్కొని, పట్టే నామాలు ధరించివున్న వారొకరు లోపలినుండివచ్చి . కచేరీచావడిలో  నేలమీద పారచిన  ఒక చిన్న కుషన్ మీద కూర్చున్నారు , వారికి సుమారు  అరవై ఏళ్ళ  నయ స్పుం[టుంది. చిన్నప్పుడు దట్టంగా పోసిన స్ఫోటకపుమచ్న లింకా ఆ మొగంమీద కనిపిస్తూ చేవున్నాయి ., కొంచెం స్థూల కాయం . ; నలుపు ఛాయ, డాబులేను ; దర్పం లేదు. వారు కూర్చున్న చోట ఎడమవవైపూనా  ఒక చంగుకా పెట్టె, ముంచుప్రక్క_ ఒక డస్కు_ పెట్టి వున్నాయి, వచ్చిన పెద్దలూ, పిన్నలూ  అందరూ అక్క_డి తివాచీలమిదనే కూర్చుండి పోతూ వచ్చారు, దానధర్మాలకూ, పారి(శామిక కార్యనిర్వా హక త్యానికీ ఖ్యాతి కెక్కిన రావు బహద్దూర్ మోతే వీరరాజు  వారే అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏలూరు నగ రాభివృద్ధికి జరిగిన కృపి. యావగ్తూ ముగ్గురు నలుగురు [ప్రముఖులకు సంబంధించినదిగా కని శీ మూతే గంగరాజాగారు పిస్తుంది. దివాన్ బహాద్దూరు సర్ మోచర్ల రామ చంద్రరావు పంతులు, రావుబహాద్దూరు బడేటి వెంకట రామయ్యనాయుడుగార్లు మునిసిపల్  సంఘం ద్వారా . నగ రాభఫవృద్ధిని సాధిస్తే, రావు బహాద్దర్  మోతే గంగరాజు గారు విసుగు లేని తమ ప్రజోపకార    కార్యాల ద్వారానూ, అవసరమైన సంస్కరణలతో  ప్రజా సౌఖ్యాన్ని సంపాదిస్తున్నారు’’  Jఅని ఆయనను బాగా ఎరిగిన వారి కధనం.

 ఏలూరు లో ‘’అన్న వస్త్ర దాన సమాజం ‘’స్థాపించి ,60వేల రూపాయలు మూల ధనం ఏర్పాటు చేసి ,రోజూ ఎంతమంది వచ్చినా భోజనం పెట్టి ఆకలి తీర్చారు గంగరాజు .పండుగ ,పర్వాలలో పిండి వంటలతో భోజనంపెట్టే వారు .చలికాలం లో వస్త్రాలు ఇచ్చే వారు .ఇలాంటి సంస్థ ఆంధ్ర దేశంలో లేనే లేదు.అలాగే గోరక్షణ సమాజమూ నిర్వహించారు .రావు బహాద్దర్ వేంకటరామయ్య గారు స్థాపించిన మిషన్ హైస్కూల్ ఎత్తేసే పరిస్థితి వస్తే ,అండగా నిలబడి విద్యా దానం కొనసాగించారు .ఏలూరు బందరు బెజవాడలలో దేశీయ విద్యాలయ స్థాపనకు ముందుకు వచ్చి నిర్వహించారు .ఏలూరు గాంధీ విద్యాలయానికి 25 వేల రూపాయలు విరాళమిచ్చిన విద్యాదాత ఆయన . వైశ్యులైన  ఆయన కన్యకాపరమేశ్వరి సత్రానికి ,ఆర్య వైశ్య సభకు చెరొక పది వేలరూపాయలు అందించారు .జనార్దన స్వామి ,కన్యకా పరమేశ్వరి ఆలయాలను మహా యాత్రా స్థల్లాలుగా మార్చారు .

   గంగరాజు గారు తమ ఇంట్లో కుమారుల కుమార్తెల వివాహాలకు కవి పండిత ,కళాకారులను ఆహ్వానించి  సత్కరించి బహూకరించే వారు .స్ట్రీ సమాజాలకు ,పురమందిరం అంటే టౌన్ హాల్  కూ  అండగా నిలబడ్డారు .ఏలూరులోని జూట్ మిల్ ఆయన స్థాపించి,విదేశీ మిల్లులతో పాటు అద్భుత ప్రగతి పధం లో నిర్వహించి ఆదర్శ ప్రాయులయ్యారు .ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన లాభాలను వాటాదార్లకు 25 లక్షల రూపాయలు పంచిపెట్టిన ఘనత ఆయనది .ఇంతగా అభి వృద్ధి చేసిన ఆయన మిల్లును ఇంకొకరి చేతిలో  నమ్మి పెడితే మూలధనం అంతా హరించి ,అప్పులు పెరిగి మిల్లు కార్మికులు వేయి మందికి పని లేకుండాపోయి మిల్లు మూతపడింది .

  14-5-1933 న గంగరాజు గారి షష్టి పూర్తి మహోత్సవం నభూతో గా జరుపుకున్నారు .పండితుల వేదా శీస్సులు మేళ తాలాలాతో ఊరేగింపు ,బ్రహ్మాండమైన వేదిక పై జరిగింది .తులాభారం జరిగింది .కాటాలో ఎడమవైపు ఆయన కూర్చోగా ,కుడివైపు వెండి గంగాళం లో వెండి రూపాయలు కుమ్మరిస్తుండగా ,కాటాముల్లు మధ్యకు వచ్చి ఆగింది .వేద పండితుల ఆశీర్వాదాలలతో కాటానుంచి దిగారు .కాటాలో తూగిన డబ్బు 20 వేల రూపాయలు దేశోపయోగ సంస్థ లకు , ,పండితులకు, ఆప్తులకు  సంతృప్తిగా పంచిపెట్టిన వదాన్యులు ఆయన .

  గంగరాజు గారిని ఎన్నో పదవులు వరించాయి .ఆనరారి మేజిస్ట్రేట్ ,పంచాయతి కోర్టు ,సహకార బ్యాంక్ ప్రెసిడెంట్ జిల్లాబోర్డు ,మునిసిపాలిటి సభ్యులు ,శాసన సభ్యులు .ఇన్ని పదవులలో ఉన్నా ఎవరికీ అపకారం చేయని మహాను భావులాయన .వివాహాలకు సప్తాహాలకు సంతర్పణలకు దేవాలయాలకు సత్రాలకు ఆయన అందించిన ధనం ఎంతో లెక్కలకు అందనిది .ఆయన గుండె పూడి ,విస్సన్న పేటల జమీందార్ .అయినా ఆరాజసం ,గర్వం ఆయనలో యే కోశానా కనిపించేదికాదు .అంత నిగర్వి .జనాభిమానం ,దీన జనాభిమానం మూర్తీభవించిన మానవతా మూర్తి .’’రాజా’’గారు అని ప్రజలు మనసారా పిలిస్తే ‘’,రావు బహాద్దర్’’ అని ప్రభుత్వం గంగరాజు గారిని గౌరవించింది  .

 ఇంతకూ మించి విశేషాలు నాకు లభ్యం కాలేదు . నెహ్రూగారు ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించే ప్పుడు శ్రీమతి మోతే వేదకుమారి గారు శ్రావ్యంగా వందేమాతరం జనగణ మన గానం చేసేవారు .బహుశా గంగారాజుగారి కుటుంబం లోని వారే అయి ఉంటారు .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-11-23-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.26 వ భాగం.7.11.23.

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.26 వ భాగం.7.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కోనసీమ ఆహితాగ్నులు.3 వ భాగం.7.11.23.

కోనసీమ ఆహితాగ్నులు.3 వ భాగం.7.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.89 వ భాగం.7.11.23.

శ్రీ హర్ష నైషధం.89 వ భాగం.7.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరస భారతి 178 వ కార్యక్రమ౦గా’’సరస కవిరాజు ‘’ విద్వాన్ శ్రీ నవులూరి రమేష్ బాబు రచించిన ‘’కృష్ణా జిల్లా సాహిత్య తరంగిణి ‘’గ్రంథా విష్కరణ సభ.

       అక్షరం లోక రక్షకం

 సరస భారతి సాహిత్య సాంస్కృతిక  సంస్థ  –ఉయ్యూరు

సరస భారతి 178 వ కార్యక్రమ౦గా’’సరస కవిరాజు ‘’ విద్వాన్ శ్రీ నవులూరి రమేష్ బాబు రచించిన ‘’కృష్ణా జిల్లా సాహిత్య తరంగిణి ‘’గ్రంథా విష్కరణ సభ.

 సాహితీ బంధువులకు శుభకామనలు . సరసభారతి ,స్థానిక శ్రీనివాస డిగ్రీ కాలేజ్   సంయుక్త ఆధ్వర్యంలో సరసభారతి 178 వ కార్యక్రమంగా, ఆకళాశాలల ఆవరణలో 20-11-23   సోమ వారం ఉదయం  10.30 గం లకు –

‘’ సరస భారతికి ఆత్మీయులు ,ఉయ్యూరు గ్రామ వాసి ,రిటైర్ద్ తెలుగు లెక్చరర్ ,మూడు శతకాలు రచించి  , ‘’విద్యార్థి పథ దర్శని’’, ‘’విద్యార్థి వ్యాసములు’’( సాహితీ మిత్రులు, కైకలూరువారి ప్రచురణ)” రచించి ఉచితంగా విద్యార్థులకు పంపిణీ చేసి , 1987లో కైకలూరులో’’ శ్రీఅగస్త్యేశ్వరశతకావిష్కరణ’’ సభలో, మాన్యశ్రీ యస్.వి. జోగారావుగారు, మొవ్వ వృషాద్రిపతి, యస్,రాజన్న కవి,  కలిదిండి నారాయణ రాజు, కనుమలూరు వెంకట శివయ్య మున్నగు మహనీయుల సమక్షంలో   ” ‘’సరస కవిరాజు’’’బిరుదు నందుకొని . 1998గురుపూజోత్సవ సందర్భంలో  ‘మండల ఉత్తమ తెలుగు ఉపాధ్యాయ అవార్డు’ ; 1999 సం. ‘జిల్లా  ఉత్తమ తెలుగు పండిత  అవార్డు’  , “దక్షిణాంధ్ర సాహిత్యంలో భక్తి తత్త్వం” అనే అంశంపై పరిశోధన చేసి, లఘు సిద్ధాంత వ్యాసం సమర్పించి,  2008 సెప్టెంబర్ లో  ఎం.ఫిల్.డిగ్రీ పొందిన

   విద్వాన్ శ్రీ నవులూరి రమేష్ బాబు గారు ఎన్నో ఏళ్ళు శ్రమించి  ,కృష్ణా జిల్లాకు చెందిన 2006 మంది కవుల, రచయితల వివరాలు సేకరించి 550 పేజీలతో వెలువరించిన ‘’-

‘’కృష్ణా జిల్లా సాహిత్య తరంగిణి ‘’ బృహద్గ్రంథం-  

ముఖ్య అతిధి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి ) గారిచే ఆవిష్కరణ జరుగుతుంది .సాహిత్యాభిమానులందరూ పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా దీపావళి శుభా కాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాం .

,గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు

                                                      పరుచూరి శ్రీనివాసరావు –ప్రిన్సిపాల్ –శ్రీనివాస డిగ్రీ కాలేజ్ –ఉయ్యూరు

                                                     ఉయ్యూరు -7-11-23-.

                                        కార్య క్రమం

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యులశ్యామలా దేవి –సరస భారతి గౌరవాధ్యక్షులు

’కృష్ణా జిల్లా సాహిత్య తరంగిణి’’ గ్రంథా విష్కరణ – ముఖ్య అతిధి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్

ఆత్మీయ అతిధులు –శ్రీ గుత్తికొండ సుబ్బారావు – అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం –మచిలీపట్నం

                        డా.జి వి .పూర్ణ చ౦ద్-ప్రధాన కార్య దర్శి , కృష్ణా జిల్లా రచయితల సంఘం-విజయవాడ

                      అవధాన సరస్వతి డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ –మంగళగిరి

                       శ్రీ చలపాక ప్రకాష్ –ముఖ్య కార్య దర్శి –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం –విజయవాడ

                       శ్రీ పరుచూరి శ్రీనివాసరావు – ప్రిన్సిపాల్ –శ్రీనివాస డిగ్రీ కాలేజ్-ఉయ్యూరు

                       శ్రీ గాజుల సత్యనారాయణ –‘’పెద్దబాల శిక్ష ‘’ ముద్రాపకులు ,రచయిత-విజయవాడ

                       శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు ,విశ్రాంత తెలుగు అధ్యాపకులు –మచిలీపట్నం .

                      విద్వాన్ శ్రీ చల్లా లక్ష్మీ నారాయణ, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు –విజయవాడ 

                       శ్రీ గాజుల సత్యనారాయణ –‘’పెద్దబాల శిక్ష ‘’ ముద్రాపకుల

                    గ్రంథ రచయితవిద్వాన్ నవులూరి రమేష్ బాబు కు ఆత్మీయ సన్మాన సత్కారం-సరసభారతి చే .

                     రచయిత స్పందన

                   సభ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి 

Posted in సభలు సమావేశాలు, సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -6 వ చివరి భాగం . (శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా )

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -6 వ చివరి భాగం . (శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా )

నాయుడుగారి నాటక సమాజం రాజమండ్రి నుంచి అమలాపురం వెళ్ళేదాకా చిలకమర్తివారు ,ప్రకాశంగారు ఒకరినొకరు ‘’ఏమండీ ‘’అని పిలుచుకోనేవారు .ఆతర్వాత సాన్నిహిత్యం బాగా పెరగటం తొ ‘’ఒరేయ్ ‘’అనే పిలుచుకొనే వారుఅని కవిగారే చెప్పారు .ప్రకాశంగారు మెట్రిక్ పాసవగానే చిలకమర్తి రెండు రూపాయలు ఖర్చు చేసి ‘’చీనా మిఠాయి ‘’కొని అందరికి పంచి అందరికి ఆనందం కల్గించారు .ధవళేశ్వరంలో జనార్దన స్వామి తిరునాళ్ళకు నాయుడుగారు, ప్రకాశం గారు, కవి గారు కలిసి వెళ్ళినప్పుడు ప్రకాశం గారిపై చిలకమర్తి ఒక పద్యం రాసి వినిపించారు –

‘’సీ- ఈగ వ్రాలిన గాని వేగ జారెడు నట్లు –మువ్వంపు కురులను దువ్వినాడు –వర లలాటము నందు తిరు చూర్ణ రేఖను –ముద్దు గారేడు భంగి దిద్దినాడు –అరుణ పల్లవ మట్లు కరము రంజిల్లు చెం –గావి వస్త్రంబు గట్టినాడు –చార లంగరఖాను జక్కగా ధరియించి –వలెవాటు ఖండువ వైచినాడు

గీ-చెవుల సందున గిరజాలు చిందులాడ –మొగము మీదను జిరునవ్వు మొలకలెత్త –టంగుటూరి ప్రకాశము రంగు మెరయ –ధవళగిరి తీర్ధమున కు దరలి వచ్చే .

  ఈ పద్యం మనకు ఎవరికీ తెలీదు .అచ్చం ఫోటో తీసినట్లు ప్రకాశంగారి మూర్తిని మన కనులముందు నిలిపారు కవి చిలకమర్తి .

 ఒక సారి నాయుడు గారి సమాజం మద్రాస్ వెళ్ళినప్పుడుఆంధ్రనాటక పితామహ  ధర్మవరం కృష్ణ మాచార్యుల వారిని కలిసి వారి నాటకాలు బాగున్నాయని చిలకమర్తి ప్రశంస౦చి,తమ వచన నాటకాలు ఆదరి౦ప బడతాయా అని అడగ్గా ‘’నాటకం లో అభినయం ముఖ్యం సంగీతం కాదు ‘’అని ధైర్యం చెప్పారు .వారికోర్కేపై వీరు రాసిన ‘’నల ‘’నాటకం ప్రదర్శించారు శ్రీ దుర్గి గోపాలక్రిష్ణారావునలుడుగా ,ప్రకాశంగారు దమయంతిగా నటించారు .ధర్మవరం వారి అబ్బాయి శ్రీనివాసాచార్యులు కూడా వారితో ఉన్నాడు. అతడూ గోప్పనటుడే .

  చిలకమర్తి వారు క్రమంగా నవలలు రాయటం ప్రారంభించి శ్రీ న్యాపతి సుబ్బారావు గారు ఏర్పాటు చేసిన నవల రచన పోటీ లలో పాల్గొని పాల్గొన్న ప్రతి నవలకు మొదటి బహుమతి పొంది,నాటక ,నవలా సవ్యసాచి అయ్యారు .

శ్రీ వడ్డాది సుబ్బారాయుడు గారు ‘’వేణీ సంహారం ‘’నాటకం రాసి తాము స్థాపించిన ‘’హిందూ నాటకోజ్జీవ సమాజం ‘’ ద్వారా పలు ప్రదర్శనలిచ్చారు .వడ్డాది వారు ధర్మరాజు ,కనుపర్తి శ్రీరాములు అశ్వత్ధామ ,సుసర్ల శ్రీనివాసరావు ద్రౌపది ,సుసర్ల అనంతరావు దుర్యోధనుడు వేశారు. వడ్డాది వారు శాంతరసం,కరుణ రసం  బాగా అభినయించి  ధర్మరాజు పాత్ర పోషించారని నాటకం చూసిన చిలకమర్తి మెచ్చారు .ఒకసారి  అశ్వత్ధామ పాత్ర కూడా వేసి వీర రౌద్ర రసాలను పరమాద్భుతంగా రక్తికట్టిచారని కవిగారు ఉవాచ .నాటకం చివర స్క్రిప్ట్ లో లేని ముక్కు తిమ్మన పారిజాతాతపహరణ కావ్యంలోని శ్రీ కృష్ణ స్తవం అనే దండకాన్ని అద్భుతంగా గానం చేశారని ,ఆయన పద్యాలు పాడే నేర్పు మహా గొప్పదని చిలకమర్తి శ్లాఘించారు .ఈనాటకం అంటే తనకు పరమప్రీతి అని మెచ్చుకున్నసహృదయులు చిలకమర్తి .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-23-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.3 వ భాగం.6.11.23.

ఛ౦గిజ్ ఖాన్.3 వ భాగం.6.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.25 వ భాగం.6.11.23.

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.25 వ భాగం.6.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -5(శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా )

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -5(శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా )

శ్రీ ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు స్కూల్ మాస్టారి ఉద్యోగంలో ఉన్నా ,హెడ్ మాస్టార్ గా ఉన్నా ,ఆయన నాటక ప్రదర్శన నిర్వహిస్తూనే ఉన్నారు .ఎక్కడ ఉన్నా నాటక శాలయే ఆయన ఇల్లు అని ,నటులే ఆప్తులని అదే వారిఆనందానికి కారణమని ఆయన హృదయం తెలిసిన చిలకమర్తి వారన్నారు .అమలాపురానికి చెందిన శ్రీ చిలుకూరి లక్ష్మీ నరసింహారావు గారు రాజమండ్రి వచ్చి వీరి సమాజం లో చేరి మేనేజర్ గా ఉన్నారు అప్పుడు నటులందరికీ బొబ్బట్లు చేయించి విందు చేశారు అప్పటి నుంచి ఆయనను ‘’బొబ్బట్ల మేనేజర్ ‘’అని పిలిచేవారట .కవికూడా అవటం తొ ‘’ద్రౌపదీ వస్త్రాపహరణం’’,’’సౌగంధికా హరణం ‘’నాటకాలు కూడా రాశారట .మొదటి దానిని వీరి సమాజం ప్రదర్శించింది .ఈ సమాజానికి కోపిస్టి వంట బ్రాహ్మణుడు ఒకాయన ఉండేవాడు .పచ్చళ్ళు చేస్తే తన పిప్పి గోళ్ళు పుచ్చుగోళ్ళు నెప్పి పుడతాయని చేసేవాడుకాడు .రాగానే పచ్చి అటుకులు పెరుగులో వేసుకొని తినేవాడు .ఒక రోజు పెరుగు లేదని అలిగి వంట చేయకుండా వెళ్ళిపోయాడు .1891 సంక్రాంతి నాడు ఇలాగె ఏదో సాకుతో  కోపంతో వంట చేయకుండా పరారయ్యాడు .పండగ రోజు పస్తులు ఉండలేక నటులే  తంటాలుపడి మధ్యాహ్నం మూడింటికి ఇంత చారు అన్నం వండుకొని తిన్నారట . పండగనాడు పిండివంటలు లేవు  పప్పాలు  లేవు పప్పూలేదు కూర పచ్చడి కూడాలేవు పాపం .

 అమలాపురానికి చెందిన శ్రీ మంత్రిప్రగడ కవులట్లయ్య గారు  వీరి నాటకాలు చూసి మిత్రులై ,ఒక రోజు రాత్రి చిలకమర్తి వారిని  ‘’అష్టావధానం ‘’చేయమని కోరితే ,ఉన్న బసలోనే నటుల ఎదుట చేశానని చిలకమర్తి గారు రాశారు .ఎనిమది మందికి వారు అడిగిన విషయాలపై ,వారుకోరిన వృత్తాలలో పద్యాలు చెప్పారు .అందరూ ఆనందించారు పుష్పగణనం ,పురాణం ,చీట్లపేక అందులో లేవు ,ఒకసారి రాత్రి హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తూ ఉంటే  ముగ్గురు ధవలేశ్వరపు ఇంజనీర్లు వచ్చి ,చూసి ,మర్నాడు ఉదయం నాయుడు గారిని కలిసి మెచ్చి తాము నాటకం ఫోటోలు తీయలేకపోయామని అప్పుడు ప్రదర్శిస్తే తీసుకొంటామని చెప్పగా ,నాయుడు గారు తనమాటకు ఎవరూ అడ్డు చెప్పరనే ధైర్యంతో ఒప్పుకోగా ,ప్రియ శిష్యుడు ప్రకాశం గారు ‘’రెడ్డొచ్చె మొదలాడు ‘’అన్నట్లు గా ఉందికనుకపగలు  తాను వేషం వేయనని భీష్మించారు .గురువు ఎంత బతిమిలాడినా శిష్యుడు ససేమిరా అన్నాడు .ప్రకాశం మొదట్నుంచి స్వతంత్రుడు తనకు నచ్చిన పనే చేస్తారు మొహమాటం లేడు .దొరలముందు తన పరువు పోతుందని నాయుడుగారు భయపడ్డారు .మిగిలిన నటులు ఆశ్చర్యపోయారు .అప్పుడు గత్యంతరం లేక యరగర్ల సత్యరాజు ,నెప్పల్లి బుల్లి కృష్ణ య్య స్ట్రీ వేషాలు వేయగా ఇమానేని కాంతారావు నాయుడు ,అయిన వోలు తాతయ్య గార్లు మగ వేషాలు వేయగా దొరల ఎదుట నాటకం ఆడి పరువు దక్కించుకొన్నారు నాయుడు జీ .దొరలు ఫోటోలు తీసుకొని యోగ్యతా సర్టిఫికేట్ ఇచ్చి వెళ్లారు సంతోషంగా .

  ఒకసారి గయోపాఖ్యానం ఆడుతుంటే కృష్ణ బలరామ పాత్రధారులు పోట్లాడుకొనగా వెంటనే బలరామ వేషం వేసే   శ్రీ దుర్గి గోపాల కృష్ణారావు కృష్ణుడుగా వేయగా, బలరామ పాత్రకు ఎవరూ లేకపోతె చిలకమర్తి వారే వేయటానికి సిద్ధపడితే ,అప్పుడు అనుకోకుండా బలరామ పాత్రధారి వచ్చి నటించి రసాభాస కాకుండా కాపాడాడు అన్నారు కవిగారు. కవి గారిని మనం నటుడు గా చూసే అవకాశం కోల్పోయామన్న మాట .దుర్గి గారు ఆతర్వాత కృష్ణ పాత్ర దరిస్తూ మంచి పేరు తెచ్చుకొన్నారు .ఒకసారి కాకినాడలో నాటకం ఆడాలని సంకల్పించి నాయుడు గారు కాకినాడ వెళ్ళి ఉప్పుటేటి ఒడ్డున సింగితపు అబ్బాయి గారు అనే  వస్తాదు,వైద్యుడు ,అక్కడి నాటకకంపేని మేనేజర్ అయిన , మధ్వ బ్రాహ్మణుడి  సాయ౦ తొ పాక వేయించి ,1892 జనవరిలో పారిజాతాపహరణం నాటకం  ప్రదర్శించారు .ప్రకాశం గారి నటనా ప్రకాశంతో నాటకం బాగా రక్తి కట్టింది .సమాజానికి మంచి పేరొచ్చింది .ప్రకాశం గారు ఎక్కడ ఏ వేషం వేసినా  నట ప్రకాశమే .అప్పుడు బిఏ చదువుతున్న ఒరియా విద్యార్ధి శ్యామ సుందర రాజగురువు  వీరి నాటకాలు తరచుగా చూసి,మెచ్చి టంగుటూరి ప్రకాశం గారికి ‘’రంగ నక్షత్ర ‘’(స్టార్ ఆఫ్ ది స్టేజ్’’)అనే బిరుదును ప్రేక్షకుల కరతాల ధ్వనుల మధ్య అందజేసి సత్కరించాడు .ఈ విషయం కూడా మనలో చాలామందికి తెలియదు అనుకొంటాను

  కాకినాడ అబ్బాయి గారికి రాజమండ్రి నాయుడు గారికి మధ్య స్నేహం పెరగలేదు కాని వైరం వృద్ధి అయింది .చాడీలు విని అబ్బాయి నిజంగానే అబ్బాయిలా ప్రవర్తించేవాడు .అతని చుట్టూ రౌడీగాంగ్ ఉండేది .నాటకాలకు ఫ్రీగా టికెట్లు ఇమ్మని నాయుడుగారిని ఆబాచ్ బెదిరించేది .ఒకసారి రాత్రి వీరి నటుడు కోపల్లె శేషగిరి రావును బుర్రపై దుడ్డు కర్రలతో బాది పారిపోయారు .రక్తం కారుతుంటే మిగిలిన వారు బసకు తీసుకువెళ్ళి కట్టుకట్టించారు .ఆ బాచ్ చేసిన అల్లరి అంతైన్తాకదన్నారు చిలకమర్తి .అబ్బాయికూడా వచ్చి బసపై దాడి చేసి రాళ్ళు రువ్వాడు .అబ్బాయి గూండా ఇజాన్ని చుట్టుపక్కల వారెవరూ చూసి నివారించలేకపోయారు .అతడంటే అంత టెర్రర్ ..ఆతర్వాత వీరికీ వారికి తరచూ’’ కర్రాటలు ‘’జరుగుతూ పరిస్థితి  భీకరంగా ఉండేది .సంక్రాంతి నాదు అక్కడ గొప్ప ఉత్సవాలు జరుతుంటే నాయుడుగారు రాజమండ్రి వెళ్లగా ,కవి గారు వద్దని చెబుతున్నా ఒకరాత్రి ప్రకాశంగారు పిళ్ళారి శెట్టి తాతయ్య గోపాలక్రిష్ణారావు  నటులు ఉత్సవం చూడటానికి వెళ్లారు .రాత్రి పదింటికి అబ్బాయి మనుష్యులు దుడ్డు కర్రలతో గోపాలకృష్ణయ్య బుర్ర పగలగొట్టారు .వెళ్ళిన అరగంటలోనే రక్తం కారుతూ తిరిగి వచ్చాడు .మిగిలిన ముగ్గురు ఏమయ్యారో అని కవిగారికి కంగారు .పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు .రాత్రంతా నిద్రలేదు నాలుగు గంటలయ్యాక ‘’ఆత్రయం’’ తిరిగి వచ్చి జరిగిన సంగతులు కధలు గాధలుగా చెప్పారు .ప్రకాశం గారు తనను తరుముతున్న వాడి నుంచి తప్పించుకోవటానికి ఒక మార్వాడి దుకాణం లో దూరే ప్రయత్నం చేస్తే కొట్టు వాళ్ళు అడ్డుపడితే బలిస్టుడు కనుక తోసుకొని లోపలి వెళ్ళి ,తలుపు బిగించి కిటికీ దగ్గర నిలబడితే కొండయ్య అనే వాడు కర్రతో పొడవగా గుర్తుపట్టారు .

  ఈ సంఘటన జరిగాకకూడా ఫిబ్రవరి దాకా నాటకాలు ఆడి,రాజమండ్రి చేరారు . .కాకినాడ వారిపై ప్రకాశం పగబట్టి వీలుదోరికి నప్పుడు తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారు .ఒకసారి కొండయ్య రాజమండ్రి వీధుల్లో తిరుగుతుంటే ప్రకాశంగారు చూసి కర్రలతో వెంటబడి ఆయనా చలపతిరావు బుర్ర పగలకొట్టి దెబ్బకు దెబ్బతీశారు .కాకినాడ ముఠా వారు కోర్టులకు వెళ్లారు  కొండయ్యకు  సాక్ష్యం  చెప్పే వారు దొరకలేదు ఆవిషయం మేజిస్ట్రేట్ ముందు ఒప్పుకోని వేసిన కేసు వాపసు తీసుకొన్నాడు .అదీ ప్రకాశంగారి మగటిమ .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-11-23-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ హర్ష నైషధం.88 వ భాగం.6.11.23.

శ్రీ హర్ష నైషధం.88 వ భాగం.6.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -4(శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా )

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -4(శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా )

1885లో కాకినాడలో శ్రీ దినవహి హనుమంతరావు అనే సంపన్నుడు మిత్రులప్రోత్సాహంతో ఒక నాటక సమాజం స్థాపించి తెరలకే అయిదు వేల రూపాయలు ఖర్చు చేశారు .అందులో వైజర్స్ అప్పారావు .జయంతి భావనారాయణ కవి,ఆనేసాలు భీమ సేనరావు ,కంచి ఆనందరావు ,వల్లూరి సూర్యప్రకాశరావు ,కోపల్లె రమణారావు ,రాయవరపు హనుమంతరావు మొదలైన వారు  పాత్రలు ధరించేవారు .మేనేజర్ సింగితపు అబ్బాయి అనే మధ్వ బ్రాహ్మణుడు .ఆనంద రావు మంచి హాస్యం చెప్పి రంజింప జేసేవాడు నాయుడుగారుకూడా అతన్ని పిలిపించి తమనాటకాలకు హాస్యం చెప్పించేవారు .

  పారిజా తాపహరణం తర్వాత చిలకమర్తి వారు ‘’నల ‘’నాటకం రాస్తుండగా . రాజు వేషం వేసే పిళ్ళారి శెట్టి  రామ కృష్ణమ్మ నాయుడు కవి గారి దగ్గరకు వచ్చి,నలుడుపాత్ర తనకు ఇమ్మని పద్యాలు పెట్టద్దని ఒకవేళ ఒకటి రెండు పద్యాలున్నా  భావం కూడా రాయమని విసిగిస్తే చిలకమర్తి గారికి కోపం వచ్చి ఆనాటకం నిలువుగా చించిపారేశారట  .నాటక సమాజం వారు చూసి దాన్ని జాగ్రత్త చేసి కాపీ రాసుకొని చాలా సార్లు ఆనాటకం ప్రదర్శించారట .నలపాత్ర ను కవిగారి శిష్యుడు దుర్గి గోపాల కృష్ణారావు ధరించాడు .పద్యాలు మహా కమ్మగా పాడి మెప్పించేవాడు .ప్రకాశం గారు దమయంతి వేసేవారు .ఈ నాటకం అచ్చు వేయలేదని కవిగారు చెప్పారు దానికి కారణం  బళ్ళారి లోని ఆంధ్రనాటక పితామహ శ్రీ ధర్మవరపు కృష్ణమాచార్యులవారు ‘’చిత్ర నలీయం ‘’నాటకం రాసి ,’’సరస వినోదిని ‘’నాటక సమాజం స్థాపించి ,మద్రాస్ వెళ్ళి ఆనాట కాన్ని తానె నలుడి పాత్ర ధరించి ప్రదర్శించారు .అక్కడి ఆంధ్రులు దానికి బ్రహ్మ రధం పట్టారు .అనాటకాన్ని తెప్పించుకొని చిలకమర్తి వారు చదివించుకొని ,అన్ని విధాలా అది తన నల నాటకం కంటే బాగున్నదని భావించి ,దాని ముందు తననాటకం బలాదూర్ అని అచ్చు వేయించ లేదని వారే చెప్పుకొన్నారు .అదీ చిలకమర్తి వారి గొప్పతనం .దాని ప్రతికూడా ఆయన దగ్గర లేదట .ఏ నాటకం రాసినా రెండవ ప్రతి రాసి ఉంచుకోవటం తనకు అలవాటు లేదని చెప్పారు .రాసిన ప్రతి సమాజం వారికిచ్చేవారట .

  1890 మార్చి లో ‘’సీతారామ  కళ్యాణం ‘’నాటకం రాశారు చిలకమర్తి .శ్రీరామనవమి నాడు హనుమంతరావు నాయుడు గారి సమాజం దాన్ని ప్రదర్శించింది .బ్రహ్మ సమాజ గురువు శ్రీ శ శివనాద శాస్త్రి రాజమండ్రి రెండవ సారి వచ్చినప్పుడు వీరేశలింగం గారింట్లో ఉన్న ఆయన్ను చూడటానికి చిలకమర్తి వారు వెడితే ,ఆదరంగా మాట్లాడుతూ ‘’Local Shakspere ‘’అని సంబోధించి గౌరవించారు .ఆయన పై ఈయన పద్యాలు రాసి వినిపించారు .నాయుడు గారి సమాజం చిలకమర్తి గారు రాసిన నాటకాలే కాక ,శ్రీ ముడు౦ బై  రామానుజచార్యులవారి ‘’సిరియాళరాజు చరిత్ర ‘’,’’పాండవాశ్వమేధం ‘’,వేరెవరో రాసిన  ‘’సారంగధర ‘’నాటకాలేకాక వీరేశ లింగం గారి ‘’చమత్కార రత్నావళి ‘’కూడా ప్రదర్శించేవారు .స్త్రీల  పాత్రలను ప్రకాశం గారే కాక ,యరగర్ల సత్యరాజు గారు కూడా ధరించేవారు .ఈయనా అందంగా ఉన్న యువకుడే .ఆకారం స్త్రీ వేషానికి బాగా తగినట్లు ఉండేవారు అన్నారు  చిలకమర్తి .ప్రకాశంగారు సారంగధర లో ‘’రత్నాంగి ‘’వేస్తె సత్యరాజు ‘’చిత్రాంగి ‘’వేసేవాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-11-23-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చెంఘిజ్ ఖాన్.2 వ భాగం.5.11.23.

చెంఘిజ్ ఖాన్.2 వ భాగం.5.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.24 వ భాగం.5 11.23.

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.24 వ భాగం.5 11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

న్యాయవాది ‘’,దిహిందు’’ఆంగ్ల పత్రిక స్థాపకుడు,రాజమండ్రి మునిసిపాలిటి తొలి చైర్మన్,మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు , అమెరికా నుంచి తిరిగి వచ్చిన స్వామి వివేకానంద కు ఆహ్వానం పలికి,తొలి పూల మాల వేసిన -ఆంధ్ర భీష్మ శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులుగారు

న్యాయవాది ‘’,దిహిందు’’ఆంగ్ల పత్రిక స్థాపకుడు,రాజమండ్రి మునిసిపాలిటి తొలి చైర్మన్,మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు , అమెరికా నుంచి తిరిగి వచ్చిన స్వామి వివేకానంద కు ఆహ్వానం పలికి,తొలి పూల మాల వేసిన -ఆంధ్ర భీష్మ శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులుగారు

ఆంధ్రభీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు (జనవరి 14, 1856 – జనవరి 15, 1941) స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు, రాజకీయ నాయకునిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశీలి.

బాల్యం, విద్యాభ్యాసం

సుబ్బారావు 1856వ సంవత్సరం జనవరి 14 వ తేదీ మకర సంక్రాంతి రోజున నెల్లూరులో రాఘవరావు, రంగమ్మ దంపతులకు జన్మించారు. ఆ తరువాత కుటుంబం రాజమండ్రికి మారింది.[1] బాల్యం నుండే సుబ్బరావు విషయ పరిజ్ఞాన సముపార్జన పట్ల అమిత జిజ్ఞాస కలిగి ఉండి పేదరికం కారణంగా వీధిలాంతర్ల మసక వెలుతులో చదువు కొనసాగించారు. మెట్రిక్యులేషన్‌ పాస్‌ అయ్యి అనంతరం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరి స్కాలర్‌షిప్‌ సహాయంతో చదువుకుని 1876లో బిఎ డిగ్రీ పొంది . అనంతరం అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. బోధనా వృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి 1879లో లా పట్టాను పొందారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ న్యాయవాద పట్టాను పొందటం అప్పట్లో అరుదైన విషయం. ఈ ఖ్యాతిని సాధించిన దక్షిణ భారతదేశంలోని అతి కొద్దిమందిలో ఒకరిగా కోస్తా జిల్లాల్లో తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.

న్యాయవిద్యార్థిగా ఉండగానే 22 ఏళ్ళ ప్రాయంలో ఆయన ‘’ట్రిప్లికేన్‌ సిక్స్ ‘’గా పిలువబడే నాటి సాహిత్య సంఘం సభ్యులు మరో ఐదుగురు సభ్యుల మిత్ర బృందంతో కలసి, జాతీయోద్యమానికి సహకరించే ఉదాత్త లక్ష్యంతో, ది హిందూ జాతీయ ఆంగ్ల దినపత్రికను స్థాపించారు. అప్పట్లో భారతదేశంలో ప్రచుతరిమయ్యే ఆంగ్ల పత్రికలన్నీ బ్రిటీష్‌ ప్రభుత్వం కనుసన్నలలోనే ఉండేవి.

రాజమండ్రిలో

ఉమ్మడి మద్రాసు రాష్టంలో సుబ్బారావు గౌరవ న్యాయమూర్తిగాను, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 1880లో న్యాపతి సుబ్బారావు మద్రాసు నుంచి రాజమండ్రి తిరిగివచ్చి అక్కడే స్థిరపడ్డాడు. మరో 9 మంది న్యాయవాదులతో కలిసి రాజమండ్రి బార్ అసోషియేషన్ స్థాపించి , రాజమండ్రిలో సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగంతో సన్నిహితంగా మెలగేవారు. వితంతు పునర్వివాహాలు జరిపించడంలో వీరేశలింగానికి సుబ్బారావు పంతులు ఎంతగానో సహకరించారు. 1881లో స్థాపితమైన హితకారిణి సమాజం యొక్క మొదటి కార్యదర్శిగా నియమించబడి నిర్వహణలో, కార్యకలాపాల విస్తరణలో విలువైన సేవలందించారు.

1885లో రాజమండ్రి పురపాలకసంఘానికి తొలి అనధికార ఛైర్మన్‌గా ఎన్నికై 1888 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలోనే రాజమండ్రి ప్రజలకు తొలిసారి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశారు. 1893లో ఆయన మద్రాసు ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు సభ్యునిగా ఎన్నికై సర్కారు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ పదవిలో ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికై 1899 వరకు కొనసాగారు. 1896లో ఆయన రాజమండ్రిలోని టౌన్‌ హాల్‌ ట్రస్టుబోర్డు కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కలకత్తాలోని టౌన్‌ హాలు తర్వాత దేశంలో అంతటి ప్రాముఖ్యత రాజమండ్రి టౌన్‌ హాల్‌కు ఉంది. దీనిని కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించటం వెనుక న్యాపతి వారి సహకారం ఎంతో ఉంది.

సుబ్బారావు పంతులు రాజమండ్రి ఎలక్ట్రిక్‌ సప్లై కార్పొరేషన్‌ను స్థాపించి, విద్యుదుత్పాదన చేయడమే కాక తొలిసారిగా రాజమండ్రికి ఆ విద్యుత్‌ను సరఫరా చేసి వెలుగులు నింపాడు. 1893లో ఆయన రాజమండ్రిలో చింతామణి పత్రికను పునరుద్ధరించి ప్రజలకు ఆందుబాటులోకి తెచ్చారు. ఈ పత్రికకు కందుకూరి వీరేశలింగం పంతులు ఎడిటర్‌గా వ్యవహరించారు. రచయితల్ని ఆర్థికంగా ప్రోత్సహించటం లక్ష్యంగా సుబ్బారావు పంతులు నవలారచన అంశంగా వివిధ పోటీలు నిర్వహించేవాడు. చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనా వ్యాసంగానికి సుబ్బారావు నైతికంగా, ఆర్థికంగా ఎంతో సహకరించాడు. అదేవిధంగా హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసును రాజమండ్రి, పరిసర ప్రాంతాలకు పరిచయం చేసినది కూడా ఈయనే. 1922 ప్రాంతంలో రాజమండ్రిలో ఆంధ్ర చారిత్రక పరిశోధనా సంస్థ (ఇప్పుడు రాళ్ళబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలగా ఉన్నది) ఏర్పాటును న్యాపతి సుబ్బారావు పంతులు ఎంతగానో ప్రోత్సహించారు.

1897, ఫిబ్రవరి11న స్వామి వివేకానంద అంతర్జాతీయ మతాల సమావేశంలో ప్రసంగించి భారతదేశం తిరిగివస్తున్న సందర్భంలో ట్రిప్లికేన్ సిక్స్ మిత్రబృందం ఆయన్ను ఆహ్వానించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పురజనులు హాజరైన ఆ సమావేశంలో వివేకానందుని ఆహ్వాన సంఘానికి న్యాపతి సుబ్బారావును అధ్యక్షునిగా నియమించారు. వివేకానందుడు మద్రాసు రేవులో దిగగానే పూలమాల వేసి ఆహ్వానించిన తొలివ్యక్తి సుబ్బారావే. ఆ మరుసటి రోజు విక్టోరియా హాల్లో వివేకానందునికి ఆహ్వాన సభ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి14న మెరీనా బీచ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వివేకానందునితో పాటు సుబ్బారావు పంతులు వేదికను అలంకరించాడు. అలా ప్రారంభమైన వీరి స్నేహం సుబ్బారావుపై గాఢమైన ప్రభావాన్ని వేసింది. 1903లో వివేకానందుని స్ఫూర్తితో, సుబ్బారావు రాజమండ్రిలో భగవద్గీత, సనాతన హిందూధర్మ ప్రచారానికై, హిందూ సమాజం అనే సంస్థను స్థాపించారు.[1]

1898 నుంచి 1917 వరకూ భారత జాతీయ కాంగ్రెస్‌లో ఆయన కీలకమైన భూమికను పోషించారు. 1907లో వందేమాతర ఉద్యమ సందర్భంగా బిపిన్ చంద్రపాల్‌ను రాజమండ్రి ఆహ్వానించి అక్కడ ఉపన్యాసాలు ఇప్పించారు. విజయవాడలో 1914 ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహిస్తూ, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం చారిత్రాత్మకమైన పిలుపునిచ్చాడు. 1918 జనవరి 1వ తేదీన సుబ్బారావు పంతులు డిమాండ్‌ మేరకు ఆంధ్రప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ కాంగ్రెస్‌ కౌన్సిల్‌ను అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ మండలికి న్యాపతి సుబ్బారావు పంతులు అధ్యక్షుడయ్యారు. అంతేగాక ఆయన అఖిలభారత కాంగ్రేసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు ఎన్నికై సేవలందించారు.

సుబ్బారావు పంతులు 1941, జనవరి 15వ తేదీన85వఏట మరణించారు.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-11-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కోనసీమ ఆహితాగ్నులు.1 వ భాగం.5.11.23.

కోనసీమ ఆహితాగ్నులు.1 వ భాగం.5.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.87 వ భాగం.5.11.23.

శ్రీ హర్ష నైషధం.87 వ భాగం.5.11.23.

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మ సమాజ అధ్యక్షులు ,తత్వవేత్త ,వక్త పండిత సీతారామ తత్వ భూషణ్

బ్రహ్మ సమాజ అధ్యక్షులు ,తత్వవేత్త ,వక్త పండిత సీతారామ తత్వ భూషణ్

పండిట్ సీతానాథ్ తత్త్వభూషణ్ సాధారణ బ్రహ్మ సమాజ్ యొక్క అధికారిక వేదాంతవేత్త మరియు తత్వవేత్త.[1][2] అతని కీర్తనలు ఇప్పటికీ బ్రహ్మ ఆచారాలు మరియు ప్రార్ధనాలకు ఆధారం.[2][3]

జీవితం తొలి దశలో

అతను 1856లో సిల్హెట్‌లోని ఒక గ్రామంలో సీతానాథ్ దత్తా జన్మించాడు.[4] అతను 1871లో ఉన్నత విద్య కోసం కలకత్తా చేరుకున్నాడు. అతను మొదట్లో కేషుబ్ చుందర్ సేన్ యొక్క బ్రహ్మో నికేతన్‌లో చేరినప్పటికీ, అక్కడ అతను మత తత్వశాస్త్రంపై ఆసక్తిని పెంచుకున్నాడు. అయితే ఆ ఇన్స్టిట్యూట్ మూసివేయబడిన తరువాత, అతను 1875లో అలెగ్జాండర్ డఫ్ యొక్క జనరల్ అసెంబ్లీ ఇన్స్టిట్యూషన్‌లో చేరాడు.[5] 1879లో ఆనందమోహన్ బోస్ సిటీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా చేరారు. 1883 చివరలో, అతను సధారన్ బ్రహ్మ సమాజ్ యొక్క వేదాంతశాస్త్ర సంస్థలో దాని కార్యదర్శిగా చేరాడు మరియు పన్నెండేళ్ల పాటు దాని కార్యకలాపాలతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఈ కాలంలో అతను బ్రహ్మ వేదాంతశాస్త్రం మరియు మతంపై తులనాత్మక ప్రసంగాలను అన్వేషించాడు.[5]

అతను 1926లో సాధారణ బ్రహ్మ సమాజ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[6]

మతపరమైన స్థానాలు

అతని విస్తృతమైన పఠనాలు మరియు అతని సహచరులతో మేధోపరమైన మార్పిడిని అనుసరించి, మతం మార్చేవారిని ఆకర్షించడంలో బ్రహ్మోయిజం వైఫల్యం దాని తక్కువ తాత్వికత మరియు దైవిక ప్రేరణ మరియు ధృవీకరించలేని వాదనల ఆధారంగా సిద్ధాంతంపై ఎక్కువ ఆధారపడి ఉంటుందని అతను అభిప్రాయాన్ని అభివృద్ధి చేశాడు. దీనిని ఎదుర్కోవడానికి, అతను తత్వశాస్త్రం ఆధారంగా విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చాడు.[5] అతని రచనలలో, అతను బ్రహ్మోయిజం యొక్క వేదాంత వ్యవస్థను అభివృద్ధి చేశాడు. ఇది సహజమైన అంతర్ దృష్టి లేదా ఆకస్మికతపై కాకుండా, ఉపనిషత్తులు మరియు వేదాంతాలపై ఆధారపడిన ఆస్తికత్వం మరియు స్వీయ-జ్ఞానం యొక్క మెటాఫిజిక్స్‌పై ఆధారపడింది.[5] చైతన్యం ఏర్పడటానికి సాధనంగా నైతిక వికాసం యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పడం ద్వారా, అతని ఆలోచనలు వివేకానంద ఆలోచనలను ముందుంచాయి.

వివాదాలు

భక్తి సంప్రదాయాలపై ఆధారపడిన సహజమైన లేదా ఆకస్మిక మతం విమర్శనాత్మక హేతుబద్ధమైన అధ్యాపకుల అభివృద్ధికి సహాయం చేయదని భావించినందున అతను వైష్ణవ మతంపై దాడి చేశాడు.

బ్రహ్మో అనుచరులను (ప్రధానంగా కేశబ్ చుందర్ సేన్ యొక్క నూతన పాలన యొక్క అనుచరులు) ఆధ్యాత్మిక భ్రష్టులుగా అతని విమర్శనాత్మక అంచనా, మరియు తార్కిక అనుభవవాదంపై అతని ఉద్ఘాటన అతనికి బ్రహ్మ సమాజ్ (ముఖ్యంగా కేశుబ్ చుందర్ సేన్ అనుచరులు) మరియు విస్తృత హిందూ మతంలో వ్యతిరేకులను సంపాదించిపెట్టింది. సమాజం, అతని ప్రయత్నాలను ఎఫెట్ స్కాలస్టిసిజం అని విమర్శించింది.[5]

కుటుంబం

రవీంద్రనాథ్ ఠాగూర్ జీవిత చరిత్ర రచయితగా ప్రసిద్ధి చెందిన ప్రభాత్ కుమార్ ముఖోపాధ్యాయ తన కుమార్తె సుధామోయిని వివాహం చేసుకున్నారు. ఆమె శాంతినికేతన్ పూర్వ కాలపు విద్యార్థినులలో ఒకరు. ఆమె బోల్పూర్ బాలికా విద్యాలయ స్థాపకురాలు మరియు చాలా సంవత్సరాలు ప్రధానోపాధ్యాయురాలు.[7]గా పనిచేస్తుంది

బ్రహ్మో జిజ్ఞాస (తత్వవాదం యొక్క తాత్విక ఆధారంపై విచారణ), 1888.

బ్రహ్మోయిజం తత్వశాస్త్రం, 1909.

మాన్యువల్ ఆఫ్ బ్రాహ్మిక్ ప్రేయర్ అండ్ డివోషన్స్, 1921.

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-11-23-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment