కల్ప వృక్షపు స్త్రీలు –1
అంటే శ్రీ విశ్వ నాద సత్యనారాయణ గారు రచించిన శ్రీ రామాయణ కల్ప వృక్షం లో స్త్రీ పాత్ర చిత్రణ .
‘’అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యము ,అస్మాద్రుశుం –డలఘు స్వాదు రసావ తార దిషణా హంకార ,దో
హల బ్రాహ్మీ మయ మూర్తి శిష్యుడయినాడ న్నట్ట్టి ,యా వ్యోమ పే—శల చాంద్రీ మృదు కీర్తి చెళ్ళపిళ వంశస్వామికున్నట్లుగన్ ‘’
అంతటి దిషణా హం కారం ఉన్న కవి విశ్వ నాధ ‘’తేనెల్ వారును ,మేఘ గర్జనలు వీతేన్చున్ ,,పిక కన్యకా నూనవ్యాహృతి మాదు పంచమ మంచిన్డున్ ,దయో నవాభః కణశ్రీ నృత్యంబు ,చూపు మత్కవిత ‘’అని తనను తానే ఆవిష్కరించు కొన్న విద్వత్ కవి .’’ణా కవితాన్ ,విశాల జఘనా !ఒక ఔచితి లేదు ,భాషలేదాక్రుతి లేదు ,–ఊరక రసాత్మక తనే ,ప్రవహించి ,పోవుదున్ ‘’ .అని తన రాసాత్మతను తెలియ జేస్తాడు .ఇంకొంచెం గడుసుగా ‘’నన్నయ్యయు ,తిక్కన్నయు ,నన్నావేశించిరి ,పరిణా హ మనస్సంచంన్నత వారలు పోయిన –తెన్నున మెరుగుల ను దీర్చి ,దిద్డుచు పోవుదు న్ ‘’ అంటాడు .అలానే చేసి చూపించాడు .అందుకే విశ్వనాధ శారద ‘’సకలార్ధ దాయిని ‘’.ఆయన కల్ప వృక్షం ‘’సకలోహ వైభవ సనాధం ‘’.
కల్ప వృక్షం లో అద్వైత తాత్విక దర్శనం ప్రధానం గా చూపారు విశ్వనాధ .వాల్మీకి మహర్షి సుందర కాండ లో ‘’సుందర హనుమంమంత్రాన్ని’’ నిక్షే పిస్తే ,విశ్వనాధ ‘’ఆపదుద్ధార హనుమంమంత్రాన్ని ‘’ప్రతిష్టించారు .సీతా దేవి పరాశక్తి ,శ్రీ రాముడు శ్రీ విద్యో పాసకుడు .రాముడు అరణ్యవాసానికి వెళ్ళే సందర్భం లో వర్ణించిన పద్యాలలో ,’’సౌభాగ్య లక్ష్మీ స్తోత్రం ‘’ఉందని విశ్లేషకులు గమనించారు .
శూర్పణఖ లో కామం కాయమంతా వ్యాపించి కళ్ళు మూసుకు పోయాయి .’’లింగ సంబంది కామంబు –లే దు దితిజ ,మనుజ యన్న భేదమ్ము,యౌవనము ,వార్ధకంబున ,దశా ప్రబెధముల్ ,కామ సహిత భావమే దివ్యం ‘’అంటుంది .రావణ డు మొదలైన వాళ్ళు నాగరకత కల వారే అయినా ,వారి కామ దృష్టి ఇంతే .అని పించాడు .ఇది ఆధునిక సమాజానికి ప్రతి బిమ్బమే .అయితే సీతా సాధ్వి దృష్టి లో ‘’చేతో మోహ కుల్యా నదే మర్యాదాక్రుతి తీర్చు యోగం ‘’ అదీ వారిద్దరి తర తమ భేదం .ఇంత సూక్ష్మ పరిశీలనా దృష్టి ఆయనది .కల్ప వృక్షం లో ముని పత్నులు ,రాక్షస స్త్రీలు అందరు లౌకిక వ్యవహారాలలో మన నిత్య జీవితం లో కని పించే మనుష్యుల్లాగానే ప్రవర్తిస్తారు .
కల్ప వృక్షం లో కైక కు పెద్ద పీట వేశాడు విశ్వనాధ .రామ కధ అంతా ‘’కైకేయీ సముపజ్నం ‘’అంటాడు .’’కైకేయీ సముపజ్ఞమియ్యది ,జగత్కల్యాణ గాదా ప్రవాహాకారంబయి పొల్చు రామ కధ ‘’అని భరతునితో ,ఆంజనేయుని తో అని పిస్తారు విశ్వనాధ .’’కైక కోరక మహా ప్రభు నీవని రాక లేదు –నీ యాడది సీత కోరక మహాసుర సంహరణంబు లేదు –యా యాడు ది లేక, లేదు జగమంచు –నిదంతయు నేనా చేసితిన్ ‘’అని సీతా సాధ్వి అగ్ని ప్రవేశం ముందు అంటుంది .రాముడు శుద్ధ సత్య స్వరూపం .ఆయన క్రియా ప్రవృత్తిని స్పందింప జేసింది కైక ..ఆ స్పందనను ఫల వంతం చేసింది సీత .అయోధ్యకు తిరిగి వచ్చిన సీతను కౌగలించు కొని కైక –
‘’ఓసి యనుంగ ! నీవుగా గైకొని ,,ఈ వనీ చయ నికామ నివాస –భరంబదేల్లనున్ —లోకము నన్ను దిట్టుట తలోదరి !మార్చితి –కైక పంపనే గాక ,దశాననాది వధ కల్గునె ,యన్న ప్రశంశ లోనికిన్ –‘’ అని సంబర పడి పోయింది కైకేయీ.కార్య సాధనకు అంతటి అంతర్మధనం చెందింది కైక .నిశ్చ యాత్మకం గా సీత ప్రవర్తించింది .అంత రంగాల్లో అంతటి భేదం .బాల కాండ నుండి ,యుద్ధ కాండ దాకా ,కైకేయీ స్పురణ రాకుండా కల్ప వృక్ష కావ్యం సాగదు .శ్రీ రాముడు చేసే ప్రతి యుద్ధం లోను కైక ప్రసక్తి తప్పక ఉంటుంది .ఆమె స్థానం అంత ఉన్నత మైనది గా విశ్వనాధ తీర్చి దిద్దాడు .
సశేషం — మిగిలిన విషయాలు మళ్ళీ తెలియ జేస్తాను –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-5-12.—కాంప్ –అమెరికా


మాస్టారూ.. చాలా మంచి ప్రయత్నం ప్రారంభించారు. అక్షర దోషాల విషయంలో దయచేసి కొంచెం జాగ్రత్త వహించండి.
LikeLike