అమెరికా ఊసులు -10 –భాష -ఘోష

అమెరికా ఊసులు -10
–భాష -ఘోష
భావ వ్యక్తీకరణకు భాష అవసరం అని మనకు తెలిసిన విషయమే
.కొన్ని భాషలకు లిపి ఉండదు .మాట్లాడటానికే అవి ఉపయోగ పడతాయి .ఇరవై అయిదు
రకాల రచనా విధానాలున్నాయి .అక్షర మాలను ఉప యోగించి సాధారణం గా భాషను
రాస్తారు కాని చానా జపానీస్ భాషలను ఇడియోగ్రాం ల లో రాస్తారు .అవి
గుర్తులు గా ఉంటాయి .సుమేరియన్ భాష అత్యంత ప్రాచీన భాష గా అంటే 5,000ఏళ్ళ
నాటి భాష గా భావిస్తారు .సంస్కృతానికి సుమారు నాలుగు వేల ఏళ్ళు అని వీరి
నమ్మకం .ప్రపంచం మొత్తం మీద 6,912భాషలున్నాయి వీటికి మాండలికాలు ఉన్నాయి
.ప్రపంచ జనాభా లో సగం మంది ఇరవై భాషలే మాట్లాడుతున్నారు .బ్రిటన్ సూపర్
పవర్ కాక పోయినా వారి భాష ఇంగ్లీష ఆది పత్యం వహిస్తోంది .అందుకే ”రూల్
ఆఫ్ బ్రిటన్ పోయింది కాని రోల్ ఆఫ్ ఇంగ్లీష్ ”అనిచేణుకుతుంటారు .ఇండియా
లో .350మిలియన్ల జనం ఇంగ్లీష లోనే మాట్లాడు తున్నారు .వీరు బ్రిటన్
,ఆస్ట్రేలిన్యూజిలాండ్అమెరికాలలో ఇంగ్లీష మాట్లాడే వారికి సరి సమానం . ,
మాట్లాడే వారు లేక భాషలు అంత రించి పోతున్నాయి .ఈ విషయాన్ని
u.n.o.హెచ్చ రించి చాలా కాలమైంది .గౌతమ బుద్ధుడు బౌద్ధమత ప్రచారాన్ని
”పాళీ భాష ”లో చేశాడు .దానికి లిపి లేదు .ఇప్పుడీ భాష మాట్లాడే వారి
సంఖ్య అతి పరిమితం .ఇది శ్రీలంక ,తాయి లాండ్ ,మయన్మార్ దేశాలలో పూజా
విధానాలకు మాత్రమె పరి మితమైంది .అతి నాగరక భాష అని మనం గౌరవించే సంస్కృత
భాష మాట్లాడే వారు లేక గ్రందాలకే ఎక్కువ గా పరిమిత మైంది .ఐరిష్ భాష ను
గాలిక్ అంటారు ఐర్లాండ్ దేశీయుల అధికార భాష .ఆ దేశం స్వాతంత్రాన్ని1922
లో పొందినప్పుడు ఆ భాషను రెండు లక్షల యాభై వేల మంది మాట్లాడే వారట
.ఇప్పుడు కేవలం 30,000మంది మాత్రమె మాట్లాడుతున్నారట .
ఇవాల్టి ప్రపంచం లో199 భాషలను కేవలం డజను మంది మాత్రమె ఆయా భాషలలో
మాట్లాడుతున్నారని తెలిసి భాషా వేత్తలు ఆందోళన పడుతున్నారు . ఇందులోకి
దిగితే చాలా ఆశ్చర్య కర విషయాలను తెలుసు కొని గుండె బాదు కొంటాం .ఇయాక్
అనే భాష మాట్లాడే ఏకైక వ్యక్తిఅలస్కా లో2008 లో మరణించటం తో ఆభాష అదృశ్య
మైంది . ఐరిష్ భాష లాంటి ”మాక్స్ ”భాష మాట్లాడే చివరి ఆయన 1974 లో
మరణించటం తో అదీ తీసి వేత కు గురైంది .అండమాన్ దీవుల్లో” బో” భాష
మాట్లాడే 85ఏళ్ళ మహిళ2010  ఫిబ్రవరి లో చని పోవటం తో 65,000సంవత్స రాల
నుండి అవిచ్చిన్నం గా ఉన్న లంకే తెగి పోయింది .లాటియా యా లో”లివోనియన్
”  భాష మాట్లాడే ఒకే  ఒకరు ఇంకా ఉన్నారు .ఇప్పటి వరకు ఎనభై భాషలు ,ఆ
భాషలు మాట్లాడే జనం లేక కాల గర్భం లో కలిసి పోయాయి .ఇది చాలా ఆందోళన కర
విషయం .
కొన్ని భాషలు భాషా సాన్కర్యం వల్ల అంతరిస్తాయి. పాత ఇంగ్లీష
అనే ఆంగ్లో సాక్సన్ భాష మోడరన్  ఇంగ్లీష వ్యాప్తి వల్ల కనుమరుగైంది .భాషా
శాస్త్రజ్ఞుల లెక్క ప్రకారం 516భాషలు కోన ఊపిరి తో మినుకు మినుకుమంటూ
చావా లేక బ్రతకా లేక ఉన్నాయంటున్నారు .ఆఫ్రికా లో 46 ,అమెరికా లో170
,ఆసియా లో12, పసిఫిక్ లో 210 భాషలు కనుమరుగు ఆయె స్తితి లో ఉన్నాయి .ఈ
శతాబ్దం అంతానికి మాట్లాడే భాషల్లో సగం అంత రిస్తాయని హెచ్చరిక .
మనదేశవిషయానికి  వస్తే -428 భాషలున్న మనకు అధికార భాషలు 22ఉన్నాయి
.196 భాషలు ప్రమాదం అంచున ఉన్నాయి .అందులో 84 భాషలకు తీవ్ర గడ్డు స్తితి
.మరీ ముఖ్యం గా 62 తులసి తీర్దానికి రెడీ గా ఉన్నాయి .ఒక సారి వాటి వివ
రాలను చూద్దాం -అస్సాం లో అహోం ,తురంగ్ భాషలు ,అండమాన్ ,పాళీ లలో
ఒకో-జువాయ్ ,టిబెటన్ బర్మా లో అకాబీ ,అకాబో ,అకా కారి ,అకా కేడీ ,అకా
కోరా ,అకా బాలే లు అంత రించి పోయి నాగరకత కు సంస్కృతికీ వికాసానికి దోహదం
చేసినవి నిష్క్రమించి ఆందోళన కు గురి చేస్తున్నాయి .అతి కొద్ది మంది జనం
మాట్లాడే భాషల గురించి వింటే గుండె తరుక్కు పోతుంది .అండమాన్ లో ని జేరు
భాషనూ కేవలం ఏడుగురు మాట్లాడుతున్నారు .అక్కడిదే అయిన మరోభాష జార్వా ను
మాట్లాడే వారు 250 మంది మాత్రమె .అక్కడివే అయిన ఒంగే ను వందమంది ,ఆ
పూకిక్వార్ భాషను24 మంది అస్సాం లోని ఖామ్యంగ్ భాష ను కేవలం యాభై మంది
,ఒరిస్సా లోని పరాంగ్ భాషను 76మంది ,ఉత్తరాఖండ్ లోని జాద్భాష మాట్లాడే
వారు మూడొందలు మాత్రమె ఉన్నారు అంటే భాషలు ఎంత తీవ్ర వేగం తో కాల గర్భాన
కలిసి పోతున్నాయో తెలుస్తోంది .
ఇలా ఆందోళన పది నిశ్చేష్టులై చైతన్య రహితం గా ఉండటమేనా
?లేక భాషా పునరుద్ధరణ కార్య క్రమాలు ఏమైనా జరుగు తున్నాయా అని మనకు అను
మానం రావటం సహజం .ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి .భాషలను బతికించు కొనే
ప్రయత్నాలను తీవ్రం గానే చేస్తున్నారు .దీనికి కొన్ని ఉదాహరణలు -బ్రిటన్
లోని యూని వర్సేల్ భాష అని పిలువ బడ్డ ”కార్న్ వాల్లోని ”కార్నిష్
”భాష మాట్లాడే వారు 1990 లో దాదాపు అంత రించి పోతే  పటిష్టమైన చర్యలను
తీసుకోవటం వల్ల ఇప్పుడు 300 మంది ఆ భాషను నేర్చుకొని సజీవం గా ఉంచారు
.హాట్స్ ఆఫ్ .అలాగే ఐస్ లాండ్ లో ఇంగ్లీష భాష టో సంకరం కా కుండా వాళ్ళ
భాష లో పదాలను సృష్టించుకొని చక్కగా వాడుకొంటూ భాషను
బతికిన్చుకొంటున్నారు .
ఆంద్ర ప్రదేశ్ లో భాష లను పునరుజ్జీవింప జేయటానికి భాషోద్యమ
ఉద్యమాలను చేబట్టారు /”తెలుగు లో మాట్లాడటం జన్మ హక్కు ”అనే నినాదం
పెరిగింది .ఆంగ్ల మాధ్యమాన్ని తగ్గించామనే ఆందోళన చే బట్టు తున్నారు
.తెలుగు భాషా సంఘాలు తెలుగు భాషా సంస్కృతికి అనేక పధకాలను ప్రభుత్వానికి
సూచించి అమలు చేయటానికి ఒత్తిడి తెస్తున్నాయి .ఇప్పుడు తెలుగు అధికార భాష
గా ఉన్నా ఆ సంఘానికి అధ్యక్షుడు లేడు .తెలుగు అకాడెమీ లేదు .తెలుగు భాష
కు మంత్రి లేడు’ఎంతో ఒత్తిడి మీద నాలుగేళ్ల క్రితం తెలుగు కు ప్రాచీన
హోదా లభించినా ఇంకా అధ్యయన కేంద్రం కేంద్ర గ్రాంటు రాలేదు .అసలు మంత్రులు
శాసన ,లోక సభ సభ్యులు ఈ దిశా గా చేయాల్సిన ప్రయత్నం చేసింది తక్కువే
కృష్ణా జిల్లా రచయితల సంఘం ఈ విషయాలలో అనేక చైతన్య
యాత్రలను జరిపి ప్రజలకు విషయాలను తెలియ జేసింది .తెలుగు ను కోర్టులలో
అమలు జేసే విషయం లో సెమినార్ నిర్వ హించింది .రె ”తెలుగు రచయితల ప్రపంచ
మహా సభలు”రెండింటిని విజయ వాడ లో అతి ఉత్సాహం గా నిర్వహించి అందరి
దృష్టిని ఆకర్షించింది .రెండ వ సభల అనంతరం ఆధునిక సాంకేతి కతను జోడించి
తెలుగు ను విశ్వ వ్యాపితం చేసే ఆలోచన చేసి కొత్త ఫాంటులను ఆవిష్కరింప
జేసి అంతర్జాలం లో తెలుగు వ్యాప్తికి కృషి చేసింది .ఈ సంఘానికి
అధ్యక్షకార్య దర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బా రావు  డా.జి వి.పూర్ణ చాద్
ల సేవలు నిరుప మానం .వీరికి మార్గ దర్శనం చేస్తున్న వారు శ్రీ మండలి
బుద్ధ ప్రసాద్ .,యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ గార్లు .అలానే తెలుగు
భాషోద్యమాన్ని తమ భుజ స్కంధాల పై మోస్తు , వయస్సు ను కూడా లెక్క జేయ
కుండా అవిశ్రాంతం గా కృషి చేస్తున్న మాన్యులు శ్రీ సి.ధర్మా రావు ,శ్రీ
సామల రమేష్ బాబు గార్ల సేవ లు మాటలతో చెప్ప లేనంతటి ఉత్క్రుష్టమైనవి .
భాషను రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని అందరు
గుర్తించాలి .మాత్రు భాష ఔన్నత్యాన్ని తెలుసు కోవాలి ఇంటి భాష గా తెలుగు
లో మాట్లాడాలి .మన పిల్లలతో తెలుగు లో మాట్లడించాలి . ఈ ”భాషా  ఘోష ”
అంతటా నిన దించాలి .–”భాష ఆలోచన కు ఆహార్యం ”–”నా మెదడు లోని
ఆలోచనలను నీ మెదడు లోనికి శస్త్ర చికిత్స లేకుండా ప్రవేశ పెట్టేదే భాష
”అన్నారు మహాను భావులు .
ఈ వ్యాసానికి ఎక్కువ ఆధారం శ్రీ ఏం.యెన్.శాస్త్రి
-(ముంబాయ్) గారు రాసిన”world demographic trends  అనే పుస్తకం లోని
languages అనే వ్యాసం .ఈ పుస్తకాన్ని నాకు పంపి నన్ను చది వించిన నా
మిత్రులుశ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సాహిత్య ఋణం తీర్చు కోలేనిది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –.21-7-12.–కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

1 Response to అమెరికా ఊసులు -10 –భాష -ఘోష

  1. madhavaraopabbaraju's avatar madhavaraopabbaraju says:

    శ్రీ దుర్గాప్రసాదు గారికి, నమస్కారములు.

    చాలా చక్కటి విషయాన్ని, ఎన్నో వివరాలతో అందించారు. ధన్యవాదాలు.
    ఒక ఊహాత్మాకమైన ప్రశ్నని మీ ముందు వుంచుతున్నాను. ఈ ఊహ ఒక extreme situation అనుకోండి. అయితే, ప్రతి ఒక్కరూ తమతమ మాతృ భాషని కాపాడుకోవాలి అనే విషయాన్ని మాత్రం నేను వదలటలేదు. నా ప్రశ్న:–

    “ మానవులందరూ ఒకటే; ఒకటిగానే వుండాలి అని అంటాము. భాష మనలోని భావాల్ని వ్యక్తం చేయటానికి వినియోగిస్తాము. ప్రపంచంలోని వేల భాషలు కుదింపబడి, చివరకు రెండే మిగిలాయి అనుకోండి. అప్పుడు అందరూ ఈ రెండు భాషలనే వాడాల్సి వస్తుంది. అప్పుడు మనుషుల్లో భాషా ఐక్యత; మనమందరం ఒకటే అన్న భావన కలిగే అవకాశం రాదంటారా? ”.
    నా ప్రశ్న మిమ్మల్ని నొప్పించివుంటే, క్షమించండి.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.