కృష్ణా జిల్లా సాంస్కృతిక సదస్సు –విజయ వాడ -13-12-12- గురువారం
నిన్న అంటే పదమూడవ తేది మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా పౌర సంబంధాల అది కారి గారు నాకు ఫోన్ చేసి‘’ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు విజయవాడ ఇందిరా గాంధి స్టేడియం లో మీకు సన్మానం ఉంది తప్పక రండి ‘’అని చెప్పారు .నేను వెళ్లాను .అప్పటికే వివిధ పాఠశాల విద్యార్ధులు బెంజ్ సర్కిల్ నుండి ఊరేగింపుగా తెలుగు భాషా సంస్కృతి లను కాపాడుకోవాలి అంటూ నినాదాలు చేస్తూ స్టేడియం చేరారు .విద్యార్ధినుల మా తెలుగు తల్లికి నృత్యాభి నయం తొ సభ ప్రారంభ మైంది ..విద్యార్ధినులు ‘’తెలుగు భాష తీయదనం తెలుగు నేల గొప్పదనం ‘’పాటను నృత్యాభి నయం చేశారు .ఇద్దరు మహిళలు‘’నేత్రావధానం ‘’నిర్వహించారు .పృచ్చకులు రాసిచ్చిన ప్రశ్నలకు కళ్ళ కదలిక లతో సమాధానం చెప్పటం .బాగానే సరిగ్గానే చెప్పారు .పది నిముషాలలో ముగింప జేశారు నిర్వాహకులు స్పందనా కరువే అయింది ..ఇక్కడ ఒక విశేషం –బందరు లో ఉంటున్న అధ్యాపకులు స్రేఎ స్వర్ణ రాజ హను మంత రావు గారు నేత్రా వధానం ప్రదర్శన లను వెయ్యికి పైగా చేశారు .ఈ వేదిక ప్రక్క మరో వేదిక పై ‘’భువన విజయం ‘’కోసం కృష్ణ దేవ రాయలుగా శ్రీ కోట సుందర రామ శర్మ ,తిమ్మరుసు గా అవధాని శ్రీ పాల పర్తి శ్యామలా నంద ప్రసాద్ ల తొ బాటు అష్ట దిగ్గజ కవుల వేషాలలో సర్వశ్రీ గుమ్మా సాంబశివరావు.పింగళి కృష్ణా రావు పువ్వాడ తిక్కన సోమయాజి ,జంధ్యాల మహతీ శంకర్ వంటి హేమా హేమీలు రెండు గంటలు గా కూర్చున్నారు చివరికి వారి కిచ్చిన సమయం పావు గంట మాత్రమె .నిరీక్షణే వారికి సరి పోయింది పాపం ..వారి ముందు కొన్ని నృత్య ప్రదర్శనలు జరిగాయి .స్వర్గీయ వేమల పల్లి శ్రీ కృష్ణ రాసిన ‘’చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గత మెంతో ఘన కీర్తి కలవోడా ‘’గీతాన్ని ఒక గాయకుడు అద్బ్భుతం గా పాడి ఉత్తేజం కల్గించాడు .
ఆంద్ర ప్రదేశ్ అధికార భాషా సంఘాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ మొదటి ప్రపంచ తెలుగు మహా సభలు ముప్ఫై ఏడేళ్ళ క్రితం హైదరా బాద్ లో జరిగాయని ,రెండవ సభ మలేషియా లో మూడవది మారిషస్ లో జరిగిందని ఇప్పుడు జరుగ బోయే నాల్గవ సభ తిరు పతి లో ఈ నెల ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు జరుతాయని చెప్పారు .ఇప్పటికే రుసుము చెల్లించి మూడు వేలకు పైగా ప్రతి నిధులు నమోదు చేసుకొన్నారని ,ఇంకో ఏడేని మిది మంది స్వంత క్షర్చులతో వస్తున్నారని అన్నారు .మొత్తం మూడు వేల మంది వివిధ కళా కారులు పాల్గొంటున్నారని అందులో పదిహేను వందల మంది జానపద కళాకారు లుండటం విశేషమని మూడొందల మంది రచయితలు పత్ర సమర్పణ చేస్తున్నారనికొన్ని వందల మంది విదేశాల నుండి వస్తున్నారని చెప్పారు . చాలా పెద్ద స్థాయి లో నిర్వహించే సభలు అని ,రాష్ట్ర పతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ సభలను ప్రారంభిస్తారని శ్రీ నారాయణ రెడ్డి గారు రచించిన గీతం తొ సభ ప్రారంభ మవుతుందని తెలిపారు .తెలుగు ను కాపాడు కోవలసిన బాధ్యత మన అందరిది అని ఇంట్లో తెలుగు తప్పక మాట్లాడాలని ప్రాధమిక స్తాయి నుండి విశ్వ విద్యాలయ స్తాయి వరకు తెలుగు బోధించ టానికి అన్ని విధాలా కృషి చేస్తామని ఈ సభలు దిశా నిర్దేశం చేస్తూ ,ఆధునిక సాంకేతికతను భాషకు సమ కూర్చు కొంటూ అంతర్జాలం లో కూడా తెలుగు వాడకాన్ని పెంచే ఏర్పాటులో ఉన్నామని ,అందరు పాల్గొని సభలను దిగ్విజయం చేయాలని కోరారు .పూర్వం జరిగిన సభలు ఒక్క హైదరా బాద్ కే పరి మితమైనాయని ఈ సభలు గ్రామ గ్రామాన ప్రదర్శనలతో ఉత్తెజితులం చేశామని మండల,రేవిన్యు స్టయిల్లో పోటీలు నిర్వహించి ప్రతిభా పురస్కారాలను అందించామని చెప్పారు జిల్లా స్తాయిలో ఈ నెల తొమ్మిది నుండి పన్నెండు వరకు బెజవాడ ,మచిలీ పట్నాలలో అనేక సభలు, సెమినార్లు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి సభల పై అవగాహన కల్పించామని అన్నారు ఈ రోజు విజయ వాడ లో జిల్లా మొత్తం సభల ముగింపు సభ జరుపు తున్నామని జిల్లా స్తాయిలో అనేక రంగాలలో విశిష్ట సేవ లందించిన వారిని గుర్తించి ఉచిత రీతిని సత్కరిస్తున్నామని తెలియ జేశారు .
ఆ తర్వాత మారిషస్ దేశం లో మూడవ ప్రపంచ సభలనిర్వహణ లో భాగస్వామి, అక్కడి తెలుగు రేడియో ‘’టోరి‘’లోతెలుగు కు ఇన్చార్జి అయిన శ్రీ సంజీవప్పడు మాట్లాడుతూ రెండు వందల ఏళ్ళ క్రితం తమ వారంతా ఉత్త రాంధ్ర నుండి మారిషస్ చేరుకోన్నారని ‘’మరీచి మహర్షి దేశం ‘’కనుక మారిషస్ అయిందని ,తాను మారిషస్ లోనే జన్మించానని అయినా తెలుగు నర నరానా జీర్నిచి పోయిందని అన్నారు మారిషస్ లో ఒకటో తరగతి నుండి విశ్వ విద్యాలయ స్తాయి వరకు తెలుగులో బోధన ఉంటుందన్నారు ఉగాది ,సంక్రాంతి వంటి తెలుగు పండగలకు జాతీయ సెలవులిస్తారని తామంతా తెలుగు పండుగలను అత్యంత ఉత్సాహం గా జరుపు కొంటామని అన్నారు రెండు వందల ఏళ్ళ నుంచి శ్రీ రామ భజన ను విడువ కుండా మారిషస్ లో జరుపుకొంటున్నామని చెప్పారు భారత దేశానికి యాభై, అరవై మందితో ప్రతి ఏడాది వస్తామని ఇక్కడికి విమానం దిగ గానే ఈ నేల తల్లికి సాష్టాంగ నమస్కారం చేస్తామని ,ఆ మట్టిని శిరసున ధరిస్తామని తెలుగు నేల అంటే తాము ఎన్నడు మర్చి పోమని ఇక్కడి పుణ్య క్షేత్రాలన్నీ దర్శించి అక్కడి మట్టి ని తమతో తీసుకొని వెళ్లి అతి పవిత్రం గా చూసుకొంటామనిహర్ష ధ్వానాల మధ్య వివరించారు .
గుడి వాడ వాసి ,అమెరికా లో స్తిర నివాసి ‘’మరో పికాసో ‘’అని పించుకొన్న ప్రఖ్యాత చిత్ర కారులు డాక్టర్ శ్రీ ఎస్ .వి. రామా రావు మాట్లాడుతూ అమెరికా లో ఉన్నా ప్రతి ఏడు భరత్ కు వస్తామని ఇక్కడి మూలాలను మరిచి పోమని అక్కడ తమ ఇళ్లలో తెలుగు తప్పని సరి మాట్లాడుతున్నామని.మనం అందరం కలిసి తెలుగు సభలను విజయ వంతం చేద్దామని అన్నారు .తానా అధ్యక్షులు, గన్నవరం వాసి శ్రీ తోటకూర ప్రసాద్ తాము అమెరికా లో తెలుగు నేర్పటానికి లక్షలాది డాలర్లు ఖర్చు చేస్తున్నామని అందరు ఇళ్ళల్లో తెలుగే మాట్లాడుతామని ,తెలుగు సంస్కృతీ వైభవాన్ని తెలియ జేసే తానా సభలు నిర్వహిస్తున్నామని భారత అభి వృద్ధికి తెలుగు భాషా సంస్కృతి ల అభి వృద్ధికి తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నామన్నారు .ఇక్కడ తెలుగు మాధ్యమం లో బోధనా లేక పోవటం విచారకరమన్నారు
ఆ తర్వాత జిల్లాలో కవిత్వం ,రచన ,నాటకం ,సంగీతం నృత్యం ,చిత్ర లేఖనం ,క్రీడలు ఆటలలో మొదలైన వివిధ రంగాలలో విశేష కృషి, సేవలు చేసినవారిని సుమారు వందమందిని ఎంపిక చేసి వారందరికి తెలుగు పురస్కారాలంద జేశారు వీరందరికీ శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ,కలెక్టర్ శ్రీ బుద్ధ ప్రకాష్ గారు స్వయం గా ఒక్కొక్కరికి శాలువా కప్పి జ్ఞాపికను ,ప్రశంశా పత్రాన్ని దానితో పాటు వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందజేసి సత్కరించి తమ విశేషతను చాటు కొన్నారు ..బుద్ధ ప్రసాద్ గారు నాకు శాలువా కప్పి సన్మానం చేస్తూ కలెక్టర్ గారితో ‘’వీరు గబ్బిట దుర్గా ప్రసాద్ గారు .ఉయ్యురు నుండి వచ్చారు . .అక్కడ ఆయన గొప్ప సాహిత్య సంచలనం .ఎన్నో చాలా గొప్ప సాహిత్య సభలను నిర్వహిస్తూ మమ్మల్ని కూడా భాగా స్వామ్యులను చేస్తారు ‘’అన్నారు.కలెక్టర్ గారు కర చాలనం చేశారు . .ఆనందం ఆశ్చర్యం వేసింది నాకు రంగ రంగ వైభవం గా సాగిన ఈ కార్య క్రమం చాలా ఆలస్యం అయి నందు వల్ల చివరికి ప్రేక్షకులు లేక వేలా తేలా బోయి ఖాళీ కుర్చీల తొ దర్శన మిచ్చింది ..ఏం సి.దాస్ గారు సభా సంచాలనాన్ని తప్పుల తడిక గా నిర్వ హించటం ,పేర్లను తప్పుగా పలకటం ,అనవసరపు ప్రసంగం విసుగేత్తిం చింది ..ఏమైనా కలెక్టర్ గారు జిల్లా అధికారులు గ్రామ స్తాయి నుంచి జిల్లా స్తాయి వరకు దాదాపు పది హేను రోజుల పాటు ఈ తెలుగు భాషా పండుగను చేయటం న భూతో న భవిష్యతి అని పించింది . ఇంటికి చేరే సరికి రాత్రి పదిన్నర అయింది .
సభలో ప్రముఖులనుఫోటో లలో గుర్తు పట్టటానికి కొన్ని ఆన వాళ్ళు –నల్ల పాంటు నల్లకోటు వేసుకొన్న వారు శ్రీ తోటకూర ప్రసాద్ –తానా అధ్యక్షులు .వారి ప్రక్కన రంగు పాంటు రంగు షార్ట్ ఇంశార్ట్ తొ ఉన్న వారు చిత్రకారులు శ్రీ ఎస్.వి.రామా రావు గారు .మాట్లాడిన వారిలో తెల్ల పైజమా ,పసుపు లాల్చీ తొ నుదుట నిలువు గా వెడల్పు యెర్ర బొట్టు తొ ఉన్న వారుమారిషస్ కు చెందిన శ్రీ సంజీవప్పడు గారు .తెల పాంటు తెల్ల ఫుల్ హాండ్ బుష్ షార్ట్ లో ఉన్న వారు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు .తెల్ల పాంటు తెల్ల షార్ట్ ఇంశార్ట్ లో ఉండి సన్మానం చేసిన వారు కలెక్టర్ శ్రీ బుద్ధ ప్రకాష్ గారు .
సన్మా నితులలో తెల్ల మీసాలు గడ్డం తొ పంచె లాల్చీ తొ కుర్చీలో కూర్చున్న వారు’’మాయల ఫకీర్ ‘’నాటక’’ ఫేం’’ శ్రీ ఆచంట వెంకట్రామయ్య నాయుడు గారు వేదిక పైరాష్ట్ర గ్రందాలయాధ్యక్షులు శ్రీ తుర్ల పాటి కుటుంబ రావు గారిని గుర్తు పట్టే ఉంటారు బుద్ధ ప్రసాద్ గారి పక్కనే వేదిక పై కూర్చున్నారు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-12-12- ఉయ్యూరు ,


empty chairs, bad audio system, not keeping time, interest in felicitation, not giving proper time -all types of defects that appear in a bureaucracy are present in the function in vijayawada and this will be repeated in a much more manner in Tirupati . Let the god in tirumala save them.
LikeLike