Monthly Archives: March 2013

నా దారి తీరు -14 ఇన్స్పెక్షన్ –నాకు అప్పుడే హెచ్ .ఏం.గా ప్రొమోషన్ ?

నా దారి తీరు -14      ఇన్స్పెక్షన్ –నాకు అప్పుడే హెచ్ .ఏం.గా ప్రొమోషన్ ? మానికొండ స్కూల్ ఇన్స్పెక్షన్ ప్రారంభమైంది .పేరు జ్ఞాపకం లేదు కాని ఒక ఆచార్యులు గారు ఇన్స్పెక్షన్ చేయటానికి వచ్చారు .ఆయన బ్రాహ్మల ఇంట్లోనే భోజనం చేస్తారట .హెడ్ మాస్టారు వెంకటేశ్వర రావు గారు నన్ను పిలిచి ‘’ఆయనకు మీ ఇంట్లో భోజనం ఏర్పాటు చేయగలరా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

అరకొరగా ఉన్నా ఆగనిదే జీవితం -కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించిన-. ఎన్. గోపి జీవనయానం

అరకొరగా ఉన్నా ఆగనిదే జీవితం ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎన్ని పాఠాలైనా చెప్పి ఉండవచ్చు. విద్యార్థుల జీవితాల్ని అవి ఎంతగానైనా ప్రభావితం చేసి ఉండవచ్చు. కానీ, ఆ చెప్పేవారిని కూడా నడిపించే పాఠాలు కొన్ని ఉంటాయి కదా! ఆ పాఠాల స్ఫూర్తితోనే ఇక్కడిదాకా రాగ లిగానని చెబుతారు డాక్టర్ ఎన్ గోపి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -12

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -12   భక్త ప్రహ్లాద రక్షకుడు నారదుడు భాగవతం సప్తమ స్కంధం లో ప్రహ్లాద బాలకుని చెలి కాళ్ళందరికి విష్ణు భక్తి అతనికి ఎలా అబ్బిందో అర్ధం కాక బుర్రలు బద్దలు కొట్టుకొని చివరికి అతనినే అడిగేశారు .ఆశ్చర్యం గా ‘’మంటిమి గూడి ,భార్గవ కుమారులొద్ద ననేక శాస్త్రముల్ వింటిమి ,లేడుసద్గురుడు వేరొక డేన్నడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగు లో చదివితే ఉద్యోగాలు రావా ?-శ్రీ పులికొండ సుబ్బా చారి వ్యాసం

Posted in సేకరణలు | Tagged | 1 Comment

పక్షి ప్రపంచం:1 కాకి

ప్రియ మిత్రమా !                        నమస్కారం.                        పక్షి ప్రపంచంలోని వివిధ  పక్షులకు చెందిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విశేషాలతో ఒక వ్యాస పరంపర రాయ తలపెట్టి, ముందుగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు –13 మానికొండ కాపురం

 నా దారి తీరు –13  మానికొండ కాపురం   నేను ,మా ఆవిడ ఇద్దరు పిల్లలతో మాని కొండ లో కాపురం పెట్టాను .కమ్మ వారి ఇంట్లో .స్కూల్ కు దగ్గర ఆ కుటుంబం లో ముసలి ఆయనా ,మామ్మ గారు ,ఇద్దరు మనవళ్ళు ఉండేవారు వాళ్ళ ఇల్లు పెద్దది .మాది వారింటి పక్క చిన్న డాబా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -11 శబళాశ్వు లకు నివృత్తి మార్గ బోధన

 జ్ఞానదుడు మహర్షి నారదుడు -11    శబళాశ్వు లకు నివృత్తి మార్గ బోధన   భాగవతం లోని ఆరవ స్కంధం లో నారద మహర్షి ఒక మహా గడుసైన పని చేస్తాడు .దక్ష ప్రజాపతికి ఆసిక్ని అనే భార్య వల్ల శబళాశ్వులు అనే కుమారులు జన్మిస్తారు .తండ్రి వారిని సృష్టి చేయమని కోరగా వారు నారాయణ సరస్సు దగ్గర తీవ్ర … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

నా దారి తీరు -12 స్నేహ బృందం ఉయ్యూరు రాక

 నా దారి తీరు -12        స్నేహ బృందం ఉయ్యూరు రాక నా బదిలీ మీద ఊహా గానాలు చాలా జరిగాయని చెప్పాను .ఈ లోపల కొన్ని విషయాలు రాయాలి .మోపిదేవి లో నాతో పని చేసిన శ్రీ జమ్మల మడక  రామణా రావు(లెక్కల మేష్టారు ),కూచి భొట్ల సత్యనారాయణ (తెలుగు మేష్టారు –అదే వాసన మేష్టారు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సంగీత పరమాచార్య

సంగీత పరమాచార్య   అటు సంగీతంలోనూ, ఇటు వైద్య రంగంలోనూ ఆయనొక అద్భుతం. ఏక కాలంలో రెండు వృత్తుల్లో కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించిన మహామహులు చాలామందే ఉండవచ్చు కానీ, డాక్టర్ శ్రీపాద పినాకపాణి ‘బాణి’ మాత్రం న భూతో న భవిష్యతి. తెలుగు సంగీతాభిమానుల కోసం కర్నాటక సంగీతాన్ని తిరగ రాశారు. ఈ సంగీతానికి మకుటాయమానమైన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

మూగబోయిన రాగం

మూగబోయిన రాగం డాక్టర్ శ్రీపాద పినాకపాణి అస్తమయం శోకసంద్రంలో సంగీతప్రియులు ప్రముఖుల సంతాపం.. నేడు కర్నూలులో అంత్యక్రియలు   కర్నూలు, హైదరాబాద్, మార్చి 11: కర్ణాటక సంగీతాన్ని తెలుగునాట తంజావూరు బాణీలో కొత్తపుంతలు తొక్కించి సంగీతప్రియుల ప్రశంసలు అందుకున్న సంగీత కళానిధి పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -10

జ్ఞానదుడు మహర్షి నారదుడు -10 ప్రాచీన బర్హికి ఇంకా వివరాలు చెబుతూ నారద మహర్షి ‘’హరి పాద యుగాళాలే అన్నిటికి శరణ్యం ‘’ఘన పురుషార్ధ భూతమనగా దగు నాత్మకు ,నే నిమిత్తమై    యొనర ,ననర్ధ హేతువన నూల్కును సంస్కృతి సంభవించు,న    నట్లే నయము ,దన్నిమిత్తము పరిహారకు మర్ది జగద్గురుండు ,     నా దనరిన వాసుదేవ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సరస భారతి -43వ సమావేశం -శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది సాహితీ కదంబం

సరస భారతి -43వ సమావేశం -శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది సాహితీ కదంబ ,ఉగాది పురస్కార,పుస్తకావిష్కరణ సభ -7-4-2013 ఆదివారం సా. 4గం-A /Cలైబ్రరి -ఉయ్యూరు  

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నల్లగొండ.. తెలుగు కొండ

నల్లగొండ.. తెలుగు కొండ జనం భాషలోనే పరిపాలన ఫలిస్తున్న కలెక్టర్ చొరవ తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు ఆంగ్లంలో వస్తే.. తిరుగు టపా! 95 శాతం లేఖలు మాతృ భాషలోనే సహకరిస్తున్న అధికారులు, సిబ్బంది అధికార భాషా అమలులో జిల్లాలకు ప్రథమ స్థానం   ‘తెలుగా! అదెందుకు?’ అని ప్రశ్నిస్తే… ఈ రాష్ట్రం తెలుగు. ఈ ప్రజలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాటి మహామహులందరినీ కలిపిన అభినవాంధ్ర కవి పండిత సభ

నాటి మహామహులందరినీ కలిపిన అభినవాంధ్ర కవి పండిత సభ జీవద్భాషలోనే విద్య సాగాలని తీర్మానం – డా. తుర్లపాటి రాజేశ్వరి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న బరంపురం 19వ శతాబ్ది పూర్వార్థానికి గంజాం జిల్లాలో ప్రధాన సాంస్కృతిక కేంద్రంగా వాసికెక్కింది. జాతీయ ఉద్యమం దేశంలో వ్యాపిస్తున్న క్రమంలో మతం, కులం, స్త్రీల స్థితిగతులు, శాస్త్రీయత, … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శివరాత్రి చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Leave a comment

ఆ రోజుల్లోనూ ఉన్నయ్… నిషేధాలు – సితార 17 3 2013

Posted in సేకరణలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -9

జ్ఞానదుడు మహర్షి నారదుడు -9     ఇంత చేసి నారదుడు ఊర్కొంటాడా ?వెంటనే ఉత్తాన పాద మహా రాజుదగ్గరకు  వెళ్ళాడు ఆయన పూర్వం జరిగిన దంతా మహర్షికి విన్న విన్చుకొన్నాడు అప్పుడు నారద మహర్షి రాజా ! నీకుమారుడు ‘’దేవకిరీట రత్న రుచి దీపిత పాద సరోజుడైన ,రా  జీవ దళాక్షరక్షితు ,డశేష జగత్పరికీర్తనీయ ,కీ  ర్తి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మా ఊరి నాటకంలో హీరో నేనే

మా ఊరి నాటకంలో హీరో నేనే “జోరుగా వచ్చే ముసీ ప్రవాహం, ఆ నీరు ఎక్కడి కక్కడ సుడులు తిరగడం నిజం ‘టైటానిక్’ నీటిని తలపించేది. ఇంతవరకు నేను అలాంటి సీన్‌ను నా సినిమాల్లో చూపించలేదు. కానీ దర్శకుడు గుణశేఖర్ ‘సైనికుడు’ సినిమాలో కొంతవరకు ఈ ప్రయత్నం చేశారు.” ‘టైటానిక్’ నీటిలో… “మా ఊరు చాలా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

UPSC : తెలుగు లో మెయిన్స్ రాసే అవకాసమివ్వాలి

Posted in సేకరణలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు –8 ద్రువునికి ఉపదేశం

     జ్ఞానదుడు మహర్షి నారదుడు –8    ద్రువునికి ఉపదేశం  తల్లి మాట మీద ‘’నిజ ధర్మ పరిశోధన ‘’కోసం రాజధాని ని వదిలి వస్తున్న ధ్రువ బాలకునిసంగతి నారదుడు తెలుసుకొన్నాడు .ఆయన్ను ఎవరూ పిలువనక్కరలేదు .స్వయం గా వచ్చి కర్తవ్య బోధ చేస్తాడు .అగణితమైన కీర్తిని సంపాదించ బోయే ద్రువునికి తగిన మార్గం సూచింప గలవాడు నారదుడు కాక … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీమతి పి.కరుణా నిధి కవితలు

 శ్రీమతి   పి.కరుణా నిధి కవితలు                                       మనిషి మనసు        మనిషి మనసు ఒక కడలి -అందులోని ఆలోచనలు పడి లేచే కెరటాలు        ఒడ్డుకు … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

మా ఇంట్లో శ్రీరంగ వైభవం

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

కార్మిక మాత జోన్స్ (మదర్ జోన్స్ ) మనిషి పేర మేగజైన్

 కార్మిక మాత జోన్స్ (మదర్ జోన్స్ )     మనిషి పేర మేగజైన్      ఆమె  అసమాన సాహస మహిళ .మడమ తిప్పని కార్మికోద్యమ నాయకురాలు .ఎక్కడ కార్మిక ,శ్రామిక సమస్య వచ్చినా అక్కడ వాలి ,పరిష్కారానికి మార్గం సులభం చేసిన దీరోదాత్తురాలు వివేచనా సంపన్నురాలు .బాలకార్మిక విమోచానానికి కంకణం కట్టుకొని ఆహరహం శ్రమించిన నాయకురాలు .మహిళాభ్యున్నతికి … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మన స్మరణీయ మహిళా మణులు

 మన స్మరణీయ మహిళా మణులు మనదేశం లో మహిళా మణులేందరో ప్రత్యెక స్థానం పొంది ఉన్నారు రాజ్యాలేలిన ఝాన్సీ లక్ష్మీ బాయి ,చాంద్ బీబీ ,అందానికి కొత్తర్ధం చెప్పిన రాణి సంయుక్త ,ఒక సామ్రాజ్యానికే నాయకత్వాసం వహించిన కాకతీయ రాణి రుద్రమ దేవి ,చతుర రాజకీయం లో నిధి అని పించుకొన్న నాగమ్మ త్యాగానికి మరోపేరైన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మరుగుపడ్డ మాణిక్యం – కలల అలల ఫై – గబ్బిట కృష్ణ మోహన్

kalala alala pai -Pdf కలల అలల ఫై…….. <== చూడండి  

Posted in రచనలు | Tagged | Leave a comment

మైసూరు వెళితే… మేల్కోటే వెళ్ళిరండి

మైసూరు వెళితే… మేల్కోటే వెళ్ళిరండి – డా. నాగసూరి వేణుగోపాల్   ఒక కోటి అంటే ఒకటి అంకె పక్కన ఏడు సున్నాలు పెట్టాలి. అదే వేయి కోట్లు అన్నప్పుడు పది సున్నాలు పెట్టాలి. సంఖ్య పెరిగే కొద్దీ సున్నాల సంఖ్య పెరుగుతుంది. ఈ స్థాయిలో ఉన్న సంఖ్యలను సులువుగా పేర్కొనే పద్ధతి ఉంది. వెయ్యి … Continue reading

Posted in సేకరణలు | Tagged | 1 Comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -7

జ్ఞానదుడు మహర్షి నారదుడు -7  వ్యాసుని సందేహం తీర్చి ఇంకా ఇలా అంటున్నాడు మహర్షి నారదుడు ‘’తీర్ధ పాదుడైన దేవుండు విష్ణుండు –దన చరిత్ర మేన దవిలి పాడ-జీరబడ్డ వాని చెలువున నే తెంచి –ఘనుడు నా మనమున గాన వచ్చు ‘’    అంతే కాదు –‘’వినుమీ సంసారంబను –వననిధి లో మునిగి కర్మ వాంఛల చే వేదన బొందెడు వానికి –విష్ణు గుణ వర్ణనము … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మధురవాణి ‘ఝాన్సీ’

మధురవాణి ‘ఝాన్సీ’ ‘సెంచరీ’ తరువాత?… ‘డబుల్’కు రెడీ కావడమే అనుకుంటాం! కానీ ఝాన్సీ మాత్రం ‘నూరో’ ఎపిసోడ్‌కే చేరుకోలేదు.. ఆ తరువాత ఏమైంది?… ‘నూటొక్క’ ఏళ్ల మధురవాణిగా రంగస్థలంపై మెరిసింది.. మహిళా నిర్ణయాధికారం మీద ‘ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్విరి థింగ్ ‘ అనే సినిమాను నిర్మించే స్థాయికి ఎదిగింది. ‘నూటొక్క’ మహిళా దినోత్సవం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు చివరి రోజు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విమర్శకులు కావాలి – విమర్శకులు

Posted in పుస్తకాలు | Leave a comment

మంజూష నవలా సమాహారం – ఆవిష్కరణ – మచిలీపట్టణం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -6 వ్యాసునికి కర్తవ్య బోధ

    జ్ఞానదుడు మహర్షి నారదుడు -6           వ్యాసునికి కర్తవ్య బోధ వ్యాస భట్టారకుడు వేద విభజన చేశాడు .వేదాంత రచనా పూర్తీ చేశాడు .అష్టాదశ పురాణాలు ,బ్రహ్మ సూత్రాలు రచించాడు .పంచమ వేదమైన మహా భారతాన్నీ రాసి ,ఐతిహాసికత ను సాధించాడు .అయినా మహర్షి మనసు వ్యాకులం గానే ఉంది .’’హరికి యోగి వరుల కభిలషితంబైన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

నీలంరాజు జీవితంలో..

నీలంరాజు జీవితంలో.. పదిహేనేళ్ల వయసులోనే గాంధీ పిలుపుకు స్పందించి విద్యాలయాల బహిష్కరణ చేసిన దేశభక్తుడు నీలంరాజు వేంకట శేషయ్య. తరువాతి కాలంలో ఆయన ప్రకాశం పంతులుగారికి ప్రైవేట్ సెక్రటరీగా పని చేశారు. అతి పిన్న వయసులోనే పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించి ‘స్వరాజ్య’, ‘ఆంధ్రపత్రిక’లలో పని చేసి తర్వాత సొంత వార పత్రిక ‘నవోదయ’ను స్థాపించారు. చాలాకాలం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదారి కుర్రాడు మేజిక్‌లో మొనగాడు

గోదారి కుర్రాడు మేజిక్‌లో మొనగాడు పేదరికం అతని కళాతృష్ణను అణగారనివ్వలేదు. కళ్ల జోడు షాపులో పనిచేస్తూనే కనికట్టు విద్యలో నిష్ణాతునిగా మారాడాయన. ఆయనే ప్రముఖ మెజిషియన్ అలీ. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక కుగ్రామంలో జన్మించిన ఆయన అంతర్జాతీయ స్థాయి మెజిషియన్‌గా ఎదిగారు. పేకముక్కలు, పావురాలు వంటివి ఖాళీ చేతులలో సృష్టించడం ఆయన ప్రత్యేకత. తన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన తెలుగును రక్షించు కొందాం -పూరి పండా అప్పల స్వామి

Posted in సేకరణలు | Tagged | Leave a comment

రాజువయ్యా !- మహా రాజు వయ్యా !! – శోభన్ బాబు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గొర్రె పొట్టేలు బండి వీరమ్మ తిరునాళ్ళు- ఊరిస్తున్న మా తోట ఉసిరి కాయలు

This gallery contains 13 photos.

More Galleries | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -5 విజ్ఞాన ప్రదాత నారదుడు

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -5                     విజ్ఞాన ప్రదాత నారదుడు   ఆపదలో ఉన్న వారికి భగవద్ విలాసం తెలిపి చిత్తానికి శాంతి కల్గిస్తాడు నారద మహర్షి.అకంపనుడు పుత్రశోకం తో విలపిస్తుంటే ‘’మృత్యు స్వభావం ‘’తెలియ జేసి ఊరట కల్గిస్తాడు .సృన్జయునికి పదహారు రాజుల చరిత్ర చెప్పి దుఖోప శమనం కల్గించాడు .అతని పుత్రుని కూడా రెండు సార్లు తానే బ్రతికించి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’రాజస’’ (సు ) లోచన

   ‘’రాజస’’ (సు ) లోచన      రాజసులోచన అంటే వెడల్పైన అందమైన ముఖం ,పెద్ద బొట్టు తో రాజసం తాండ వించే చూపులతో అభినయానికి ఉదాహరణ గా కని పిస్తుంది .రాజసులోచన అంటే ‘’వెలుగు నీడలు   ‘’సినిమా లో ‘’పాడవోయి భారతీయుడా ‘’పాటే ఎప్పుడూ ముందు గుర్తుకొస్తుంది .అందులో శ్రీ శ్రీ రచన ,పెండ్యాల స్వర లహరి రాజసులోచన నృత్యాభినయం గుర్తుకొచ్చిన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -4 గాన విద్యా పరీక్షకుడు నారదుడు

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -4                        గాన విద్యా పరీక్షకుడు  నారదుడు మార్కండేయ పురాణం లో ఒక అద్భుత మైన కధ ఉంది .ఒక నాడు ఇంద్ర సభ లో రంభాదులు నృత్యం చేస్తున్నారు .నారదుడు ఆ సమయం లో అక్కడికి వెళ్ళాడు .వీరిలో ఎవరి గానం ఇంపు గ ఉందోపరీక్షించి తేల్చమని ఇంద్రుడు నారదుడిని అడిగాడు .ఎవరు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉయ్యూరు – వీరమ్మ – సిడి బండి – దృశ్యాలు

This gallery contains 18 photos.

More Galleries | Tagged | Leave a comment

విక్టోరియారాణి కాలపు మహిళ

  విక్టోరియారాణి కాలపు మహిళ Posted on March 1, 2013 by విహంగ   స్త్రీ జనాభ్యుదయానికి కృషి చేసి, స్త్రీ వాద రచయిత్రి అని పేరు పొంది   అంతర్జాతీయం గా గుర్తింపు పొందిన నవలా కథా రచయిత్రి ఇంగ్లాండ్ దేశానికి చెందిన వర్జీనియా ఉల్ఫ్. స్త్రీల మనో వేదనల పై ఎన్నో సమా వేశాలలో ఉద్వేగం గా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -3

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -3          లింగ ,శివ పురాణాలలో నారదీయం  ఒకప్పుడు నారదుడు హిమాలయం పై తపస్సు చేస్తున్నాడు .ఇంద్రుడు విఘ్నం చేయమని దేవకన్యల్ని పంపాడు నారదుడు శివారాధకుడు కూడా కనుక శివ ప్రభావం వల్ల మనసు చలించలేదు .దీనితో గర్వం వచ్చింది .తపస్సు ముగించి ,బ్రహ్మ విష్ణువు లను చూడటానికి వెళ్ళాడు .తన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బడి ‘భాగవతం’

బడి ‘భాగవతం’ అరుణ పప్పు ఇక్కడ నడుస్తున్న విద్యావిధానానికి ముగ్థురాలైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి వాళ్లకో చక్కటి భవనాన్ని కానుకగా ఇచ్చారు. అంతేనా, ప్రతి తరగతి గదికీ ఓ కంప్యూటర్. అందులోనే పాఠాలన్నీ నిక్షిప్తమయి ఉంటాయి. లెక్కలైనా, సైన్సయినా, ఇంగ్లీషయినా… కంప్యూటర్‌లో సినిమా చూసినంత సులువుగా చూసెయ్యడమే. తర్వాత దాని గురించిన చర్చ, రన్నింగ్ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాకెట్ ఎగిరినపుడంతా ‘మొగల్తూరు’ రైతే గుర్తొస్తాడు

రాకెట్ ఎగిరినపుడంతా ‘మొగల్తూరు’ రైతే గుర్తొస్తాడు మొగల్తూరు అనగానే టక్కున చిరంజీవి గుర్తొస్తాడు. అరే, కృష్ణంరాజుదీ అదే ఊరు కదా అనుకుంటాం. ఈ సినిమా వ్యవహారం పట్టని పాత తరం వాళ్ళయితే, బారిష్టర్ పార్వతీశంని గుర్తు చేసుకుంటారు. ఈ ముగ్గురూ కాకుండా నాలుగో హీరోని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. పేరు ఎంవైఎస్ ప్రసాద్. శ్రీహరికోట రాకెట్ … Continue reading

Posted in సేకరణలు | Tagged | 1 Comment