తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -7

తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -7

 

సేనా ఫాస్ డిక్

అమెరికా లోని రచయిత్రి శ్రీమతి ‘’సేనా ఫాస్ డిక్ ‘’తో సంజీవ్ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. ఆ జాబులూ జవాబులూ లలో ఏంతో  ఆనందం ఉన్నట్లు భావించాడు

అన్నపూర్ణ

గుంటూర్ లో ఇంటర్ విద్యార్ధిని అన్న పూర్ణ ను దండమూడి మహీధర్ సంజీవ్ కు పరిచయం చేశాడు .ఆమె భర్త విశాఖ లో ఏం .బి.బి.ఎస్..ఆమె తో కరస్పాండెన్స్ జరిపాడు గుంటూరు వెళ్లి చూశాడు .ఆమె మంచి ఆతిధ్యం ఇచ్చింది .అన్న పూర్ణ ఇచ్చిన ఫలహారం మాత్రం నూటికి నూరు వంతులు ‘’ఫలాహారమే ‘’అని మురిసి పోయాడు .’’ఆమె భర్త మౌనం గా ఉన్నా ,మనసు పలచని మనిషి ‘’అని తెలుసు కొన్నాడు ఆయన కు కూడా అన్న పూర్ణ తో ‘’లలిత విషయాలు అంటే ఇష్టం ‘’

శ్రీమతి మార్సేలా హార్డీ

మద్రాస్ లో ‘’silpi ‘’పత్రికకు సంపాదకీయాలు రాయటం శ్రీమతి మ్మార్సేలా హార్డీ తో సన్నిహితం గా పని చేశాడు .ఆమె మంచి విదుషీ మణి..ఆక్స్ ఫర్డ్ పట్టభద్రురాలు .ఆంగ్లేయుడిని వివాహం మాడింది .అయిదారు యూరోపియన్ భాషలు నేర్చింది .’’కళ లన్నా ,కళా కారు లన్నా సాహిత్య మన్నా ,సాహితీ పరులన్నా ఆమెకు ఏంతో  ప్రేమ ‘’అంటాడు దేవ్ .ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కధలూ వ్యాసాలూ రాస్తుంది .ఒడ్డూ ,పొడుగు శరీరం .’’ఆలోచన లో లోతు కలిగిన పటిమ గల వ్యక్తిత్వం ఆమెది ‘’అంటాడు .ఇక్కడ ఆమె ఒంటరిగా ఉంటోంది .ఆమె ఇంట విందు భోజనమూ ఆరగించాడు .ఆ తర్వాతా ఆమె కళా కారుల ,,గ్రంధ కర్తల సంఘాన్ని స్తాపించింది .’’చక్రి ‘’పత్రిక నడిపింది దానికి సంజీవ దేవ్ తాను రాసిన వ్యాసాలూ పంపాడు ..’’ఇన్ అండ్ అవుట్ ‘’అనే గేయం రాశాడు ఆమె తుమ్మ పూడి వచ్చి సంజీవ్ ఆతిధ్యం స్వీకరించింది .ఆమె శాకాహారి చిన్నతనం లో ఎండిన పొగాకు ను కాగితం లో చుట్టి చుట్ట కాల్చే దాన్ని అని చెప్పింది

డాక్టర్ పతి గారి పత్ని

మద్రాస్ డాక్టర్ పి.వి.పతి ఆంధ్రుడే .ఆయన భార్య ‘’ఫ్రాన్స్ దేశం ‘’లో ఉంది .సంజీవ్ కు అనుమానం వచ్చి ‘’మీరు విడాకులు తీసుకున్నారా?’’అని అడిగాడు .’’మేమిద్దరం ఇప్పటికీ దంపతులమే .మానసికం గా కలిసే ఉన్నాం .ఉత్తరాల ద్వారా మా ప్రేమ ను వ్యక్త పరచుకొంటాం .మాది ‘’పోస్టల్ ప్రేమ ‘’అన్నాడు ఆ పతి గారు .ఈ రకమైన ‘’లవ్ ‘’సంజీవ్ కు కొట్టిన పిండే కదా .

మార్జోరి సైక్స్

మార్జోరి  సైక్స్ మద్రాస్ ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజి లో లెక్చరర్ .ఆమె కాలేజి ని సంజీవ్ కు చూపించింది .అక్కడ సగం జడ వేసుకొన్న అమ్మాయిలను చూసి మనవాడు ముచ్చట పడ్డాడు .వీరిని వెనక నుంచి చూస్తె ముచ్చట  గా ఉంటారని కామెంట్ చేశాడు .’’సైక్స్’’రవీంద్రుని శాంతి నికేతన్ లో కూడా పని చేసింది .వార్సా లోను పని చేసిన్దావిడ .రవీంద్రుని పై ఒక గ్రంధం రాసింది .ఆమె ను ఉన్నత ఆదర్శాలు గల వ్యక్తీ గా సంజీవ దేవ్ భావించాడు .’’సన్నగా ,కోల ముఖం తో ,కత్తిరించిన జుట్టు తో మెరిసే కళ్ళద్దాలతో మేధావిగా గోచరిస్తుంది ‘’అన్నాడు

సూర్య కుమారి

టంగుటూరు ప్రకాశం గారి అన్న కూతురు సూర్య కుమారి తోమద్రాస్ లో పరిచయం కలిగింది సంజీవ్ కు .అదే మొదటి సారి చూడటం .సన్నగా ,పొడుగ్గా పచ్చ్చ గా ఉంది ‘’ఆమె రూపం కంటే ఆమె గానమే బాగుంది ‘’అన్నాడు ఉభయులు ఆనందిన్చారట

రామ కృష్ణ గర్ల్ ఫ్రెండ్

మద్రాస్  లో రామ స్వామి ముదలియార్ మనుమడు రామ కృష్ణ ఇంట్లో సంజీవ దేవ్ ఉంటున్నాడు అ తను  మంచి వాడే కాని దుబారా మనిషి .ఒక రోజు ఆలస్యం గా ఇంటికి వస్తే ‘’రామ కృష్ణ ఒడిలో నగ్న వక్షం తో ఒకామె పడుకొని ఉండటం ‘’చూశాడు .ఇతన్ని చూసి దక్షిణ నాయకుడు కృష్ణ కంగారు పడ్డాడు .ఆమె చెదరా లేదు, బెదారా లేదు.తెలివిగా ఆమె పమిట సద్దుకొని కిందికి దిగి వెళ్లి పోయింది .రామ కృష్ణ తో  ‘’ఇవన్నీ పాప కార్యాలుగా నేను భావించను .మామూలు విషయాలే నా దృష్టిలో ‘’అని దేవ్ అభయ మిచ్చాడు .

ఒక రోజు ఆక్సిడెంట్ లో రామ కృష్ణ డ్రైవర్ చని పోయాడు .రామక్రిష్ణకూ ఆమెకు బల మైన గాయాలు తగిలాయి .ఆమె బాధ భరించ లేక పోతోంది .సంజీవ్  ను చూసి నప్పుడల్లా ఆమె నమస్కారాలు పెట్టేది .ఆమె దగ్గర కూర్చుని ఓదార్చాడు .తన వల్లనే  ఇంత ఘోరం జరిగిందని ఎడ్చిన్దామే .తను ఆ ఇంటికి రావటమే పెద్ద దోషం అని ఒప్పు కుంది .అప్పుడు సంజీవ్ ‘’ఆపదలలో బాధ లో మనిషి లోని నిజ స్వరూపం, స్వభావం బయటకు వస్తుంది ‘’అను కొంటాడు .తన వద్ద ఉండి  మనశాంతి నిమ్మని బతిమి లాడింది .తన జీవితం అంధకారం అయిందని గ్రహించింది ‘’.ఇది జీవితం నేర్పిన ప్రత్యెక పాఠం ‘’అని తెలుసుకొన్నాడు

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-13- ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.