నా దారి తీరు -40 పదవ బదిలీ నాల్గవ సారి ఉయ్యూరు

 

                                   నా దారి తీరు -40

  పదవ బదిలీ నాల్గవ సారి ఉయ్యూరు

నా బది’’లీల’’లో ఇది పదవది నాల్గో సారి ఉయ్యూరు వచ్చాను .18-8-79 ఉదయం ఉయ్యూరు హైస్కూల్ లో విధులలో చేరాను .హెడ్ మాస్టారు మిక్కిలి నేని వెంకటేశ్వర రావు గారు .నాకు బాగా నచ్చిన వ్యక్తీ ..

ఆఫీస్ పని లో చేయూత

 

అప్పటికే వెంగల రావు ప్రభుత్వం కొత్త పి.ఆర్.సి ,ని1978 p/r.c.ని   అమలు జరిపింది .జీతాలు బగా నే పెరిగాయి వెంళ  రావు ఉద్యోగుల పాలిటి దేవుడు అని పించుకొన్నాడు మేస్టార్ల కు గౌరవ మైన వేతనాలు మొదటి సారిగా దక్కాయి అందరూ ఎంతో సంతోషించాం ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొన్నాం ఇదంతా ఏం ఎల్ సిల పట్టుదల యూనియన్ల సంఘటిత శక్తి వల్లనే సాధ్యమైంది 320 14-460-15-580 ఉన్న బి యి.డి.స్కేల్ ఇప్పుడు 575-20-775 -25-950 స్కేల్ గా మారినా  బేసిక్ 775 rs wi e.f 1-4-78 అయింది ఉయ్యూరు హైస్కూల్ లో దాదాపు ఎనభై మంది స్టాఫ్ ఉన్నారు వీరందరికీ పే ఫిక్సేషన్  చెయ్యాలంటే ఉన్న గుమాస్తాల వల్ల  కుదరదు .అందుకని హెడ్ మాస్టారు నన్ను ,దేవేంద్ర రావు గారిని ,వి..పూర్ణ చంద్ర రావు ను, యి .ఎల్ సి.వి.ప్రసాద్ కు అప్పగించారు .మేమందరం  ఖాళీ సమయం లోనో లేక స్కూల్ అయిన తర్వాతనో లేక ఒక్కొక్క సారి క్లాసులకు వెళ్ళకుండా నో దీన్ని విజయ వంతం గా పూర్తీ చేసి అందరి మన్ననలు పొందాము .అందరికి కొత్త స్కేళ్లు  అమలయ్యాయి ..అలాగే ఇంక్రిమెంట్ లు చేయాలన్నా ,నెల వారీ మూడు కాపీల పే బిల్ల్స్ చేయాలన్నా ఎరియర్స్ కోసమైనా  మా సహాయమే తీసుకొనే వారు సమయానికి పంపి జీతాలు వచ్చేట్లు చేయ గలిగే వాళ్ళం ఇందులో పైన చెప్పిన మా అందరి పాత్ర ఉంది .ఆఫీసులో వీరయ్య గారు అనే పెద్ద గుమాస్తా ఉండేవాడు కాంగ్రెస్ వాది .ఖద్దరు పైజమా ,లాల్చీ వేసే  వాడు బెల్ అండ్ బిల్ పధ్ధతి వాడు ఆయనకు చెప్పి ఎవరూ చేయించ లేక పోయే వారు హెడ్ మాస్తారైనా అంతే .గురుదాస్ అనే అతను చాలా మంచి వాడు .పని బాగా చేసే వాడు .రూల్స్ కూడా బాగా తెలిసిన వాడు .తలలో నాలుక లా ఉండే వాడు అతనికి  అడ్మిషన్లు టి సిల తో సరి పోయేది .సుబ్బారావు అనే నా మోపిదేవి శిష్యుడు ఇంకో గుమాస్తా .ఇతనికి ఎస్ ఎస్.సి .పని పబ్లిక్ పరీక్షలు మార్కు షీట్లు,సర్టిఫికెట్లు  ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షల తో సరి పోయేది .అందుకని మా అందరి  సహకారం ఆఫీస్ పనికి అవసరం వచ్చింది దీన్ని మేము శ్రద్ధగా హుషారుగా బాధ్యత గా నే నిర్వహించాం .సంతృప్తీ పొందాము

ఏం ఎల్ సి.ఎన్నికలు

సరిగ్గా జ్ఞాపకం లేదు కాని ఈ సమయం లోనే శాసన మండలికిఉపాధ్యాయులనుండి ఎన్నిక కోసం ఎన్నికలు ప్రకటించారు మేమంతా కృష్ణా జిల్లా గిల్డ్ తరఫు వాళ్ళం .మా అభ్యర్ధి కొల్లూరి కోటేశ్వర రావు గారు .అయన ప్రత్యర్ధి యు.టి ఎఫ్ కు చెందినా కురు వృద్ధులు శ్రీ పి.శ్రీ రామ మూర్తి గారు పెద్ద మనిషి ఈయనకు మండలి కృష్ణా రావు గారి సపోర్ట్ ఉంది కొల్లూరికి చైర్మన్ పిన్నమ నేని కోటేశ్వర రావు ,కాంగ్రెస్  వాదుల  తోడ్పాటు ఉంది .హోరా హరీ గా ప్రచారాలు జరుగుతున్నాయి మా హెడ్ మాస్టారు శ్రీ రామ మూర్తి గారి అభిమాని ఆయన ఆయన వర్గం సపోర్ట్ అంతా ఆయనకే .ఆ స్కూల్ లో నేను ఆంజనేయ శాస్త్రి కాంతా రావు హిందీ రామా రావు దేవేంద్ర రావు,అన్నే పిచ్చి బాబు   . మొదలైన వారందరం కొల్లూరికి సపోర్ట్ .స్కూల్ రెండు వర్గాలుగా ఉంది .కొందరు గోడ మీది పిల్లి పాత్ర పోషించారు పగలోకరి వైపు రాత్రి వేరొకరికి బాకా .మా గ్రూప్ వాళ్ళం అందరం పకడ్బందీ గా ప్లాన్ వేశాం నేను దేవేంద్ర రావు పిచ్చి బాబు లీడ్ తీసుకొన్నాం .మిగిలిన వారంతా మాకు వెన్ను దన్నుగా నిల బడ్డారు .పెనమకూరు ఇందుపల్లి ,వల్లూరు లలో శ్రీరామ మూర్తి గారి మనుషులు ఎక్కువ మిగిలిన వారు కొల్లూరి  మద్దతు దార్లె .తాడంకి సాలిడ్ సపోర్ట్. అక్కడ హిందీ పండిట్ పాలేటి లక్ష్మణ స్వామి చాలా చురుకైన కార్య కర్త గిల్డ్ కు సెక్రెటరి గా చేశాడు మాకు ఒక రకం గా పెద్దన్న .

మేము స్వంత డబ్బులతో  చిన్న కారు మాట్లాడు కొని  కనీసం  ఏడెనిమిది మంది ఇరుగ్గా నే కూర్చుని చుట్టూ ప్రక్క స్కూల్స్ కు వెళ్లిఅక్కడి  హెడ్ మాస్టారి అనుమతి తో స్టాఫ్ ను సమావేశ పరచి కొల్లూరికి వోటు వేయమని కోరే వారం ఇలా చేయటం లో మాకు మంచి నమ్మకం కలిగింది .ఎప్పటికప్పుడు కొల్లూరికి తెలియ జేసే వాళ్ళం ఆయన తో బాటు నన్ను కొందరిని పర్యటనకు తీసుకొని వెళ్ళే వాడు .చల్ల పల్లి  అవనిగడ్డ ,నాగాయ లంక బందర్ ,బేజ వాడ గుడివాడ విస్సన్న పేట మైల వరం మొదలైన ఎన్నో స్కూళ్ళు తిరిగాము నేనే ఎక్కువ మాట్లాడే వాడిని అందరిని నచ్చ చెప్పి సమస్యలుంటే తెలుసు కొని పరిష్కార మార్గాలను కొల్లూరి తో చెప్పించి వారికి ఊరట కలిగించే వాళ్ళం నా ఉపన్యాసాన్ని అందరూ మెచ్చుకొనే వారు .ఎలాగైనా ఉయ్యూరు ప్రాంతం లో కొల్లూరికి ఎక్కువ మేజారీటి సాధించాలని మా ఆలోచన .ప్రతి దశ లో జాగ్రత్త గా వ్యవహరించాం . .ఎన్నిక రోజున సి బి .ఏం.స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టెంట్ వేసి వోటర్ లిస్టు లను చూసి అందరికి కాఫీ టిఫిన్లు చేయించి పెట్టి లోపలి పంపాం .మా వ్యూహం ఫలించింది .కొల్లూరికికి అత్యధిక వోట్లు పడ్డాయి చివరికి కొల్లూరి మూడోసారిగెలిచాడు  శ్రీ రామ మూర్తి గారు ఒడి పోయారు

      రెండు జెండాల మనిషి

బందరు కలెక్టర్ ఆఫీస్ లో వోట్ల లెక్కింపు జరి గింది .అందరం అక్కడికి చేరుకొన్నాం క్షణక్షణం ఉత్కంత టో ఉన్నాం ఫలితాలు ఎలా ఉంటాయో అన్నది అందరి ఆందోళన .ఎవరి డబ్బు వాళ్ళమే పెట్టుకొని వచ్చాం .చివరికి కొల్లూరి కోటేశ్వర రావు గెలిచి నట్లు ప్రకటించారు మేమందరం ఆయన్ను మనసారా అభి నందించాం  .అక్కడే చిన్న సభ ఏర్పాటయింది అక్కడ  రాపర్ల  జనార్దన రావు గారు అనే ఒక హెడ్ మాస్టారున్నారు .టాగూర్ లాగా బారు గడ్డం దానికి సంపెంగ నూఎన్ రాసి నల్ల రంగు మాయకుండా నిగ నిగ లాడేట్లు పెంచుకొనే వారు గడ్డం బాగా పెంచటంవల్ల మేము ఆయన్ని ‘’గడ్డం జనార్దన రావు’’ అని పిలిచే వాళ్ళం .ఆయన మాకంటే సీనియర్ . కోటు లోపలి దాకా గడ్డం పెరిగి ఉండేది ఇంగ్లీష్ లో, తెలుగు లో గొప్ప వాగ్ధాటి ఉన్న వాడు రేడియో లో ఎన్నో ఆంగ్ల ప్రసంగాలు చేశాడు నాకు చాలా పరిచయం ఉన్న వ్యక్తీ .ఆయన్ను మాట్లాడ మన్నారు.ఎందుకో  కంగారు లో ఉన్న ఆయన జేబు లో రాసి ఉంచుకొన్న ఒక కాగితం తీసి చదవ బోయాడు .అది పి.శ్రీ రామ మూర్తి గారు గెలుస్తారనే నమ్మకం తో  ఆయన్ను గురించి రాసిన కాగితం .మొదలు పెట్టి ఒక వాక్యం చదవ గానే అందరూ గోల చేశారు అప్పుడు తేరుకొని రెండో జేబు లోఉన్న కాగితం  తీసి కొల్లూరి పై రాసింది చదివాడు .ఇలా రెండు పడవల మీద కాళ్ళు పెట్టె వారున్నా రని ప్రత్యక్షం గా మా బృందం చూసి పిచ్చగా నవ్వుకొన్నాం అప్పటి నుంచి మేమెప్పుడు ఆ సంఘటనను  జ్ఞాపకం చేసుకొని నవ్వుకొనే వాళ్ళం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-9-13 ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.