రాచకీయ ‘’ద్విప్లేట్స్ ‘’ -5
1-అంతా కొత్త అన్నీ కొత్త విధానాలతో చీపురు మయమైన మైదానం రాం లీలా
ఈపొంగు చల్లారకుండా ఉండి ప్రజాసేవలో తరించాలి అంఆద్మీ సి.ఏం. కేజ్రీ వాలా
2-తెలుగు దేశం దళపతి బాబు దిసిద్ధాంతం రెండు కళ్ళు
దీన్ని మింగలేక కక్కలేక అన్నారు పెట్టాడని రెండు పడవల్లో కాళ్ళు
3- కాంగీ మీటింగ్ కు కిరణ్ కొట్టాడు డుమ్మా
రేపో మాపో పై వారితో అడుతాడేమో అష్టా చమ్మా .
4- కొత్త ఏడాదికి ముందు కొత్తపట్నం రైల్ బగ్గీ లో జనం అగ్గీ బుగ్గీ
బుద్ధి రాని యంత్రాంగం ఇంకా చూస్తోంది మొహాలు వేసి పగ్లీ .
5- గుండు గీయించి రెడీ గా ఉన్నాడు లాంకో లగడపాటి
కొత్త పార్టీ ‘’షురూ’’కి వెంకన్న మొక్కేమో? అందుకే ఈ ధాటి?
6- సమైక్యం వచ్చింది తెలుగు తల్లి గర్భం నుంచి
రాజ గోపాల్ కు తెలీదా విభజన వచ్చింది ఇటలీ గర్భం నుంచి?
7- అవినీతి లేని సమాజంకోసం బాబు వెంకన్నకు మొక్కు
మన చేతుల్లో,చేతల్లో లేనప్పుడు అంతే కదా దేవుడే దిక్కు ?
8-అసెంబ్లీ చర్చకు అడ్డు పడితే చరిత్ర హీనులన్న పొన్నాల
ఈ చర్చేమిటో రచ్చేమిటో తెలీకుండా అప్పుడే ఎందుకా గోల?
9- శంకరరావు కోరుతున్నాడు ముఖ్యమంత్రి జైలు
ఈ మధ్య వెళ్ళొచ్చి తెలుసుకోన్నాడేమో ఆ సుకమూ వీలు
10- రాహుల్ భజనతో పులకిస్తున్న లాలు
ఇచ్చిందేమో షాక్ తో అక్కడ జ్ఞానోదయం –జైలు
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ – 29-12-13—ఉయ్యూరు
