పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-3
విలియం లాంగ్లాండ్
చాసర్ తరువాత ఆంగ్ల సాహిత్యం పూర్తిగా మార్పు చెందింది . అనేక విషయాలు కవితా వస్తువులైనాయి .భాష సరళం అయింది .పని చేసుకొనే వారికి కవిత చేరువైంది .పద్నాలుగు ,పదిహేను శతాబ్దాలు సాంస్కృతిక పునరుజ్జీవనానికి సిద్ధ మైనాయి .ఇంగ్లాండ్ లో యూని వర్సిటీలు ఏర్పడ్డాయి .గ్రామాలు నగరాలైనాయి .రాజభవనం ,పల్లెటూరు దగ్గరైనాయి .అప్పటిదాకా చెలామణి అయిన ఆంగ్లో సాక్సన్ పదాల స్థానం లో ఫ్రెంచ్ మాటలు చోటు చేసుకొన్నాయి .కొత్త తేలిక పలుకు బడులు వచ్చాయి .చాసర్ కు చెందిన ఆగ్నేయ మధ్య దేశపు మాండలికం ఆంగ్లేయులను ఆకర్షించింది .అదే ఆధునిక ఆంగ్ల స్థాయీ భాష గా మారింది .పద్నాలుగో శాతాబ్బ్ది సామాన్యులకే కాక రెండొందల ఏళ్ళ తర్వాతా వచ్చిన షేక్స్పియర్ కవికీ కూడా ఇదే సహజ భాష అయింది .చాసర్ పాత సంప్రదాయాలను పాటిస్తూ కొత్త చిట్కాలు ప్రయోగించాడు .ఇంగ్లాండ్ దక్షిణాన నికొలాస్ గిల్డ్ ఫోర్డ్ కవి పల్లె భాషలో రెండొందల పంక్తుల ‘’ది ఔల్ అండ్ ది నైటింగేల్ ‘’కవిత రాశాడు .పశ్చిమాన ‘’పెరల్ పోయేట్ ‘’అని అభిమానం గా పేరొందిన’’ విలియం లాంగ్లాండ్’’ యమక చక్రవర్తి గా విజ్రుమ్భించాడు .
1330లో మాల్వేర్న్ లో పుట్టిన లాంగ్లాండ్ తనను జనం చాలాకాలం గుర్తుంచుకొంటారని కవిత అల్లాడు .మొనాస్టరి లో చదివి మత గురువైనాడు .ఆక్స్ ఫర్డ్ లో చదివి లండన్ నివాసి అయ్యాడు .చని పోయిన వారి ఆత్మ శాంతికోసం శాంతి గీతాలు పాడేవాడు .బీదతనం అతన్ని కవిని చేసింది .’’దివిజన్ ఆఫ్ పీర్స్ ప్లో మాన్ ‘’రాశాడు .సంఘాన్ని విమర్శిస్తూ ,సంఘాన్ని సంస్కరించే ప్రయత్నం చేశాడు .పరాన్న భుక్కుల పాలిటి సింహస్వప్నం అయ్యాడు .న్యాయం పై ద్రుష్టి లేని న్యాదిపతులను న్యాయ వాదుల్ని ,అవినీతి పరుల్ని ,అధికార దాహం ఉన్న వారిని యేకి పారేశాడు .మొదట చిన్న కవితగా 1360లో ప్రారంభించిన కవితను 7,000లైన్ల దాకా పదిహేనేళ్ళ తరువాత పెంచి ,ఆ శతాబ్ది చివరలో మళ్ళీ మార్పులూ చేర్పులూ చేశాడు .ఆతను రాసిన ‘’విజన్ ‘’కవిత బ్రహ్మాండం గా క్లిక్ అయి తరువాతి శతాబ్దం లోకీ చొచ్చుకు పోయింది .యాభై అయిదు చేతి రాతల పుస్తకాలుగా అవతరించింది .అదొక ఏకైక సృజనాత్మక కవిత గా నిలబడింది .చాసర్ తో పోలిస్తే లాంగ్లాండ్ ముతకగా ,అస్తవ్యస్తం గా కధలు చెప్పాడని పిస్తుంది .ఈ కవితకు ఇంగ్లాండ్ లో వ్యాపించిన బుబానిక్ ప్లేగు, దాని వలన చనిపోయినవారు ( ‘’బ్లాక్ డెత్ ‘’)వందేళ్ళ యుద్ధం, రైతుల తిరుగు బాటు ,ఫ్యూడల్ వ్యవస్థ కూలి పోవటం నేపధ్యంగా వచ్చిన కవితలివి .ఆర్దిక అసమానత ,దయా సానుభూతి లేని పాలకుల నిరంకు శత్వం పై దాడి తో ఈ దీర్ఘ కవిత జనాలకు బాగా పట్టింది .
లాంగ్లాండ్ తాను ‘’పెరల్ ,పేషేన్స్ ప్యూరిటి’’’’సర్ గవాన్ అండ్ ది గ్రీన్ నైట్ ‘’కవితలను వెస్ట్ మిడ్లాండ్ మాండలికం లో రాశానని చెప్పుకొన్నాడు .ఇందులో ముత్యాల గురించి ముచ్చటైన విషయాలెన్నో చెప్పాడుకనుక ‘’పెరల్ పోయేట్ ‘’గా గుర్తింపు వచ్చింది .పెరల్ కవిత అతని స్వంత కద అన్నారు .ఇదొక అమ్మాయి గురించి రాశాడు ఆమెను పుష్పం గా ,ముత్యం గా పోల్చాడు .గ్రీన్ నైట్ కవితను ‘’మాస్టర్ పీస్ ‘’అంటారు .అందులో ఏంతో కళ ఉందంటారు ‘’బొ ఉల్ఫ్’’ అనే వీరోచిత యోదుడికద .భార్య అనేక సార్లు బొ ఉల్ఫ్ ను దిగజార్చటానికి ప్రయత్నిస్తుంది .కాని పట్టువదలని విక్రమార్కుడిలా గమ్యం వైపు సాగి పోతాడు .ఇందులో ఆటవిక సంఘటనలకే ప్రాముఖ్యం .హింస ,కపటం మోసం అన్నీ గొప్పగా చిత్రిస్తాడు .సాహస వీరుడు ఎలా ఉంటాడో ,ఉండాలో బొ ఉల్ఫ్ పాత్రలో నిలబెట్టి ఆదర్శం గా తీర్చాడు .ఇందులోని పాత్రలు చాసర్ పాత్రలంత సజీవాలుకాదు.కాని లాంగ్లాండ్ సామర్ధ్యం తీసి పారేసేది మాత్రం కాదు .’’Langland is the essential teller of tales ,his very detachment as a narrator enables him to turn an incredible phantasmagoria into one of the most delightful Arthurian romances ‘’అని లాంగ్లాండ్ తీరును విశ్లేషించారు
dreamer of Langland
.
స్కాటిష్ చాసరియన్లు
‘’గోవర్, హోక్లేవ్ ,లిద్ గెట్ ‘’లను కలిపి స్కాటిష్ చాసరియన్లు అంటారు .చాసర్ చేత మసగ బారిన కవులు .ఇందులో జాన్ గోవర్ 1303లో పుట్టి 1408లో గిట్టాడు .లాటిన్ నార్మల్ ఫ్రెంచ్ ,మిడిల్ ఇంగ్లీష్ భాషల్లో విపరీతం గా కవితలు అల్లాడు .మిడిల్ ఇంగ్లీష్ కవితలే అతడిని కవిగా గుర్తింపు తెచ్చాయి ‘’కన్ఫెషియో యమాన్టిస్ ‘’అనే కదల కవిత రాశాడు .రెండవ చార్లెస్ రాజు తనను ప్రేమ ఆధారం గా రాయమన్నాడు అందుకే అరువు కధలు, అనువాదాలు, అను సృజనలతో కవితలు రాశాడు .చాసర్ ఇతన్ని ‘’మోరల్ గోవర్ ‘’అన్నాడు .ఇందులో ‘’పెరిక్లిస్ ‘’ షేక్స్ పియర్ ను ఆకర్షించింది .గోవర్ ఈ నాటికలో కోరస్ పాత్ర ధరించాడు .దీనిని ఎనిమిది పుస్తకాలుగా ముప్ఫై నాలుగు వేల పంక్తుల తో తయారు చేశాడు .కాంటర్ బరీ కధలతో పోలిస్తే ఇది ఒక చెక్క బొమ్మ లా ,రక్తమాంసాలు లేని పాత్రలతో ,ఊక దంపుడుగా ఉంటుంది .ఇందులోని పాత్ర వీనస్ చాసర్ను ‘’ mi disciple and mi poete’’అని అంటాడు .ప్రేమ తో ఉన్నతం గా జీవించమని కోరితే పో పొమ్మంటాడు చాసర్
![]()
.
థామస్ హోక్లీవ్ 1370-1450వాడు .చాసర్ కు వీరాభిమాని .అదే అతన్ని కవిని చేసింది ‘’maister deere and father reverent ‘’అంటూ గురువు చాసర్ ను పొగిడాడు .చాసర్ శిష్యుడిని తీర్చి దిద్దే ప్రయత్నం చేశాడు .తనను పట్న వాసిగా కవితల్లో చిత్రిన్చుకొన్నాడు .ప్రేమలో పడటం,అప్పుల్లో మునిగి ఉండటమేఅతని పని .కాని పరిశోధకులు అతనికి చెందని దాన్ని అతనిదే నని బూస్ట్ ఇచ్చారు .హోక్లీవ్ వలననే చాసర్ కు చెందిన ‘’సాధికారిక చిత్రం ‘’మనకు లభించింది .గురువు మీద గొప్ప కప్లేట్ రాశాడు ‘’ to putte other men in remembrance –of his persone I have here his likeness ‘’అని రాసుకొన్నాడు
నాలుగవ హేన్రికి పుస్తకం అంకితమిస్తున్న హాక్లేవ్
నాలుగవ హేన్రికి పుస్తకం అంకితమిస్తున్న హాక్లేవ్
![]()
హాక్లేవ్ దగ్గరున్న చాసర్ చిత్రం
స్కాటిష్ చాసరియన్స్ లో మూడవ వాడు 1370-1449కాలం వాడైన’’జాన్ లిద్ గెట్ .‘’సెయింట్ ఎడ్మండ్ బరి లో బెనేడిక్తాన్ మాంక్ .సాహిత్యం లో యధాలాపం గ ప్రవేశించాడు .’’ది స్టోరి ఆఫ్ ది ధేబ్స్ ‘’,ది కోర్ట్ ఆఫ్ వీనస్ ‘’దికంప్లైంట్స్ ఆఫ్ దిబ్లాక్ నైట్ ‘’రాశాడు .ఇవన్నీ గొప్ప విజయాలనే ఇచ్చాయి .చివరిది చాసర్ చాలా కాలం జ్ఞాపకం ఉంచుకొన్నాడు .దాదాపు రెండు లక్షల పంక్తుల కవితలు రాశాడు అందులో ఒక్కటీ దక్కలేదు .అతనికి తాను నైపుణ్యం ఉన్న కవిని కాదని తెలుసు .చాసర్ శైలికి తానూ ఎన్ని మైళ్ళ దూరం లో ఉన్నాడో గ్రహించాడు .ఆతను తన శక్తి సామర్ధ్యాలను ఇంకా సమర్ధ వంతం గా ఉపయోగించుకొని ఉన్నట్లయితే ,చాసర్ ప్రేరణతో వచ్చిన మరో గొప్ప కవిగా శతాబ్దాల పాటు గుర్తుండి పోయేవాడు
![]()
జాన్ లిద్ గేట్
.
సశేషం
శ్రీ శంకర జయంతి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-14-ఉయ్యూరు

