గీర్వాణ కవుల కవితా గీర్వాణం -68
105-రాయల్ సొసైటీ సభ్యుడు –రాం కరణ్ శర్మ
విద్య –గ్రంధ రచన
బీహార్ లోని శరణ జిల్లా శివ పూర్ లో రాం కరణ్ శర్మ 1927లో జన్మించాడు .పాట్నా యూని వర్సిటి నుండి సంస్కృత హిందీ భాషల్లో ఏం ఏ .డిగ్రీ పొందాడు .సాహిత్యాచార్య ,వ్యాకరణ శాస్త్రి వేదాంత శాస్త్రి పట్టాలను సాధించాడు .అమెరికాలోని కాలిఫోర్నియా లోఉన్న బెర్కిలీ యూని వర్సిటి నుండి భాషా శాస్త్రం లో పి.హెచ్.డి ని ..’’ముర్రే బి ఎమన్యు ‘’గైడెన్స్ లో చేశాడు .సంస్కృత ఆంగ్లాలలో బహు రచనలు చేశాడు .సంధ్య ,పాధేయ శతకం ,వీణ అనే సంస్కృత పద్యకావ్యాలు ,రాయసా ,సీమా అనే నవలలు మహా భారతమలో కవిత్వ మూలాలు అనే గొప్ప పరిశోధనాత్మక విశ్లేషణాత్మక గ్రంధం రాశాడు .ఎన్నో వైద్య గ్రంధాలను అనువదించాడు .మహాకావ్యలను ,పురాణాలను అనువాదం చేశాడు .ఇండాలజీ(భారతీయ చరిత్ర సాహిత్యం వేదాంతం సంస్కృతీ ) పై జరిగిన ఎన్నో సెమినార్ లలో పాల్గొని అనేక పరిశోధనా పత్రాలను రాసి వెలువరించాడు .
పురస్కారాలు
కేంద్ర సాహిత్య అకాడెమి నుండి సంస్కృతం లో అవార్డ్ అందుకొన్నారు .భాషా సాహిత్య పరిషద్ అవార్డ్ ,ధిల్లీ సంస్కృత అకాడేమి అవార్డ్ లను పొందాడు .కృష్ణ కాంత్ హాన్దీక్ మెమోరియల్ అవార్డ్ సంస్కృత భాషా వ్యాప్తికి చేసిన సేవకు లభించిది బిర్లా ఫౌండేషన్ వాచస్పతి పురస్కారాన్ని అంద జేసింది .రాయల్ ఎసియాటిక్ సొసైటీ ,అమెరికన్ ఓరిఎంటల్ సొసైటీ లలో విశిష్ట సభ్యులుగా నియమిం పబడి గౌరవం పొందారు
దర్భంగలోని కామేశ్వర సింగ్ సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సెలర్ గా 1974-80కాలం లో పని చేశాడు రాం కరణ్ శర్మ .వారణాసి లోని సంపూర్ణానంద్ సంస్కృత యూని వర్సిటి కి కూడా ఉప కులపతిగా 1984నుండి ఒక ఏడాది సేవ చేశాడు .అమెరకా లోని చికాగో ,కొలంబియ ,పెన్సిల్వేనియా యూని వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు .
రాం కరణీయం
రాం కరణ్ శర్మ సంస్కృతం లో సంధ్య ,పాధేయ శతకం ,వీణా ,కవిత ,సర్వం సహా కావ్యాలను రాశాడు .రాయిసం సీమ అనే సంస్కృత నవలలు రచించాడు .ఇంగ్లీష్ లో elementsof poetry in Mha Bharata ,Anthology of midieval Indian literature,Researches in Indian and Buddhist philosophy (essays in honour of Professor Alex wayman )రాశాడు ఇవికాక శివ సహస్ర నామ శతకం ,శివ సుఖీయం ,గగన వాణి,చరక సంహిత ,రేజు వెనతీవ హితకారే –ఆయుర్వేద ,సర్వ మంగళ సుమనోమల ,దీపికా –ఇవి కాక గణేశ పురాణం ను స్వీయ సంపాదకత్వం లో వెలువరించాడు .
అంతర్జాతీయ భావ వ్యాప్తికి శర్మ అనేక సెమినార్ లను దేశ విదేశాలలో నిర్వహించాడు. భారత ప్రభుత్వానికి విద్యా సలహా దారుగాఉన్నాడు ,ఎన్నో విశ్వ విద్యాలయాలు గౌరవ సలహాదారుగా శర్మ సేవలను వినియోగించుకొన్నాయి.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-14-ఉయ్యూరు
.

