|
నా గొంతు వినడానికే సినిమాలు చూసేవాళ్లున్నారు
|
|
చిన్మయి అంటే అందరూ గుర్తు పట్టకపోవచ్చు. కాని సమంతకు డబ్బింగ్ చెప్పే అమ్మాయి అంటే చాలు అందరూ గుర్తుపడతారు. డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయని అయిన చిన్మయి కథక్, ఒడిస్సీ నృత్యకారిణి. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషు, జర్మన్ భాషలు కూడా వచ్చు ఈమెకి. ఇంత టాలెంట్ ఉన్న చిన్మయి శ్రీపాదతో నవ్య చేసిన ఇంటర్వ్యూ…
గాయకురాలు కావాలని చిన్నప్పట్నించీ అనుకునేవారా? బడికెళ్లే వయసులోనే సింగర్ కావాలనుకునేదాన్ని. అందుకు కారణం మా అమ్మ పద్మహాసిని. తను మంచి సింగర్. సంగీతంలోనూ దిట్ట. అమ్మే తొలి గురువు కావటం నా అదృష్టం. చిన్నపుడే కర్నాటక, హిందుస్తానీ సంగీతం నేర్పించింది. సంగీతం నేర్చుకునే రోజుల్లో రేవతి, సురేష్‌మీనన్ నటించిన ఓ సినిమాకి తీసుకెళ్లింది. ఆ సినిమాలో పాటలు నాకు బాగా నచ్చాయి. ‘రంగీలా’ సినిమాలో స్వర్ణలత పాడిన ‘హాయ్ రామా యే క్యా హువా…’ పాట పాడాలన్న స్ఫూర్తి కలిగించింది. పాటల పయనం ఎలా మొదలైంది? సన్‌టీవీ వాళ్లు నిర్వహించిన ‘సప్తస్వరంగళ్’ అనే పాటల రియాలిటీ షోలో గెలిచాను. అప్పుడే సింగర్ శ్రీనివాస్ నన్ను రెహ్మాన్ దగ్గరికి పరిచయం చేశారు. మణిరత్నంగారు తీసిన ‘కన్నథిల్ ముత్తమిత్తల్’ చిత్రంలో ‘ఒరు దైవం తంట పూవే…’ పాడాను. అదే సినిమా తెలుగులో ‘అమృత’గా విడుదలైంది. అందులో ‘ఏ దేవి వరమో నీవు’ పాట పాడాను. గాయనిగా అది నా మొదటిపాట. మంచి హిట్టయ్యింది. మొదటి పాట సక్సెస్ కావడంతో నా బాధ్యత పెరిగింది. మొదటిపాటకే రెహ్మాన్‌తో కలిసి పనిచేశారు కదా ఆ అనుభవం గురించి… రికార్డింగ్ థియేటర్‌కి వెళ్లాక ‘నీ స్టైల్‌లో పాడు’ అన్నారు రెహ్మాన్. ఎటువంటి ఒత్తిడి పడకుండా పాడాను. లిరిక్స్, ట్యూన్, పిక్చరైజేషన్ వల్ల నా గాత్రం ఎలివేట్ అయింది. రెహ్మాన్ తో పనిచేయటమంటే ఓ ఎడ్యుకేషన్. నేర్చుకోవాలనే తపన ఉండాలే గానీ అనునిత్యం కొత్త విషయాల్ని నేర్చుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే రెహ్మాన్‌తో కలిసి పనిచేయడటమంటే గుడికెళ్లి ప్రార్థన చేసినట్లు ఉంటుంది. గాయకులకి స్వేచ్ఛనిచ్చే మనస్తత్వమున్న వ్యక్తి. కొత్త గాయకుల ప్రతిభను గుర్తించి, ఏ పాట ఎవరుపాడితే నప్పుతుందని అంచనా వేయడంలో రెహ్మాన్ నిష్ణాతులు. ఇప్పటివరకూ నలభై పాటలు రెహ్మాన్ వద్ద పాడాను. తెలుగు, తమిళ పాటల గురించి… మొదటిపాట తర్వాత శివాజీ చిత్రంలో ‘సహానా..’ పాట పాడి తమిళంలో బిజీ అయ్యాను. తెలుగువాళ్లు ‘చిన్మయి’ ని ఇంతలా స్వాగతించటం అదృష్టం. 2002 నుండి తెలుగులో అవకాశాలు వచ్చాయి. తమిళంతో పోలిస్తే తెలుగులో లవ్‌సాంగ్స్ చాలా నచ్చుతాయి. బాలీవుడ్‌కి కూడా రెహ్మాన్‌గారే నన్ను పరిచయం చేశారు. ‘గురు’ తర్వాత ఐదేళ్లకి హిందీలో మంచి అవకాశం వచ్చింది. సంగీత దర్శకులు విశాల్-శేఖర్ ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ మూవీ పనిమీద చెన్నయ్‌కి వచ్చి ‘తేరే బినా’ పాట పాడిన అమ్మాయి ఎవరని ఆరాతీసి. ఫోన్ నంబరు కనుక్కొని మరీ నాకు ఫోన్ చేశారు. ఆ సినిమాలో నేను పాడిన ‘బన్ కే తిత్లీ దిల్…’ పాట మంచి పేరు తెచ్చింది. ‘టుస్టేట్స్’ సినిమాకి పాడిన ‘మస్తుమగన్’ యువతని ఆకట్టుకుంది. ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ, మరాఠీ, తుళు భాషల్లో పాటలు పాడాను. పాటల ప్రయాణం మీకెలా అనిపిస్తోంది. ఇందులో మీ బలాలు, బలహీనతలు… ఒక్కోసారి చాలా టఫ్‌గా, కొన్నిసార్లు గ్రేట్‌గా అనిపిస్తుంది. నాలోని బలాలు తెలీదు గాని బలహీనత మాత్రం నన్ను నేను తిట్టుకోవడం. నా పాటలు నేను పూర్తిగా వినను. ఒక్కోసారి బాగా పాడలేదని నన్ను నేనే తిట్టుకుంటాను. అలా తిట్టుకోవడమే నాకు ప్లస్ అని చెప్పొచ్చు. నాకు బెస్ట్ క్రిటిక్ అమ్మ. నా పాటలు విన్నవాళ్లు, స్టేజ్ పెర్ఫార్మెన్స్ చూసిన వాళ్లు అభినందిస్తే, మా అమ్మ మాత్రం ‘అది అలా పాడాలి… ఇది ఇలా పాడాలి’ అని చెప్తుంటుంది. ‘ఏంటమ్మా అలా చెప్తావు’ అనంటే ‘అందరిలా నేనూ పొగిడితే ఎలా’ అంటుంది. గమ్మత్తుగా పలికే మీ గొంతు వెనక ఉన్న రహస్యం? రహస్యాలేమీ లేవు. గొంతు కోసమని ప్రత్యేక శ్రద్ధ తీసుకోను. శాకాహారం ఎక్కువగా తింటాను. చాక్లెట్ మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్స్ అంటే మహా ఇష్టం. పాటలు పాడేవాళ్లు ఐస్ క్రీమ్‌లు తినకూడదంటారు. కాని ఐస్‌కీ రమ్ తిన్నాక గోరు వెచ్చని నీళ్లు తాగితే సరిపోతుంది. డబ్బింగ్‌లోకి ఎలా వచ్చారు? అనుకోకుండా జరిగింది. గౌతమ్‌మీనన్ రూపొందించిన చిత్రం ‘సిల్లును ఒరు కాదల్’లో భూమిక పాత్రకి డబ్బింగ్ చెప్పమన్నారు. ‘పాటలు పాడతాను కానీ నవ్వడం, ఏడవడం నా వల్ల కాద’న్నాను. కాని భూమిక పాత్రకి చిన్మయే డబ్బింగ్ చెప్పాలన్నారు గౌతమ్‌మీనన్. దానికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘సూర్య సన్నాఫ్ క్రిష్ణన్’ తమిళ, తెలుగు వెర్షన్స్‌లో సమీరారెడ్డికి డబ్బింగ్ చెప్పించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా స్టార్డమ్ అనేది గౌతమ్‌మీనన్ వల్లే వచ్చింది. ఆయన రూపొందించిన ‘వినైతాండి వరువయా’ చిత్రంలో త్రిష నటించిన ‘జెస్సీ’ పాత్రకు గొంతు ఇచ్చాను. ఆ సినిమా తెలుగు వెర్షన్ ‘ఏం మాయ చేశావే’లో సమంతకి డబ్బింగ్ చెప్పాను. హిందీలో వచ్చిన ‘ఏక్ దివానా థా’ సినిమాలో అమీజాక్సన్ నటించిన జెస్సీ పాత్రకీ డబ్బింగ్ చెప్పాను. ఒకేసారి తమిళ, తెలుగు చిత్రపరిశ్రమలో డబ్బింగ్ చెప్పటానికి కారణమైన ఏమాయ చేశావే సినిమాని చాలామంది ప్రేక్షకులు, చిత్రపరిశ్రమకు సంబంధించిన వాళ్లు నా గొంతు వినటం కోసమే చూశామని చెప్పారు. పాటలతో పాటు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు దక్కింది. డబ్బింగ్‌తో మాస్ ప్రేక్షకులకి చిన్మయి ఎవరో తెలిసింది. సమంతాతో స్నేహం గురించి… ‘నటిగా నాకు మంచి పేరొచ్చింది చిన్మయి గొంతు వల్లే’ అని చాలాసార్లు చెప్పింది తను. భేషజాలు లేని స్టార్ హీరోయిన్ ఆమె. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. సమంతా నటనకి నా గొంతు బాగా నప్పుతుంది. ఆమె నటించిన ‘బృందావనం, ఆటోనగర్ సూర్య, జబర్దస్త్’ సినిమాలకి తప్ప మిగతా అన్నింటికీ నేనే డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్‌లో ఇబ్బందులైవేనా ఉంటాయా? డబ్బింగ్ చెప్పడం ‘మైకుమీద సామే’. గొంతు మీద ఒత్తిడి పడుతుంది. నేను కూడా త్వరగా అలసిపోతాను. ఒక రోజు డబ్బింగ్ చెప్పానంటే రెండు రోజులు విశ్రాంతి తప్పనిసరి. నటీనటుల తప్పుల్ని డబ్బింగ్‌తో సరిచేస్తారనే విషయం తెలిసి ఆశ్యర్యపోయాను. డబ్బింగ్ చెప్పాలంటే భాషపై పట్టు ఉండాలి. నటుల హావభావాలు, సీన్ డిమాండ్, మూడ్ బట్టి ప్రవర్తించాలి. పాత్రకి గొంతుతో జీవం పోయడం అంత సులువేం కాదు. పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకుని రిహార్సల్స్ చేసుకోవాలి. మాటల్లో చిన్న పొరపాటు కూడా దొర్లకుండా చూసుకోవాలి. దర్శకుడు ‘ఓకే’ అనేవరకు ఎన్ని రీటేకులైనా చేయాలి. ఇప్పటివరకూ 70 చిత్రాలదాకా డబ్బింగ్ చెప్పాను. తెలుగు హీరోయిన్ అనుష్క చేసే వాణిజ్య ప్రకటనల కోసం నా గొంతే ఉండాలని అడిగి మరీ చెప్పించుకుంది. అది నాకు గర్వంగా అనిపించింది. మీ ప్రేమపెళ్లి గురించి… అందాల రాక్షసి సినిమా అప్పుడే రాహుల్ పరిచయమైంది. ‘మీ డబ్బింగ్ సూపర్’ అని రాహుల్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ‘మీ యాక్టింగ్ బావుంద’ని నేనన్నాను. ఆ తర్వాత ట్విట్టర్‌లో కలిశాను. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. వాట్సప్ మెసేజ్‌లతో మరికాస్త దగ్గరయ్యాం. రాహుల్ ప్రపోజ్ చేశాక ఏడాదిన్నర తరువాత పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. తను స్నేహితుడిలా ఉంటాడు. వేరొకరి గురించి చెడ్డగా మాట్లాడడు. రూమర్స్ వినడు. రాహుల్ లాంటి మంచి మనసున్న భర్త దొరకటం నా అదృష్టం.’’ చిన్నప్పుడే శాస్ర్తీయనృత్యం నేర్చుకున్నాను. కథక్, ఒడిస్సీ నృత్యాలు చేస్తాను. నాకు తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషు, జర్మన్ భాషలపై పట్టుంది. మాకు ‘బ్లూ ఎలిఫెంట్’ అనే ట్రాన్స్‌లేషన్ కంపెనీ ఉంది. ఇందులో మేము 130 భాషల్ని తర్జుమా చేస్తాం. పుస్తకాలు, సినిమాలు ఏదైనా అనువాదం చేసి పెడతాం. పుస్తకాలు చదవటం, కొత్తభాషలు నేర్చుకోవటం అంటే నాకెంతో ఇష్టం. గజల్స్ అంటే చాలా ఇష్టం. వాటివల్ల రిఫ్రెష్ అవుతాను. నా పదిహేనో యేట నించే గజల్స్ పాడుతున్నాను. గులాం అలీ సాబ్, మెహదీ హాసన్ గజల్స్ అంటే ప్రాణం. గజల్స్‌లో తెలీని అనుభూతి, పొయెట్రీ మ్యాజిక్ ఉంటుంది. అంతకంటే మించి మంచి సోల్ ఉంటుంది. |
వీక్షకులు
- 1,107,559 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

