
|
బర్త్‌డే స్పెషల్ : చాళుక్య వీరభద్రుడిగా రానా (13-Dec-2014)
|
|
గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘రుద్రమదేవి’ చిత్రంలో రానా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నిడవర్ద్యపురం (నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడిగా రానా కనిపించబోతున్నారు. డిసెంబర్ 14న రానా పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దేశంలోనే తొలిసారిగా స్టీరియోస్పోపిక్ త్రీడీ విధానంలో ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ కూడా బాగా ఉపయోగపడేలా కనబడుతుంది. ఈ చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్స్ పూర్తిచేసుకుంటోంది.
ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, నాగదేవునిగా బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.
|

