|
మామిడి పండులా ఉందన్నారు
|
|
బాపు సినీకావ్యాల్లో చెప్పుకోదగినది ‘ముత్యాలముగ్గు’. ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపించే చిత్రం అది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆ టైటిల్‌నే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీనియర్ నటి సంగీత. బాపు మలచిన కుందనపు ‘బొమ్మ’ల్లో సంగీత కూడా ఒకరు. బాపు జయంతి సందర్భంగా ఆయన గురించి సంగీత చెబుతున్న విశేషాలు…
‘‘నేను మేగజైన్‌లో యాడ్‌లు చేసేదాన్ని. ఒకసారి ప్రకటనల కోసమని స్టిల్ ఫోటోగ్రాఫర్ భూషణ్ నా ఫోటోల్ని తీశారు. ఆయన బాపుగారి సినిమాలకు కూడా పనిచేసేవారు. నా ఫోటోలు బాపుగారికి చూపించడం, ఆయనకి నచ్చడంతో ‘ముత్యాలముగ్గు’లో అవకాశం వచ్చింది. ఈ సినిమా కంటే ముందు ‘అందాలరాముడు’ చేయాల్సింది. కానీ, కుదరలేదు. నేనేమో ఇండస్ర్టీకి కొత్త. ఏం తెలిసేది కాదు. అవే ఫోటోలు చూసి విశ్వశ్వరరావుగారు ‘తీర్పు’లో అవకాశం ఇచ్చారు. అది హీరోయిన్‌గా నాకు తొలి సినిమా కాగా విడుదలైంది మాత్రం ‘ముత్యాలముగ్గు’. మేకప్ లేకుండా నటించమన్నారు ‘తీర్పు’ షూటింగ్ జరుగుతుండగానే ‘ముత్యాలముగ్గు’కి నన్ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు చెప్పారు. మేకప్ లేకుండా నటించాలన్నప్పుడు కొంచెం ఫీలయ్యాను. ‘సినిమా అంటే గ్లామర్ కదా, మేకప్ లేకుండా నటించామంటారేంటి?’ అనుకున్నాను. అంతకుముందు బాపుగారి గురించి నాకు తెలీదు. సినిమా అంటేనే పెద్దగా తెలీదు. స్కూల్లో స్కిట్స్ చేసేదాన్ని. మా స్వస్థలం వరంగల్. సెలవులకు సికింద్రాబాద్‌లో ఉన్న మా పెద్దక్క దగ్గరకి వెళ్లినప్పుడు పక్కనే ఉన్న డాన్స్ స్కూల్‌లో డాన్స్ నేర్చుకున్నాను. మద్రాసుకి వచ్చిన తరువాత కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం చేశాను. చిన్నప్పుడు స్కూల్లో చేసిన డాన్స్‌లతోనే సినిమాపై ఇష్టం పెరిగింది. ‘మంచి ఫోటోజెనిక్ ఫేసు. సినిమాల్లో ఎందుకు ట్రై చేయకూడదు’ అని మా ఫ్రెండ్స్ అనేవారు. ‘తీర్పు’ పూర్తికాకుండానే ‘ముత్యాలముగ్గు’లో నటించాను. సరదాగా కూర్చుని మాట్లాకుంటున్నప్పుడు షాట్ రెడీ అంటే వెళ్లిపోయేవాళ్లం. కొద్దిగా టచప్ చేసేవాళ్లంతే.
పాట నా ఫస్ట్ షాట్ అలా మాట్లాడ్డం చాలా అరుదు…
ఇండస్ర్టీకి వచ్చి 35 ఏళ్లు దాటింది. ఇప్పటికీ నన్ను చూస్తే ‘ముత్యాలముగ్గు సంగీత’ అనే అంటారు. ‘లవకుశ’ సినిమాకి సాంఘిక రూపం ‘ముత్యాలముగ్గు’. దాన్ని మరిపింపచేసేలా ఈ సినిమా తీశారు. ఇన్నేళ్లయినా ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే అదే ‘బాపు రమణీయం’. ‘పద్మశ్రీ’ వచ్చినప్పుడు శుభాకాంక్షలు చెబుదామని ఇంటికి వెళ్లాను. మీకు ‘పద్మభూషణ్’ వస్తే బాగుంటుంది అన్నాను. ‘ఏ ఎందుకు భారతరత్న వస్తే బాగుండదా?’ అని గట్టిగా నవ్వేశారు. అవార్డుల్ని ఆశించే తత్వం కాదని తమాషాగా చెప్పారు. ఆయన ఇలా జోక్‌గా మాట్లాడ్డం చాలా అరుదు.
ఆ షాక్‌లో ఏడుపు రాలేదు… |
వీక్షకులు
- 1,107,452 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

