|
సంస్కృతమంటే భయమెవరికి…
|
|||||||||||||
గత సంవత్సరం జూన్ మాసంలో అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. మా అబ్బాయికి పిహెచ్.డి డిగ్రీ ఇచ్చే సమయం కాబట్టి కుటుంబసహితంగా వెళ్లాం. విశ్వవిద్యాలయం ప్రధాన అధికారులైన ప్రెసిడెంటు మరియు డీన్‌లు లాటిన్‌భాషలో వాళ్ల ప్రసంగాలు ప్రారంభించి తర్వాత ఆంగ్లభాషలో మాట్లాడారు. డిగ్రీ సర్టిఫికేట్లు కూడా లాటిన్ భాషలోనే ఉన్నాయి. అదేమిటని విచారిస్తే కేవలం అక్కడే కాకుండా అమెరికాలోని టాప్ యూనివర్శిటీలలో అది పరిపాటి అని తెలిసింది. అమెరికా దేశానికి కేవలం అయిదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అయినా తమకు గొప్ప చరిత్ర ఉంది అని చెప్పుకోవడానికి ఆ విధంగా లాటిన్ తమ భాషగా చెప్పుకుంటున్నారు.
అమెరికాకు, రోమ్‌కూ మతం తప్ప మిగతా ఏ సంబంధమూ లేదు. వారి మతగ్రంథాలు లాటిన్ భాషలో ఉండడమొక్కటే వారికి సంబంధం. సంస్కృతం అలా కాదు. సంస్కృతమంటే కేవలం హిందూమతం కాదు. ఇంగ్లీషు అంటే క్రైస్తవమతం ఎలా కాదో అలాగే సంస్కృతమంటే హిందూమతం అని అర్థం కాదు. వేదాల్నీ, దేవుడిని అంగీకరించని బౌద్ధులు, జైనులు, అలాగే పూర్తిగా నాస్తికులైన చార్వాకులు మొదలైన వాళ్లందరూ సంస్కృతంలోనే రచనలు చేశారు. మొదట్లో బౌద్ధులు పాళీభాషలో పుస్తకాలు రాశారు. అయితే అవి ఒక చిన్న ప్రాంతానికే పరిమితమయ్యాయి. ఈనాడు ఇంగ్లీషులో రాయటం వల్ల ప్రపంచమంతా ఎలా చదవగలరో అలాగే ఆనాడు వారందరూ పాళీభాష వదిలి సంస్కృతంలో రాయటం మొదలుపెట్టారు. లాజిక్, తత్త్వశాస్త్రం, గణితం, ఖగోళశాస్త్రం, రసాయనశాస్త్రం, దండనీతి శాస్త్రం, ధర్మశాసా్త్రలు, ఆయుర్వేదం లాంటి విషయాలపై రచనలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఒకే వర్గం వారే దీన్ని నేర్చుకున్నారనడం బొత్తిగా అవగాహన లేని వాదన. ప్రపంచంలోనే మొట్టమొదటి నిఘంటువు శ్లోకాల రూపంలో రాసిన అమరసింహుడు జైనుడు. పాణిని వ్యాకరణానికి వ్యాఖ్యలు రాసినవారు బౌద్ధులు, జైనులు. అనేకమంది రాజులు కావ్యాలు, నాటకాలు రాశారు. క్రమక్రమంగా సంస్కృతం భరతఖండం మొత్తానికి జూజీుఽజు జ్చూుఽజఠ్చజ్ఛ గా బ్రిటీష్‌వారు వచ్చేవరకూ కూడా కొనసాగింది.
మన ప్రాచీన గ్రంఽథాల్ని చాలా వాటిని వెలికితీసిన ఘనత బ్రిటీష్ వారికి ఇవ్వాలి. వారి పాలనలో బౌద్ధ గ్రంఽథాలనేకం ఆఫ్ఘనిస్తాన్‌లో లభించాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం సమగ్రప్రతి కేరళలో లభించింది. దేశంలో విద్యార్థులు ఒక మూల నుండి మరొక మూలకు వెళ్లి చదువుకున్నారు. సంస్కృతం జాతి మొత్తానికి చెందిన భాష కేరళ నుండి గాంధార దేశం (ఆఫ్ఘనిస్తాన్) వరకూ వ్యాపించిన భాష స్వతంత్రం వచ్చిన సమయంలో పార్లమెంటులో జాతీయభాష ఏది ఉండాలి అనే ప్రశ్నపై అంబేద్కర్ కూడా సంస్కృతాన్ని సమర్థించడం మనం గమనించాలి.
‘ఈ దేశం సంస్కృతిని పెకలించే ఉద్దేశంతో పనిచేస్తున్న మన మిషనరీలందరూ సంస్కృతాన్ని బాగా చదవాలి. ఆ భాషలోని, శాసా్త్రల్లోని మెళకువల్ని గమనించి మన కార్యకలాపాలు చేయాలి. సంస్కృతం అనే ఆయుధంతో పాటు లాజిక్ కూడా చదవాలి. ఇక్కడ పండితులు, తెలివైనవాళ్లు. ఇది చాలా కష్టమైన పని అయినా ఇష్టంగా చేయాలి’. (పేజీ 4849) అని ప్రఖ్యాత సంస్కృత విద్వాంసుడు మోనియర్ విలియమ్స్ ‘‘అ ట్టఠఛీడ ౌజ ట్చుఽటజుటజ్టీ జీుఽ ఖ్ఛజ్చ్టూజీౌుఽ ్టౌ ఝజీటటజీౌుఽ్చటడ గిౌటజు జీుఽ ఐుఽఛీజ్చీ’’ అనే ప్రసంగంలో 1861లో ఆక్ప్‌ఫర్డ్ యూనివర్శిటీలో చెప్పాడు. ఈ ప్రసంగంలో ప్రారంభమయిన ఆయన మాటలు గమనించదగ్గవి. ‘(ఐుఽఛీజ్చీ) ్చ్ట్ట్చజీుఽ్ఛఛీ ్చ జిజీజజి ఛ్ఛీజట్ఛ్ఛ ౌజ ఛిజీఠిజీజూజ్డ్చ్టీజీౌుఽ ఠీజ్ఛిుఽ ౌఠట జౌట్ఛజ్చ్టజ్ఛిటట ఠ్ఛీట్ఛ ఛ్చటఛ్చటజ్చీుఽట, ్చుఽఛీ జ్చిఛీ ్చ ఞౌజూజీటజ్ఛిఛీ జ్చూుఽజఠ్చజ్ఛ ్చుఽఛీ జూజ్ట్ఛీట్చ్టఠట్ఛ ఠీజ్ఛిుఽ ఉుఽజజూజీటజి ఠ్చీట ఠుఽజుుఽౌఠీుఽ’’. ఈ ప్రసంగం మొత్తం పుస్తకరూపంలో ఇంటర్‌నెట్‌లో మనం చూడవచ్చు. మ్యాక్స్‌ముల్లర్ లాంటి పండితులందరూ భారతీయ సంస్కృతిని నిర్మూలించాలనే ధోరణితో సంస్కృతాన్ని చదివారు. అంతవరకూ ముద్రించని వేదాల్లాంటి గ్రంథాల్ని ముద్రించడం. వాటిపైన ఇంగ్లీషులో వ్యాఖ్యలు రాయటంతో భారతదేశంలోని విద్యావంతులందరూ వాటినే ప్రమాణ గ్రంథాలుగా, ఞటజీఝ్చటడ టౌఠటఛ్ఛిట గా భావించే వాతావరణం ఏర్పడింది.
మోనియర్ విలియమ్స్ చెప్పినదే అతనికి ముందు వచ్చినవారూ, తర్వాత వారూ కూడా ఆచరించారు. రాబర్ట్ నొబిలి అనే ప్రచారకుడు జందెం వేసుకుని రోమన్ బ్రాహ్మణుడు అని పరిచయం చేసుకుని అయిదవ వేదం అంటూ ఒక పదాన్నే సృష్టించాడు. ఆయన మతానికి అనుకూలంగా ఉన్న గ్రంథమిది. సాక్షాత్తూ నేడు మనం ఇంటర్‌నెట్‌లో ఈశావాస్య ఉపనిషత్ కోసం చూస్తే ఒకానొక తమిళ పండితుడు రాసిన ఈ వ్యాఖ్య కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తులో ‘ఈశ’ అంటే ‘జీసెస్’ అని చెప్పి ఒక పి.హెచ్.డి. కూడా తీసుకున్నాడు. సన్మానాలు కూడా పొందాడు. యూట్యూబ్‌లో ్ఖఐఖఇ అనే వెబ్‌సైట్ చూస్తే కొందరు ముస్లిం సోదరులు కూడా ఉపనిషత్తుల్లోని మంత్రాలు చెబుతూ మీ పుస్తకాల్లో ఉన్నది మా దేవుడే అని ప్రచారం చేయడం చూడగలం. ఇదంతా మనం చిన్నప్పుడు చదివిన బ్రాహ్మణుడు మేకపిల్ల కథకు చక్కని ఉదాహరణ. కుక్క అనే భ్రమతో బ్రాహ్మణుడు మేకపిల్లను పారవేసినట్లే మనం ఈనాడు మన సంస్కృతిని పారవేస్తున్నాం.
ప్రభుత్వం సంస్కృతాన్ని స్కూళ్లలో ప్రవేశపెడితే హిందూత్వం పెరిగిపోతుందని కొందరి ఆందోళన. సంస్కృతం నేర్చుకోవడం వల్లనే హిందుత్వాన్ని పెకలించి వేయగలమని మరికొందరి వాదన. ఎవరు చెప్పినా, చెప్పకపోయినా ఈ రెండోవర్గం వారు పట్టుదలగా సంస్కృతం నేర్చుకుంటూనే ఉన్నారు. మూడోవర్గం, అంటే హిందూత్వం గురించి మాట్లాడే వాళ్లు గొప్పగా సంస్కృతం నేర్చుకున్న దాఖలాలు లేవు. అసలైన సంస్కృత పండితులకి ఈ గొడవంతా అసలే తెలియదు. ఎవరు ఎలాంటి రచనలు చేస్తున్నారో అవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో వీరికి బొత్తిగా తెలియదు. అన్ని విమర్శలకూ సమాఽధానం చెప్పగలిగే అనర్గళమైన పాండిత్యం మాత్రం వీరి దగ్గర ఉంది. వివేకానందుడు చెప్పినట్లు వీళ్లందరూ బంగారు నిధిపై కూర్చు ని పేద బతుకులు గడుపుతున్నా వారు.
సత్యమేవ జయతే- ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. అనేది మన సిద్థాతం. అయితే సత్యమేమిటో మనమే తెలుసుకోవాలంటే ఇతరులు ఎవరు చెప్పిన మాటలు కాకుండా మనమే దాన్ని పరిశీలించాలి. మనల్ని పాలించడానికి వచ్చినవాళ్లు, వాళ్ల సంస్కృతిని మనపై రుద్దాలని వచ్చిన వాళ్లూ మనల్ని గురించి నిజాలు రాస్తారని భావించడం మన అమాయకత. అందమైన ఆంగ్లభాషలో అసత్యాలు చెపితే అవి నిజం కావు. మన పుస్తకాల్లో ఎలాంటివి నెగిటివ్‌గా చెప్పగలరో అవన్నీ ఇతరులు చెప్పేసారు. ఆ ప్రచారం అలాగే ఉండాలి. మంచి విషయాలు బయటకు రాకూడదు అనుకునేవాళ్లు సంస్కృతాన్ని వ్యతిరేకిస్తారు. మీ పుస్తకాల్లో ఏముందో మేము అందంగా చెప్పేశాం. అందమైన పుస్తకాల్లో అందించాం. మీరు మీ మూలగ్రంథాల్ని చదవాల్సిన పనిలేదు అనే వాళ్లు వ్యతిరేకిస్తారు.
ప్రభుత్వం సంస్కృతాన్ని నిర్బంధంగా ప్రవేశపెటాలి. ఎవరో చదవాలి, నాకు మాత్రం టైమ్ లేదు అనడం పలాయనవాదం. మన సంస్కృతిలో రుషి రుణం అనే భావన ఒకటి ఉంది. మన ప్రాచీనులు మనకు చెప్పిన విషయాల్ని సరిగా అర్థం చేసుకోవడం, ఆ సంస్కృతిని నిలపడం మన కర్తవ్యం అనేది ఈ పదం యొక్క అర్థం. ఆధునిక ప్రపంచంలోని ప్రచార ధోరణుల నేపథ్యంలో ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా సత్యమేమిటో తెలుసుకోవాల్సిన కర్తవ్యం చదువువుకున్న మనందరిదీ. కొత్త వేదాన్ని రాసే స్థాయికి నొబిలి మహాశయుడు వెళ్లినపుడు మనమెందుకు ఈ భాషను తెలుసుకోలేం? ఈ ప్రశ్నపై ఆలోచించాలి.
|
వీక్షకులు
- 1,107,617 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


