సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు -2
వికలాంగోపనిషత్
ఈ కదా సంకలనం లో కధకులు గొప్ప సత్యాలను ఆవిష్కరించారు .అవి వికలాంగుల కోసమే చెప్పినా సర్వులకూ అనుసరణీయాలే .అందుకే ‘’ఉపనిషత్ ‘’అన్నాను .’’అవయవాలు పని చేసినా పనీ పాటూ లేకుండా సోమరిగా తిరుగుతూ ,ఆస్తులను ఖర్చు చేస్తూ ,దుర్వ్యసనాలకు బానిసలై అసాంఘిక శక్తులుగా మారేవారే సక లాంగు లైన వికలాంగులు .వికలాంగ పిల్లలు సద్గుణాలతో సమాజానికి తోడ్పడిత తలిదండ్రులకు అంతకంటే కావల్సినదేముంది ?’’అని ‘ఆణిముత్యం ‘’కధలో విశ్వం ప్రభాకర్ అంటాడు .’’మనవ జీవితానికి కావాల్సిన పరమార్ధం ‘’తృప్తి ‘’.దీన్ని కోట్లు ఖర్చు చేసినా పొందలేం .ప్రతి జీవీ ఇతరులకు ఉపయోగ పడుతుంది .మనిషి మాత్రం తన ఇష్టాల పంట కోసం ఎన్నిటినో బలి తీసుకొంటాడు .’’అని ‘’గమ్యం ‘’లో ప్రసూన శరత్ అంటాడు .’’మా కళ్ళతో మా కలలు కన నివ్వండి ప్లీజ్ .విధికి ఎడురీదగలిగే కెరటాలం మేము .అధైర్యం ఉంటె ముందుకు సాగలేం.విజయాల తీరామ్రుతాన్ని సేవించలేం .’’అంటాడు నరసింహం ‘’చాంపియన్స్ ‘’లో చాంపియన్ లాగా .
‘’అతడే ఒక స్పూర్తి ‘’కదలో ముళ్ళపూడి ‘’మనిషిని మనిషిగా పుట్టించలేని ఆ బ్రహ్మ ను సృష్టించింది ఎవరో నాకు తెలిస్తే వాడిని ,యా నాలుగు తలల రాక్షసుడిని ఎవరు సృస్తిన్చామన్నారు ?అని అడిగే వాడిని ‘’’’ ఆకాశం లా ఉంటె మేఘమై అలుముకోవాలి,మెరుపై మెరిసిపోవాలి ,ఉరుమై గర్జించి ,,చినుకై వర్షించి పులకింప జేస్తేనే ఆకాశానికి ఆ గొప్పతనం .నెల వంక వంకరగా ఉందని వెన్నెలను వద్దను కొంటామా ? .ఎదోరకమైన వంకరను కాదు చూడాల్సింది .హృదయంలో వెలుగుల్ని ‘’అన్నాడు.ఘాలి లలిత’’మనో నేత్రం ఉండీ ప్రపంచాన్ని చూడలేని అందునికన్నా ,మనో నేత్రం తో ప్రపంచానికి వెలుగులు పంచెదే వ్యక్తిత్వ పు వెలుగు ‘’అంటుంది .’’సమాజం నిన్ను చూసి జాలిపడితే ఎదిరించే ధైర్యం కావాలి. ప్రేమకు వైకల్యం లేదు అని చెప్పగలిగే సత్తా ఉండాలి ‘’అంటుంది శివలెంక నాగ లక్ష్మి ‘’కళ్ళున్న ప్రేమ ‘’లో . కమల పాటి వెంకట శాంత లక్ష్మి ‘’తెలివితో ప్రకాశించే ‘’కధలో ‘’నా శరీర లోపం నాతప్పుకాదు .భగవంతుడి తప్పు .సంపూర్ణ ఆరోగ్య ప్రదమైన హృదయంఉంటె చాలు’’ అన్నది. అడవి బాపిరాజు ‘’తిరుపతికొండ మెట్లు ‘’కధలో ‘’ఉడుకు మోతుతనం కాశ్మీర దేశాన్ని ఎడారిగా చేయగల శక్తితో విజ్రుమ్భించింది .జపాన్ వాడు మంచూరియాను ఆక్రమించి చైనా వాడిని తరిమి కొట్టినట్లు బిచ్చగాళ్ళ సంఘం ‘’పున్నెడిని’’ కొండ మీద నించి నేట్టేయాలని ఉద్యమించింది ‘’అన్నారు ‘’పిల్లలకు లోపాలున్నాయని నిరుత్సాహ పడ కూడదు . .వారిలోపం మరో రూపం లో పూడ్చ బడుతుంది .వారికి నచ్చిన దారిలో పిల్లలను పోనివ్వాలి .కాని ,జాగ్రత్తగా గమనిస్తూండాలి .వారిని ప్రోత్స హించ క పోవటం పోవటం మన లోపమే అవుతుంది తప్ప ,వారిలోని లోపం ఒక లేక్కలోనిదికాదు’’అన్నది గుమ్మా శశికళ ‘’ఆదర్శం ‘’కధలో .
నయాబ్ రసూల్ ‘’వికల మనసులు ‘’కధలో ‘’అవిటి వారు బాగా తెలివి గల వాళ్లై నేర్పరులై వ్యక్తిత్వంలో ,కళల్లో. సామాన్యుల కంటే మేధావులుగా ఉంటారు .వారిపై జాలి చూపించి వారి అంగ వైకల్యం గుర్తుకు తెచ్చి ,భవిష్యత్తును అగమ్య గోచరం చేయద్దు . మామూలు మనుషులుగా చూస్తె చాలు .అన్నిటిని అధిగమించి అద్భుతాలు సాధిస్తారు ‘’అంటారు .’’పడమటి కొండల్లో సూర్యుడుకూడా కులం లేని వాని బాధను చూడలేనట్లు కనుమరుగై ,వెలుతురూ సన్న గిలింది .’’అని ‘’నిచ్చెన మెట్లు ‘’కధలో డాక్టర్ వసునూరి రవీందర్ అన్నారు . ‘’లైఫ్ అంటే మేధా మేట్రిక్స్ కాదు..అన్నిటికీ అన్సర్లు ఉండవు .ఉద్వేగాలు మోతాదు మించితే కష్టం .అనుమానం నీకే కాదు అందరికీ అశాంతి అల్గిస్తుంది .’’ అని ‘’నిజం ‘’లో నాగరత్నం అంటే ,’’పోరాటంలో ఆనందమూ తృప్తీ ఉన్నాయి ‘’.’’ఛీకటి ఎరుగని కళ్ళకు నిత్య సూర్యోదయమే ‘’అంటుంది జ్యోత్స్నా ఫణిజ .’’సువర్ణోదయం ‘’లో .ఇవన్నీ నిత్య సత్య ఉపనిషత్ సూక్తులే .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-14-ఉయ్యూరు
‘

