సర్వాంగ సుందరమైన వికలాంగ కధలు -3 (చివరి భాగం )
‘’కల్పనా సాహిత్యం లో బలీనమైన ఆకర్షణ ,సామాన్య పాఠకులలో దానికున్న విశేషాదరణ వల్లనే వల్లనే కధలు రాస్తారు ‘’’’short story is the national art form ‘’.అందుకే కధకు అద్వితీయ గౌరవం కలిగింది.’’అన్న ప్రఖ్యాత కధకులు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత శ్రీ ముని పల్లె రాజు అన్న మాటలు నిత్య సత్యాలు .’’కద రాయాల్సింది కలం తోకాదు ,హృదయం తో ‘’అన్న శ్రీపాద వారి మాటలు శిరోధార్యం గా భావిస్తూ ఈ సంకలనం లోని కధలు అచ్చంగా హృదయం తో రాసినవే అనిపిస్తాయి .’’జీవితాన్ని ప్రేమిస్తే ,దాని అర్ధం తర్వాత అదే తెలుస్తుంది ‘’అని చెప్పిన పెద్దల మాటలకు అద్దంపట్టిన కధలు ఇవి .’’కద ఆకలి లాంటిదే .ఆ ఆకలి తీర్చుకోవటానికే కద రాస్తాడు రచయిత.కొత్త ప్రయోగాలు రావాలి .అవి ప్రజల హృదయాల్లో చొచ్చుకు పోవాలి .
‘’వికలాంగులు తమ ఉనికిని నిల బెట్టుకోనేందుకు చెయ్యాల్సిన ప్రయత్నాన్ని కాల్పనిక సాహిత్యం ద్వారా ఈ సమాజానికి తెలియ జెప్పాలనేదే నా ప్రయత్నం ‘’అని శ్రీ నాగ రాజు నాకు రాసిన లేఖ లో తెలియ బర్చారు .తానూ వికలాంగుడే కనుక ,తన లాంటి వారి భావ ప్రకటనలతో ,కదా ప్రక్రియ ద్వారా వారినే వస్తువుగా చేసిన సాహసమే ఈ ప్రయత్నం .వికలాంగు లపై వచ్చిన సాహిత్యం చాలా అరుదుగా ఉన్న కాలం లో ‘’వికలాంగుల కధలు –అస్తిత్వ చిత్రణ ‘’ఆ లోటును భారీగానే భర్తీ చేసిందని పిస్తుంది .ఇందులో పది మంది మహిళలు రాసిన కధలూ ఉన్నాయి .ఇదీ ఒక ముందడుగే .తమ లోని సృజనను వెలువరించే అవకాశమూ వికలాంగు లకు లభించింది .ఇలాగే వికలాంగుల రచనలతో చిన్న నవలలు ,నాటికలు ,కవితలు తీసుకొని వస్తే ఆ సాహిత్యం మరింత పరి పుస్టమౌతుంది .
ఈ కధల్లో ‘’నారేటివ్ ‘’శైలి ఎక్కువ గా ఉంది .బహుశా ఇలాంటి కధలకు ఇది తప్పని సరేమోనని పిస్తుంది . వాచ్యం ఎక్కువైంది .అంటే అన్ని విషయాలు కధకులే చెప్పేయటం జరిగిందని ,పాఠకుల ఊహకు ,ఆలోచనకు అవకాశమే లేదని అర్ధం ..ఇదే మొదటి మెట్టు కనుక ఫరవా లేదు .తరువాత వచ్చే వాటిలో ఈ మార్పు వస్తే మరింత బాగుంటుంది .అందరు తమ ప్రతిభను పణంగా పెట్టి రాశారు .అందరూ అభినంద నీయులే .శ్రీ మునిపల్లె రాజు గారన్నట్లు ‘’ఏ విషాదమైనా ,మన విషాదమే .విషాదానికి జాతి ,కుల ,మత , జండర్ అనే రంగులు లేవు .ఒక్కటే రంగు –విషాదమే .’’ ఈ విషాదాన్ని అధిగమించే శక్తి ఉన్న కధలే ఇవన్నీ ‘.’’తన దుఖం ,విషాదం ,ఒంటరి తనం రచయితకు మొదటి గురువులు .గురువైనా కొంత దూరమే నడిపిస్తాడు .మిగతా ప్రస్థానమంతా వ్యక్తిదే ‘’అన్న సూక్తికి నిదర్శనలే ఈ కధలు .
వీరందరూ కదా స్వరూపాన్ని కళాత్మకం గా ,వాస్తవంగా చెప్పే ప్రయత్నమే చేశారు ..’’మన జీవితపు ప్రతి బింబం లాగా వాస్తవిక వాద కద నడవాలి’’ .అలానే నడిచాయి ఈ కధలు .దిగులు ,దరిద్రత ఒంటరితనం ,అభద్రతా,భయం ,ఆందోళన ప్రతి ఫలించిన కధలివి .పరిష్కార మార్గం చూపిన కధలు కూడా .’’పాజిటివ్ అవుట్ లుక్ ‘’ఉండటం వలన జీవితానికి భరోసా నిచ్చాయి .లోకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాసిన కధలే .శాప గ్రస్తులకు ,బలహీనులకు ఆశావహ మైన భవిష్యత్తును చూపే కధలే ఇవి .
‘’profoundly personal of all arts ‘’అయిన కధలు చదివి ,భావ స్పూర్తి పొందాలి కాని ,నా లాంటి మూడవ వ్యక్తీ పరిచయం ,ముందుమాట ,వత్తాసు కావాలా?’’అన్న సందేహం ఉన్నా ,ఆత్మీయుడు శ్రీ నాగ రాజు మాట కాదన లేక పోయి రాశాను అంతే.ఈ పాతిక కధలూ చదవండి .అనుభవించండి .వారితోబాటు ఆనందం పంచుకోండి .ధైర్య మివ్వండి .సహవేదన చెంది మానవులం అని పించుకొందాం రండి .
గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-14-ఉయ్యూరు
‘
—

