హైదరాబాద్ మోతీనగర్ నుండి హాసం అనే అన్నిరకాల అభిరుచులతో హాస్య మాస పత్రిక కొన్నేళ్ళు నడిచి పాఠకాదరణ లేక ఆగిపోయింది . నడిచినంత కాలం మాత్రం హాస్యం ఏరులై పారింది అందులోనే తనికెళ్ళ భరణి ”ప్రసి ద్ధ సంగీత విద్వాంసుల పై ధారావాహికం గా చాలా మంది మరుగున పడిన విద్వాంసుల గురించి కొత్త కోణం లో రాశాడు .దాన్ని ప్రేరణగా తీసుకొని నేను ”ఆంద్ర వేద శాస్త్ర విద్యా లంకారులు ”రాసి సరస భారతి ప్రచురణ గా తెచ్చాను అంత ప్రభావం చూపించింది ఆ శీర్షికా, భరణి రచనా .యెన్నొ సినిమాలలోని మధుర గుళికల్లాంటి పాటలన్నిటిని ఆ పత్రిక వరుసగా ప్రచురించిందని జ్ఞాపకం అలాంటిఅభిరుచి ఉన్న పత్రిక బతికి బట్ట కట్టక పోవటం మన దురదృష్టం ఽ ఆంధ్రులు చేసుకొన్న దురదృష్టం .
ఇవికాక హాస్యానికి పెద్ద పీట వేసింది హాసం .పేరును నిల బెట్టుకోంది హాసం పోషకులు ప్రసిద్ధులైన మందులకంపెనీ యజమాని రెడ్డిగారని జ్ఞాపకం .యెమ్బి ఎస్ ప్రసాద్ ,,విఎన్ రామారావు మొదలైన హేమా హేమీలు సంపాదక వర్గం లో ఉన్న జ్ఞాపకం ..కొన్ని సంచికలు చదివాను .కలకాలమ్ దాచుకోదగ్గ మాసపత్రిక హాసం .
అందులో ”చౌ చౌ చౌరాస్తా ”అనే శీర్షిక లో సరదాఅయినవి ,తమాషా అయినవి ఉండేవి .దాని ఉపశీర్షికలు -1కొంటె క్వేస్చన్లు -వింత జవాబులు .2-చిలిపి లిపి 3-ఈ రూటే వేరు 4-చిలిపి కవిత 5-షార్ట్ కట్స్ నాకు బాగా నచ్చినవి కొన్ని రాసి జాగ్రత్త చేసుకొన్నాను .వాటినే మీ ముందు ఉంచుతున్నాను .
చిలిపి లిపి
-ACDT-ఎసిడిటి
CBRUM-శిబిరం
GOLAW–గోల
ఈ రూటే వేరు
కప్పు గంతుల చంద్ర ప్రకాష్ -Frog jumps Moon light
గాజుల బంగార్రాజు –Bangles golden king
గాలి ఏక దంతం -Air single tooth
డబుల్ రోల్
గున్న ఎనుగులాగున్న వాడికి
ఇందిరా?-అది కాలేజీకి పోయిందిరా
షార్ట్ కట్స్
ఆలపాటి కుటుంబ రావు –ఆ .కు .
గోవిందరాజు కరుణాకర రావు -గొ.క రా
చింతల పాండు జీవన్ -చిం పాం జీ .
మేడార కుటుంబం –మే.కు.
గోపరాజు చిదంబరం –గో.ఛి.
మాంబళం సంబంధన్ -మాం సం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-14-ఉయ్యూరు

