|
గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్ (గామా అవార్డ్స్) ప్రదానోత్సవం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న దుబాయ్‌లో ఘనంగా జరగనుంది. 2013కుగానూ మ్యూజికల్ అవార్డ్స్‌తోపాటు ప్రముఖ దర్శకుడు బాపుని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కళాతపస్వీ కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నారు. ‘గామా’ అవార్డ్ కమిటీ చైర్మన్ కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ ‘‘2013కు సంబంధించిన అవార్డ్ ఫంక్షన్‌ను జనవరి 31న ఎంతో ఘనంగా జరిపాం. 2014లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ‘గామా’ అవార్డుప్రదానోత్సవం 2015 ఫిబ్రవరి 6న ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈసారి కె.విశ్వనాథ్‌గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నాం. పలువురు సినీ ప్రముఖులు, గాయనీగాయకులు, సంగీత దర్శకులు, పాటల రచయితలు పాల్గొనబోతున్న ఈ వేడుక దుబాయ్‌లోని తెలుగువారికి కనుల పండుగ అవుతుంది’’ అని అన్నారు.
|


