స్వర్గీయ వెలగా ,గూడపాటిలకు శ్రద్ధాంజలి
సరసభారతి ఈరోజు 31-12-14- బుధవారం సాయంత్రం 6గం.లకు స్థానిక శాఖా గ్రంధాలయం లో ప్రత్యెక సమావేశం జరిపి గ్రంధాలయ గాంధి ,పలికే పుస్తకం బాల సాహిత్య సృష్టికర్త ,రామ మోహన ఫౌండేషన్ సభ్యులు ,ఉయ్యూరు ఏ సి లైబ్రరీ నిర్మాణం లో సూత్ర ధారి స్వర్గీయ వెలగా వెంకటప్పయ్య గారి మరణానికి ,,ఉయ్యూరు సాహితీ మండలి వ్యవస్థాపక సభ్యులు ,ప్రస్తుత నిర్వాహకులు ,క్షేత్రయ్య సాహిత్య పరి శోధకులు ,సాహితీ మూర్తి శ్రీ గూడపాటి కోటేశ్వర రావు గారి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తోంది .సాహిత్యాభిమానులు ,గ్రంధాలయాభిమానులు మిత్రులు కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి కార్యక్రమం లో పాల్గొన వలసినదిగా అభ్యర్ధిస్తున్నాం .
జోశ్యుల శ్యామలా దేవి మాదిరాజు శివలక్ష్మి గబ్బిట వెంకట రమణ వి బి.జి.రావు గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి సాంకేతిక నిపుణులు అధ్యక్షులు –సరసభారతి
