ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -6
ఆధునిక సంగీత సృష్టికర్త –రిచార్డ్ వాగ్నర్ -4(చివరి భాగం )
ఇంత చేసినా వాగ్నర్ సంగీతం ‘’కళకు ,సౌందర్యానికి వ్యతిరేకమే కాక కామన్ సెన్స్ కు కూడా వ్యతిరేకమే ‘’అన్నారు విమర్శకులు .’’టాన్ హీసర్ ‘’కు కూర్చిన సంగీతం అంతా రణగొణ ద్వనియే’’అందిలండన్ టై మ్స్ పత్రిక .’’ట్రిస్టాన్ కు చేసిన సంగీతం ‘’ఒక బాంబు పేలి సంగీత స్వరరాగాలను విచ్చిన్నం చేసి నట్లుంది ‘’అన్నది .జర్మన్ విమర్శకుడు ఇంకొంచెం ముందుకు వెళ్లి వాగ్నర్ సమకూర్చినది ఏదీ మిగలదు నిలవదు అని ఖచ్చితం గా చెప్పాడు .చార్లటాన్’’హంబగ్ ‘’-కౌంటర్ పాయింట్ ను విషపూరితం చేశాడు –సంగీత విద్యా మూర్ఖుడు, శత్రువు ‘’అని శాపనార్ధాలు పెట్టాడు .’’ఇంపు సోంపు పిచ్చి చేష్టలకు బలైనాయి ‘’అన్నాడొక ప్రబుద్ధుడు .వాగ్నర్ కు సంగీత వరస కట్టటం రాదనీ ,అతనిలో హాస్య ప్రియత్వం లేదని ,అణకువ అసలే ఉండదని ,ప్రతిదాని లోను రూపాన్ని రూప శూన్యం లోకి లాక్కేళ్ళాడని ,అతనిదంతా పెద్ద మోత తప్ప చెవులకు ఇంపైనది ఏదీ లేదన్నాడు బెక్ మేసర్ .’’it could be cruel to judge such trash by any known literary standard ‘’అని ‘’విమర్శ కుండ ‘’పగల కొట్టాడు స్టాతాన్ .
వాగ్నర్ భార్య హార్ట్ అటాక్ తో చనిపోయింది .పెళ్ళాడిన కోసిమా ఇతనికి ముగ్గురు పిల్లని కనిపెట్టింది .కోసిమాలో ప్రేమ ఆపేక్ష కనిపించాయి .ఆమె ఆరాధనకు మురిసిపోయాడు. పిల్లలకు తన సంగీత పాత్రల పేర్లు –ఐసాల్ద్ ,ఈవా ,సీగ్ ఫ్రీడ్ అని పెట్టుకొన్నాడు . అనూహ్యం గా వాగ్నర్ కు కొండంత అండగా నిలబడ్డాడు ప్రఖ్యాత ఫిలాసఫర్ ‘’Friedrich Neitzsche ‘’‘’ ‘’వాగ్నర్ విశ్వాన్ని అతి సూక్షం గా చేశాడు ‘’అని కీర్తించాడు .ఈ ఇద్దరి మధ్య అపూర్వ ఆకర్షణ ఏర్పడింది .నీషే క్రిష్టియానిటికి వ్యతిరేకం గా ఉన్నాడు .వాగ్నర్ కూడా అలాగే చేశాడని భావించాడు .వాగ్నర్ సంగీతం ప్రజలకు తీయని మత్తు మందు అని సంస్కృతికి ద్రోహం చేస్తున్నదని ,మత్తు మందు తో మభ్య పెడుతున్నాడని దియేటర్ యజమాలు గోల పెట్టారు ..
ఇంతటి వ్యతిరేక పరిస్తితులలో వాగ్నర్ కు విజయాలు నెమ్మదిగా చేరువైనాయి .జర్మనీ లో ఇమ్పీరియలిజం వ్యాపించింది .తమ గడ్డపై జన్మించిన వాడిని గౌరవించాలన్న బలమైన కోరిక ఏర్పడి అతని ప్రదర్శనలు బ్రహ్మ రధం పట్టటం ప్రారంభించారు .59వ ఏట ‘’బే రూత్ ఫెస్ట్ ఫీలస్ ‘’ కు సంకు స్థాపన చేశాడు .అరవై మూడవ ఏట బేరూత్ ఉత్సవాలు ఘనం గా నిర్వహింప బడ్డాయి .ఇద్దరు చక్ర వర్తులు, ఒక రాజు కొందరు ఉన్నతాధికారుల సమక్షం లో రింగ్ సర్కిల్(దిరింగ్ ఆఫ్ దినీబే లంగ్స్ ‘’ ప్రదర్శించాడు . ఇది అత్యంత విజయవంతం అయింది .అయినా అప్పుల్లో మునిగి ,తీర్చటానికి కచేరీలకోసం దేశాటన చేశాడు .అప్పటికే జీవితం లో ఆసిపోయాడు .కాని మత ఉత్సవానికి సరిపడా ఆలోచనలతో ‘పార్సీ ఫాల్ ‘’చేయాలని బుర్రనిండా ఆలోచనలతో ఉన్నాడు .
పర్సిఫాల్ ఉపోద్ఘాతం ను ప్రదర్శించే టప్పుడు వాగ్నర్ వయసు అరవై అయిదు .నరాల వ్యాధి వచ్చింది .గుండె జబ్బు చోటు చేసుకొన్నది .దద్దుర్లు వచ్చాయి ఒళ్ళంతా .ఇటలీ లోని ప్రశాంత చల్లని వాతావరణం లో ఉండాలని వెళ్ళాడు ముందు నేపుల్స్ చేరి తర్వాత పలేర్మో వెళ్లి అక్కడ పార్సిఫాల్ సంగీతం పూర్తీ చేశాడు .అక్కాడ హార్ట్ ఏటాకులు వచ్చి మళ్ళీ జర్మనీ వచ్చేశాడు .ఉండలేక వెనిస్ వెళ్ళాడు .అక్కడ వెండ్రామిని పాలెస్ లో ‘’సింఫనీ ఇన్ సి ‘’మీద పని చేసి ‘’ఆన్ ది ఫెమినైన్ ఇన్ హ్యూమన్ నేచర్ ‘’పై ఒక కరపత్రం రాశాడు .తీవ్రమైన పని ఒత్తిడిలో ఉండగా చివరిసారిగా గుండెపోటు వచ్చి 13-2-1883 న వాగ్నర్ 70 వ ఏట మరణించాడు .అతని నోటి వెంట వచ్చిన చివరిమాటలు ‘’’’లీబ్ –ట్రాజిక్ ‘’ అంటే ప్రేమ- విషాదం ‘’అనే మాటలు .ఈ రెండే అతని జీవితం లో పెనవేసుకొన్న విషయాలు
వాగ్నర్ లోని రచయితను అతనిలోని సంగీతాన్ని వివిడిగా చూడలేము .’’the poet is a poor second best ‘’అన్నారు అందుకే .పురాతన ఉత్తర గాధా కవిత్వాన్నిఎంచుకొని ,స్కోపెంహార్ ఫాటలిజం అంటే విదిబలీయం ,జరిగేది జరక్క మానదు అనేదాన్ని కలిపాడు .అతని సంగీతాన్ని ‘’instinctive antipathy ‘ అన్నారు అతనికవిత్వం లో మార్మికత ఎక్కువై ప్రజలకు సన్నిహితం కాలేక పోయిందన్నారు .కొన్ని సందర్భాలలో జర్మన్ ఫిలాసఫర్ కవి’’ గోదే ‘’ను కూడా మించి ముందుకు వెళ్ళాడు .కాని అతని సంగీతం ప్రపంచాన్ని ముంచేసింది .ముఖ్యం గా ఒపేరా సంగీతానికి కొత్త ద్వారాలు తెరిచాడు .అంతకు పూర్వం ఎన్నడూ లేని మహోన్నత వైభవాన్ని సాధించి దిగ్భ్రాంతి కల్గించాడు .తరువాతి వారు మొదట్లో అతని శైలిని కాదనుకొన్నా అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయారు .వాగ్నర్ స్టైల్ కు ఉన్న శక్తి అమోఘం .ఆర్కేస్త్రాకు ఉన్న వనరులనన్నిటినీ విస్తృత పరచాడు .సృజనాత్మక కళకు ప్రాదాన్యమిచ్చాడు .మానసికం గా గుండేలోతుల్ని స్పృశించింది వాగ్నర్ సంగీతం .కొత్త సంగీత రూపాన్ని ఆవిష్కరించి సంగీతానికి అర్కేస్ట్రాకు ప్రాధాన్యత తెచ్చి మార్గ దర్శి అనిపించుకొన్నాడు .’’The establishment of ‘’’.a new musical form ,the invention of a vast musical language ,and the total splendor of his achievement have the assurance of timelessness ‘’అలాంటి కాలాతీత సంగీతాన్ని అందించి చిరస్మరణీయుడైనాడు రిచార్డ్ వాగ్నర్ .
వాగ్నర్ మధుర శ్రావ్య సౌష్టవ సమ్మేళనాన్ని సాధించాడు సంగీతం లో .సాంప్రదాయక ధ్వని వాచ్యాల పరిధులను విస్తరింప జేశాడు .తాళానికి స్వరానికి ప్రాధాన్యతనిచ్చాడు .వాటి ఉనికికి కొత్త అర్ధాలు వెతికి ప్రదర్శించాడు .ఇదే ఇరవై వ శతాబ్దపు ‘’ఎటోనాలిటీ’’అయింది అంటే సంప్రదాయ స్వరాలకు మంగళం పాడి స్వర రాహిత్యానికి పట్టాభిషేకం చేశాడన్నమాట .అందుకే ఆధునిక పాశ్చాత్య సంగీతానికి వాగ్నర్ జనకుడు అని,అతని ట్రీస్టాన్న్ ‘’లో దీన్ని సృష్టించాడని అన్నారు .అందుకని దీన్ని ‘’త్రీస్టాన్ కార్డ్ ‘’అన్నారు .అంటే’’ త్రీస్టాన్ శృతి అన్నమాట .
వాగ్నర్ కచేరీల నిర్వహణలో అభ్యాసం లో ప్రదర్శనలో ఉత్తమ విలువలతో కూడిన సిద్ధాంతాలను జోడించి ఆదర్శం గా నిలిచాడు .సంగీత సమ్మేళనం తో ఒక అపూర్వమైన అభిరుచిని ఆనందాన్ని మానసిక తృప్తిని ,పరిధికి మించిన అలౌకిక ఆనందాన్ని కల్గించాడు .అతనంటే ఇష్టపడని వాళ్ళే అతని ప్రతిభకు జోహార్లు పలికి అంతకంటే ఇంక ఏమీ లేదని చెంపలేసుకొన్నారు జర్మన్ బ్యాండ్ రామేస్తీన్ ఎలెక్ట్రానిక్ కంపోజర్ క్లాస్ శుజ్ మొదలైన వారందరూ వాగ్నర్ ను అనుసరించిన వారే .
[Wagner’s] protean abundance meant that he could inspire the use of literary motif in many a novel employing interior monologue; … the Symbolists saw him as a mystic hierophant; the Decadents found many a frisson in his work.
వాగ్నర్ సంగీత ప్రభావం 20 21 శతాబ్దపు సినిమా పై విపరీతం .హిట్లర్ స్వయం గా వాగ్నర్ కచేరీలకు హాజరై అందాన్ని అనుభవించేవాడు .తానుకోరుకొంటున్న జర్మనీని వాగ్నర్ సంగీతం లో సృస్తిస్తున్నాడని మెచ్చాడు .వాగ్నర్ భావాలు నాజీలు అనుకరించారు .1933-34లో నాజి కాన్సన్ ట్రేషన్ కాంప్ లలో వాగ్నర్ సంగీతాన్ని వినిపించి బంధితుల ఆలోచనా సరళిలో మార్పు తెచ్చి వారిలో జాతీయ భావం కలిగించేవారట .రెండవ ప్రపంచ యుద్ధ నాజీ డెత్ కాంప్ లలో వాగ్నర్ సంగీతం వినిపించేవారట .ఇదీ ఆధునిక సంగీత సృష్టికర్త రిచార్డ్ వాగ్నర్ జీవితం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-2-15-ఉయ్యూరు