గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
501- వేమన శతకాన్ని సంస్కృతీకరించిన –ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్ (1921)
ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్21-6-1921తమిళనాడులో జన్మించాడు సంస్కృత తమిళ ఆంగ్లభాషలలో నిష్ణాతుడైన పండితకవి .లెక్చరర్ గా చేరి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాడు .ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ ,దేశికన్ ప్రతిభా పాండిత్యాలు గుర్తించి ,రాష్ట్రప్రభుత్వ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి శాఖకు ప్రత్యేక ఆఫీసర్ గా నియమించాడు .ఇందులో పని చేసిన 13 సంవత్సరాలలో దేశికన్ ప్రాచీన సంస్కృత ఆయుర్వేద గ్రంథాలను అనువదించటం లో గొప్పపరిశోధనా కృషి చేశాడు .ఇందులో 25 వేల శ్లోకాలున్న అష్టాంగ సంగ్రహం ,6,400 శ్లోకాల లో 6 భాగాలుగా ఉన్న చరక సుశ్రుత సంహిత లున్నాయి .వీటిని ఆయుర్వేద కాలేజిలో దేశ వ్యాప్తంగా పాఠ్య గ్రంథాలను చేశారు .అంతటి అమోఘ కృషి చేశాడు దేశికన్ .
నాటి భారత రాష్ట్ర పతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ను దేశికన్ సంస్కృత పరిపుస్టి,అనువాదాలకు ఒక సంస్కృత కమిషన్ ఏర్పాటు చేయమని కోరగా ,వెంటనే అంగీకరించి ఏర్పాటు చేయించి ఆకమిషన్ ఇచ్చిన సూచనలను అమలుపరచి తగినంత నిధులను విడుదల చేయించి సంస్కృత విద్యా పీఠాలను ఏర్పరచి సంస్కృత విద్యకు అందులో రిసెర్చ్ కి ప్రోత్సాహం కల్పించారు .
దేశికన్ శ్రీ వెంకటేశ్వర ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్1943నుండి 45వరకు 1972నుంచి 75వరకు మూడేళ్ళు ,రిసెర్చ్ ఆఫీసర్ గా సేవలందించాడు .1980లో తంజావూర్ సరస్వతిమహల్ గ్రంథాలయ౦ కు గౌరవ సంపాదకునిగా ,1988లో చెన్నైలోని ప్రభుత్వ మాన్యుస్క్రిప్త్స్ లైబ్రరీకి గౌరవ సలహాదారుగా ఉన్నాడు .ఆయుర్వేద విద్యకు చేసిన మహత్తర సేవకు కంచికామకోటి పీఠం ఆయనకు ‘’ఆయుర్వేద భారతి ‘’,శ్రీరంగం లోని శ్రీమద్ అండావన్ ఆశ్రమం ‘’అభినవ సుశ్రుత విస్తృత ‘’బిరుదులను ప్రదానం చేసి గౌరవించాయి .1971లో రాష్ట్రపతి శ్రీ వి. వి .గిరి దేశికన్ సంస్కృత విద్వత్తుకు రాష్ట్రపతి పురస్కారం అందించారు .1993లో తమిళనాడు ప్రభుత్వం అత్యుత్తమ’’ కలైమణి ‘’పురస్కారమిచ్చి సత్కరించింది .
ఆయుర్వేదం లో అపారమైన కృషి చేసిన దేశికన్ సంస్కృతం లో ‘’దేశిక మణి శతకం ‘’రాశాడు .తిరుక్కురళ్ ,నాలాదియార్ ,పాతుప్పట్టు ,ఎట్టుతోగై ,శిలప్పాదికారం ,అవ్వయ్యార్ నీడి ,తిరుప్పావై ,సుబ్రహ్మణ్య భారతి రచనలన్నీ దేశికన్ సంస్కృతం లోకి అనువదించి సుసంపన్నం చేశాడు .6వేల శ్లోకాల భరతుని నాట్య శాస్త్రాన్ని తమిళం లోకి అనువదించిన ఘనత దేశికన్ ది .
అవ్వయార్ తమిళ రచన నీడిని అవ్వయ్యార్ నీతి గా శిలప్పాదికారంను నూపుర కావ్యంగా ,నాలాదియార్ ను సంస్కృతం లోకిఅనువదించి ఇంగ్లీష్ ,తమిళాలలో వ్యాఖ్య ,తిరుక్కురళ్ ను రెండుభాగాలుగా సంస్కృతం లోకి అనువాదం చేసి ఇంగ్లీష్ తమిళాలలో వ్యాఖ్య ,గోదాదేవి తిరుప్పావైకి ,కంబరామాయణం బాలకాండ కు సంస్కృతానువాదం,సుబ్రహ్మణ్య భారతి రచనలను –భారతీయార్ కావ్య సంస్క్రుతానువాద గా అనువాదం చేశాడు .
జనవేమన రాసిన శతక పద్యాలను 1-మూర్ఖ పధ్ధతి 2-దా౦భిక పధ్ధతి 3-విద్వత్పద్ధతి 4- ఆర్థ పధ్ధతి శీర్షికలతో సంస్కృతం లోకి అనువదింఛి రాష్ట్రపతి గిరిగారికి అంకితమిచ్చాడు దీనికి ముందుమాట బీహార్ గవర్నర్ అనంత శయనం అయ్యంగార్,ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ బూర్గుల రామ కృష్ణారావు గార్లు రాశారు .ఇద్దరూ కూడా దేశికన్ సంస్కృత అనువాదం అత్యంత సుందరంగా ,సరళంగా, మూలానికి విధేయంగా సాగిందని మెచ్చుకున్నారు .
ఒక్కో భాగం లో కొన్ని శ్లోకాలు రుచి చూద్దాం –
1-మూర్ఖ పధ్ధతి –
1-బ్రహ్మజ్ఞానాత్ భవేద్విప్రః -తద్విహీనో ద్విజేతరః –శ్రుతి సిద్ధమిదం-జ్ఞాన జ్ఞానాద్వాల్మీకి ర్బ్రహ్మతాం యయౌ ‘’
97-శాస్త్రాభ్యాసన మాత్రేణ మూర్ఖో –న గుణ వాన్ భవేత్ –సుగంధ వస్తు భరణాత్ శ్రేస్టే నస్యద్ధాయా ఖరః ‘’
2-దాంబిక పధ్ధతి
2-జ్ఞాతుం హరిం బహూన్ –దేశానటిత్వా నిష్ప్రయోజనః –కపటే తపసి స్తిత్వా –నశ్యంతి బకవద్ వృధా ‘’
98-నీచం చ వైష్ణవం కృత్వా- విప్రవర్య౦ వదంతి తమ్-గంగాజలస్య సంబంధాత్ శుద్దే న స్యాత్ సురా ఘటః’’
3-విద్వత్పద్ధతి
3-మూలే బ్రహ్మో పరేవ్యోమ్ని వేదాంతేప్యేక రూపతః –జ్ఞానం యదాస్తి తత్ప్రాప్య బుధః శివ పదం వ్రజేత్
95-శాస్త్రేణ స్వానుభూత్యా వా విద్వాన్ విగత సంశయః –నిశ్చలం దీపకలికా తుల్యం తత్వం ప్రపద్యతే ‘’
4-ఆర్యపద్ధతి
4-అసత్యం సర్వదా యస్తు కథ యేత్ –తస్య మందిరే –న తిస్టతిధృవం లక్ష్మీః జలం భిన్నఘటే యథా’
95-అహో దుఃఖం దరిద్రస్య న కంచి ద్గణ యేన్నరః – దుఖితే ధనికే ఖేద మపహ్య ఇతి భాషతే ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-9-19-ఉయ్యూరు
మీరు కొట్ చేసిన నాలుగు శ్లోకాలకు మూల తెలుగు పద్యాలు దయచేసి చెప్పండి.