కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు
శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి ఆవిష్కరించాలని భావించిన
1-ఊసుల్లో ఉయ్యూరు పుస్తకాన్ని మా గురువరేణ్యులు బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు శ్రీమతి సీతమ్మ గారు దంపతులకు అంకిత మివ్వాలని భావిస్తున్నట్లు,అనుమతించమని గురుపుత్రులకు తెలియ జేయగానే ,, కోట సోదరులు శ్రీ చంద్ర శేఖర శాస్త్రి, శ్రీ రామకృష్ణ ,శ్రీ గాయత్రిప్రసాద్ ,శ్రీ సీతారామాంజనేయులు గార్లు వెంటనే అంగీకారం తెలియ జేసినందుకు
2-మా కేరళ వగైరా యాత్రా విశేషాలను పుస్తక రూపం లో తెస్తున్నామని తెలిసిన వెంటనే అప్పుడు మాతో పాటు యాత్రలో పాల్గొన్న మాకుటుంబ మిత్రురాలు ,సరసభారతి కార్యవర్గ సభ్యురాలు ,”మా అన్నయ్య ”కవితా సంకలనం స్పాన్సర్ అయిన శ్రీమతి సీత0 రాజు మల్లిక గారు ఈపుస్తకానికి కూడా తానే స్పాన్సర్ గా ఉంటానని ఐచ్చికంగా ముందుకు వచ్చినందుకు
కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్ -11-9-19