కూచిపూడి నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో మరణం
అఖిలభారత కూచిపూడి నాట్యకళా మండలి కార్యదర్శి ,కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో 7-5-21శుక్రవారం కూచిపూడి లో మరణించారు .1952లో జన్మించి,తిరుపతిలో సంస్కృతం లో బి.ఎ డిగ్రీ పొందిన కేశవప్రసాద్ ,కృష్ణాజిల్లా పరిషత్ హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేసి రిటైరయ్యారు .నాట్య కుటుంబానికి చెందిన ప్రసాద్ అఖిలభారత కూచిపూడి నాట్యకళా మండలి స్థాపించి కార్యదర్శిగాఎంతో కళా సేవ చేసి ఎన్నో భాషల నాత్యకలాకారులను ఆహ్వానించి ప్రదర్శనలు ఇప్పించి అందరి ప్రశంసలు అందుకున్నారు 1978నుంచి 83వరకు సిద్ధేంద్ర కళాక్షేత్రం లో డాన్స్ అసిస్టెంట్ గా పని చేశారు .1800లకు పైగా ప్రదర్శనలిచ్చి మార్గదర్శి గా ఉన్నారు ,శ్రీ వేదాంతం రత్తయ్యశర్మ ,డా.చింతా రామనాధం ,శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ ,పద్మశ్రీ డా.వెంపటి చినసత్యం వంటి నాత్యాచార్యులతో కలిసి పని చేసిన నాట్య గురువు కేశవ ప్రసాద్ .
.సరసభారతి పురస్కారం తో పాటు అనేక పురస్కారాలు పొందిన కేశవ ప్రసాద్ మరణం కళా రంగానికి తీరని లోటు .ఆత్మీయత ,ఆప్యాయత ,గౌరవం సంస్కారం,సౌజన్యం మూర్తీభవించిన కళా మూర్తి కేశవప్రసాద్ .-నాకుసరసభారతికి మంచి ఆత్మీయుడు .అయన ఆత్మకు శాంతి కలగాలని భావిస్తూ ఆకుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్ -8-5-21


కూచిపూడి నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ గారి అకాల మరణం చాలా బాధాకరమైన విషయము. వారి కుటుంబీకులకు మా ప్రగాఢ సంతాపములు.
ఆర్. వి. యస్. చౌదరి, హైదరాబాదు
LikeLike