చతురామ్నాయ పీఠాలు
శ్రీ శ౦కర భగవత్పాదులు స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాలలోశృంగేరి పీఠం అతి ప్రాచీనమైనది .క్రీ శ 1331నుంచి -1386వరకు శృంగేరి 12వ పీతాఠాధ్యక్షులుగా శ్రీ విద్యారణ్యస్వామి ఉన్నారు అంతకు ముందున్న 11 గురి పేర్లు తెలియవు .క్రీశ.773న శ్రీ విశ్వ రూపాచార్య నిర్యాణం చెందాక ఆయనే ఈ పరంపరకు మొదటి పీతాచార్యుడు అయి ఉంటాడు .ఈయన క్రీ.పూ.27 న శంకరాచార్యస్వామి ఆదేశం పై మొదటి ఆచార్యుడైనాడు అని శృంగేరి పీఠం తెలియజేసింది .వీరిలెక్క ప్రకారం శంకరులు క్రీ.పూ.11న సిద్ధిపొందారు .కనుక శంకరాచార్య ఉండగానే ,శంకరుల 16వ ఏట విశ్వరూపుడు పీఠాధిపతి అయ్యాడు .ఆతర్వాత 16 ఏళ్ళు శంకర భగవత్పాదులు జీవించారు .ఈ లెక్క ప్రకారం విశ్వ రూపుడు క్రీ.పూ.27నుంచి ,క్రీశ .73వరకు పూర్తిగా 300 సంవత్సరాలు జీవించి ఉన్నట్లు తెలుస్తోంది .’’ఇదంతా అసంభవం ,ఆయన బతికింది కేవలం 80ఏళ్ళు మాత్రమె అనీ కనుక శంకరులు క్రీశ 7 వ శతాబ్ది వాడు’’ అని పండిట్ ఎన్.భాష్యాచార్య ‘’ ది ఏజ్ ఆఫ్ శంకరాచార్య ‘’గ్రంథం లో ఊహింఛి చెప్పాడు .
శృంగేరి పీఠాన్ని అధిష్టించిన ఆచార్యులలో క్రీ.శ.6 శతాబ్దికి చెందిన9వ పీఠాధిపతి.విద్యాశంకరులు సిద్ధిపొందాక ,సుమారు 800ఏళ్ళు పీఠానికి అధ్యక్షులే లేరని ,14వ శతాబ్ది విద్యాతీర్ధ అభిమతం ప్రకారం విద్యారణ్యస్వామి తనగురువైన భారతీ కృష్ణ తీర్ధుని పీఠాదిపతిని చేశాడని శ్రేష్టులూరి క్రిష్ణస్వామయ్య తన జగద్గురు శ్రీ శంకరాచార్య చరిత్రం లో రాశాడు .భారతీ కృష్ణ తీర్ధుడు ,శంకరానంద విద్యాతీర్దుల శిష్యుడనీ,విద్యారణ్యుల సోదరుడు అనీ చెప్పాడు .విద్యాతీర్ధుడు కుంభకోణం, కంచి కామకోటి పీఠాల అధ్యక్షుడై ,జీర్ణమైన శృంగేరి పీఠాన్ని విద్యారణ్యుని ద్వారా పునరుద్ధరించాడని కొందరంటారు .విద్యారణ్యుడు శృంగేరి స్వామియే అనీ ,కామకోటి పీఠానికి తీర్ధ సంప్రదాయం లేదని మరికొందరి వాదం .ఇవన్నీ ఆలోచిస్తే ,క్రీ.శ 773నుంచి శృంగేరికి క్రమరీతిలో ఆచార్యులు వారికాలాలు ఉన్నాయికనుక త్రోసివేయటానికి వీల్లేదు.అన్ని వాదాలకు స్వస్తి చెప్పి ,శంకరాచార్యుల వారి తర్వాత ఈ పీఠానికి విశ్వరూపాచార్యుడే అధిపతిఅయి .క్రీ శ.778వరకు నిత్యబోధ ఘనాచార్యుడు అధ్యక్షుడు అయ్యేదాకా కాలక్షేపం చేసి ఉంటాడు అనుకొంటే ఇబ్బంది లేదన్నారు శ్రీ అనుభవానంద స్వామి .ఈ అసంపూర్ణ ఆచార్య పరంపరను సమన్వయపరచి శంకరాచార్య క్రీశ.788లో జన్మించారని మాక్స్ ముల్లర్ చెప్పిన మాట సరైనదే అన్నాడు కృష్ణస్వామి అయ్యర్ .
ద్వారకలోని శారదా పీఠం ప్రకారం శంకరాచార్య యుధిష్టిర శకం 2633వైశాఖ శుద్ధపంచమి పునర్వసు నక్షత్రం నాడు జన్మించినట్లు ,2636లో ఉపనయనం,2639లో సన్యాసం ,2640లో గోవింద భగవత్పాదులవద్ద బ్రహ్మోపదేశం ,2638కార్తీక బహుళ త్రయోదశినుంచి ,మాఘ శుద్ధ దశమి వరకు ద్వారకా పీఠ స్థాపన 2648 ఫాల్గుణ శుద్ధ నవమి నుంచి శృంగేరి పీఠ ప్రతిష్ట 2649లో మండన మిశ్రునికి సన్యాస మిచ్చి ద్వారక పీఠాధ్యక్షుని చేశారని ,2654లో హస్తామలకుని శృంగేరి పీఠాధిపతిని చేశారనీ ,2655లో పూరీ గోవర్ధన పీఠ స్థాపన చేసి పద్మపాదుని ఆచార్యునిగా చేశారనీ ,యుధిష్టిర శకం 2666కార్తీక పౌర్ణమినాడు శంకరులు సిద్ధిపొందారని ఉంది .అంటే క్రీ.పూ.50లొ జన్మించి క్రీపూ 472లో శంకరులు సిద్ధిపొందినట్లు నిర్ణయించారు .
పూరీపీఠ గురుపరంపరను బట్టి యుదిష్టిరశకం 2655వైశాఖ శుద్ధ దశమి నాడు జగన్నాధ పీఠాన్ని స్థాపించి శంకరాచార్య పద్మపాదుని ఆచార్యుని చేశారనీ ఉంది. ఇది గోవర్ధలో పీఠ లెక్కలకు దగ్గరలో ఉంది
బదరికాశ్రమ జ్యోతిర్మఠ పీఠ0చాలాకాలం శిధిలమై ఉండి ఇటీవలే పునరుద్దరింప బడటం వలన అక్కడి గురుపరంపర లభ్యం గా లేదు .
ఈనాలుగే కాక కంచిలోని కామకోటి పీఠం శంకరాచార్య స్థాపితమే అనె అభిప్రాయం ఒకటి ఉన్నది .దీన్ని బట్టి కలియుగ 2593నందన సంవత్సర వైశాఖ శుద్ధపంచమి ,పునర్వసు నక్షత్రంలో శంకర జననం అని ఉంది .’’పుణ్యశ్లోక మంజరి ‘’ప్రకారం కలియుగం 2625రక్తాక్షి సంవత్సర అంటే క్రీ.పూ.77 శుద్ధ ఏకాదశి నాడు శంకరులు బ్రహ్మైక్యంచెందారు .కామకోటిలోని ‘’గురు రత్నమాల ‘’కూడా వీటినే సమర్ధించింది.
1- శృంగేరి మఠం క్రీ.పూ.43నుంచి క్రీ.పూ 11వరకు 2-కామకోటి పీఠం క్రీ.పూ.508-509,క్రీపూ 477వరకు ,3-ద్వారక పీఠం-క్రీ.పూ 50నుంచి క్రీ.పూ.473వరకు ,4-గోవర్ధన పీఠం కూడా ఇదే కాలం లో నే ఉన్నది .
ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి ‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’
శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -17-5-21-ఉయ్యూరు

