- అనుజన్ముండటంచు సంతతము నాకానందసంజాత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
- అనుపమ వీర సింహుడని ఆలులమందు ప్రశస్తి – పద్యం -మాధవపెద్ది
- అవశిష్ఠంబులు దీర్చి సర్వము పరిత్యాగము గావించి (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
- ఆలము సేయబూని నిటలాక్షుడు నన్నెదిరించు (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
- ఇటు ఇటు ఓ రాజా ఇటు ఎటు ఎటు ఓ రాజ ఎటు రారాదా – ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: డా. సినారె
- కలన జయింపలేక బలగర్వమడంగియు చింత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
- కలలన్ని ఫలియించె ఈనాడే తలపులు చిగురించె ఈ నాడే – పి.సుశీల – రచన: డా. సినారె
- కాళీచిత్తసరోజబంబహర గంగా శశాంక ప్రియా – వెంకట్రావు – రచన: తాండ్ర
- జపమేమి జేసెనో జనక మహారాజు కల్యాణరాముని కాళ్ళు (పద్యం) – ఘంటసాల – రచన:తాండ్ర
- జయ జయ జానకిరామ రఘుకుల సోమా పావన – ఘంటసాల,సరోజిని – రచన: రాజశ్రీ
- ధరణి శ్రీరామచంద్రుడే దైవమేని సీత భూజాత లోకమాత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
- నేనే నేనే మధుగీతి నవరసపూరిత నవవిలాసవతి నేనే – పి.సుశీల,ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: ఆరుద్ర
- పండెన్ దుష్టచతుష్ఠయంబునకు పాపంబు ఆపదలు (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
- పలికే రాగం పిలిచే భావం నేనేలే నింగిలోన నేలపైన నేనేలే – ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: డా. సినారె
- ప్రాంచితకీర్తిశాలి యగు పాండునృపాలుడు నాదు తండ్రి (పద్యం) – మాధవపెద్ది – రచన:తాండ్ర
- రామనామ సుధా మధురాతి మధుర పావానాక్షరసేవ (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
- రామా రఘుకుల సోమా.. శ్రీరామ జయరామా నీలనీరద కోమల – ఘంటసాల- రచన: తాండ్ర
- వీరుడనే ధీరుడనే వినవే ఓ భామా ఔనన్నా కాదన్నా – పి. శ్రీరామ్ – రచన: రాజశ్రీ
- సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందర ఏల – ఘంటసాల,పి.సుశీల – రచన: డా. సినారె
- సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికే నీవే ( బిట్ ) – ఘంటసాల,పి.సుశీల – రచన: డా. సినారె
- సురభామినీ సౌదామినీ కలహంస ఓలే ఇటురావే – ఘంటసాల – రచన: డా. సినారె
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –236
236-వెయిట్ లిఫ్టింగ్ను అంతర్జాతీయ స్థాయికి చేర్చి ,9స్వర్ణ ,12జాతీయ అవార్డ్ లు పొంది ,ఆసియాక్రీడలలో రజతం పొంది ,హేల్సేంకి ,వార్సా ,మెల్బోర్న్ ,జకార్తా పోటీలలో ప్రధమ స్థానం పొంది ,భీమాంజనేయ యుద్ధం లో ఆంజనేయుడు గా నటించిన అర్జున అవార్డ్ గ్రహీత –కామినేని ఈశ్వర రావు
• జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో, కృష్ణా జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళిన ఘనత, అర్జున అవార్డు గ్రహీత శ్రీ కామినేని ఈశ్వరరావు గారికే దక్కుతుంది. భారతదేశంలోని అనేక నగరాలలో, భారత వెట్ లిఫ్టింగ్ ఫెడెరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో 9 పసిడి పతకాలూ, భారతదేశంలో 12 జాతీయ రికార్డులను సాధించిన మొదటి భారతీయుడు శ్రీ ఈశ్వరరావు కావటం విశేషం.[మూలాలు తెలుపవలెను]
• వీరు భట్ల పెనుమర్రు గ్రామంలో 1926, ఆగస్టు-28వ తేదీన ఒక రైతు కుటుంబంలో జన్మించారు. వెయిట్ లిఫ్టింగ్ లో గోసాలలోని గురువు శ్రీ రంగదాసుగారి వద్ద, శిక్షణ పొందినారు. జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కోల్ కతా, చెన్నై, ముంబై, కొత్త డిల్లీ, జబల్ పూర్ మొదలగు నగరాలతో పాటు, విదేశాలలోని హెల్సింకీ (ఫిన్లెండు), వార్సా (పోలెండ్), మెల్బోర్న్ (ఆస్ట్రేలియా), జకార్తా (ఇండోనేషియా) మొదలగు చోట్ల జరిగిన పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారు. 1951లో కోల్ కతాలో జరిగిన అన్ని విభాగాలలోనూ, శరీర సౌష్టవ పోటీలలోనూ, పసిడి పతకాలు సాధించారు. 1963లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా “అర్జున” అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు.
• ఎన్నో రికార్డులు:- 1951లో ఆసియా క్రీడలలో, ఇంతవరకూ ఏ భారతీయుడూ సాధించని రజత పతకాన్ని ఈయన వెయిట్ లిఫ్టింగులో సాధించారు. దేశంలో 12 జాతీయ రికార్డులు, ఆసియా ఖండంలో 4 రికార్డులు స్థాపించిన తొలి భారతీయుడు. ఈయన కృష్ణా జిల్లా క్రీడా సంఘానికి కార్యదర్శిగా పనిచేశినారు. వీరికి చలనచిత్ర రంగంలో గూడా ప్రవేశం ఉంది. “భీమాంజనేయ యుద్ధం” అను చిత్రంలో వీరి ప్రత్యర్థి శ్రీ దండమూడి రాజగోపాలరావుతో పోటీగా ఆంజనేయ పాత్ర ధరించి పలువురు ప్రశంసలు పొందినారు. వీరు 1977, నవంబరు-7న గుండెపోటుతో కన్నుమూశారు.
• కుటుంబ నేపథ్యం:- వీరి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కె.పిరావు, హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. కుమార్తె శ్రీమతి వసుంధర, విజయవాడలో గృహిణిగా ఉన్నారు.
• యోధానుయోధులు:- గతంలో ఆంధ్రప్రదేశ్ లో, వెయిట్ లిఫ్టింగ్ అంటే కృష్ణాజిల్లా నే గుర్తుకు వచ్చేది. జిల్లాకు చెందిన శ్రీ కామినేని ఈశ్వరరావు, శ్రీ దండమూడి రాజగోపాలరావు వంటి యోధానుయోధులు, జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకొని వచ్చారు. వీరితోపాటు బొబ్బా వెంకటేశ్వరరావు, ఎం.పి.రంగా, మాదు వెంకటేశ్వరరావు, సంపత్, రామస్వామి, అచ్యుతరావు వంటి ఎందరో వెయిట్ లిఫ్టర్లు 1945-70 మధ్య జిల్లాకు మంచిపేరు తీసుకొని వచ్చారు.
• మహాలక్ష్మీ మూవీస్ వారి భీమాంజనేయ యుద్ధం చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకుడు వి.వి.రామచంద్ర. ఈ చిత్రంలో భీముని పాత్రను దండమూడి రాజగోపాల్, ఆంజనేయుని పాత్రను కామినేని ఈశ్వరరావు ధరించారు. ఇంకా ఈ చిత్రంలో ద్రౌపదిగా ఎస్.వరలక్ష్మి, నలకూబరునిగా కాంతారావు, రంభగా కాంచన, సౌదామినిగా రాజశ్రీ, మరియూ కైకాల సత్యనారాయణ, రమణారెడ్డి మొదలైనవారు నటించారు. ఈ చిత్రానికి తాండ్ర సుబ్రహ్మణ్యం కథను అందించగా, కె.వి.నాగేశ్వరరావు కళాదర్శకత్వం, టి.వి.రాజు సంగీతం నిర్వహించారు.
• చలం నారదుడిగా
• ఈ చిత్రంలో హాస్య నటుడు చలం నారదుడు పాత్రలో కనిపిస్తాడు. చలం ఈ పాత్ర వెయ్యటం అదే మొదటిసారి చివరిసారి కూడా!
•
పాటలు, పద్యాలు