కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -2

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -2
విద్యాభ్యాసం
బంట్వాల్ పట్టణలక్షణాలన్నీ ఉన్న పల్లె ప్రాంతం .అక్కడి సుమారు 40సారస్వత బ్రాహ్మణ కుటుంబాలలో పంజే కుటుంబం ముఖ్యమైంది .రామప్పయ్యగారి పిల్లలు దైవభక్తీ సరస సౌజన్యాలకు పేరుపొందారు .పెద్దన్న కృష్ణారావు అభిప్రాయాలు,అలవాట్లలో గంభీరుడు .మంగేష్ రెండవ వాడు .తమ్ముళ్ళు శివరావు ,శ్రీనివాసరావు ,రాఘవేంద్ర ,తండ్రి చనిపోయేనాటికి పసి బిడ్డ చిన్న తమ్ముడు అందరూ మెరికల్లాంటి వాళ్ళు .చుట్టుప్రక్కలవారితో కలుపు గోలుగా ఉండేవారు .పచ్చని వాతావరణం ,నేత్రావతి సోయగాలు వారిని ఆకర్షించేవి .పంజే కు చురుకు తక్కువ .ఈత బాగా వచ్చినా చిన్నతమ్ముడు మునిగిపోతుంటే రక్షించటానికి వెళ్లి తానె మునిగాడు ..శంకర్ కూడా దూకి మునిగిపోగా దారిలో వెళ్ళే వారొకరు చూసి అందర్నీ కాపాడాడు .పంజే దైవభక్తితో ఇంట్లో ,గుడిలో నేర్చిన మంత్రాలుచదువుతూ ఉండేవాడు .తల్లినుంచి మరాటీ ,కన్నడ భక్తీ గీతాలు,సూక్తులు నేర్చాడు .స్వరం బాగుండేది .హాస్యంగా మాట్లాడి అందర్నీ నవ్వించే వాడు .ఆశుకవిత్వం లో పంజే సోదరులు దిట్టలు .సమస్యా పూరణం లో ఘటికులు .
పంజే తనకు వచ్చిన చదువు ఇతరులకు సులభంగా బోధించేవాడు .ఆయన ముఖ్యోపాధ్యాయుడుగా ఉన్న స్కూల్ లో ఆయన స్నేహితులు అనుసరించేవారు .ఆయన కవితా ప్రయోగాలు చాలాకాలం అక్కడి వారు జ్ఞాపకం ఉంచుకొన్నారు .ఇంటిపనులలో తల్లికి సాయం చేసేవాడు .స్వామి రధోత్సవానికి స్నేహితుల్ని పోగు చేసి హడావిడి చేసేవాడు .
ఉన్నత విద్యకోసం మంగుళూరులో తల్లివైపు బంధువుల ఇంట్లో ఉన్నాడు .మంచి స్కాలర్షిప్ లు పొందాడు .ప్రైవేట్లు చెప్పి కావలసిన డబ్బు సంపాదించేవాడు .కాగితంతో సహా అన్నిటికి కటకట.ఒకే పేజీలో రెండు సార్లు రాసేవాడు .గీతకు గీతకు మధ్య ఇంకు మార్చి రాసేవాడు .తనదగ్గర లేనిపుస్తాకాలు ఇతరుల దగ్గర తెచ్చి చదివి ఇచ్చేసేవాడు .జ్ఞాపక శక్తి,ధారణా బాగా ఎక్కువ .1892లో దాయాదుల వ్యాజ్యాలతో కలత చెంది తండ్రి చనిపోయాడు .వార్త తెలిసి అప్పటికే చివరి పడవ వెళ్ళిపోగా నడుచుకుంటూ వెళ్లి తండ్రిని చివరి చూపు చూసి ఆశీర్వాదం పొందాడు .చనిపోతూ తండ్రి ‘’మద్య౦ ముట్ట వద్దు . నిర్మలంగా నిజాయితీగా జీవించు. అన్నదమ్ముల్నిఅక్క చెల్లెళ్ళను జాగ్రత్త గా చూసుకో ‘’అని హితవు చెప్పాడు .చివరిదాకా నిజాయితీగా వీటిని పాటించాడు .
పెద్దన్న మద్రాస్ లో చదివి డిగ్రీ పొంది ,పెళ్లి చేసుకొని బొంబాయి స్టేట్ లో ఉద్యోగం లో చేరాడు .క్షణం తీరిక ఉండేదికాదు అన్న కృష్ణారావు కు .1894లో పంజే ఒక ప్రసిద్ధ కన్నడ పండితుడి చెల్లెల్ని పెళ్ళాడి ,ఎఫ్ ఎ పాసై పై చదువు కు కుటుంబ పోషణకు ప్రయత్నాలు చేసి ,లెక్కలలో డిగ్రీ పొందాలని ఉన్నా ,మంగుళూరు లో ఉన్న ఒకే ఒక డిగ్రీ కాలేజి సెయింట్ ఎలోషియస్ కాలేజిలో కన్నడ చరిత్ర అర్ధ శాస్త్రాలతో తృప్తి పడాల్సి వచ్చింది .పూర్తిగా డిగ్రీ పొందకుండా నే రెండు పార్ట్లు పాసై ,ప్రభుత్వకాలేజిలో సహోపాధ్యాయుడుగా ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండటం వలన చేరి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు .
ఉద్యోగం
పై ఉద్యోగానికి పంజే తో పోటీపడింది నందలికే లక్ష్మీ నారాయణప్ప తర్వాత కన్నడ సాహిత్యానికి గొప్ప సేవ చేసినవాడు .వీరిద్దరూ ఒకరికొకరు పోటీ అని తెలియదు .నందకిలే కు తనవలన అవకాశం పోయిందని తెలుసుకొని పంజే ఆయనకు ఒక తియ్యటి లేఖ రాస్తూ ‘’వడ్లు దంచే రోకలిని కన్నడ సాహిత్యాన్నీ బోధించటానికి ఎన్నుకున్నారు .నెమలి పింఛం తో తయారైన చిత్రకారుని కుంచెను చెవిలో గూలి తీసుకోవటానికి వదిలిపెట్టారు ‘’అని రాశాడు ఆతర్వాత ఇద్దరూ మంచి మిత్రులయ్యారు .అనేక వేదికలపై ఆయన్ను’’దక్షిణ కన్నడ జిల్లాలో నిజమైన కవి ‘’అని కీర్తించాడు .
పంజే జీతం నెలకు 20రూపాయలు .తల్లి పెద్దన్నయ్య దగ్గరకు ,ఒకసోదరుడు చదువుకోసం మద్రాస్ కు వెళ్ళగా పంజే ,భార్య,పిల్లలే మంగుళూరులో ఉన్నారు .వచ్చిన దానితోనే గుట్టుగా సంసారం లాగించేవాడు .కొంతకాలాని పంజే సోదరులిద్దరూ చనిపోయారు .కు౦గి పోయాడు కాని నిగ్రహించుకొన్నాడు .ఒక కవితాత్మక తత్వ గీతం రాశాడు .పంజే హెడ్మాస్టర్ అయి , జీతం మరో పది పెరిగి కొంత ఇబ్బంది తగ్గింది .ఉపాధ్యాయుడుగా స్థిర పడాలంటే ఎల్టి కావాలి అందుకని మద్రాస్ లో బంధువుల ఇంట్లో భార్యా ,పిల్లల్ని ఉంచి, తాను దక్షిణ కన్నడ విద్యార్ధి కూటం లో చేరి తొమ్మిదినెలలలో ట్రెయినింగ్ పూర్తయి ఎల్టి డిగ్రీ తీసుకొని మంగుళూరు చేరి ,ప్రభుత్వోద్యోగం లో స్థిరపడ్డాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-22-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.