గీర్వాణకవుల కవితా గీర్వాణం -40

గీర్వాణకవుల కవితా గీర్వాణం -40

40-ధ్వన్యాలోక కర్త –ఆనంద వర్ధనుడు

ఆనంద వర్ధనుడు అనగానే ‘’ధ్వని సిద్ధాంతం ‘’జ్ఞాపకం వస్తుంది ధ్వని సిద్ధాంతంపై విపులమైన చర్చ చేసి ధ్వన్యాలోకం లేక ‘’కావ్యాలోకం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన వాడు ఆనంద వర్ధనుడు .ఇది అలంకార శాస్త్రం లో ఒక కుదుపుకుదిపి కొత్తమలుపుకు తిప్పింది .శ.  855-883 వాడిన ఈ ఆలంకరికుడు కాశ్మీర రాజు అవంతి వర్మ ఆ స్థానపండితుడు .ఆనంద వర్ధనుడు ఒక యుగ కర్త అయ్యాడు .ధ్వని యొక్క ప్రకాశమే ధ్వన్యాలోకం .ధ్వని అనే కాంతి దర్శనమే ధ్వన్యాలోకం .సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రిగారు దీనికి తెలుగులో విపులమైన వ్యాఖ్య రాశారు .ఆంగ్లం లో జెఫ్రీ మౌసఫ్ మాసన్  పట్వర్ధన్ లు అభినవ గుప్తుని లోచన వ్యాఖ్య ఆధారం గా  అనువదిస్తే హార్వర్డ్ యూని వర్సిటి ప్రెస్ 1990లో ప్రచురించింది .బిడ్యుత్ భరన్ ఘోష్ చేసిన వ్యాఖ్యానాన్ని సాంస్క్రిట్ పుస్తక భాండార్ వారు ముద్రించారు .

ఆనంద వర్ధనీయం

ధ్వన్యాలోకం లో నూట ఇరవై తోమ్మిదికారికలున్నాయి .వీటిని ధ్వనికారికలు అన్నాడు ఈ కారికలకు రాసిన వృత్తినే ధ్వన్యాలోకం అంటారు ధ్వనియోక్క ఆలోకనం అన్నమాట .దీనికి నూటయాభై ఏళ్ళ తర్వాత అభినవ గుప్తుడు ‘’లోచనం ‘’అనే మహా గొప్ప వ్యాఖ్య రాశాడు .కావ్య ప్రారంభం లో ఆనంద వర్ధనుడు ‘’పూర్వ ఆలంకారికులు కావ్యాత్మనే ధ్వని అన్నారు .కొందరు కాదన్నారు .కొందరు లక్షనాన్తర్గతం అన్నారు. కొందరు అది గోచరించదు అన్నారు .నేను ఇప్పుడు సహృదయుల సంతృప్తికోసం ధ్వని తత్వాన్ని వివరిస్తున్నాను ‘’అని చెప్పుకొన్నాడు .కాని కొందరు దేశీయ కొందరు విదేశీయ పండితులు ధ్వన్యాలోకం ఆనంద వర్ధనుడు రాయలేదన్నారు .అంతకు ముందే ధ్వని ఉందన్నారు

‘’ధ్వనినా గతి గభీరేణ  కావ్య తత్వ నివేశినా –ఆనంద వర్ధనః కస్య నాసీ దానంద వర్ధనః ‘’అన్నదాన్ని బట్టి సందేహ నివృత్తి కలుగుతోంది దీనిభావం –‘’అతి గంభీరమైన కావ్య తత్వ పరిపుష్టమైన ధ్వని యొక్క స్వరూప స్వభావాలను నిరూపించటం చేత ఆనంద వర్ధనుడు ఎవరికి ఆనంద వర్ధనుడు కాదు ?అలాగే ఇంకొక శ్లోకం లో ఉన్నదాన్ని బట్టి –

‘’సత్కావ్య తత్వ విషయం స్పురిత ప్రసుప్త –కల్పం మనస్సు పరిపక్వ దియాం యదాసీత్

తద్వ్యాకరో త్సహృదాయో దయ లాభ హేతో –రానండ వర్ధన ఇతి ప్రథితాభి దానః ‘’-అంటే ‘’పరిపక్వమైన బుదద్ధికల విపస్చిత్తుల మనస్సులలో స్పురించి ,,సుప్తావస్తలో ఉన్న కావ్య తత్వాన్ని సహృదయుల ఆనందానికి సహృదయుడు వ్యాఖ్యానించి చెప్పాడు ‘’.కనుక ఆనంద వర్ధనుడికి పూర్వమే ‘’కావ్యాత్మ ధ్వని’’అని ఉన్నాదని ,దాన్ని నిరూపించి పండితులను అంగీకరించేట్లు వ్యాఖ్యానించాడని భావం .కాణే,ఎస్ కే డే వింటర్ నిత్స్ పండితులు కారికలు రాసింది ‘’సహృదయ ‘’అనే పేరుగల వాడన్నారు ఈ కారికలు ఆనంద వర్ధనుడికి పూర్వమే నూట యాభై ఏళ్ళ కిందటనే ఉన్నాయన్నాడు డే .మొత్తం మీద మనకు తెలిసింది ఏమిటి అంటే అప్పటికే వ్యాప్తిలో ఉన్న ధ్వని ని సిద్ధాంతీకరించి వ్రుత్తి రాసి ప్రచారం లోకి తెచ్చిన వాడు ఆనంద వర్ధనుడు అనుకొంటే ఏ ఇబ్బందీ ఉండదు ఎవరితోనూ .

ధ్వన్యాలోక అవ్యక్త ధ్వని

ధ్వన్యాలోకం లో నాలుగు ఉద్యోతాలున్నాయి .మొదటిదానిలో ప్రాచీన అలంకారికులు ధ్వనిని గురించి ఏమేమి చెప్పారో వాటిని గురించి వాటిపై వచ్చిన ఖండనల గురిచి చెప్పి ధ్వని స్వరూపాన్ని ధ్వని భేదాలను ,గుణీ భూత వ్యంగ్యాన్ని తర్క భూమికపై వ్యాఖ్యానించాడు .తర్వాత ధ్వని నిరూపణ ప్రయోజనాన్ని వివరించాడు .అభినవ గుప్తుడు లోచన వ్యాఖ్యానం రాశాడని చెప్పుకొన్నాం .అతడు ‘’చంద్రిక అనే వ్యాఖ్యానాన్ని గురించి చెప్పి లోచనం లేక పొతే చంద్రిక ఉన్నా ‘’ఆలోకం ‘’కనపడదని చమత్కరించాడు .వర్ధనుడు తన రచనలైన దేవీశతకం, అర్జున చరిత్ర మహా కావ్యం ,విషమ బాణ లీల ,హరవిజయం నుంచే లక్షణాలకు ఉదాహరణలు ఇచ్చాడు .ఇందులో దేవీశతకం ఒక్కటే లభ్యం .విషమ బాణ లీల ,హరవిజయాలు ప్రాకృత భాషలో రాశాడు .

ఇంతకీ ధ్వని అంటే ఏమిటి?కావ్యం లో వాచ్య లక్ష్యార్దాలకంటే వేరైనది ఒకటి అంతరార్ధం గా భాసిస్తుంది .దాన్ని వ్యంగ్యార్ధం అని అంటారని అదే ధ్వని అని ఆనంద వర్ధనుడు నిర్వచించాడు .ధ్వని వాచ్య ,లక్షణార్దాలకంటే చమత్కార రంజకమై ఆనందాన్నిస్తుంది .ధ్వని రామణీయకత్వం సహృదయ వేద్యం .ఇది స్త్రీల అలంకారాల కంటే  భిన్నం గా ఉండే లావణ్యం లాంటిది .

‘’ప్రీతీయమాన  పునరన్య దేవా –వస్త్వ్యస్తి వాణీషుమహా కవీనాం

యత్తత్ ప్రసిద్దావయ వతి రిక్తం –విభాతి లావణ్య మివ అంగనాసు ‘’

‘’గంట కొడితే వచ్చే చెవులు భరించలేని టంకార ధ్వనికంటే దాని ఝంకార ప్రతిధ్వని ఆహ్లాదం కలిగించినట్లుగా ,గుణ , అలంకారాదులకంటే రమణీయమైన ప్రతీయమానమైన అర్ధం సహృదయ జనాలకు  ఆకర్షణీయం అవుతుంది ‘.అదే ధ్వని ‘’అని గంటకొట్టి ధ్వని సిద్ధాంతం లోని రహస్యాన్ని చెప్పాడు .ధ్వనియే కావ్యాత్మ అన్నాడు .ధ్వని లక్ష్య అర్ధాలలో దొరకదని ,దాన్ని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదని వారి అభిప్రాయాలను ఖండించాడు .తర్క ,పాండిత్య ఆధారాలుగా ధ్వని సిద్ధాంతాన్ని స్తాపించాడు .ధ్వనిలో ఉన్న అతి సూక్షమైన భేదాలను వివరించటం లో ఆతను తీసుకొన్న మార్గం మహా విశిష్టమైంది .ఉదాహరణలు లేకుండా ఏదీ చెప్పలేదు .ధ్వనిలో అభిదా మూల ధ్వని ,లక్షణామూల ధ్వని అని ధ్వనిలో రెండు భేదాలనాను వివరించాడు .భరతుని రస సిద్ధాంతమే రసధ్వని శ్రవ్య కావ్యాలకు అన్వయించ బడింది .వ్యంగ్యార్ధం అనే ముసుగు వేసుకొన్న రస సిద్ధాంతమే ధ్వని సిద్ధాంతం అనిపిస్తుంది .రసభావ సమన్వితమైన కావ్యాన్నే ఉత్తమ కావ్యం అన్నాడు .అలంకార రచన ఉత్తమ కావ్యం అని పించుకోదు అని స్పష్టం గా చెప్పాడు ఆనంద వర్ధనుడు .

ఎంతటివాడికైనా సమకాలీనులు అడ్డు తగలటం సర్వ సామాన్యం.ఇది ఆనంద వర్ధనుడికీ తప్పలేదు  .మొదట్లో పండితులు ధ్వని సిద్ధాంతాన్ని చూసి పెదవి విరిచారు .కాని కాలం గడిచిన కొద్దీ కావ్య సిద్ధాంతాలలో ధ్వని సిద్ధాంతమే ఉత్తమోత్తమమిందని తెలుసుకొన్నారు. వ్యాప్తీ ,ప్రచారమూ చేసి నెత్తి కెత్తుకొన్నారు అందరూ .ఒక రకం గా అప్పటివరకు ఉన్న భామఃహ దండిల అలంకార వాదం ,వామనుడి రీతి వాదం వరకు అన్నిటి సమన్వయ పరచిన గొప్ప అలంకారికుడు ఆనంద వర్ధనుడు .మౌలిక తర్క సిద్ధాంత శైలిని  ఎన్నుకొని ఎదురు లేని మొనగాడు అనిపించుకొన్నాడు .’’ధ్వని ధ్వని అని లోకం చెవుల్లో మారుమోగేట్లు’’ చేసిన  ఆనంద వర్ధనాచార్యుడు ‘.

‘’కావ్యాత్మ స ఏవార్ధః తధాచాది కవే ఃపురా –క్రౌంచ ద్వంద్వ వియోగోత్తః శోక శ్లోకత్వ మాగతః ‘’అని మొదట్లోనే ఆనంద వర్ధనుడు అన్నాడు ..కావ్య సృష్టి ఎలాంటిదో కావ్యాన్ని అర్ధం చేసుకొని అభినందించటమూ అంత గొప్ప అన్నాడు ఆనంద వర్ధనుడు .’’The unexpressed is not is not understood by those who only know grammar and lexicon  but only by men of taste and literary instinct who know the essence of poetry .It is the province of the sahridaya ,the connosseur who is expert in discerning through the intricate meshes of veiled word and sense into the aesthetic relish of deeper significance .The aesthetic emotion istransfered only when there is  ideal reawakening of it in the reader .Ananda vardhana clearly states that appreciation of poetry is essentially the same as the creation of it ‘’Aesthetic  consciousness has no end out side of itself .Aesthetics experience charactarised by the immersion of the subject in the aesthetic object is akin to the beatitude of ecstacy or the Brahman or Self  .’’అని డా .కే సుబ్రహ్మణ్యం ధ్వని సిద్ధాంతం పై చక్కని వ్యాఖ్య చేశారు .

మరోకవితో కలుద్దాం

సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39-

39-నైషద కర్త -శ్రీ హర్షుడు

గీర్వాణ కవుల గురించి రాస్తున్న ఈ సీరియల్ లో మొదట కొంచెం అటూ ఇటూ గామొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ‘’క్రానలాజికల్ ఆర్డర్ ‘’ననుసరించి కవుల జీవితాలను రాస్తూ హర్ష చక్రవర్తి దాక వచ్చాను .ఇప్పుడు హర్షునికాలం నుండి సుమారు అయిదు వందల ఏళ్ళు ముందుకు దూకి శ్రీ హర్షుడి గురించి రాస్తున్నాను .దీనికి కారణం ఇద్దరూ  ఒకే కాలానికి చెందిన వారుకాకపోయినా ఇద్దరూ వేరు వేరు వ్యక్తులని చాలా మందికి తెలియదు ఒక్కరే అని చాలామంది భ్రమ పడుతున్నారు ..చక్రవర్తి హర్షుడు నాగానందం  మొదలైన మూడు నాటకాలు రాస్తే , శ్రీ హర్షుడు సంస్కృత పంచకావ్యాలలో ముఖ్యమైన నైషద చరిత్ర అంటే మన శ్రీనాధుడు అనువాదం చేసిన శృంగార నైషధంరాశాడు .దీన్ని  రాస్తూ ‘’హర్ష నైషద కావ్యమాంధ్ర భాష’’అన్నాడు  . విద్వాంసులకే ఔషధం అనిపించుకొన్న మహా కావ్యం నైషధం .శ్రీహర్షుడు మహా మేధావి .కనిపించిన ప్రతి దానిపై అమోఘం గా కవితలల్లెవాడట .అవి అర్ధం చేసుకోవటం సామాన్యులకు అలవి అయ్యేది కాదట .పండితులే ముక్కున వేలేసుకొనే వారట .బుర్రలు బద్దలు కొట్టుకొన్నా మింగుడు పడేవికాదట .ఆ తెలివి తేటలు అనితర సాధ్యం గా ఉండేవట .తల్లికి భయం వేసేదట .అతని మేనమామను పిలిపించి గోడు వెళ్ళ బోసుకోనేదట .ఆయన దీనికి విరుగుడుగా అతని మేధస్సు తగ్గించటానికి రెండు కిటుకులు చెప్పి చేయిం చాడట .ఒకటి కాకర పాదు కింద రోజు వేడినీళ్ళతో స్నానం చేయించటం ,రెండవది బుద్దిమాంద్యం కలిగించే మినప పప్పుతో రోజూ కుడుములు లేక గారెలు వేసి తినిపించటం ఈ రెండూ ఆమె క్రమం తప్పకుండా చేసిందట .వీటి ప్రభావం వలన వెయ్యోవంతు మేధ మాత్రమె తగ్గిందట .’’మాష పూపాలపై ‘’(గారెలు )అలవోకగా అప్పుడు శ్లోకం చెప్పి వాళ్ళమ్మను మేనమామను సంభ్రమాశ్చర్యాలతో ముంచేశాడట .అతని మేధస్సును ఎవరూ తగ్గించలేరని నిర్ణయించుకోన్నారట .అలాంటి శ్రీ హర్షుని గురించి ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .శ్రీనాధ కవి సార్వ భౌముడు రాసిన అన్ని గ్రందాలకంటే  శృంగార నైషదానికే  గొప్ప పేరు వచ్చింది .హర్షుని హృదయాన్ని వెతికి పట్టుకొని రాసిన మహా కావ్యం అది .’’సీసాల’’తో ఉయ్యాల లూగించాడు .అంతేకాదు సంస్కృత నైషధం లో శ్రీహర్షుడు మంత్రం శాస్త్రాన్ని నిక్షిప్తం చేశాడని మహా పండితుడు కవి, శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు గొప్ప వ్యాఖ్యానం రాశారు .

శ్రీహర్ష చరితం

కనోజు పాలకుడైన జయ చంద్రుని ఆస్థానకవి శ్రీహర్షుడు .కాలం 1130-1190.తల్లి మామల్లాదేవి తండ్రి శ్రీ హీరుడు .’’నైషద చరిత’’రాసి ప్రసిద్ధుడు అవటం వలన ‘’నర భారతి ‘’అనే బిరుదు పొందాడని రాజశేఖరుడు ‘’ప్రబంధ కోశం ‘’లో రాశాడు .జీవితం లో చివరికాలం గంగా నదీ తీరం లోతండ్రి ఉపదేశించిన ‘’చింతామణి మంత్రం ‘’జపిస్తూ ఒక ఏడాది  గడిపాడు అప్పుడు  త్రిపుర సుందరీదేవి ప్రత్యక్షమై అపూర్వ శేముషిని ,ప్రతిభను అనుగ్రహిం చిందని  ,ఆ ప్రభావం తో అలవోకగా నోటినుండి కొన్ని శ్లోకాలు బయటికి వచ్చాయి అవి పండితులకే అర్ధం కాలేదట .మళ్ళీ దేవి అనుగ్రహాన్నిపొంది అందరికి సులభం గా అర్ధమయ్యే రీతిలో కవిత్వం చెప్పే సామర్ధ్యాన్నిపొందాడట .పండిత సభలో ఉదయనాచార్య  అనే పెద్ద పండితుడిని ఓడించాదట .

.1174లో నైషద చరితను  గుజరాత్ కు వీర ధవళ రాజు వద్దకు శ్రీహరుడు తీసుకొచ్చాడని, చందూ పండితుడు ‘’దీపిక’’లో చెప్పాడట .దీనికి విద్యాధరుడు వ్యాఖ్యానం రాశాడట .శ్రీహర్షుడు ‘’ఖండన ఖండ ఖాద్య ‘’రాసిన దానికంటే ముందే నైషషదము  రాశాడట .శ్రీ హర్షుడు రాసినట్లుగా చెప్పబడుతున్న విజయ ప్రసస్తి ,చంద్ర ప్రశస్తి ,గౌడీర్వికాసకుల ప్రశస్తి ,సాహసాంక చరిత , ఆర్ణవవర్ణన ,అమర ఖండన అలభ్యాలు .న్యాయ శాస్త్ర విశేషాలపై హర్షుడు వ్యాఖ్యానం గా ‘’ఖండన ఖండ ఖాద్య ‘’రాశాడని అంటారు .ఇవికాక స్థైర్య విచారం ,చింది ప్రశస్తి ,శివ శక్తి సిద్ధి ,ఈశ్వర త్రిసంది రాశాడని అంటారు .

శ్రీహర్షుడు కనోజు రాజు జయ చంద్రుని ఆస్థానకవి .జయచంద్రుడు పృధ్వీరాజ్ చౌహాన్ కు మామ .కూతురు రాణి సంయుక్త ప్రుద్వీరాజును ప్రేమించింది .జయ చంద్రుడికి ఇష్టం లేదు .ఆమెను పృధ్వీరాజు వీరోచితం గా తీసుకొని వెళ్లి వివాహం చేసుకోన్నాడని చరిత్ర .నైషధకావ్యాన్ని రాసి కాశ్మీర్ కు తీసుకు వెళ్లి అక్కడ సర్వజన పీఠ అధినేత్రి సరస్వతీ దేవి హస్తాలలో ఉంచాడని ,ఆమె ఆదరం తో స్వీకరించిందని ,తన కావ్యానికి సరస్వతి ఆమోదం తెలిపిందని కాశ్మీర రాజు మాధవ దేవుని నుండి రాజ ముద్రిక ను వేయించుకొని లేఖను తెచ్చాడని ఒక కధనం ఉంది .పృధ్వీ సంయుక్తల అమరప్రేమనే నైషధం లో ప్రతిబింబింప జేశాడని అంటారు  .

నైషధం లో శ్రీహర్షణీయం

నైషద మహాకావ్యం ఇరవై రెండు సర్గలున్నది .నల దమయంతుల ప్రేమకధా పూర్ణం .కద మనకు తెలిసినదే .నలుడిని పరీక్షించటానికి ఇంద్ర వరుణ ,అగ్ని, యములు దమయంతి స్వయం వారానికి రావటం ,నలుడికి  తిరస్కరినణీ విద్య నిచ్చి తమ దూతగా దమయంతి దగ్గరకు రాయ బారిగా పంపటం ,నలుడి వేషం లోనే దిక్పలకులు కూర్చోవటం ,సరస్వతీ దేవి స్వయం గా వచ్చి స్వయంవర రాజులను చమత్కారం గా పరిచయం చేయటం ,దేవతల అనుగ్రంహం తో నలుని దమయంతి గుర్తించటం ,నల దమయంతుల వివాహం ,కలి వవిజ్రు0భణ ,మొదలైనవి ఉన్నాయి .ఇది మహా భారత కధయే .కొంత కదా సరిత్సాగరం లోనూ ఉంది .వివాహం వరకు శృంగారకావ్యం గానే రాశాడు .ఔచితీ యుతమైన రచన చేశాడు .

ఆలంకారిక శైలి  భారవి తో ప్రారంభమై ,మాఘునిలో పరిపక్వమై శ్రీహర్షునితో ఉత్కృష్ట స్థాయి పొందింది .తరువాత వచ్చినవన్నీ అంత గొప్పవికావు కనుక ‘’ఉదితే నైషధే కావ్యే క్వ మాఘః క్వచ భారవిః’’అన్న లోకోక్తి ప్రచారమైంది .విద్వాంసుల గర్వమనే రోగాన్ని పోగొట్టే ఔషధం నైషధం –అంటే ‘’నైషధం విద్యదౌషధం ‘’.అంతేకాదు ‘’అందమైన కన్య సౌందర్యం బాలుని మనస్సునుఎలా  ఆకర్షించ లేదో అదేవిధం గా సరసం లేని అరసులకు నా కావ్యం అర్ధం కాదు ‘’అని చెప్పాడు  హర్షుడు .గురువుదగ్గరైనా చదువుకోవాలి ,లేకపోతె వ్యాఖ్యానాలన్నా చదవాలి .అప్పుడే అర్ధమవుతుంది .

హర్షుని కవిత్వం లో ఒజో గుణం ఉంటుంది .నారికేళ పాకం .పగల గోట్టుకు తింటూ నమిలితేనే మాధుర్యం .శ్లేష తో చమక్కులు చేశాడు .దీర్ఘ సమాసాలతో ఊపిరి ఆడనీయడు .ఉక్తి వైచిత్రి కి అగ్రాసనం వేశాడు .ప్రతిశ్లోకం అలంకార శోభితం .భావ కల్పనా అనితర సాధ్యం ,అద్భుతం ఆశ్చర్యం .అంతమాత్రాన పదలాలిత్యం లేదనుకోరాదు .అదీ తగుమోతాదులో ఉంది .నైషదే పదలాలిత్యం అన్న పేరూ పొందింది .శైలి గాఢమైన బంధాలతో గౌడీ రీతిలో ఉంటుంది .ప్రతిశ్లోకం రామణీయమే .ప్రతిభావం అపూర్వమే .ప్రతి అలంకారం పరమ రామణీకమే .

ప్రబంధం లో ఉండే వర్ణనలన్నీ చేశాడు .ఒకే విషయాన్ని పలు చోట్ల పలురకాలుగా  వర్ణిస్తేనేకాని హర్షుడికి తృప్తి ఉండదు .’’ఎకామత్యజతో నవార్ధ ఘటనాం ‘’అన్నాడు .ప్రతిదానిలో కొత్తదనాన్ని కల్పిస్తాడు ,కన్పించేట్లు  చేస్తాడు .నైషదానికి 23వ్యాఖ్యానాలున్నా మల్లినాద సూరి రాసిన ‘’జీవాతువు ‘’ప్రముఖమైనది .తర్వాత నారాయణ భట్టు రాసిన ,,నైషద ప్రకాశం .హర్షుడు ,మహా పండితుడు ,మహాకవీ మహా వ్యాకరణ, వేత్త ,మహా దార్శనికుడు .షట్ దర్శన పాండిత్య విశేషుడు .అద్వైత సిద్ధాంతి .చార్వాకాది సిద్ధాంతాలనూ చదివాడు .ఇతర దర్శానాలు అవహేళన చేశాడు .అతని వ్యాకరణ పాండిత్యాన్ని తెలియ జేసే శ్లోకాలు అపరిమితం గా కనిపిస్తాయి .అతని కామ శాస్త్ర పారంగత్యమూజ్యోతకమవుతుంది .    ఇందులో కొన్ని ప్రతీకలు కనిపిస్తాయి .నల దమయంతుల ప్రేమకు హంస రాయ బారం జరుపుతుంది .ఈ హంసను జీవాత్మ ,పరమాత్మలను కప్పి ఉంచే అజ్ఞానాని తొలగించి వాటి ఇద్దరి కలయిక కు తోడ్పడే గురువు కు ప్రతీక అని భావించారు .ఇలాంటి అద్వైత భావనలెన్నో ఇందులో ఉన్నాయనే శేషేంద్ర శర్మ గొప్పగా నిరూపించారు .హర్షుడి మేనమామయే ‘’కావ్య ప్రకాశం’’ అనే అలంకార గ్రంధం రాసిన ముమ్మటుడు అని ఒక అభిప్రాయం ఉన్దిలోకం లో .మేనల్లుడు రాసిన నైషధాన్ని ముందే చూసి ఉండి నట్లయితే తాను తన అలంకార శాస్త్రం లో దోష ప్రకర ణానికి వేరే చోట్ల వెతుక్కొనే పని ఉండేదికాదు కదా అని అను కోన్నాడట .

మరోకవిని తర్వాత కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”కదిలే బొమ్మలకు”ప్రాణం పోసిన రఘు పతి వెంకయ్య జయంతి

కదిలే బొమ్మకు ప్రాణం పోసిన బ్రహ్మయ్య
నేడు రఘుపతి వెంకయ్య జయంతి

వందేళ్ల భారతీయ సినిమా సంబరాలు జరుపుకున్నాం. మనదేశంలో సినిమా పుట్టుకకి కారణమైన వ్యక్తుల గురించి, వారు చేసిన కృషి గురించి స్మరించుకున్నాం. అయితే 1910లో ‘పుండలీక్‌’ సినిమా నిర్మించిన దాదాభాయి టోర్నీ కంటే , 1913లో ‘రాజా హరిశ్చంద్ర’ చిత్రం తీసిన దాదాసాహెబ్‌ ఫాల్కే కంటే ముందే ఒక తెలుగువాడు 1909లోనే భారతీయ సినిమా పరిశ్రమకు పునాది వేశాడన్నది చరిత్ర చెప్పే సత్యం. తెలుగు సినిమాకే కాదు దక్షిణాది సినిమాకే ఆద్యుడైన ఆ వ్యక్తి పేరు రఘుపతి వెంకయ్యనాయుడు. ఆయన వేసిన పునాది మీదే దక్షిణాదిన సినిమా వేళ్లూనుకుని దినదిన ప్రవర్థమానమైంది. మనదేశంలో తొలి ప్రదర్శకుడు, తొలి పంపిణీదారుడు ఆయనే. వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం.

ప్రభుత్వంలోని సైనిక శాఖలో సుబేదారుగా పనిచేసిన మచిలీపట్నం వాస్తవ్యుడు అప్పయ్యనాయుడు రెండో కొడుకు రఘుపతి వెంకయ్య. 1873 అక్టోబర్‌ 15న జన్మించారు. వెంకటేశ్వరుని భక్తుడైన అప్పయ్యనాయుడు తన పెద్దకొడుకుకి వెంకటరత్నం అనీ, చిన్నకొడుక్కి వెంకయ్య అని పేరు పెట్టారు. తండ్రి ఉద్యోగ బదిలీ మీద వెంకయ్య తన 18వ ఏట మద్రాసులో అడుగుపెట్టారు. చిన్నతనం నుంచి చిత్రలేఖనం మీద ఆసక్తి ఉండటంతో మౌంట్‌రోడ్‌లో ఒక ఇల్లు తీసుకుని దానిని ఒక కళాకేంద్రంగా తీర్చిదిద్దారు వెంకయ్య. ఆయన వేసే బొమ్మలు, చెక్కే రాతిబొమ్మలు చాలామంది దృష్టిని ఆకర్షించాయి. ఆ రోజుల్లో బొబ్బిలి, విజయనగరం, కళ్లికోట, చెట్టినాడ్‌ సంస్థానాలకు చెందిన మహారాజులు గిండిలో జరిగే గుర్రపు పందాలకోసం వస్తుండేవారు. వారి దృష్టిని వెంకయ్య ఆకర్షించారు. అలాగే బ్రిటీషు ప్రభుత్వ అధికారుల ప్రశంసలు కూడా ఆయన పొందారు.
పెయింటింగ్స్‌తో పాటు ఫొటోగ్రఫీలో కూడా ప్రవేశం ఉండటంతో కొత్త ప్రయోగాలు చేసేవారు. ఒకరోజు పేపరు తిరగేస్తుంటే ‘క్రోనోమెగాఫోన్‌’ నే సినిమాటోగ్రాఫ్‌ మెషీన్‌ను కనిపెట్టారనీ, దాని మీద పిక్చర్‌ ప్రొజెక్ట్‌ అయ్యేటప్పుడు రికార్డెడ్‌ డిస్క్‌ సాయంతో సంగీతాన్ని, ఇతర శబ్దాలను వినిపించవచ్చనే వార్త వెంకయ్యని ఆకర్షించింది. లండన్‌లోని గౌమాంట్‌ కంపెనీ అధినేతలు ఈ ఎక్విప్‌మెంట్‌ సృష్టికర్తలనీ, బకింగ్‌హామ్‌ భవనంలో ఐదో జార్జి, మేరీ రాణి సమక్షంలో ఇచ్చిన తొలి ప్రదర్శన విజయవంతమైందనీ ఆ వార్త సారాంశం. కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే వెంకయ్య వెంటనే మద్రాసులోని జాన్‌ డికెన్‌సన్‌ కంపెనీవారిని కలుసుకొని ‘క్రోనోమెగాఫోన్‌’ ఎక్విప్‌మెంట్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. దాని ఖరీదు రూ. 30 వేలు. తన భార్య నాంచారమ్మ సలహాతో తన ఫొటో స్టూడియోను తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ‘క్రోనోమెగాఫోన్‌’ ఎక్విప్‌మెంట్‌ తెప్పించుకున్నారు వెంకయ్య. నాలుగువందల అడుగుల పొడువున్న 12 లఘు చిత్రాలను తయారు చేసి, వాటిని తొలిసారిగా విక్టోరియా పబ్లిక్‌ హాలులో ప్రదర్శించారు. ‘అండర్‌ ది పెనామా’, ‘స్వింగ్‌ సాంగ్‌’, ‘సీ సర్పెంట్‌’, ‘ఫైర్‌మర్‌ సాంగ్‌’, ‘మికాడో’… ఇటువంటి టైటిల్స్‌తో ఆ చిత్రాలను ప్రదర్శించేసరికి జనం ముగ్ధులయ్యారు. తొలి ప్రదర్శనకి ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. అయినా వెంకయ్య నిరాశ పడలేదు. చిన్న చిన్న కరపత్రాల ద్వారా ఈ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను జనానికి తెలిసేట్టు చేశారు.
ప్రేక్షకుల నాడి పసికట్టిన వెంకయ్య 1910లో ఎస్‌ప్లనేడ్‌(ఇప్పటి రాజా అన్నామలై హాలు)లో టెంట్‌ సినిమా ఏర్పాటు చేసి ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అవి విజయవంతమయ్యాయి. ఆ తర్వాత తన టెంట్‌ సినిమాతో బెంగుళూరు, ఆంధ్రదేశంలోని ముఖ్య పట్టణాలు తిరిగి ప్రదర్శనలిచ్చారు. దీని వల్ల లాభాలు రాకపోయినా నష్టం మాత్రం రాలేదు. నాటకాల ప్రభావం నుంచి కొంత బయట పడి సినిమాలు చూడటం కోసం జనం వస్తున్నందుకు ఆయన సంతోషించారు.
దేశంలోనే కాదు సింహళదేశానికీ తన టెంట్‌ సినిమాతో వెళ్లి అక్కడ ప్రదర్శనలిచ్చేవారు. తన తయారు చేసిన చిత్రాలే కాకుండా విదేశాల 500 అడుగుల పొడవు కలిగిన లఘు చిత్రాలను దిగుమతి చేసుకొని ప్రదర్శించేవారు. సింహళం నుంచి బర్మా వెళ్లి అక్కడ రంగూన్‌, పెరూ పట్టణాల్లో సినిమా ప్రదర్శనలు ఇచ్చారు. ఇవి జనంలో సినిమా చైతన్యాన్ని కలిగించాయి.
1911లో మద్రాసుకు తిరిగి వచ్చిన వెంకయ్య గెయిటీ టాకీస్‌ను నిర్మించారు. మద్రాసులోని తొలి సినిమా థియేటర్‌ ఇదే. ‘మిలియన్‌ డాలర్‌ మిస్టరీ’, ‘మిస్టరీస్‌ ఆఫ్‌ మీరా’, ‘క్లచింగ్‌ హాండ్‌’ వంటి లఘు చిత్రాల్ని ఇందులో ప్రదర్శించేవారు. ఆ తర్వాత మింట్‌ స్ర్టీట్‌లో క్రౌన్‌ థియేటర్‌ని, పరుశువాకంలో గ్లోబ్‌ థియేటర్‌ను వెంకయ్య నిర్మించారు. యూనివర్సల్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన లఘు చిత్రాలను ఇందులో ప్రదర్శించేవారు.
1913లో మౌంట్‌ సీ్ట్రట్‌లో క్రౌన్‌ థియేటర్‌ వెనుక ‘స్టార్‌ ఆఫ్‌ ఈస్ట్‌ ఫిలిం’ అనే సంస్థను నెలకొల్పి, తన చిత్రనిర్మాణకార్యక్రమాలను ప్రారంభించారు వెంకయ్య. ఆ రోజుల్లో కరెంట్‌ సమస్య తీవ్రంగా ఉండటంతో దానిని అధిగమించడం కోసం గ్లాస్‌ స్టూడియోను నిర్మించారు. ఎండ వచ్చి స్టూడియోల్లోని అద్దాల మీద పడుతుంటే ఆ వెలుగులో షూటింగ్‌ చేయవచ్చనే ఆలోచన ఆయనది. ఇటువంటి ప్రయోగం చేయడం భారతదేశంలోనే తొలిసారి. అంటే ఇప్పుడు సినిమా షూటింగ్స్‌లో ఉపయోగిస్తున్న రిఫ్లెక్టర్స్‌ విధానానికి ఆ రోజుల్లో అలా శ్రీకారం చుట్టారు వెంకయ్య.
వెంకయ్య పెద్ద కొడుకు సూర్యప్రకాశ్‌ ఇంగ్లాండ్‌ వెళ్లి సినిమా సాంకేతిక శాసా్త్రన్ని నేర్చుకుని విలియం సన్‌ సైలెంట్‌ కెమెరాతో స్వదేశానికి తిరిగివచ్చారు. తండ్రీకొడుకులు కలసి గ్లాస్‌ స్టూడియోలో ‘గజేంద్రమోక్షం’, ‘మత్స్యావతారం’, ‘భీష్మప్రతిజ్ఞ’ తదితర మూకీ చిత్రాలు నిర్మించారు.
ప్రారంభంలో కాలానికి ఎదురీది కొత్త ప్రయోగాలు చేసిన వెంకయ్య చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులకు లోనయ్యారు. ఆస్తులన్నీ కోల్పోయారు. మూకీ యుగం అంతరించి టాకీల నిర్మాణం పెరగడం కూడా వెంకయ్య వెనకబడటానికి కారణం అయింది. 1941 మార్చి 15న ఆయన కన్నుమూశారు. కానీ ఆనాడు ఆయన సేవల్ని ప్రజలు, ప్రభుత్వం మరిచిపోలేదు. రాష్ట్రవిభజనకు పూర్వం ఆయన పేరిట ఒక అవార్డ్‌ ఏర్పాటు చేసి, చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ఏటా అందించేవారు. ఇకపై కూడా రెండు రాష్ట్రప్రభుత్వాలు ఆ అవార్డ్‌ను కొనసాగించాలని సినీజనం కోరుకుంటోంది. అలాగే రఘుపతి వెంకయ్య జీవిత చరిత్రకు సినిమా రూపం ఏర్పరచి దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో సతీశ్‌ నిర్మించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నరేశ్‌ ఇందులో వెంకయ్య పాత్ర పోషించారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అల్లూరి -అడ్డతీగెల బంధం -పదాల వీరభద్ర రావు-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోదీయే గత్యంతరం !!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వా కవుల కవితా గీర్వాణం -38

గీర్వా కవుల కవితా గీర్వాణం -38

38-బౌద్ధ నాటక కర్త –హర్ష వర్ధనుడు

స్థానేశ్వరాన్ని రాజ దాని చేసుకొని వింధ్య నుండి హిమాలయాల వరకు రాజ్య పాలన చేసిన హర్ష చక్ర వర్తి మూడు  నాటకాలు రాశాడు.  హర్షుడు క్రీ .శ.606-648కాలానికి చెందినవాడు .తననాటకాలలో హర్ష వర్ధనుడు అని చెప్పకుండా హర్ష దేవుడు అని చెప్పుకొన్నాడు .తండ్రి ప్రభాకర వర్ధనుడు .చైనా యాత్రికులు హ్యూన్ సాంగ్ ,ఈత్సింగ్ లు ఇతని పాలన గురించిరాశారు .బాణుడు హర్ష చరిత్ర రాశాడు .శీలాదిత్యుడు అనే బిరుదు ఉంది .అంటే శీలం లో, సదాచారం లో సూర్యుని వంటి వాడని అర్ధం .హర్షుడికి ముందు అన్న రాజ్య వర్ధనుడు రాజరికం చేశాడు .సూర్యారాధక వంశం .తర్వాత బౌద్ధమతావలంబి అయ్యాడు .గౌడ రాజు శశాంకుడు రాజ వర్ధనుడిని ఓడి చనిపోతే హర్షుడు రాజ్యాభి షిక్తుడయ్యాడు.రెండవ పులకేశిని ఓడించి దక్షిణం లో నర్మదా నది వరకు హర్షుడు రాజ్య వ్యాప్తి చేశాడు ..అయిదేళ్లకోసారి ధనాగారం లోని డబ్బునంతా ప్రజలకు దానం చేసేవాడు .రాజ్యాధికారం కంటే సాహిత్యం పై మోజేక్కువ .మంచికవి .హర్షునికాలం లో నలందా విశ్వ విద్యాలయంపది వేల మంది దేశ విదేశీ విద్యార్ధులతో మహోన్నత దశలో ఉండేది .ధర్మ కీర్తి ఇక్కడ ఆచార్యుడు గా ఉండేవాడు .తన అన్నరాజ వర్ధనుడిని చంపిన శాశాంకుని ఓడించి సంహరించి ప్రతీకారం తీర్చుకొన్నాడు హర్షుడు . శశాంకు ని  చెరలో ఉన్న చెల్లెలు రాజ్యశ్రీ తప్పించుకొని బయట పడి బౌద్ధ భిక్షువు చేత రక్షింప బడి హర్షుని చేరుతుంది .ఆ భిక్షువు తత్వ బోధతో హర్షుడు బౌద్ధాన్ని స్వీకరించాడు .అంతకు ముందు హర్షుడు శివుడి అభిమాని .హర్షుని పట్టమహిషి  పారశీక కన్య .ఆమెనే మహాశ్వేతాగా బాణుడు చిత్రించాడని అంటారు .రెండవ భార్య సౌరాష్ట్ర రాజ వంశానికి చెందినదని ఆమెయే కాదంబరి అని పండితుల పిండితాభిప్రాయం .హర్ష సామ్రాజ్యం అస్సాం నుండి సౌరాష్ట్ర వరకు ,హిమాలయం నుండి వింధ్య వరకు వ్యాపించింది .

హర్షుని కవితా హర్ష వైభవం

హర్షుడు రాసిన మూడు నాటకాలలో ప్రియ దర్శిని మొదటిది .నాలుగు అన్కాలున్నాయి .బృహత్కధ నుండి తీసుకొన్న ప్రేమకధ ఇది .వత్సరాజు ఉదయనుడు నాయకుడు. కాలింగ రాజు దృఢ వర్మ శత్రువుల చేతిలో ఓడిపోగా కూతురు ప్రియ దర్శినిని ఉదయనుడి భార్య వాసవ దత్త దగ్గర పరిచారికగా చేరుస్తాడు .సేనాపతి విజయ సేనుడు .ప్రియ దర్శినిని ఉదయనుడు ఒక సారి ఉద్యానవనం లో చూడటం తో ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది .వీరిద్దరి ప్రేమను నాటకం గా వేస్తారు .అందులో ఉదయనుడు వాసవ దత్తగా ప్రియ దర్శిని  నటిస్తారు .వీరిప్రేమ రాణి వాసవ దత్తకు తెలుస్తుంది .ప్రియ దర్శికను బంధిస్తుంది .దృఢ వర్మ శత్రువులను జయించి వాసవ దత్తకు అసలు విషయం చెబుతాడు .వాసవ దత్త ఉదయన ప్రియ దర్శనికల వివాహం జరిపిస్తుంది ..ఈ నాటకం పై మాళవికాగ్ని మిత్ర ప్రభావం ఉంది .

రత్నావళి నాటకం లో నాలుగు అన్కాలున్నాయి .రత్నావళి నాయిక సింహళ దేశానికి చెందింది .రత్నావళి పెళ్లి చేసుకొన్నా వాడు చక్ర వర్ర్తి అవుతాడనే జ్యోతిష్యం బయట పడుతుంది .వాసవ దత్త ,యౌగంద రాయణులు ఒక పన్నాగం పన్ని వాసవ దత్త చనిపోయినట్లు పుకారు పుట్టించగా, వార్త తెలిసిన మంత్రి వాసు భూపతి ఉదయునిదగ్గరకు  రత్నావళి ని పంపుతాడు .ప్రయాణం లో నౌక ప్రమాదానికి గురై రత్నావళి సముద్రం లో పడిఎల్లాగో బయట పడి వాసవ దత్తను చేరి సాగరిక పేరుతొ పనిమనిషిగా ఉంటుంది .రాజు కంటబడకుండా ఈమెను జాగ్రత్త గా చూసుకొంటున్నా ఒక సారి వారిద్దరూ ఉద్యానవనం లో కలుసుకొని హృదయాలను పారేసుకొంటారు .తరువాత కొన్ని మలుపులు తిరిగి ఉదయన సాగారికల వివాహం జరిగిపోతుంది .ప్రియ దర్శినిలోను ఇందులోనూ దాదాపుఒకే కద ఉంది. భాసుడి స్వప్న వాసవ దత్త ప్రభావం దీనిమీద ఎక్కువ .నాటకం మనసును ఆకర్షిస్తుంది .

మూడవ నాటకం నాగానందం .ప్రౌఢ రచన .అయిదు అంకాలు .ఇది జీమూత వాహనుడిత్యాగ కద .అహింసకు ప్రాధాన్యతనిచ్చాడు .ఈ కధకు ఆధారం జాతక కధలోని విద్యాధర చరిత్ర అని హర్షుడు చెప్పాడుకాని అది దొరకలేదు .నాటకారంభం లో బుద్ధుని స్తుతించాడు .అయినా హిందూ మతం పై కోపం లేదు కనకనే నాటకం లో నాయిక మలయా వతిని  గౌరీ దేవి భక్తురాలుగా చిత్రించాడు  .సన్నివేశాలను వేగవంతం గా నడిపిస్తాడు .విసుగుఉండదు ..మొదటి మూడు  అన్కాలలో  శృంగార రసం పోషింప బడింది .తరువాత శాంత రసం సాగింది .హాస్య అద్భుతరసాలకూ ఇందులో చోటు కల్పించాడు

కాళిదాస భవ భూతుల తర్వాతి స్థానం హర్ష దేవుడిదే .సరళ సుందర శైలితో కోమలమైన రచన చేశాడు .హర్షుడు నాట్య సంగీతాలలో నిష్ణాతుడు అని తెలుస్తుంది .లలితకళా ప్రియుడుగా కనిపిస్తాడు .హర్షుని రస హృదయం ప్రేక్షకాదరణ పొందింది .ప్రక్రుతి చిత్రణా సహజ సుందరం గా చేశాడు .పాత్రల స్వభావాలను సుస్పష్టం గా చిత్రించాడు ..కవిగా,నాటక కర్త గా హర్షుడు సవ్య సాచిత్వం చేశాడు .రచనా ప్రావీణ్యం అమోఘమని పిస్తుంది .హర్షుడు హృదయ హర్షుడనిపిస్తాడు .నాగానంద నాటకాన్ని 2008లో దేశం లో పలుచోట్ల ప్రదర్శించారు .అఖిల భారతీయ మరాఠీ  నాట్య పరిషద్ ఆధ్వర్యం లో చాలా చోట్ల ప్రదర్శించారు .

ఈ నాటి హర్యానా పంజాబ్ ప్రాంతం లో రాజధాని నేర్పరచుకొన్న హర్షుడి సైన్యం లో లక్ష మంది అశ్విక సైన్యం , అరవై వేలమంది ఏనుగులు ఉండేవి .ప్రజలకు విద్యా వైద్య సౌకర్యాలను ఉచితం గా కల్పించాడు మంచినీటి సరఫరా నాణ్యం గా ఉండేది . విశ్రాంతి గృహాలు ఉండేవి . ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడడాని చరిత్రకారులు రాశారు .తక్కువ పన్నులు వేసేవారు ఆరోవంతు భూమి శిస్తు వసూలు చేసేవాడు .ఈ నాడు స్తానేశ్వరం లో ఒక కిలో మీటరు పొడవు ముప్పాతిక కిలోమీటరు వెడల్పు ఉన్న శిధిల ‘’హర్ష కా తిల ‘’కనిపిస్తుంది .అత్యాధునిక సౌకర్యాలున్న ప్రాంతంగా ఇది కనిపించి ఆశ్చర్య పరుస్తుంది .తాంగ్ వంశానికి చెందిన చైనా చక్రవర్తి తిజాంగ్ తో సత్సంబంధాలు నేరపాడు .సందర్శకులు ఇరుదేశాలనుంది వచ్చి వెడుతూ ఉండేవారు .చైనా యాత్రికుడు హ్యూన్ చాంగ్ హర్షుని రాజ్యం లో  ఎనిమిదేళ్ళు భారత దేశం లో గడిపాడు .ప్రయాగలో అయిదేళ్లకోసారి మహా కుంభ మేలను నిర్వహించేవాడు .నలభై ఒక్క ఏళ్ళు హర్షుడు రాజ్యాన్ని పాలించాడు .హర్షునికుమారులు వ్యాఘ్ర వర్ధనుడు ,కళ్యాణ వర్ధనుడు .హర్షుని ముఖ్యమంత్రి అరునణాశ్వుడు వీరిద్దరిని చంపి ,రాణి ప్రభావతిని చెరలో పెట్టాడు .

జయదేవుడు తన గీత గోవిందం లో హర్షుని కాళిదాసుతోపోల్చాడు .జయదేవునికాలానికే హర్షుని కీర్తి దేశావ్యాప్తమైందనిదని తెలుస్తోంది .ఆర్.సి మజుందార్ అనే పరిశోధకుడు హర్షుని గురించి రాస్తూ ‘’A great general and just administrator .Harsha was even greater than patron of religion and learning .He gathered around himself finest intellects holiest sages .Men like Bana ,Mayura ,Divakara and Huen tsang thronged round his throne .In this respect   he is more fortunate than Samudra Gupta for still we posses some gems of literature that proceedede according to tradition from his pen ‘’అని హర్షుని భహుముఖీన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు .

 Inline image 1  

ఈ సారి నైషధాన్ని రాసిన హర్ష దేవుడి గురించి తెలుసుకొందాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37

36- వసంత తిలక వృత్త -రత్నాకరుడు

హర విజయం అనే మహా కావ్యం  రాసిన రత్నాకరుడు కాశ్మీర దేశం కవి .బిప్పట జయాపీడుని ఆస్థానం లో ఉన్నాడు .తర్వాత అవంతి వర్మ రాజ్యం లోను ప్రసిద్ధిపొండాడు .కనుక కాలం క్రీ శ .ఎనిమిది వందలు గా నిర్ణయించారు 850-894అనుకోవచ్చు .హరవిజయం లో శివుడు అందకాసురుడిని సంహరించటం అనే కద ఉంది ఇది యాభై సర్గల బృహత్ కావ్యం .శ్లోకాల సంఖ్య 4320.

కవితా రత్నాకరుడు (కవి సముద్రుడు )

రాజానక ,వాగీశ్వర ,విద్యాధిపతి బిరుదులున్న రత్నాకరుడు వసంత తిలక వృత్తానికి సృష్టికర్త .దీనిని క్షేమేంద్రుడు రాజశేఖరుడూ పేర్కొని మెచ్చారు .హర విజయం లో శివ పార్వతులు కామ కళా కేళి లో ఉండగా అంధుడైన అంధకాసురుడు జన్మించాడు .శివుడిని స్తుతించి కను చూపు తెచ్చుకొన్నాడు వరగర్వం తో విర్రవీగి మూడు లోకాలను కల్లోల పరచాడు .దేవతలు అందకుని ఆగడాలు భరించ లేకఈశ్వరుని ప్రార్ధిస్తే వాడిని సంహరించటమే కద .యాభై సర్గ లున్న ఈ కావ్యం లో మొదటి పదమూడు సర్గలలో శివుడు అందకాసురుడిని సంహారం చేయటానికే చేసే   మంత్రాంగమే  వర్ణించాడుకవి .తర్వాత ఏడు సర్గలలో శివుడికి అందకాసురుడికి మధ్య సంవాదం ఉంటుంది సన్నివేశాలు సంవాదాలు బాగా పెంచి రాసిన కావ్యం ఇది .

రత్నాకరుడు సకల శాస్త్ర రత్నాకరుడు .అతనికి ప్రవేశం లేని విద్య లేదు .పురాణ ,ఇతిహాస ,నాట్య ,సంగీత ,నీతి,వేదాంత ,కామ శాస్త్ర ,అలమ్కారాది శాస్త్రాలలో నిష్ణాతుడు .దీనికి మించి చిత్రకావ్య రచనా సమర్ధుడు .మహా కావ్య లక్షణాలన్నీ హరవిజయం లో చొప్పించాడు .తన కావ్య మర్మాన్ని రాత్నాకురుడే –‘’లలిత మధురాఃసాలంకారాఃప్రసాద మనోహరాః –వికట యమక శ్లేషోద్గార ప్రబంధ నిరర్గలాః’’ఇన్ని కవితా లక్షణాలతో తన హర విజయం మనోహర విజయం సాధించిందని చెప్పాడన్నమాట .ప్రతి సర్గ చివర ‘’రత్న ‘’అనే శబ్దాన్ని వాడాడు .దీనికి స్పూర్తి భారవి వాడుకొన్న ‘’లక్ష్మి ,మాఘుడు ప్రయోగించిన శ్రీ  ‘’,శ్రీహర్షుడు ఉపయోగించిన ‘’ఆనంద ‘’శబ్దాలే .రత్నాకరుడి కావ్యం ‘’చంద్రార్ధ చూడ చరితాశ్రయ చారు ‘’సుందరం అని తానే చెప్పుకొన్నాడు .

డేవిడ్ స్మిత్ ఈ కావ్యం లో మతవిషయాలతో బాటు సింబాలిజం కూడా ఉందన్నాడు  భారతీయ సంస్కృతిని కావ్యం లో ప్రతిబింబింప జేశాడనీ చెప్పాడు .సంప్రదాయ  ఆలంకారికులను విమర్శిస్తూ చెప్పిన గ్రంధమనీ అన్నాడు .రాజాస్థాన విధానాలు ,సమాజ వ్యవహారాలూ ఇందులో పొండుపరచాడని తెలియ జేశాడు .హరవిజయాన్ని పండిట్ దుర్గా ప్రసాద్ ,కాశీనాద్ పాండురంగ పరబ్ లు ఆంగ్లం లోకి అనువదించి ప్రచురించారు .పుర ,నగర పర్వత సముద్ర వన సూర్యాస్తమయ ,అస్తమయ యుద్ధ ,ఋతు వర్ణాలతో కావ్యం సర్వాంగ సుందరం గా ఉంటుంది  కద కంటే కధన వర్ణన విధానం బాగా ఆకర్షిస్తుంది .భారవి కిరాతార్జునీయాన్ని మాఘుడి శిశుపాల వధ కావ్యాలను మించిన కవితా సౌందర్యం ఇందులో ఉన్నది .

37-  బాల కవి -రాజ శేఖరుడు

బాల్యం లోనే కవిత్వం లో అమోఘమైన ప్రతిభ చూపి’’ బాలకవి ‘’అనే బిరుదు పొందిన రాజ శేఖరుడు కనోజు పాలకుడు ఘూర్జర రాజు ప్రతీహార వంశస్తుడు  మహేన్ద్రపాల రాజు ఆస్థానం లో విద్యా గురువు .అతనికొడుకు మహీ పాలుని వద్ద ,కేయూర వర్షుని ఆస్థానం లోను గౌరవ పదవులలో రాణించాడు .కనుక కాలం క్రీ శ .860-940గా నిర్ణయించారు .పండిత వంశం లో జన్మించిన ఇతని తండ్రి దుర్దకుడు స్వీయ ప్రతిభతో  మంత్రి అయ్యాడు  తల్లి శీలవతి .ముత్తాత అకాల జలదుడు కూడా గొప్ప కవి .ఇతన్ని మాయవర కుల సంజాతుడని అంటారు ఈ కులం బ్రాహ్మణ క్షత్రియ రెండుకులాల్లోనూ ఉందట .క్షత్రియుడేనని అందుకే చౌహాన్ క్షత్రియ కులానికి చెందిన అవంతీ సుందరిని పెళ్లి చేసుకోన్నాడని వాదించేవారూ ఉన్నారు .ఇది నిజం కాదని బ్రాహ్మణ కుల సంజాతుడేనని మెజార్టీ నమ్మకం .అవన్తీసుందరి గొప్ప పండితురాలు ,విదుషీమణి కాబట్టే ,రాజశేఖరుడు కులాంతర వివాహం చేసుకోన్నాడని అది ఆనాటి సంఘం లో ఉన్న ఆచారమే నని సమర్ధిస్తారు .ఆమె ప్రేరణ అతనికి బహువిధాల తోడ్పడిందని  అనుకోవచ్చు .ఆనాటి చాలా రాజ్యాలతో రాజులతో అతనికి పరిచయాలున్నాయి .జీవిత చరమాంకాన్ని కాశీలో గడిపినట్లు తెలుస్తోంది .ప్రతీహార వంశం రాష్ట్ర కూట రాజు ఇంద్రుని చేతిలో నశించింది .అప్పుడు రాజశేఖరుడు త్రిపురకు  వెళ్లి అక్కడ కాలచూరి రాజు కేయూర వర్షుని ఆస్థానం చేరాడు .శేఖరుడు పండిత కవి .అనేక రచనలు చేశాడు

కవితా రాజశేఖరం .

త్రిపురలో ‘’విద్ధ సాల భంజిక ‘’నాటకాన్ని రాజశేఖరుడు రాశాడు .అక్కడే ‘’కావ్య మీమాంస ‘’అనే అలంకార గ్రందాన్నీ రచించాడు .పాండిత్యం కవిత్వాలతో రాజుల మెప్పుపొంది అనేక ఘన సన్మానాలు అందుకొన్నాడు అతని సమకాలీన కవుల కృష్ణ శంకర వర్మ ,అపరాజితుడు మొదలైన వారు శేఖరుని గొప్ప తనాన్ని గుర్తించి కొనియాడారు .సాహిత్య కళల తో బాటు సాంస్కృతిక ,ధార్మిక విషయాలూ బాగా తెలిసిన వాడు .ఆకాలం లో మహిళా కవులైన భట్టారిక ,సుభద్ర లను మెచ్చుకొన్నాడు .స్త్రీ వలన సాహిత్య ప్రాచుర్యం పొందిన మొదటికవి రాజశేఖరుడు .ఎంత పాండిత్యం ఉన్నా హద్దుల్లో ఉందడి సాటి వారి యెడ గౌరవాదరాలు కలిగి ఉన్న సంస్కారి .ఇతరుల అభిప్రాయాలకు విలువ నిచ్చిన ప్రజాస్వామ్య వాది.

రాజ శేఖరుడు ఆరు కృతులను రచించాడని ‘’నః షట్ ప్రబందాన్ ‘’అని తన రామాయణ నాటక ప్రస్తావనలో తెలిపినదాన్ని బట్టి తెలుస్తోంది .కాని అయిదు రచనలే లభ్యం .అందులో నాలుగు నాటకాలు –అవి బాల రామాయణం ,బాల మహా భారతం ,కర్పూర మంజరి ,విద్ధ సాల భంజిక .అయిదవది అలంకార గ్రంధం అయిన ‘’కావ్య మీమాంస ‘’.భువన కోశం కూడా రాశానని చెప్పాడుకాని దొరక లేదు .

బాల  రామాయణ నాటకం లో తాను  వాల్మీకి అవతారాన్ని అని రాజ శేఖరుడు చెప్పుకొన్నాడు .సీతా స్వయం వరం తో ప్రారంభమై రాముడు అయోధ్యకు తిరిగి వచ్చేదాకా కదనడుస్తుంది. పది అంకాలున్న నాటకం .కనుకనే మహా నాటకం అన్నారు .ప్రతి అంకానికి ప్రత్యేకమైన పేరు పెట్టి కొత్త దారి చూపాడు .అవే-ప్రతిజ్ఞా పౌలస్త్యం ,రామ రావణీయం ,విలక్ష లంకేశ్వరం భార్గవ భంగం ,ఉన్మత్త దశాననం ,నిర్దోష దశరధం ,అసమా పరాక్రమం ,వీర విలాసం ,రావణ వధ ,సానంద రాఘవం ‘’ఈపేర్లు చక్కగా ఆ అంకం లోని కధకు గొప్ప వివరణ గా ఉంది .నాటకానికి అవసరమైన మార్పులు చేశాడు. రావణ విరహానికి ప్రాముఖ్యం ఇచ్చాడు .మన యెన్ టి  రామా రావు లాగా రావనణుడిమీద సానుభూతి పెరిగేట్లు చేశాడు .కధలో గమనం లో సన్నివేశాలలో .నాటకం లో కళా ద్రుష్టి పూజ్యం .బాపు గారి శ్రీరామ రాజ్యం లాగా సర్వం  పూజ్యం అనిపిస్తుంది .కల్పనలకు ఎక్కువ విలువపొండాడు .

బాల భారత నాటకం కు ‘’ప్రచండ పాండవం ‘’అనే పేరుకూడా ఉంది .రెండు అన్కాలే లభించిన అసంపూర్తి నాటకం .ఇందులో  ద్రౌపదీ స్వయం వరం  ,జూదం వస్త్రాపహరణం ఉన్నాయి .కర్పూర మంజరి నాటకం ‘’సట్టకం ‘’అనే రూపక భేదానికి చెందింది .నృత్య ప్రధానమైంది .భార్య అవంతీ సుందరి ముద్దు కోరిక తీర్చ టానికే రాశాడు .మొదటి అంకం లో వసంతోత్సవ వేడుకలు ,చంద్రపాల రాజు రాణి విభ్రమ లేఖ ,విదూషక రంగ ప్రవేశం ఉంటాయి .విదూషకుడికి పరిచారిక విచక్షణ కు వసంత వర్ణన లో పోటీ ఏర్పడి కోపం వచ్చి భైరవానందుడు అనే సిద్ధుని తెస్తాడు విదూషకుడు .సిద్ధుడు మాయ జాలాన్ని చూపించి కర్పూర మంజరిని పరిచయం చేస్తాడు .రాజు ఆమె పై మరులు గొంటాడు .ఆమె రాణికి పిన్ని కూతురే .రెండవ రంగం లో మంజరి రాజు ను ప్రేమిస్తుంది .దూతిక ద్వారా తెలియ జేస్తుంది .రాజు మంజరిని చూస్తాడు .మూడవ అంకం లో మంజరి రాజుకు కలలో కన్పించిన విషయాన్ని విదూషకుడికి చెప్పటం విరహ వేదనతో మంజరి వచ్చి రాజును కలవటం ఈ వార్తా రాణి చెవిన పడటం .నాలుగులో-రాణి మంజరిని నిర్బంధం లో ఉంచటం సిద్ధుడికి కానుకగా ధన సార మంజరితో పెళ్లి చేయిస్తాననటం వార్త రాజుకు చేరవేయటం చివరికి ధనసారమంజరేకర్పూరమంజరి అని తేలటం ఇద్దరికీ వివాహం జరగటం తో సమాప్తం  ఈ నాటకం రాజశేఖరుని నాటకాలలో గొప్పదని అభిప్రాయం. నాటక కళకు కవితా శోభ అద్దాడు .రీతి భేదం చూపి రక్తి కట్టించాడు .విదూషకుడు హుందాగా మాట్లాడటం ప్రత్యేకత .శౌరసేని ప్రాక్రుతాన్ని వాడి కొత్త దారి తొక్కాడు .

విద్ధ సాల భంజిక కూడా పైనాటకం లాంటిదే .’’నాటిక ‘’ అనే రూపక  భేదానికి చెందింది .మొదటి అంకం లో రాజా చంద్ర వర్మ కూతురు’’ మృగాంక వతి’’ని  ‘’ మృగాంక వర్మ’’ అనే పేరుతొ’’ కొడుకుగా’’ ప్రకటించటం ,ఆ వేషం లో ఆమె విద్యాధర మల్లుని రాణి దగ్గరకు చేరటం అతని మంత్రికి  ఈ రహస్యం తెలిసిపోవటం ,ఆమెను పెళ్లి చేసుకొన్న వాడు చక్ర వర్తి అవుతాడని జ్యోతిష్కులు చెప్పటం ,రాజు దగ్గరే ఆమెను ఉంచటం .ఒకసారి విద్యాధర మల్లుడికి  ఆమె ముక్తాహారాన్ని విసిరిపోయినట్లుకల వచ్చి విదూషకుడికి చెబితే స్వప్నం లో చూసిన సుందరి బొమ్మను (విద్ధ సాల భంజిక )చిత్రశాలలో ప్రతిస్టిం చటం  అప్పుడు మృగాంక వర్మ రావటం ,రాజుకు ఆమె స్త్రీ అని తెలియక పోవటం తో మొదటి అంకం పూర్తీ .రెండవ అంకం లో కుంతల రాకుమారి కువలయ మాల తో మృగాంక వర్మ వివాహం జరిపించటానికి రాణి ఆలోచించటం .ఒక రోజు నిజరూపం లో ఉద్యాన వనం లో విహరిస్తున్న ఆమెను రాజు చూడటం ఉంటుంది .మూడులో రాజు  మృగాంకవతిని కలుసుకొంటాడు .ఇద్దరూ ప్రేమ బద్ధులౌతారు .నాలుగవ అంకం లో రాణికి  ఈర్ష్య ఏర్పడి   మృగాంక వర్మ పెళ్లి చేసేస్తుంది .ఇంతలో చంద్ర వర్మకు కొడుకు పుడతాడు. పుత్ర వేషం లో ఉన్న కూతురును రాజు కిచ్చి పెళ్లి చేయాలనుకొంటాడు .చివరికి రాణి ఏమీ చేయలేక మృగాంక వతి బాటు  కువలయ మాలను కూడా రాజు కిచ్చి పెళ్లి చేస్తుంది .

కదా సన్నివేశాలు బహు చమత్కారం గా తీర్చాడు. నాటకీయత లోపించి రక్తి కట్టలేదు .దీనిపై మాలవికాగ్నిమిత్ర ,రత్నావళి నాటక ప్రభావం బాగా ఉందనిపిస్తుంది .కవిత్వాపరం గా హిట్టే .నాటక కళ పరంగా ఫట్టే .ఇందులో సమకాలీన సామాజిక చరిత్ర ఉందని ఆనాటి ప్రజల మనోభావాలకు నిలువుటద్దమనీ భావిస్తారు .తన నాటకాలలో నాటక కళతక్కువే అని ఆయనే చెప్పుకొన్నాడు ..రస భావ అనుకూల భాషను ప్రయోగించటం లో రాజశేఖరుడి నేర్పు కన్పిస్తుంది .మాధుర్య గుణం తో ఉన్న సంగీత గుణం అతనికవిత్వం లో ఉంది .శబ్ద విన్యాస చతురుడు .పదలాలిత్యానికీ శేఖరుని ఉదహరిస్తారు .రాజ శేఖరుని రచనలు మునుల మనస్సుల్లాగా సమాధి గుణం కలవి ,ప్రసన్నం చేసేవి అని తిలక మంజరిలో ధనపాలుడు ప్రశంసించాడు –‘’సమాధి గుణ శాలిన్యః ప్రసన్న పరి పక్త్రియా –యాయా వర కవేర్వాచో మునీనామివ వృత్తయః ‘’

సంస్కృతం లోనే కాక ప్రాక్రుతభాషలైన శౌరసేని ,ప్రాకృత అపభ్రంసః భాషలమీదా ఆధారిటీఉన్నవాడు .బాల రామాయణం లో ‘’ప్రాకృతం సంస్కృతానికి జనని ‘’అని స్పష్టం గా చెప్పాడు .ప్రాకృత భాషలు చెవికి సోకితే ఇతర భాషలు రుచించవు అనీ చెప్పాడు .’’శుభస్య అపభ్రంశః ‘’అన్నాడు కావ్య రచనకు అపభ్రంశ భాషలు ఇతోధికం గా తోడ్పడతాయి అన్నాడు .భూత భాషను ‘’సరస రచనం భూత వచనం ‘’అని కీర్తించాడు .ఈ విధం గా అంతకు ముందు ఏ కవీ చేయని సాహసం చేసి ఆనాడు జన సామాన్యం లో వాడుకలో ఉన్న భాషలను సమాదరించి ,వాటికీ కావ్య గౌరవం ఉంది అని నిర్ద్వంద్వం గా తెలియ జెప్పిన వాడు రాజ శేఖరుడే .

కావ్య మీమాంస

రాజ శేఖరుడు రచించిన అలంకార శాస్త్రం ‘’కావ్య మీమాంస ‘’.ఇది క్షేమేంద్ర ,భోజ హేమచంద్రాదులకు ప్రేరణ గ్రంధం ఇందులో పద్దెనిమిది అద్యాయాలున్నాయి .కావ్య పురుషుడి ఉత్పత్తితో ప్రారంభించి ,అతడు అష్టాదశ శిష్యులకు కావ్య విద్యలు నేర్పటం శిష్యులు వాటిపై గ్రంధ రచన చేయటం, కావ్య భేదాలు ,సాహిత్య విద్యా కన్యను కావ్య పురుషుడు వివాహమాడటం,కవి భేదాలు ,భాష, శైలి వగైరాలు కవి సమయాలు ,కవిరహస్యాలు అలంకార సిద్ధాంత సమీక్ష మొదలైనవన్నీ శాస్త్రీయం గా రాశాడు .ఇలాంటివిషయ చర్చలు ఇంతకూ పూర్వం ఎవరూ చేయలేదు .అందుకే అపూర్వం అనిపిస్తాయి. కావ్యార్దాపహరణ లోముప్ఫై రెండు రకాలను తెలియ జేసి , చర్చించాడు .కవులకు అర్దాపహరణ తప్పదు అన్నాడు .గుణ రీతి ధ్వని సిద్ధాంతాలను స్పృశించాడు .కవుల దిన చర్యలు రాజ సభల్లో గోష్టి విధానం గొప్పగా చిత్రించాడు .రుద్రటుడి ప్రభావమ్ ఇతనిపై ఎక్కువ అంటారు .అలంకారాలు ,రీతులు కావ్యానికి ఉపయోగ సామగ్రి అన్నాడు .ఇవేవీ కావ్యాత్మకాదన్నాడు .ధ్వనిని గురించి ఎక్కడా స్పష్టం గా చెప్పలేదంటారు.అంటే అప్పటికి ధ్వని సిద్ధాంత వ్యాప్తి బాగా ఉండి  ఉండక పోవచ్చు  ఉక్తి వైచిత్రి అవసరం అన్నాడు .

భార్య అవంతీ సుందరికూడా సంస్కృత ప్రాకృత పండితురాలు .ఆమె అభిప్రాయాలకు విలువనిస్తూ చాలా సార్లు పేర్కొన్నాడు .’’రసోచిత శబ్దార్ధ సూక్తులను కావ్యం గా పరిగ్రహిం చాలి ‘’అని అవంతీ సుందరి చెప్పినదానితో తానూ ఏకీభవిస్తున్నట్లు రాజశేఖరుడు చెప్పాడు .’’రసకవి యేఉత్తమ కవి ‘’అన్నాడు .కనుక రస సంప్రదాయానికి చెందిన వాడుగా రాజ శేఖరుని గుర్తించారు  .కావ్య మీమాంసను ఆంగ్లం లో సి ఎస్ వెంకటేశ్వర న్ అనువదించి విపులమైన వివరణ చేశాడు .

Inline image 1  Inline image 2

మరో కవితో మళ్ళీ

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జాషువా జాడ ప్రామానికమా అని ప్రశ్నించిన -బండి నారాయణ స్వామి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -36 -34-శాంతాన్ని నవమ రసం గా చెప్పిన –ఉద్భటుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -36

34-శాంతాన్ని నవమ రసం గా చెప్పిన –ఉద్భటుడు

‘’కావ్యాలంకార సార సంగ్రహం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన ఉద్భట భట్టు కాశ్మీర దేశస్తుడు .కాశ్మీర రాజు జయా పీడుడి ఆస్థాన పండితుడు .కనుక ఇతనికాలం  779-813అని నిర్ధారించారు .ఈ విషయాన్ని కల్హణుడు తన రాజ తరంగిణిలో లో పేర్కొన్నాడు .’’విద్వాన్ దీనార లక్షేణ ప్రత్యహం కృత వేతనః –భట్టో  భూ దుద్భటస్తస్య భూమి భర్తుః సభా పతిః ‘’

కవితోద్బటం

ఉద్భటుని ‘’కావ్యాలంకార సార సంగ్రహం ‘’అలంకార రచన .ఇదికాక’’ భామఃహ  వివరణ ‘’అనే గ్రంధమూ రాశాడు .ఇది భామహుడు రాసిన కావ్యాలంకారానికి వ్యాఖ్యానమే .కాని ఇది లభించటం లేదని చెప్పుకొన్నాం .భరతుడి నాట్య శాస్త్రానికి ఉద్భటుడు టీక కూడా రాశాడు .ఇవికాక ‘’కుమార సంభవం ‘’అనే కావ్యం రాసినట్లుంది ..ఈ కావ్య శ్లోకాలను తన అలంకార గ్రంధం లో ఉదాహరణలుగా ఇచ్చాడు .

కావ్యాలంకార సార  సంగ్రహం కూడా ఆరు పరిచ్చేదాలల్తో ఉన్న గ్రంధం .మొత్తం 79కారికలున్నాయి .భామహుడు నడిచిన బాటలోనే దీన్ని రాసినా అతనికంటే భిన్నమైన అలంకార వివేచన చేశాడు .భిన్నం గా అలంకార భేదాలనూ చెప్పాడు .మొత్తం మీద నలభై ఒక్క అలంకారాలను ఉద్భటుడు వివరించాడు .ఇతని ఉపమ ,ఉత్ప్రేక్ష ,అతిశయోక్తి లను తరువాత  అలంకారికులైన  ముమ్మటుడు రుయ్యకుడు గ్రహిం చారు .కావ్య సౌందర్యానికి గుణాలతో బాటు అలంకారాలు అవసరమే నని ఉద్భటుడు చెప్పిన దానితో రుయ్యకుడు ఏకీభవించాడు .ఉద్భటుడు శాంత రసాన్ని తొమ్మిదవ రసం గా నాట్య శాస్త్రం లో చెప్పాడని పండితాభిప్రాయం .

రీతులను దేశ పరం గా కాకుండా ఉపనాగరక ,గ్రామ్య ,పరుష అనే పేర్లతో పిలిచాడు .ఇది శబ్ద సంయోజనం పై ఆధార పడి ఉండేట్లు చెప్పాడు .ఉపనాగరిక రీతి పరిష్కృతం అయిన పధ్ధతి .గ్రామ్య రీతి సాధారణ మైంది .పరుష రీతి అంటే కఠినమైనది .క్రీ శ .తొమ్మిది వందల యాభై ప్రాంతం వాడైన‘’ప్రతిహా రేందు రాజు’’ ఉద్భటుని కావ్యాలంకార సార సంగ్రహానికి  విపుల మైన వ్యాఖ్యానం రాశాడు .ఉద్భటుడి శిష్య పరంపర రాజశేఖరుడి వరకు వ్యాపించి ఉంది అని ‘’ఇతి ఔదంభరాఃఉద్భట మతానుయాయినః ‘’అని రాజ శేఖరుడు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది .ఉద్భటుని సంప్రదాయం ‘’ఔద్భట సంప్రదాయం ‘’అని పిలువ బడుతోంది .శ్రవ్య కావ్యం లో రసమే ‘’జీవద్రూపం ‘’అని ఉద్భటుడుఅంగీక  రిం చాడని తెలుస్తోంది .ప్రాచీన ఆలంకారుల్లో ఉద్భటునిదిమూడవ స్థానం .మొదటివాడు భరతుడు రెండవ వాడు భామహుడు ,మూడవ వాడు ఉద్భటుడు .రసభావ అలంకార సంయోజనం  గురించి చెప్పిన వాడు ఉద్భటుడు

35- సూత్ర పద్ధతిలో అలంకార గ్రంధం రాసి కావ్యాత్మను చెప్పిన  -వామనుడు

ఇప్పటికి వరకు మనం చెప్పుకొన్న అలంకారికులు తమ గ్రంధాలను పద్యాలకారికల్లో రాస్తే వామనుడు మాత్రం సూత్ర పద్ధతిలో అలంకార గ్రంధం రాశాడు .ఈయనా ఉద్భటుడిలాగే కాశ్మీర రాజు జయా పీడుని ఆస్థాన కవే కాకుండా మంత్రికూడా .ఇతని అలంకార గ్రంధం పేరు ‘’కావ్యాలంకార సూత్ర వ్రుత్తి ‘’.ఏదైనా సూత్రాలుగా చెబితేనే అది శాస్త్రం అవుతుందని నమ్మి అలా రాశాడని భావిస్తారు .ఈగ్రంధం లో మూడు వందల పందొమ్మిది సూత్రాలు ఉన్నాయి .అయిదు అధికరణాల్లో ,పన్నెండు అధ్యాయాలుగా రచించాడు .తన సూత్రాలకు అర్ధాలను కూడా వామనుడే రాసుకొన్నాడు .అదొక ప్రత్యేకత .సూత్రాలను వివరించే వాటికి ‘’వ్రుత్తి ‘’అని పేరు పెట్టాడు .ఇతనికి ముందున్న అలంకారికులు లక్షణాలకు ఉదాహరణలను తమ స్వంత కావ్యాలనుంచే ఇచ్చారు .కాని దీనికి భిన్నం గా వామనుడు ఇతరకవుల కావ్యాలనుంచి ఉదాహరణలు సేకరించి అందజేసి తన సిద్ధాంత వ్యాప్తి చేసుకొన్నాడు . ఇదీ రెండో ప్రత్యేకత.

వామన విశ్వ రూపం

వామనుడు  రాసిన కావ్యాలంకార సూత్ర వృతి లోకావ్య పరిభాష ,కావ్య ప్రయోజనం కావ్య హేతువులు ,కావ్య రీతులు ,కావ్య అంగాల నిరూపణ చేశాడు .రెండు మూడు నాలుగుల్లో  దోష ,గుణ ,అలంకార నిరూపణ చేశాడు .అయిదులో శబ్ద శుద్ధి గురించి చెప్పాడు .ఇది భామహుని కావ్యాలంకారం లోని చివరిపరిచ్చేదాన్ని తలపింప జేస్తుంది .ముప్ఫై మూడు అలమ్కరాలనువామనుడు చెప్పాడు అందులో వక్రోక్తికి ,వ్యాజోక్తికి ఎక్కువ ప్రాముఖ్యాన్నిచ్చాడు .

కావ్యం యొక్క ‘’ఆత్మ ‘’ను గురించి మొదట చెప్పిన వాడు వామనుడే .ఆతను అన్నమాట ‘’రీతి రాత్మా కావ్యస్య ‘’అనేది అందరికి నోట నానిన సూత్రమే .అంటే కావ్యానికి ప్రాణం రీతి .అది ఆత్మ వంటిది అన్నాడు .’’కావ్య శోభాకరాన్ ధర్మాలంకారాన్ ప్రచక్షతే’’అని దండి అభిప్రాయపడ్డాడు .కాని వామనుడు కావ్య శోభ గుణాల వలననే కలుగుతుందని చెప్పాడు –అదే ‘’కావ్య శోభాయాః కర్తారో ధర్మా గుణాః’’అని సూత్రీకరించాడు ఖచ్చితం గా .గుణాల వలననే కావ్యానికి సౌందర్యం కలుగుతుందని ,ఆ సౌందర్యాన్ని ఇనుమడింప జేసేది అలంకారం అని స్పష్టం గా చెప్పాడు .అలంకారాలు లేక పోయినా కావ్యం యొక్క సహజ సౌందర్యానికి ఏ విధమైన లోపమూ రాదనీ వామన మతం .వ్యక్తి గుణాల వల్ల ఆత్మ సౌందర్యం పొందినట్లుగానే ,కావ్యానికి కూడా సౌందర్యం గుణాల వల్ల ఏర్పడుతుంది అన్నాడు .కనుక వామనుడు ‘’సౌందర్య వాది’’ అని పిలవ బడ్డాడు .

వామన ఉద్భట అలమ్కారికులిద్దరూ ఒకే రాజాస్థానం లో ఉన్నారు .కాని ఒకరు రాసిన దానిలో రెండవ వారిని పేర్కొనక పోవటమే అమితఆశ్చర్యం  కలిగిస్తోందని విశ్లేషకులు అంటారు .ఇద్దరివి భిన్నమార్గాలు కూడా అని మనకు తెలిసిన విషయమే .ఉద్భటుడు భామహుని అనుసరిస్తే ,వామనుడు దండి ని అనుసరరించి రీతి సిద్ధాంత కర్త అయ్యాడు .దండి కావ్యాన్ని వ్యక్తీ తో పోల్చగా వామనుడు వ్యక్తికీ ఆత్మ ఉన్నట్లు కావ్యానికీ ఆత్మ ఉంటుంది అన్నాడు .కాశిక రాసిన వామనుడు ,కావ్యాలంకార సూత్ర వ్రుత్తి కర్త వామనుడు ఒకరే అని పండితుడు పి వి కాణేనిర్ణయిస్తే ,బూల్యర్ పరిశోధకుడూ దాన్ని సమర్ధించాడు . వామనుడు రీతి అంటే శైలి కావ్యానికి ఆత్మ అన్నాడు .పాంచాలి రీతి మాధుర్యం గా ఉంటుందని ,గౌడీరీతిలో వేగం శక్తి ఉంటాయని  వైదర్భీ రీతిలో ఇవన్నీ సమపాళ్ళలో కలిసిఉంటాయని చెప్పాడు .

వామనుడు మహా మేధావిగా పరిగణింప బడ్డాడు .’’కావ్యం గ్రాహ్య మాలాన్కారాత్ –సౌందర్య మాలకారః ‘’అని తన గ్రంధాన్ని ప్రారంభించాడు .అలంకారం అంటే సౌన్దర్యమేనన్నాడు ‘’కావ్య శోభాకారాణ్ ధర్మన్ అలంకారాన్ ప్రచక్షతే ‘’అని దండి అంటే –వామనుడు ‘’కావ్యా శోభయా కర్తారో ధర్మాః గుణాః-తదతిస్య హీత్వాః-అలమ్కారః ‘’అన్నాడు .సహజ సౌందర్యం గుణాలవలన ,కృత్రిమ సౌందర్యం అలంకారాల వలన లభిస్తుందని గుణాలకే ఎక్కువ మార్కులు వేశాడు .గుణాలు చక్కని బంధాన్ని ఏర్పరుస్తాయన్నాడు –‘’ఓజః ప్రసాద శ్లేష సమతా సమాధి మాధుర్య సౌకుమార్య –ఉదారతా అర్ధ వ్యక్తీ కాన్తయో బంధుగుణాః’’.అలాగే ‘’విశిష్ట పద రచన రీతి –విశిష్ట గుణాత్మా ‘’అని అన్నాడు .పదరచన విశిష్టం గా ఉంటె నిర్మాణం బాగుంటుంది ..కానీ రీతి  ఆత్మ.విశిస్టపదరచన వ్యన్జకం అయితే రీతి వ్యంగ్యం అని వివరించాడు .విశిష్ట పదరచనతో రీతి పుష్టి చెంది అలౌకిక  సౌన్దర్యాన్నిస్తుందని భావం .పాకం సహ్రుదయుడిని ఆకర్షించి ఆనందింప జేస్తుందని చెప్పాడు –‘’ఉదయితి హై సా తాద్రిక్ క్వాపి వైదర్భ రీతౌ సహృదయ హృదయాననం –రంజకః కూపీ పాకః ‘’’’అని అన్నాడు రీతిని పాకాన్ని ఎలా సరిగ్గా నిర్వచింప లేమో అలానే కూపీ పాకం కూడా అనిర్వచనీయం అన్నారు .శబ్ద పాకం అర్ధ పాకం సమపాళ్ళలో సంయోజనం చెందితే సహృదయ రంజకం జరుగుతుందని భావం .

మరొకరితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరో రెండు సరసభారతి ప్రచురణలు

సాహితీ బంధువులకు శుభాభినందనలు -సరస భారతి పద్నాలుగవ ప్రచురణ గా సరసభారతికి ఆత్మీయులు ,అమెరికా వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు స్పాన్సర్ చేస్తూ ,వారికి  అభిమానులైన శ్రీ మాగంటి సుబ్బారావు గారికి(85)  (తెనాలి )అంకితం ఇస్తున్న నేను నెట్ లో రాసిన ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”ను మైనేనిగారి 80వ పుట్టిన రోజున  10-1-2015ఆదివారం ఉయ్యూరు లో శ్రీ సువర్చలాన్జనేయ స్వామి సన్నిధిలో సాయంత్రం జరిగె శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవసమయం లో లాంచనం గా ఆవిష్కరించి ,13-1-2015 బుధ వారం ధనుర్మాస సందర్భం గా భోగి నాడు మధ్యాహ్నం అరిగె స్వామి వారల కళ్యాణ సమయం లో పూర్తిగా ఆవిష్కరించి భక్తులకు అందజేస్తున్నామని తెలియ జే యటా నికి  అందిస్తున్నాను . ఇది మైనేని వారు స్పాన్సర్ చేస్తున్న నాలుగవ పుస్తకం అని గుర్తు చేస్తున్నాను .

    నెట్ లోనే నేను రాసిన ”దర్శనీయ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలు ”గ్రంధాన్ని అమెరికాలో ఉంటున్న మా మేనల్లుడు ఛి వేలూరి  మృత్యుంజయ  శాస్త్రి (జె వేలూరి-jay veluri) స్పాన్సర్ గా ఉండి స్వంత ఖర్చులతో ముద్రించటానికి  ముందుకు వచ్చి తమ తల్లి దండ్రులైన శ్రీ వేలూరి వివేకానంద శ్రీమతి దుర్గ అంటే మా అక్కయ్యా బావ గార్లకు  అంకితం ఇచ్చేట్లు ,ఆపుస్తకాన్ని 2015  మే -జూన్ నెలలలోవచ్చే  వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి నాడు స్వామివార్ల కళ్యాణ మహోత్సవం లో  ఆవిష్కరణ చేస్తే బాగుంటుందని  అంగీకరింఛి   ఇప్పుడే మెయిల్ ద్వారా తెలియ జేశాడు  . ఇవి సరసభారతి ప్రచురిస్తున్న 14 ,15 పుస్తకాలు .నేను రాసిన తొమ్మిది ,పది పుస్తకాలు అని మనవి చేస్తున్నాను శ్రీ మైనేని గారికివారి కుటుంబానికి  ,ఛి శాస్త్రికి  ,వాళ్ళ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియ జేస్తూ సరస భారతికి కొండంత అండగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలియ జే స్తున్నాను . ఇలాంటి సహృదయుల సహకారం తో సరస భారతి ప్రగతి పధం లో పయనిస్తోందని వినయం గా  మనవి చేస్తున్నాను -దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35

33-మొదటి శ్రవ్యకావ్య అలంకారికుడు-భామహుడు

భామహుడు ఏడవ శతాబ్దానికి చెందిన కాశ్మీర దేశపు కవి ,ఆలంకారికుడు .దండికవికి సమకాలీనుడు ..’’కావ్యాలంకారం ‘’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .నాట్య శాస్త్రం లో భరతుడు రంగ ప్రదర్శనకు నోచుకొన్న నాట్య ,రూపకాల లక్షణాలు వివరించాడు .ఇవన్నీ దృశ్య రూపకాలు. కాని అప్పటికి శ్రవ్య కావ్యాలు లు అంతగా ప్రాచుర్యం పొందలేదు కనుక వీటి సిద్ధాంతాలపై ఎవరి దృష్టీ పడలేదు .శ్రవ్య కావ్య లక్షణాలపై తొట్టతొలి రచన చేసిన వాడు భామహుడు .అందుకే చరిత్ర ప్రసిద్ధి పొందాడు .కావ్యాలంకారం లో భామహుడు శ్రవ్య కావ్యాలో ఉన్న తేడాలు ,వాటి స్వరూపాలు ,మహా కావ్య లక్షణాలు ,కావ్య గుణ దోషాలు ,కావ్య గతమైన అలంకారాలు మొదలైన వాటిని మొట్ట మొదటగా  చర్చించిన వాడు భామహుడే .భరతుడి నాట్య శాస్త్రం తర్వాత అలంకార గ్రంధం భామహుదు రాసిన కావ్యాలంకారం .భామహుడి తండ్రి పేరు ‘’రుక్రిల గోమిన్ ‘’ఇది బౌద్ధ నామం అని ఊహించి అతడు బౌద్దుడన్నారు .కాని భామహుడు కావ్యారంభం లో ‘’ప్రణమ్య సర్వం సర్వజ్ఞం మనోవాక్కాయ కర్మభిః ‘’అని చెప్పటం వాళ్ళ అనుకొన్న పొరపాటు ఇది సర్వజ్ఞ నామం శివుడికే ఉంది –‘’సర్వజ్ననామము శర్వునికే  గాక’’అన్న పద్యం మనకు గుర్తు ఉంది .అదీకాక రామాయణ మహా భారత ఉదాహరణలే భామహుడు ఇచ్చాడు .కనుక బౌద్దుడుకాడు .

‘’ కావ్యాలంకార ‘’శోభ

భామహుడు రచించిన కావ్యాలన్కారం లో ఆరు పరిచ్చేదాలున్నాయి .అలంకారం అనే శబ్దానికి ‘’సౌందర్యం ‘’అనే అర్ధం కూడా ఉంది .వీటిని ‘’ కారికలు’’ అన్నాడు .మొదటి పరిచ్చేదం లో కావ్య ప్రయోజనాలు ,కావ్యానికి హేతువులు ,కావ్య లక్షణాలు ,భేదాలు గురించి చెప్పాడు .రెండవ దానిలో కావ్య గుణాలు ,మూడు లో అలంకారాల చర్చ చేశాడు .చతుర్ధ పరిచ్చేడం లో పూర్వ పరిచ్చేదాలలో వదిలేసిన వాటిని వివరించాడు .పంచమం లో తర్క శాస్త్రాధారం గా దోషాలను ఆరులో వ్యాకరణ శాస్త్ర రీత్యా వచ్చే దోషాలను గురించి వివరణ ఉంది .అలంకారాలను దోషాలను విపులంగా భామహుడు చర్చించటం వలన కావ్యం అనేది శబ్ద శుద్ధికలిగి ఉండాలని  ,అలంకారాలతో శోభించాలని భావించాడు .

భరతుడు చెప్పిన రస సిద్ధాంతాన్ని భామహుడు చర్చించ లేదు .అగ్నిపురాణ కర్త రసమే కావ్యానికి జీవం జవం అని అంగీకరించినట్లు గా భామహుడు  అంగీకరించినట్లు కనిపించదు .భామహుడి దృష్టిలో శబ్దం అర్ధం  ఉండేదేకావ్యం .కావ్యప్రయోజనానికి వైచిత్రి ,వక్రోక్తి తో కలిసిఉన్న అర్ధ సంయోజనం ముఖ్యమైన అవసరం అని చెప్పాడు .దీని తో బాటు కావ్యం దోష రహితం గా ఉండటమే కాకుండా గుణ సహితం గా ఉండాలని కోరాడు .రసాన్ని ‘’రసదలంకారాం’’గా భావించి భామహుడు వివరించాడు .మొత్తం మీద భామహుని దృష్టిలో అలంకారమే కావ్యానికి ప్రధానం .దృశ్యకావ్యం లో రసానికి ప్రాధాన్యం ఉన్నట్లు శ్రవ్య కావ్యం లో రస ప్రాధాన్యత అంత అవసరం లేదని భావించాడు .ముప్ఫై ఆరు అలంకారాలను ,రెండు శబ్దాలంకారాలను భామహుడు వివరించి చెప్పాడు .కావ్యం రాసేవారికి వ్యాకరణ పరిజ్ఞానం తో బాటు శబ్ద పరిచయం ఎక్కువగా ఉండాలని చెప్పాడు .ప్రసాదం మాధుర్యం ఓజో గుణాలను పేర్కొని భామహుడు ప్రసాద మాదుర్యగుణాలు శ్రేష్టమైనవి అని పేర్కొన్నాడు .’’శబ్దార్ధౌ సహితౌ కావ్యం ‘’అనేది భామహుని నినాదం .

ఎనిమిదవ శతాబ్దికి చెందినా ఉద్భటుడుఅనే అలంకార శాస్త్ర వేత్త  భామహునికావ్యాలంకార శాస్త్రానికి’’భామహ వివరణ ‘’లేక భామహ వ్రుత్తి ‘’అనే  చక్కని వ్యాఖ్య రాశాడు .కాని దురదృష్ట వశాత్తు ఇది లభించటం లేదు .దీన్ని ‘’ప్రతిహా రేందు రాజు ,అభినవ గుప్తుడు, రుయ్యకుడు మాత్రం పేర్కొనటం వలన మాత్రమె తెలుస్తోంది .భామహుడు మరోరచన చేశాడని అదే వర రుచి రాసిన ‘’ప్రాకృత ప్రకాశం ‘’కు రాసిన ‘’మనోరమ ‘’అనే వ్యాఖ్యానం . నారాయణ భట్టు భామహుడు ‘’ఛందో గ్రంధం ‘’కూడా రాశాడని ,అందులో అనేక చందోరీతులున్నాయని తెలిపాడు ,కనుక రాసిఉండచ్చు అని అనుకో వచ్చు .భామహుడు తరువాతి ఆలన్కారికులపై గొప్ప ప్రభావాన్ని చూపాడు ఆ ప్రభావం పొందిన వారిలో ఉద్భటుడు ,ఆనంద వర్ధనుడు ,అభినవ గుప్తుడు, ముమ్మటుడు మొదలైన వారున్నారు .

వైదర్భి ,గౌడీ రీతులను పోలుస్తూ వైదర్భిని ‘’అవక్రోక్తి ‘’అన్నాడు భామహుడు .స్వభావోక్తి లో వైచిత్రి ఉండడుకనుక దాన్ని వదిలేశాడు .’’యుక్తం లోక స్వభావేన రసిక శకలైః ప్రుధక్ కావ్యాలంకారా’’అన్నాడు భామహుడు .దీని అర్ధం మహా కావ్యం లోసందర్భాన్ని బట్టి అనేక రసాలు ఉండాలి .రసం కంటే  ఆలంకారాలకే ప్రాధాన్యత నిచ్చాడు .

నాగ నాద శాస్త్రి బటుక్ నాద  శర్మలు ఆంగ్లం లో ఈ కావ్యాలంకారాన్ని వెలువరించారు .తాతాచారి 1934లో తెచ్చిన పుస్తకం ఈరెందిడిటికన్న శ్రేష్టమైనది .

Inline image 1  Inline image 2

మరో కవిని కలుసుకొందాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చారిత్రక కోణంలో వైదిక వాఙ్మయం – ప్రొ.ముదిగొండ శివప్రసాద్ ,ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ సాహిత్యం- సృజనపై ”సుధామ

అలుపెరుగని సాధన.. అద్భుత సృజన..

  • -సుధామ
  • 11/10/2014
TAGS:

సృజన
-శ్రీకాంతశర్మ సాహిత్యం
ఒకటవ సంపుటి
ప్రతులకు: ఇంద్రగంటి ఫ్యామిలీ
104, సాహితి రెసిడెన్సీ,
ప్రేమ్‌నగర్ కాలనీ, (జి.కె.కాలనీ)
సైనిక్‌పురి పోస్ట్, సికిందరాబాద్-94
వెల: రూ.2500
(రెండు సంపుటాలకూ కలిపి)

‘మనం ఎంచుకున్న మార్గాన్నిబట్టి
మన జీవనక్రమం నిర్ణయవౌతుంది’
(‘సుపర్ణ’ కావ్యంలో)
సప్తతి పూర్తి చేసుకున్న కవి పండితుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సమగ్ర సాహిత్యం ‘సృజన’ పేర రెండు సంపుటాలుగా వెలువడింది. కథలు, నవలలు, నాటకాలు ఎన్నో రాసినా, వౌలికంగా శ్రీకాంతశర్మకు కవిగా, పండితునిగానే పేరు. 1168 పేజీల ఈ ఒకటవ సంపుటిలో 398 పేజీలే ఆయన కవితా మూర్తిమత్వం. మిగతావన్నీ వచన రచనలే. అందులోనూ నాటకాలు, నాటికలే ప్రథమగణ్యం. ఆ తరువాతనే ఆయన నవలలూ, కథలూ. లలిత గీతాలు, యక్షగానాలూ కవిత్వ పార్శ్వాలే. ఒక సృజనకారుడి బహుముఖీనతకు ఈ ప్రక్రియా వైవిధ్యం నిలువుటద్దం. వ్యాసాలు, సమీక్షలు, మున్నుడులు, పరిచయాలు వంటి రచనలన్నీ వారి పాండితీ వైభవ సంకేతాలే కావడంతో శ్రీకాంతశర్మ అనగానే కవి పండితుడు అనీ, పండిత కవి అని భావించేవారే అధికం. ఆయన విమర్శనా రచనలు కూడా పాండిత్యంలో భాగాలే.
నిజానికి శ్రీకాంత శర్మ వృత్తిరీత్యా ప్రధానంగా ఎంచుకున్న మార్గాలు రెండు. ఒకటి పత్రికా మాధ్యమం, రెండవది శ్రవ్య మాధ్యమం అయిన ఆకాశవాణి. ఈ రెండింటి కారణంగానే ఆయన జీవనక్రమం నిరంతర సాహిత్య ప్రస్థానంగా సాగింది. రెండింటా అనివార్యంగా కలం పట్టక తప్పని అవసరం, స్వతహాగా వివిధ సాహిత్య ప్రక్రియా రచనలు చేయాలన్న అభిమతం, ఇన్నాళ్లుగా ఇనే్నళ్లుగా తన చేత రాయిస్తూ, సహస్రాధిక పుటల రెండు సంపుటాల రూపంలో ఇవాళ అభివ్యక్తమవుతోంది. వీటిల్లోకి రాని రచనలు ఇంకా మిగిలే ఉంటాయన్నది వాస్తవం. ఎందుకంటే తానే స్వయంగా ఓ ‘ఎడిటర్’. తొలుత ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీ ఉపసంపాదకునిగా, ఆపై ఆకాశవాణిలో రచయితగా, కార్యనిర్వహణాధికారి అయినా ఆకాశవాణి నుంచి పదవీ విరమణ చేసి తిరిగి ‘ఆంధ్రప్రభ’ వారపత్రిక సంపాదకునిగా, తన ఉద్యోగ భూమికను నిర్వర్తించినందువల్లనే- ఆయనకు తను రాస్తున్నది ఏమిటో, తాను చేస్తున్నది ఏమిటో క్షుణ్ణంగా తెలుసు. మనసు పెట్టి చేసిన రచనలే కానీ, మనసు చంపుకుని రాసినవి ఇందులో లేవు.
శ్రీకాంతశర్మ సుకుమార భావుకుడు, అనుభూతి ఆరాధకుడు. విశ్వసించిన దానిపట్ల ఎప్పుడూ విముఖత చెందని జగమొండి. గాలివాటుగా ఉద్యమాల వెంటబడి ఆ మూసలో కవి అనిపించుకున్నవాడు కాదు. సంప్రదాయాన్నీ, అభ్యుదయాన్నీ మేళవించి, మానవీయ అనుభూతులకు అక్షరాకృతుల నిచ్చినవాడు. చాలామంది రచయితల రచనలు పాఠకులకు మాత్రమే చేరుతాయి. పత్రికలు కేవలం అక్షరాస్యులకే! అయితే వాటిని చదివేవారిలో – ఒక పాఠక హృదయం మాత్రమే వుండదు. సామాజికుడయిన ప్రతి వ్యక్తిలో ఒక పాఠకుడూ, ఒక శ్రోతా, ఒక ప్రేక్షకుడు వున్నారు. ఒక రచయిత సృజన అంతా త్రిముఖంగా సామాజికులకు చేరి సంతృప్తినిచ్చి ఉపయుక్తం కాగలిగినప్పుడే, ఆ రచయిత ప్రతిభావంతునిగానూ, ఆ రచన ప్రయోజనదాయకంగానూ భాసించడం వీలవుతుంది. అదిగో ఆ ప్రజ్ఞామతి అయిన రచయిత శ్రీకాంతశర్మ.
శ్రీకాంత శర్మ రచనలు పాఠకులనూ, శ్రోతలనూ, ప్రేక్షకులనూ ఏకకాలంలో సామాజికునిలో వున్న ఆ మూడు పార్శ్వాలనూ తట్టగలిగేవిగా ఉం టాయి. అందుకే అంతటి కవి పండితుడూ సామాన్యమైన సా మాజికులనూ తన రచనలతో మెప్పించగలిగాడు.
పత్రికలకు కథలు, నవలలు, వ్యాసాలు, సమీక్షలు, కాలమ్స్ రాసిన వాడే – రేడియోకి పాటలు, నాటకాలు, నాటికలు, రూపకాలు ఎన్నో రాశాడు. ప్రసంగాలు చేశాడు. అలాగే రంగస్థలానికి కావలసిన నాటకాలు, నృత్య రూపకాలు రాశాడు. కొన్ని సినిమాలకు పాటలూ రాశాడు. అచ్చు అక్షరాల్లోనే కాక, ఇలా శ్రవ్య, దృశ్య మాధ్యమాల్లో అక్షరాలుగా వినబడ్డాడు. కనబడ్డాడు. కనుకనే ఆయన జీవన క్రమం వైవిధ్యభరితమైంది. మూస ధోరణులకు భిన్నంగా ఎప్పటికప్పుడు వికాసవంతమైంది.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం వైభవ ప్రాభవాలకు శ్రీకాంత శర్మ రచనా (ప్ర)వృత్తి ఎంతగానో దోహదపడింది. తనకు సంతృప్తినీ, సంస్థకు దీప్తినీ కలిగించింది. ఈ సంపుటంలో లలిత గీతాలు, యక్షగానాలు, నాటకాలు, ఇరుగుపొరుగు నాటికలు విభాగంలోని రచనలు – రేడియో రచనలను కలిగి వున్నాయి. 1982- 2003 వరకు ఆకాశవాణి వార్షిక జాతీయ పురస్కారాలలో ఏడు ప్రథమ బహుమతులు, మూడు ద్వితీయ బహుమతులు, అయిదు యోగ్యతా పత్రాలు సాధించిన ఘనత శ్రీకాంత శర్మ రచనలదే! అవన్నీ సృజనాత్మకం, సంగీత రూపకం, డాక్యుమెంటరీ, నాటకీకరణ విభాగాలవే. ఆ రచనలకు రూపకల్పన చేసింది సి.రామమోహనరావు, ఎస్.బి.శ్రీరామమూర్తి, కలగా కృష్ణమోహన్, పాండురంగారావు ప్రభృతులే కావచ్చుగాక, కానీ రికార్డు స్థాయిలో అన్ని బహుమతులకు శ్రీకాంతశర్మ రచనలే మూలకందం. ‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’ అనే బాలల గీతం నుండి, ఈ మాసపు పాటలు, సంగీత రూపకాలు ఎన్నో ఆకాశవాణి ద్వారా ప్రసారమైన శ్రీకాంత శర్మను రేడియోవాడిగా శ్రోతల హృదయాల్లో సుప్రతిష్ఠితం చేశాయి.
రెండేళ్ల క్రితం 2012లో వెలువడిన శ్రీకాంతశర్మ ‘ఏకాంత కోకిల’ ఒక రకంగా ఆయన జీవన రేఖలు కొన్నింటి కవితాత్మక ప్రదర్శనమే. అందులోని నివేదనములో తన ఆకాశవాణి సహోద్యోగి గూర్చి-
ప్రహరాజు పాండురంగడు
అహరహమును నాకు తోడనంగా, వృత్తిన్
సహచరుడై ఏ చరించెను
విహరించితి నతడి వెంట వివిధ విధములన్
అంటూ – తన నాటక నాటికాభిరుచులకు దోహదమైన మిత్రునిగా తలుచుకున్నారు. అలాగే ‘స్వస్ర్తి అభిశంస’ అంటూ – తను ప్రేమించి పెళ్లాడిన, సాహిత్య సంగీత సమలంకృత ‘జానకీబాల’ గురించి కూడా సరదాగా రాశారు. బహుశా గొప్ప గాయని కూడా అయిన జానకీబాల, కుమార్తె కిరణ్మయిలే ఆయన పాటల రచనా పాటవానికి పరోక్ష ప్రేరకులు కావచ్చు. ‘ఏకాంత కోకిల’లో శర్మగారి ‘ఆరాటాలు’ ‘ఆలోచనలు’ ‘కవి హృదయం’ అవిష్కృతమయ్యాయి. బహుమతులు బడసిన తమ సృజన రేడియో రచనల్లోని పాటలను కూడా ఇందులో చేర్చారు.
రూప, చైతన్య సంగమ రూఢి దెలుపు
సృజనశక్తికి శాస్తమ్మ్రు సిగ్ధతనువు
గంధలహరిని బోలెడు కళ మనస్సు
మనుపజేసెడి యనుభూతి మనిషిభూతి
అంటారు. అనుభూతి కవిగా శ్రీకాంత శర్మను కవితా లోకం ఏనాడో గుర్తించింది. తిలక్, ఇస్మాయిల్ వంటి వారిని అజంతాను ఎంతో ఇష్టపడతారు శర్మగారు. యక్షగాన రచనలో శర్మగారి కవితా ప్రావీణ్యం వల్లనే ఆయనను పండిత కవి అనేవారున్నారు. రేడియోలో సంగీత రూపకాలు, వేదికలపై శోభానాయుడు వంటి నర్తకీమణుల కోరికపై రచించి ఇచ్చిన నృత్య రూపకాలు శ్రోతలను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నవే. కొన్ని సినిమా పాటలు రాసినా సినీ కవిగా స్థిరపడ(దలచ)లేదు ఆయన.
శ్రీకాంత శర్మ నాటకాలు పధ్నాలుగు, నాటికలు పదిహేను ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. పాత్రోచిత సంభాషణలతో, ఔచితీమంతమైన సన్నివేశ కల్పనలతో, ఇతివృత్తానికి దృశ్య శ్రవణ స్పర్శనిచ్చే ప్రజ్ఞ కానవస్తుంది. ‘శిలామురళి’ ‘కెరటాల పల్లకి’ ‘స్మృతి’ ‘ఆషాఢమేఘం’ ‘తెరలు’ వంటి నాటకాలు, 1990-91 నడుమ విజయవాడ ఆకాశవాణి నుండి ‘ఇరుగు పొరుగు’ పేర నలభై వారాలపాటు ప్రసారమైన నాటికలు శ్రోతృజన హృదయ రంజకాలైనవే.
‘సమూహం నుంచి ఏకాంతానికి
ఏకాంతం నుంచి సమూహానికి
లోలకం మాదిరి ఊగులాడుతూ
ఎంత ఉద్విగ్నత!!’
అంటూ ‘సుపర్ణ’ అనే తన ఒక పక్షి ఆత్మకథా కావ్యంలో పేర్కొన్నట్లు – శ్రీకాంతశర్మ అనుభూతి కవిగా ఒక ఏకాంతం నుంచే జన మాధ్యమాలైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల సమూహానికి చేసిన రచనలెన్నో ఉన్నాయి. కథకునిగా కన్నా ఎక్కువగా ‘తూర్పున వాలిన సూర్యుడు’ ‘ఉపాసన’ ‘క్షణికం’ అనే మూడు నవలలతో ఒక నవలా రచయితగా కూడా నిలిచారు. క్షుద్ర సాహిత్యం రాసారన్న అపవాదు కొంత పొందినా, నిజానికి ఆ శాస్త్ర వైదుష్యమే తద్రచన కావించిందని గ్రహించినప్పుడు, ఆయన పాండితీగరిమను ప్రశంసించక ఉండలేం!
ఈ మొదటి సంపుటి ఆయనలోని అనుభూతి కవికీ, శ్రవ్య, దృశ్య రచనా ప్రతిభా పాటవాలకు నెలవైన రచయితకూ అద్దం పడుతోంది. మనిషి సామూహికంగానూ, పది మందిలో ఒంటరిగానూ కూడా జీవించవలసి రావడం బ్రతుకు యధార్థం. వ్యక్తి సమూహాలను శాసించగలుగుతాడనేది పాక్షిక సత్యమే కావచ్చు కానీ, వ్యక్తులవల్లే వ్యవస్థలకు దీప్తి! ఎన్ని అవస్థలు పడినా వ్యవస్థలోనే వ్యక్తి ఉనికి, మనికి! నిత్య చైతన్యశీలమైన పత్రికా ప్రసార రంగాల భిత్తికపై శ్రీకాంతశర్మగారి ‘సృజన’ పాఠకుల, శ్రోతల, ప్రేక్షకుల ప్రశంసాపాత్రమైంది. మనిషితనం ప్రయోజనాలను కాపాడింది. వెనుదిరిగి చూసుకుంటే.. ‘సంతోష స్వాంతం’ మించినదేముంది? ఈ ‘సృజన’లో శాశ్వతంగా నిలిచేదేదో, విస్మృతమయ్యేదేదో నిర్ణయించేది మాత్రం కాలమే! ఇంద్ర పదవికి నూరు యజ్ఞాలు చేయాలిట కనీసం! శ్రీకాంత శర్మ నిరంతర రచనా యజ్ఞం నిజమైన ‘ఇంద్ర’గంటి.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

చారిత్రక కోణంలో వైదిక వాఙ్మయం

వ్యాస సుందరం
వెలమకన్ని సుందరరామశాస్ర్తీగారి
భాషా వ్యాస సంకలనం
వెల: అమూల్యం,
ప్రతులకు: వి.కన్యాకుమారి, 202
విశ్వలక్ష్మిటవర్స్,
రవీంద్రనగర్, 3వ లైను, గుంటూరు-6

వెలమకన్ని సుందరరామశాస్ర్తీ ప్రధానంగా చారిత్రక పరిశోధకులు. లోగడ విష్ణుకుండినుల వంటి రాజ్యాలపై ప్రామాణిక సిద్ధాంత గ్రంథాలు వెలువరించారు. వారి కుమార్తెలు తమ తండ్రి స్మృత్యర్థం ఇప్పుడు ఒక గ్రంథం తెచ్చారు. ఇందులో రెండు భాగాలున్నాయి. మొదటిది శతరుద్రీయ వ్యాఖ్యానం. రెండవది చారిత్రక వ్యాసములు. శతరుద్రీయము అంటే యజుర్వేదమునకు అనుబంధమైన తైత్తరీయ సంహితలోని నమక విభాగము. ఇది అభిషేక వియోగమునకు భక్తులు వాడుకోవటంవలన దేశములో ఈ అధ్యాయానికి విస్తృతమైన ప్రచారం ఉంది. శతరుద్రీయములో ప్రతిపాదించబడిన శివుడు రుద్రశబ్దంలో ప్రధానంగా పిలువబడ్డాడు. ఈ రుద్రుడు సూర్యమండల అంతర్వర్తియే. వేదమునకు ప్రాచ్యపాశ్చాత్యులు ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. సంప్రదాయ సాయణ భాష్యములవంటి వానితోబాటు ఆధునికమైన అరవింద, దయానందుల భాష్యాలు కూడా లభ్యమవుతున్నాయి. వెలమకన్ని సుందరరామశాస్ర్తీగారు సంద్రాయ భాష్యములను పరిగణనలోనికి తీసుకోకుండా లింటర్‌నెడ్జ్ మాక్సుముల్లర్ వంటి పాశ్చాత్యుల పరిశోధనలను అధ్యయనంచేసి రుద్రశబ్దాన్ని ఇందులో వివరించారు. అలాగే తర్వాతి విభాగంలో భాషాశాస్త్ర పాఠాలున్నాయి. ఆర్.ఎస్.శర్మ వంటి సెక్యులరిష్టులు చేసిన చారిత్రకాంశాలు కూడా వెలమకన్నివారి దృష్టికి వచ్చాయి. ఈ విషయం వాటి ఉపయుక్త గ్రంథ సూచినిబట్టి గ్రహించవచ్చు. వెలమకన్ని వారు ఈ గ్రంథంలో ఆర్య-ద్రవిడ సిద్ధాంతాన్ని ఆమోదించారు.
ప్రాచీన పురాణాలలోని యక్షులు దక్షిణ భారతీయ భాషలో బ్రాహ్మీలిపి నుండి పుట్టాయా? ‘‘స’’ ‘హ’గా ఎందుకు మారుతున్నది? ముండా-తలవర శబ్దాలు సమానార్థకాలా? ఇలా చాలా లోతైన పరిశోధనను వెలమకన్నివారు చేశారు. మారెమ్మా పూజ తెలుగునాట ఉండేదని మార్కాపురం మారన వంటి రూపాలు చూపించారు. (87వ పుట.) ఐతే ఈ ‘‘మార’’ శబ్దం సంస్కృతమేమో పరిశీలింపవలసి ఉంటుంది. పిత్రూణం తీర్చుకునే దిశలో వెలమకన్ని సుందరరామశాస్ర్తీగారి రచనలలో కొన్నింటిని వారి కుటుంబ సభ్యులు గ్రంథ రూపంలో తీసుకొని రావటం ముదావహం. వారి ఇతర అముద్రిత వ్యాసాల్ని కూడా వీలువెంట వెలువడుతాయని ఆశింపవచ్చు. ఇంత విలువైన పుస్తకం అమూల్యం అని ప్రకటించటం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.

మన పాఠ్యపుస్తకాలు ఇలా వుంటే ఎలా…?

గ్రూప్-4 పరీక్ష రాసిన నలుగురు ఇంజనీరింగు విద్యార్థులు రైల్లో ప్రయాణిస్తూ, పరీక్షలో అడిగిన ప్రశ్నల గూర్చి చర్చించుకుంటున్నారు. ‘గ్రీన్‌విచ్ మీన్’ అంటే ఏంటో నాకర్థం కాలేదని ఒక విద్యార్థి అంటే, అలాంటి సూత్రాన్ని ఎప్పుడు వినలేదని మిగతావారి సమాధానం! అదే రైల్లో ప్రయాణిస్తున్న ఈ వ్యాస రచయిత ‘అ క్షాంశ, రేఖాంశాల గూర్చి తెలుసా..?’ అని వా రిని ప్రశ్నించగా ఎప్పుడో చదువుకున్నట్లు జ్ఞాపకంగాని, వాటి గూర్చి తెలియదని మూ కుమ్మడి సమాధానం!
****
అది పదో తరగతి సాంఘిక శాస్త్రం. 16 మంది రచయితలు, ఇద్దరు సమన్వయకర్తలతో పాటు, 14 మంది సంపాదక వర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ 2014-15 విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి రాష్ట్ర విద్యార్థులకై తయారుచేసిన పుస్తకమిది. రచయితలల్లో విశ్వవిద్యాలయ స్థాయి నుంచి, సెకండరీ స్థాయి ఉపాధ్యాయులదాకా ఉన్నా రు. ఇక సంపాదక వర్గంలో మధ్యప్రదేశ్ ఏకలవ్య, బెంగుళూర్ అజీం ప్రేమ్‌జీ, న్యూఢిల్లీలోని ఎన్‌సిఇఆర్‌టి, ఉస్మానియా, హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వున్నారు. రాజీవ్ విద్యామిషన్, ఎస్‌సిఇఆర్‌టిలో విద్యా రంగంపై పట్టు, విశేష అనుభవం గలవారి నాయకత్వంలో తయారైన ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు తయారుచేసిన వారికి కాకు న్నా, బోధిస్తున్నవారికి కూడా దృష్టిలో పడకపోవడం శోచనీయం!
ఈ పుస్తకం బోధన ప్రారంభమై గత సెప్టెంబర్‌నాటికి నాలుగు నెలలు గడిచాయి. ఈ నాలుగు నెలల్లో రెండు నెలసరి పరీక్షలు, ఒక టర్మ్ (మొడు నెలలు) పరీక్ష జరిగింది. ఉపాధ్యాయులు ప్రశ్నలు సంధిస్తే విద్యార్థులు రాస్తున్నారు. పేపర్లు దిద్దారు, మార్కులు వేశారు. పిల్లల మార్కుల్ని చూసి సంతసించే తల్లిదండ్రులు, మార్కులు బాగా సంపాదించే విద్యార్థులుంటే సంబరపడే ఉపాధ్యాయ వర్గమున్న వ్యవస్థ మనది. పాఠ్యాంశాలు ఎలా వున్నాయనే ధ్యాస, తల్లిదండ్రులకు సరే, ఉపాధ్యాయులకు, అందునా అదే విషయ పరిజ్ఞానంతో బోధించే ఉపాధ్యాయులకు లేకుండాపోవడం కొంత ఆశ్చర్యమే!
సాధారణంగా పుస్తకాల్లో అచ్చుతప్పులు దొర్లడం సహజం. గతంలో తప్పొప్పుల పట్టిక ఒకటి పుస్తకం చివర వుండేది. దీనికిప్పుడు కాలం చెల్లింది. లేదా పుస్తకాలు వెళ్లిపోయాయని భావిస్తే ఓ సర్క్యులర్ ద్వారా తప్పుల్ని గుర్తించి, సరిచేసుకొని చదవాలనే సూచనలుండేవి. ఇవేమి లేవంటే, తయారుచేసిన పుస్తకాన్ని ఎవరూ రెండోమారు చూడలేదని అర్థం!
భాగం ఒకటిలో ఒకటో పాఠం. భారతదేశం:్భగోళిక స్వరూపాలు పేజీ (2) మొదటి వాక్యం- ‘్భరతదేశం చాలా విశాలమైన దేశం ఇది పూర్తిగా దక్షిణార్థ గోళంలో ఉంది. దేశం 8-50 డిగ్రీల ఉత్తర రేఖాంశంగల మధ్య 68-9డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య ఉంది’. …పై పటం చూసి (ప్రపంచ) ఆర్కిటిక్ వృత్తంలో భారతదేశం వుందని ఊహించుకోండి.. మీ జీవితంలో ఏయే తేడాలుంటాయి..?
పైనగల రెండు వాక్యాలలో తప్పొప్పుల గూర్చి పక్కన పెడదాం. పరస్పర విరుద్ధ వాఖ్యానాలు దేన్ని స్ఫురిస్తున్నాయి. దక్షిణార్థగోళంలో భారతదేశం వున్నపుడు, ఎట్టి పరిస్థితుల్లో ఆర్కిటిక్ వృత్తంలో భారతదేశం వుండడానికి వీలులేదు. కాబట్టి ఎలాంటి ఊహలకు తావుండదు. లేదా మొదటి వాక్యమే సరియైనదైతే, అంటార్కిటికా వృత్తంలో ఉన్నట్లుగా భారతదేశాన్ని ఊహించుకోవాలి. పేజీ నెంబర్ మూడు: పటం (2)ను చూస్తే భారతదేశం ఏయే అక్షాంశాల మధ్యన, ఏయే రేఖాంశాలమధ్యన వుందో కనీస పరిజ్ఞానం వున్నవారు గుర్తించగలరు. పటంలో ప్రస్తావించిన వాస్తవ స్థితికి చూపిన కోణాలకు, రెండవ పేజీలోని వాక్యాలకు పరస్పర విరుద్ధం కనపడుతుంది. భారతదేశం 8.4’-37.6’ డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్యన, 68.7’-97.25’ డిగ్రీల తూర్పు రేఖాంశాలమధ్యన వున్నట్లు స్పష్టంగా వుంది. ఇదే పుస్తకంలోని పేజీ నెం.(49)లో ‘ఉత్తరార్థ భూగోళంలోని వ్యాపార పవనాల మేఖలలో భారతదేశం ఉంది..’ అనే వాక్యం కూడా సరిగానే వున్నది. తిరిగి పేజీ నెం.(47)లో మొదటి పేరాలో కూడా.. ‘్భమధ్య రేఖకి దూరంగా ఉన్న రేఖాంశాల కంటే దగ్గరగా ఉన్న రేఖాంశాల వద్ద ఈ తీవ్రత (ఉష్ణోగ్రత) ఎక్కువగా ఉంటుంది…’. భూమధ్య రేఖకు దూరంగా, దగ్గరగా వుండేది అక్షాంశాలుగాని రేఖాంశాలు కావు. ఇదే పేజీలోని రెండవ పేరాలో.. ‘్భరతదేశం సుమారుగా 8-37 డిగ్రీల రేఖాంశాల మధ్య వుంది. రెండో పేజీలో ప్రస్తావించిన 8-50 డిగ్రీల ఉ. రేఖాంశాలమధ్య.. దానికి కూడా ఇది భిన్నంగా వుంది. ఇదీ 8.4’-37.6’ డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్యనే అనే వుండాలి.
అయిదవ పాఠ్యాంశంలోని (59)వ పేజీలో ప్రస్తావించిన సింధూ నది వ్యవస్థ, గంగానదీ వ్యవస్థల గూర్చి అసంపూర్తి సమాచారం, తప్పుడు భావనల్ని కల్గించేలా వున్నాయి. సాధారణంగా ఒక నది మరో నదిలో కలిస్తే, కలిసిన నది ఉపనది అవుతుంది. సింధూ నది టిబెల్‌లోని మానస సరోవరం చుట్టూగల కైలాస పర్వత శ్రేణుల్లో పుట్టి, లడక్ ద్వారా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. పుస్తకంలో ప్రస్తావించినట్లు పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలతో ఈ నదికి సంబంధం లేదు. కాని దీని పరీవాహక ప్రాంతంలోని అనేక ఉపనదులు ఈ రాష్ట్రాల్లో పుట్టి ప్రవహిస్తాయి. కాశ్మీర్‌లో ప్రవహించే జీలం, చీనాబ్, తావి, పంజాబ్‌లో ప్రవహించే రావి, బియాస్ సట్లెజ్‌లు ఒకదాంట్లో ఒకటి ఉపనదిగా కలుస్తూ సట్లెజ్ నదిగా పాకిస్తాన్‌లో సింధూ నదితో కలుస్తుంది. చీనాబ్ (ఉధంపూర్ గుండా ప్రవహించే) నదిలో జమ్మూ పట్టణం ద్వారా ప్రవహించే తావి, శ్రీనగర్ పట్టణం ద్వారా ప్రవహించే జీలంలు, పంజాబ్ పఠాన్‌కోట ద్వారా ప్రవహించే రావినదులు కలిసిన తర్వాత బియాస్ నదిని కలుపుకొని సట్లెజ్ చీనాబ్‌తో సంగమం చెందుతుంది (అయినా అట్లాస్‌ను చూడాలి). గంగానదీ వ్యవస్థ గూర్చి ప్రస్తావిస్తూ, ఇదిరెండు నదుల కలయిక అని రాసారు. నిజానికి దేవప్రయాగ దగ్గర అలకనందతో కలిసి గంగానదిగా ఏర్పడే భాగీరథిలో ‘బిలంగ్‌నా’ అనే ఓ ప్రధాన నది, రుద్ర ప్రయోగ దగ్గర కేదార్‌నాధ్‌పైన గల గాంధీ సరస్సు (చార్‌బరీ), వాసుకీతల్‌ల నుంచి పుట్టిన మందాకిని నది అలకనందతో కలిసి అలకనందగా మారుతుంది. ఈ విధంగా ప్రధాన మూడు నదుల కలయిక గంగానది అయితే, అలహాబాద్ దగ్గర యమునా నదితో కలిసి మరింతగా విశాలమైన గంగానదిగా మారుతుంది. యమునానది ప్రస్తావన లేకుండా గంగానదిని ప్రస్తావించలేం. ఇక బ్రహ్మపుత్ర నది ప్రారంభంలో అనేక పేర్లతో వుండి, బంగ్లాదేశ్ గుండా బంగాళాఖాతంలో కలిసేముందు అనేక పాయలుగా డెల్టాలను ఏర్పర్చుతూ కలుస్తుంది. ఈ పాయలలో పద్మ, జమున, మధుమతి, మేఘనలు ముఖ్యమైనవి. పేజీ నెం.(60)లోని పటంలో ఈ విషయాలు స్పష్టంగా వున్నాయి. ప్రస్తావన కూడా వుండాల్సింది. ఇన్ని అంశాలు అవసరమా అనే భావన కొందరికి రావచ్చు! పాఠశాల విద్యాదశలో పదవ తరగతి చివరి దశ. ఈ దశ తర్వాత విద్యార్థి చదువంతా ఐచ్ఛికంగా వుంటుంది. కాబట్టి, పుస్తకంలో ముందే ప్రస్తావించిన విద్యా ప్రమాణాల్లోని సామర్థ్యాలను పొందాలంటే, భూగోళ శాస్త్రం వాస్తవికంగానే వుండాలి. చారిత్రక అంశాలు అన్వయంలో వ్యత్యాసాలు వుండవచ్చు! పాలకుల భావజాలాన్ని బట్టి ప్రపంచ చరిత్రను, యుద్ధాల్ని, విప్లవాల్ని చూడడం జరుగుతుంది. కాని భౌగోళిక విషయాలు ఎలాంటి మార్పునకు గురికాలేవు.
గతంలో పాఠ్యపుస్తకాల రూపకల్పన కేంద్రీకృతంగా, ఒకరిద్దరు రచయితలచే, అదీ తరగతి గది బోధనతో సంబంధంలేని వ్యక్తులచే లిఖించబడేవి. ఈ పుస్తకాల తయారీపై అనేక విమర్శలు వచ్చేవి. కాని పరిస్థితుల్లో మార్పు రావడం, నిధుల కొరతను అధిగమించడం, రాజీవ్ విద్యామిషన్ (ఎస్‌ఎస్‌ఎ) చొరవతో మారుమూల ప్రాంతాలలో నిష్ణాతులని గుర్తించబడిన తరగతి గది బోధకులచే ఎంపిక చేసి, చర్చలు జరిపి, వర్కుషాపుల్ని నిర్వహించి, ముందు ప్రణాళికను, తర్వాత అంశాలను, అంశాలవారిగా పట్టు వున్న ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసి, వీరికి దేశవ్యాపితంగా గల నిపుణులచే సూచనల్ని, సలహాల్ని ఇప్పించి, వారు కూడా ఈ వర్కు షాపుల్లో పాల్గొనేలా చేసి తయారుచేసిన పుస్తకాలు ఇలా తప్పుడు భావనలతో వుంటే విద్యార్థులు అవే తప్పుడు భావనల్ని అవగాహన చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే.
పొరపాట్లు జరగడం సహజమే అయినా- వాటిని కనీసంగా గుర్తించకపోవడం అతి ధీమానే అవుతుంది. ఎవరి చాప్టరును వారే రాసుకొని, చేతులు దులుపుకోవడం జరగడం, సంపాదక వర్గం కనీసంగా అన్ని అధ్యాయాల్ని క్షుణ్ణంగా చూడకపోవడం ఒక లోపమైతే, నాలుగు నెలలుగా ఈ పుస్తకాన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో క్రమశిక్షణతో బోధిస్తున్న విషయ నిపుణులైన ఉపాధ్యాయులు గుర్తించకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం. అంటే పాఠ్యాంశాల్లో పేజి పేజిని బోధించడం, వాటి కనుగుణంగానే ప్రశ్నలు సంధించడం, జవాబుల్ని కూడా సరిగా చూడకుండా మార్కులు వేయడం జరిగిపోతూనే వున్నది. అందుకే, సాంఘిక శాస్త్రంలో అతి తక్కువ మంది ఫెయల్ అవుతూ వుంటారు.
ఈ విషయాల్ని గుర్తించడానికై పెద్దగా విషయ పరిజ్ఞానం అవసరంలేదు. అట్లాసును చూసినా, గ్లోబును పరిశీలించినా అన్ని విషయాలు అవగతం అవుతాయి. కాని మన పాఠశాలల్లో అట్లాసులు వున్నాయా అనేది ఒక ప్రశ్న అయితే, వున్నా అవి బీరువాలోనుంచి బయటకు రావడం చాలా కష్టం. ఇక గ్లోబు సంగతి సరేసరి! ఎప్పుడో కొన్న గ్లోబు ప్రధానోపాధ్యాయుని బల్లపై, లేదా పక్కనేగల బీరువాపై భద్రంగా వుంటుంది. అదెన్నడు తరగతి గదిలోకి ప్రవేశించదు. పటాలు చుట్టచుట్టన్నా వుంటాయి, లేదా స్ట్ఫారూంలో వేళాడుతూ చిరిగిపోతూ వుంటాయి. ఓ తరగతి గదిలోకో, వరండాలోకో వచ్చి వేళ్ళాడితే, అక్కడో పాయింటర్ వుంటే ఏ ఉపాధ్యాయుడికి సహాయం లేకుండా విద్యార్థులే పట నైపుణ్యాల్ని పెంపొందించుకుంటారు. విషయ అవగాహన పెరుగుతుంది. ఉపాధ్యాయుడు పుస్తకంలోని విషయాన్ని ఎత్తి చదివి, బోధన చేస్తున్నానని భ్రమపడితే పరిస్థితి పైన ఉదహరించిన ఇంజనీరు విద్యార్థుల్లాగానే వుంటుం ది. పాఠ్యాంశాల లొసుగులు ఒక్క సాంఘిక శాస్త్రంకే పరిమితం కాలేదు. ఆరో తరగతి సామాన్య శాస్త్రంలోని ‘మన ఆహారం’ అనే మొదటి పాఠం మొదటి పేజీలో పొందుపర్చిన తొమ్మిది రకాల ఆహార పదార్థాలను చూస్తే, మన పాఠ్యాంశాలు ఏ వర్గ ప్రయోజనాల్ని కాంక్షిస్తున్నాయో తెలుస్తుంది. శ్రమజీవులు, హరిజన, గిరిజనులే కాదు, రాయలసీమ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంత ప్రజలు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజల ఆహార పదార్థాలు కనీసంగా చూపకపోవడం పుస్తక రచయితల అవగాహనా రాహిత్యమే! ఇప్పటికైనా కొత్త రాష్ట్రాలకు, వాస్తవ చింతనతో పుస్తకాల తయారీకి పూనుకుంటే విద్యార్థులకు మేలుచేసినవారమవుతాం!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ ప్రక్రుతి వికృతి గా ఎందుకు మారింది?

ప్రకృతి…. వికృతి

ధవళకాంతులతో శోభిల్లే హిమాలయ పర్వత శిఖరాలు…అందమైన తులిప్ తోటలు…నోరూరించే యాపిల్ పళ్లు…దాల్ సరస్సుపై తేలియాడుతూ వెళ్లే కుటీరాల్లాంటి పడవల పరుగులతో కళకళలాడే కాశ్మీర్ అందాలు ఒక్కసారిగా ఎందుకు కకావికలమయ్యాయి? ఎండాకాలం ఉండగానే ఒక్కుదుటున కుండపోత వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి? రుతుపవనాల గమనంలో అనూహ్య మార్పులు ఎందుకొస్తున్నాయి? సాగరాలు చెలియలకట్టలు దాటి ఎందుకు తెగబడుతున్నాయి? ఊళ్లకు ఊళ్లను ఎందుకు ఊడ్చేస్తున్నాయి? శీతాకాలంలోనూ ఉక్కపోత ఎందుకు ఎక్కువవుతోంది? భూతాపం ఎందుకు పెరిగిపోతోంది…అంటే జవాబు తెలియనివారు ఎవ్వరూ లేరు. అనుభవాలనుంచి పాఠాలు నేర్వని మనిషి పదేపదే కష్టాలపాలవుతున్నాడు. అభివృద్ధి పేరిట మానవుడు చేపట్టిన విధ్వంసకర చర్యలు ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్నాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణంలో పెనుమార్పులు సంభవించి ప్రకృతి విపత్తులకు దారితీస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో గతేడాది వరదలు సృష్టించిన బీభత్సం, కొనే్నళ్లక్రితం సంభవించిన గుజరాత్, లాతూర్ భూకంపాలు, సునామీ, ఇక దేశంలో చాలాప్రాంతాల్లో సంభవిస్తున్న వరదలు, కరవు, కొండచరియలు విరిగిపడిన సంఘటనలు ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లే. ఈ విపత్తుల బెడద ఒక్క మనదేశంలోనే కాదు…యావత్ ప్రపంచంలోనూ ఉంది. పెనుతుపానులు, భూకంపాలు, కార్చిచ్చులు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు… ఇలా విపత్తులు తలెత్తున్నాయి. వీటిలో ఒకటీఅరా సహజంగా ముంచుకొస్తున్నప్పటికీ మొత్తమీద మానవుడి నిర్లక్ష్యం, అత్యాశ పెనువిపత్తులకు కారణమని తేలిపోయింది. విపత్తులను నివారించడం, ఎదుర్కోవడం, కనీసం వాటివల్ల వచ్చే నష్టాన్ని తగ్గించగలగడంపై ఇప్పుడు దృష్టిపెట్టాలి. విపత్తుల కారణాలు తెలుసుకోవడం, ఏయే ప్రాంతాల్లో అవి విరుచుకుపడే అవకాశం ఉందో గుర్తించడం, ఎదుర్కోవడమెలాగో తెలుసుకోవడం, విపత్తుల నియంత్రణ, కనిష్టనష్టాలు ఉండేలా జాగ్రత్తపడటం ప్రస్తుతం మానవాళి కర్తవ్యం. ఇందుకు పెద్దఎత్తున ప్రజల్లో అవగాహన, చైతన్యం అవసరం. అందుకే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో విపత్తుల ప్రమాదాన్ని వీలైనంతవరకు తగ్గించే దిశగా అడుగులుపడుతున్నాయి. ఏటా అక్టోబర్ 13న ప్రకృతి విపత్తుల నియంత్రణ దినోత్సవంగా కార్యక్రమాలు చేపడుతోంది. మనుగడకే ముప్పు మార్స్‌పై మానవ మనుగడ సాధ్యమా? కాదా? అన్న అంశంపై శాస్తవ్రేత్తల పరిశోధనల ప్రయాణం మంగళకరంగానే సాగుతోంది. ఎటొచ్చీ భూమిపైనే జీవరాశి మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. అభివృద్ధి, అత్యాశలతో మానవుడు ప్రకృతిని ధ్వంసం చేస్తూ చేపడుతున్న కార్యక్రమాలు, పారిశ్రామికీకరణ, అభివృద్ధి పనుల పేరిట యధేచ్ఛగా చేపడుతున్న చర్యలు ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నాయి. సెలయేళ్ళు, నదుల గమనమార్గాన్ని అడ్డుకుంటూ, లేదా నీటిప్రవాహ మార్గాన్ని మారుస్తూ విచ్చలవిడిగా చేపడుతున్న నిర్మాణాలు పెనుముప్పునకు కారణమవుతున్నాయి. వర్షాలు కురిసినప్పుడు వరదనీరు వెళ్లేమార్గం లేక ఊళ్లలోకి, నగరాల్లోకి ఆ వరద ముంచేస్తోంది. తాజాగా కాశ్మీర్‌లో జరిగింది అదే. చెట్ల నరికివేత వల్ల నీటిప్రవాహాన్ని నెమ్మదింపచేయగలిగే వ్యవస్థ ధ్వంసమైపోయినట్లవుతోంది. భూమిలోపలికి చొచ్చుకువెళ్లే వాటి వేళ్లు, మొదళ్లు నీటిప్రవాహవేగాన్ని నియంత్రించి భూసారాన్ని కాపాడతాయి. ఇప్పుడు చెట్లే లేకపోవడంతో ఆకస్మిక వరదలు ఊహించని వేగంతో వచ్చి ముంచేస్తున్నాయి. మరోవైపు పరిశ్రమలు, వాహనాలు, ఫ్రిజ్, ఏసీ మిషన్లువంటి ఆధునిక యంత్రాలవల్ల ఉత్పత్తి అవుతున్న కర్బన ఉద్గారాలు పెరిగి వాతావరణం కలుషితమవుతోంది. ఫలితంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. భూమిమీద ఉన్న జీవజాతుల్లో ఎన్నో అంతరించిపోతున్నాయి. ఇది ఆహారోత్పత్తి, మానవ మనుగడకు ముప్పు తెస్తోంది. పెరుగుతున్న జనాభాపై ఇది పెనుప్రభావం చూపబోతోంది. 1970నుంచి 2010లోగా జీవరాశిలో, ముఖ్యంగా సరీసృపాలు, క్షీరదాలు, పక్షులు, జంతువులలో 52శాతం మేర అంతర్థానమయ్యాయి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. వరల్డ్ లైఫ్ ఫండ్ అనే సంస్థ చేసిన అధ్యయనం చెప్పిన వాస్తవం ఇది. ఇదంతా మానవ తప్పిదాల ఫలితమే. భూమిపై జీవ వైవిధ్యం దెబ్బతింటే మనిషి మనుగడ ప్రశ్నార్థకమే. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తోంది? 80వ దశకంలో ప్రకృతి విపత్తుల జోరు పెరిగింది. అన్నింటికీ మానవాళే కారణం. నష్టపోయేదీ వారే. ప్రమాదాన్ని పసిగట్టిన ఐక్యరాజ్యసమితి విపత్తుల ప్రమాదాన్ని తగ్గించి, నష్టాన్ని కనిష్టం చేసే దిశగా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి నడుంకట్టింది. 1989లో ఈమేరకు సర్వసభ్య సమావేశంలో ఓ తీర్మానం చేసింది. అక్టోబర్ 13ను విపత్తుల నియంత్రణ దినంగా ప్రకటించింది. ఈ దిశగా చర్యలు చేపట్టేందుకు ది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (యుఎన్‌ఐఎస్‌డిఆర్) సంస్థను తనకు అనుబంధంగా నెలకొల్పింది. ప్రపంచంలోని 168 దేశాలు దీనిద్వారా చర్యలు చేపట్టాయి. 2015నాటికి విపత్తుల నివారణకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించేందుకు 2010నుంచి అడుగులు వేయడం ప్రారంభించింది. పిల్లలు, యువకులు, వయోజనులు, వికలాంగులు, ఇలా పధ్నాలుగేళ్లుగా, ఏడాదికో వర్గంనుంచి అభిప్రాయాలు సేకరించింది. వారు ఎదుర్కొన్న విపత్తులు, నష్టాలు, కష్టాలు, నివారణోపాయాలపై వారినుంచి సమాచారాన్ని సేకరించింది. 2014లో వయోవృద్ధుల సంవత్సరంగా ప్రకటించి వారి అభిప్రాయాల్ని సేకరించింది. వీటన్నింటి నుంచి సారాన్ని క్రోడీకరిస్తోంది. విపత్తులను తగ్గించగలగడం, ఎదుర్కోవడం, నష్టాన్ని నియంత్రించడంపై ఈ సంస్థ ప్రజలను చైతన్యం చేస్తోంది. 2015లో జపాన్‌లోని సిండాయ్‌లో జరిగే ప్రపంచస్థాయి సదస్సులో ఈ అంశాలపై చర్చిస్తుంది. విపత్తుల నివారణ ఎలా? మనదేశంలో సునామీ సృష్టించిన బీభత్సం తరువాత ప్రపంచ సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ప్రకృతి విపత్తుల నివారణ, నియంత్రణ లక్ష్యంగా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవిర్భవించింది. విపత్తుల సమయంలో స్పందించి చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంకా ఆ సంస్థ చురుకుగా స్పందించాల్సిన అవసరం ఉంది. విపత్తులు ఏర్పడే ప్రాంతాల గుర్తింపు, వివిధ ప్రాంతాల్లో సాధారణంగా ఎదురయ్యే సవాళ్లు, అక్కడికక్కడ ఎదుర్కొనే యంత్రాంగం ఇంకా ఏర్పడలేదు. దేశరాజధానినుంచే ఆ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల ఏపీలోను, ఆ మధ్య ఉత్తరాఖండ్, ఒడిశా, తాజాగా కాశ్మీర్‌లో సంభవించిన తుపానులు, వరదల వేళ ఢిల్లీనుండి బృందాలువెళ్లి సహాయం చేశాయి. అదే ఆయా రాష్ట్రాల్లోనే ఉంటే సకాలంలో స్పందించి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేది. శాస్త్ర,సాంకేతిక విజానాన్ని బాసటగా చేసుకుని సవాళ్లను ఎదుర్కోవాలి. ఉపగ్రహాలు అందించే సమాచారాన్ని, వాతావరణ శాఖ చేసే హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలి. ముందుజాగ్రత్త చర్యలతో చాలావరకు నష్టాన్ని నియంత్రించవచ్చు. ఒడిశాలో ఆమధ్య వచ్చిన ఫైలిన్ తుపాను సమయంలో ఆ జాగ్రత్తే ప్రాణ, ఆస్తినష్టాల్ని నియంత్రించింది. విపత్తుల ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో వాతావరణ హెచ్చరికల కేంద్రాలు, డాప్లర్ రాడార్ కేంద్రాల ఏర్పాటు, జాతీయ విపత్తు ప్రాంతీయ కేంద్రాల నిర్వహణ అవసరం. తీరప్రాంతాలకు దూరంగా జనావాసాలు ఉండటం, నదీగమన ప్రాంతాల్లో నిర్మాణాలను అడ్డుకోవడం, నదులు, సెలయేళ్ళలో ఇసుక తవ్వకుండా చూడటం కనీస జాగ్రత్తలు. పర్వతసానువుల్లో నిర్మాణాలు నిరోధించడం, కొండలపైన, దిగువ చెట్లను నరికివేయకుండా చూడటం, పర్వత సానువులను చదను చేయకుండా ఉండటం అతిముఖ్యం. ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలస్థాయి, ప్రభావం బాగా తగ్గిపోతాయి. ఉత్తరాఖండ్‌లో ఏం జరిగింది? హిమాలయ పర్వత సానువుల్లోని ఈ రాష్ట్రం పర్యాటక రంగం విస్తృతికోసం ఇచ్చిన అనుమతులు, జలవిద్యుత్‌కేంద్రాలకోసం చేపట్టిన చర్యలు కేదార్‌నాథ్ విలయానికి కారణమయ్యాయి. మందాకిని, అలకనంద వంటి నదుల మార్గాల్లో విధ్వంసక చర్యలు చేపట్టడం, వేలాది ఎకరాల్లో అడవులు నరికి జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో వాతావరణం దెబ్బతిని హఠాత్తుగా వర్షాలు, వరదలు ముంచెత్తాయి. 37వేల ఎకరాల్లో చెట్లను నరికి, 3200 ఎకరాల్లో ఇసుకను తవ్వేసి 51 జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు ప్రకృతి ఇలా స్పందించిందన్నమాట. నిజానికి ఈ రాష్ట్రంలో మరో 47 జలవిద్యుత్ కేంద్రాలు నిర్మాణంలో ఉండగా 234 ప్రాజెక్టులకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. విపత్తుల ప్రమాదం ఎక్కువగా ఉన్న హిమాలయ పరీవాహక రాష్ట్రాలైన కాశ్మీర్, ఉత్తరాఖండ్‌సహా పలు ప్రాంతాల్లో రాడార్లు, వాతావరణ హెచ్చరిక కేంద్రాలు, విపత్తు నిర్వహణ కేంద్రాలు లేవంటే అక్కడి పాలకులకు, నేతలకు ఎంత శ్రద్ధో అర్ధమవుతుంది. ఆ మధ్య మహారాష్టల్రోని పూనేలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇక్కడ పర్వతాల దిగువ ప్రాంతాన్ని చదును చేసి 28వేల చెట్లను నరికేశారు. అక్కడభూమి గుల్లబారిపోవడం, భారీవర్షాలు కురియడంతో మట్టిపెళ్లలు జారిపోయి ఇళ్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. దేశం మొత్తంమీద 75 శాతం ప్రాంతాలు విపత్తులకు అవకాశం ఉన్నవే. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే అంశం ఇది. ఇక ప్రభుత్వాలూ అది తెలుసుకుని అడుగులు వేయాల్సిందే. మన దేశంలో మహా విపత్తులు ఇవీ… 1770-బెంగాల్ కరవు-బెంగాల్, ఒడిశా, బీహార్‌లో కరవుతో 10లక్షలమంది దుర్మరణం. 1769-73 మధ్య కరవు విలయతాండవం చేసింది. ప్రపంచ మహావిపత్తులో ఇది ఒకటి. 1839-ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలోని కోరింగ ప్రాంతంలో సంభవించిన పెనుతుపాను. 20వేల మంది మృత్యువాతపడ్డారు. ముప్ఫైరెండేళ్లక్రితం సంభవించిన దివిసీమ ఉప్పెనా అలాంటిదే. 1894-ప్లేగ్ విజృంభణతో 12 లక్షలమంది మృతి. మనదేశం, చైనాల్లోనే ఇది సంభవించింది. దాదాపు రెండేళ్లు పీడించిన అంటువ్యాధి ఇది. కోల్‌కతా, ముంబై పోర్టులలో ప్రారంభమై దేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించి లక్షలాదిమంది ప్రాణాలు తీసింది. 1979-లాహాల్ అవలాంచ. హిమానీనదం కరిగి లాహాల్ లోయలో మీదపడటంతో 200మంది సజీవసమాధి అయ్యారు. మృతులపై 200 అడుగుల మేరకు మంచు పేరుకుపోయింది. 1993-లాతూర్ భూకంపం-మహారాష్టల్రోని లాతూర్‌లో తీవ్ర భూకంపం ధాటికి 10 వేలమంది మరణించారు. మరో 40వేల మంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. 1999-సూపర్‌సైక్లోన్ 05బిగా చెప్పుకున్న ఈ తుపాను తాకిడికి 15వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తినష్టానికి లెక్కేలేదు. 2001-గుజరాత్ భూకంపం-ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవంనాడు జరిగిన భూకంపం ధాటికి 20వేలమంది మరణించారు. కచ్ జిల్లాలో ఇది పెనువిధ్వంసం సృష్టించింది. 2002-వడగాడ్పులు-దేశంలో వడగాల్పులకు వేయిమంది మరణించారు. ఏపీలో ఈ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. 2004-సునామీ-హిందుమహాసముద్రంలోఇండోనేసియాలో వచ్చిన సునామీ 14 దేశాల్లో తీరప్రాంతాలపై ప్రభావం చూపింది. మనదేశంలోని అండమాన్ నికోబార్ సహా హిందూమహాసముద్రతీర ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. సునామీ తాకిడి ఉన్న అన్ని ప్రాంతాల్లో కలపి 2లక్షల 30వేలమంది మరణించారు. 2007-బీహార్ వరదలు-గడచిన 30 ఏళ్లలో ఎన్నడూలేనివిధంగా వచ్చిన వరదలు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. వందలమంది మరణించారు. ఆస్తినష్టం లెక్కలేదు. 2005-ముంబై వరదలు. వాతావరణంలో వచ్చిన మార్పులతో భారీవర్షాలతో వరదలు. 5వేలమంది మృతి. 2010-తూర్పుభారతదేశంలో తుపానుతో పెనునష్టం. వందమంది మరణించగా 92వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2013-మహారాష్టల్రో కరవు. లక్షలాదిమంది ఆకలికేకలు. గత 40 ఏళ్లలో ఎన్నడూలేని నీటిఎద్దడి. దాదాపు రెండేళ్లపాటు జల్నా, జలగావ్, ధూలే జిల్లాలు విలవిల. ఉత్తరాఖండ్-్ఫ్లష్‌ఫ్లడ్-ఆకస్మిక వరదలతో వెయ్యిమంది మృతి, 5వేలమంది గల్లంతు. వేలాది ఇళ్లు, ఊళ్ళకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం. 2014-కాశ్మీర్ వరదలు-శ్రీనగర్‌సహా పలు గ్రామాలు జలదిగ్బంధం. 250పైగానే మరణాలు. నాలుగువారాలపైగానే అనేక గ్రామాలు నీటిలోనే ఉండిపోయాయి. జాతీయవిపత్తుగా కేంద్రం ప్రకటన. * ఇలా చేయాలి… ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం, నష్టాన్ని తగ్గించుకోవడం లక్ష్యంగా దేశాలు అడుగులేయాలి. భూకంపాలు, వరదతాకిడి సమయాల్లో వాటిని తట్టుకునేలా భవన నిర్మాణాలు సాగాలి. కొత్త టెక్నాలజీని వినియోగించాలి. పర్యావరణ అనుకూల విధానాలు పాటించాలి. కర్బన వాయువుల విడుదలకు కారణమవుతున్న వ్యవస్థలకు కళ్ళెం వేయాలి. మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఆహారోత్పత్తులు పెంచాలి. ఆరోగ్యకర వాతావరణాన్ని పెంపొందించాలి. ఏయే ప్రాంతాల్లో విపత్తులు ముంచుకొస్తాయో శాటిలైట్, వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలి. ఉపద్రవం స్థాయిని అంచనా వేయాలి. ముందస్తు సమాచారంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలి. ఇదీ విపత్తుల విశ్వరూపం విపత్తులు ఒక్క మనదేశానికే పరిమితం కాదు. విశ్వమానవాళి సమస్య ఇది. ప్రకృతి విపత్తులు రెండు విధాలుగా నష్టాన్ని కలిగిస్తాయి. ఒకటి ప్రాణ, ఆస్తినష్టాలు. మరోటి జీవరాశిని దెబ్బతీయడం. విపత్తునుండి కోలుకోవడానికి ఏళ్లతరబడి సమయం, లెక్కలేనంత ధనవ్యయం తప్పదు. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం 1980నుంచి 2011 మధ్య ప్రపంచంలో మొత్తంమీద 3455 ప్రాంతాల్లో భారీ వరదలు ముంచెత్తాయి. 2689 తుపానులు అల్లకల్లోలం సృష్టించాయి. 470 ప్రాంతాల్లో కరవు విలయతాండవం చేస్తే..395 ప్రాంతాల్లో ఉషోగ్రతలు బాగా పెరిగిపోయాయి. 2000-12 సంవత్సరాల మధ్య జరిగిన విపత్తుల వల్ల 1.7 ట్రిలియన్ డాలర్ల ఆస్తినష్టం సంభవించింది. 2.9 బిలియన్లమంది ప్రజలపై పెనుప్రభావం చూపాయి. 12 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అధికారికంగా లభ్యమైన సమాచారం. ఇక అనధికారిక నిజాలు దేవుడెరుగు. కాశ్మీర్ గుణపాఠం హిమాలయ పర్వత ప్రాంతాల్లోని రాష్ట్రాలకు ప్రకృతి విపత్తుల బెడద ఎక్కువ. మానవతప్పిదాల దానికి తోడవడంతో పెనునష్టాలు సంభవించాయి. జీలం, చీనాబ్, రావి నదుల ప్రవాహ గమన మార్గాలను అడ్డుకుని విశృంఖలంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం రిసార్టులు నిర్మించారు. ఫలితంగా నదీజలాల గమనంలోను, వేగంలోనూ తీవ్రపరిణామాలు సంభవించాయి. వరదలు వచ్చినపుడు నీరు వెళ్లే మార్గాలు లేక అవి నగరాల్లోకి, గ్రామాల్లోకి వచ్చాయి. గత శతాబ్దంలో ఎన్నడూలేని విధ్వసం సృష్టించడానికి ఇదే ప్రధాన కారణం. హిమాలయ ప్రాంత రాష్ట్రాలన్నింటికీ ఈ విపత్తుల ముప్పు ఉంది. అడవుల నరికివేత, పర్వతసానువులు చదునుచేయడంతో వరదప్రవాహాన్ని అడ్డుకుని, నెమ్మదింపచేసే వ్యవస్థలు ధ్వంసమై ఈ ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, నాయకుల నిర్లక్ష్యం, స్వార్థంవల్లే భారీ ప్రాణ,ఆస్థినష్టం సంభవించింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”దాదా మౌని ”-అశోక్ కుమార్ జయంతి

రతీయ సినిమాపై ‘దాదామోని’ ముద్ర

అశోక్‌కుమార్‌నూ, భారతీయ సినిమానూ వేరుచేసి చూడలేం. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఆయనది డెబ్భై ఏళ్ల భాగస్వామ్యం. తనకు అమితమైన పేరు తెచ్చిన మొదటి సినిమా ‘అచ్చుత్‌ కన్య’ (1936)లో నటించేందుకు ఆయన మొదట నిరాకరించారన్నది నిజం. డైరెక్టర్‌ హిమాంశు రాయ్‌ బలవంతం మీద ఆ సినిమా చేశారు. ఆ సినిమా నుండి ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలుగలేదు. అందులో నాయిక దేవికా రాణి.
ఆ రోజుల్లో అశోక్‌కుమార్‌, దేవికా రాణి కాంబినేషన్‌ అంటే ప్రేక్షకులకు కన్నుల పంటే. ‘జీవన్‌ నైయా’ (1936), ‘ఇజ్జత్‌’ (1937), ‘సావిత్రి’ (1937), ‘నిర్మల’ (1938) వంటి చిత్రాలలో ఆ జోడీ బాగా రాణించింది. అశోక్‌కుమార్‌ అసలు పేరు కుముద్‌లాల్‌ కుంజిలాల్‌ గంగూలీ. 1911 అక్టోబర్‌ 13న భాగల్పూర్‌లో జన్మించిన ఆయన ఖండ్వాలో పెరిగారు. కలకత్తాలో న్యాయవాద పట్టా పుచ్చుకున్నాక, బాంబే టాకీస్‌లో లేబరేటరీ అసిస్టెంట్‌గా కెరీర్‌ ప్రారంభించారు. అదే కంపెనీ నుంచి నటునిగా మారారు. దేవికా రాణి తర్వాత లీలా చిట్నీస్‌తో కలిసి ఆయన నటించిన ‘కంగన్‌’ (1939), ‘బంధన్‌’ (1940), ‘ఝూలా’ (1941) సినిమాలు సూపర్‌ హిట్టయి అశోక్‌కుమార్‌ను అగ్రశ్రేణి నటునిగా మార్చాయి. ‘కిస్మత్‌’ (1941)లో చేసిన యాంటీ హీరో రోల్‌ ఆయన కెరీర్‌లో మోస్ట్‌ ఫేమస్‌ రోల్‌గా పేరు తెచ్చుకుంది. అందులో ఆయన సిగరెట్‌ తాగే స్టయిల్‌ను ఆ కాలంలో ఎంతోమంది అనుసరించడం ఆ పాత్ర సాధించిన విజయం. అప్పటి నటుల తరహాలో ఆయన కూడా తన పాటలను తనే పాడారు. వాటిలో ‘మై బన్‌ కీ చిడియా’, ‘చల్‌ చల్‌ రే నౌజవాన్‌’, ‘న జానే కిదర్‌ ఆజ్‌ మేరీ నావో చలీ రే’ వంటివి బాగా పాపులర్‌ అయ్యాయి. ‘ఆర్తి’ (1962), ‘గుమ్‌రాహ్‌’ (1963), ‘బందిని’ (1963) చిత్రాల్లో నటునిగా ఆయన ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ప్రత్యేకించి ‘బందిని’లో ప్రతి సన్నివేశంలోనూ నూతన్‌, అశోక్‌ ఒకరిని మించి మరొకరు అద్భుత నటన ప్రదర్శించారనే పేరు తెచ్చుకున్నారు.
కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా…
ఆరవ దశకం ద్వితీయార్ధంలో చేసిన ‘మమత’ (1966), ‘హాతే బజారే’ (1967) చిత్రాల తర్వాత ఆయన కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారారు. ‘జ్యూయల్‌ తీఫ్‌’ (1967)లో విలన్‌గా, ‘మిలి’ (1975)లో సానుభూతికి నోచుకునే తండ్రిగా, ‘ఆశీర్వాద్‌’ (1968), ‘చోటీ సీ బాత్‌’ (1975) సినిమాల్లో వృద్ధునిగా, ‘జవాబ్‌’ (1970)లో రేపిస్ట్‌గా, ‘విక్టోరియా నెం. 203’ (1972)లో మోసగానిగా, ‘ఖూబ్‌సూరత్‌’ (1980)లో భార్యా విధేయుడైన ఇంటిపెద్దగా వైవిధ్యమైన పాత్రల్లో రాణించారు అశోక్‌కుమార్‌. అప్పట్నించే ఆయనను అందరూ ప్రేమగా ‘దాదామోని’ (పెద్దన్నయ్య)గా పిలుచుకోవడం ప్రారంభించారు. ఎనిమిదో దశకానికి వచ్చేసరికి ఆయన సినిమాలను బాగా తగ్గించేసుకున్నారు. టెలివిజన్‌లో అడుగుపెట్టి దూరదర్శన్‌లో ప్రసారమైన మొదటి ధారావాహిక ‘హమ్‌ లోగ్‌’ (1984)కు ప్రయోక్తగా వ్యవహరించారు. 1986లో ప్రసారమైన ‘బహదూర్‌ షా జఫర్‌’ సీరియల్‌లో టైటిల్‌ రోల్‌ పోషించారు. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో ఆయన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ను అందుకున్నారు. వృద్ధాప్యం కారణంగానూ, అనారోగ్య కారణాల వల్లనూ ఆయన తొమ్మిదో దశకం మధ్య నుండి సినిమాలకూ దాదాపు దూరమయ్యారు. నటునిగా ఆయన చివరి చిత్రం ‘ఆంఖోం మే తుమ్‌ హో’ (1997). సంపూర్ణ జీవితాన్ని గడిపిన ఆయన తొంభై ఏళ్ల వయసులో గుండెపోటుతో 2001 డిసెంబర్‌ 10న మృతిచెందారు.
(నేడు అశోక్‌కుమార్‌ జయంతి)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కవిత -”సన్నికర్ష

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరిత్ర దారుణాలకు వర్తమాన దర్పణం -నోబెల్ ప్రైజ్ విన్నర్ -పాట్రిక్ మోదియానో

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”భాష కోసమే బతుకుతున్నా ”అంటున్న కేన్సర్ పీడితుడు -తాతా రమేష్ బాబు –

భాష కోసమే బతుకుతున్నా

కళ మనిషిని బతికిస్తుందా? అంటే అవుననే అంటారు తాతా రమేష్‌బాబు. తనను కేన్సర్‌ ఏ క్షణాన్నైనా కబళించే అవకాశం ఉందని తెలిసినా జానపద కళల కోసం ఆయన చేస్తున్న కృషిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జానపద కళల పునరుజ్జీవంతోనే తెలుగు భాష వికసిస్తుందని నమ్మి, గత మూడు దశాబ్దాలుగా అందుకోసం కృషి చేస్తున్నారు రమేష్‌బాబు.

గుంటూరు జిల్లా భట్టిప్రోలులో జన్మించిన తాతా రమేష్‌బాబు గుడివాడలో ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే తెలుగు భాషా వికాసం, తెలుగు భాషా చైతన్యం కోసం కృషి చేశారు. జానపద కళలు, సూక్ష్మచిత్రకళ, పెయింటింగ్స్‌, బొమ్మలాటలు, పప్పెట్‌ షోలు… ఇలా అనేక విధాలుగా తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తుండటం విశేషం. ఇప్పటి వరకు 30కి పైగా పుస్తకాలు రాశారు. దూరదర్శన్‌, రేడియోలో పప్పెట్‌ షోలు చేశారు. ఆకాశవాణిలో ధారావాహిక ప్రసంగాలు చేశారు. కవితలు, కథలు, సభల సమీక్షలు నిర్వహించారు. రంగస్థలంపై నాటకాలకు కొదవ లేదు. ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులను అందుకున్నారు. గుంటూరు శేషేంద్రశర్మ సాహితీ పురస్కారంతో పాటు జాతీయ ఉగాది పురస్కారాలు వరించాయి.

‘‘తెలుగు భాష గొప్పది..’’ అంటూ దీర్ఘ ఉపన్యాలు ఇస్తే వినడానికి జనాలు అంత ఆసక్తి చూపరు. అదే ఏ పప్పెట్‌తోనో, జానపద గేయంతోనో చెబితే వింటారు. నిర్వాహకుల లక్ష్యమూ నెరవేరుతుంది. తాతా రమేష్‌బాబు ఆ పనే చేశారు. జానపద కళలను బతికించుకోవాలని తాపత్రయ పడుతూనే.. మరో వైపు తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారాయన.
ఆంగ్ల చదువులొచ్చాక మాతృభాష పట్ల తగ్గుతున్న ఆసక్తిని గమనించి ఆయనీ పని చేస్తున్నారు. ‘‘తెలుగు భాష తీరు ఇలాగే కొనసాగితే మరో 30 ఏళ్లలో కనుమరుగు కావడం ఖాయం’’ అని ఐక్యరాజ్యసమితి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆయనలో తీవ్ర ఆలోచనలు రేకెత్తించింది. తెలుగు భాషను కాపాడుకోవాలనే దృఢ సంకల్పాన్ని కలిగించింది. తెలుగు భాష అప్పుడెందుకు పరిఢవిల్లింది? ఇప్పుడెందుకు నీరసిస్తోంది? అన్న ప్రశ్నలు రమేష్‌బాబు మదిని నిత్యం తొలిచేవి. కారణాలు ఎన్నున్నా.. జానపద కళలు అంతరించిపోతుండటమూ ఒక కారణమన్నది రమేష్‌బాబు అభిప్రాయం. ‘‘జానపద కళలు పునరుజ్జీవం పొందినప్పుడే భాషకు కొత్త వెలుగు వస్తుంది. పాతికేళ్ల క్రితం చదువురాని వారికి సైతం రామాయణం, మహాభారతం కంఠతా వచ్చేవి. దానికి కారణం జానపదకళలే కదా! తెలుగు భాష వికాసం జరగాలంటే ఆ కళలను మళ్లీ బతికించుకోక తప్పదు’’ అని చెప్పారు.
కేన్సర్‌ కబళిస్తున్నా…
తెలుగు భాషా చైతన్యం కోసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చైతన్యయాత్రలు నిర్వహించారు రమేష్‌బాబు. ఇందుకోసం ఏడు లక్షల రూపాయల వరకు తన సొంత డబ్బును ఖర్చు చేశారాయన. ప్రభుత్వం గానీ, ఇతర సంస్థలు గానీ ఎటువంటి సహాయం చేయలేదు. అయినా సరే వెనుకంజ వేయకుండా ఊరూరా తిరిగి జానపద కళలు, వాటి ప్రాముఖ్యత, తెలుగు భాష గొప్పదనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. అయితే అదే సమయంలో ఆయనను విధి వెక్కిరించింది. కేన ్సర్‌ రూపంలో అనారోగ్యం బయటపడింది. కేన్సర్‌ అనగానే తన గురించి, కుటుంబం గురించి ఆలోచిస్తారు ఎవరైనా. కానీ తను అందుకు భిన్నంగా- చనిపోయేలోగా సమాజానికి ఏదైనా చేయాలని సంకల్పించారు. వ్యాధి గురించి తెలిశాకే తన కోరిక మరింత బలపడిందని ఆయన అంటారు. టీచర్‌ వృత్తిని వదిలేసి జానపద కళల ప్రాచుర్యంపై పూర్తి దృష్టి సారించారు. ‘‘కళాసాహిత్య సేవా పీఠాన్ని నెలకొల్పి కళ, సాహిత్యం, సేవ, భాష, సంస్కృతి, చరిత్ర.. ఇలా ఆరు అంశాల్లో పేద కళాకారులకు నగదు బహుమతిని అందజేయాలనుకుంటున్నాను. నేను ఉన్నా లేకున్నా ప్రతి ఏటా ఇది కొనసాగడానికి కొంత నిధిని ఏర్పాటు చేశాను. పేద కళాకారులకు ఇది కొంతైనా సహాయపడుతుందని నా ఆశ. ప్రతి ఒక్కరు సమాజం నుంచి లాభం పొందుతుంటారు. వాళ్లు తిరిగి సమాజానికి కొంత ఇవ్వడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే సమాజం ఆనందంగా ఉంటుంది’’ అని తెలిపారు రమేష్‌బాబు.
కేన్సర్‌ కబళిస్తున్నా ‘అడవి పూలు, గంగతో రాంబాబు’ వంటి సీరియల్స్‌లోనూ ఆయన నటిస్తున్నారు. రేడియో, టీవీల్లో జానపద కళలకు ప్రాచుర్యం తీసుకొస్తున్నారు. గోశాల నుంచి కొన్ని ఆవులను దత్తత తీసుకుని వాటి ఆలనాపాలనా చేస్తున్నారు. అనాథ బాలలకు తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఊరికే ఒక్క పైసా విదల్చని ఈ కాలంలో అంత డబ్బు ఎలా ఖర్చుపెడుతున్నారని అడిగితే ‘‘నాకు అందులోనే ఆనందం ఉంది. టీచర్‌గా పనిచేస్తూనే రాత్రిపగలు నా భార్య, నేనూ స్ర్కీన్‌ప్రింటింగ్‌ నడిపే వాళ్లం. వృథాగా ఎక్కడా డబ్బు ఖర్చు పెట్టలేదు. నా దృష్టిలో ఖర్చు చేయకపోవడం అంటే సంపాదించడమే. అలా నేను సంపాదించిన, పొదుపు చేసుకున్న డబ్బులో నుంచే నాకిష్టమైన వ్యాపకాల కోసం తీసుకునే వాడ్ని. దీనికి నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు’’ అన్నారు రమేష్‌బాబు.
– నవ్యడెస్క్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంగుల తెలంగాణ -కళాకారుల ఆవిష్కరణ

రంగుల తెలంగాణం

ఆర్ట్‌ అంటే – కాన్వాస్‌, బ్రష్‌లు, రంగులు కాదు. నింగి, నేల, మనుషులు, యాస గోస, బతుకులు, కష్టాలు కన్నీళ్లు. వాటన్నిటినీ అద్దంలో చూపిస్తుంది పెయింటింగ్‌. తెలంగాణలో అలాంటి పెయింటింగ్స్‌కు కొదవ లేదు. ఇక్కడున్నంత మంది ప్రముఖ ఆర్టిస్టులు ఇంకెక్కడ లేరు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను రంగుల్లోకి కన్వర్ట్‌ చేసి కాన్వాస్‌ మీద ప్రతిఫలించి.. దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ఘనత వీరిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి అందరు ఆర్టిస్టులు ఒకచోట చేరి చిత్రకళకు నీరాజనం పలికారు. హైదరాబాద్‌లో జరిగిన ఆ ఆర్ట్‌క్యాంప్‌ విశేషాలే ఇవి..

పెయింటింగ్‌ను వృత్తిగా, ప్రవృత్తిగా ఎంచుకున్న మహిళలు తక్కువేనని చెప్పవచ్చు. అయితే ఉన్న కొద్ది మంది మహిళలు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, పేరును సంపాదించుకున్నారు. మరి కొంత మంది తమ వృత్తిని కొనసాగిస్తూనే ఆర్టిస్టులుగా అప్పుడప్పుడు కుంచె పట్టుకుంటున్నారు. ‘‘తెలంగాణలో 12 మంది మహిళా ఆర్టిస్టులున్నారు. అందులో నేను ఒకరిని కావడం నా అదృష్టం. ఇండియన్‌ మైథాలజీపై నేను రీసెర్చ్‌ చేస్తున్నాను. అందులో భాగంగానే తెలంగాణ గ్రామదేవతలపై పరిశోధన సాగిస్తున్నాను. నేను వేసే పెయింటింగ్స్‌లో కూడా గ్రామదేవతలు ఉంటారు. ఈ క్యాంప్‌లో గాడెస్‌ ఆఫ్‌ లైఫ్‌ పేరుతో బతుకమ్మ చిత్రాన్ని గీసాను. ఒక ఆధునిక మహిళ కల్చర్‌ను ఎలా యాక్సెప్ట్‌ చేస్తోంది.. కల్చర్‌తో పాటు ఎలా ముందుకెళుతోందనే అంశాలను నా చిత్రాలు ప్రతిబింబిస్తాయి’’ అంటున్నారు మహిళా ఆర్టిస్ట్‌ నిర్మల. తను ఇఫ్లూలో రీసెర్చ్‌ స్కాలర్‌గా చేస్తూనే ఉమెన్‌ ఓరియెంటెడ్‌ పెయింటింగ్స్‌ వేస్తూ మహిళాభ్యున్నతికి తన వంతు కృషి చేస్తున్నారు.
ప్రత్యక్షంగా చూసే అవకాశం
ఒక అద్భుతమైన పెయింటింగ్‌ను చూసినపుడు ఎలా గీసి ఉంటారో అనిపిస్తుంది. అయితే అలాంటివి వేసేటప్పుడు చూసే అవకాశం లభించదు. ఇలాంటి ఆర్ట్‌ క్యాంప్‌లు ఆ అదృష్టాన్ని అందిస్తాయి. ‘‘ఇదొక హిస్టారికల్‌ ఈవెంట్‌. ఇక్కడ సీనియర్‌ ఆర్టిస్టులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. వారితో ఇంటరాక్ట్‌ కావడం వల్ల టెక్నికల్‌ అంశాలు తెలుసుకోగలిగాం. తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులందరికీ దక్కిన ఒక అరుదైన అవకాశం ఇది’’ అని కరీంనగర్‌ జిల్లాకు చెందిన కిరణ్‌ వరికిల్ల అన్నారు. ఈయన అద్భుతమైన ఎరోటిక్‌ పెయింటింగ్స్‌ను ఈ క్యాంప్‌లో వేశారు. ఆర్టిస్టులు వేస్తున్న సమయంలోనే సందర్శకులు ఆసక్తిగా తిలకించి వారి చిత్రకళా నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అంతేకాకుండా చిత్రకళలో అపారనైపుణ్యం ఉన్న ఆర్టిస్టులను ఇప్పుడిప్పుడే ఆర్టిస్టులుగా ఎదుగుతున్న వారు చూసి నేర్చుకునేందుకు ఒక వేదికగా ఉపయోగపడింది.
స్వేచ్ఛకు ప్రతీక..

తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తరువాత నిర్వహించిన మెగా ఆర్ట్‌ క్యాంప్‌ కావడంతో చిత్రాలలో తెలంగాణం వెల్లివిరిసింది. ప్రతి పెయింటింగ్‌లో తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు సందర్శకులను కట్టిపడేశాయి. ‘‘స్వేచ్ఛకు చిహ్నంగా పావురాన్ని ఎంచుకుంటారు. కానీ నా చిత్రంలో కాకిని ఎంచుకున్నాను. ఇందులో ఎరుపు పోరాటాన్ని, నీలం నిరసనను తెలియజేస్తుంది. ఆకుపచ్చ రంగు అభివృద్ధికి సూచికగా నిలుస్తుంది. మొత్తంగా దళిత స్వేచ్ఛను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది’’ అని ప్రముఖ ఆర్టిస్ట్‌ అక్బర్‌ అన్నారు. ‘‘సీనియర్స్‌ పెయింటింగ్‌ చేస్తుంటే చూడాలనే ఒక ఆసక్తి ఉండేది. అది ఈ క్యాంప్‌లో తీరింది. ఆర్టిస్టులు మంచి మంచి పెయింటింగ్స్‌ వేయడానికి ఇలాంటి ఎన్విరాన్‌మెంట్‌ బాగా ఉపకరిస్తుంది. అంతరించిపోతున్న రూరల్‌ కల్చర్‌ను పట్టి చూపిస్తాయి నా చిత్రాలు’’ అని మెదక్‌ జిల్లా కాస్లాబాద్‌కు చెందిన కంది నర్సింలు అంటున్నారు. ఈయన ఆర్ట్‌ క్యాంప్‌లో వేసిన పెయింటింగ్‌ పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లి అప్పటి అలంకారం ఎలా ఉండేదో ప్రత్యక్షంగా చూపించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి పెద్దఎత్తున నిర్వహిస్తున్న ఆర్ట్‌ క్యాంప్‌ ఇది. ఈ క్యాంప్‌ విజయవంతం కావడం మాలో ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడిప్పుడే ఆర్టిస్టులుగా ఎదుగుతున్న వారికి ఈ తరహా క్యాంప్‌లు చాలా ఉపయోగపడతాయి. సీనియర్‌లతో ఇంటరాక్షన్‌ కావడం వల్ల చిత్రకళలో మెలకువలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. రంగులు ఎలా అప్లై చేయాలి? కర్వ్స్‌, డ్రాయింగ్‌, ఫినిషింగ్‌ వంటి పనితనం తెలుస్తుంది. ఒక పెయింటింగ్‌ని చూసినపుడు ఈ కర్వ్‌ ఎలా వేసి ఉంటాడు ? ఫినిషింగ్‌ అద్భుతంగా ఉంది, ఎలా చేసి ఉంటాడని అనిపిస్తుంది. అవన్నీ ఇక్కడ స్వయంగా చూసే భాగ్యం కళాభిమానులకు కలిగింది.
– బి.నర్సింగరావు, ప్రముఖ దర్శకులు, చిత్రకారులు

ఆర్టిస్టులందరినీ ఒకే వేదికపై తీసుకురావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. మేం ఆ ప్రయత్నం చేసి సఫలమయ్యాం. 100 సంవత్సరాల హిస్టరీని డాక్యుమెంట్‌ చేశాం. 150 మంది ఆర్టిస్టుల ప్రొఫైల్స్‌ను పుస్తకరూపంలో తీసుకువచ్చాం. ఇందులో సీనియర్‌ ఆర్టిస్టుల నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆరిస్టుల వరకు వివరాలు ఉన్నాయి. పాతతరం ఆర్టిస్టుల వివరాలు కావాలంటే ఎక్కడా దొరకవు. ఈ పుస్తకంతో ఆ లోటు తీరింది. ఒక డాటా బ్యాంక్‌ మాదిరిగా ఈ పుస్తకం ఉపయోగపడనుంది.
– ఏలె లక్ష్మణ్‌, ప్రముఖ చిత్రకారుడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34

32- సింహళ రాజ కవి -కుమార దాసు

మహా కావ్యం ‘’జానకీ హరణం ‘’రాసిన కుమార దాసు 413-523కాలం లో శ్రీలంకను పాలించిన కుమార సేన మహా రాజు అని భావించారు .కాని కావ్యం చివర లో ఉన్నదాన్ని బట్టి తన తండ్రి కుమారసేనుని సైన్యాధికారి ‘’మానిత’’’అని ,తన చిన్నతనం లో యుద్ధం లో చనిపోయాడని  మేనమామలు మేఘ ,అగర బోధిలు తనను పెంచి పెద్దవాడిని చేశారని రాశాడు .క్రీ శ తొమ్మిది వందల కాలం వాడైన రాజ శేఖరుడు కుమార దాసు అంధుడు గా జన్మించాడని ‘’తన కావ్య మీమాంసలో ‘’మేఘా విరుద్ధ కుమారాదాసదయః జాత్యన్ధాః ‘’అని రాశాడు .కాని ఈ మాట రాసింది మహా కవి కాళి దాసు అని ,కాళిదాసు తర్వాత కుమార దాసు వచ్చాడని అంటారు .కనుక క్రీ .శ. అయిదు వందల నాటివాడని చెప్పారు .మాఘుడికి ముందు భవ భూతికి తరువాత కుమారదాసు ఉన్నాడని అంటారు .జానకీ హరణ కావ్యం రాసేముందు కుమార దాసు కాళిదాసు రాసిన రఘు వంశకావ్యం  చదివి ఉంటాడని భావిస్తున్నారు .కుంహాన్ రాజ అనే పరిశోధకుడి పరిశోధనలో కుమార దాసు దక్షిణ దేశం లోని కంచి లో నివశించి ఈ కావ్యాన్ని రాశాడని ఉంది .ఈ కావ్యం కాళీదాస కృత రఘు వంశ స్తాయి ఉందనీ చెప్పాడు .సుభాషిత రత్న కోశం లో కుమార దాసురాసిన జానకీ హరణ కావ్య  ప్రస్తావన ఉంది .’’జానకీ హరణం కర్తుం –రఘు వంశే పురస్తితే –కవిః కుమారా దాసోవా –రావణోవా యది క్షమః ‘’దీని అర్ధం –రఘువంశ అంటే సూర్య వంశ  కావ్యం కాళిదాసు రాసింది ఉండగా జానకీహరణం అంటే కుమారదాసుకావ్యం సీతాపహరణం చేసే సామర్ధ్యం కుమార దాసుకు, రావణుడికి మాత్రమె ఉంది అని చమత్కరించాడు .

కుమార రామదాసీయం

కుమార దాసు కావ్యాన్ని చాలా గొప్పగా రాశాడు .ఇరవై సర్గల మహా కావ్యం ఇది .దశరదునిపై కమ్మని కవిత్వం చెప్పాడు .సందర్భాలను ఎన్నుకొని మహాకవ్యానికి తగినట్లు వర్ణనలు చేశాడు .బృహస్పతి మహా విష్ణువుతో రావణుడి దురాగతాలను అంతం చేయమని ప్రార్ధిస్తాడు . దాసు జలక్రీడల్ని,  సూర్యోదయ సూర్యాస్తమయాలను నేర్పుగా వర్ణించాడు .తరువాత కద మిధిలకు చేరుతుంది .విశ్వామిత్ర ,జనకుల సమాగమం కమనీయం గా కాళిదాస మార్గం లో వర్ణించాడు .కవిత్వం లో ‘’వైదర్భీ రీతి ‘’ని వాడి కావ్య గౌరవాన్ని ఇనుమడింప జేశాడు .కుమార దాసు గొప్ప వ్యాకరణ పండితుడు .అనుకూలమైన ఛందస్సులను సందర్భాన్ని బట్టి వాడి కదాగమనానికి ,రామ ణీయతకు తోడ్పడ్డాడు .ద్రుత విలంబితం ,ప్రమితాక్షరం ,ఇంద్ర వజ్ర ఉపజాతులు బాగా వాడి సమర్ధతనిరూపించాడు .వంకస్త ,వైతాళీయ ,రదోద్ధత ,ఛందో భేదాలను సద్వినియోగం చేసుకొన్నాడు .శార్దూలం శిఖరిణి ,స్రగ్ధర ,పుష్పితాగ్ర , ప్రహర్శిణి వసంత తిలక ,అవితా మందాక్రాంత ,మాలిని లను అవసరాన్ని బట్టి ప్రయోగించాడు .వాల్మీకానికి పూర్తీ విదేయకం గా రామాయణ పాత్రల ఉదాత్తతకు ఉన్నత స్తానం కల్పించేట్లుగా  మనో భావాలను,భావోద్వేగాలను పరిపూర్ణం గా  స్పష్టం గా వ్యక్త్యం చేసేట్లు రాశాడు కుమార దాసు .అంతకు ముందు ఏకవీ వాడనికొన్ని పదాలను కుమార దాసు వాడి నూతనత్వానికి దారి వేశాడు .

‘’ మాక్డోవేల్ పండితుడి’’ దృష్టిలో కుమార దాసు మౌర్య రాజు ముద్గాలాయనుడికొడుకు .తండ్రి తొమ్మిదేళ్ళు రాజ్య పాలన చేశాడట .దాసుగురించి బౌద్ధ వాజ్మయం లో విస్తృతం గా ఉందట .సింహళ దేశం లో జానకీహరణ కావ్యాన్న్ని ప్రతిమాటనూ అనువాదం చేసి భద్రం గా దాచుకొన్నారు అంటే సింహలీయులపై అతని ప్రభావం జాస్తీగా ఉందని అర్ధం .

వాల్మీకి రామాయణం లోని కదనే  తీసుకొన్నా దాసు కొన్ని మార్పులు చేశాడు .విశ్వామిత్రుడు అడిగిన వెంటనే దశరధుడు యాగ రక్షణకు రాముడిని పంపుతూ క్షత్రియ ధర్మాలు బోధిస్తాడు. మారీచుడు కూడా సుబాహు తో పాటు రాముడి చేతిలో చచ్చినట్లు చెప్పాడు .మాయ లేడి విషయాన్ని సంక్షిప్తం చేశాడు .సీతా స్వయం వరానికి ముందే జానకీ రాములు పరస్పరం కలుసుకొని అనురాగం పొందినట్లు మార్చాడు .తనకు నచ్చిన ఘట్టాల్లోని భారవి ,భవ భూతి కాళిదాసకవితలను స్పూర్తిగా తీసుకొని గొప్ప ప్రేరణ పొంది చక్కగా అనుకరించి కవిత్వం చెప్పాడు –‘’గగన సరసి చంద్ర రూప్య  కుంభే-వ్యప సరతి స్మ నిపాతితే రాజన్యా ‘’అని, భారవి ఉపమానమైన ‘’హేమ కుంభ ఇవ పూర్వ పయోదేర్మున  మజ్జ  శనకైస్తు హిమామ్శుః ‘’ను అనుకరించి కుమార దాసు చెప్పాడు .

నఖ శిఖ పర్యంత సీతా సౌందర్యాన్ని వర్ణించి తరువాతి వారికి మార్గ దర్శి అయ్యాడు దాసు .అనుకరణను అవసరాన్ని కి తగ్గట్టు చేసిన స్వతహాగా మహా భావుకుడైన కవిగా దర్శన మిస్తాడు .అందరికంటే ఒక ఆకు ఎక్కువే చదివి సంభోగ శృంగారాన్నీ తనివి తీరా వర్ణించాడు .పరశురాముడు రాముడిని  కలిసినప్పుడు .ఇద్దరి మధ్యా సంభాషణలను రౌద్ర వీర రసాలతో పుష్టి కల్గించాడు .దాదాపు అన్ని రసాలను కావ్యం లో పోషించాడు విశ్వామిత్ర్ ఆశ్రమ ప్రశాంతతను శాంత రసం తో నింపాడు .విభావాన్ని ,అనుభావాన్ని గొప్పగా ప్రదర్శించి రస పుష్టి చేకూర్చాడు .పద్దెనిమిదవ సర్గలో శబ్ద చమత్క్రుతీ వైభవాన్ని అనుభవైక వేద్యం చేశాడు .అనేక రకాలుగా బంధ కవిత్వం తో చెలరేగిపోయి రాశాడు .అందులో గోమూత్రిక ,మురజాదులు ముఖ్యమైనవి .నిర్యోస్త్య ,అనులోమ ,ప్రతిలోమ కవిత్వం లోను తన ప్రజ్ఞా ప్రదర్శనను అత్యద్భుతం గా చేశాడు .శ్లేషనూ సమాదరించాడు .

ప్రతిభ తో బాటు వ్యుత్పత్తికూడా  సంపూర్ణం గా ఉన్నకవి కుమార దాసు .అందుకే సుప్రసిద్ధ ఆలంకారికులైన విద్యాకరుడు ,జల్హనుడు .శ్రీధరుడూ ,వల్లభ దేవుడు కుమార దాస కృత మహా కావ్యం జానకీ హరణం నుంచి శ్లోకాలను రాసి ఉదాహరించారు .అందుకే ఎవరి ప్రచారమూ అక్కర్లేకుండా కుమారుడు మహా కవికుమారుడై ,దాసు వాణీ దాసుడైనాడు .

Inline image 1

మరో కవిని తర్వాత దర్శిద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా లంకా శివరాం ప్రసాద్ గారి ”టర్కీ ట్రావలోకం ‘

డా లంకా శివరాం ప్రసాద్ గారి ”టర్కీ ట్రావలోకం ‘turky1 001 turky2 001 turky3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేడియో ప్రయోజనంపై” రేడియో నాటకం”రాసిన స్వర్గీయ పైడి తెరేష్ బాబు

radio1 001 radio2 001 radio3 001 radio4 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33

31-  తొలిశాస్త్ర కావ్య కవి -భట్టి

‘’రావణ వధ ‘’అనే మహా కావ్యాన్ని రాసిన కవి భట్టి .దీనికి ‘’భట్టికావ్యం ‘’అనే పేరుంది .భర్త్రు కావ్యం ,రామ కావ్యం ,రామ చరిత్ర అనేపేర్లూ ఉన్నాయి .ఏడవ శతాబ్దానికి చెందిన కవి భట్టి .సంస్కృత శబ్దం ‘’భర్త్రి ‘’ప్రాకృతం లో ‘’ భట్టిఅయందని అంటారు .భర్త్రు హరి కొడుకే భట్టి అనే ఒట్టి భ్రమా ఉంది   . ‘’పాణిని వ్యాకరణాన్ని రామాయణ కధకు జోడించి కవితామయం చేశాడు కావ్యాన్ని.ఒక రకం గా పాణినికి ఇది వ్యాఖ్యాన రామకధా రూపం అని చెప్ప వచ్చు . శ్రీరాముని సకల సద్గుణాభిరామునిగా తీర్చి దిద్దాడు .అగ్ర కవుల సరసన చేర్చే కావ్యం గా రావణ వధ కావ్యాన్ని నిర్వహించాడు .ఈ కావ్యం లో రావణ వధ భాగం అతి చిన్నదే అయినా ,మిగిలిన రామాయణ కావ్యాలకు భిన్నంగా ఉండాలని ‘’రావణ వధ ‘’అని టాగ్ తగిలించాడని పిస్తుంది .సంస్కృత సాహిత్యం లో శాస్త్ర కావ్యాలలో ఇదే మొట్టమొదటిది .శ్లోకాలలో రాసి దాని గౌరవాన్ని మరీ పెంచాడు .ఈ కావ్యం పాఠ్య గ్రంధం అయింది అంటే దాని విశేషమేమిటో కవి ప్రతిభ ఎలాంటిదో తెలుస్తుంది .భట్టి ని భట్టికవి ,భట్టిపండిత ,భట్టి బ్రాహ్మణ అనికూడా పిలుస్తారు .భామహుడి సమకాలికుడు .

భట్టి కవితా భట్టీయం

భట్టి రావణ వదాకావ్యం లో పూర్తిగా వాల్మీకినే అనుసరించాడు .యుద్ధ కాండ తో ఆపేశాడు .ఉత్తరా రామ చర్తిత్ర జోలికి పోలేదు  .పాణిని వ్యాకరణాన్ని జన సామాన్యానికి అందించాలనే తపన తో రాసిన గొప్ప ప్రయోగ ,ప్రయోజన కావ్యం .శబ్దాల వ్యుత్పత్తి ,ప్రయోగ వైచిత్రీ వివరించిన కావ్యం ఇది .వ్యాకరణ అంశాలను కావ్యం ద్వారా బోధించాడు కనుక శాస్త్ర కావ్యం అనే మాట సరిపోయింది .కావ్యం లోని సర్గలకూ వ్యాకరణ సంజ్ఞలను పెట్టటం మరో విశేషం .మొదటి అయిదు సర్గల వరకు ‘’తిగంత’’రూపాలు చెప్పాడు వీటికే ‘’ప్రకీర్ణ కాండం ‘’అనే పేరు .ఆరవ సర్గ నుంచి తోమ్మిదివరకు చాలా లక్ష్య రూపాలను తెలియ జేశాడు .వీటికి ‘’అధికార కాండం ‘’అని పేరుంది.పదో సర్గనుందడి పదమూడవ సర్గ వరకు గుణాలంకార లక్ష్యాలు వివరించాడు .వీటినే ‘’ప్రసన్న కాండం ‘’అంటారు .పదకొండు నుంచి చివరి ఇరవై రెండవ సర్గ వరకు ‘’లట్ ‘’మొదలైన తొమ్మిది లకారాల విశిష్ట రూపాలను తెలియ జేశాడు .వీటిని తిన్గంత కాండమని పేరు .ఈ విధం గా పాణిని చెప్పిన వ్యాకరణ అంశాలను ,అలంకారాలతో మిళితం చేసి రామకధా వస్తువును ఎన్నుకొని కావ్యాన్ని రాశాడు భట్టి . శాస్త్రం  ,కావ్యం అనేజోడు గుర్రాల స్వారీ చేశాడన్నమాట .వ్యాకరణ  ఉదాహరణలకు శ్లోకాలు రాశాడు .వర్ణనలు వర్ణనల కోసమే రాసినట్లు ఉండికృత్రిమత కనిపిస్తుంది .

కవిత్వం విషయం గురించి చెప్పాలంటే ధారా శుద్ధి బాగా ఉంటుంది .శైలి రమ్యం గా రస బంధురం గా ఉండటం మరీ కావ్య శోభను పెంచింది .యమకాలను విస్తృతం గా ప్రయోగించటం తో కర్ణ మాధుర్యం ప్రస్పుటమైంది .ఇదేమి వ్యాకరణం రా బాబోయ్ అని అనిపించదు .ఆ ప్రవాహం లో అలా కొట్టుకు పోతాం .కధకు వ్యాకరణ బోధకు తగిన శబ్దాలను ఎంచుకొని ప్రయోగించటం లో భట్టి అసమాన మైన గట్టి పాండిత్య ప్రతిభను ప్రదర్శించాడు .శబ్ద ప్రయోగం ఆశువుగా వచ్చి చేరి నిండుదనాన్ని ,రామణీయకతనూ చేకూర్చింది .నూతన శబ్దాలకు ,సంధులకు  భట్టి కావ్యం  భాండాగారం గా నిలిచింది .భాష మీట పట్టు ఉందని చూపటానికి భట్టి ప్రసిద్ధం లో లేని పదాలనూ ప్రయోగించి సత్తా చాటుకొన్నాడు .చిన్న చిన్న సమాసాలే వాడి చదువరులకు గొప్ప ఆసక్తినికలిగించి వైదర్భీ రీతికి న్యాయం చేశాడు .

భట్టికవి అలంకార,వ్యాకరణాలలోనే కాదు నాట్య ,సంగీత ,వేద,వేదాన్గాలలోను అర్ధ ధర్మ శాస్త్రాలలోను అసమాన పండితుడు .రానీతిని ఔపోసన పట్టినట్లు కావ్యం తెలియ జేస్తుంది .సంభాషణా చతురుడనిపిస్తాడు .సామాన్యులు ఈ కావ్యాన్ని చూసి పారిపోరు .ఆప్యాయం గా చదివి ఆనందిస్తారు .అదీ భట్టీయం .చాలా చోట్ల భారవిని అనుకరించినట్లు తోస్తుంది .మాఘుడు భట్టిని అనుకరించాడు అదీ భట్టికి ఉన్న ప్రత్యేకత .ఉచితమైన సందర్భ శుద్ధికల వర్ణనలే భట్టి చేసి సెబాస్ అనిపించాడు .శరద్రుతువును వర్ణిస్తూ భట్టి చెప్పిన శ్లోకం మహా భేషుగ్గా ఉంటుంది .చూడండి –

‘’నతజ్జలంయన్న సుచారు పంకజం –న పంకజం తద్యదలీన షత్పదం-నషత్పదోసౌ నజుగుమ్జ యః కలం న గుంజితం తన్న జహార యన్మనః ‘’ –భావం –‘’కమాలలు వికసించని సరస్సులు సరసులేకావు .భ్రమరాలు మూగని కమలాలు కమలాలే కావు .ఝంకారం చేయని తుమ్మెదలు తుమ్మెదలే కావు .మానవుల మనస్సులను ఆకర్షించని   ఝంకారాలు భ్రమర  ఝమ్కారాలేకావు .’’

ఉదయ సూర్యుని గురించి వర్ణిస్తూ ‘’ప్రపంచం అంతా పెను చీకటి అనే బురదలో కూరుకు పొతే ఉదయాద్రి మీద ఉదయించే భాణుడు తన కిరణాలు అనే తాళ్ళ చేత ప్రాణులను పైకి లాగుత్న్నట్లు ఉన్నాడు ‘’

హనుమంతుడు లంకను కాలిస్తే అగ్ని జ్వాలలు  వ్యాపించి లంక యెంత కల్లోలం గా ఉందొ  యమకం లో మహా గమకం గా చెప్పాడు భట్టి .అర్ధం అక్కర లేదు శబ్ద సౌందర్యం తో ఆ విషయం అంతా అర్ధమైపోతుంది –

‘’సరసాం సరసాంపరి ముచ్యతమం పతతాం పతతాం కకుభో బహుశః

సకలైః సకలైః పరితః కరుణై రుదితై రుదితైరివ ఖం నిచితం

నగజా నగజా దయితా దయితా విగతం విగతం లలితం లలితం

ప్రమదా ప్రమదా  మహతా మహతా మరణం మరణం సమయాత్ సమయాత్ ‘’

వ్యాకరణం అనే కళ్ళజోడు పెట్టుకొన్న వారికి తన కావ్యం దీపం లాంటిది అని భట్టి స్వయం గా తెలిపాడు –‘’

‘’దీప తుల్యః ప్రబందోయం శబ్ద లక్షణ చక్షుషాం-హస్తా మర్ష ఇవాంధానాం భవేద్ వ్యాకరణాద్యతే’’-అంటే దీపం గుడ్డివాడికి వస్తువులను చూపించలేదు .అలాగే వ్యాకరణ చక్షువులు ఉంటేనే నా కావ్యం ,దీపం లాగా కదన వస్తువులను దర్శింప జేస్తుంది అని భట్టి స్వయం గా చెప్పాడు .’’తెలుగున వ్యాకరణ దీపం చిన్నది ‘’అన్నారు వెంకట శాస్త్రి గారు .పెద్ద వ్యాకరణ కళ్ళజోడు పెట్టుకొంటేనే భట్టీయం అర్ధమవుతుంది .ఉత్త కావ్య ‘బట్టీయం’’ వలన అందం గోచరించదు .ఈ కావ్యాన్ని పగల గొట్టి అందరికి అర్ధమయ్యేట్లు చేయటానికి ఇరవై రెండు వ్యాఖ్యానాలు వచ్చాయి .పెద్ది భట్టు అనే తెలుగు ఆయన మంచి వ్యాఖ్య రాశాడు .మల్లినాద సూరి మనుమడే పెద్ది భట్టు .మల్లినాదుడుకూడా భట్టి కావ్యానికి ‘’సార్వ పధీనా ‘’పేరుతొ వ్యాఖ్యానం రచించాడు .శ్రీధరుడు కూడా తెలుగులో వ్యాఖ్యానించాడు .శ్రీనాధుడుఅనే పెరుగలాయన  ‘’భట్టి రూప ప్రకాశం ‘’పేరుతొ వ్యాఖ్యానం రాసినట్లు తెలుస్తోంది .ఇతను మన శృంగార శ్రీనాదుడుకాదని ఈయనే రఘువంశ ,నైషధాలకూ వ్యాఖ్యానం రాశాడని భావిస్తున్నారు .ఏమైనా భట్టి మంచి రసపట్టు ఉన్న దిట్టమైన కవి అనటానికి సందేహం లేదు .

భట్టి ఈ కావ్యం లో పదమూడవ సర్గ లో మరో గొప్ప ప్రయోగం చేశాడు .అదే ‘’భాషాసమ ‘’అంటే ఒకే శ్లోకం ను సంస్కృతం లోను ప్రాకృతం లోను చదువుకోవచ్చు .సంధులు విడగోట్టుకొంటే అలా చదవటం సాధ్యమవుతుంది .మన ద్వార్దికావ్యాలలో లాగా .భట్టికావ్యానికివిదేశీ ప్రాచుర్యమూ దక్కింది .జావా దేశం లో పురాతన ‘’జావనీయ రామాయణానికి’’ ‘’సోర్స్ బుక్ ‘’గా  భట్టికావ్యాన్ని ఉపయోగిస్తున్నారు .జావా రామాయణం అతిపురాతనకావ్యం దీన్ని’’కాకావిన్ ‘’అని గౌరవం గా సంబోధిస్తారు .భట్టికావ్యం జావా ప్రజలకు అరాధనీయం   భట్టికావ్యం లోని యమకాలను,శ్లేషను  వాళ్ళు బాగా ఉపయోగించుకొన్నారు .

భట్టికావ్యం అనే రావణ వధ వీరకావ్యమని ,చతుర్విధ పురుషార్ధ సాధన ధ్యేయం గా రాశాడని ,నగర ,పర్వత ,సముద్ర ,ఋతు ,ఉదయాస్తామయ వర్ణనలు కలిగిఉందని ,ప్రేమ శృంగార సమన్వితమని ,సంస్కృత పంచకావ్యాల సరసన చేరి ఆరవ మహా కావ్యం అనిపించుకోందని ,’’ఆలివర్ ఫాలన్ ‘’అనే విమర్శకుడు భట్టికావ్య ఆంగ్ల అనువాదానికి ఉపోద్ఘాతం రాస్తూ చెప్పాడు .

Inline image 1   Inline image 2

మరోకవితో మరోసారి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సమసమాజ స్వాప్నికుడు – నశీర్‌ అహమ్మద్‌

సమసమాజ స్వాప్నికుడు – నశీర్‌ అహమ్మద్‌
మాతృభూమి విముక్తి కోసం అటు భారత జాతీయ సైన్యం యోధునిగా ఆంగ్ల సైన్యాలతో తలపడి, ఇటు సామ్యవాదం లక్ష్యంగా ఎంచుకుని సాగుతున్న రాజకీయ పోరాటాలలో నిన్నటి దాకా చురుగ్గా పాల్గొన్న కెప్టెన్‌ అబ్బాస్‌ అలీ 1920 జనవరి 3న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బులంద్‌షహర్‌ జిల్లా ఖుర్‌జా గ్రామంలోని జమీందారి కుటుంబంలో జన్మించారు. ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని అంగీకరించని ముస్లిం రాజపుత్ర కుటుంబం నుంచి వచ్చిన అబ్బాస్‌ అలీ ఉన్నత పాఠశాల విద్యార్థిగా సర్దార్‌ భగత్‌ సింగ్‌ స్థాపించిన ‘నౌ జవాన్‌ భారత సభ’లో సభ్యులయ్యారు. ఆ తరువాత ఉన్నత విద్య కోసం అలీఘర్‌ విశ్వవిద్యాలయానికి వెళ్ళిన ఆయన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్‌ కున్వర్‌ ముహమ్మద్‌ అష్రాఫ్‌ శిష్యరికంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యత్వం పొందారు. అష్రాఫ్‌ ప్రేరణతో బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీలో తిరుగుబాటుకు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అబ్బాస్‌ అలీ వ్యూహాత్మకంగా 1939లో బ్రిటిష్‌ సైన్యంలో చేరారు. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో భాగంగా 1941లో ఆయన సింగపూర్‌ వెళ్ళారు. 1942లో జపాన్‌ సైన్యాలకు బ్రిటిష్‌ బలగాలు లొంగిపోవడంతో ఇతర సైనికులు, సైన్యాధికారులతోపాటుగా అబ్బాస్‌ అలీ యుద్ధఖైదీ అయ్యారు. ఆ సందర్భంగా, 1943లో చివరి మొగల్‌ చక్రవర్తి బహదూర్‌ షాహ్‌ జఫర్‌ సమాధి వద్ద నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చేసిన ప్రసంగం మాతృభూమి విముక్తి కోసం అంకితమయ్యేందుకు అబ్బాస్‌ను సంసిద్ధం చేసింది. భారత జాతీయ సైన్యంలో చేరిన ఆయనకు ‘కెప్టెన్‌’ హోదా లభించింది. సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ నినాదానికి అనుగుణంగా ఆంగ్ల సైన్యాలతో పోరాటానికి అబ్బాస్‌ అలీ అరకాన్‌ యుద్ధక్షేత్రం వెళ్ళారు. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ పరాజయంతో భారత జాతీయ సైన్యం వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో బ్రిటిష్‌ సైన్యం భారత జాతీయ సైన్యం యోధులతో పాటుగా ఆయనను అరెస్ట్‌ చేసింది. అరెస్టు తరువాతు బ్రిటిష్‌ సైన్యాధికారులు కోర్టు మార్షల్‌ జరిపి అబ్బాస్‌కు మరణశిక్ష ప్రకటించారు. ఈలోగా బ్రిటిష్‌ వలస పాలకుల నుంచి భారత దేశానికి పూర్తిగా స్వాతంత్య్రం లభించడంతో ఆయనకు విధించిన మరణశిక్ష రద్దయ్యింది. స్వాతంత్య్రం లభించాక 1948లో ఆచార్య నరేంద్రేవ్‌, జయప్రకాష్‌ నారాయణ, డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా సహచర్యంలో సోషలిస్టు పార్టీ నాయకులుగా అబ్బాస్‌ అలీ ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ఈకృషిలో భాగంగా ప్రజల పక్షంగా అబ్బాస్‌ అలీ సాగించిన పోరాటం ఫలితంగా 1948 నుంచి 1974 వరకు ఆయన 50 సార్లకు పైగా అరెస్టు, ప్రభుత్వ నిర్బంధాలకు గురయ్యారు. చివరకు 1975లో ఏర్పడిన అత్యాక పరిస్థితి, నియంతృత్వ పోకడలను వ్యతిరేకించినందుకు గాను అబ్బాస్‌ అలీ 19 మాసాలు జైలులో గడపాల్సి వచ్చింది. 1978లో ఉత్తరప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఆయన ఎన్నికయ్యారు. చివరిశ్వాస వరకు సమసమాజ స్థాపన ప్రధాన లక్ష్యంగా సాగుతానని ప్రకటించిన ఆయనన్యూఢిల్లీ కార్యక్షేత్రంగా తన కృషిని సాగించారు. కెప్టెన్‌ అబ్బాస్‌ అలీ స్వల్ప అస్వస్థత తరువాత 2014, అక్టోబర్‌ 11న కన్నుమూశారు.

– నశీర్‌ అహమ్మద్‌
చరిత్రకారులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓరుగల్లు తరహాలో వల్లూరు

ఓరుగల్లు తరహాలో వల్లూరు -డు సురేశ్
కళ్యాణీ చాళుక్యులు, వైదుంబులు, కాయస్థులకు క్రీ.శ. 1048 నాటి నుంచే వల్లూరు పట్టణం రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. క్రీ.శ. 1304 వరకు దాదాపు 256 సంవత్సరాలపాటు కడప జిల్లాలో రాజధానిగా వల్లూరు విరాజిల్లింది. కాకతీయ ప్రభువుల సామంత రాజులైన అంబదేవుడు, మేనమామ గంగయసాహిణి ‘వల్లూరు’ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ నేపథ్యంలో వల్లూరు మండలం చరిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ‘వల్లూరు’ను కూడా ఓరుగల్లు తరహాలో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలి.

తెలుగువారి తరగని వెలుగుల వీరనారి, కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి గురించి చలన చిత్రం చిత్రీకరిస్తున్న విషయం తెలుగు వారికి విదితమే. ఈ చిత్రంలో రాణి రుద్రమదేవి మరణానికి కారకుడైన కాయస్థ అంబదేవుడిగా జయప్రకాశ్‌ రెడ్డి ఓ పాత్ర పోషిస్తున్న సంగతీ తెలిసినదే. కాకతీయుల నమ్మక సామంతులే కాయస్థులు. ఆ కాయస్థ వంశీయులైన అంబదేవుడు, మేనమామ గంగయసాహిణి కాకతీయ ప్రభువుల ఎడల విశ్వాసపాత్రులై, సామంత రాజులై కడప జిల్లాలోని ప్రాంతాలను కడపకు చేరువలో ఉన్న ‘వల్లూరు’ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ నేపథ్యంలో వల్లూరు మండలం చరిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
కళ్యాణీ చాళుక్యులు, వైదుంబులు, కాయస్థులకు క్రీ.శ. 1048 నాటి నుంచే వల్లూరు పట్టణం రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. క్రీ.శ. 1304 వరకు దాదాపు 256 సంవత్సరాలపాటు కడప జిల్లాలో రాజధానిగా వల్లూరు విరాజిల్లింది. పురాతన పుష్పగిరి ఆలయాలు, ప్రాచీన పీఠాలు, విజయనగర సామ్రాజ్య గురువులైన విద్యారణ్యస్వామి స్థాపించిన విద్యాకేంద్రం వల్లూరు మండలంలో ఉన్నాయి. వల్లూరు మండలంలో శ్రీ చక్రమున్న ఆలయాన్ని శంకరాచార్యులు ప్రతిష్ఠించారు. చోళులు, కళ్యాణీ చాళుక్యులు, వైదుంబులు, కాయస్థులు, విజయనగర రాజాలు నిర్మించిన అద్భుత శిల్పకళా సంపదలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. శ్రీ కృష్ణదేవరాయలను చదరంగంలో ఓడించిన శ్రీ బొడ్డుచర్ల తిమ్మన పుట్టిన కొప్పోలు గ్రామం ఈ మండలంలోనిదే. 150 సంవత్సరాల క్రితం డచ్చి నిర్మాణ కట్టడమైన ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వల్లూరు మండలంలోనే ఉంది. నాచన సోమనాథుడు నడయాడిన ప్రదేశమిది. పంచమనదీ సంగమ ప్రదేశమైన వల్లూరు మండలం పర్యాటకులకు ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతోంది.
రాజరిక, చరిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న వల్లూరు వేదికగా కాకతీయ సామ్రాజ్యాధినేతలకు, సామంత కాయస్థులకు చాలా సన్నిహిత సం బంధం ఉంది. ఆంధ్ర దేశాన్ని ఏక చక్రాధిపత్యంగా పాలించిన రాజవంశాలలో కాకతీయుల కీర్తి గోలుకొండ కోటంత ఘనమైనదీ, గండికోట అంత లోతైనది. మొదట చాళుక్య రాజ్య పతనాంతరం స్వతంత్ర రాజ్యం స్థాపించి తెలుగు వారి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పరచిన ఘన చరిత్ర కలిగినవారు కాకతీయులు. అట్టి కాకతీయుల విశ్వాసపాత్రులైన సైన్యాధ్యక్షులు, సామంతులు కాయస్థులు. కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుడు విజయపరంపరలతో తెలుగుదేశాన్ని సమైక్యం చేసి, ఆంధ్రులలో వినూత్న జాతీయోత్సాహం కల్గించాడు. ఓరుగల్లు ఆంధ్రానగరి అయింది. గణపతి దేవుడు ఆంధ్రాధీశుడయినాడు. ఈ గణపతి దేవుడకి విశ్వాస పాత్రుడిగా అనేక యుద్ధాలలో పాల్గొని తన ప్రభువునకు విజయం సాధించి పెట్టిన మహావీరుడు కాయస్థ గంగాయసాహిణి. గణపతిదేవుని దక్షిణ దిగ్విజయ యాత్రలో నెల్లూరు తెలుగు చోళరాజు మనుమసిద్ధికి గంగాయసాహిణి సహాయం చేశాడు. కడప జిల్లా ‘వల్లూరు’ పట్టణమును రాజధానిగా చేసు కొని, చోళరాజ్యంపై దండెత్తిన రాయదేవ మహారాజు అనబడే రక్కస గాంగ అను వైదుంబ రాజును సాహిణి జయించాడు. శ్రీ.శ. 1250 నాటి కడప జిల్లా నందలూరు శాసనం ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నవి. ఈ యుద్ధంలో గంగాయసాహిణితో పాటు అతని మేనల్లుడైన జన్నిగదేవుడు కూడా పాల్గొన్నాడు.
ఈ యుద్ధ విజయాన్ని పురస్కరించుకొని గణపతిదేవుడు గంగయసాహిణిని పానగల్లు నుంచి మహారాజవాడి వరకు (మహారాజవాడి అనగా కడప జిల్లా పులివెందుల తాలూకా మోపూరు నుంచి కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా చింతామణి తాలూకా మిండగల్లు వరకు ఉన్న ప్రదేశం) ఉన్న ప్రాంతానికి అధిపతిగా నియమించాడు. క్రీ.శ. 1255 నాటి మాచుపల్లె శాసనం గంగాయసాహిణి సామంతుడు సోమిదేవుడు వల్లూరు పట్టణం రాజధానిగా పాలిస్తున్నట్లు తెలుపుతున్నది. ఆ విధంగా కడప జిల్లా వల్లూరు రాజధాని కేంద్రంగా కాకతీయుల సామంతులైన కాయస్థుల పాలన కడప జిల్లాలో ప్రారంభమైనది. గణపతి దేవుడు గతించిన తర్వాత రుద్రమదేవి రాజ్యానికి వచ్చిన వెంటనే ప్రతిభ ప్రాతిపదికన సమర్థులకు, నమ్మకస్తులకూ ప్రాధాన్యం ఇస్తూ, కుల మత ప్రాంతాలకతీతంగా, ప్రధాన పదవుల్లో వారిని నియమించింది. వారిలో శివదేవయ్య, కాయస్థ జన్నిగదేవుడు, త్రిపురాంతక దేవుడు, గోనగన్నారెడ్డి, రేచర్లప్రసాదిత్యనాయుడు ముఖ్యలు. వీరందరూ రాణి రుద్రమకు అహర్నిశలు అండగా ఉండి, తమయావత్తూ శక్తియుక్తులూ కాకతీయరాజ్య క్షేమానికై, విస్తరణకై శ్రమించిన శౌర్యులు రాజనీతి కోవిదులు.
ఈ కాయస్థ జన్నిగదేవుడు వల్లూరు రాజ్య ప్రాంతాలను కలుకడ (కలకడ) వకైదుంబ రాజు భుజబలం వీర నారాయణుని నుంచి జయించాడు. గంగాయసాహిణికి పుత్రసంతానం లేకపోవడం వల్ల అతని మేనల్లుడైన జన్నిగదేవుడు కాయస్థ రాజ్యానికి వారసుడైనాడు. క్రీ.శ. 1258-59 మధ్య కాలంలో జారీ చేయబడిన జన్నిదేవుడి శాసనాలు కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఉన్నాయి. తన మేనమామ గంగయసాహిణి వలెనే పానగల్లు నుంచి మహారాజుపాడి వరకు ఉన్న ప్రాంతాన్ని పాలిస్తూ గణపతిదేవునికి విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. జన్నిగదేవుడి తర్వాత అతని సోదరుడైన మొదటి త్రిపురారి దేవుడు రాజైనాడు. ఇతడు కూడా రుద్రమదేవికి సామంతునిగా ఉంటూ తన పూర్వీకులైన గంగయసాహిణి, జన్నిగదేవుడు నిర్వహించిన పదవులను నిర్వహించినాడు. త్రిపురారి దేవుడు రుద్రమదేవికి ప్రధాన సైన్యాధ్యక్షునిగా ఉండి కమ్మనాడు, మాలికెనాడు, పొత్తపెనాడు, గండికోట మొదలగు సీమలకు అధికారిగా కాకతీయుల ప్రతినిథిగా పాలించాడు.
ఒక స్ర్తీ రాణి కావడం ఓర్చుకోలేని రుద్రమదేవి సవతి కుమారులైన హరహర మురారి దేవులు రుద్రమపై తిరుగుబాటు చేసారు. రేచర్ల ప్రసాదాదిత్యుడు, కాయస్ఠ జన్నిగదేవుడు, అతని సోదరులైన త్రిపురారి దేవుడు, అంబదేవుడు, గోన గన్నారెడ్డి మున్నగు సేనానుల సహకారంతో రుద్రమ దేవి ఆ తిరుగుబాటును తిప్పికొట్టింది. రుద్రమదేవి దక్షిణ దేశ జైత్రయాత్ర చేపట్టింది. త్రిపురారి దేవుడు (1270-72) తర్వాత అంబదేవుడు (1272-1302) ముప్ఫై సంవత్సరాలపాటు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇతడు అనేక మంది రాజులను జయించాడు. 72 మంది రాజులను వధించాడు. కాకతీయ సామ్రాజ్యంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర కాయస్థ రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. క్రీ.శ. 1287 నాటి అత్తిరాల శాసనం ద్వారా అంబదేవుడు వల్లూరు పట్టణం రాజధానిగా గండికోట, ములికినాడు, రేనాడు, పెనదాడి, పెడకల్లు, సకిలి, ఏఱువ, పొత్తపినాడు మొదలగు దేశాలను ఏలినట్లు తెలుస్తోంది.
క్రీ.శ. 1290 ప్రాంతంలో కాకతీయ యువరాజు ప్రతాపరుద్రుడు, రాణి రుద్రాంబ తరపున అంబదేవునిపై దండెత్తి అతని రాజ్యంలోని ఉత్తర ప్రాంతాలు జయించినట్లు తెలుస్తూ ఉంది. అంబదేవుడి బుద్ధి చెప్పాలని రాణీ రుద్రమదేవి తలపోసింది. అంబదేవునితో రుద్రమదేవి పోరాటం భీకరంగా సాగింది. క్రీ.శ. 1290లో అంబదేవునితో యుద్ధంలో తన సైన్యాధ్యక్షునితో సహా రుద్రమ దేవి మరణించిందని చందుపట్ల గ్రామంలోని కాకతీయ ప్రతాపరుద్రుని శాసనం తెలియజేస్తుంది. కాకతీయలకు విధేయులుగా సామంతులుగా ఉన్న కాయస్థుల కార్యక్షేత్రమైన ‘వల్లూరు’ను కూడా ఓరుగల్లు తరహాలో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలి.

–  మొగిలిచెండు సురేశ్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -32

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -32

30-సూర్య శతక కర్త –మయూరుడు

సూర్య శతకాన్ని రాసిన మయూర భట్టు క్రీ శ.606-648కాలం వాడు .హర్షుని ఆస్తానకవులలో  ఒకడు .బాణుడి సమకాలికుడు .మయూరుని వంశస్తులు గొప్ప సూర్యోపాసకులు .అందుకే సూర్య శతకం రచించాడు .సాహిత్యం లో ,ఆధ్యాత్మిక భావాలలో మయూర శతకం విశిష్ట స్థానాన్ని పొందింది .రాజ శేఖరుడు- మయూరుడు, బాణుడు హర్షుని ఆస్థాన కవులని పేర్కొన్నాడు .నిడద వోలు వెంకట రావు గారు తమ పరిశోధనలో’’మయూరుడు –ఆంద్ర వాజ్మయం ‘’లో  మయూరుడు భోజుని ఆస్థానకవి అన్నారు .

‘’అహో ప్రభావో వాగ్దేవ్యాయన్మాతంగా దివాకరః –శ్రీహర్షస్యా భవద్ సభ్యః సమో బాణ మయోరయోః’’అని రాశాడు .మయూరుడు, బాణులతో బాటు హర్షుని ఆస్థానం లో ‘’మాతంగ దివాకరుడు’’ కూడా ఉన్నట్లు చెప్పాడు .బాణుడికి మయూరుడికి కవితా స్పర్ధ ఉన్నట్లూచెప్పాడు . మన వాళ్లకు పుకార్ల షికార్లు చేయటం బాగా అలవాటేకదా .ఈ పుకారు షికారులో విలసిల్లిన మరో కట్టుకధ కూడా లోకం లో కనిపిస్తుంది .అదేమిటంటే –మయూరుడు తన కుమార్తెను బాణుడికిచ్చి పెళ్లి చేశాడు .అంటే బాణుడిని అల్లుడుగా చేసుకోన్నాడన్నమాట .ఒక రోజు నవ దంపతులు శృంగార క్రీడలో ఉండగా మయూరుడు చాటుగా చూసి కూతురు అందానికి ముగ్ధుడై ఎనిమిది శ్లోకాలు చెప్పాడట .అదే ‘’మయూరాస్టకం’’.దీన్ని విన్న మయూరుని కూతురు తండ్రిని కుష్టు వ్యాధి గ్రస్తుడుకమ్మని శపించిందిట .ఆ వ్యాధితో తీసుకొంటూ సూర్యోపాసన చేస్తూ సూర్య శతక రచన ప్రారంభించాడట .ఆరవ శ్లోకం రాసేసరికి పూర్తిగా కుష్టు తొలగిపోయిందట .మయూరుని పేర లోకం లో కొన్ని చాటువులు వ్యాపించాయి .ఇవి స్రగ్ధరా వృత్తాలు .

మయూర శతక ప్రఖ్యాతి

మయూరుడికి ఒకప్పుడు కుష్టు వ్యాధి సోకింది .ఆ దుఖం లో ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్ అనే దాన్ని నమ్మి సూర్య ఉపాసన చేస్తూ సూర్య శతకాన్ని రాసినట్లు కధలు ప్రచారం లో ఉన్నాయి .ఈశతకం పూర్తీ అయ్యేసరికి వ్యాధి పూర్తిగా నయమైనదట .బాణుడి శాపం వాళ్ళ ఈ వ్యాదివచ్చిందనే ప్రచారమూ ఉంది కాని ,జగన్నాధుడు పూర్వ జన్మ వల్లనే వచ్చిందని తెలియ జేశాడు .సూర్య శతకం లో వంద శ్లోకాలున్నాయి .స్రగ్ధరా వృత్తం లో మయూరుడు ఈశతకం రాశాడు .చదువుతుంటే మహానందం కలుగుతుంది .రచన గౌడీరీతిలో ఓజో గుణ ప్రధానం గా ఉంది .యమక పంట పండించాడు ఈ శతకం లో అనేక అర్దాలంకార సంయోజనం తో రచించాడు .ప్రౌఢ రీతిలో నడిచింది .

మొదటి నుంచి నలభై మూడవ శ్లోకం వరకు సూర్య కిరణాల వర్ణన ,సూర్య స్తుతి ఉంది .తర్వాత అయిదు శ్లోకాలలో సూర్యుని రధం ,సూర్యాశ్వాల వర్ణన చేశాడు .పిమ్మట పన్నెండు శ్లోకాలలో సూర్య రధ సారధి అరుణుడిని (అనూరుడు )వర్ణించాడు .సూర్యుని రధాన్ని పదకొండు శ్లోకాలలో చెప్పాడు .ఏడు శ్లోకాలలో సూర్య బింబాన్ని ,మూడు శ్లోకాలలో శివ విష్ణు ,బ్రహ్మ స్వరూపుడుగా సూర్యుని స్తుతించాడు .మరొక శ్లోకం లో సమస్త దేవతలా కంటే సూర్యుడు సర్వ శ్రేస్టుడని వివరించాడు .సూర్యుడు ప్రకాశించేటప్పుడు భూమి పై జరిగే పరిణామాన్ని వర్ణించి చెప్పాడు .మరొక్క శ్లోకం లో సూర్యుడు సమస్త చరా చర జగత్తుకు సార్వ భౌముడు అని నిరూపిస్తూ వర్ణించాడు .మయూరకవి రాసింది ఒకే ఒక్క టి అదే మయూర శతకం దీనితోనే కవుల్లో అగ్రభాగాన నిలిచాడు అంటే అంతటి ప్రశస్తిని ఈశతకం  ద్వారా సాధించాడని గ్రహించాలి .ఒక్క శతకం తో ‘’జాక్ పాట్’’కొట్టి సాహితీ ఉద్యానవనం లో కవితా మయూర నృత్యం చేశాడు సప్తవర్ణ శోభ కల్పించాడు అంతేకాదు –సాహిత్య నభోమండలం లోసూర్య శతకం తో  శతసహస్ర భాను కిరణ పుంజాలను వెదజల్లి ఆరోగ్యం తో బాటు ,ఆనందాన్నీ ,హ్రుదయాహ్లాదాన్ని కల్గించి నభోమండల సావిత్రు నారాయణ మూర్తి యై భాసించాడు .

మయూరుని చాటువుల్లో ఒకటి –అర్ధ నారీశ్వరుడైన పార్వతీ పతికి సంధ్యాదేవి వలన జన్మించిన  సంధ్య ,పై ప్రేమ కల్గిందట .అప్పటికే నెత్తిమీద గంగ సవితిగా ఉంది .ఒక రోజు శివుడు నాట్యం చేసే సమయం వచ్చింది .పార్వతి గంగను దించను ,సంధ్యను వదించను అన్నదట.శివుని శరీరం నుండి వేరైపోవాలనీ అనుకొందిట .ఆమెను ఆపే ప్రయత్నం లో శివుడి హస్తం సర్వ మంగళ కుచాన్ని  తాకిందట .అలాంటి మంగళ కరమైన చేయి మనల్ని రక్షించాలి అని కవి శ్లోకం చెప్పాడు –

‘’అన్యన్యా సంప్రతీమం కురు మదన రిపో –స్వాంగ దాన ప్రదానం –నాహం సోఢుం సమర్దా శిరసి సురనదీం-నాపి సంధ్యాం ప్రణతుం –ఇత్యుక్త్వా కోప విద్దాం విఘట యితు ముమా –మాత్మ దేహం ప్రవృత్తాం –రుంధానః పాతు శంభోఃకుఛ కలశ హఠ క్రుస్తో భుజోవా’’

మయూర శతకానికి పద్నాలుగు వ్యాఖ్యానాలున్నట్లు తెలుస్తోంది  .ఈ శతకానికి ఖండాంతర ఖ్యాతి ఉన్నది .ఆనంద వర్ధనుడు మయూర శ్లోకాలను ఉదాహరించాడు జగన్నాధ పండిత రాయలు మయూరుని అనుసరించి ‘’సుధా లహరి ‘’ని స్రగ్ధరా వృత్తాలలో రచించాడు .మయూరుని కవితా శక్తి  కి ఆకర్షితులైన వారిలో పింగళి లక్ష్మీకాంతం, దాసు శ్రీరాములు ,వడ్డాది సుబ్బారాయకవులేకాక పూర్వకవులలో శ్రీనాధ ,పోతన ,పెద్దన ,రామ రాజ భూషనాదులూ ఉన్నారు .ఇందులో శ్రీనాధుడు మయూరుని పది హేను శ్లోకాలను అనువదించి కాశీఖండం, శివ రాత్రి మహాత్మ్యం లలో చేర్చాడు .అంటే తెలుగు వారికి మొదటగా మయూరుని పరిచయం చేసిన ఘనత శ్రీనాదుడిదేనన్న మాట .’’భట్ట బాణ మయూర భవ భూతి ,శివ భద్ర కాళిదాసు ల’’సరసన మయూరుని నిలిపి గౌరవించాడు . .మయూరుని కవితా వేగం అతన్ని బాగా ఆకర్షించి ఆ ధోరణిలో పద్యాలు అల్లాడు .దాసు శ్రీరాములుగారు 1902 లో సూర్య శతకాన్ని అనువదించారు .ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి గారూ  తెనుగు  చేశారు .రాజ శేఖరుడు మయూరుని –

‘’దర్పం కవి భుజంగానాం గతా శ్రవణ గోచరం –విష విద్యేవ మయూరీ మయూరీ వాజ్ని కృతం తతి’’అని మెచ్చుకొన్నాడు దీని అర్ధం –నెమలి చేసే క్రేంకారం లాంటి మయూరకవి వాక్కు నీచ కవులు అనే  విష సర్పాల చెవి సోకగానే వాళ్ళ గర్వాన్ని నశింప జేస్తుంది ‘’’మయూర శతకం లో మొదటి శ్లోకం అందాన్ని చూద్దాం –

‘’జమ్భారీతివ కుమ్భోద్భావమివ దాదాస్సాంద్ర సింధూర  రేణుం –రక్తా సిద్దా ఇవౌఘే రుదయ తటీ దారాద్రవస్య

ఆయాంత్యాతుల్యకాల కమల వన రుచే వారుణోవొ విభూత్యై –భూయాసుర్భా సయం తో భువన మభినవా భానవో భానఃవీయాః’’-

అర్ధం –సూర్య కిరణాలు దేవ గజం అయిన ఐరావతం కుంభ స్థలం నుండి పుట్టిన సింధూరపు ధూళి కమ్మినట్లు కమ్మాయి .అంటే దేవలోకం నుంచి బయల్దేరాయని చెప్పటం .తర్వాత తూర్పు కొండపై ఉన్న గైరికాది వన మూలిక ద్రవాలతో తడిసి యెర్ర బడ్డాయా అన్నట్లున్నాయి .సూర్యుని రాకతో పద్మాలు వికసించి పద్మవనం యొక్క యెర్రని కాంతిని సంతరించుకొన్నాయి .మూడులోకాలను ప్రభావితం చేస్తాయి అని అంతరార్ధం .

మయూరుని సూర్య శతకం సి డి లు లభిస్తున్నాయి .ఇంటర్ నెట్ లోనూ వినచ్చు .వింటే చాలు ఆనందాను భూతి లభిస్తుంది .నమ్మకం ఉంటె ఆరోగ్యమూ సిద్ధిస్తుంది .

మరో కవిని కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-14-ఉయ్యూరు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -31 29 వేణీసంహార నాటక కర్త -భట్ట నారాయణుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -31

29 వేణీసంహార నాటక కర్త -భట్ట నారాయణుడు

భట్ట నారాయణుడు ఏడవ శతాబ్దికవి  అంటారు .550-650 అని చెప్పవచ్చు . ఆయన రాసిన ‘’ వేణీసంహార నాటకం ‘’ వీర రస ప్రధానమై గొప్ప పేరుపొందింది .గంభీరమైన రచన తో సాగి ఉత్కంఠ రేకెత్తిస్తుంది .దీన్ని విశాఖ దత్తుని ముద్రా రాక్షసం తో పోలుస్తారు .రాక్షసం లో స్త్రీ పాత్ర లేదు ఇందులో ద్రౌపది ఉన్నది .అది ముఖ్యమైన భేదం .భట్ట నారాయణుడు కన్యాకుబ్జ బ్రాహ్మణుడు .బెంగాల్ రాజు ఆది సూరుని ఆహ్వానం మేరకు  బెంగాల్ లో స్తిర వాసం ఏర్పరచుకొన్న అయిదుగురు బ్రాహ్మణులలో భట్టు ఒకడు .టాగూర్ వంశ మూల పురుషుడు భట్ట నారాయణుడు అని బావిస్తారు .బెంగాల్ రాజు ఆదిసూరుడు బ్రాహ్మణాభిమాని కనుక ఈ కుటుంబాలను ఆహ్వానించి పోషించాడు .నారాయణుడికి ‘’భట్టు ‘’అనేది బిరుదు వాచకం .అలాగే ‘’మృగ రాజలక్ష్మ’’అనేది, సింహ అనేది కూడా ఇతని బిరుదే .వేణీ సంహారం లో తనను గురించి ఏమీ చెప్పుకోలేదు .ఇతరులు చెప్పింది ,లోకం లో ప్రచారం లో ఉన్న వాటిని బట్టే వివరాలు తెలిశాయి .వామనుడు వేణీ సంహారం నుంచి కొన్ని ఉదాహరణలిచ్చాడు .దండి కూడా భట్టును గురించి రాశాడు .కనుక వీరిద్దరికంటె ముందువాడు అని  నిర్ణ యించారు .భట్టు మూడు రచనలు చేశాడని దండి అన్నప్పటికీ వేణీసంహారం ఒక్కటే లభించింది .వేణీ సంహారం అనేదానికి పెద్దలు –జుట్టు ముడి వేయటం కోసం సంహారం అని ,వేణి వలన జరిగిన కౌరవ సంహారం అని ,వేణికి సంహారం అంటే జుట్టుకు నివృత్తి అని అర్ధాలు చెప్పారు .ఇందులో మొదటిదే బాగా ఉందనిపిస్తుంది

వేణీసంహారం లో భట్టు కవితా పట్టు

వేణీసంహార నాటకం మహా భారత ఇతి వృత్తం .  .వేణి అంటే జడ .ఇందులో ఆరు  అంకాలున్నాయి .ప్రధమాం కం లో శ్రీకృష్ణుని కౌరవుల వద్దకు రాయ బారిగా ధర్మ రాజు పంపి సంధి చేయమని కోరటం భీమ ద్రౌపదులకు ఇష్టం ఉండదు .సహదేవుడు భీముడిని శాంత చిత్తుని చేస్తాడు .కాని నిండుసభలో పాండవ రాజ పత్నియైన ద్రౌపది  తీవ్ర అవమానం పొందటం హృదయ శల్యం గా భావించి భీముడిని రెచ్చ గొట్టే ప్రసంగం చేసి అతనిలోని పౌరుషాగ్నిని రగుల్గొల్పుతుంది .ఈ మాటలకు ఉద్రేకం, ఉత్తేజం పొందిన భీముడు తన గద తో దుర్యోధనుడి తొడలను విరుగ గొట్టి ,దుశ్శాసనుడి వక్షస్తలాన్ని చీల్చి రక్తం తాగి ,ఆ రక్తం తో తడిసిన చేతులతో ద్రౌపది కేశ పాశాన్ని ముడుస్తాను అని ఘోర ,భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. ద్రౌపది దీనితో శాంతిస్తుంది .విఫలమైన సందిరాయబారం తో వికల మనస్కుడై కృష్ణుడు అప్పుడే తిరిగి వస్తాడు .ధర్మ రాజు ఇక గత్యంతరం లేక కురుక్షేత్ర సంగ్రామానికి పూనుకొనగా భీముడు రెట్టించిన ఉత్సాహం తో యుద్ధ భూమిలో ప్రవేశిస్తాడు .

రెండవ అంకం లో దుర్యోధనుడి భార్య భానుమతికి  నూరు పాములను ఒక ముంగిస చంపి నట్లు కల వచ్చి కీడు ను శంకించి కలవర పడుతుంది  .శాంతికోసం సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తుంది .దుర్యోధనుడు వచ్చి భార్యను ఓదారుస్తాడు  .భార్య భర్తలు ప్రేమ సాగిస్తారు .జయద్రదుడి తల్లివచ్చి తనకొడుకును అర్జునుడు చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వార్త తెలియ జేస్తుంది .గాంధారీ పుత్రుడు యుద్ధానికి వెడతాడు .

మూడో అంకం లో ద్రుస్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపుతాడు .ఈ వార్త ద్రోణ సుతుడు ఆశ్వతామకు తెలిసి క్రోధం తో ఉడికి పోతుంటే మేన మామ కృపుడు ఊరడించి దుర్యోధనుడి దగ్గరకు తీసుకుకొని వెళ్లి మేనల్లుడిని సేనాపతిని చేయమంటాడు .అంతకు ముందే కర్ణుడిని చేస్తానని ఆతను మాట ఇచ్చానంటాడు .కర్ణ ఆశ్వత్థామల మధ్య తీవ్ర వాదోప వాదాలు నడుస్తాయి రాజు సమక్షం లోనే. కర్ణుడు బతికుండగా తాను  ఆయుధం దాల్చనని ప్రతిజ్ఞ చేస్తాడు ద్రోణ సుతుడు .ఇంతలో భీముడు దుస్శాసనుడిని చంపి వక్షస్థలం చీల్చి నెత్తురు తాగాడన్న వార్తా తెలుస్తుంది .

నాలుగో అంకం లో – కర్ణుడికొడుకు వృష సేనుడు చనిపోయాడని వార్తాహరుడు రాజుకు చెబుతాడు .రెట్టించిన కోపం తో ద్రుత రాష్ట్ర సుతుడు యుద్ధానికి సన్నద్ద మవుతాడు .ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు యుద్ధం వద్దని పాండవులతో సంధి ముద్దు అని హితం చెబుతారు .

ఐదో అంకం -లో భీముడు అర్జునుడు దుర్యోధనుడు ఎక్కడో దాక్కున్న సంగతి తెలిసి వెతుకుతూ ఉంటారు .భీముడిని ద్వంద్వ యుద్ధానికి రమ్మంటాడు రాజు .కాని అర్జుండు కల్పించుకొని ఆపేస్తాడు .ధర్మ రాజు వీరిద్దరిని రమ్మన్న వార్త విని అన్నగారి దగ్గరకు వెళ్ళిపోతారు .అశ్వత్థామ వచ్చి రాజును కలుస్తాడు .

చివరిది అయిన ఆరవ అంకం –కౌరవ పక్షం లో అందరూ యుద్ధం లో చనిపోతారు .దుర్యోధనుడోక్కడే మిగిలాడు .ప్రాణ భీతితో ఒక సరస్సులో దాక్కుంటాడు రాజు .పసికట్టిన భీముడు సరస్సు సమీపానికి వస్తాడు .దుర్యోధనుడు పైకి వచ్చి భీముడితో గదా యుద్ధం చేస్తాడు .ధర్మ రాజు గూఢచారి భీముడి చేతిలో దుర్యోధనుడు చనిపోయినట్లు చెబుతాడు .అందరూ సంతోషిస్తారు. ధర్మ రాజుకు పట్టాభిషేకం ద్రౌపదికి వేణీ సంహారోత్సవానికి సర్వం సిద్ధ చేస్తారు .ఇంతలో దుర్యోధనుడి రాక్షస స్నేహితుడొకడు చార్వాక ముని వేషం లో వచ్చి ద్వంద్వ యుద్ధం లో భీముడు నిహతుడైనట్లు వార్త చెపుతాడు .ఇది వరకు తానూ చేసిన ప్రతిజ్ఞా ప్రకారం ధర్మ రాజు మరణ ప్రయత్నం చేస్తాడు .ఈలోగా ఒళ్ళంతా రక్త ప్రవాహం తో తడిసి అలసిన  భీకర రూపం లో భీముడు  రంగ ప్రవేశం చేస్తాడు .అతడే దుర్యోధనుడు అనుకోని యుదిస్థిరుడు యుద్ధం చేయటానికి సిద్ధమవుతాడు .కాసేపటికి రక్తం ఓడుతున్నవాడు దుర్యోధనుడిని చంపిన భీముడుగా అందరూ గుర్తిస్తారు .భీముడు  దుశ్శాసన రక్తం తో నిండిన చేతులతో ద్రౌపదీ దేవి వేణి కి పూసి కురులను ముడిచి వేణీ సంహారం చేస్తాడు ,శ్రీకృష్ణుడు వచ్చి భరత వాక్యం పలుకుతాడు .

వేణి లో నారాయణ భట్టు నాటక రీతి

భారత యుద్ధ క్లైమాక్స్ ఘట్టాలను ఎన్నుకొని ,నాటకీయతను పోషించి మంచి ఉత్సుకతను నింపాడు వేణీ సంహారం లో కవి భట్ట నారాయణుడు .నాటక భాగాలైన సంధి దాని అంగాలను చక్కగా వినియోగించుకోన్నాడని విమర్శక ప్రశంసలు పొందాడు .ధనుంజయ ,విశ్వనాధ మొదలైన నాటక లక్షణ కారులు ఈ నాటకాన్ని చాలా చోట్ల ఉదాహరించారంటే దాని ప్రతిభ ఏమిటో అర్ధమవుతుంది .ఇందులో వేణీసంహారానికే ప్రాధాన్యత నిచ్చి రాశాడు .యుద్ధ ఫలితం అయిన పాండవ రాజ్య ప్రాప్తికి అంత ప్రాధాన్య మీయ లేదు .ఫల ప్రాప్తి నిర్వహణ లో బహుముఖీన ప్రజ్న చూపాడుకవి .మొదటి అంకం లో ముఖ సంధి ద్వితీయం లో ప్రతిముఖ సంధి తర్వాత గర్భ సంధి చివర అవముఖ సంధి లను భట్టు నిర్వహించాడని తెలుస్తోంది .యుద్ధ ఫలితం చివరి అంకం లో డోలాంన్దోళనం లో కాసేపు పడేశాడు చార్వాక రాకతో .కనుక ఫలాపేక్ష అనిశ్చితం అనిపిస్తుంది .టెంపో సృష్టించి కుతూహలం పెంచి కధను నడిపాడు .దుర్యోధనుడు చచ్చాడనిఒక సారి ,కాదు, భీముడే అసువులు బాశాడనిఒక సారి ప్రేక్షకులు భావించే సస్పెన్స్ మెయింటైన్ చేశాడు కవి .అలాగే ఇంకోమలుపు –వస్తున్న భీముడే దుర్యోధనుడనుకొని ధర్మ రాజు రెచ్చిపోయి యుద్ధానికి దిగటం నాటకీయ పరాకాష్ట అనిపిస్తుంది .వీటినన్నిటినీ అద్భుత భయానక భీభాత్సాలతో ఆశ్చర్యాలతో నిర్వహించిన భట్ట బాణుడి నాటక నిర్వహణ తీరుకు హాట్స్ ఆఫ్ అన  బుద్ధి వేస్తుంది .

ఇంతబాగా నాటకం ఉన్నా ఇందులో కొన్ని లోపాలూ ఉన్నాయి .సన్నివేశాలు వేగం గా నిర్వహింప బడలేదు కృత్రిమ సంఘటనలు ఆకట్టుకోలేదు సుదర్శ కుడు అనే చార్వాక  సంభాషణ ‘’సుదీర్ఘ సుత్తి’’ అనిపిస్తుంది .వర్ణనలు సాగదీయటం తో గమనం మంద గించింది .కాని ఈ నాటకం లో శైలిని ‘’రసాభాస ‘’అన్నారు .ఇది పాత్రల చిత్రణకు దోహద పడింది .ఈ దృష్టిలో ఇది శ్రేష్టమైన నాటకం అనిపించింది .సందట్లో సడేమియా అన్నట్లు యుద్ధం లో దుర్యోధనుడు భార్యతో ప్రేమకలాపం చేయటం ఎబ్బెట్టు,అనౌచిత్యం  అనిపించి ‘’దా.వీ .శూ.కర్ణ ‘’(దాన వీర శూర కర్ణ )లో దుర్యోధన ‘’ఎన్టిఆర్,’’ భానుమతి ‘’ప్రభ’’ తో పాడిన డ్యూయెట్ గుర్తుకొస్తుంది .దీన్ని ‘’ముమ్మటుడు ‘’కూడా అధిక్షేపించాడు .మనకే అలా ఉంటె ఆయనకు ఉండటం లో ఆశ్చర్యమేముంది?భానుమతి స్వప్నం షేక్స్పియర్ నాటకం జూలియస్ సీజర్ భార్య కల ను జ్ఞాపకం చేస్తుందన్నారు .కవిత్వ పరం గా వేణి సంహారం తొంభై మార్కులు సాధించినా నాటక కళా ధర్మం ప్రకారం ‘’అత్తెసరు మార్కులు ‘’అంటే పాస్ మార్కులే పొందింది .వీర రసం కోసం వాడిన దీర్ఘ సమాసాలు క్లిస్ట పదాలు ప్రేక్షకులకు కొరుకుడు పడవు .

భట్టు శైలి హృదయ గతం మనోగతం కాదు అదేపెద్ద లోపం వాచ్యార్ధమైన శైలి .మన ‘’పరుచూరి బ్రదర్స్ రకం’’ అన్నమాట .ఇన్ని లోపాలున్నా  వేణీ సంహార నాటకాన్ని సంస్కృత నాటకాలలో విశిస్ట నాటకం గానే భావిస్తారు .శృంగారాన్ని అంగాంగం లో పూసి వదిలిన నాటకాల కంటే భిన్నం గా  వీరానికి ‘’ వీర తాళ్ళు’’ వేసి రంజించే ప్రయత్నం చేసి వినూత్న మార్గానికి దారి వేశాడు భట్ట బాణుడు .ఈ గొడవ ఇలా ఉంటె ఇందులో నాయకుడు ఎవరు అనే ప్రశ్న వేసుకొని విమర్శకులు బుర్రలు బద్దలు చేసుకొన్నారు .ధర్మ రాజే అన్నారు .భారత వాక్యం ద్వారా ఫల ప్రాప్తి పొందాడుకనుక ఆయనేనన్నారు .కవికికూడా ఇది ఇస్టమేనన్నట్లు కధాగమనం వలన అర్ధం అవుతుంది .

ఇది కుదరదు –మొదటి అంకం లో ప్రతిజ్ఞ చేసి చివరి అంకం దాకా కదా నడిపించి అన్నదమ్ములిద్దర్నీ చంపి రక్తం తాగి తొడలు విరగ్గొట్టి ద్రౌపదికి  వేణీసంహారం చేసింది భేముడే కనుక రియల్ హీరో ఆయనే అన్నారుకొందరు .ఫల ప్రాప్తి కలిగించిన వాడు భీముడు ఫల భోక్త ధర్మ రాజు .ప్రధాన సాధకుడు భీముడు ..సాధన ఫలాన్ని పొందిన వాడు పెద్దన్న యుదిస్థిరుడు .కనుక భీముడికే హీరో గా ఎక్కువ మార్కులు .ఇక్కడ ముద్రా రాక్షస నాటకాన్ని దీనీతో పోలుస్తున్నారు అక్కడ చాణక్యుడు కార్య సాధకుడు ,చంద్ర గుప్త మౌర్యుడు ఫల భోక్త .అక్కడ చాణక్యుడు ఇందులో భీముడు తిరుగు లేని నాయకులు అనుకొంటే సరిపోతుంది .

ధర్మాధికారి ,మహోపాధ్యాయ బిరుదాంకితుడైన ‘’జగద్ధార పండితుడు ‘’వేణీ సంహారానికి గొప్ప వ్యాఖ్యానం రాశాడు . వేణీ సంహారాన్ని వడ్డాది సుబ్బరాయ కవి తెలుగు లోకిఅందమైన  కందపద్యాలలో అనువాదం చేశారు . దీన్ని చిలక మర్తి వారికి చదివి వినిపించారట వ సు కవి .ఏంతో బాగుందని మెచ్చి ఆశువుగా –‘’వేణీ సంహారంబును –వాణీ ధవ తుల్యుడైన  వసురాయడు తా—నాణేముగా తెనిగించెను –ప్రాణంబులు లేచి వచ్చు పద్యము విన్నన్ ‘’అని మెచ్చుకున్నారు .వసురాయని వేణీ సంహార అనువాద పద్య గద్యాలను రంగ స్థలం పై పఠించేవారట.

వేణీ సంహారం కొన్ని అద్భుత శ్లోకాలను చూద్దాం .భట్టు వైవిధ్యమైన ఛందస్సును వాడాడు .పద్యా వక్త్రం ,లలితా ,ఔప చ్చ్చందసిక ,ఆర్యా ,ద్రుత విలంబిత ,ప్రహర్షిని ,పృధ్వీ ఛందస్సులను మామూలు వాటితో పాటు సందర్భోచితం గా ఉపయోగించి రక్తికట్టించాడు .

‘’చంచద్భుజ భ్రమిత చండ గదాభి ఘాత-సంచూర్నితోరుయుగళస్య సుయోధనస్య

స్యానవ నద్ద ఘన శోణిత సిక్త పాణి –రుత్తం సయిష్యతి కచాస్తవ దేవి భీమః ‘’-దీని అర్ధం –‘’వేగం గా కదిలే భుజాల చండ గదయొక్క దెబ్బలతో ముక్కలైన తోడలుకల సుయోధనుడి రక్తం తో పూసుకొన్న చేతులతో భీముడు నీ సిగను ముడి వేస్తాడు ‘’అని భీముడు ద్రౌపదికి చేసిన ప్రతిజ్ఞ ఇది .వసంత తిలక వృత్తం లో వీర రసస్పోరకం గా భట్టు రాసిన శ్లోకాన్ని అందరూ ఉదాహరిస్తారు .ఇది మన నన్నయ్య గారు భరతం లో భీమునితో నిండు సభలో ‘’అమ్భోరు నిజోరు దేశమున పంచిన ఇద్దురాత్ము చందా ఘదాహతిన్ భగ్నోరు తరోరు జేసెద యుగ్ర రణాంతరంబునన్ ‘’’ ‘’అనిపించిన పద్యం గుర్తుకు తెస్తుంది .భట్టు తనను ‘’కవి మృగ రాజు ‘’అంటే’’ కవి సింహం ‘’అని పిలుచుకొన్నాడు .మాఘుదడిలాగా విలక్షణమైన వినూత్న, పదాలను ఉపయోగించాడు భట్టు .’’కొణాఘాతమ్ ‘’అనే శబ్ద ప్రయోగం యుద్ధ సందర్భం లో చేశాడు .అంటే లక్ష ధక్కలు ,వెయ్యి భేరులు ఒకే సారి మోగితే వచ్చే శబ్దం అని అర్ధంట .కరభం అనే శబ్దాన్ని వాడాడు అంటే –మణికట్టు నుంచి చిటికెన వేలి వరకు ఉన్న భాగమట.తొడలు కలిగినదీ అనే అర్ధం కూడా ఉందట .

నాటకం లో హాస్యం పండించే విదూషక పాత్ర లేకుండా రాశాడు భట్టు .కాల వస్తు ,సమయ నటన ఐక్యతలు లేవని పాశ్చాత్య విమర్శకులు విల్సన్ ,బారువాలు ఎత్తి చూపారు .దుర్యోధనుడు భానుమతితో సరసాలు  ఆడుతుంటే ద్వారపాలకుడు ఒక్కసారిగా ప్రవేశించి ‘’భగ్నం భగ్నం ‘’అని అరుస్తాడు .అంటే ఆ గది బయట దుర్యోధనుడి రాజధ్వజం పెనుగాలికి విరిగి ఊడి పడిందని అర్ధం .ఈ సన్నివేశ కల్పనా అతనికి జరుగ బోయే కీడుకు సంకేతం గా కవి చెప్పించాడు .నాటక ప్రస్తావనలో  ధార్తరాస్త్రులు’’ అనే శబ్దాన్ని  హంసలకు,కౌరవులకు చక్కగా అన్వయించే గొప్ప శ్లోకం  చెప్పాడు .

మరో కవిని దర్శిద్దాం

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘వేదాలను రక్షిస్తేనే లోక కల్యాణం ”అన్న కంచి స్వామి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత్ లో” విద్యార్ధికి” పాకిస్తాన్ లో ”మలాలా ”కు నోబెల్ శాంతి పురస్కా

 

సమాజంలో మార్పు రావాలి

నోబెల్‌ విజేతల మనోగతం

మానవ హక్కుల రంగం గురించి కొద్దొ గొప్పొ తెలిసిన వారికి పరిచయం అవసరం లేని పేరు కైలాష్‌ సత్యార్థి. వృత్తిరీత్యా ఎలకి్ట్రకల్‌ ఇంజనీర్‌ అయిన సత్యార్థి దాదాపు మూడు దశాబ్దాల క్రితం బచపన్‌ బచావో ఆందోళన్‌ సంస్థను ప్రారంభించారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించటం, వెట్టిచాకిరి కోసం బాలలను ఇతర దేశాలకు తరలించటం వంటి దురాగతాలను అరికట్టడానికి ఈ సంస్థ నిర్విరామంగా కృషి చేస్తోంది. సత్యార్థికి నోబెల్‌ బహుమతిని ప్రకటించిన నేపథ్యంలో- ఆయనతో గతంలో చేసిన ఒక ఇంటర్వ్యూలోని భాగాలు..
బచపన్‌ బచాబో ఆందోళన్‌ను ప్రారంభించటానికి మీకు స్ఫూర్తి?
బాలల హక్కులకు సంబంధించిన అంశాలపై నాకు చిన్నప్పటి నుంచి మక్కువ ఎక్కువ. అయితే వయస్సు, అనుభవం వస్తున్న కొద్ది- ఒక వ్యక్తి సమాజంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకురాలేడని అర్థమయింది. ఇలాంటి మార్పు రావాలంటే భావసారూప్యత కలిగిన వ్యక్తులు ఒక సంస్థగా ఏర్పడాలి. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి. బాలకార్మిక వ్యవస్థ ఒక చట్టపరమైన అంశమో, సాంకేతికపరమైన అంశమో, ఆర్థికపరమైన అంశమో కాదు. అన్నింటినీ కలగలిపిన అంశమిది. దీనిని రూపుమాపాలంటే సమాజంలో ఒక మార్పు రావాలి.
వెట్టి చాకిరిలో మన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి?
ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది పిల్లలను తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారనేది ఒక అంచనా. వీరిలో వెట్టిచాకిరి చేసేవారు కోటి మంది దాకా ఉంటే మిగిలిన వారంతా బాలకార్మికులు.
ఏ రాషా్ట్రల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది?
ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌- ఇలా పెద్ద పట్టణాలకు పిల్లలను తరలిస్తున్నారు. ఇక్కడకు వచ్చే పిల్లలు బీహార్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిషా, పశ్చిమబెంగాల్‌లకు చెందినవారు.
దక్షిణాసియాలో ఎలా ఉంది?
బాలకార్మికులకు సంబంధించి మన దేశంలో కఠినమైన చట్టాలు లేవు. కొన్ని చట్టాలు ఉన్నా- ప్రభుత్వాధికారులు వాటిని అమలు చేయరు. తమ దగ్గర బాలకార్మిక వ్యవస్థ ఉందని చెబితే- చెడ్డపేరు వస్తుందని వారు భయపడుతూ ఉంటారు. రాజకీయనాయకులు ఈ విషయంపై పెద్ద శ్రద్ధ పెట్టరు.

Related News
చావుని జయించి చదువుకున్నా

మహిళలు చదువుకోకూడదు. బురఖాలు వేసుకోకుండా బయటకి రాకూడదు. కనీసం నెయిల్‌ పాలిష్‌ కూడా వేసుకోకూడదు… తాలిబన్‌ ఫత్వాలివి. ఇస్లాం అందరికి సమాన హక్కులిచ్చింది. నేను చదువుకుంటే ఏమవుతుంది? బురఖా వేసుకోకుండా స్కూలుకు వెళ్తే ఏం చేస్తారు?- అని ఒక పన్నెండేళ్ల పిల్ల ప్రశ్నించింది. అగ్రరాజ్యం అమెరికాను సైతం గడగడలాడించిన తాలిబన్‌ ఈ ప్రశ్నలకు నివ్వెరపోయింది. ఏం చెప్పాలో తెలియక ఆమెపై బులెట్ల వర్షం కురిపించింది. కాని ఆ పిల్ల బులెట్లను సైతం తట్టుకొంది. దాడి జరిగిన ఏడాది లోపునే ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొంది. ఇప్పుడు అతి చిన్న వయస్సులో నోబెల్‌ శాంతి బహుమతిని పొందిన వ్యక్తిగా చరిత్రకెక్కింది. ఆమె పేరు మలాలా. ఆమె ఆత్మకథే ‘ఐయామ్‌ మలాలా’. గతంలో ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను ‘ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం’ ప్రచురించింది. ఆ కథనమే ఇది..

గోళ్లకు రంగు వేసుకుంటే కొరడా దెబ్బ
గ్రామంలో మహిళల జీవితం అనేక కట్టుబాట్ల మధ్య నడిచేది. మహిళలు బురఖా వేసుకోకుండా బయటకు రాకూడదు. సన్నిహిత బంధువులతో తప్ప ఇతర పురుషులతో మాట్లాడకూడదు. నేను టీనేజర్‌ను అయిన తర్వాత కూడా బురఖా వేసుకొనేదాన్ని కాదు. దీనితో మా బంధువులకు చాలా కోపంగా ఉండేది. మా తెగలో మహిళలను సరిగ్గా చూసేవారు కాదు. వారికి చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేవారు. కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఎవరితోనైనా ప్రేమలో పడితే- నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. ఇలాంటి వాటితో పాటుగా- మా తెగలో స్వర అనే ఒక సంప్రదాయముండేది. మాకు, వేరే తెగవారికి మధ్య తగువు వస్తే- దానిని పరిష్కరించుకోవటానికి ఒక అమ్మాయిని ఆ తెగ వారికి ఇచ్చేసేవారు. ఆ తెగలో పురుషులు ఆ అమ్మాయిని తమ సుఖాలకు వాడుకొనేవారు. ఈ ఆచారాన్ని ప్రభుత్వం నిషేధించింది. కాని అనధికారికంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పస్థూన్‌ సంప్రదాయం ప్రకారం- . ఇలాంటి వాటి వల్ల మహిళలు నష్టపోతున్నారని చాలా సార్లు మా నాన్నతో వాదించేదాన్ని. గతంలో పరిస్థితులు మరింత కఠినంగా ఉండేవని చెప్పేవాడు నాన్న. తాలిబన్లు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రకరకాల చట్టాలు చేశారు. మహిళలు నవ్వటాన్ని నిషేధించారు. తెల్ల రంగు పురుషులకు మాత్రమే చెందుతుందని ప్రకటించి- మహిళలు తెల్ల బూట్లు వేసుకోవటాన్ని నిషేధించారు. గోళ్ల రంగు వేసుకుంటే కొరడాతో కొట్టేవారు. ఇలాంటివన్నీ నాన్న చెబుతున్నప్పుడు నా ఒళ్లు భయంతో జలదరించేది.

అర్థరాత్రి పుట్టిన దేశం నాది. మధ్యాహ్నం నేను మరణానికి చేరువయ్యాను..
ఏడాది క్రితం.. నేను ఇంటి నుంచి స్కూలుకు వెళ్లా. మళ్లీ ఇప్పటి దాకా నేను మా ఇంటికి తిరిగి వెళ్లలేదు. నన్ను తాలిబన్లు బుల్లెట్లతో కాల్చారు. కొందరు నేను మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లనన్నారు. కాని ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వెళ్తానని నా మనసుకు తెలుసు. మనం ఎంతగానో ప్రేమించిన దేశాన్ని వదిలి వెళ్లాలని ఎవరూ అనుకోరు. నేనూ అంతే! ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే కళ్లు తెరిచి చూస్తా. నా స్వదేశం నుంచి ఐదు గంటల దూరంలో ఉన్నాననే సత్యం ఒక్కసారిగా గుర్తుకొస్తుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న వసతులతో పోలిస్తే నా దేశం వందల ఏళ్లు వెనకబడి ఉంది. సుఖవంతమైన జీవితానికి అవసరమైనవన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రతి కుళాయి నుంచి వేన్నీళ్లు, చన్నీళ్లు వస్తాయి. స్విచ్‌ వేసిన వెంటనే లైట్లు వెలుగుతాయి. చమురు దీపాల అవసరమే ఉండదు. బజారు నుంచి గ్యాస్‌ సిలిండర్లు తేవాల్సిన అవసరముండదు. ఇక్కడ మన తిండి కూడా ప్యాకెట్లలో తినటానికి రెడీగా ఉంటుంది. కిటికీలో నుంచి బయటకు చూస్తే పెద్ద పెద్ద భవంతులు కనబడతాయి. నల్లటి రోడ్ల మీద వాహనాలు ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటాయి. మరో వైపు చూస్తే లాన్లు కనిపిస్తాయి. కానీ నా కళ్లు మూసుకుంటే- స్వాట్‌ వ్యాలీ- కళ్ల ముందు కనిపిస్తుంది. ఒక వైపు మంచు కొండలు… మరో వైపు పచ్చని చెట్లు… వేగంగా ప్రవహించే నదులు… ఇవన్నీ గుర్తుకొస్తే నా మనసు పులకించిపోతుంది. నా స్కూలు గుర్తుకొస్తుంది. నా స్నేహితురాలు మోనిబా కళ్లముందు కదులుతుంది.
కాని నేను లండన్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్నది నిజం. కల చెదిరిపోతుంది.
ఆ రోజు మర్చిపోలేను..
2012, అక్టోబర్‌ 9. నా జీవితం మారిపోయిన రోజు. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వాస్తవానికి నాకు పరీక్షలంటే భయం లేదు. స్వాట్‌ వ్యాలీలో తాలిబన్ల పాలన తర్వాత స్కూలు బోర్డులన్నీ మాయమైపోయాయి. బయట నుంచి చూస్తే లోపల స్కూలు ఉందనే విషయం కూడా తెలియదు. నాలాంటి అమ్మాయిలకు స్కూలు ఒక వేరే ప్రపంచం. అప్పటి దాకా మా ముఖాలను కప్పి ఉంచిన స్కార్ఫ్‌లన్నీ మాయమైపోతాయి. మేము మా గ్రౌండ్‌లోకి వస్తాం. పైన ఆకాశం.. చుట్టూ పర్వతాలు.. మధ్యలో మేము. ఒక అమ్మాయి ‘ఆసాన్‌ భాష్‌’ (స్టాండ్‌ ఎట్‌ ఈజ్‌) అని అరుస్తుంది. మేము మా కాళ్లను నేలకు వేసి కొడతాం. ‘అల్లా’ అని అరుస్తాం. ఆ తర్వాత ఆమె ‘హోషియార్‌’ (అటెన్షన్‌) అని అరుస్తుంది. మేమందరం మళ్లీ అల్లా అని అరుస్తాం. ఆ స్కూలును నేను పుట్టకముందు మా నాన్న స్థాపించాడు. గ్రౌండ్‌కు ఎదురుగా ఉన్న గోడ మీద ‘కుషాల్‌ స్కూల్‌’ అని పెద్ద పెద్ద అక్షరాల్లో రాసి ఉంటుంది. మేము వారానికి ఆరు రోజులు స్కూలుకు వెళ్తాం. ఉర్దూ గ్రామర్‌ చదువుతాం. ఇంగ్లీషులో స్టోరీలు రాయటానికి ప్రయత్నిస్తాం. నా స్నేహితుల్లో చాలామందికి డాక్టర్‌ కావాలనేది ఒక కల. వారు డాక్టర్లు కావటం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. కాని స్కూలు బయట చాలా మంది అలా అనుకోరు. స్వాట్‌ వ్యాలీలోని ప్రధాన నగరమైన మింగోరాకు చెందిన కొందరికి, తాలిబన్‌లకు అమ్మాయిలు చదువుకోవటం ఇష్టం లేదు.
ఆ రోజు కూడా మామూలుగానే ప్రారంభమయింది. పరీక్ష మాత్రం ఒక గంట ఆలస్యంగా మొదలయింది. ఉదయాన్నే నాన్న ప్రతి రోజు మాదిరిగానే ‘టైం అయిపోయింది..జానేమన్‌’ అని లేపాడు. ‘కొద్దిసేపు పడుకోనీ..అబ్బా’ అన్నా. ఆ తర్వాత అమ్మ వచ్చి ‘పిషో’ అని గట్టిగా అరిచింది. పర్షియన్‌లో పిషో అంటే పిల్లి అని అర్థం. అమ్మ నాకు పెట్టిన ముద్దు పేరిది. ‘‘బాబీ..లేటు అయింది..’’ అని గట్టిగా అరిచా. మా సంస్కృతిలో మగవాళ్లందరిని సోదరులని పిలుస్తాం. అమ్మను ఏడిపించాలంటే అప్పుడప్పుడు నేను కూడా అలా పిలుస్తూ ఉంటా. మా ఇంటి ముందు ఒక రూమ్‌ ఉంది. ఆ రూమ్‌లో ఒక బెడ్‌, ఒక బీరువా ఉంటుంది. ఈ ఫర్నిచర్‌ను నేనే కొన్నా. స్వాట్‌ వ్యాలీలో శాంతి కోసం ప్రచారం చేసినందుకు, ఆడపిల్లలు స్కూలుకు వెళ్లాలని ప్రచారం చేసినందుకు నాకు వచ్చిన అవార్డుల ద్వారా ఈ ఫర్నిచర్‌ కొన్నాను. స్కూలు మా ఇంటికి దగ్గరలోనే ఉంది. గతంలో నడిచే వెళ్లేదాన్ని. తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత బస్సులో వెళ్ళాల్సి వచ్చేది. బస్సులో వెళ్తే ఐదు నిమిషాలు పడుతుందంతే. నాకు బస్సులో వెళ్లడమంటే ఇష్టం. బస్సు డ్రైవర్‌ ఉస్మాన్‌ అలీని ‘భాయిజాన్‌’(సోదరుడు) అని పిలుస్తాం. అతను రకరకాల కథలు చెప్పి మమల్ని నవ్విస్తుంటాడు. నేను బస్సులో వెళ్లటానికి మరో కారణం ఉంది. ఏడాది నుంచి నాకు పత్రికల్లో వార్తల రూపంలో తాలిబన్ల నుంచి కొన్ని బెదిరింపులు వచ్చాయి. చిన్న చిన్న చీటీల మీద బెదిరింపులు రాసి గుర్తు తెలియని వ్యక్తులు నా మీద విసిరేవారు. దీనితో మా అమ్మ నన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ నడిచి స్కూలుకు వెళ్లనిచ్చేది కాదు. తాలిబన్లు ఎప్పుడు మహిళలను లక్ష్యంగా చేసుకోలేదు. అందువల్ల నేను పెద్దగా భయపడలేదు. మా నాన్నపై దాడి చేస్తారనే భయం మాత్రం ఉంది. మా నాన్న తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. అందుకే వాళ్లు నాన్న స్నేహితుడు జహీద్‌ఖాన్‌ను నుదుటి మీద కాల్చి చంపేశారు. మసీదుకు ప్రార్థనలకు వెళ్తున్న సమయంలో అందరూ నాన్నను- ‘‘జాగ్రత్తగా ఉండు.. ఇక నీ వంతే’’ అని హెచ్చరిస్తుండేవారు. ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు భయమేసేది.
మా వీధిలోకి బస్సు రాదు. అందువల్ల వీధి చివరే బస్సు దిగి ఇంటికి నడిచివచ్చేదాన్ని. ఎవరైనా దాడి చేస్తే ఇక్కడే చేస్తారని అనుకొనేదాన్ని.

నేను వీధిలో నడుస్తూ ఉంటే హఠాత్తుగా ఒక టెర్రరిస్టు నా మీదకు దూకి కాల్చేసినట్లు కలలు వచ్చేవి. ఆ సమయంలో ఏం చేయాలని ఆలోచించేదాన్ని. కాలికి ఉన్న చెప్పు తీసి ఆ టెర్రరిస్టును కొట్టాలనుకొనేదాన్ని. కానీ అలా చేస్తే నాకు, టెర్రరిస్టుకు తేడా ఏముందనిపించేది. దాని కన్నా అతనిని- ‘‘నన్ను కాల్చు. కానీ నేను చెప్పేది విను. నువ్వు చేస్తున్నది తప్పు. నాకు, నీకు ఎలాంటి శతృత్వం లేదు. ప్రతి అమ్మాయి స్కూలుకు వెళ్లాలని నేను అనుకుంటున్నా. అంతకు మించి నాకేం తెలియదు’’ అని ప్రార్థించాలనిపించేది.
రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత గేటు తాళం పెట్టేదాన్ని. చనిపోయిన తర్వాత ఏమవుతుందని ఆలోచిస్తూ పడుకొనేదాన్ని. నా ఆలోచనలన్నీ నా ప్రాణ స్నేహితురాలు మోనిబాకు చెప్పేదాన్ని. నాకు మోనిబా చిన్నప్పటి నుంచి స్నేహితురాలు. జస్టిన్‌బీవర్‌, ట్విలైట్‌ మూవీస్‌ దగ్గర నుంచి ఫేస్‌క్రీమ్‌ల దాకా అన్ని విషయాలు మాట్లాడుకొనేవాళ్లం. మోనిబాకు ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనేది కోరిక. కానీ వాళ్లింట్లో ఒప్పుకోరని తెలుసు. అందువల్ల అందరితోను డాక్టర్‌ అవుతానని చెబుతుండేది. మా సమాజంలో అమ్మాయిలు టీచర్లు కావాలి. లేదా డాక్టర్లు కావాలి. ఇతర వృత్తుల్లో చేరటానికి అవకాశమే ఉండదు. నాకు చిన్నప్పుడు డాక్టర్‌ కావాలని ఉండేది. ఆ తర్వాత సైంటిస్ట్‌ కావాలనుకున్నా. రాజకీయాల్లోకి వెళ్లాలని ఉండేది. ఈ విషయం చెబితే మోనిబా భయపడింది. తాలిబన్లకు తెలిస్తే చంపేస్తారని హెచ్చరించింది. ‘‘ఏం భయపడకు. మనలాంటి వాళ్ల కోసం తాలిబన్లు బులెట్లు వేస్ట్‌ చేసుకోరు’’ అని ఆమెకు చెప్పా.
ఆ రోజు బస్సు హారన్‌ మోగిన వెంటనే మేమందరం పరిగెత్తుకుంటూ వీధి చివరకు వెళ్లాం. బస్సు అంటే మామూలు బస్సు కాదు. టయోటా టౌన్‌ ఏస్‌ ట్రక్కులో మూడు బెంచీలు వేసి ఉండేవి. దానిలో 20 మంది విద్యార్థులం, ముగ్గురు టీచర్లు కూర్చునేవాళ్లం. నా పక్కనే మోనిబా కూర్చునేది. మా బ్యాగులన్నీ బెంచీల కింద పెట్టేవాళ్లం. ఆ రోజు ఉదయం ఎండగా ఉంది. బస్సు లోపల చాలా ఉక్కగా ఉంది. ట్రక్కు అన్ని వైపులా మూసేసి ఉంది కాబట్టి బయటకు చూడటానికి కూడా లేదు. బయట బాగా ఎండగా ఉందని మాత్రం తెలుస్తోంది. బస్సు కుడివైపునకు తిరగటం మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత అంతా ఒక కలలా జరిగిపోయింది. మాకు కుడివైపు స్వాట్‌ వ్యాలీ తొలి ఆర్థిక మంత్రి షేర్‌ మహ్మద్‌ ఖాన్‌ సమాధి ఉంది. ఎడమ వైపు ఒక ఫ్యాక్టరీ ఉంది. రోడ్డుకు అడ్డంగా లేత రంగు బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చాడు. బస్సును ఆపమని చేతులు ఊపాడు. ‘‘కుషాల్‌ స్కూలు బస్సు ఇదేనా?’’ అని మా డ్రైవర్‌ను అడిగాడు. భాయ్‌జాన్‌ అవునని సమాధానమిచ్చాడు. ‘‘కొంత మంది పిల్లలకు సంబంధించిన సమాచారం కావాలి’’ అని ఆ వ్యక్తి డ్రైవర్‌ను అడిగాడు. ‘‘స్కూలు ఆఫీసులో తెలుసుకోండి’’ అని భాయ్‌జాన్‌ సమాధానమిచ్చాడు. ఒక వైపు అతను మాట్లాడుతుంటే- మరో వైపు ఒక వ్యక్తి బస్సు వెనకవైపు వచ్చాడు. ‘‘ఎవరో జర్నలిస్టు నిన్ను ఇంటర్వ్యూ చేయటం కోసం వస్తున్నాడు..’’ అంది మోనిబా. ఆ వస్తున్న వ్యక్తి మొహానికి రుమాలు కట్టుకున్నాడు. ఒక కాలేజీ స్టూడెంట్‌లా ఉన్నాడు తప్ప జర్నలిస్టులా లేడు. బస్సుపైకి ఎక్కి- ‘‘మలాలా ఎవరు?’’ అని అడిగాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. కాని చాలా మంది నావైపు చూశారు. బస్సు మొత్తం మీద మొహాన్ని కవర్‌ చేసుకొంది నేను ఒక్కదాన్నే. అతను నల్లటి తుపాకీని బయటకు తీసాడు. బస్సులో ఉన్నవారందరూ గట్టిగా అరవటం మొదలుపెట్టారు. నేను మోనిబా చేతిని గట్టిగా పట్టుకున్నా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అతను మూడుసార్లు కాల్చాడని నా స్నేహితులు తర్వాత చెప్పారు. ఒక బుల్లెట్‌ నా కంటిలోపలి నుంచి వెళ్లిపోయింది. మరో బుల్లెట్‌ ఎడమ భుజాన్ని తాకింది. మూడో బుల్లెట్‌ నా ఎడమ చెవికి తగిలింది. నాపక్కన కూర్చున్న షాజియా, కైనాత్‌ రియాజ్‌లకు కూడా బులెట్లు తగిలాయి. కాలుస్తున్న సమయంలో ఆ వ్యక్తి చేతులు వణికాయని నా స్నేహితులు చెప్పారు. నేను ఆసుపత్రికి వెళ్లే సమయానికి మోనిబా ఒళ్లంతా రక్తమే.
అనువాదం : సివిఎల్‌ఎన్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -30

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -30

28-వచన బాణం –భట్ట బాణుడు

హర్ష వర్ధన మహారాజు ఆస్థానకవి అయిన బాణ భట్టు ఏడవ శతాబ్దానికి చెందిన వాడు .606-647అసలుకాలం గా భావిస్తారు  .స్థానేశ్వర అనిపిలువబడే నేటి కనోజ్ జన్మ స్థలం .హర్షుని జీవితచరిత్రను హర్ష హరిత్రగా రాశాడు .బాణుడి ‘’కాదంబరి ‘’జగత్ ప్రసిద్ధం .’’బట్ట బాణుని ముద్దు పట్టి కాదంబరి కధలు చెప్పు చెల్మి కత్తేనాకు ‘’అని తెలుగుకవి ప్రశంసలనందుకొన్నాడు బాణుడు .సంస్కృతం లో తోలి వచన కావ్యం కాదంబరి .ఈ కదా నవలను పూర్తీ చేయకుండానే మరణిస్తే కుమారుడు భూషణ భట్టు పూర్తీ చేశాడని అంటారు  బాణుడు చండికా శతకం, పార్వతి పరిణయం నాటకం రాశాడని చెబుతారు .ఈ రెండు గ్రంధాలలో ఆయన చెప్పుకొన్న విషయాల వల్లనే జీవిత చరిత్ర తెలుస్తోంది .’’ముకుట తాడితం ‘’అనే నాటకాన్ని కూడా రాశాడని చంద్రపాలుడు ,గుణ విజయ గణులు చెప్పారు .కాని అది బాణ కృతం కాదు .పార్వతీ పరిణయం వామన భట్ట బాణుడు రాశాడంటారు .కాదంబరి మాటకు  నానార్దాలున్నాయి –ఆడుకోయిల ,గోరింక, మద్యం .కోయిల గానం గా పరవశాన్ని కల్గిస్తుంది .గోరింక ళా ముచ్చటగా ఉంటుంది మద్యం లా హృదయానికి కిక్కు ఇస్తుందని సరదాగా మనం అర్ధం చెప్పుకోవచ్చు .

బాణుడి తండ్రి చిత్ర భాను తల్లి రాజా దేవి .హిరణ్య బాహు నదీ తీరం లో ఈ నాటి చాప్రా జిల్లాలోని  ప్రీతి కూట లో పుట్టాడు .భోజక కుటుంబం లో వాత్సాయన గోత్ర సంభవుడు .దేశ సంచారం చేస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు .హర్షుడి తమ్ముడు కృష్ణుడు ఆహ్వానం పంపితే వెళ్ళాడు .మనితర లో ఉన్న హర్ష వర్ధనుడిని కలుసు కొన్నాడు .మూకాభినయం తో , కోపాభినయం తో హర్షుని మనసును ఆకర్షించాడు .ఈ నాటి ఔరంగా బాద్ లో హాస్పురా జిల్లాలోని పీరూ గ్రామం లో బాణుడు జన్మించాడని మరోకధనం .’’బాణోచ్చిస్టమిదం జగత్ ‘’అని లోకం లో సామెత ఉంది .అంటే బాణుడు ముట్టి వదలనిదేదీ లేదు .అనగా ఉన్నదంతా బాణుడు ఎంగిలి చేసి వదిలినదే అని భావం .దీనికి ఇంగ్లీష్ లో సమానమైన ఒక లోకోక్తి ఉంది ‘’he did not leave which he did not adorn ‘.సాక్షరం వాసు దేవ దీక్షితులు ,నేతా శర్మ ,కే కృష్ణ మూర్తి బాణుని జీవిత చరిత్ర రాశారు .ఆంద్ర పండితుడు ,కవి రాంభొట్ల లక్ష్మీ నారాయణ శాస్త్రిగారికి ‘’అభినవ భట్ట బాణుడు ‘’అనే బిరుదునిచ్చారు .

బాణ కవితా గీర్వాణం

ఒక్క కాదంబరి తోనే బాణుడు సుప్రసిద్దుడయ్యాడు .’’కాదంబరీ రసజ్ఞానానం ఆహారోపి న  రోచతే ‘’అని ఒక లోకోక్తి ప్రచారం లో ఉంది .అంటే –కాదంబరి ని చదువుతుంటే ఎవరికీ అన్నం మీద కూడా ద్రుష్టి పోదు తినటం మర్చిపోతారు. బీహార్ లోని ఔరంగా బాద్ గ్రంధాలయం లో ఇప్పటికీ కాదంబరి సంస్కృత వ్రాత ప్రతి ఉంది  .హర్షుడు బాణుడికి అనేక ప్రశంసలేకాక పురస్కార సన్మానాలు కూడా చేశాడు .బాణుడివచన  శైలి మహా ప్రవాహం .అలంకారమయం చేశాడు కాదంబరిని  .బాణ భాష కర్ణామృతం .ప్రాస పూరితమై హ్రుదయాహ్లాదిగా ఉంటుంది .బాణుడి విధానం తరువాతికవుల పై ప్రభావం చూపింది .ఆయన ధోరణిలో పడిపోయారు .బ్రాహ్మణ భావాలు, వైదిక సంస్కృతీ ప్రతి బిమ్బించేట్లు రచనలు చేశాడు .దీనికి అసూయ పడిన కొందరు ఇతర పండితులు హర్షుడికి బాణుడిపై చాడీలు చెప్పారు .కాని బాణుడు బెదరలేదు .రాజు స్వయం గా బాణుడిని ఆహ్వానించి నిజ నిర్ధారణ చేసుకోమన్నాడు .ధైర్యం గా తన జీవిత విధానాన్ని రాజుకు పూస గుచ్చినట్లు వివరించి రాజు మనసు దోచుకొని అభిమానాన్ని మరింత పొందాడు. గౌరవాలు లభించాయి .

అద్భుత కదా మంజరి కాదంబరి. కాదంబరీ చంద్రా పీడుల ,మహా శ్వేత ,పుండరీకుల ప్రేమ కధలు జోడింప బడ్డాయి చంద్రా పీడుడు పూర్వ జన్మ లో చంద్రుడు తర్వాత జన్మలో శూద్రక రాజు .పుండరీకుడు వైశంపాయనుడు ఇంకో జన్మ లో చిలుక .కాదంబరి మహాశ్వేత లకు ఒకే జనం చెప్పాడు .అంటే నాయికల కాలం లో నాయకులూ త్రిజన్ములైనారన్నమాట .నాయిక లిద్దరూ గంధర్వ రాకుమారికలు కాదంబరి చంద్రా పీడుడిని శ్వేత పుండరీకుని ప్రేమిస్తారు .విరహాన్ని భరించలేక పుండరీకుడు హరీ మంటాడు.మహా శ్వేత  ఆత్మ హత్యకు పాల్పడుతుంది .ఇంతలో ఆకాశ వాణి చెప్పిన మాట విని ప్రయత్నాన్ని మానుతుంది .సన్యాసిని యై ప్రేమికుదడి కోసం  ఎదురు చూస్తూంటుంది .చంద్రా పీడుడు తన స్నేహితుడు వైశంపాయనుడి చావు విని చనిపోయి ,శూద్రక రాజు గా పుడతాడు .పుండరీకుడు వైశంపాయనుడిగా పుడతాడు .మహాశ్వేతను చూసి మనసు పారేసుకొంటాడు . వైశంపాయనుడే  పుండరీకుడు అని  తెలియక చిలుక గా మారమని శపిస్తుంది .చిలకను లక్ష్మీదేవి శూద్రక రాజు దగ్గరకు చేరుస్తుంది .జాబాలి ముని దయ వలన పూర్వ జన్మ తెలుసుకొన్న చిలుక శూద్రుడికి చెబుతుంది. శూద్రకుడు ప్రాణాలు వదిలి కాదంబరి చే రక్షించ బడి  చంద్రా చూడుడి  కళేబరం లో ప్రవేశిస్తాడు .చిలుక పున్దరీకుడవుతాడు  .నాయకులిద్దరూ నాయికలను కలుసుకొని వివాహం చేసుకొని సుఖ జీవనం గడుపుతారు .ఇదీ కాదంబరి లో మొత్తం కద .

కాడంబరిలో అద్భుత సంఘటనలున్నాయి .మానవ ,గాంధర్వ ,చంద్ర లోకాలలో కద జరగటం విశేషం.టెంపో బాగా నడిపాడు. ఉత్స్డుకత తో చదివే వాళ్ళు రోమాలు నిక్క బొడుచుకొని ఆశ్చర్య భరితులౌతారు. కల్పిత కధకు మహాద్భుత వచనాన్ని జోడించి హాయిగా చదివేట్లు రాశాడు .ఈ కద కదా సరిత్సాగరం లో ‘’మకరందికోపాఖ్యానం ‘’ఆధారం అని పిస్తుంది .

అనేక కదా మిశ్రమం గా ఉన్నా ,వర్ణనలతో ప్రాధాన్యాన్ని తగ్గకుండా రాయటం బాణుడి ప్రతిభ .అనేక జన్మల కధలు తమాషా గా ఉండి కధాగమనం మహా వేగం గా సాగిపోతుంది .ఎక్కడా విసుగు రాకుండా రాశాడు బాణుడు .అందుకే వచన రచనలో బాణుడు మేటి అనిపించాడు .బాణం లాగా దూసుకు పోయేట్లు రచన చేశాడు .  మధుర ,అలౌకిక ప్రేమకే విలువ నిచ్చాడు .అశ్లీలం తాకని శృంగారం వర్ణించాడు .దివ్య ప్రేమకు పట్టం కట్టాడు .కామ వాంచలను ఎక్కడా చూపలేదు బాణుడు .ప్రేమలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించి ఉత్క్రుస్టత సాధించాడు .కావ్యం లోకానికి మార్గ దర్శకం గా ఉండాలన్ని సామాజిక బాధ్యతా బానునిలో ప్రస్పుటం గా గోచరిస్తుంది .

బాణుడు ఎందుకు ఇప్పటకీ అభిమాన పాత్రుడయ్యాడు?అని ప్రశ్నించుకొంటే బాణుని శైలియే అంతటిపని చేసిందని తెలుస్తుంది .పొడవైన సమాసాల జోలికి వెళ్ళకుండా హ్రస్వ సమాసాలతో కూడిన ‘’పాంచాలీ ‘’శైలిని అవలింబించాడు.అదే అతని సక్సెస్ కు లాండ్ మార్క్ అయింది .బాణుడి శబ్దజ్ఞానం చూస్తె మహాశ్చర్యమేస్తుంది .శబ్దాన్ని  అర్ధం  తో సంయోజనం చేసిన తీరు ముచ్చట గొల్పుతుంది . క్లిష్ట మైన విషయాన్ని అయినా  సరళ సుందరం గా  వర్ణించి చెప్పగల నేర్పు బాణుడిది . వక్రోక్తికి పెద్ద పీట వేశాడు బాణుడు .వట్టి వక్రోక్తి మాత్రమె కాదు శ్లేష తో అనుపానం చేసి మహా సౌందర్యాన్ని కలిగించాడు .విరోదా భాస ,పరి సంఖ్య మొదలైన శ్లేష పై ఆధార పడిఉన్న అలంకారాలను వాడి రంజకత్వం సృష్టించాడు .వక్రోక్తి తో బాటు స్వభావోక్తికీ సమాన స్థానం చూపాడు. అంటే చక్కని సమ తుల్యతను పాదుకోల్పాడు రచనలో .కుంతకుడి వక్రోక్తి స్వభావోక్తి అలంకారాన్ని ‘’ఆలం కార్యం ‘’గా భావించాడు .కాని బాణుడు స్వభావోక్తిని ఆదరించి దాని గుణాన్ని మరింత పెంచాడు ..ఇంకొక తమాషా కూడా చేశాడు బాణుడు .ప్రతి అలంకారానికి ఆధారం గా స్వభావోక్తిని తీసుకొన్నాడు .అందుకే అసంభావ్యత కనిపించదు. అదీ అతని మహిమ .వక్రోక్తికి శ్లేష ,అతిశయోక్తులే బాగా రాణిస్తాయని అప్పటిదాకా భావించిన వారికి బాణుడు చేసిన ఈ ప్రయోగం దిమ్మ తిరిగేట్లు చేసింది .సహజ భావ సంపన్నుడు బాణుడు .వస్తువును కాని దృశ్యాన్ని కాని సన్నీ వేశాన్నిఆని ఒక చిత్రం గీసినట్లు అద్భుతం గా చిత్రించి వన్నె తెచ్చాడు .

‘’నవార్దో జాతిర గ్రామ్యో శ్లేషో క్లి స్టః స్పుటో రసః –వికటాక్షర బంధశ్చ కృత్స్న మేకత్ర దుష్కరం ‘’అని బాణుడు చెప్పాడు –అంటే ‘’కొత్త అర్ధం ,అశ్లీలం కాని స్వభావోక్తి ,రస స్పోరకం .వికటమైన అక్షర బంధం ,శ్లేష వీటన్నిటి సమాహారమే నా కవిత్వం లో చూడచ్చు ‘’అన్నాడు .సంస్కృతం మీద మోజున్న వారికి బాణ రచన నవ లోకాలను చూపిస్తుంది .అనేక మంది తర్వాత కవులు బాణుని శైలిని ప్రశంసలతో ముంచెత్తారు …

‘’జాతా శిఖండినీ ప్రాక్ యదా శిఖండీ తదావ గచ్చామి –ప్రాగల్భ్య మదిక మాప్తుం వాణీ బబాణో బభూవేత్ ‘’అని గోవర్ధనాచార్యుడు బాణుడిని సరస్వతీ అవతారం గా భావించాడు ‘’అధికమైన ప్రాగాల్భ్యాన్ని సాధించటానికి శిఖండిని శిఖండిగా మారిపోయినట్లు పురుష రూపంతో  అతి చమత్కారం పొందాలని వాణి  వాణ(బాణ ) రూపాన్ని ధరించింది .రాజ శేఖరుడు బాణుడి శబ్ద సౌందర్యాన్ని ,సుకుమార పద విన్యాసాన్ని శ్లాఘించాడు .ఒక అజ్ఞాతకవి ‘’బాణం గుచ్చుకొంటే ఊపిరి బయటికి రానట్లే, బాణుని కాదంబరి చదివిన తర్వాత ,కవులకు వాణి నోటినుంచి బయటికి రాదు అని చమత్కరించాడు .’’శబబ్డార్ధయోః సమో గుమ్ఫః పాంచాలీ రీతి రిష్యతే –శీలా భట్టారికా వాచిబాణోక్తిషు చసాయది’’.

ధర్మ దాసు బాణుని కవిత్వం రుచిరమైన వర్ణన ,పదాలతో కలిసి రసభావ పరిపూర్ణం గా ఉంది .తరుణ అయిన నాయిక లాగా రసిక హృదయాలను దోచు కోవటానికి సమర్ధత కలిగి ఉంది అన్నాడు –‘’రుచిరస్వర వర్ణ పదార రసభావ వతీజగన్మోహన రతి –సాకిం తరుణీ నహి నహి వాణీ బాణస్య మధుర శీలస్య ‘’.మరో కవి ‘’అలంకార ,సమాస భూయిష్టమైన బాణుని కవిత్వం విధ్యారణ్యం లాంటిది .దానిలో విహరించే కవి కుంజరాల (ఏనుగుల)గండ స్థలాలను చీల్చే సింహమే బాణకవి ‘’అని ఉత్ప్రేక్షించాడు .ఎవరేమి చెప్పినా అపూర్వ మైన మౌలిక మైన భావాలతో ,పిండి ఉండలా కాకుండా బాణ కవిత్వం నవీన అర్ధ శోభితం గా ప్రకాశిస్తుంది అని చెప్పటం లో సందేహమే లేదు .కాదంబరి అనేది నవలకు పర్యాయపదం గా నిలిచింది .పీటర్సన్ ,కానే లు సంస్కృత కాదంబరిని మొదటిసారిగా వెలువరించారు .కాలే ,లేన్ ,రిడ్డింగ్గ్ లు కాదంబరిని ఆంగ్లం లో అనువదించారు . ,తెలుగులో రెంటాల గోపాల కృష్ణ మొదలైన వారు . అనువదించారు

Inline image 2   Inline image 3

.

మరోకవితోకలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-1-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆదూరు సత్యవతి -కె బి లక్ష్మి -చినుకు

1aduru 001 2aduru 001 3aduru 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాగపూర్ లో నడుస్తున్న బుద్ధుడు -బుద్ధ భూమి

3buddha 001 4buddha 001 nadustunna buddha -1 001 nadustunna budha 2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -29

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -29

27-కుందమాల నాటక రచయిత దిజ్నాగుడు

కుందమాల(జాతిమల్లె పూదండ) అనే నాటకాన్ని రచించిన దిజ్ఞాగ కవి క్రీ శ .1100వాడు .బౌద్ధ దార్శనికుడైన ఇంకొక దిగ్నాగుడు ఉన్నాడు వీరిద్దరూ వేరే అని గ్రహించాలి  ఉత్తర  రామాయణ కధను తీసుకొని భవ భూతి లాగా అనేకానేక మార్పులు చేసి ముకుందమాల నాటకం రాశాడు  .సీతా పరిత్యాగం తో నాటకం మొదలౌతుంది .మళ్ళీజానకీరాముల సమాగమం తో నాటకం పరిపూర్తి అవుతుంది .భవ భూతి చాయలు ఎక్కువ గా కనిపిస్తాయి .ఆయన లాగానే కరుణ రస పోషకం గా ముకున్దమాలను తీర్చి దిద్దాడు .

దిజ్ఞాగుని కవితా విశేషాలు

ఆరు  అంకాలున్ననాటకం ముకుందమాల .రాముడు సీతాప వాద వార్త విని లక్ష్మణుడిని గర్భిణిఅయిన  సీతను అరణ్యం లో గంగా నది ఒడ్డున విడిచి పెట్టి రమ్మంటాడు .అక్కడ మహర్షి వాల్మీకి ఆమెను చూసి తన ఆశ్రమానికి తీసుకు వెడతాడు .కుశలవులను సీత ప్రసవిస్తుంది .మహర్షి వారికి రామకధను గాన రూపం లో నేర్పిస్తాడు .రాముడు అశ్వమేధ యాగం చేస్తూ వాల్మీకి మహర్షిని ఆహ్వానించటానికి ఇక్కడికి వస్తాడు .అప్పుడు రాముడు గోమతీ నదిలో కొట్టుకు పోతున్న ‘’కుంద మాల ‘’పుష్పహారాన్ని చూస్తాడు .అది సీత కట్టే మాల లాగా ఉందనిప్పిస్తుంది .సీతా వియోగం తో దుఖం పెల్లుబికి వస్తుంది .చాటుగా ఉన్న సీతకూడా   భర్త దుఖాన్ని చూసి కరిగిపోతుంది .ఇద్దరి మనోబాదను కవి చాలా కరుణరసాత్మకం గా చిత్రించాడు .ఇంతలో కుశలవులు రామాయణ గానం చేస్తూ అక్కడికి చేరుకొంటారు .సీతారామ  లవ కుశ సమాగమం తో నాటకం పూర్తి అవుతుంది .

కవి గొప్ప నాటకీయతను ప్రవేశ పెట్టి ప్రతి అంకాన్ని రసభరితం చేశాడు భవభూతి లాగేనే .కవిత్వమూ సులభ బోధకం గా ఉండి మనసుకు హత్తుకుంటుంది ..భవ భూతిని అనుకరించినా తన ప్రత్యేకతలను కొన్ని కొన్ని సందర్భాలలో చాటుకొన్నాడు .విశ్వనాధ సత్యనారాయణ గారు తన రామాయణ కల్ప వృక్షం  అవతారికలో ‘’భాస కాళిదాస భవ భూతి దిజ్ఞాగులకు ,ప్రశస్త వాగ్విలక్షణుడు మురారి భట్టునకును ,రామ కదా భాష్య కారులకును మోడ్పు కై ఘటించి ‘’అని ప్రస్తుతించారు .అందులో దిజ్ఞాగునికీ స్థానం లభించింది .కుందమాలను మాన వల్లి రామ క్రిష్నయ్య పంతులు గారు తెలుగులోకి అనువదించారు .దిజ్నాగుడు ఆంధ్రుడే అని ఆచార్య తిరుమల రామ చంద్ర రాశారు .తక్షశిల విశ్వ విద్యాలయం లో దిజ్నాగుడు తర్కాన్ని బోధించే ఉపన్యాసకుడుగా ఉన్నాడు .ఇతని గురువు భగంత వసు బంధువు కూడా కవే .కాళిదాసు మేఘ సందేశం లో దిజ్ఞాగుని గురించి ప్రస్తావించాడు .ఈయనకు మరోపేరు భదంత దీర నాధుడు .

బౌద్ధదార్శనికుడు – దిజ్నాగుడు

బౌద్ధ దార్శనికుడైన దిజ్నాగుడు తెలంగాణా లోని కరీం నగర్ జిల్లా కోటిపల్లి గ్రామ నివాసి .ఈయన జీవితం లో చివరికాలాన్ని వేంగిలో గడిపాడని తెలుస్తోంది . ఇది చూస్తె ఇద్దరూ ఒకరేనేమో అని అనుమానం రావటం ఖాయమే .చరిత్ర తేల్చాల్సినవిషయమే . ప్రమాణ సముచ్చయ పరీక్ష ,హేతు చక్ర డమరుకం ,న్యాయావయవం  మొదలైన తర్క శాస్త్ర గ్రంధాలు రాశాడు .వేంగిలో(తెలంగాణా) ఒక కొండమీద ఒంటరిగా ఉండి ప్రమాణ సముచ్చయం రాశాడు .అనుష్టుప్ ఛందస్సులో ఉన్న ఈగ్రంధం అలభ్యం టిబెట్ లిపిలో దొరికింది .ఇది ఆరుభాగాల రచన .వాత్సాయనుడు తన సూత్రాలను వాడుకోన్నాడని దిజ్నాగుడు చెప్పాడు .ప్రత్యక్ష ,అనుమాన మొదలైన ప్రమాణాలను విపులం గా ఇందులో చర్చించాడు .

న్యాయ ప్రవేశిక లేక న్యాయావయవం తర్క శాస్త్రం లో కరదీపిక. దీని సంస్కృత ప్రతికూడా దొరకలేదు .టిబెటన్ అనువాదమే ఆధారం .ఇది తర్కానికి ప్రవేశ ద్వారం అంటారు .సధర్మ విధర్మ హేతువు మొదలైన వాటిని వివరించే గ్రంధం .హేతు చక్ర డమరువు అసలు సంస్కృత ప్రతి కాల గర్భం లో కలిసిపోతే టిబెటన్ అనువాదమే ఆధారమైంది .ఆలంబన పరీక్షకు ఆలంబన పరీక్స్శా వృత్తిని దిజ్ఞాగుడు రాశాడు .త్రికాల పరీక్ష అనే మరో రచనా ఆయనదే .దిజ్ఞాగుని శిష్యుడు శంకర స్వామి అని చైనా అనువాదాల్లో కనిపిస్తుంది

 

.Inline image 1  Inline image 2

మరోకవి దర్శనం ఈ సారి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు లో గీతామందిరం లోశ్రీ వేదపండితులు శ్రీ స్వర్ణ నాగేశ్వర రావు గారి ఆధ్వర్యం లో ఈ రోజు 9-10-14-గురువారం ఆశ్వయుజ బహళ విదియ రాత్రి జరిగిన వేద సభ దృశ్యమాలిక 

This gallery contains 40 photos.

More Galleries | Tagged | Leave a comment

స్వాతి మాస పత్రికలో- పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు- ఆవిష్కరణ

gabbita

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పురాణాలు-నేడు ఎలా తెలుసుకోవాలి?

పురాణాలు-నేడు ఎలా తెలుసుకోవాలి?

  గతవారంలో దేవీ నవరాత్రులను వివరించే సందర్భంలో పురాణాల ప్రస్తావన వచ్చింది. వీటిగురించి మరికొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

మహాభారతం మొదటి అధ్యాయంలో ‘ఇతిహాసాలు, పురాణాల ద్వారా వేదాన్ని వ్యాపింపజేయాలి’ అని వ్యాసుని మాట కనిపిస్తుంది. మన సంప్రదాయంలో ముఖ్యంగా పద్ధెనిమిది పురాణాలు ఉన్నాయని తెలిసిందే. అవి మన మూల గ్రంథాలైన ఉపనిషత్తుల్లో చెప్పిన సిద్ధాంతం నేపథ్యంలో ఆనాటి సామాన్య మానవుడికై వ్రాయబడ్డ పుస్తకాలు. వీటన్నింటినీ వ్యాసుడొక్కడే వ్రాసాడని కొందరు, అనేకులు వ్రాశారని మరికొందరి వాదన. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవుడి గూర్చి గొప్పగా చెప్పడం చూడగలం. వేదాంతం చదవనంతవరకూ పురాణకథల్ని అక్షర సత్యాలుగా భావిస్తాం లేదా అసత్యాలుగా కొట్టిపారేస్తాం. వేదాంతం కొంత చదివిన తర్వాత ప్రశ్నలు మొదలవుతాయి. విశ్వమంతా చైతన్యమనే మహాసముద్రంలో కనిపించే అల లాంటిది అన్నపుడు శ్రీదేవి ఎవరు, విష్ణువు ఎవరు, శివుడు ఎవరు, ఈ చైతన్య సాగరంలో వీరి స్థానమేమిటి, ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనే ప్రశ్నలు వస్తాయి.
విశాలమైన భరతఖండంలో విభిన్న ప్రాంతాల్లో విభిన్న సంప్రదాయాలు వెలిసినట్టు మనం గమనించగలం. వేదాల్లో పలుచోట్ల విష్ణువు, శివుడు, ఇంద్రుడు మొదలైన పేర్లు కనిపిస్తాయి. ఇవన్నీ ఒకే తత్త్వానికి వేరు వేరు పేర్లు మాత్రమే. కానీ సమాజంలో మాత్రం ఒక ప్రాంతంలో విష్ణువుకు ప్రాముఖ్యం, మరొకచోట శివుడికి ప్రాముఖ్యం, మరొకచోట శక్తి- ఈ విధంగా సంప్రదాయాలు ఉన్నట్లు ఊహించగలం. ఈ సంప్రదాయాలకు అనుగుణంగా పురాణాలు వచ్చాయి. విష్ణువు గొప్పదనాన్ని చెప్పేవి కొన్ని, శివుడు గొప్ప అని చెప్పేవి కొన్ని, శక్తి లేదా గణపతి గొప్ప అని చెప్పేవి మరికొన్ని కనిపిస్తాయి. ఈ పురాణాలన్నీ వేదవ్యాసుడు వ్రాసినా, మరొకరు వ్రాసినా ఉపనిషత్తుల్లో చెప్పిన వేదాంత సిద్ధాంతంతో తమ తమ సంపదాయాల్ని జోడించడం, దానికి ప్రామాణ్యం కల్పించడం ఆయా రచయితల ప్రణాళిక. ఉపనిషత్తుల్లో ప్రపంచమంతా శుద్ధచైతన్యంలో ఏర్పడే ఒకానొక దృశ్యంలాంటిదని చెబుతారు. చైతన్యంలో ఉన్న సృజనశక్తియే జడపదార్థంగా కనిపిస్తుందని అర్థం. ఈ కనిపించే ప్రక్రియ గూర్చి ఇదివరలో ‘ప్రపంచం ఎలా వచ్చింది’ అనే వ్యాసంలో చూశాం. ఈ శుద్ధచైతన్యమే శివుడనీ, అందులోని సృజనశక్తియే పరాశక్తి అని శైవ సంప్రదాయంవారు, అలాకాక శుద్ధచైతన్యం విష్ణువనీ, సృజనశక్తియే విష్ణుమాయ అని వైష్ణవులు, పరాశక్తియే చైతన్యమూ, అందులోని సృజనశక్తి అంటూ శక్తిసంప్రదాయంవారు చెబుతూ తమ సంప్రదాయం యొక్క స్ట్రక్చర్‌ను ఉపనిషత్తు సిద్ధాంతంతో (్ఛఝఛ్ఛఛీఛీజీుఽజ) కలిపేశారు.
ఇది భారతీయ సమాజంలో జరిగిన అద్భుత ప్రక్రియ. విశ్వాసాలు వేరు వేరుగా ఉన్నప్పుడు ఇతర దేశాల చరిత్రల్లో మనం చూసేవి యుద్ధాలు, రాజకీయబలంతో ఏదో ఒక విశ్వాసం బలపడి స్థిరం కావడం. భారతీయ సమాజంలో అలాకాకుండా విభిన్న సంప్రదాయాలు శాంతియుతంగా ఉపనిషత్‌ సిద్ధాంతము అనే గొడుగు క్రిందికి వచ్చాయి. ఒక్క వ్యాసుడే ఈ పని చేశాడంటే అతను నిజంగా అద్భుతమైన రీతిలో సమాజాన్ని ఏకం చేశాడని చెప్పవచ్చు. అలాగాక ఆయా సంప్రదాయాల రుషులు వాటిని వ్రాశారంటే వారి శాంతికాముకత, సమన్వయ దృష్టి అమోఘమైనవని చెప్పాలి. (సమాజం వేదాంత భావాలకు దూరమైన తర్వాత ఈ సమన్వయభావం లోపించి 15వ శతాబ్దం తర్వాత వైష్ణవులు, శైవుల మధ్య సంఘర్షణలు కొన్ని ప్రాంతాల్లో జరిగాయి.)

21వ శతాబ్దంలో మనకెందుకీ పురాణాలు అని ప్రశ్నించవచ్చు. నిజమే. మనకు గొప్పగా అక్కరలేకపోవచ్చు. అభిరుచి ఉన్నవాళ్లు సంతోషంగా వాటిని చదివి కొన్ని మంచి విషయాలు గ్రహించవచ్చు లేదా మానవచ్చు. అయినా చాలా అనూహ్యంగా వీటిగూర్చి తెలుసుకోవాల్సిన సామాజిక అవసరం ఏర్పడింది.

అనేక పాశ్చాత్య విద్యాలయాల్లో comparative mythology అనే విభాగాన్ని కొత్తగా ప్రారంభించి వివిధ దేశాల్లోని పురాణ కథలపై పరిశోధనలు, రచనలు జరుపుతున్నారు. ఇటీవల హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఉన్న ఒక ప్రొఫెసర్‌ “The Origin of World Mythologies” అనే పుస్తకం వ్రాశారు. ప్రపంచంలో అందరూ మన పురాణాలు చదవడం సంతోషించదగిందే కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఈ రచయితలు చాలామంది పురాణాల నేపథ్యం, వాటి వెనుక ఉన్న తాత్విక సిద్ధాంతం పక్కన ఉంచి పురాణకథలను జాతుల మధ్య పోరాటంగా చెప్తున్నారు లేదా అశ్లీలమైన, అనాగరికమైన, హానికరమైన అర్థాల్ని చెప్తున్నారు. ఇది కొత్త విషయం కాదు. బ్రిటిష్‌ పాలన సమయంలోనే మ్యాక్స్‌ ముల్లర్‌ మొదలు చాలామంది రచయితలు చేసిన పనే. దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధాల్ని ఆర్యులు, ద్రావిడులు అనే రెండు జాతుల మధ్య జరిగిన యుద్ధాలు అని వ్యాఖ్యానించి దేశ ప్రజల్ని అనేక వర్గాలుగా విడగొట్టడంలో సాఫల్యం చెందారు. ఇదే వైఖరి ఇటీవల కాలంలో మరింత పెరగడం గమనించదగింది. ఉదాహరణకు Paul Courtright  అనే అతను వినాయకుడిపై ఒక పుస్తకాన్నే వ్రాశాడు. ఇందులో కేవలం అశ్లీలతకే ప్రాధాన్యం. కోట్లాది ప్రజలు భక్తితో పూజించే వినాయకుడిని, పార్వతినీ, శివుడిని అశ్లీలంగా వ్యాఖ్యానించాడు. అలాగే సీత, హనుమంతులను గూర్చి జుగుప్సాకరంగా వ్రాశాడు. Wendy Doniger అనే రచయిత్రి ఇలాంటి వ్యాఖ్యల్నే చేసి పెద్ద పెద్ద పుస్తకాల్ని ప్రచురించింది. ఈవిడ వ్రాసిన ఒకానొక పుస్తకాన్ని ఇటీవల పెంగ్విన్‌ ప్రచురణకర్తలు వెనక్కి తీసుకోవడం కూడా పాఠకులు గమనించి ఉండవచ్చు.
పై పుస్తకాల ప్రభావం మన దేశంలోని మేధావి వర్గంపై పడుతుంది. మన మేధావి వర్గం మన సంస్కృతి నుంచి చాలామటుకు దూరమై పాశ్చాత్య సంస్కృతికి చేరువలో ఉంది. కానీ దురదృష్టవశాత్తూ వీరే సమాజంలో ప్రజాభిప్రాయాన్ని నిర్మించేవారు ( opinion makers ). వీరు విశ్వవిద్యాలయాలు, మీడియా మొదలగు అనేక రంగాల్లోని ప్రముఖులు. వీరికి మన సంస్కృతిపై ద్వేషం లేదు అయినా యాదృచ్ఛికంగా సంస్కృతికి దూరం కావడంవల్ల, మన సంస్కృతిపై అవగాహన కల్గించేవారు లేకపోవడం వల్ల, పైన చెప్పిన రచనలతో ప్రభావితం అవుతున్నారు. అలాంటి భావాలతోనే తమ రచనల్ని కూడా చేస్తారు. దీనికి జవాబు ఏమిటి? మన సంస్కృతిని బాగా తెలుసుకున్న సాంప్రదాయ పండితులకు పైవిధంగా రచనలు జరుగుతున్నాయన్న విషయం తెలియదు. వీరికి సంస్కృతంలో అసాధారణమైన పాండిత్యం ఉండవచ్చు కానీ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ఎలాంటి రచనలతో ప్రభావితమౌతున్నారనే విషయం వీరికి అవగాహన లేదు. మన సమాజంలో ఇన్నేళ్లుగా వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడిన రామాయణం, భారతంలాంటి పుస్తకాలు, పురాణాలపై సరైన అవగాహన కల్గించడం ప్రస్తుతం అవసరం. ఒక చిన్న ఉదాహరణ చూస్తే దేవతలు, రాక్షసులంటే సినిమాలలో చూపినట్టు ఆకాశంలోనిలబడి యుద్ధాలు చేసుకునేవాళ్లు కాదు. మరేమిటి అంటే – ‘‘దేవాః శాసో్త్రద్భాసితా ఇంద్రియవృత్తయః, అసురాః తద్విపరీతాః’’ అని ఉపనిషత్తుల వ్యాఖ్యల్లో చెప్పారు. శాస్త్రంచేత సంస్కరింపబడిన మనోభావాలే దేవతలనీ, సంస్కరింపబడని భావాలు రాక్షసులనీ దీని అర్థం. అదే సందర్భంలో దేవాసుర సంగ్రామం అంటే ప్రతిమనిషి మనస్సులో మంచి ఆలోచనలకూ, చెడు ఆలోచనలకూ ఎల్లప్పుడూ జరిగే ఆధ్యాత్మిక సంగ్రామం అన్నారు. ఇలాగే ప్రతి పురాణంలోనూ ఆయాదేవతల గూర్చిన సింబాలిజం అక్కడక్కడా చెప్పబడి ఉంది. వీటిని మామూలు పాఠకుడికి లేదా శ్రోతకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కానప్పుడు మహిషాసురుడు, బలిచక్రవర్తి మొదలైనవాళ్లు దళితుల ప్రతినిధులనీ, దుర్గాదేవి, వామనుడు మొదలైన దేవతలు బ్రాహ్మణవర్గం వారనీ హాస్యాస్పదమైన రచనలు రావడంలో ఆశ్చర్యం లేదు. సమాజంలోని మార్పుని తెలుసుకోవడం, విమర్శల ప్రభావాన్ని అవగాహన చేసుకోవడం, మన పుస్తకాల్లోని విషయాల్ని అందరికీ (ముఖ్యంగా విద్యార్థులకు) అందించడం పండితుల ముందున్న పని. పురాణకథల్ని చిలవలు పలవలుగా వర్ణించి పిల్లలకు చెప్పే స్థాయిలో కాక దార్శనిక దృష్టితో చెప్పినా పాఠకులు/శ్రోతలు సిద్ధంగానే ఉన్నారు. అదే సామాజిక అవసరం కూడా.

-డాక్టర్‌ కె. అరవిందరావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కనలే బతుకులపై కలం బావుటా ఎత్తిన -ఫ్రెంచ్ నవలా కారుడు పాట్రిక్ మోదియ్తానోకు నోబెల్ పురస్కారం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా వేదసభల ఆహ్వానము

ఆస్తిక  మహాశయులకు నమస్కారం.  
 
ప్రతి సంవత్సరము తెలంగాణా ప్రాంతములో జరిగే మన శ్రీ జనార్దనానంద సరస్వతి వేద విద్వన్ మహా సభలు ఈ సంవత్సరము హైదరాబాద్ లో పరమ పవిత్రమగు అష్టలక్ష్మీ  దేవాలయము లో వేదవేద్యుడగు అష్టలక్ష్మీ సమేత శ్రీ ఆదినారాయణస్వామి దివ్యసన్నిధి యందు 16-10-2014 నుండి 19-10-2014 వరకు జరుగుచున్నాయి. 
 
కావున ఆస్తిక మహాశయులందరూ ఈ 4 రోజుల సభలలో పాల్గొని ఆ వేదవేద్యుడైన అష్టలక్ష్మీ సమేత శ్రీ ఆదినారాయణస్వామి అనుగ్రహాన్ని, అలాగే వేదమాత అనుగ్రహాన్నికూడా పొందవలసినదిగా ప్రార్ధన. 
 
ఈ వేద సభలు నిరంతరంగా ప్రతిసంవత్సరం నిర్వహించుటకు, తద్ద్వారా సాంప్రదాయిక వేదవిద్యా వ్యాప్తి  సంపూర్ణముగా జరుగుటకు వదాన్యులు పూనుకొని ఈ ట్రస్టు శాశ్వత నిధికి తగు సహాయ సహకారాలు అందించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. 
 
దీనితో పాటు ఆహ్వాన పత్రికను జత చెయడమైనది. 
 
తూములురు శాయినాథ  శర్మ, శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి స్మృతి ట్రస్ట్, +91-94905-13438 
పసుమర్తి బ్రహ్మానంద శర్మ, శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి స్మృతి ట్రస్ట్ , +91-98490-11009
కుప్పా శ్రీ ఆంజనేయ శాస్త్రి, శ్రీ వేద వ్యాస పాఠశాల, +91-40-6444-8800

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -28

గీర్వాణకవుల కవితా గీర్వాణం -28

26- బౌద్ధ వేదాంతి ,కవి -అశ్వ ఘోషుడు

అశ్వఘోషుడు అంటే చాలాకాలం వరకు బౌద్ధ వేదాంతి అనే అనుకొన్నారు కాని అతని కావ్య, నాటకాలు వెలుగు చూసిన తర్వాత కాళిదాసాది కవుల సరసన చేర్చారు .సౌందర నందం చివర్లో తనను గురించి ‘’ఆర్య సువర్నాక్షిపుత్రాస్య సకేతస్య భిక్షోరాచార్యస్య  భదంతాఆశ్వ ఘోషశ్యా మహా కవేర్మహా వాడినః క్రుతిరిహస్య ‘’అని చెప్పుకొన్నాడు .దీనిని బట్టి సువర్నాక్షి తండ్రి అని ,అయోధ్యా నగర వాసి అని ,బౌద్ధ ఆచార్య పదవి అందుకోన్నాడని ,అప్పటికే ప్రసిద్ధి చెందాడని తెలుస్తోంది .వేద ధర్మాచరణ చేసే బ్రాహ్మణుడని  అర్ధమవుతోంది .తర్వాత బౌద్ధానికి ఆకర్షితుడై వసుమిత్రాచార్యుల వద్ద దీక్ష తీసుకోన్నాడని మహాయాన శాఖకు చెందిన వాడని అవగతం అవుతుంది .తన పాండిత్య ,కవిత్వాలను బౌద్ధ మత వ్యాప్తికే వెచ్చించాడు. గొప్ప ప్రచారమూ చేశాడు .గొప్ప సంగీతజ్ఞుడు కనుక మాధుర్య గానం తో జనాలను పరవశులను చేసేవాడట .

అశ్వ ఘోషుడు బుద్ధ చరిత రాశాడు .దీనికి చైనా అనువాదం ధర్మ రక్ష అనే భారతీయ పండితుడుక్రీ శ.414-421 లో  చేశాడట .కనుక అంతకు  ముందు వాడే నని  భావించాలి. మధ్య ఆసియాలో బుద్ధ చరిత్రలోని శారీపుత్ర ప్రకరణ వ్రాత ప్రతులు దొరికాయి .దీన్ని బట్టి కుషానులకాలానికి  కనిష్కుడి కాలానికి చెందిన వాడని పాశ్చాత్య పండితుడు లూదర్స్ అభిప్రాయ పడ్డాడు .బౌద్ధ అభిధర్మానికి ‘’విభాష ‘’అనే వ్యాఖ్య అశ్వ ఘోషుడు కనిష్కుని బౌద్ధ ధర్మ మహాసభల సమయం లో రాశాడు కనుక కనిష్కుని సమకాలీనుడే కాని క్రీ పూ ఒకటవ శతాబ్ది అంటే 80-150అని నిర్ణయించారు .ఒక ఐతిహ్యం ప్రకారం కనిష్కుడు పాటలీ పుత్రం మీదికి దండెత్తి ,ఆ రాజును జయించి ఆరుకోట్ల డబ్బును పరిహారం గా అడిగాడని ,రాజు దానికి మూడుకోట్ల విలువ అని భావించే బదులు బుద్ధుని భిక్షా పాత్రను  మరో మూడుకోట్లకు బదులు   అశ్వ ఘోశుడిని సమర్పించాడట .ఇలా కనిష్కుడు అశ్వ ఘోషుడిని దక్కించుకొని రాజధాని పెషావర్ అని పిలువ బడే పురుష పురానికి తీసుకు వెళ్లి ,అతని ప్రేరణ చేత బౌద్ధాన్ని స్వీకరించాడని తెలుస్తోంది .తర్వాతే కనిష్కుడు బౌద్ధమత వ్యాప్తికి పూనుకోన్నాడట .చైనా ,టిబెట్ ,జపాన్ మధ్య ఆసియా మొదలైన చోట్లకు బౌద్ధ భిక్షువులను పంపి ప్రచారం చేయించాడు.

ఘోషుని కవితా ఘోష

అశ్వ ఘోశుడిని బౌద్ధులు మహా దార్శనికునిగా ఆరాధిస్తారు .అనేక దార్శనిక గ్రంధాలు రాశాడు .కనుక కవి గా మరీ గుర్తింపు తెచ్చుకొన్నాడు .ఆతను రాసినవి బుద్ధ చరిత్ర తోబాటు ,సౌందర నందం సూత్రాలంకారం ,మహాయాన శ్రద్దోత్సవం ,వజ్ర సూచీ మొదలైనవిరాశాడని అంటారు .ఇందులో బుద్ధ చరిత్ర, సౌన్దరనందాలకు విశ్వ వ్యాప్తి ఉంది .శారీపుత్ర అనే ప్రకరణాన్నీ రాశాడు .ఇరవై స్రగ్ధరా వృత్తాలతో ‘’గాండీ స్తోత్రం ‘’రాశాడు .ఇది బుద్ధ స్తుతి .రాష్ట్ర పాలుడు అనే గేయ నాటకమూ రాశాడని’’ సిల్వీ లేవి’’ భావించాడు

సంస్కృత బుద్ధ చరిత్రలో పది హేడు సర్గాలున్నాయి .చివరి నాలుగు సర్గాల్ని పందొమ్మిదో శతాబ్దం లో అమ్రుతానందుడు రాశాడని అంటారు .చైనా భాషలో అనువాదానికి ఇరవై ఎనిమిది సర్గ లున్నాయట .బుద్ధుడు జన్మించినది మొదలు చివరిదాకా ఉన్నకధ అశోకుడికాలం లో జరిగిన యుద్ధాలు బౌద్ధ సభా వర్ణనలూ ఉన్నాయి .బుద్ధ చరిత కు ఆధారం ఏమిటో ఎవరూ చెప్పలేక పోతున్నారు .’’లలితా వర్తనం’’ నుంచి మూల కద తీసుకొని మార్పులు చేశాడని ఊహ .శృంగారాన్ని రమ్యం గ వర్ణించాడు .సభ్యత మీరలేదు .బుద్ధుడు తపస్సు చేస్తుండగా మన్మధుడు వేసిన బాణం నిష్ఫలం అయిన సందర్భం లో

‘’శాలేంద్ర పుత్రీం ప్రతి ఏవ ద్దో దేవో పి శంభు స్చలితో బభూవ –నచిన్తయత్యష తమేవ బాణం కిం స్యా దచిత్తో న శరః స ఏషః ‘’-దీని అర్ధం –‘’ఏ బాణం చేత శివుడు పార్వతిని చూసి చలించి విచాల్మనస్కుడైనాడో ఆ బాణాన్నే బుద్ధుడు లెక్క చెయ్యలేదు ఏమిటి ?ఇతనికి హృదయమే లేదా?లేక పొతే ఈ బాణం బాణమే కాదా’’?ప్రక్రుతి వర్ణనలూ బాగానే రాశాడు బుద్ధుడు శాక్య  వంశానికి చెందిన వాడు .శాక్యులు శ్రీరాముని ఇక్ష్వాకు వంశస్తులు .అశ్వ ఘోషుడు శ్రీరాముని అయోధ్య వాసి కనుక వాల్మీకి నే అనుసరించి బుద్ధ చర్తిత్రలో వర్ణనలు చేశాడు .బుద్ధుడు మారుని అంటే మన్మధుని జయించే ఘట్టాలు చాలా మనోజ్ఞం  గా ఉంటాయి

సౌందరనందం లో కవిత్వ సౌందర్యం

బుద్ధుడు సోదరుడు నందుడు బౌద్ధమతాన్ని తీసుకోవటమే ఇందులో కద .ఇది ప్రౌఢ రచన .బద్ధ చరిత లోనివే ఇందులోనూ కొన్ని పునరా వ్రుత్తమైనాయి. నందుడు సుఖాభిలాషి .సంసార జీవితం పై మోజున్న వాడు.  భార్య సుందరి అంటే ప్రాణం .అలాంటి వాడిమనసు మార్చి బుద్ధుడు దీక్ష నిస్తాడు .ఇది మహా కావ్యాల సరసన చేరింది సుందరీనందుల శృంగారాన్ని రమణీయం గా వర్ణించాడు .రస రమ్య కావ్యం గా చిరకీర్తి నందుకొన్నది సౌందర నందం .తెలుగులో దీనినే పింగళి లక్ష్మీ కాంతం గారు కాటూరి వెంకటేశ్వర రావు గారు సుమధుర కావ్యం గా తీర్చి దిద్దారు …ఘోషుడు  మంచి ఉపమానాలు వాడాడు. అన్ని రసాలను పోషించి కావ్యానికి శోభ చేకూర్చాడు. కవిత్వం హృదయాన్ని ఆకర్షిస్తుంది .అశ్వ ఘోషుడి భావాలను కాళిదాసు అనుకరించాడని అంటారు .సుందరీ నందుల వియోగాన్ని అశ్వ ఘోషుడు రాత్రికి చంద్రునికి మధ్య వియోగం తోపోల్చటం  విచిత్రమని పిస్తుంది .

‘’తాం సుందరీం  చేన్నలభేతనన్దః సా వా నిషేవేతే న తమ్ నత భ్రూః –ద్వంద్వం ధృవం తద్వికలం న శోబేదన్యోన్య హీనా వివ రాత్రి చంద్రౌ .

వేదాంత భావనలనూ సరళం గా అర్ధమయ్యే రీతిగా వర్ణించాడు .శాంత ,కరుణ రసాలనూ అద్భుతం గా పోషించాడు అయితే ‘’సిమెట్రీ’’ ఘోషునిలో కాళిదాసు కంటే తక్కువేమో ననిపిస్తుంది. మానవ హితంకోసం ఈ రెండు గ్రంధాలూ రాశాడు కనుక కావ్య సౌందర్యం కంటే ప్రజా ప్రయోజాన కోసం రాశాడు .బుద్ధ ధర్మ ప్రచారమే ధ్యేయం .హైందవ ధర్మంపై ద్వేషం లేనివాడు .కారణం మొదట్లో ఆ సంస్కారం లో పెరిగిన వాడేకనుక .అందుకే బుద్ధ కధల్లో రామాయణ భారత కధలను జోడించాడు .

అశ్వ ఘోషుడి తర్వాత గుప్తుల కాలం వరకునాలుగు వందలేళ్ళు  సంస్కృత కవులు కనపడటం లేదు .అప్పటిదాకా ప్రసిద్ధ కవులు కావ్యాలు లేకపోయి ఉండచ్చు .గుప్తులకాలం వైదికమతం పునరుద్ధానం చెంది స్వర్ణయుగం అనిపించుకొన్నది .క్రీ శ 345అలహాబాదు శాసనం లో సముద్ర గుప్తుని ప్రశస్తి కనిపించింది. ఈ శాసనాన్ని హరి శేనుడు అనేకవి రచించాడు .శైలి వైదర్భీ రీతిలో రమ్యం గా ఉంటుంది .గద్యమూ ఉన్నది. సముద్రగుప్తుడి ఆస్థానం లో యితడు ఏదైనా కావ్యాలు రాసి ఉంటాడని ఊహిస్తున్నారు .క్రీ శ.472మందసర్ శాసనాన్ని వత్స భట్టికవి గౌడీ శైలిలో రాశాడు .ఇతనిపై మేఘ సందేశ ,రుతుసంహార కావ్య ప్రభావం ఉందని భావన .Inline image 1  Inline image 2

 

మరో కవితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -27

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -27

25- అర్ధ శాస్త్ర రచయిత  — కౌటిల్యుడు

క్రీ .పూ.350-283 కాలం వాడైనచాణక్యుడు భారత దేశం లోనే అతి విశాలమైన మౌర్య సామ్రాజ్యస్థాపకుడు చంద్ర గుప్తుని రాజ్యాభిషిక్తుడిని చేసి ,ప్రతిజ్ఞ చేసి నంద వంశ నిర్మూలనం చేసి పిలక ముడి వేసుకొన్న చాణక్యుడే అర్ధ శాస్త్రం అనే మహా గ్రంధాన్ని రాసిన కౌటిల్యుడు .విష్ణుగుప్తుడు అనే పేరుకూడా ఉంది .తక్షశిల విశ్వ విద్యాలయానికి అర్ధ శాస్త్ర విభాగానికి అధ్యక్షుడు .నందరాజ  మంత్రి రాక్షసుడిని ఎన్నో మాయోపాయాలతో ఓడించి ప్రతిజ్ఞ నిలుపుకొన్నవాడు చివరికి రాక్షసుడినేశాంతి సమయం లో  చంద్ర గుప్తుని మంత్రిని చేసి సుపరిపాలన ప్రజాక్షేమం కాంక్షించిన వాడు .నాలుగు పురుషార్దాలలో  రెండవది అయిన అర్ధానికి ప్రాధాన్యం ఇచ్చి రాసి అన్ని ధర్మాలు అందులో నిక్షిప్తం చేశాడు కౌటిల్యం అని కీర్తించే రచన అది .చాణక్య ,రాక్షసమంత్రుల ఎత్తులపై శూద్రక కవి ముద్రా రాక్షస నాటకం లో చక్కగా వివరించాడు .

చణకుడు అనే బ్రాహ్మణుని కుమారుడు .తక్షశిల నివాసి .ఆయన జీవితం తక్షశిలా ,పాటలీ పుత్రలలోనే గడిచింది .చాణక్యుడు చిన్నతనం నుండి విద్యపై అభిరుచి ఉండటం వలన సకల శాస్త్రాలు కొద్దికాలం లోనే అభ్యసించి ఆర్ధిక ఆచార్యుడయ్యాడు .ఆ నాటికి ప్రపంచం లోనే అత్యున్నత అతి ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయం తక్షశిల .అందులో ఆర్ధిక విభాగాధ్యక్షుడై విద్యా బోధన చేశాడు .ఇందులోనే అశోక చక్ర వర్తికూడా విద్యా భ్యాసం చేశాడు .మహోన్నతమైన పదవిలో ఉన్నా అతి సాధారణ జీవితం గడిపి అందరికి ఆదర్శం గా నిలిచాడు .చెప్పింది చేసి చూపించిన ఘనత ఆయనది ..రాజు రాజ్య భద్రత మీద ఎక్కువ ద్రుష్టి ఉండాలని చెప్పాడు .చంద్ర గుప్తుని చక్రవర్తిని చేసి రాక్షసుడిని అమాత్యుడిని చేసి  రాజ భోగాలను త్యజించి అరణ్యాలకు చేరి ఒంటరి జీవితం గడిపాడు .ఆయన మరణం పై విభిన్న కధనాలు ఉన్నాయి .హేమ చంద్రుడు అనే బౌద్ధ రచయిత రాసిన దానిప్రకారం బిందుసారుని మంత్రి సుబందు కుట్ర వలన అడవిలో ఆహారం నీరు అందాక పస్తులతో గడిపి మరణించాడట .దీనికి కారణం బిందుసారుని తల్లిని హత్య చేయించింది చాణక్యుడే అని సుబందు రాజును నమ్మిం చటమే .బౌద్ధ రాజనీతి ప్రకారం హంతకుడికి నీరు ఆహారం అందకుండా మరణిం చేట్లు  చేయటమే అతి కఠిన శిక్ష.తన తల్లి మరణం సహజమే అని ఆలస్యం గా తెలుసుకొన్న బిందుసారుడు సుబందు ను చాణక్య మరణాన్ని ఆపమని ఆజ్న చేసినా ,అమలు చేయకుండా తగల బెట్టి చంపించాడని కధనం .

కౌటిల్య గరిమ

కౌటిల్యం అంటే కుటిల రాజకీయం అనే అర్ధం లోకం లో స్తిరపడిపోయింది .కాని మహోన్నత మానవతా వాదిగా కౌటిల్యుడు దర్శనమిస్తాడు .అర్ధశాస్త్రాన్ని చాణక్య నీతి శాస్త్రం అనీ పిలుస్తారు .ఇందులో ఆర్ధిక విషయాలు ఆదాయ వ్యయాలు ,రాజనీతి ,ప్రజా సంక్షేమం ,ఇతర దేశాలతో సత్సంబంధాలు ,వ్యాపార వాణిజ్య విషయాలు ,యుద్ధ తంత్రాలు అన్నీ చర్చించాడు .రాజ్య పాలన ఎలా ఉండాలో రాజులు తెలుసుకోనేట్లు రాశాడు .మను ధర్మ శాస్త్రాన్ని అనుసరించాడు శిక్షా స్మృతిని తెలియ జేశాడు. రక్షణ వ్యవస్తను  పటిష్ట పరచటం గూర్చి వివరించాడు .పన్నులు ,వసూళ్లు ,సైన్య విభాగం వాటి సద్వినియోగం ఒకటేమిటి అన్నిటినీ పేరుపేరునా చర్చించి వివరించాడు. సులభం గా అర్ధమయ్యే భాషలో రాసి అందరికి చేరువ అయ్యేట్లు చేశాడు .చాణక్య ప్రతిభ నిరుపమానం .ఎవరైనా ఏదైనా గొప్ప ఆలోచన చెబితే వారిని ‘’అపర చాణక్యుడు ‘’అనటం లోక రివాజు .కుటిల ఆలోచనలిస్తే’’ అబ్బో పెద్ద కౌటిల్యుడు రా’’అని ఆయన చెడు చెప్పక పోయినా ముద్ర  వేయటమూ ఉంది .ఆనాటి అఖండ భారత సార్వ భౌమత్వానికి ఏమాత్రం ముప్పులేకుండా చేయగల్గిన మేధావి చాణక్యుడు .అర్ధ శాస్త్రం అంటే రాకీయ యదార్ధ శాస్త్రం అని ,ప్రభుత్వం ఎలా పని చేస్తుందో తెలియ జేస్తూ ,ఎలా పని చేయాలో సూచిస్తూ ,రాజు విదులేమితో తెలియ బరుస్తూ ,ప్రజలకు పాలన దగ్గరకావాలని తెలుపుతూ ,ప్రజలు రాజ్య నిర్మాతలని అంటూ ,వారుకూడా హద్దుదాటితే తీవ్ర శిక్ష ఎలా అమలు చేయాలో తెలియ జేసింది అని పాశ్చాత్య పండితులు మెచ్చారు .రాజు నిరంకుశుడే ఆనాడు .అలాంటి కాలం లో ఆర్ధిక పరి పుష్టి కల్గించటం ఎలాగో చెప్పాడు .న్యాయ సంబంధమైన విషయాలను వివరిస్తూ అధికారుల విధి విధానాలు సూచిస్తూ ,సంస్కృతిని నిల బెడుతూ పురోగతికి మార్గాలు సూచించాడు .గనుల శాస్త్రాన్ని గని తవ్వకాలను ,లోహ శాస్త్రాన్ని ,వ్యవసాయం లాభ సాటిగా చేయటాన్ని ,పశువుల పెంపకం ,యాజమాన్య పద్ధతులు ,వనమూలికలు ,ఔషధాలు ,ఆయుధాల తయారీ ,అడవి జంతువుల సంరక్షణ ,కరువులు రాకుండా చేసే ఉపాయాలు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ,ప్రక్రుతి వైపరీత్యాలను ప్రజా సహకారం తో పరిష్కరించటం, గూఢ చారి వ్యవస్థ ,కోటలను స్వాధీనం చేసుకొనే విధానం ,సంస్థల నిర్వహణ విధానం ,యుద్ధ నీతి యుద్ధ ఖైదీలను చూడాల్సిన పద్ధతులు,క్రమశిక్షణ ,దండయాత్రా విధానాలు , సంధి విగ్రహాలు ,వ్యసనాలు నిర్మూలన ,ప్రభుత్వాధికారుల బాధ్యతలు విధులు వంటివి తెలియ జెప్పాడు .వీటిని పది హీను విభాగాలలో వివరించాడు .

పాశ్చాత్యులు అర్ధ శాస్త్రాన్ని మాక్ విల్లీ రాసిన ‘’ప్రిన్స్ ‘’తో పోలుస్తారు .అది సరైన పోలిక కాదు .కౌటిల్యుడు రాజు ‘’రాజర్షి ‘’కావటానికి కావలసిన సకల విషయాలు వివరించాడు .’’ప్రజల  సుఖ సంతోషాలే రాజు సుఖ సంతోషాలు .వారి సౌభాగ్యమే తన సౌభాగ్యం వారి సంక్షేమమే తన సంక్షేమం .తనకు ఆనందాన్ని ,లాభాన్ని కలిగించేవికాడు .ప్రజలకు ఆనందాన్ని లాభాలను కలిగించేవే రాజు చేయాలి ‘’అని గొప్ప రాకీయ సూక్ష్మాన్ని బోధించాడు కౌటిల్యుడు .రాజర్షికి ఉండాల్సిన లక్షణాలను వివరిస్తూ –రాజు ఆత్మ నిగ్రహం కలిగిఉండాలి .విజ్ఞులైన పెద్దలతో ఉంటూ విజ్ఞానాన్ని పెంచుకోవాలి .వేగుల వారికన్నులే తన కన్నులుగా చూడాలి .రక్షణ ,సంక్షేమమమే ధ్యేయం గా ఉండాలి .తానూ ధర్మ బద్ధం గా ఉంటూ ప్రజలూ అనుసరించేట్లు చేయాలి .అన్ని శాస్త్రాలలోను అభినివేశం కలిగి ఉండాలి .ప్రజలకు సహాయ పడుతూ వారి ఆర్ధికాభి వృద్ధికి తోడ్పడాలి .క్రమ శిక్షణ తో ప్రవర్తిస్తూ ప్రజలను అదే దారిలో నడిచేట్లు చేయాలి .

రాజు ఇతరుల  భార్యలపై వ్యామోహ పడరాదు .ఇతరుల సంపదను దోచుకోరాడు . అహింస నే అవలంబించాలి .ఆడంబరం అసత్యం ఉండరాదు .దుష్టులకుదూరం గా ఉండాలి .అని రాజులకు సూక్తి ముక్తావళి చెప్పాడు .పటిష్టమైనఆర్ధిక వ్యవస్థ రాజ్యానికి శ్రీరామ రక్ష అన్నాడు కౌటిల్యుడు .ధర్మం కర్మ దీనిపైనే ఆధార పడిఉంటాయి అన్నాడు .రాజు శక్తి వంతుడైతే పాలితులూ అలానే ఉంటారు .బద్ధకిస్స్టూడు రాజు అయితే శత్రువులు తేలిగ్గా రాజ్యాన్ని లోబరచుకొంటారు .కనుక రాజర్షి ఎల్లప్పుడూ చలాకీగా ఉండాలి .అప్పుడే రాజ్యానికి ప్రమాదం ఉండదు .పగలు,రాత్రి ని ఎనిమిది విభాగాలు చేసుకొని ఒక్కో విభాగానికి ఒకటిన్నర గంటలు కేటాయించి తన కార్యక్రమాలను అమలు చేయాలి .

పగలు మొదటి విభాగం లో –రక్షణ ,ఆర్ధిక ,ఖర్చుల పై నివేదికలపై దృష్టిపెట్టాలి .రెండవ విభాగం లో ప్రజా విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కరించాలి .మూడు లో అధికార నియామకాలు కానుకల స్వీకరణ ,వారికి పనులు పురమాయించటం చేయాలి .నాలుగవ భాగం లో ఉత్తర ప్రత్యుత్తరాలు మంత్రులతో సమావేశాలు చేయాలి .అయిదులో స్వీయ వినోద విషయాలలో పాల్గొనాలి .ఆరులో సైనిక విశేషాలు ,పర్య వేక్షణ నిర్వహించాలి .సాయంకాల ప్రార్ధన తో పగలు కార్యక్రమం పూర్తీ అవుతుంది .

సాయంత్రం మొదటి గంటన్నరలో –గూఢచారులతో సమావేశం నిర్వహించాలి .రెండవ భాగం లో –స్నానం పూజాదికాలు,చదువు .మూడు నాలుగు లో  –నిద్రకు ఉపక్రమించి హాయిగా నిద్రపోవాలి .అర్ధ రాత్రి దాటినా గంటన్నరలో మంగళ ధ్వానాలతో మేల్కొనాలి .రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి . మూడవ భాగం లో మంత్రులతో సమావేశం వేగులను పంపటం చేయాలి .సూర్యోదయానికి గంటన్నర ముందు గృహ  మత సంబంధ విధులు ,గురువు ల సందర్శనం ,పురోహిత హితులతో వైద్యులతో భేటీ  ముఖ్యమైన వంట వాడితో ,వైద్యులతో సమావేశం నిర్వహించాలి

శత్రు రాజుల యెడ సామ దాన భేద దండ మాయ ,ఉపేక్ష ఇంద్రజాలాలను ప్రయోగించాలని చెప్పాడు కౌటిల్యుడు ..రాజ్య సరిహద్దుల్లో అరణ్యాలు పెంచి వాటికి కాపలాగా ఏనుగులను ,రక్షకులను నియోగించాలని చెప్పాడు .కౌటిల్యుడు ఆనాడు చెప్పినవన్నీ నేటికీ శిరోదార్యాలే అని ఆర్ధిక ధర్మ న్యాయ ,శిక్షాశాస్త్రజ్నులు చెబుతున్నారు .

మరో కవి తో మళ్ళీ కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -26

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -26

24- యమక చక్ర వర్తి -ఘటకర్పకుడు (పగిలిన కుండ)

విక్రమాదిత్య చక్రవర్తి ఆస్థానం లోని నవ రత్న కవులలో ఘట కర్పకుడు ఒకడు .కాళిదాస మహాకవి సమకాలికుడు .నీళ్ళు మోసే కులం లో పుట్టాడు కనుక ఘట కర్పకుడు అని పిలువ బడ్డాడు .కనుక క్రీ పూ .ఒకటవ శతాబ్దికి చెందిన వాడుగా అనుకోవచ్చు .భాసుడే ఘటకర్పకుడు అనే ప్రచారమూ ఉంది .భాసుడు కూడా నీళ్ళు మోసే వాడు కనుక అతన్ని పరిహాసం చేయటానికి ఘటకర్పకుడు అని పిలిచేవారనే మాట వాడుకలో ఉందికాని ఇది సమ్మతం కాదు .ఇద్దరూ వేరువేరు .భాసుడులాగా శూద్రకులం లో జన్మించాడని భావిస్తారు .ఈ పేరు రావటానికి ఆయనే తన కావ్యం లో కారణం చెప్పుకొన్నాడు .

‘’ఆలంబ్య చాంబు త్రుషితః కరకశ పేయం –భావాను రక్త వనితా సురతైః శపేయం

జీయేయ యేన కవినా యమకైః పరేన –తస్మై వహేయముదకం ఘట కర్పరేణ ‘’ అంటే ‘’ఎవరు యమకాన్ని ప్రయోగించటం లో నన్ను మించిపోతారో వారికి ఘట కర్పరం తో-పగిలిన కుండ తో  నీళ్ళు మోస్తాను ‘’అని చాలెంజి చేసిన యమక చక్రవర్తి ఘటుడు .ఇతనికి కాళిదాసు తో స్పర్ధ ఉన్నదట .కుమార సంభవం లో కాళిదాసు ‘’ఏకోహి దోషో గుణ సన్నిపాతేనిమజ్జ తోందోః కిరణే ష్వివాన్కః ‘’అన్న శ్లోకం లోని అనౌచిత్యాన్ని ఎత్తి చూపాడు కర్పకుడు .యమకాన్ని కాళిదాసు తక్కువగా వాడితే కర్పకుడు యమకం తో కావ్యాన్నే రాసిపారేశాడు .కాళిదాస మేఘ సందేశం లో యక్షుడు భార్యకు మేఘం ద్వారా సందేశం పంపిస్తే కర్పకుడు భార్య  భర్తకు మేఘ సందేశం పంపుతుంది.భర్త ఆమెను ఎప్పుడూ వర్షాకాలం లో వంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు అందుకే ఈ సందేశం . అదీ ముఖ్యమైన తేడా .రెండు కావ్యాలు వర్ష రుతువులోనే ఆరంభమౌతాయి .యక్షుడి విరహం ఎదాడిది అయితే కర్పర కావ్య నాయిక విరహం మూడే నెలలు .మేఘం ఎలా ప్రయాణం చేయాలో యక్షుడి చేత కాళిదాసు చెప్పిస్తాడు. కాని కర్పరకావ్యం లో భార్య రూట్ మాప్ ఇవ్వలేదు .

ఘట కర్పరుని కవితా  గీర్వాణం

ఘట కర్పరకుని కావ్యం లో లభించినవి కేవలం 23 శ్లోకాలే .అందులో ఇరవై రెండవ శ్లోకం ప్రక్షిప్తం అని తేల్చారు .దీనికి అభినవ గుప్తుడు వ్యాఖ్య రాయలేదు .దివాకరుడు ఇరవైకి మాత్రమె వ్యాఖ్యానం చేశాడు .కనుక ఇరవై ఒక్క శ్లోకాల యమక కావ్యం ‘’యమహా కావ్యం’’ .ఇది సందేశ కావ్యాలలో మొదటిది అని విమర్శకాభిప్రాయం .అంటే మేఘ సందేశం కంటే ముందుది అని అనుకోవాలి .ఈ కావ్యానికి పేరు కూడా లేదు .అందరూ ‘’ఘట కర్పర కావ్యం ‘’అనే పిలుస్తున్నారు .మొట్టమొదటి సారిగా జర్మనీ దేశం లో ‘’దుర్సే ‘’అనే ఆయన సంపాదకత్వం లో 1828లో ప్రచురింప బడింది .అంతకు ముందు ఏ భారతీయ రచయితా ,కవి ,ముద్రాపకుల ద్రుష్టి దీనిపై పడక పోవటం దురదృష్టం .1959లో డా.జతీంద్ర విమల్ చౌదరి ఆధ్వర్యం లో వ్యాఖ్యానం తో కలకత్తా నుంచి ‘’సంస్కృత రూప సంగ్రహ ‘’సిరీస్ లో ప్రచురితమైంది .సంస్కృతం లో ఘట కర్పర కావ్యానికి వ్యాఖ్యానాలు రాసిన ప్రముఖులలో అభినవ గుప్తుడు ,భారత మల్లికా ,శంకర ,తారా చంద్ర ,గోవర్ధన ,రంనాపతి మిశ్ర ,దివాకర వైద్యనాదాదులున్నారు .అభినవ గుప్తుడు దీన్ని కాళిదాస కావ్యం గా భావించాడు .వృత్తిక అనే పేరుతొ వ్యాఖ్యానం రాశాడు .’’’poem of the broken jug ‘’‘’అని ఇంగ్లీష్ లోఘటకర్పర కావ్యాన్ని  పిలుస్తారు .

ఘటకర్పకుడు యమక చక్ర వర్తి  అన్నాంకదా. యమకం మహా యమహాగా సుందరం గా చెవులకు ఇంపుగా హృదయోల్లాసం గా ఉంటుంది .సహజ సుందరమైన యమకాలను ప్రయోగించాడు కర్పక కవి .అప్రయత్నం గా మహా ఆశువుగా యమకం కర్పకునిలో ఊరి కర్పూర సువాసనలనీను తుంది .అది అతని ప్రత్యేకత .మచ్చుకి ఒకటి

‘’మేఘావృతం నిశి న భాతి నభో వితారం –నిద్రాభ్యుపైతి చ హరిం సుఖ సేవితారం

సేంద్రాయుధశ్చజలదోద్యర సన్నీ భానాం –సంరంభ మావహతి భూధర  సన్నిభానాం ‘’’’

ఈకావ్యం లో అయిదు రకాల ఛందస్సులను వాడాడు .కాళిదాసు మేఘ సందేశం అంత ప్రచారం దీనికి రాకపోయినా తర్వాత కవులపై ప్రభావం చూపింది .మదనుడు అనేకవి ఆకర్షితుడై తనకృష్ణ లీల కావ్యం లో కర్పరకుని ఒక్కొక్క శ్లోకం లోని మొదటి  పాదాన్ని తీసుకొని మిగిలిన మూడు పాదాలు తానూ చేర్చి రాశాడు .అలాగే రెండవ పాదాన్ని తన శ్లోకం లో రెండవ పాదం గా గ్రహించి మిగిలిన పాదాలు అల్లాడు .మొత్తం ఎనభై నాలుగు శ్లోకాలతో మదనుడు కృష్ణ లీల కావ్యం రాశాడు .ఇలా ఇంతవరకు ఏకవి కావ్యానికి ఆ గౌరవం అబ్బలేదు .ఘటకర్పకుడికే ఆ గౌరవం దక్కించాడు మదన కవి యమకాన్ని కూడా కర్పక కవి వాడినట్లే దట్టించి వదిలాడు .కృష్ణ జననం ,లీలలు  గోపికా విరహం ,రాసలీలలనుఅత్యద్భుతం గా  మదనుడు మదన మనోహరం గా సుందరం గా మనోహరమైన శైలిలో రాసిఒక రకం గా కర్పకునికి అంకితం చేశాడా అన్నట్లు ఉంటున్దికావ్యం .మర్దనుడు పరహారవ శతాబ్ది దక్షిణ దేశ కవిగా భావిస్తారు

సశేషం

మరోకవితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -25

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -25

23- భరత నాట్య సృష్టికర్త -భరత ముని

క్రీ .పూ .మూడవ శతాబ్దానికి చెందిన భారత ముని నాట్య శాస్త్ర రచయిత .సంగీత నాట్యాలలో మహా పండితుడు .భారతీయ నాటక ధర్మాలను అవలోడనం చేసిన వాడు .నాటక శాలా నిర్మాణం లో సుప్రసిద్ధుడు .ప్రాచీన భారత దేశ సంగీత నృత్య సంప్రదాయాలను బాగా తెలిసి  ప్రయోగించాడు .గాన ,వాద్య సంగీతాలను నాట్య కళ లను గురించి సంపూర్ణం గా వివరించిన మహా గ్రంధం నాట్య శాస్త్రం .ఇవన్నీ సంస్కృత నాటక రంగ భాగాలే .దశ విధ రూపక భేదాలను గుర్తించి వివరించాడు .పాశ్చాత్యులు డ్రామా అని పిలిచే నాటకం ఈ పదిలో ఒకటి మాత్రమె .దశ విధ రసాలపై చర్చించాడు .35అధ్యాయాలున్న ఈ శాస్త్రానికి భరతుడు ఆద్యుడు .భారత నాట్యానికి అభినవ గుప్తుడు  అనితర సాధ్యమైన’’అభినవ భారతి ‘’అనే పేరిట  వ్యాఖ్యానం చేశాడు .గాంధర్వ వేదం అంటే సామగానం ఆధారం గా దీన్ని రాశాడు .36,000శ్లోకాలున్న ఉద్గ్రంధం భారత శాస్త్రం .నాట్య వేదం అని పిలువ బడేది దొరకక పోవటం దురదృష్టం .

భరతముని కవితా గీర్వాణం

ఇప్పుడు మనకు లభిస్తున్న భరత శాస్త్రం లో ఆరు వేల శ్లోకాలున్నాయి.దీనిని ఆంగ్లం లో ‘’డ్రామాటిక్ ఆర్ట్ ‘’’’పెర్ఫార్మన్స్ ఆర్ట్ ధీరీ ‘’అన్నారు .నాట్యాన్ని  దృశ్య రూపకం లేక దృశ్య కావ్యం అంటారు .ఇది నాట్య నృత్య సంగీత త్రివేణీ సంగమం .మునులు భరతుని వద్దకు వచ్చి నాట్య వేదాన్ని గురించి తెలియ జేయమని కోరితే బ్రహ్మ తెలియ జేసిన దానిని వారికి దీనిద్వారా తెలియ జేశాడు .దుస్తులు ఆహార్యం రంగ స్తలం ,విభజన ,నటన ,దర్శకత్వం వగైరాలను గురించి వివరంగా తెలిపాడు .ఆంగిక ,వాచిక ,ఆహర్యాలను వివరించాడు .అరిస్టాటిల్ రాసిన పోయేటిక్స్ తో పోలుస్తారు .ప్రేక్షకులు ఆదరించే  రాసోత్పత్తి కోసం నటులు  రంగం మీద  అభినయించి రసోత్పత్తి చేస్తారు .సంగీతాన్ని గురించి విపులంగా చర్చిన తోలి గ్రంధం భరతుని నాట్య శాస్త్రమే .పదమూడవ శతాబ్దం వరకు భారత దేశానికి ఇదే ఉపయుక్త సంగీత గ్రంధం ఆ తర్వాత ఉత్తరాది సంప్రదాయం ,దక్షిణాది సంప్రదాయాలు ఏర్పడ్డాయి. వాటినే హిందూస్తానీ అని, కర్నాటక సంగీతం అనీ అని పిలుస్తున్నాం .

భరతుడు షడ్జమాన్ని ‘’గ్రామ ‘’(గామ )అన్నాడు అదే మొదటిది .మూలమైనవి అవినాశి అని అవిలోపి అని అవిమారవని తెలియ జేశాడు .శ్రుతుల మధ్య సామరస్యమే సంగీతం అన్నాడు .నాట్య శాస్త్రాన్ని అయిదవ వేదం గా గుర్తిస్తారు .దీనిపై ఎన్నో వ్యాఖ్యానాలోచ్చాయి అందులో మాతంగుడు రాసిన బృహద్దేశి ,అభినవ గుప్తుని అభినవ భారతి ,సారంగ దేవుని సంగీత రత్నాకరం ముఖ్యమైనవి .భరతుని నాట్య శాస్త్రం నాట్యకళా సంబంధ ‘’విజ్ఞాన సర్వస్వం ‘’.ఇందులో లేనిది లేదు .భరతుని తర్వాత నందీశ్వరుడు అభినయ దర్పణం రాశాడు .ఇతనికాలం పన్నెండో శతాబ్దం .ఆచార్య పోనంగి శ్రీరామ అప్పారావు గారు భరతముని నాట్య శాస్త్రాన్ని తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని పొందారు

 

.Inline image 1   Inline image 2

మరో కవి దర్శనం చేద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -24

గీర్వాణకవుల కవితా గీర్వాణం -24

22-వ్యాస వాల్మీక సమానుడు –గుణాధ్యుడు

గుణాధ్యుడు బృహత్కధ రాశాడు .ఇది సంస్కృతం లో ప్రాకృతం లో ఒక భేదమైన పైశాచీ భాషలో రాయబడింది .గ్రంధం మొదట ఉదయన రాజు చరిత్ర ఉంటుంది ,ఆయన వాసవ దత్త వివాహం తర్వాత అసలుకద అతనికొడుకు నరవాహన దత్తుడితో ప్రారంభమవుతుంది .తర్వాత దత్తుని సాహస యాత్రలు ,అనేక మంది స్త్రీలతో వివాహాలు వస్తాయి .విద్యాధరులకు రాజు అవటం ,మధ్యలో అనేక కధలు చేరుతాయి . అంటే కదాకావ్యం అన్నమాట .గునాధ్యుడు వ్యాస వాల్మీకి అవతారం అన్నారు .రామాయణ  మహా భారతాలు బృహత్కధ అనే త్రివేణీ సంగమం లా కవిత్వాన్ని ప్రవహింప చేశాడని  గోవర్ధనాచార్య అన్నాడు .గుణాధ్యుడు శ్రుతార్ధ అనే బ్రాహ్మణ స్త్రీకి కీర్తి సేనుడు అనే నాగ రాజుకు గాంధర్వ వివాహం లో జన్మించాడని అంటారు .సుప్రతిస్టాన పురం అతని నివాసం .అతనికాలం క్రీ శ అయిదు ఆరు నుంచి క్రీ పూ .ఒకటవ శతాబ్దం దాకా ఊహించారు .చివరికి స్మిత్ పండితుడు క్రీ పూ ఒకటవ శతాబ్ది వాడే నని నిర్ణయం తో అందరూ ఏకీభ విస్తున్నారు

పైశాచిలో రాయటానికి నేపధ్యం

సుసంపన్నం అయిన  సంస్కృతాన్ని వదిలి పైశాచీ భాషలో ఎందుకు రాశాడు ?దీనికి ఒక కద ప్రచారం లో ఉంది .శాతవాహన రాజు కుంతకుడు రాణి తో జలక్రీడ లో ఆమెపై నీరు చల్లుతాడు. ఆమె సంస్కృతం లో ‘’మొదకైస్తాడయ ‘’’’అన్నది అర్ధం తెలియని రాజు మొదకాలు అంటే ఉండ్రాళ్ళుకావాలని అడుగుతున్దేమోనని భావించి  తెప్పించి విసిరాడు .అతని అజ్ఞానానికి ఆమె పరిహసించింది ..ఉక్రోషం వచ్చిన రాజు ఆస్థాన పండితుడు గుణాధ్యుడిని ఆశ్రయిస్టస్తే ఆరేళ్లలో పండితుడిని చేస్తానంటే అక్కడేఉన్న శర్వ వర్మ ఆరునెలల్లో చేస్తానని సవాలు విసిరాడు .వర్మ నిజం గా అలాచేస్తే తానూ సంస్కృత ,ప్రాకృత ,మొదలైన దేశ భాషలను త్యజిస్తానని గుణాధ్యుడు శపథం చేశాడు .శర్వ వర్మ కాతంత్ర అనే వ్యాకరణాన్ని రాసి అన్నమాట ప్రకారం రాజును సంస్కృతం లో పండితుడిని చేశాడు. మాటనిల బెట్టుకోవటానికి గుణాధ్యుడు సంస్క్రుతాది భాషాలు త్యజించేశాడు ,భూతాల భాష అయిన పైశాచి లో కావ్యం రాశాడు .

బృహత్కధ –కవితా గీర్వాణం

గుణాధ్యుడు శివ గణాలలో ఒకడుఅని కదా సరిత్సాగరం లో ఉంది .శివుడు పార్వతికి ఈ కధలు చేబుతూండగా పుష్పదంతుడనే శివ గణం లోని వాడు  చాటుగా విన్నాడు .ఇది గమనించిన పార్వతి మానవునిగా పుట్టమని శపించింది. రహస్యం గా విన్న ఎడుకధాలను పిశాచం గా ఉన్న కాన భూతికి చెప్పి కైలాసానికి రమ్మని ఆదేశించింది అతని సోదరుడు మాల్యవంతుడు మధ్యలో అడ్డుకోగా అతన్నీ మనిషిగా పుట్టమన్నది .పుష్పదంతుడు వర రుచిగా పుట్టి మగధ పాలకుడు నంద రాజు దగ్గర  మంత్రి అయ్యాడు   .ముసలితనం లో వింధ్య పర్వతాలను చేరి కాన భూతిని కలిసి కధలు చెప్పి కైలాసం చేరాడు .మాల్య వంతుడు గుణాధ్యుడుగా పుట్టి ప్రతిష్టానపురం లో శాతవాహన రాజ మంత్రి చేసి ,తర్వాత వింధ్య ప్రాంతానికి వెళ్లి పైశాచి భాష నేర్చాడు .కాన భూతి చెప్పిన కధలు విన్నాడు. భూతి పిశాచ రూపం పోయింది. కాన భూతి చెప్పిన వాటిని ప్రచారం చేస్తూ భూలోకం లో ఉండి శిష్యులు గుణ దేవా ,నందిదేవుల తో సలహా తో శాతవాహన రాజుకు చూపాడు .పైశాచీ భాషలో ఉండటం వలన దాన్ని నిరాకరించాడు రాజు .అవమానం పొంది వింధ్యకు వెళ్లి చితి పేర్చుకొని రాసిన గ్రంధం లో ఒక్కో పత్రం మంటల్లో వేసి కాల్చేస్తున్నాడు .రాజు తప్పు తెలుసుకొని వచ్చి ఆపాడు .అప్పటికే ఆరు వంతుల గ్రంధం దగ్ధమైంది .నరవాహన దత్తుని వృత్తాంతం ఉన్న లక్ష పద్యాలే మిగిలాయి దీన్ని శిష్యులకిచ్చి శాప విమోచనం పొంది కైలాసం చేరాడు

శిష్యులను రాజదానికి తీసుకొని వెళ్లి రాజు వారిని సత్కరించి దానికి ఆముఖం గా ‘కదా పీఠం ‘’రాశాడు అప్పటి నుంచి బృహత్కధ గా ప్రచారమైంది .మూల పైశాచీ గ్రంధం లోకం లో లేకుండా పోయింది  బాణాది కవులు దీన్ని ఉదహరించారు .పైశాచీ భాష భారత దేశం లో ఉత్తర –పశ్చిమ అంటే వాయవ్య దిశలో ప్రచారం లో ఉండేదట .ఈనాటి దర్దిక్ భాషకు దగ్గరలో ఉంటుందట .పాంచాల ,కేకయ ,బాహ్లిక నేపాల ,కుంతలా గాంధార ప్రజలు పైశాచీ ని మాట్లాడేవారని పిశేల్ అనే చారిత్రకుడు అన్నాడు .శౌరసేని కి దగ్గరగా ఉంటుందని అన్నారు. బౌద్ధ భిక్షువులు దీనిని నేర్చుకోనేవారట .అంటే నిత్య జీవితం లో ప్రజలు మాట్లాడేభాష గా పైశాచి ఉండేదని తెలుస్తోంది .నాగరకులు కాక మిగిలిన సామాన్యులు మాట్లాడే భాష .భోజరాజు పైశాచి ని నిషేధించాడట .ప్రజాసామాన్య భాష కనుకనే గుణాధ్యుడు దీనిలో బృహత్కధ రాశాడని గ్రహించాలి .ఇప్పుడు బృహత్కధ క్షేమేంద్రుడు రాసిన బృహత్ కదా మంజరిగా ,సోమదేవుడు రాసిన కదా సరిత్సాగరం గా దర్శన మిస్తోంది .బృహత్కధలో రాజు  విక్రమాదిత్యుడిని పేర్కొన్నాడు గుణాధ్యుడు .గాదా  సప్త శతి రాసిన హాలుడు ,గుణాధ్యుడు విక్రమాదిత్యుని కాలం లో ఉండేవారు .మహారాష్ట్రలో పైఠాన్ అనే ప్రాంతాన్ని పాలించిన శాతవాహన రాజు ఆస్తానం లో గునణాధ్యుడు ఉండేవాడు .గుణాధ్యుడు తన కావ్యాన్ని సకల కళాసారం గా రచించాడు .అతడు అన్నిటా ఆరితేరిన వాడనిపిస్తాడు .ఈ కదా కావ్యాన్ని ఉత్తమ పురుషలో రాసి తానె మనకు చెబుతున్నట్లు రాయటం విశేషం .తన దృష్టికోణం లో కధలను వివరిస్తాడు .

ప్రభావం

బృహత్కధను క్షేమేంద్రుడు ,బుద్ధ స్వామి సోమదేవుడు అనువాదం చేశారని చెప్ప్పుకోన్నాం .ఇందులోని కధలెన్నో పంచతంత్రం భేతాళ వింశతి ,శుక సప్తతి వంటివాటిల్లో చేరాయి .బౌద్ధ జాతక కధల్లోనూ దూరాయి ‘.’కదా అనే గద్య ప్రక్రియ పై కూడా దీని ప్రభావం ఉంది .బాణుడు, సుబందు దీన్ని చాల గౌరవించారు .ఉదయనుడి భార్య వాసవ దత్త పేరును సుబందు తన కావ్య నాయికకు పెట్టాడు .బాణుడు ఉజ్జయిని లో  బృహత్కదా కుశలురు ఉండేవారని తెలియ జేశాడు .కదా మహాకావ్యాలకు బృహత్కధ ప్రేరణ నిచ్చింది. దశకుమార చరిత్ర ,కాదంబరి కధలపై దీని ప్రభావం ఉంది .అనేక దేశ విదేశీ భాషల్లోకి అనువదింప బడింది .

గుణాలకు ఆధ్యుడు అతిగొప్ప గ్రంధం బృహత్ కధను రాసి ఎందరికో ప్రేరణ నిచ్చాడు .జన సామాన్య భాషలో సామాన్య జనాలకు అర్ధమయ్యేట్లు రాసి వ్యావహారిక భాషోద్యమానికి ఆనాడే పునాది వేసిన మార్గ దర్శి గునాధ్యుడు .

Inline image 1

మళ్ళీ మరోకవితో

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ – స్వగ్రామం నందమూరులో విశ్వనాధ 38 వ వర్ధంతి సభ

విశ్వనాధ   – స్వగ్రామం నందమూరులో విశ్వనాధ 38 వ వర్ధంతి సభ38vishvanadha 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వణకవుల కవితా గీర్వాణం -23 21-ముకుందమాల రాజకవి –కులశేఖరాళ్వార్

గీర్వణకవుల కవితా గీర్వాణం -23

21-ముకుందమాల రాజకవి –కులశేఖరాళ్వార్

కేరళ రాజు  కులశేఖర వర్మ నే కులశేఖర ఆళ్వార్ అంటారు  .ఆయన రాసిన ‘’ముకుందమాల ‘’వైష్ణవ భక్తులకు నిత్య పారాయణం .కలియుగం ఆరంభమైన ఇరవై యేడు సంవత్సరాలకు ఆయన జన్మించాడని వైష్ణవ గ్రంధాలు తెలియ ఇస్తున్నాయి .క్రీ పూ 3075కాలం వాడుగా పరిగణిస్తారు .పునర్వసు నక్షత్రం లో జన్మించాడు .శ్రీహరి యొక్క కౌస్తుభాంశ లో జన్మించాడు .రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి సంపదలను ,వినోదాలను విసర్జించాడు .తమిళదేశం లోని పన్నెండుమంది అఝావర మునులలో ఏడవ వానిగా  భావిస్తారు .ఈ పన్నెండు మంది మునులు రాసిన మహా గ్రంధాన్ని ‘’నాలాయిర దివ్య ప్రబంధం ‘’అంటారు .నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలను దివ్య దేశం అంటారు .ముకుందమాల అనే స్తోత్ర గీతాలను సంస్కృతం లో రాశాడు కుల శేఖరుడు .భక్తీ జ్ఞానానికి పరాకాష్టగా నిలిచే పుస్తకం ఇది .తమిళం లో ‘’పెరుమాళ్ తిరుమోఘి ‘’రాశాడు .ఇది దివ్యప్రబంధం లో ఒక భాగం .సంస్కృతంలో కులశేఖరుడు ‘’తపతి సంవర్ణం ‘’,సుభద్రా ధననంజయం,’’విచ్చిన్నాభి షేకం ‘’రాశాడని తెలుస్తోంది .వైష్ణవ క్షేత్రాలలో ముకున్దమాలను సామూహికం గా గానం చేస్తారు .

కులశేఖరుడు కేరళలోని పెరియార్ లో అన్మించాడు .తండ్రి దృఢ వర్మ.ఆయన క్రీ .పూ 3102కలి యుగం ప్రారంభ మైన 27వ సంవత్సరం లో అవతరించాడని నమ్మకం .కనుక ఆయన జన్మించినది క్రీ పూ.3075అవుతుంది .కులశేఖరుడు కేరళ రాజు .కొల్లి ,ఊదార్ ,కొంగు అనే ప్రాంతాలను పాలించాడు వీటినే ఇప్పుడు ఉదైయూర్ మదురై ,ట్రావెంకూర్ అంటున్నారు .ఆధునిక చరిత్రకారులు ఆయన చేరరాజు అని కాలం క్రీ శ .800-820అంటున్నారు దీనినతో ఎవరూ ఏకీభవించటం లేదు .వైష్ణవ సంప్రదాయాన్ని పటిష్టం గా పాటించిన వేదాంత దేశిక మహా రాజు .దక్షిణ భారతం లో భక్తీ ఉద్యమ సారధిగా కీర్తిపొందాడు .సామాన్య ప్రజలకు భక్తిని అందించి తరిమ్పజేసిన పుణ్యాత్ముడు కుల శేఖరుడు .

కవితా గీర్వాణం

ఆళ్వార్ర్ దివ్య ప్రబంధం లో నాలుగు వేల శ్లోకాలు ఉంటె అందులో కులషేఖరునివి నూట అయిదున్నాయి .శ్రీరామ శ్రీకృష్ణుల పై చ సంస్కృతం లో చెప్పిన ముకుందమాల నలభై  శ్లోకాల రస గుళికలు కలిగిఉన్నది .అద్వైత మతస్తాపకుడు ఆది శంకరాచార్యులు కులశేఖరులకు సమకాలికులు. ఆయనకంటే చిన్న వారు .కులశేఖరులు మహా శ్రీరామ భక్తులు , రాముడు అనుభవించిన కష్టాలన్నీ తనకు ఆపాదిన్చుకొన్నాడు . ఆయన్నుఅందుకే  ‘’పెరుమాళ్ ‘’అంటారు .అంటే గొప్పవాడు అని అర్ధం .పెరుమాళ్ అనే పేరు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉందన్న సంగతిమనకు తెలుసు .విష్ణు భక్తులను సాక్షాత్తు విష్ణు మూర్తి స్వరూపం గా భావించి పూజించేవాడు కులశేఖరాల్వార్ .రామ ,కృష్ణ చరిత్రలను స్మరించుకొని తన్మయత్వం తో ఇద్దరినీ ఒకే శ్లోకం లో వర్ణించాడు .శ్రీ కృష్ణుని తల్లి దేవకిగా తనను భావించుకొని రచన చేశాడు కొన్ని శ్లోకాలలో .కుమారుడు కృష్ణుడు తనను వదిలి వ్రేపల్లెలో నంద యశోదల వద్ద పెరగటాన్ని దేవకీ భరించలేకపోయినట్లు ,ఎప్పుడు తన బాల కృష్ణుడు తన ముందు వచ్చి వాలుతాడా అని ఎదురు చూస్తున్నట్లూ రాశాడు .

శ్రీరంగం లో ఉండి శ్రీ రంగ నాద స్వామిని సేవించే వాడు కుల శేఖరుడు .శ్రీ వెంకటేశ్వరుడిని ఆయన ద్వారం వద్ద గడప గా పడి ఉండే భాగ్యాన్ని కలిగించమని వేడుకోన్నాడట .తధాస్తు అని వరమిచ్చాడు బాలాజీ .అందుకే తిరుమలలో గర్భ గుడి ద్వారానికి ఉన్న గడపను ‘’కులశేఖర పడి’’అంటారు .కుల శేఖరుడు రాసిన ‘’తిరు మొఘి ‘’లో ‘’గోవింద రాజ శ్రీపాద పద్మాలను తప్ప మరిదేనిని రాచరికం గా భావించను .’’అని చెప్పుకొన్న పరమ భక్తా గ్రేసరుడు .ఆయన ‘’గడప ప్రార్ధన’’ చూద్దాం –‘’శేదియాయ సేల్వినైగల్ ,తీర్కుం తిరుమాలే –నేదియానే వేంగడవా నిన్ కోయిల్ వాశేల్

అడియారుం వారరువం అరంబై యెరుం కిడందు ఇంగల్ –ప్పడియాయ్ కిడందు ఉన్ పవళ వాయ్ కాన్ బెనే’’  ‘’ అంటే ‘’వేంకటేశా !అనాదిగా ఆర్జించిన పాపాలను తొలగించేవాడివై ,తిరుమల లో వేంచేసి ఉండే నీ భక్తులు, దేవతలు కలిసి సంచరించేట్లు నీ దివ్య సన్నిధి వాకిలి లో అందరూ కాలితో తొక్కే గడప గా పడిఉండి,పగడం లాగా ఉండే నీ కిందిపెదవిని ఎప్పుడూ సేవించే భాగ్యాన్ని ప్రసాదించు ‘’.కులశేఖరుడు ప్రతి రోజు రామాయణాన్ని వింటూ ప్రవచనం చేస్తూ తన్మయత్వం చెంది భక్తులను తన్మయులను చేసేవాడు .

కులశేఖరుని ముకుందమాలలో మొదటి శ్లోకం –ఘుష్యతే యత్ర నగరే రంగ యాత్రా దినే దినే తమహం వందే రాజానం కుల శేఖరం ‘’అని చెప్పుకొన్నాడు .పరమాత్మను గురించి చెబుతూ ‘’హరి సరస్సవి గాహ్య ఆపీయ తేజో జలౌఘం –భవ మరు పరిఖిన్నః ఖేదమద్యచ్చజామి ‘’’భావం –‘’హరి అనే దివ్య సరస్సు సంసార తాపాన్ని తొలగిస్తుంది .తాపం తగ్గించుకోవటానికి మనమే అందులో మునగాలి. వీరు వారు అనే భేదం అక్కర్లేదు .ఉన్నది అదొక్కటే సరస్సు .మునిగి పాప ప్రక్షాళనం చేసుకోవాలి .’’నాలుకా !ఇది వరకు ఎన్నో రుచులు చూశావు .ఇప్పుడు శ్రీకృష్ణ నామ రుచి చూడు .దానికి మించిన మాధుర్యం ఉండదు .నువ్వు నన్ను అడగాల్సినది పోయి నేనే నిన్ను అడగాల్సి వస్తోందం’’టారు ‘’మరో శ్లోకం లో .

విష్ణు భక్తులపై కులశేఖర మహారాజుకున్న విశ్వాసాన్ని తెలియ జెప్పే కద ఒకటి ఉంది .విష్ణువును ,విష్ణు భక్తులను సేవించటం కులశేఖరులకు నిత్య విధి .వారికి అందుబాటులో అన్నీ ఉంచేవాడు .ఒకసారి విష్ణు భక్తులు అంతఃపురానికి వస్తారు .వారిని సేవించేందుకు కులశేఖరుడు వచ్చాడు .ఈ విష్ణు భక్తుల బాధ తప్పించాలని అనుకోని కాపలా అధికారులు అక్కడ పెట్టిఉన్న విలువైన ఆభరణాలను తీసి దాచేసి రాజుకు వైష్ణవ భక్తులే కాజేశారని ఫిర్యాదు చేస్తారు .ఆయనకు భక్తులపై అచంచలవిశ్వాసం, నమ్మకం ఉన్నాయి వారీపని చెసిఉండరని  భావించాడు .ఏమైనా నిజం తేల్చాలికనుక ఒక గంగాళం తెప్పించి అందులో కాల నాగుల్ని వేయించి దానిలో తన ఉంగరాన్ని జార విడుస్తాడు .అందులో పడేసిన తన ఉంగరాన్ని చేతులు పెట్టి తీసీవ్వమని తన పర్య వేక్షకులను ఆదేశిస్తాడు .వాళ్ళు భయపడి చేయిపెట్టలేదు .అప్పుడు రాజు విష్ణు భక్తులకు విష్ణువుపై భక్తీ విశ్వాసాలుంటే విష జంతువు లు కూడా ఏమీ చేయలేవని హరినామం చేస్తూ తానే మిన్నాగుల మధ్య  చెయ్యిపెట్టి తన ఉంగరాన్ని తీస్తాడు .అధికారుల మొహాలు మాడి నిజం చెప్పేస్తారు .తప్పు ఒప్పుకొని క్షమించమని వేడుకొన్నారు. అదీ కుల శేఖరాల్వారులకు విష్ణు భక్తీ , భక్తులపై ఉన్న నమ్మకం .

ముకుందమాలలోని మరిన్ని భక్తీ స్తోత్రాలు చూద్దాం –

‘’జయతు జయతు దేవో దేవకీ నందనోయం –జయతు  జయతు కృష్ణో వృష్ణి వంశః ప్రదీపః

జయతు జయతు  మేఘశ్యామో కొమలాన్గః –జయతు జయతు పృధ్వీ భారనాశో ముకున్దః ‘’

‘’కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతమ్-అద్వైవ మే విశతు మానస రాజ హంసః

ప్రాణ ప్రయాణ సమయే కఫా వాత పిత్తౌ-కంఠావ రోదన విధౌ స్మరణం కుతస్తే ‘’

‘’హే గోపాలక హే కృపాజలనిదే హే సింధు కన్యాపతే –హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే మాధవ

హే రామానుజ హే జగత్రయ గురో హే పున్దరీక్ష మాం –హే గోపీ జననాధ పాలయ పరం జానామి నత్వాం వినా ‘’-

‘’నమామి నారాయణ పాద పంకజం –కరోమి నారాయణ పూజనం సదా

వదామి నారాయణ నామ నిర్మలం –స్మరామి నారాయణ తత్వ మవ్యయం ‘’

‘’యస్య ప్రియౌ శ్రతి ధరౌ కవిలోక వీరౌ –మిత్రే ద్విజన్మ పదపద్మ శరావ భూతాం

తేనామ్బుజాక్ష చరణాంబుజ ష ట్ పదేన  -రాజ్నాకృతా కృతి రియం కుల శేఖరేణ’’

మరోకవి పరిచయం లో కలుద్దాం

Kulasekhara Alwar.png

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొమరం భీమ స్పూర్తి

ఆదిలాబాద్‌ జిల్లా జోడెఘాట్‌… 1940 సెప్టెంబర్‌ 1వ తేదీ. ఆదివాసీల పోరాట యోధుడు తలదాచుకున్నాడని నిజాం సైనికులకు సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకుని తుపాకులు ఎక్కుపెట్టారు. అయినా ‘భీం’ జంకలేదు. కొండగుట్టల్లో నుంచే సైనికులపైకి పదునైన బాణాలు వదిలాడు. ఆఖరికి ఆ పోరాటంలో సైనికుల కాల్పుల్లో కొమురంభీంతో పాటు పదిహేను మంది అనుచరులు నేలకొరిగారు. ఆదివాసీల జల్‌, జమీన్‌, జంగిల్‌పై హక్కుల కోసం అలుపెరుగని పోరు తలపెట్టిన వీరుడు అసువులుబాశాడు. అప్పటి నుంచి తెలంగాణ ప్రాంతానికే కాకుండా తెలుగు ప్రజలందరిలోను పోరాట స్ఫూర్తి నింపారు భీం.. సిర్పూర్‌ (యు)లోని పంగిడి, దోబిలా గ్రామాల్లో ఆయన మనుమళ్లు సోనేరావు, మాధవరావు ఉన్నారు. నేడు కొమురం భీం వర్థంతి సందర్భంగా సోనేరావుతో మాట్లాడింది ‘నవ్య’.

‘‘నేను కొమురం భీం వారసుడిని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. భీం కొడుకు మాధవరావు, ఆయన కొడుకును నేను. మా తమ్ముడి పేరు కూడా మాధవరావే. భీం పోరాట యోధుడని చెప్పడమేకాని 73 ఏళ్ల నుంచి మమ్మల్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఆయన వర్ధంతి వచ్చినా మేము ఏమీ కోరకుండానే.. అదిగో అవి చేస్తాం, ఇవి చేస్తాం అని హడావిడి తప్ప.. ఆఖరికి చేసింది ఏమీ లేదు. కనీసం ఇప్పటి వరకు ప్రభుత్వ భూమి కూడా ఇవ్వలేదు. ఉద్యోగాలు లేవు. సొంత ఇళ్లు లేవు. మా బతుకులు చాలా దారుణంగా ఉన్నాయి. నా బిడ్డ వరలక్ష్మి ఇంటర్‌ చదువుతోంది. నా కొడుకు మాధవరావు టీటీసీ చేసిండు. వీళ్లిద్దరికి గవర్నమెంట్‌ ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరినం. ఆయన సరే అన్నరు. వ్యవసాయానికి భూమి అడుగుతున్నం. అప్పుడెప్పుడో మా నాన్న భూమి 2 ఎకరాల 8 గుంటలు ఉంటే వ్యవసాయం చేసుకుంటున్నం. మా కుటుంబంతో సహా మేమంతా 60 మంది దాకా ఉంటాం. అందరం పేదరికంలోనే ఉన్నాం. మా సోదరి సోంబాయి జోడెఘాట్‌లో ఉంటోంది. కొమురం భీం ఏం కోరుకున్నారు? గిరిజనుల హక్కులు కోరుకున్నారు. భూమి మీద ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు.
భీం కోరిక నెరవేరేనా?
ఇన్ని సంవత్సరాలకు మా తాత కొమురం భీం కోరిక నెరవేరేటట్టున్నది. మా భూమిలో మా రాజ్యం ఏర్పడేటట్టున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 8వ తారీఖు జోడెఘాట్‌కు రావడం సంతోషంగా ఉన్నది. సీఎంకు ధన్యవాదాలు. గిరిజన యూనివర్శిటీ ఇస్తరట. మ్యూజియం, పెద్ద పార్కు పెడ్తమన్నరు. పర్యాటక
కేంద్రం చేస్తమన్నరు. మా ఆదివాసీల బతుకులు బాగు చేస్తమన్నరు. మాకు భూములిస్తమన్నరు. ఇంతకంటే ఎక్కువేం గావాలే. మా తాత కోరింది గూడ ఇదే. మా భూమి మాకు, మా అడవి మీద మాకు హక్కు కల్పిస్తరని నమ్ముతున్నం. మా తాత భూమికే పట్టాలేదట. మాకెక్కడ నుంచి వస్తది. ఆ పట్టాల కోసమే మా ఆదివాసీలు పోరాడుతున్నరు. జల్‌, జమీన్‌, జంగల్‌ కోసం మా తాత పోరాడి నేలకొరిగిండు. ఇంతకుముందు లీడర్లు ఐదెకరాల చొప్పున మాకు భూమి ఇస్తమన్నరు. ఇంకా చాలా హామీలిచ్చిండ్రు. ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇప్పుడు అమలు అయితయని కేసీఆర్‌ నమ్మకం బుట్టించిండు. తెలంగాణ వస్తే కచ్చితంగా ఆదివాసీల జీవితాలు బాగుపడతయని ఆయన 2007లో ఒకసారి జోడెఘాట్‌కు వచ్చినప్పుడు చెప్పిండు. మేమందరం కుటుంబ సభ్యులమంతా కలిసి జోడెఘాట్‌కు పోతున్నాం. జోడెఘాట్‌ వద్ద సీఎంను కలుస్తాం. మా తాత కలలు 73 ఏండ్ల తర్వాత నెరవేరుతున్నయనే సంతోషం చాలా ఉన్నది. ఆదివాసీలను కాపాడుకోవడమన్నది ప్రభుత్వ బాధ్యత. ఇక్కడి చెట్టును, పుట్టను నమ్ముకుని బతికే గరీబోళ్లం. అదే లేకుంటే మా బతుకులు ఎట్ల ఉంటయి. జ్వరాలొచ్చి చాలా మంది చచ్చిపోతున్నరు, తిండి లేక రక్తం ఉండటంలేదు. ఇటువంటి చాలా విషయాలున్నయి.

నిజాం సైన్యంపై తిరుగుబాటు..

1935 ప్రాంతంలో దేశాన్ని బ్రిటిష్‌వారు, రాషా్ట్రన్ని నిజాం నవాబులు పాలిస్తున్న రోజులవి. అడవే జీవనాధారంగా ఉన్న గిరిజనులు బుక్కెడు బువ్వకోసం పడరాని పాట్లు పడుతుండే వారు. అటవీ ఉత్పత్తులు ఉంటేనే పొట్టనిండే పరిస్థితి. సొంతగా భూమిని కలిగి ఉంటే వ్యవసాయం చేసుకుని ఆహారధాన్యాలు ఉత్పత్తి చేసుకోవచ్చని గిరిజనులు భావించేవారు. అందుకోసం పోడు వ్యవసాయంపై దృష్టి సారించారు. కానీ వారి చర్యలను నిజాం సర్కారు గాని, స్థానికంగా ఉన్న జాగిర్దారులు గాని సహించలేదు. పోడు భూముల నుంచి వారిని తరిమివేసేవారు. దళారులు, అటవీ అధికారులు, నిజాం నవాబుల సైన్యం చేతిలో అడవి బిడ్డల బతుకులు దోపిడీ, పీడనకు గురి అయ్యాయి. ఈ తరుణంలో అడవి బిడ్డలకు బాసటగా నిలిచి వారిని సంఘటితం చేసి నిజాం సైన్యంపై తిరుగుబాటు చేసినవాడు కొమురం భీం. గిరిజనుల కోసం పోరాటం చేసి నిజాం సైన్యం చేతిలో 1940 సంవత్సరం అశ్వయుజ పౌర్ణమి రోజు వీరమరణం పొందాడాయన.

-ఎండీ. మునీర్‌, మంచిర్యాల

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment