గీర్వాణ కవుల కవితా గీర్వాణం -29

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -29

27-కుందమాల నాటక రచయిత దిజ్నాగుడు

కుందమాల(జాతిమల్లె పూదండ) అనే నాటకాన్ని రచించిన దిజ్ఞాగ కవి క్రీ శ .1100వాడు .బౌద్ధ దార్శనికుడైన ఇంకొక దిగ్నాగుడు ఉన్నాడు వీరిద్దరూ వేరే అని గ్రహించాలి  ఉత్తర  రామాయణ కధను తీసుకొని భవ భూతి లాగా అనేకానేక మార్పులు చేసి ముకుందమాల నాటకం రాశాడు  .సీతా పరిత్యాగం తో నాటకం మొదలౌతుంది .మళ్ళీజానకీరాముల సమాగమం తో నాటకం పరిపూర్తి అవుతుంది .భవ భూతి చాయలు ఎక్కువ గా కనిపిస్తాయి .ఆయన లాగానే కరుణ రస పోషకం గా ముకున్దమాలను తీర్చి దిద్దాడు .

దిజ్ఞాగుని కవితా విశేషాలు

ఆరు  అంకాలున్ననాటకం ముకుందమాల .రాముడు సీతాప వాద వార్త విని లక్ష్మణుడిని గర్భిణిఅయిన  సీతను అరణ్యం లో గంగా నది ఒడ్డున విడిచి పెట్టి రమ్మంటాడు .అక్కడ మహర్షి వాల్మీకి ఆమెను చూసి తన ఆశ్రమానికి తీసుకు వెడతాడు .కుశలవులను సీత ప్రసవిస్తుంది .మహర్షి వారికి రామకధను గాన రూపం లో నేర్పిస్తాడు .రాముడు అశ్వమేధ యాగం చేస్తూ వాల్మీకి మహర్షిని ఆహ్వానించటానికి ఇక్కడికి వస్తాడు .అప్పుడు రాముడు గోమతీ నదిలో కొట్టుకు పోతున్న ‘’కుంద మాల ‘’పుష్పహారాన్ని చూస్తాడు .అది సీత కట్టే మాల లాగా ఉందనిప్పిస్తుంది .సీతా వియోగం తో దుఖం పెల్లుబికి వస్తుంది .చాటుగా ఉన్న సీతకూడా   భర్త దుఖాన్ని చూసి కరిగిపోతుంది .ఇద్దరి మనోబాదను కవి చాలా కరుణరసాత్మకం గా చిత్రించాడు .ఇంతలో కుశలవులు రామాయణ గానం చేస్తూ అక్కడికి చేరుకొంటారు .సీతారామ  లవ కుశ సమాగమం తో నాటకం పూర్తి అవుతుంది .

కవి గొప్ప నాటకీయతను ప్రవేశ పెట్టి ప్రతి అంకాన్ని రసభరితం చేశాడు భవభూతి లాగేనే .కవిత్వమూ సులభ బోధకం గా ఉండి మనసుకు హత్తుకుంటుంది ..భవ భూతిని అనుకరించినా తన ప్రత్యేకతలను కొన్ని కొన్ని సందర్భాలలో చాటుకొన్నాడు .విశ్వనాధ సత్యనారాయణ గారు తన రామాయణ కల్ప వృక్షం  అవతారికలో ‘’భాస కాళిదాస భవ భూతి దిజ్ఞాగులకు ,ప్రశస్త వాగ్విలక్షణుడు మురారి భట్టునకును ,రామ కదా భాష్య కారులకును మోడ్పు కై ఘటించి ‘’అని ప్రస్తుతించారు .అందులో దిజ్ఞాగునికీ స్థానం లభించింది .కుందమాలను మాన వల్లి రామ క్రిష్నయ్య పంతులు గారు తెలుగులోకి అనువదించారు .దిజ్నాగుడు ఆంధ్రుడే అని ఆచార్య తిరుమల రామ చంద్ర రాశారు .తక్షశిల విశ్వ విద్యాలయం లో దిజ్నాగుడు తర్కాన్ని బోధించే ఉపన్యాసకుడుగా ఉన్నాడు .ఇతని గురువు భగంత వసు బంధువు కూడా కవే .కాళిదాసు మేఘ సందేశం లో దిజ్ఞాగుని గురించి ప్రస్తావించాడు .ఈయనకు మరోపేరు భదంత దీర నాధుడు .

బౌద్ధదార్శనికుడు – దిజ్నాగుడు

బౌద్ధ దార్శనికుడైన దిజ్నాగుడు తెలంగాణా లోని కరీం నగర్ జిల్లా కోటిపల్లి గ్రామ నివాసి .ఈయన జీవితం లో చివరికాలాన్ని వేంగిలో గడిపాడని తెలుస్తోంది . ఇది చూస్తె ఇద్దరూ ఒకరేనేమో అని అనుమానం రావటం ఖాయమే .చరిత్ర తేల్చాల్సినవిషయమే . ప్రమాణ సముచ్చయ పరీక్ష ,హేతు చక్ర డమరుకం ,న్యాయావయవం  మొదలైన తర్క శాస్త్ర గ్రంధాలు రాశాడు .వేంగిలో(తెలంగాణా) ఒక కొండమీద ఒంటరిగా ఉండి ప్రమాణ సముచ్చయం రాశాడు .అనుష్టుప్ ఛందస్సులో ఉన్న ఈగ్రంధం అలభ్యం టిబెట్ లిపిలో దొరికింది .ఇది ఆరుభాగాల రచన .వాత్సాయనుడు తన సూత్రాలను వాడుకోన్నాడని దిజ్నాగుడు చెప్పాడు .ప్రత్యక్ష ,అనుమాన మొదలైన ప్రమాణాలను విపులం గా ఇందులో చర్చించాడు .

న్యాయ ప్రవేశిక లేక న్యాయావయవం తర్క శాస్త్రం లో కరదీపిక. దీని సంస్కృత ప్రతికూడా దొరకలేదు .టిబెటన్ అనువాదమే ఆధారం .ఇది తర్కానికి ప్రవేశ ద్వారం అంటారు .సధర్మ విధర్మ హేతువు మొదలైన వాటిని వివరించే గ్రంధం .హేతు చక్ర డమరువు అసలు సంస్కృత ప్రతి కాల గర్భం లో కలిసిపోతే టిబెటన్ అనువాదమే ఆధారమైంది .ఆలంబన పరీక్షకు ఆలంబన పరీక్స్శా వృత్తిని దిజ్ఞాగుడు రాశాడు .త్రికాల పరీక్ష అనే మరో రచనా ఆయనదే .దిజ్ఞాగుని శిష్యుడు శంకర స్వామి అని చైనా అనువాదాల్లో కనిపిస్తుంది

 

.Inline image 1  Inline image 2

మరోకవి దర్శనం ఈ సారి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-14-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.