| పురాణాలు-నేడు ఎలా తెలుసుకోవాలి? | |
గతవారంలో దేవీ నవరాత్రులను వివరించే సందర్భంలో పురాణాల ప్రస్తావన వచ్చింది. వీటిగురించి మరికొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మహాభారతం మొదటి అధ్యాయంలో ‘ఇతిహాసాలు, పురాణాల ద్వారా వేదాన్ని వ్యాపింపజేయాలి’ అని వ్యాసుని మాట కనిపిస్తుంది. మన సంప్రదాయంలో ముఖ్యంగా పద్ధెనిమిది పురాణాలు ఉన్నాయని తెలిసిందే. అవి మన మూల గ్రంథాలైన ఉపనిషత్తుల్లో చెప్పిన సిద్ధాంతం నేపథ్యంలో ఆనాటి సామాన్య మానవుడికై వ్రాయబడ్డ పుస్తకాలు. వీటన్నింటినీ వ్యాసుడొక్కడే వ్రాసాడని కొందరు, అనేకులు వ్రాశారని మరికొందరి వాదన. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవుడి గూర్చి గొప్పగా చెప్పడం చూడగలం. వేదాంతం చదవనంతవరకూ పురాణకథల్ని అక్షర సత్యాలుగా భావిస్తాం లేదా అసత్యాలుగా కొట్టిపారేస్తాం. వేదాంతం కొంత చదివిన తర్వాత ప్రశ్నలు మొదలవుతాయి. విశ్వమంతా చైతన్యమనే మహాసముద్రంలో కనిపించే అల లాంటిది అన్నపుడు శ్రీదేవి ఎవరు, విష్ణువు ఎవరు, శివుడు ఎవరు, ఈ చైతన్య సాగరంలో వీరి స్థానమేమిటి, ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనే ప్రశ్నలు వస్తాయి. 21వ శతాబ్దంలో మనకెందుకీ పురాణాలు అని ప్రశ్నించవచ్చు. నిజమే. మనకు గొప్పగా అక్కరలేకపోవచ్చు. అభిరుచి ఉన్నవాళ్లు సంతోషంగా వాటిని చదివి కొన్ని మంచి విషయాలు గ్రహించవచ్చు లేదా మానవచ్చు. అయినా చాలా అనూహ్యంగా వీటిగూర్చి తెలుసుకోవాల్సిన సామాజిక అవసరం ఏర్పడింది.
అనేక పాశ్చాత్య విద్యాలయాల్లో comparative mythology అనే విభాగాన్ని కొత్తగా ప్రారంభించి వివిధ దేశాల్లోని పురాణ కథలపై పరిశోధనలు, రచనలు జరుపుతున్నారు. ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్న ఒక ప్రొఫెసర్ “The Origin of World Mythologies” అనే పుస్తకం వ్రాశారు. ప్రపంచంలో అందరూ మన పురాణాలు చదవడం సంతోషించదగిందే కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఈ రచయితలు చాలామంది పురాణాల నేపథ్యం, వాటి వెనుక ఉన్న తాత్విక సిద్ధాంతం పక్కన ఉంచి పురాణకథలను జాతుల మధ్య పోరాటంగా చెప్తున్నారు లేదా అశ్లీలమైన, అనాగరికమైన, హానికరమైన అర్థాల్ని చెప్తున్నారు. ఇది కొత్త విషయం కాదు. బ్రిటిష్ పాలన సమయంలోనే మ్యాక్స్ ముల్లర్ మొదలు చాలామంది రచయితలు చేసిన పనే. దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధాల్ని ఆర్యులు, ద్రావిడులు అనే రెండు జాతుల మధ్య జరిగిన యుద్ధాలు అని వ్యాఖ్యానించి దేశ ప్రజల్ని అనేక వర్గాలుగా విడగొట్టడంలో సాఫల్యం చెందారు. ఇదే వైఖరి ఇటీవల కాలంలో మరింత పెరగడం గమనించదగింది. ఉదాహరణకు Paul Courtright అనే అతను వినాయకుడిపై ఒక పుస్తకాన్నే వ్రాశాడు. ఇందులో కేవలం అశ్లీలతకే ప్రాధాన్యం. కోట్లాది ప్రజలు భక్తితో పూజించే వినాయకుడిని, పార్వతినీ, శివుడిని అశ్లీలంగా వ్యాఖ్యానించాడు. అలాగే సీత, హనుమంతులను గూర్చి జుగుప్సాకరంగా వ్రాశాడు. Wendy Doniger అనే రచయిత్రి ఇలాంటి వ్యాఖ్యల్నే చేసి పెద్ద పెద్ద పుస్తకాల్ని ప్రచురించింది. ఈవిడ వ్రాసిన ఒకానొక పుస్తకాన్ని ఇటీవల పెంగ్విన్ ప్రచురణకర్తలు వెనక్కి తీసుకోవడం కూడా పాఠకులు గమనించి ఉండవచ్చు. -డాక్టర్ కె. అరవిందరావు |
వీక్షకులు
- 1,181,778 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- నాకు అత్యంత ఇష్టమైన అతిథి(త్రివేణి)
- ప్రాచీన భారతదేశంలో ‘తటస్థత'(త్రివేణి)
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం.ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.261 వ భాగం.7.8.26.
- అమెరికన్ సాహిత్య పితామహుడుమార్క్ ట్వైన్ స్వీయ చరిత్ర -20(చివరిభాగం )
- (no title)
- లలిత లలితంగా సాగిన డా.లలితకుమారి పచ్చీస్ ‘’బాలకథలు ‘’
- ఆచార్య కోవెల సుప్రసన్న గారి సహృదయ చక్రం.8 వ భాగం.6.8.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య. 29 30 sarga
- మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం.38 వ భాగం.6.8.26.
- అమెరికన్ సాహిత్య పితామహుడు మార్క్ ట్వైన్ స్వీయ చరిత్ర -19
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,309)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
