జాతీయ కవి సార్వభౌమ, మా కొద్దీ తెల్ల దొరతనం గీత కర్త శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర 8 వ భాగం.15.9.23.

జాతీయ కవి సార్వభౌమ, మా కొద్దీ తెల్ల దొరతనం గీత కర్త శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర 8 వ భాగం.15.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

  సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 103 వ శతకం –రాజయోగి శతకం

  సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో

103 వ శతకం –రాజయోగి శతకం

కృష్ణా జిల్లా నూజివీడుకు చెందినశ్రీ కంతేటి వీరయ్యకవి ఈ రాజ యోగ శతకం రాశారు .రాజయోగులనుస్మరిస్తూ ఆట వెలదులలో రాసిన శతకం .దీనికి ముందు ఈ కవి ఆంజనేయ తారావళి ,హరినామ సుధాలహరి ,శ్రీమద్వయదోశషరహిత కన్దార్ధములు అనే నిజగురు పూజావిధానం ,మహాలక్ష్మమ్మ దండకం ,గజేంద్ర మోక్షరగడ రాసినట్లు ,ముద్రణలో నలోపాఖ్యాన రగడ ,మహాద్వైత భ్రమ నిరసనం ఉన్నట్లు  చెప్పుకొన్నారు .’’రమ్యముగ దెల్పెదను విను రాజయోగి ‘’అనేది మకుటం .

 మొదటి పద్యం –‘’శ్రీకరంబగు విజ్ఞాన సిద్ధికొరకు –సద్గురుస్వామి చరణా౦బుజముల దలచి –హరిహర హిరణ్యగర్భుల కాత్మ మ్రొక్కి –రమ్యముగ జెప్పెదను విను రాజయోగి ‘’.తర్వాత గురువే హరి బ్రహ్మ రుద్రుడు పరమాత్మ అని ,పరము పొందాలంటే గురు చరణాలు శరణ్యా లు అని చెప్పారు తర్వాత అంతా నీతులే బోధించారు .పిండమెరిగిన యోగి సద్విమలయోగి అండమెరిగిన యోగి శివుడే అన్నారు .పవనాన్ని అభ్యాసం చేస్తే మనసు నిర్మలమౌతుంది .జీవ శివులను కూరిస్తే ముక్తి .అస్టమదాలు భ్రస్టుల్ని చేస్తాయి .సాధన లేకపోతె తత్వార్ధ చింతన సాగదుడ .ఎరుకతో లోకాలన్నీ దర్శించవచ్చు .తత్వమసి మొదలైన మహా వాక్యాలు తరచి ప్రజ్ఞతో పరమపదం తెలుసుకోవాలి .పాలలో నీరుపోస్తే పాలు అవుతాయికాని పాలు మాత్రం నీరుకానేకాదు  .

  పరం అందుకోవటానికి రాజయోగం రాజమార్గం .దైవభావనకు హీనజన్మకు కర్మ కారణం .మాయతెలిస్తే అదే మాయమైపోతుంది .108 వా పద్యంలో ‘’మేటి తిరుమణి శెట్టి శ్రీ కోటయార్యు –కరుణ కంతేటి వీరయాఖ్య కవి సూరి –జనులకానంద సుధలొల్కగను రచించె –రమ్యముగ దెల్పెదను విను రాజయోగి ‘’అని ముగించారు .గద్యంలో –ఇదిశ్రీసీతారామ చంద్ర ప్రసాద లబ్ధ కవితా ధురీణ బాలకాన్వాయ సంజాత కంటేత్యుపనాయక లక్ష్మణాఖ్య పౌత్ర లక్ష్మీదేవి రామయాభిదాన గర్భ పయః పారావార రాకాసుధాకర సకల సుకవి సాధు జన విధేయ వీరయాభి ధేయ ప్రణీతంబైన శ్రీ రాజయోగి శతకం సర్వముసంపూర్ణము. శ్రీ కోటేశ్వరార్పణ మస్తు అని పూర్తి చేశారు .తతేలికపదాలతో గర్భితమైన రాజయోగాన్ని అందంగా ఆటవెలదులతో ఆడుకొంటూ కూర్చిన శతకం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-15-9-23-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

రజని రోబో సైలెంట్ కిల్లర్ –జైలర్

సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ సినిమా ‘’జైలర్ ‘’ను మొన్నరాత్రి మా మనవడు చరణ్ మద్రాస్ నుంచి ఫోన్ లొ ‘’తాతా !ప్రైం లొ జైలర్ ఉంది చూడు బాగుంది ‘’అని చెబితే ,నిన్న చూశాను .పాపం ఆవయసులో వంగాలేకా నడవలేక  గెంతలేక ఒక చిరునవ్వుతో సినిమాను రోబో నడిపినట్లు నడిపాడు రజని .ప్లాట్ మామూలే .అయితే అతన్నిఎలివేట్ చేసిన విధానం సూపర్ .ఈ క్రెడిట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కకే దక్కుతుంది .అనిరుథ్ రవి చందర్ సంగీతం అందించాడట .అసలు పాటలున్నాయా లేదా అని పించి౦దినాకుమాత్రం .సినిమాటోగ్రఫీ విజయ్ కార్తిక్ కన్నన్  విజయమే సినిమా విజయం .కామెడి నటుడు సునీల్ ,అరవనటుడు మోహన్ లాల్,తమన్నా పీలికల డ్రెస్ తో చేసిన  గెంతుల్లాంటి డాన్స్ ,నాగబాబు ల పాత్ర  వెగటు పుట్టిస్తుంది .వాళ్ళ సన్ని  వేశాలు తీసేసి ఉంటే ఒక అర గంట సినిమా నిడివి తగ్గి మరింత కాంపాక్ట్ గా ఉండేదేమో .రజని సినిమాలలో ప్రత్యర్ధి పాత్ర పోషించే రమ్యకృష్ణ  సైలెంట్ గా  భర్త విధేయురాలిగా ,’’డూడూ బసవమ్మ’’లా  తలాడించి నటించింది .సినిమాలో నటనలో హైలైట్ అయిన వాడు మాత్రం విలన్ వర్మగా నటించిన వినాయకన్ .ఏ యాంగిల్ లొ చూసినా సుపర్బ్ పెర్ఫార్మెన్స్ అతడిది .రజని మనవడు రుత్విక్ గా తాతను ‘’ముత్తూ’’అని పిలుస్తూ ముద్దుముద్దు మాటలతో మురిపించాడు .తీహార్ జైలు జైలర్ గా రజని అటూ ఇటూ చక్కర్లు చేస్తూ  చేతి టెలిఫోన్ ద్వారానే పనులన్నీ చక్కబెడుతూ మట్టుపెట్టాల్సిన వారిని మట్టుపెడ్డుతూ రోబో లా అన్నీ చేసేస్తాడు .అలాగే రజని ఇంట్లోకి వచ్చిన వర్మ అనుచరుల్నీ అలాగే సైలెంట్ కిల్లర్ లా చంపి పారేయిస్తాడు .అంతే చేతికి మట్టి అంటకుండా ,ఇన్ షర్ట్ నలక్కుండా ,చిరునవ్వు చెదరకుండా చి౦పేశాడు .డైలాగ్ డేలివరిలో’’ మనో ‘’ అనే మన గాయకుడు నాగూర్ బాబు అనే నాగూర్ సాహిల్ రజని జీవించాడు .ఈ క్రెడిట్ అంతా మనోకే దక్కింది . వర్మ బందీ నుంచి విడుదలయిన  రజనికొడుకు అర్జున్  ఇంటికి వస్తే ‘’నాకేమైనా చెప్పాలా ?’’అని రెండుమూడు సార్లుఅదగతం లేదని అతడు అనటం ‘’ఎందుకైనా మంచిది ఈ పిస్టల్ ఉంచు ‘’అని రజని ఇవ్వటం ,చివరి సీన్ లొ వాడు తండ్రినే చంపే స్థితిలోకి రాగా వాడి చేతిలోని గన్  రికాయిల్ అయి వాడినే చంపేయటం మాత్రం బాగా తీశాడు డైరెట్రు .దాదాపు మూడు వందలకోట్లు ఖర్చు పెట్టి చేసిన ఈ సినిమా ఆరువందలకోట్లకు పైగా వసూలు చేసిందట .చూస్తున్నంత సేపు సినిమా బాగానే ఉంది.ఇదంతా రజని మహాత్మ్యమే .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-9-23-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

సాంగ. వేదార్ధ వాచస్పతి, పద్మభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వేద సార రత్నావళి.21 వ భాగం.15.9.23.

సాంగ. వేదార్ధ వాచస్పతి, పద్మభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వేద సార రత్నావళి.21 వ భాగం.15.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.39 వ భాగం.15.9.23.

శ్రీ హర్ష నైషధం.39 వ భాగం.15.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.9 వ భాగం.9.6.23.

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.9 వ భాగం.9.6.23.

Posted in రచనలు | Leave a comment

సాంగ వేదర్థ వాచస్పతి పద్మ భూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వేద సార రత్నా వలి.8 వ భాగం.31.8.23.

సాంగ వేదర్థ వాచస్పతి పద్మ భూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వేద సార రత్నా వలి.8 వ భాగం.31.8.23.

Posted in రచనలు | Leave a comment

జాతీయ కవి , మా కొద్దీ తెల్ల దొరతనం గీత కర్త శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర.1 వభాగం.8.9.23.

జాతీయ కవి , మా కొద్దీ తెల్ల దొరతనం గీత కర్త శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర.1 వభాగం.8.9.23.

Posted in రచనలు | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం20. వ భాగం.4.9.23.

ప్రపంచ దేశాల సారస్వతం20. వ భాగం.4.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 101వ శతకం –రాఘవేశ్వర శతకం

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో

101వ శతకం –రాఘవేశ్వర శతకం

బాలకవి ,తగరంపూడి వాసి సామవేదుల వేంకట శాస్త్రి రచించిన రాఘవేశ్వర శతకం ఖాసీం కోటకు చెందినఉభయభాషాప్రవీణ అష్టావధాని  శ్రీ వడ్డాది సీతారామాంజనేయులు పరిశోధీంచగా ,అనకాపల్లి బలరామ కృష్ణా ముద్రణాలయం లొ 1937లొ ముద్రితం వెల –రెండు అణాలు .అనకాపల్లి కి చెందిన సత్యావాణి సంపాదకులు శ్రీ గ్రంధి వెంకటరమణయ్య తొలిపలుకులు పలుకుతూ ‘’ఉత్సాహం ఉన్నవిద్యార్ధి  ఈ బాలకవి తెలుగుపై మక్కువతో రాసిన శతకం .శైలి సులభం .అర్ధం మాత్రం గాంభీర్యం ‘’అని మెచ్చారు .ఇది ఉత్పల ,చంకలాలతో కూర్చిన శతకం.’’రాఘవేశ్వరా ‘’అనేది శతక మకుటం .

  మొదటి ఉత్పలమాలలో –‘’శ్రీ జనకాత్మజా హృదయ సింధు సుధాకర రామచంద్ర ,ని-ర్వ్యాజ కృపా కటాక్ష పరిపాలిత సంశ్రితలోలక వి-భ్రాజిత రావణాద్యసుర వారవినాశక మౌనిమానసా౦-భోజనివాస వాసవ విభిత్వ సముజ్జ్వల ‘’రాఘవేశ్వరా ‘’అని నమస్సులు పలికి ,పూర్వం వాల్మీకి మహర్షి నీ దివ్యగాధ గానం చేశాడు ,పోతరాజు మధుమదురంగా నీ లీలలు వర్ణించాడు ,తురుష్కకవి కబీరు ‘’వీడు నా వాడు  ‘’అని కీర్తించాడు ,గోపయ్య కబీరు చే రామ మంత్రోపదేశం పొంది భక్తరామదాసయ్యాడు,హనుమాన్ నీనామ గానం చేసి పరవశం కలిగించాడు .తులసీదాసు పురాణంగా నిన్ను గురించి రాసి పునీతుడయ్యాడు  .కాకరపర్తి వాసి వేదుల రామ శాస్త్రి భక్తితో  రచనలు చేశాడు .వేద సంతలు వ్యాకరణ పాండిత్యం తర్కచర్చలతో  ఫలితంలేదు నిన్నువర్నించి నీ గురించి చదివి వినకపోతే .

  శ్రీ రఘురామ అని చిత్తం లొ తలపోస్తే యముడు భయపడుతాడు .యోగి హృదయాలలో నిరంతర వాసం చేస్తావు .’’నీనామము అన్ని వేళల అడ్డూ ఆపులేకుండా భక్తజనం పలుకుతూ ఆనందాన్ని పొందాలి .లోకంలో ధర్మ సంస్థాపనకోసం రాఘవుడ వై జన్మించావు .కౌసల్యకు వీరమాత అనే యశస్సుకల్పించావు.గాధి సుతుడు చేసే యజ్ఞాన్ని రాక్షస విఘ్నం లేకుండా కాపాడి ప్రియ శిష్యుడవై అన్ని శస్త్రాస్త్రాలు పొందిన భాగ్యశాలివి .’’భీముని విల్లు త్రుంచి భూసుత మెడలో తాళిలికట్టావు .భరద్వాజ విందు పొంది  శుభం చేకూర్చావు .జటాయువుకు మోక్షప్రాప్తి కల్గిచావు .’’గబా గబచిన్ని రాఘవు లెకాయకి నన్ గనగా వచ్చు చుండి రంట’’అంటూ పట్టపగ్గాలులేని పరమభక్తితో ముసలి శబరి ‘’దబదబ తీపిపండ్లను ఏరి తెచ్చి సమర్పించి జన్మసార్ధకం చేసుకొన్నది .

  రామాయణ ఘట్టాలన్నీ సుందర కవితా బంధురంగా శతకం లొ పొందుపరచాడు మన బాలకవి అలనాటి లవకుశుల్లాగా .చివరలో తాను  వేదులపార్వతీశం వెంకట రట్నంల పెద్ద కుమారుడనని ,నీసేవ నిత్యం చేసే వెంకట శాస్త్రి ని అని ప్రవర చెప్పుకొన్నాడు ‘’జయజయ జానకీ హృదయ సారస పూషణ సాధుపోషణా’’అంటూ చంపకలో ,చివరగా ఉత్పలమాలలో ‘’మంగళమయ్య నీకు శుభ మంగళమయ్య మహీ తనూజకున్ ‘’అని మంగళం పాడి సమాప్తి చేశారు .

102- బలరామ శతకం

పూర్వకవి శ్రీ  సాతులూరి సుభద్రాచార్య విరచిత బలరామ శతకంను తణుకు బోర్డు ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ సాతులూరి వేంకట నరసింహా చార్యులుగారు తణుకులో డివి శ్యామలరావు గారి శ్యామలా ఆర్ట్ ప్రేస్ లొ1931లొ ముద్రించారు .వెల-రెండు అణాలు .విజ్ఞప్తిలో నరసింహా చార్యులు గారు- ‘’  మా ప్రపితామహులు 1779లొ జన్మించి పోలవరం జమీందార్ శ్రీ కొచ్చెర్లకోట జగన్నాధరావు గారి ఆస్థానం లొ పండితులుగా ఉండి’’రమణక్క పేట ‘’అగ్రహారాన్ని గౌరవార్ధంగా పొందారు .వారు గారుడా శైలశతకం నృసిమ్హశతకం వైజంతీ స్తవం (సంస్కృతం ),ఎనుబది రెండు వార్తలుఅ నే పదహారు సీసపద్యాలు  రచించారు.ఈ సీసపద్యాలు నేను ముద్రించి ధన్యుడనయ్యాను .ఈ శతకాన్ని ముద్రించటానికి జమీందారుగారు, తణుకు తాలూకాబోర్డ్ ప్రెసిడెంట్ సారస్వతలోలురు శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు చౌదరిగార్లు ఆర్ధిక సాయ౦  అందించారు .అని కృతజ్ఞతలు ప్రకటించారు .కపిల మల్లెశ్వరానికి చెందిన శ్రీ వ. రాధా మనోహర శర్మ –‘’కవిగారు భక్తిరస ప్రాధాన్యంగా శయ్యాచాతుర్యంగా ని౦దాగర్భిత స్తవంగా అసమాన సాహిత్యగారిమగా ,పారవశ్యంగా రచించిన శతకం ఇది ‘’అని గొప్పగా చెప్పారు .ఇది సీస పద్య శతకం –‘’రేవతీకామ బలరామ రిపు విరామ ‘’శతకం మకుటం .

 మొదటి సీసం –‘’శ్రీకోరుకొండ నృసింహు ల సేవించి-భద్రాద్రిరాముల బ్రస్తుతించి –శ్రీరంగనాయక శ్రీపాదములకు మొక్కి –కంచి వరద రాజ కద దలంచి –రామానుజాచార్య రమ్యా౦ మ్ఘ్రులను బట్టి-భక్తి నడాధూరు  వరదుగొలిచి- సకల భగవాంఘ్రిసలిలంబు జేకొని –శ్రీ రామపాదాబ్జ సేవ జేసి

గీ-వీర శ్రు౦గార రసదధునీ విషాద సీస –పద్య శతకంబు నీపాద పద్మ మందు –జేర్చి పూజింతునన్ను రక్షిమ్పుమయ్య –రేవతీ కామ బలరామ రిపు విరామ ‘’అంటూ సకల విశ్వ క్షేత్ర దర్శనం చేయించారు .గౌతమ ,కయ్యట జైమిని కపిల మహర్షులను స్మరించి ,ప్రతివాది భీకర రాఘవ గురునికి మొక్కి ,ఆ గురు దేవుని వలననే తర్కవేదాన్తాది సర్వశాస్త్ర నిష్ణాతుడనయ్యానని ,గీర్వాణకవితా మనోహరత్వం అబ్బిన భారద్వాజ గోత్రీకుడను క్షేమ సుభద్రాచార్య నామ ధేయుడిని ,ఉత్ప్రేక్షాది అలంకారాలతో సీస పద్యశతకం కూరుస్తున్నాను అన్నారు .కామిన్యలంక్రియా కాలసుందర ,నిజముఖపద్మ దర్శన౦గా ఉండే నీ మోము చూచినకొద్దీ మనోహరం .’’మారు నల్లని గల్వకతారులంగా సోగలౌ నీ కన్గవసొగసు చూసి గోపకాంతలు నిన్ను గూడాలని చేరారు .

  స్వామి శరీరంలోని ప్రతి అంగాన్ని మహా కవిత్వ సౌందర్యంతో తనివి తీర వర్ణించి  శతక ప్రబంధమా అని పించారు కవీశ్వరులు .ధగధగాద్ధగిత దేహ ఛాయ గంగాప్రవాహమే. తళతళలాడే తరుణ వలులు విలసత్తరంగాలి. ఘర్మబిండువులు ముత్యాల సోంపు .నాభి గంగాయమునా సంగమమే .రమణీయ పీతాంబరం తమ్ముడికిచ్చి నువ్వుమాత్రం నీలామ్బరాలు కట్టావు .రధాలు తమ్ముడికిచ్చి నువ్వు నాగలిపట్టావు .ఖడ్గం తమ్ముడికిచ్చి రోకలి చేతబట్టావు .గోపికా బృందాన్ని తమ్మయ్యకిచ్చి నువ్వు ఏకపత్నీ వ్రతం దాల్చావు .దొరతనం భోగభాగ్యాలు కన్నయ్యకిచ్చి నువ్వు దేశాటనంతో తృప్తి పొందావు .

  కుబ్జ తమ్ముడి ఆధరం కోరిందికాని బలభద్రుని జోలికిరాలేదు .రేవతి ఎన్ని నోములు నోచి తపస్సు చేసిందో నిన్నుపెళ్ళాడటానికి .తమ్ముడు మాయలోడు .నువ్వు ముక్కు సూటి మనిషి పొగడ్తల అగడ్తలో పడి పోతావు కొంప కొల్లేరు అవుతే తమ్ముడే వచ్చి కాపాడాలి .ముస్టి కాసుర సంహారం నీ వల్లనే జరిగింది  .రోహిణికి పుట్టి జరాసంధుని మదం అణగించి ,రణరంగ కౌశలంతో దిక్కులు జయించావు .చివరి పద్యంలో గజేంద్ర మోక్షం కథ వివరించి ముగించారు .

 మనసుకు హృదయానికి బుద్ధికి విందు చేసే శతకరాజం ఇది .ఆచార్యుల వారి సర్వతోముఖ పాండిత్యానికి అశేష శాస్త్ర పరిచయానికి నిలువెత్తు దర్పణం .వారి కవితా మహత్తు తెలియజేయాలంటే ప్రతి పద్యమూ ఉదాహరించాల్సిందే .అద్భుతమైన  ప్రబంధ సమానమైన పద్య శతకం .కవి శ్రీ సుభద్రా చార్యుల గారికి మనస్పూర్తిగా వందన శతం అందజేస్తున్నాను .ఈ శతక పరిచయం నా అదృష్టం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-9-23-ఉయ్యూరు     —

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

సాంగ వే దా ర్థ వాచస్పతి, పద్మ భూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పు loori గణపతి శాస్త్రి గారి వేద సార రత్నావళి.20 వ భాగం.14.9.23.

సాంగ వే దా ర్థ వాచస్పతి, పద్మ భూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వేద సార రత్నావళి.20 వ భాగం.14.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.38 వ భాగం.14.9.23.

  ·

శ్రీ హర్ష నైషధం.38 వ భాగం.14.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం.19. వ భాగం.13.9.23.

ప్రపంచ దేశాల సారస్వతం.19. వ భాగం.13.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

జాతీయ కవి సార్వభౌమ మా కొద్దీ తెల్ల దొరతనం గేయ కర్త శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర.6 వ భాగం.13.9.23.

జాతీయ కవి సార్వభౌమ మా కొద్దీ తెల్ల దొరతనం గేయ కర్త శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర.6 వ భాగం.13.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 100 వ శతకం-శ్రీ వట్టి మాయ శతకం

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో

శత(100) శతకం

100 వ శతకం-శ్రీ వట్టి మాయ శతకం

గుంటూరు జిల్లా సంతగుడిపాటి పురవాసి శ్రీ గంగులనారాయణ రెడ్ది గారు రచించి ,శ్రీ గోపాలుని హనుమంతరాయ శాస్త్రి గారిచే పరిష్కరిమ్పజేసిన’’ శ్రీ వట్టి మాయ శతకం’’ కీశే శ్రీ గంగుల మల్లికార్జున రెడ్ది సతీమణి శ్రీమతి రామ లక్ష్మమ్మ గారి ద్రవ్య సహాయంతో నరసరావు పేట రాజ్యరమా ముద్రాక్షర శాలలో 1932లొ ముద్రింపబడింది .కవి గారి గురించి పీఠికలోవినుకొండతాలూకా ముప్పాళ్ళ గ్రామవాసి  హనుమంతరాయ శాస్త్రిగారు –‘’ఇది తత్వ శతకం .సంస్కృతంలో నిష్ణాతులైన వారికే రాయటం సాధ్యం .శాస్త్రవాసన కవితా వాసన లేని రెడ్డిగారు ధైర్యంతో రాసిన శతకం నన్ను పరిష్కరించమని కోరగా ఆపని చేశాను .ఆదరించండి ‘’అన్నారు .సంతగుడిపాడు కు చెందిన శ్రీ తోక చిచ్చు వెంకట అప్పలరాజు ‘’ఇందులో ప్రాస పద్యాలుకీర్తనలుగా మంగళహారతులుగా చదువుకోవటానికి వీలుగా ఉన్నాయిఅని కితాబిచ్చారు .అన్నవరం కు చెందిన శ్రీ వాలిచర్ల హనుమయ్య పద్యాలలో –‘’వట్టి మాయ శతకం కన్నా విన్నా కర్మజాలం వదలి మోక్షం కలుగుతుంది ‘’అని అభయమిచ్చారు .ఇది సీస పద్య శతకం .’’బట్టబయలోక్కటే తప్ప వట్టి మాయ ‘’అనేది శతక మకుటం.పుస్తకం వెల చెప్పలేదు బహుశా అమూల్యమేమో!

  మొదటి సీసంలో ‘’పలుకు పలికున తప్పు పట్టవద్దని ,అర్ధాన్ని మాత్రమె తెలుసుకోమని కోరారుకవి .తరువాత అంతా వేదాంతం నీతి నింపారు .జగతికి ఆధారం సత్యం జ్ఞానమే ధనం దయ చాలాఅవసరం ,ఓర్మి ఉత్తమ గుణం అన్నారు .శివుడు గొప్ప అని ఒకరంటే విష్ణువే గొప్ప అని వేరొకర౦ టారు .శక్తియే చిచ్చక్తి అంటారు కొందరు .దేవుడు ఎక్కాడా లేడు నీలోనే ఉన్నాడు .అన్నిమతాలు’’ సమ్మతి మంచిది’’ అన్నాయి .సత్తు నుంచి సృష్టి సాగింది అంటుంది ఒక ఉపనిషత్తు .అదికానిది వేరేదీ లేదు అంది మరొకఉపనిషత్తు .సృష్టికి మూలం సృష్టి అన్నది మరొకటి .చివరికి భగవంతుడు ఒక్కడే అన్నారు .

  ఆధార చక్రమైన గుదం లొ గణపతి ఉంటాడు స్వాధిస్టానంలో బ్రహ్మ ,మణిపూరకం లొ నారాయణుడు హృదయస్థానమైన అనాహతంలో ఈశ్వరుడు ఉంటారు .ఖేచరిని చూస్తె కేశవుడు కనిపిస్తాడు ,భూచరిని చూస్తె హరి ,శాంభవిని చూస్తేశంభుడు షణ్ముఖి చూస్తె ముక్తిదారి కనిపిస్తాయి .కంటిలో ఎర్రగా కనిపించేదే బ్రహ్మ .నల్లగ్రుడ్డు చుట్టూ విష్ణువు . వర్నాలన్నీ ఉమా నాధుడే ఎక్కడికో పోయి వెతకక్కర్లేదు .ఆకాశానికి వాయువు దానికి అగ్ని దానికి జలం ,దానికి భూమి ,దానికి కర్మేంద్రియాలు ,ఆదిలో జలాలకు కర్మేంద్రియాలు  ,అగ్నికి జ్ఞానేంద్రియాలుఉద్భవించాయి  అని అద్భుత వేదాన్తరహస్యం బట్టబయలు చేశారు చక్కని తేటతెలుగు మాటలలో .

   తర్వాత ఆడవారు మగవారు ఎలా మసలుకోవాలో చెప్పి చేయెత్తి దానం చేసినవారిదే బ్రతుకు సర్వం తానె అనే సమ బుద్ధి ఉన్నవాడిదే బ్రతుకు .కామాదులకు దూరంగా ఉన్నవాడిదే,సాదు సాంగత్యం ఉన్నవాడిదే ,పాపాలు చేయనివాడిదే  బ్రతుకుఅని బ్రతుకు సార్ధకత తెలియజేశారు .కనకం ఘనమైనది అనుకొంటే తప్పులో కాలేసినట్లే .కనపడిన రాయి దేవుడేకాదు.తర్వాత పిండం ఏర్పడటం వృద్ధి చెందటం వివరించారు .పుట్టటం ఏమిటి అనే మతి లేకుండా సంచరిస్తున్నారుజనం .భర్తయే దేవుడుఅనుకొంటే ఆనందం .ఆకాశ గంగను  భూమికి దింపిన భగీరధుడు ,పాకశత్రువు వచ్చి ప్రార్ధిస్తే ఆశ్వాన్నిచ్చిన దిలీపుడు ,ఉదయాద్రి అస్తాద్రి ఒక్కగట్టున ఉంచిన మాంధాత ,కొడుకు యవ్వనం తీసుకొన్న యయాతి ,ఏకాదశి వ్రతాన్ని పాటించిన మహానుభావుడు అంబరీషుడు కలకాలం బ్రతికి ఉన్నారా ?బతుకు శాశ్వత౦ కాదు .బతుకు సార్ధకం చేసుకోవాలి .వాడి సూది మొనపై ఉంచటం అసాధ్యం .నాది నీది అనే విషయం కానే కాదు .చివర 101వ సీసంలో –‘’కోట్లు సంపాదించి కొంప పెద్దగ జేసి మరలబోయేదడి దొర మంగళ౦బు  –మాటమాటకు నోకమాట ను గల్పించు మారాజ నీకిదే మంగళ౦బు  –పెంటి ,పోతువు గాక బెంటి పోతువునై మహిమ నేలేడిప్రభూ మంగళ౦బు  –కోటలగోటల గోనంకి వెలసిన మాయయ్య నీ కిదే మంగళ౦బు  –

మంచి సుఖ మిడు నీశ్వరా మంగళ౦బు  –మదిని దయజూడు పరమేశ మంగళంబు –మరచిపోజాల నినున్ స్వామి మంగళంబు-బట్టబయలోక్క తప్ప వట్టి మాట ‘’అని శతకం ముగించారు .

 వట్టి మాటల శతకం కాదు ఇది చాలా విలువైన గట్టిమాటల పునాదిపై నిర్మించబడిన శతకం .వీనుల విందుగా ,హృదయానికి పరమానందంగా  బుద్ధికి జీవనంగా సాగిన శతకం .సార్ధక శతకం .మనమేమిటో మనకు ఎరుక కలిగించిన జ్ఞాన శతకం .కవి నారాయణ రెడ్ది గారికి  శతాధిక అభినందన మందారాలు .’’శత శతకంగా’’ దీన్ని పరిచయం చేయటం నా భాగ్యం .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-9-23-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

సాంగ వే దా ర్థ వాచస్పతి పద్మ భూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పు లూరి ణపతి శాస్త్రి గారి వేద సార రత్నా వలి.19 వ భాగం.13.9.23

సాంగ వే దా ర్థ వాచస్పతి పద్మ భూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పు లూరి ణపతి శాస్త్రి గారి వేద సార రత్నా వలి.19 వ భాగం.13.9.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.37 వ భాగం.13.9.23.

శ్రీ హర్ష నైషధం.37 వ భాగం.13.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 99 వ శతకం-శ్రీ జనార్దన శతకం-2 వ భాగం (చివరిభాగం ).

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో

99 వ శతకం-శ్రీ జనార్దన శతకం-2 వ భాగం (చివరిభాగం ).

జనార్దన శతకకర్త శ్రీ బులుసు వెంకటరామమూర్తి శతకలో తనజన్మభూమి ‘’వీరబొబ్బిలి ‘’గురించి ఘనమైన సేసపద్యం రాసి ,తర్వాత తేట గీతిలో తన వంశం గురించి చెబుతూ ‘’తమదియాగాలు చేసి సోమయాజి లైన  బులుసు వంశమని,తను కవిగాయక విబుధనిలయమైన విజయనగర వాస్తవ్యుడనని,చెప్పి చంపలమాలలో శారదా,విఘ్నేశ్వర  స్తుతి చేసి ,గురు ప్రణామం చేసి ,కాళిదాసాది కవులప్రస్తుతి చేసి ,శతకం ముద్రించిన ఈదర వెంకటరావుగారికి కృతజ్ఞత చెప్పి రంగంలోకి దిగారు .

  మొదటి చంపకం లొ-‘’శ్రీ రమణీ మణీ విమల చిత్త నివాస ,వికర్మ దుష్క్రియా –వార నివాస ,సద్విషయ వర్గ విలాస ,మణీవికాస –వి-స్ఫార కృపాభి రక్షితనిజస్మరణ స్థితి దాస భవ్య శృ౦ –గార  గుణాభిలాష నను గావు ననంత కృపన్ జనార్దనా ‘అని మొక్కుకొన్నారు .తరణం పీడా సంహరణం ఆశ్రిత భరణం అయిన నీ స్మరణం భవ బంధ హరణం అన్నారు .కుచేలుని గజేంద్రుని కాచిన వేల్పు అని ,కురుక్షేత్రయుద్ధంలో పార్ధుని రధసారదివై ధర్మ రక్షణ చేశావు ,ద్రౌపదీ మాన సంరక్షణ చేసి సురవందితుడవయ్యావు .లలితకలావిలాస బహుకోమలకోమల కీర్తిశాలి వి. నీ విలాసమే సకల జగత్తు .’’గంగను తెచ్చి నీ పదపంకజమూలన్ కడగంగా కల్మష హీనమై వెలుగొంది ,పాలంగడుగంగ నిరంతర వాసం పాల సంద్రంలో ఉంటున్నావు .

  పదాలు తొట్రిలుతున్నాయి ప్రాయం చిన్నది .రవిరాహువులు సప్తమంలో శుక్రుడు ఉచ్చలో ధనుస్సులో శనిబుధ గురులు అష్టమం లొ ,తొమ్మిదిలో చంద్రుడు నీచం లొ ఉన్నప్పుడుతులాలగ్నం లొ  పుట్టాను.అని తన జ్యోతిష పాండిత్యాన్ని ప్రకటించారు వందనమార్యసననుత శుభస్థితి దాయక తార్ఖ్య వాహనా వందనం అని శరణు చెప్పారు నూరవ పద్యం లొ తనది గౌతమ గోత్రమని తప్పో ఒప్పో చంపక మాల శతకం కూర్చి నీకు సమర్పించాను గ్రహించి ముక్తినివ్వు .చివరి 101 పద్యం లొ’’మంగళమార్త రక్షక ,రమాధవ సజ్జనలోక సన్నుతా-మంగళమబ్జనాభ ,గుణ మండన ,,చారు కటాక్ష యుక్తి చే –మంగళ సౌఖ్య సంపదలమాకొనర్చి ,కృపాబ్ధినేలు మా-మంగళరీతి నభ్యుదయమార్గము జూపి కృపన్ జనార్దనా ‘’అని ముగించి గద్యంలో ‘’గౌతమస గోత్ర పవిత్ర బులుసు బుచ్చన్న పౌత్ర ,నరసింహశాస్త్రిపుత్ర ,లక్ష్మీ నరసా౦బా గర్భ ముక్తాఫల అస్టావధానాశుకవితావిలాస  వేంకట రామమూర్తి శర్మకృత జనార్దన శతకం ‘’అన్నారు .

  దారాశుద్ధికల కవిత్వం .పండిత విరాజితం .ఔచిత్య పోషణం .సకల రసాను సంధానంగా జనార్ధన శతకం పండించారు అష్టావధాని శ్రీ బులుసు వేంకట రామమూర్తికవి .  కవిత్వాన్ని గూర్చి మహామహులు చెప్పిన మాటలన్నీ తెలియజేశాను కనుక అంతకంటే ఎక్కువ చెప్పక్కరలేదు .

మీ-గబ్బితడుర్గాప్రసాద్ -13-9-23- ఉయ్యూరు         

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం.18. వ భాగం.12.9.23.

ప్రపంచ దేశాల సారస్వతం.18. వ భాగం.12.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

జాతీయ కవి సార్వభౌమ మా కొద్దీ తెల్ల దొరతనం గీత కర్త శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర.5 వా 12.9.23.భాగం.

జాతీయ కవి సార్వభౌమ మా కొద్దీ తెల్ల దొరతనం గీత కర్త శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర.5 వా 12.9.23.భాగం.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 99 వ శతకం-శ్రీ జనార్దన శతకం-1వ భాగం .

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో

99 వ శతకం-శ్రీ జనార్దన శతకం-1వ భాగం .

 విజయనగర అష్టావధాని శ్రీ బులుసు  వేంకటరామమూర్తి గారు రాసిన శ్రీ జనార్దన శతకం ఏలూరు శ్రీ ఆంజనేయ పవర్ ప్రెస్ లొ 1957లొ ముద్రించారు .వెల- అర్ధరూపాయి.తొలిపలుకు లలో కవి –‘’బాలుడిని కవితా ప్రతిభలేకపోయినా  ,శ్రీశారదాంబ వర ప్రసాదంతో ఈశతక రచన చేశాను .కవి శేఖర పండిత పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి శ్రీ చింతలపూడి సన్యాసి రావు ,శ్రీ ఆకుండి వెంకటశాస్త్రి మున్నగు పెద్దలు చేసిన ధనసాయం .ఏలూరు లొ వెంకటరామా అండ్ కో అధినేత ,రసజ్ఞులు  శ్రీఈదర వెంకటరామయ్య   గారు ముద్రణా వ్యయం భరించి  శతక ముద్రణ చేశారు .ఏలూరులో సాహితీ పెద్దలను పరిచయం చేసిన సాహిత్యమండలి అధ్యక్షులు డా.శంకర రామారావు  గారికి ,ముద్రణలోపాలు సరిచేసిన కవిమిత్రులు శ్రీ అద్దేపల్లి కుటుంబరావు గారికి కృతజ్ఞతలు ‘’అన్నారు .పరిచయ వాక్యాలు పలికిన కవితాభూషణ విద్వాన్ శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు –‘’కవి ఆశువుగా చెప్పినా, కవిత్వం ఆలోచనాత్మకంగా,లలితపద మంజులం గా  ఉంది’’అనగా విశ్రాంత కళాశాల ఆంధ్ర పండితులు విద్వత్కవి శ్రీ ఆకుండి వెంకట శాస్త్రి పద్యాలలో ఆశీస్సులు పలుకుతూ –‘’ కవి అమితప్రజ్ఞ చూపాడు .మృదుపాకం రుచిగా ఉంది బాలకవికి ఆశీస్సులు ‘’అనగా ,మహారాజ సంస్కృత కళాశాల ఆంధ్ర పండితులు సాహిత్య విద్యాప్రవీణ ,ఉభయ భాషా ప్రవీణ కవిశేఖర శ్రీ పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి పద్య ఆశీర్వాణి లొ ‘’జనుల నర్ది౦చుటను జనార్దన శతకం అయింది .గుణభావ రసప్రసస్తి తో రాశాడు’’అన్నారు .మహారాజ ఆంగ్ల కళాశాల విశ్రాంత పండితులు కవిశేఖర శ్రీ అడిద౦ రామారావు పంతులుగారు ‘’బాలకవి త్వరలో ప్రౌఢకవి ఆయె లక్షణాలున్నాయి .కవిసార్వభౌమ శ్రీ పాదకృష్ణమూర్తి శాస్త్రిగారి ఆశీస్సులు పుష్కలంగా అందుకొన్న బాలకవి ఇతడు .కౌముదీ పరిషత్ కార్యదర్శి కవితాకోవిద శ్రీ చింతలపూడి సన్యాసిరావు ‘’మనోజ్ఞ భావనా కలిత కవిత్వ మాధురి ఉన్న శతకం ‘’అన్నారు పద్యాలలో .పార్వతీపురం బోర్డ్ హై స్కూల్ బిఎడ్ ఉపాధ్యాయలు సాహిత్యకోవిద శ్రీ క్రొవ్విడి రామం –‘’వర్ధమానకవి ప్రసాద గుణ భరితంగా రాసిన శతకం .విజయనగరం B.P.M.M.హైస్కూల్ సంస్కృత పండితులు కవిభూషణ ,,పౌరాణిక కోకిల ,కాలక్షేప కంఠీరవ భాషాప్రవీణ ,శిరోమణి శ్రీమాన్ అద్దంకి వేంకట రంగాచార్యులు –జాతిరత్నాలలాంటి చ౦పకాదులతో ,బహుళార్ధ పటిమతో ,భక్తి ఘనతతో కూర్చిన శతకం .మందారమకరంద నవ్య కవిత్వ ధార ప్రవహించింది’’అని పద్యాశీస్సు పలికారు .భీముని పట్నవాసి హరిదాస భూషణ శ్రీ మరింగంటి లక్ష్మనాచార్య భాగవతార్ –‘’ప్రతిపద్యం రసస్థానం పొందింది .కవితాధార దివ్య గంగాతరంగాలతో చెలిమి చేసింది .వీరి అవధానం ఆంధ్రలో విజయధ్వజం ఎత్తింది .శబ్దాడంబరం కంటే అర్దాడంబరం ఎక్కువ ‘’అన్నారు .ముంగండ వాసి విద్వత్కవి సార్వభౌమ ,అభినవ పండితరాజ విద్యావాచస్పతిమొదలైన ‘’దశ ‘’బిరుదాంకితులు శ్రీ పుల్య ఉమా మహేశ్వర శాస్త్రి –‘’భక్తిరస కెరటాలలో తడిపెశారు. హృదయాకర్షంగా ఉంది ‘’అన్నారు .బిలాస్పూర్ నుంచి మధురకవి శ్రీమూలా పేరన్నగారు –‘’  ఈ కవిపు౦గవుని  ఉజ్వలతర భావ సంపదలు ,కలిత మృదూక్తులు మనోజ్ఞ వాగ్వధూ గళానికి కఠ హారం చేశారు ‘’అన్నారు .ఇందరు మహామహుల ఆశీర్వాదాలు పొందిన బాలకవి శేఖరుని ప్రతిభ శతకం లోఎలా ప్రతిఫలించిందో తర్వాత తెలుసుకొందాం .

 సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -12-9-23-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాంగ వే దా ర్థ వాచస్పతి , పద్మ భూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వేద సార రత్నావళి.18 వ భాగం.12.9.23.

సాంగ వే దా ర్థ వాచస్పతి , పద్మ భూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వేద సార రత్నావళి.18 వ భాగం.12.9.23.

Posted in రచనలు | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం.17 వ భాగం.11.9.23.

ప్రపంచ దేశాల సారస్వతం.17 వ భాగం.11.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

జాతీయ కవి సార్వభౌమ , మా కొద్దీ తెల్ల దొరతనం గీత కర్త శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర.4 వ భాగం.11.9.23.

జాతీయ కవి సార్వభౌమ , మా కొద్దీ తెల్ల దొరతనం గీత కర్త శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర.4 వ భాగం.11.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 98 వ శతకం –అఘ వినాశ శతకం



సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో

98 వ శతకం –అఘ వినాశ శతకం

కృష్ణాజిల్లా బేతవోలు గ్రామస్తులు శ్రీమాన్ శ్రీపతి సుదర్శనాచార్యుల ప్రియ శిష్యుడు శ్రీ దాసరి అ౦జదాసు రాసిన ‘’అఘవినాశ శతకం’’బాపట్ల తాలూకా ఆదిపూడి నుంచి1932లొ  ప్రచురితం .పరిచయకర్త శ్రీ అబ్బరాజు వెంకటరంగారావు గారు –‘’భక్తితో పామరకవిరాసిన శతకం అని .కవిత్వం లీలామాధుర్యం గా ,రసపుస్టిగా వేమన శతకం లా  ఉన్నశతకం’’ అన్నారు.ఇది ఆట వెలది శతకం .’’అ౦జ దాస పోష అఘవినాశ ‘’మకుటం .

  ‘’శ్రీయేజనులకు రత్నము – శ్రీయే బహు సంపదలనుజేకూర్పదగున్-శ్రీయే భక్తికి మూలము –శ్రీయే రక్షించు జనుల శ్రీరఘురామా ‘’అని మొదటి పద్యం చెప్పి ,’’గొప్పబొజ్జ వాడిని ‘ వాక్కులో నివసి౦చేతల్లిని,వేమనాదికవులను ,రామచంద్రుని స్తుతించి శతకపద్యం కానుకగా  సమర్పించాడు కవి .దేహభ్రాన్తితో దేవుని చూడలేకపోతున్నానని ,జీవ హి౦స దైవ హింసతో సమానమని ,పప్పు అన్నాలు పరమేశ్వరుని రూపు అని ,ఉప్పు పులుసు నెయ్యి హృదయ గుణాలని గొప్పకూరలన్నీ గోవిందు భూతములనీ చెప్పాడు .త్రిపుటి మధ్యలొ ఉన్న దేవుణ్ణి కనుగొంటే యోగి అవుతారు .ఆలికంటే ఆత్మ బంధువు ,కాలికంటేగట్టి బంటు లేరు .ధనం లేకపోతె దైవమె దిక్కు .దాశరధిని సతతం తలచే వారికి దోషం లేని దారి దొరుకుతుంది .

   నీటిలో, పాటలో, బోటిలో, పొందులో మంచి తెలుసుకోవాలి .భూషణం, వేషం ,భాష ఉంటేనే ఎక్కడైనా గౌరవం .రోష౦ లో ,రోగంలో,మాటకటువులో ,నీటులో గొప్పగా ఉంటే ఆశ అడుగంటిపోతుంది .ధర్మ, మర్మ, నిర్మలాలు ఉంటే మంచి గతి మోక్షం .’’ఆడవారి మంచి ,అందలంబులమంచి –కోడెత్రాచు మంచి ,కోతిమంచి-గూఢచారి మంచి గుర్తించటం కష్టం .యోగభక్తిలేకపోతే ముక్తి హుళక్కే .’’తోలుతిత్తిలోని దొడ్డ వానెరుగక –కాలమెల్ల రిత్త గడుపుచుండ్రు –నీళ్ళులేని చేప నిర్మలమౌ ‘’ అని మంచి సూక్తి చెప్పాడు .స్త్రీలకన్నా చిత్త చోరులులేరు ,మహ ఇంద్ర జాలంతో  మోసగిస్తారు .రంకు చేసే భార్య భర్తపై కోపం చూపుతూ అన్నిపనులు తానె చేసుకొంటుంది .

  అ౦టీ అంటకుండా ఆకాశం ఉంది.రెంటి మధ్య రేయిపవలున్నాయి .దాన్ని చూస్తేఆనందం .రెంటిమధ్య రేచించి చూస్తె ఒంటి స్థంభం మేడ కనిపిస్తుంది .అందులో హాయిగాశయనించు అని తత్వ బోధ చేశాడు .సబ్బుబిళ్ళ రుద్ది సరసుని దరి చేరుతుంది వన్నెలాడి .’’నేను ‘’అనేదాన్ని ఎన్న గలిగితే వాడేధన్యుడు.చివరలోకవి –‘’రామపాదుకలు శిరస్సుపై ధరించి ముక్తికోసం మోస్తున్నాను .ఇవ్వటానికి నాదగ్గర చిల్లిగవ్వ లేదు.అందుకే ఈ అఘ వినాశ శతకం అనే పుష్పాలు సమర్పిస్తున్నాను .కామితార్ధా లిచ్చి కాపాడు రామ చంద్రా అని ముగించాడు .

  చక్కని సూక్తులు మహా వేదాత భావనలు,సరళమైన పదాలు తో చిత్తరంజనంగా కవిత్వం పరిమళించింది .చదివితే ,అమలుపరిస్తే .అఘ వినాశనమే .   

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -11-9-23-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

సాంగ వే దా. ర్థ వాచస్పతి,. పద్మ భూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పు loori గణపతి శాస్త్రి గారి వేద సార రత్నా వలి.17 వ భాగం.11.9.23.

సాంగ వే దా. ర్థ వాచస్పతి,. పద్మ భూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పు loori గణపతి శాస్త్రి గారి వేద సార రత్నా వలి.17 వ భాగం.11.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.34 వ భాగం.11.9.23.

శ్రీ హర్ష నైషధం.34 వ భాగం.11.9.23.

part 2

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం.16 వ భాగం.10.9.23.

ప్రపంచ దేశాల సారస్వతం.16 వ భాగం.10.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

జాతీయ కవి సార్వభౌమ, మా కొద్దీ తెల్ల దొరతనం గేయ కవి. శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర.3 va భాగం.10.9.23.

జాతీయ కవి సార్వభౌమ, మా కొద్దీ తెల్ల దొరతనం గేయ కవి. శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర.3 va భాగం.10.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలలో 97 వ శతకం –శ్రీ సిద్దేశ్వర శతకం

97 వ శతకం –శ్రీ సిద్దేశ్వర శతకం

సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలలో

97 వ శతకం –శ్రీ సిద్దేశ్వర శతకం

గుంటూరుజిల్లా పల్నాడు తాలూకా రాయవరం వాసి శ్రీచిదంబర గురుస్వామి శిష్యుడు శ్రీ కోటయాఖ్య కవి శ్రీ సిద్దేశ్వర శతకం రచించి ,గుంటూరు అనసూయ ముద్రాక్షర శాలాలో 1933లొ ముద్రించారు .వెల తెలుపలేదు .ఇది కంద శతకం .’’సిద్ధేశ్వరా  అనేది శతక మకుటం .

శార్దూలం లొ ‘’శ్రీ వైకుం ఠనీవాన దేవా విలసచ్చిన్మాత్ర తత్వంబవై ‘’అంటూ స్వామి విభూతిని ప్రశంసించి ,గురు చిదంబరస్వామిని సన్నుతించి ,తర్వాత ‘’శంకరతనయా గజముఖ ‘’అంటూ వినాయకుని ,’’పారావారము దాటి లంక కెలమిన్ బల వేగమొప్పారగా ‘’దాటిన ఆంజనేయస్వామిని ,సరస్వతిని చిత్తం లొ నిల్పి ,’’ఏ దేవతా శక్తి వేద శాస్త్రములకు  తల్లియై తనరుచుండు ‘’అని ‘’దేవీ స్తౌత్యం ‘’చేసి ,వాల్మీకాది కవి స్తుతి చేశారు కవి .సీసమాలికలో తన వంశావళి వివరించారు –తండ్రి వెంకయ్య రమ్యమూర్తి ,తల్లి అచ్చమాంబ .మేనమామఅల్లయ్య ,తమ్ముడు కృష్ణయ్య .భార్య రామ లక్ష్మమ్మ .వీరికోడుకులు హనుమయ్య వెంకయ్య కోటయ్య .వారిభార్యాలు కోటమ్మ  వేంకట రామమ్మ లచ్చమ్మ .కుమార్తెలు కాత్యాయని ,అంతమ్మ బాలకోటమ్మ,అచ్చమ్మ .వీరయ్య మొదటికుమారుడు హనుమయ్యకు వెంకట రాములు .రెండవకుమారుడు శ్రీరాములు .మూడవకొడుకు కోటయ్యకు పుట్టిన కూతురు రామ లక్ష్మ .ఈమెకు వీరయ్యకు పుట్టినవాడు మనకవి కోటయ్య .

  తర్వాత శతకం అంతా శివ స్తుతే –‘’శ్రీ రజతాచల వాసునికోరి భజించెదను నాదుకోర్కులు మీరన్నేరుపుతో నీ సత్కృతి భారకుడవు నీవే యంచు భజింతు శివా ‘’అని మొదలుపెట్టి ‘’రజతగిరివాసా , పరమేశ సింధు గంభీర ఈశా ,మారసంహార శశిధరా’’కృపతో చూడు అన్నారు .అండపిండాలు నీలో నిండి ఉంటాయి .మార్కండేయుని బ్రోచినట్లు కాపాడు .ఎంతపిల్చినా పలకవు అని ,కోటిసూర్యప్రకాశంతో కైలాసంలో ఉంటావు ,గిరిజ వామామ్కంలో ఉంటుంది .మూలం లేని జగతి నిర్మూలనమౌతుంది .ఆదిమునులు నిన్ను సర్వేశ్వరుడు అని కొలిచారు .గరళం మింగి లోకాలు కాపాడావు .ఆపదోద్ధారకుడవు .నిన్ను వర్ణించటానికి ‘’ఫణివిభుడు కూడా చాలడు.కోటి మంత్రాలు శివమంత్రం ముందు నిలవవు .

   సర్వభూతాలకు నువ్వే సాక్షి  ‘’  .’’పంచ శిరాలలో శ్రీ గంగ కుదురుగా కూర్చుని ఉంటుంది .కైలాసంలో నీ గణాలు పరివేష్టించి నిన్ను కోలుస్తుంటే వామభాగంలో ఉమాదేవితో చిన్మయానందం అనుభవిస్తూ భక్తులకు వరదాయిగా ఉంటావు .గౌరికి శ్రీరామనామ మహాత్మ్యం బోధించి నిత్యం స్తుతి చేసేట్లు చేశావు .అనమస్కము నిరాకార సా౦ఖ్యము బోధించావు .ఆరు అక్షరాలతో హరుడుగా వెలుగుతున్నావు .మణులహారంలో ఆధారంగా జగాలన్నీ అణగి ఉంటాయి .సిద్దేశ్వరంలో క్రవ్యాదుడు నీమహిమ బోధించాడు .నీపాదాల పూజించే వరమిమ్ము .తేరాల వాసుడవు కృపా సి౦ధుడవు .భావంలోనే కనిపించే భవ్యుడవు.సిద్దేశ్వర క్షేత్రంలో శివరూప కళలతో శిద్ధీశుడు అనే పేరుతొ తేరాలలో ఉన్నావు .అని 146కందాలు అందంగా చెక్కారుకోటయ్యకవి. చివర మంగళమూ పాడారు .’’సిద్ధే శ్వర ఈ శతకము శుద్ధంబుగసంస్మరింప శుభ సౌఖ్య౦బుల్ – సిద్ధించు జదివి,వ్రాసిన శిద్ధులకు గల్గు మోక్ష సిరులీ భువిలో ‘’అని గ్యారంటీ ఇస్తూ ముగించారు .

 సరళపద సపద తో  ఆడంబర హడావిడి లేకుండా మనసులోని భావధారను ప్రవహింప జేసి సిద్ధే శ్వర శివునికి అంకితమిచ్చి ధన్యమయ్యారు కవి .   

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -10-9-23-ఉయ్యూరు–

Posted in పుస్తకాలు, ప్రవచనం | Leave a comment

సాంగ వేదార్థ వాచస్పతి. పద్మ భూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వేద సార రత్నా వలి.16 వ. భాగం.10.9.23.

సాంగ వేదార్థ వాచస్పతి. పద్మ భూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వేద సార రత్నా వలి.16 వ. భాగం.10.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.33 వ భాగం.10.9.23.

శ్రీ హర్ష నైషధం.33 వ భాగం.10.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రపంచ దేశాల. సారస్వతం.15. వ భాగం.9.9.23.

ప్రపంచ దేశాల. సారస్వతం.15. వ భాగం.9.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

జాతీయ కవి మా కొద్దీ తెల్ల దొరతనం గీత కర్త శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర.2 వభాగం.9.9.23.

జాతీయ కవి మా కొద్దీ తెల్ల దొరతనం గీత కర్త శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర.2 వభాగం.9.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ పన్నగాచల నాయక శతకం

శ్రీ పన్నగాచల నాయక శతకం

శ్రీ సచ్చిదానదస్వరూప పులహరి పీలోజి దేశికేంద్రులు రచించిన శ్రీ పన్నగాచల నాయక శతకం శ్రీకోల్లిపర సూరేశ్వర లింగం దేవర ద్రవ్య సహాయంతో శ్రీ పులహరి పీరోజి బాబు చే 1924లొ ప్రచురితం .వెల –పావలా .విజ్ఞప్తిలో బాబు –‘’తనతాతగారు పీరోజి దేశికేంద్రులు అనేక గ్రంథాలు రాశారని అవి ముద్రితం కాకుండానే శివైక్యం చెందారని ,తన తండ్రి లక్ష్మోజి ఆ  శిధిలా తాళపత్ర గ్రంథాలలోని ‘’పరమానంద సుధాలహరి ‘’మాత్రం కాగితంపై కాపీరాసి ముద్రించారని ,తాతగారి శిష్యులు శ్రీ పాటిబండ్ల వీరయ్యాచార్యుల ప్రోత్సహించగా తానూ ప్రయత్నించే లోపే  ఆయనా మృతి చెందారని , అప్పికట్ల నివాసి అని,చినపరిమి అగ్రహార వాస్రవ్యులు ,వీరమహేశ్వర స్వరూపులు శ్రీకొల్లిపర చన్నమల్లయ్య గారి ధనసాయంతోశతకం ముద్రించానని సత్తెనపల్లి నుంచి తెలియజేశారు .ఉపోద్ఘాతంలో –కవిగారు ఫిరోజి బాబు గారు 1929-30మధ్యలో జన్మించి ,చిన్నతనంలోనే అనేక మహిమలు చూపుతూ ఆశ్చర్యపరచేవారని ,బడిలో చేరి అందరికన్నా బాగా చదివి పేరు తెచ్చుకోన్నారని ,ఒకసారి బడి నుండి ఇంటికి వస్తుంటే ఒక సిద్ధుడు కనపడగా భవబందాలనుంచి విముక్తి ప్రసాది౦చమనికోరగా తారకం ఉపదేశించి అదృశ్యమయ్యారని ,తర్వాత పదిహేనవ ఏట శ్రీ జమిలి శేషయాచార్యులవద్ద పరతత్వ రహస్యాలు గ్రహించారని ,శివ పంచాక్షరి ద్వాదశాక్షరి జపం నిర్విఘ్నంగా చేస్తూ ,జనులకు జ్ఞానబోధ చేస్తూ 9-7-1889న శివైక్యం చెందారని ,ఈ శతకంతో పాటు పరమానంద సుధాలహరి ,తత్వ సంగ్రహం ,స్వప్రకాశమానం .రామ శతకం మొదలైనవి రచించారని జిల్లెపల్లి వాస్తవ్యులు శ్రీ బోడేపూడి వెంకటరావు గారు తెలియజేశారు .తర్వాత గురు పీఠిక సంతరించి తన గురుపరంపరను ధ్యానిచారుపీరోజికవి . శతకం అంతా మత్తకోకిల పద్యాలలో  రాశారు .’’పన్నగాచల నాయకా ‘’అనేది శతక మకుటం .

మత్తకోకిలస్వరంతో మొదటిపద్యం పలికించారు –‘’ శ్రీ రమామణి మనోహరా చిన్మయాత్మక పాండుర- స్మేరశోభిత రాజమండల స్నిగ్ధ సద్వదనంబుజా-వారిజాసన సోమశేఖర వందితాంఘ్రి సరోరుహా –పారమోక్ష శుభ ప్రదాయక ‘’పన్నగాచల నాయకా ‘’.తర్వాత వెంకటేశ్వర అలివేలు మ౦గలను స్తుతించి ,గోపభూపయ,శోదబాలక గోపికాతి మనోహరా ,మయూర పించ వికాసా కామరూప అంటూ పరవశించారు .ద్వేష భీషణ వేష సాత్యవతేయ హృత్పరిపోషకా  ,రామ కోమలమూర్తి నిత్యవ,నిరామయాత్మక ,సామజరాజ కస్ట విదార అని కొన్ని విషయాలు గుర్తు చేశారు .రేఖ మేఘ రుచిప్రకాశరీరతిర్మణిరేఖ ,చిద్రేఖ  శేఖర అంటూ వినూత్న పదబంధాలు సృష్టించి స్వామి కీర్తన చేశారు .రాజమండల సన్నిభాసన,రాజరాజ వతంస ,భూరాజమండల ముఖ్యపూజిత రాగయోగి మనోజ్వలా ‘’అన్నారు .సర్వతోముఖ సర్వ రూపక సర్వదీపకలాప సర్వపాలన సర్వ ఖేలన అని స్వామి సర్వాంతర్యత్వాన్ని ఆవిష్కరించారు .నీవే సర్వ చరాచరం సర్వజగాలు .నిన్నే భావన చేసి బతుకుతున్నాను .చలమేల కరుణి౦చరా .ఏకమై పరిపూర్ణమై సకలేంద్రియ ప్రకరాన్తమస్తోకమై నిరవద్యమైన నువ్వు సూక్ష్మమే కాదు స్థూలం కూడా .

  ఆరింటిని వధించి పదహారును పరిమార్చి ,ఆరు చేర్చి ఆరు కూర్చి ,ఆరిటిని పోకార్చి ,ఆరుపువ్వులమీదుగా ,పదహారు కాంతుల పూర్ణమైనది ఇమ్పారుగా ఉంటుంది అని వేదాంత బోధ చేశారు .99 వ మత్తకోకిల లొ –‘’మత్తకోకిల పద్య సుమాలతో మాలచేసి నీకు సమర్పించాను వెంకటేశ్వరా .స్వీకరించి అందరికి సకలార్ధాలు సమకూర్చు .వందవ పద్యంలో –‘’పులారి కులం లొ శేషయార్య సేవాపరుడను   .సత్యభామాపుర నివాసిని .ఫీరు దాసు పేరు .నాకృతిని వ్యాప్తి చేసి అందరికి శుభం కల్గించ మనికోరారు .

 దాసకవి లోక హితైషి .వెంకటరమణ పాదార్చకులు .మదినిండా స్వామిని నింపుకొని ఇంపు మీరగా మత్తకోకిలస్వనం తో భక్తీ మత్తు ఎక్కిన్చేట్లు శతకం  రాసి తరించారు .చదివి మనమూ తరిద్దాము .

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -9-9-23-ఉయ్యూరు     —

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

సాంగ వేదర్థ వాచస్పతి పద్మ భూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వేదసార రత్నా వలి.15 వ భాగం.9.9.23

సాంగ వేదర్థ వాచస్పతి పద్మ భూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వేదసార రత్నా వలి.15 వ భాగం.9.9.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.32 వ భాగం.9.9.23.

శ్రీ హర్ష నైషధం.32 వ భాగం.9.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రపంచ దేశాల. సారస్వతం.13 వ భాగం.8.9.23.

ప్రపంచ దేశాల. సారస్వతం.13 వ భాగం.8.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ గనముక్కల నాగయ్య విరచిత’’ శ్రీ సోమేశ్వర శతకం ‘’

శ్రీ గనముక్కల నాగయ్య విరచిత’’ శ్రీ సోమేశ్వర శతకం ‘’

ను మహారాజ రాజశ్రీ సోము పాళ్యం కనుకొండ కోటిరెడ్డి ,మదనపల్లి బోర్డ్ హైస్కూల్ తెలుగు పండితులు బ్రహ్మశ్రీ వెంకటరామ శాస్త్రి గార్లచే పరిష్కరి౦పబడి మదనపల్లె బ్రిటానియా ముద్రాక్షర శాలలో 1926లో ప్రచురింపబడింది .వెల –అణన్నర.తండ్రిగారికి ఈ శతకం అంకితమిచ్చారు కవి .ఈ సీసపద్య శతకం  మకుటం అంతా గీతపద్యం నాలుగు పాదాలు ఉండటం విశేషం – ‘’కన్నెమడుగు పురీవాస ,కర్నసాలె –కులజు లిలువేలుపువని పేరుగొన్న దేవ -శీలుడగు గనముక్కల శిద్దయార్య –చిత్త సుమవాస సోమేశ చిద్విలాస ‘’ .

 మొదటి సీసం లో –‘’శ్రీ గిరిజా వర శ్రితజన మందార-సోమజటాధర శూలధార –కాయజ సంహార కారుణ్య సాగర –వాతాశిధార మిన్వాకధార –హస్తి చర్మాంబర యాగమనోగోచర పాప సంహార కపాల ధార-బలగర్వ రిపుహర ప్రణుతి శుభాకర –ఫాలలోచన ధారభయవిదార

గీ-కన్నెమడుగు పురీవాస ,కర్నసాలె –కులజు లిలువేలుపువని పెరుగొన్న దేవ –శీలుడగు గనుముక్కల శిద్దయార్య –చిత్త సుమవాస సోమేశ చిద్విలాస ‘’.అని భక్తిపూర్వకంగా సంనుతిచారుకవి .  సోమ దేవ మంత్రం నిత్యం ఉచ్చరిస్తే రోగాలురావు ,పాదపద్మాలు సేవిస్తే పాపాలు దూరం .చరిత్ర స్మరిస్తే దుఖాలు పోతాయి .ప్రాపు చేరితే శ్రీకైవల్యమే .నిన్ను హరుడు అందునా దిగంబరుడు అందునా ,భవ ,శివ, ఉమాధవ, అజ, వృషధ్వజ, భీమ, బలోద్దామా అనాలా అర్ధం కావటం లేదు అని శివనామాలు పల్కారు .నీపద సేవ చేయని చేయి కొయ్యగరిట,కీర్తించని నోరు నీటికోర ,కధలు వినని చెవులు పెద్దకవులు ,సాష్టాంగం చేయని దేహం పోలాల లోని దిష్టిబొమ్మ  .కరులున్నా నౌకరులున్నా నీ స్మరణ లేకపోతె వ్యర్ధం .ధనమున్నా సందనమున్నా నీపూజలేకపోతే ,ఆలున్నా నేల మైడాలున్నా ,నీపాలన లేకపోతె ,సుతులున్నా స్నేహితులున్నా నీకధలు వినకపోతే అవి వ్యర్ధం అని చక్కని నుడికారంతో చెప్పారు .

  సదానంద ,సకలాఘత బృంద ,దూరీకృతైక పదారవింద , వామ దేవ అమరవందిత ,విశ్వేశ శ్యామలామల చిత్త ,సకలలోకాధార,మకరాంక మదహర ప్రకటిత బలశూర ,భయవిదార ,నిశిత శూలాయుధ నీరజా సననుత  భాసిత సంమోదిత ,భవ్యచరిత అంటూ శివనామాలు పలికారు కొత్తతరహాలో .తల్లీతండ్రీ గురువు దైవం నీవే నీనామ మంత్రం నీచ తాపత్రయ భంజనం ,భక్తులకు కర్ణాభరణం ,నిగమ భూషణ కలాపూరణం మహాపాప విదారణం ,నిఖిల పిశాచ బాధకం ,సాధు సాధకం .చింతామణి ,కల్పవృక్షం ,కామధేనువు లకంటే నీనామం శ్రేష్టం . నీదయ ఉంటే  జలధి లంఘించవచ్చు,పర్వతాన్ని ఎత్తవచ్చు ,అగ్నిలో దూకవచ్చు,  ‘’మిసిమివోలె విషంబు మ్రింగవచ్చు ‘’నాతప్పులు మన్నించి నన్ను కాచి నీలో కలుపుకోసోమేశ .నాగురించిపార్వతి గణపతి కుమారస్వామి నీకు చెప్పలేదా అని ఫిటింగ్ పెట్టారు  .ప్రణవ స్వరూపుడవైన నిన్ను ,భావించి మనసులో పదిలపరచి ,నీరూపు చిత్తం లో నిలిపి పంచ పూజలతో తృప్తి పరచి భక్తి చందనం ,రక్తి అక్షతలు శాంతి సుమాలు క్షాన్తిపూజ చేస్తాను .చివరి వందవ సీసం లో –‘’మంగళ౦బురగేంద్ర మండన భవదీయ-పావన చరణరాజీవములకు – నిత్యమంగళము నీ నిర్మల కరునైక వీక్షిత నేత్రారవిన్దములకు –శుభమంగళము సర్వ శుభములొస గెడి –నీనామ మంత్ర నిధానమునకు –జయమంగలంబెల్లజగములు నిత్యంబు –పూజించు నీ దివ్య తేజమునకు’’అని శుభమంగళ౦ తో శతక సమాప్తి చేశారు .

 ధారాశుద్ధి భావ పరిశుద్ధి భక్తిపరిపాకం ఉన్నసోమేశ్వర  శతకం రాశారు కవి గనముక్కల నాగులయ్య.గణాలకోసం ప్రాకులాట లేదు .నాగాభారణునిపై నిశ్చల భక్తీ ,సోమేశ్వరునిపై అచంచల ఆరాధన తప్ప నాగులయ్యకు .మంచి శతకం. ఒక రకంగా కవి ఆత్మనివేదన ఈ శతకం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-23-ఉయ్యూరు .     ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

సాంగ వే దార్ధవాచస్పతి పద్మ భూషణ్ ఉప్పులూరి i గణపతి శాస్త్రి గారి వేద సార రత్నా వలి.14 వ భాగం.8.9.23

సాంగ వే దార్ధవాచస్పతి పద్మ భూషణ్ ఉప్పులూరి i గణపతి శాస్త్రి గారి వేద సార రత్నా వలి.14 వ భాగం.8.9.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.31. వ భాగం.8.9.23.

శ్రీ హర్ష నైషధం.31. వ భాగం.8.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రెజిల్ రిపబ్లిక్ సింబల్ , ‘’ఉమన్ ఇన్ రెడ్ ‘’-అనితా గరిబాల్డీ -గబ్బిట దుర్గాప్రసాద్- విహంగ -మహిళా వెబ్ మాస పత్రిక -సెప్టెంబర్ 

బ్రెజిల్ రిపబ్లిక్ సింబల్ , ‘’ఉమన్ ఇన్ రెడ్ ‘’-అనితా గరిబాల్డీ -గబ్బిట దుర్గాప్రసాద్– విహంగ -మహిళా వెబ్ మాస పత్రిక -సెప్టెంబర్ 

బ్రెజిల్ మరియు ఇటలీకి చెందినయుద్ధవీరుడు సైన్యాధ్యక్షుడు ,దేశభక్తుడు ,రిపబ్లికన్ , అసాధారణమైన శారీరక మరియు మానసిక ధైర్యాన్ని కలిగి ఉన్నవాడు , దక్షిణ అమెరికా మరియు ఇటలీలో స్వేచ్ఛ మరియు జాతీయ స్వయం నిర్ణయాధికారం కోసం భర్త గియుసెప్ గరీబాల్డి యొక్క పోరాటాలలో చురుకుగా పాల్గొన్న వీర వనిత అనీత గారిబాల్డీ . పేరు వైవిధ్యాలు ఉన్న అనీహా అన్నీతా బెంటోస్. గరిబాల్డీ 1821లో బ్రెజిల్‌లోని మోరిన్‌హోస్‌లో అనా మారియా డి జీసస్ రిబెరియో డా సిల్వా పేరుతొ జన్మించింది . ఆగష్టు 4, 1849న ఇటలీలోని రవెన్నా సమీపంలోని మాండ్రియోల్‌లోని గిక్సియోలీ ఫామ్‌లో మరణించింది ; బెంటో రిబీరో డా సిల్వా డి జీసస్ (ఒక రైతు) మరియు మరియా ఆంటోనియా కుమార్తె; ఆమె మరణానికి కొన్ని నెలల ముందు చదవడం మరియు వ్రాయడం నేర్చుకోవడం ప్రారంభించింది; ఆమె పేరుపై సంతకం చేయడం నేర్చుకున్నది; ఆగష్టు 30, 1835న మనోయెల్ డ్యూర్టే డి అగ్యియర్‌ను వివాహం చేసుకున్నాడు; మార్చి 26, 1842న గియుసేప్ గారిబాల్డిని వివాహం చేసుకున్నది .నలుగురు సంతానం కలిగారు .
దక్షిణ బ్రెజిల్‌లోని లగునా వద్ద గారిబాల్డిని మొదటి సారిగా కలుసుకున్నది అనీతా (అక్టోబర్ 1839); ఇంబిటుబా నావికా యుద్ధంలో పోరాడింది (నవంబర్ 3, 1839); లగునా తరలింపులో పాల్గొన్నది (నవంబర్ 15, 1839); రియో గ్రాండే దో సుల్ పర్వతాల గుండా తిరోగమనం (శరదృతువు-శీతాకాలం, 1840–41); గియుసెప్పీతో కలిసి, ఉరుగ్వేలోని మాంటెవీడియోకి బయలుదేరింది . (ఏప్రిల్ 1841); మాంటెవీడియోకి చేరుకున్నారు (జూన్ 17, 1841); మాంటెవీడియోలో బస చేశారు (1842–47); ఇటలీకి ప్రయాణించారు (జనవరి 1848); జెనోవా చేరుకుని నీస్‌కు ప్రయాణించారు (ఏప్రిల్ 1848); లివోర్నో (అక్టోబర్ 24, 1848) కోసం గియుసేప్ గారిబాల్డి మరియు అతని స్వచ్ఛంద సేవకులతో కలిసి జెనోవాను విడిచిపెట్టారు; రోమ్ సమీపంలోని రీటీలో తన భర్తతో కలిసి బస చేసింది (ఫిబ్రవరి-ఏప్రిల్ 1849); నైస్ నుండి రోమ్ వరకు ప్రయాణించారు, ముట్టడి సమయంలో వచ్చారు (జూన్ 26, 1849); రోమ్ నుండి ఉత్తరం వైపు తిరోగమనానికి బయలుదేరారు (జూలై 2, 1848).

గియుసేప్ గారిబాల్డి తన ఆత్మకథలో ఇలా వ్రాశాడు:

యాదృచ్ఛికంగా నేను బార్రాలోని గృహాల వైపు దృష్టి సారించాను—సరస్సు [బ్రెజిల్‌లోని లగునా పట్టణం] ప్రవేశ ద్వారం యొక్క దక్షిణం వైపున సహించదగిన ఎత్తైన కొండ, అక్కడ కొన్ని సాధారణ మరియు సుందరమైన నివాసాలు కనిపిస్తాయి. వీటిలో ఒకదాని వెలుపల, డెక్‌లో ఉన్నప్పుడు నేను సాధారణంగా నాతో తీసుకెళ్లే టెలిస్కోప్ ద్వారా, నేను ఒక యువతిపై నిఘా పెట్టాను .మరియు నేను ఒడ్డుకు వెళ్లాలనుకున్నందున వెంటనే పడవను బయటకు పంపమని ఆదేశించాను. నేను దిగాను, మరియు, నా విహారయాత్రకు సంబంధించిన వస్తువును కనుగొనాలని నేను ఆశించిన ఇళ్ల కోసం, నేను ఆమెను మళ్లీ చూడాలనే ఆశను పూర్తిగా వదులుకున్నాను, నేను అక్కడి నివాసిని కలుసుకున్నప్పుడు, మేము వచ్చిన వెంటనే అతనితో పరిచయం ఏర్పడింది. .

అతను తన ఇంట్లో కాఫీ తీసుకోమని నన్ను ఆహ్వానించాడు; మేము ప్రవేశించాము మరియు నా కళ్లను చూసిన మొదటి వ్యక్తి నన్ను ఒడ్డుకు ఆకర్షించిన అమ్మాయి. నా పిల్లల తల్లి అనిత, నా జీవితాన్ని మంచిగా, అధ్వాన్నంగా పంచుకుంది-ఆ భార్య ధైర్యాన్ని నేను చాలా కోల్పోయాను.’’అని రాసుకొన్నాడు .

, గియుసెప్ తన ఓడ నుండి అనితను గూఢచర్యం చేసి, “ఆమె నాది అయి ఉండాలి!” ఆపై, అభిరుచితో, అతను నీటిలోకి ప్రవేశించాడు. అతను అనితను తన భుజంపైకి విసిరాడు మరియు వారు “ఎప్పటికీ సంతోషంగా” జీవించడానికి ఇటలీకి బయలుదేరారు.కానీ ఆ అమ్మాయి, అన్నా డి జీసస్, త్వరలో అనితా గారిబాల్డి అని పిలవబడుతోంది, ఆమె త్వరలో కాబోయే భర్త వలెనే తీవ్రమైనది.

గియుసెప్ గరీబాల్డి రియో డి జనీరోలో ప్రయాణించడానికి చాలా కాలం ముందు, అతను ఇటలీగా మారే విషయంలో సమస్యలను కలిగిస్తున్నాడు. 1830లలో, గారిబాల్డి యవ్వనంలో, ద్వీపకల్పం అనేక చిన్న దేశాలుగా విభజించబడింది. ఉత్తరాన పార్మా, ఫ్లోరెన్స్, సార్డినియా మరియు లొంబార్డో-వెనెటోలు ఫ్రాన్స్ మరియు ఆస్ట్రియాచే ఎక్కువగా ప్రభావితమయ్యాయి. దక్షిణాన బోర్బన్ రాచరికం పాలించిన రెండు సిసిలీల రాజ్యం ఉంది. మరియు చనిపోయిన కేంద్రంలో పాపల్ రాష్ట్రాలు ఉన్నాయి. వీటన్నింటి మధ్యలో, గియుసెప్ గారిబాల్డి ఈ దేశాల అధికారాన్ని సవాలు చేస్తూ, ఇటలీ అనే ఒక దేశం ఉండవచ్చని ఐక్యత సందేశాన్ని బోధించాడు. అతను ఆస్ట్రియన్ల నియంత్రణను సవాలు చేశాడు మరియు వారి సైనికులను హింసించాడు, ఒకానొక సమయంలో ఒక వ్యక్తిని గ్రామం మొత్తం చూసేలా జెండా స్తంభానికి నగ్నంగా కట్టివేసాడు.

స్పష్టమైన కారణాల వల్ల, గియుసేప్ తన ఇంటి నుండి బహిష్కరించబడ్డాడు. అతను పురుషుల మధ్య తిరుగుబాటును కలిగించడానికి ఫ్రెంచ్ నావికాదళంలో చేరడానికి ఒక పథకాన్ని రూపొందించే వరకు అతను మధ్యధరా చుట్టూ తిరిగాడు. అతను దొరికాడు పేరు మార్చుకొంటే అతను ఓడలో బుక్ చేసుకోగలడు, అది చివరికి అతన్ని బ్రెజిల్‌కు తీసుకువస్తుంది. అక్కడ, తమను తాము “యువ ఇటాలియన్లు” అని పిలుచుకునే ఇటాలియన్ వలసదారుల యొక్క పెరుగుతున్న జనాభా రాజకీయంగా చురుకుగా మారుతోంది, వారు యుద్ధంలో పోరాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నప్పుడు బ్రెజిలియన్ల స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ఇది ఇటాలియన్ డయాస్పోరా ప్రారంభం; ఇటాలియన్ జనాభా పేదరికం, నిరంతర యుద్ధం మరియు అణచివేత రాజకీయ పాలనల కారణంగా వారి ఇళ్ల నుండి స్థానభ్రంశం చెందారు. త్వరలో రాజకీయ నాయకుడు కాబోతున్న గియుసేప్ అభివృద్ధి చెందే వాతావరణం ఇది.

గియుసెప్ గారిబాల్డి ప్రయాణించిన బ్రెజిల్ అంతర్యుద్ధం అంచున ఉంది. గౌచోలు, అమెరికన్ కౌబాయ్‌తో సమానమైన సంచార పశువుల కాపరులు, ఉత్తర బ్రెజిల్‌లోని మరింత “అధునాతన” ప్రభువులచే పేదరికంలో మరియు అన్యాయంగా ప్రవర్తించారు మరియు వారు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. మరియు, అమెరికా మాదిరిగానే, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ బానిసలుగా ఉన్న ప్రజల శ్రమపై నిర్మించబడింది. ఆఫ్రికా నుండి తీసుకువచ్చిన పది మిలియన్ల బానిసలలో నలభై శాతం మంది బ్రెజిల్‌కు పంపబడ్డారని నమ్ముతారు.

ఆ సమయంలో, అబ్రహం లింకన్ బానిసత్వానికి ముగింపు ప్రకటించడానికి ఇష్టపడలేదు, కాబట్టి గరీబాల్డి అమెరికన్ సివిల్ వార్‌లో చేరలేదు.

రాజకీయ మరియు సామాజిక అశాంతి మధ్య, అనిత అనే యువతి ప్రక్కన నుండి గమనిస్తోంది, పోరాటంలో పాల్గొనే క్షణం కోసం సిద్ధంగా ఉంది.

మరియు ఆమె స్వస్థలమైన శాంటా కాటరినాలో 1839లో పోరాటం ప్రారంభమైనప్పుడు, ఆమె నిర్భయంగా ఉంది. మొదట గరీబాల్డి, అప్పటికి ఆమె ప్రేమికుడు, ఆమె చేరడాన్ని వ్యతిరేకించాడు. ఆమెను సురక్షితంగా ఉంచాలనుకున్నాడు. ఇద్దరూ వాదించుకున్నారు, చాలా పెద్ద వరుస క్యాంపు మొత్తం వినబడింది. చివరికి, అతను పశ్చాత్తాపం చెందాడు మరియు అనిత అతని ఓడలో సైనికురాలిగా మారింది. పురుషుల మాదిరిగానే ధైర్యంగా పోరాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిరంగి కాల్పుల నుండి బయటపడిన తరువాత, గరీబాల్డి ఆమెను విశ్రాంతి తీసుకోవడానికి క్రిందికి వెళ్ళమని బలవంతం చేసింది-ఆమె పదిహేను నిమిషాల పాటు చేసింది, ఎందుకంటే ఆమె క్రింద దాక్కున్న పారిపోయినవారిని పెంచింది. ఆ తర్వాత, గరీబాల్డి ఆమెను చర్య నుండి తప్పించలేకపోయాడు.

గరీబాల్డి జీవితాంతం, ముఖ్యంగా అతని ప్రారంభ రోజుల్లో, అతను ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర్యం మరియు సమానత్వం పట్ల మక్కువ చూపాడు. రియో గ్రాండే డో సోల్ లేదా యునైటెడ్ స్టేట్స్ అయినా అతన్ని నియమించుకోవాలని కోరుకునే ఏ దేశానికైనా ఇది అవసరం. అంతర్యుద్ధం ప్రారంభ రోజులలో ఒక ఆదేశం అందించిన తర్వాత అబ్రహం లింకన్‌కు పంపిన లేఖలో, గారిబాల్డి ఇలా అన్నాడు – ప్రగాఢమైన మరియు అత్యంత హృదయపూర్వక సానుభూతి ఇప్పుడు ఆయుధాలు ధరించి, స్వేచ్ఛ మరియు మానవత్వం యొక్క పవిత్రమైన లక్ష్యంలో పోరాడుతున్న మీ ప్రజల పట్ల ఉన్నాయి. అమెరికన్ రిపబ్లిక్ వంటి దేశం, ఆమె రాజ్యాంగం మరియు చట్టాలలో పొందుపరచబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్య ప్రకటనలతో, మానవత్వం మరియు 19వ జ్ఞానోదయమైన నాగరికతతో సంబంధం లేకుండా ఎందుకు ఉండాలో అర్థం చేసుకోవడంలో అతనికి ఇబ్బందిగా కనిపిస్తోంది. శతాబ్దానికి, ఒక అనాగరిక యుగం యొక్క అనాగరిక అవశేషమైన బానిసత్వాన్ని కలిగి ఉండకూడదని, ఒకేసారి మరియు ఎప్పటికీ రద్దు చేయబడింది.

ఆ సమయంలో, అబ్రహం లింకన్ బానిసత్వానికి ముగింపు ప్రకటించడానికి ఇష్టపడలేదు, కాబట్టి గరీబాల్డి అమెరికన్ సివిల్ వార్‌లో చేరలేదు.

స్వాతంత్ర్యం కోసం బ్రెజిలియన్ పోరాటం (రాగముఫిన్ యుద్ధం అని పిలుస్తారు) మరియు అమెరికన్ సివిల్ వార్ మధ్య సారూప్యతలు చాలా ఉన్నాయి. ప్రజల మనోవేదనలలో అధిక-పన్ను విధించడం, వారి వనరులు ఉత్తర బ్రెజిల్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతున్నాయి, కానీ వారికి ప్రయోజనం చేకూర్చడం లేదు మరియు దక్షిణాది అవసరాలను ఇన్‌చార్జిగా ఉన్న ప్రభువులు తోసిపుచ్చారు. రాగముఫిన్ యుద్ధం మన అంతర్యుద్ధానికి భిన్నంగా ఉంది, దేశంలోని దక్షిణ భాగంలో తిరుగుబాటు చేస్తున్న రియో గ్రాండే దో సుల్‌లోని పీ ప్రజలు బానిసల స్వేచ్ఛ కోసం పట్టుబట్టారు.

ముసోలిని అనితా గరి బాల్డీ ని ఆరాధ్య దేవత గా భావించాడు.గ్లానికోలో కొండపై గుర్రం పై పోరాడుతూ ఎడమ చంకలో తన కొడుకుని ఉంచుకొని ,కుడిచేతిలో తుపాకి పట్టుకొని భర్త సైన్యాన్ని నడిపిస్తూ యుద్ధం చేస్తున్నఅనితా గారిబాల్డీ విగ్రహం చెక్కించి, ఆమెభర్త గారిబాల్డీ విగ్రహం ప్రక్కన నెలకొల్పి ఆవిష్కరణ ఉత్సవం మూడు రోజులు జరిపాడు .ఆ విగ్రహం చూస్తె చాలు ఆమె వీరవనితగా దర్శనమిచ్చి స్పూర్తి కలిగిస్తుంది .అందుకే ఆమెను ‘’ఉమన్ ఇన్ రెడ్ ‘’అంటారు .ఆమెజీవితాన్ని ‘’రెడ్ షర్ట్స్ ‘’పేరుతొ సినిమా తీశారు .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Leave a comment

గరిమెళ్ల సత్యనారాయణ గారి జీవిత చరిత్ర

ఇవాల్టి సాయంత్రం  నుంచి గరిమెళ్ళ వారి జీవితచరిత్ర 

నిన్నటి ఆరవ ఎపిసోడ్ తో జస్టిస్ పాకాల వెంకట రాజమన్నార్ నాటికలు పూర్తయ్యాయి ఇవాళ సాయంత్రం నుంచి ”మా కొద్దీ తెల్లదొరతనం ”గీతం ఫేం శ్రీ గరిమెళ్ల సత్యనారాయణ గారి జీవిత చరిత్ర ప్రారంభిస్తున్నాం 

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం.13 వ భాగం.7.9.23.

ప్రపంచ దేశాల సారస్వతం.13 వ భాగం.7.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

జస్టిస్ పీవీ రాజ మ న్నా r. నాటికలు 6 వ చివరి. భాగం.7.9.23.

జస్టిస్ పీవీ రాజ మ న్నా r. నాటికలు 6 వ చివరి. భాగం.7.9.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment