బతకమ్మ పూల దివ్యౌషధం –

బతుకమ్మ పూల దివ్యౌషధం
వానాకాలంలో భూమాత పూలపరిమళాలను వెదజల్లుతుంది. ఎక్కడ చూసినా రంగురంగుల పువ్వులు కనువిందు చేస్తాయి. ఒక్కొక్క పువ్వును పేర్చి బతుకమ్మను తీర్చిదిద్ది.. ప్రకృతితో అనుబందాన్ని చాటుకుంటారు మహిళలు. ఈ పండుగలో తంగేడు, గునుగు, చంద్రకాంత, గడ్డిపూలు, గుమ్మడి, మందార పూల విశిష్టత ఎంతో ఉంది. వీటిలోని ఔషధగుణాలకు ఎంతో విలువ ఉంది.
తంగేడు
పసుపుపచ్చ పుష్పాలు గుత్తులుగా పూస్తుంది. మొగ్గలు, పువ్వులు, గింజలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. చర్మవ్యాధులు, కంటి దోషాలు నివారింపబడతాయి.
గునుగురక్తవిరోచనాలు అరికడుతుంది. చర్మంపై పొక్కులు, గాయాలు, క్షయ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. లేత కొమ్మలు, ఆకులు, గింజలు మంచి ఆహారం.
చంద్రకాంత 
వివిధ రకాల చర్మసమస్యల నుంచి కాపాడుతుంది. సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. పుష్పాల నుంచి రంగు లభిస్తుంది. సుగంధ పరిమళాలు వెదజల్లుతుంది.
గడ్డిపూలు/చిన్నతుంగ
నరాలలో ఉత్తేజాన్ని ఇస్తుంది. పుష్టినిచ్చు పశుగ్రాసం. గడ్డి కాడలతో బుట్టలు, చాపలు తయారు చేస్తారు.
గుమ్మడి
పువ్వులలో, కాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొట్టలో క్రిములను సంహరిస్తుంది. శరీరానికి వేడిని అందిస్తుంది.
మందారం
జ్వరాలు, గుండె జబ్బులు, సెగగడ్డలు, వ్రణముల నివారణ ఉపయుక్తంగా ఉంటుంది. శిరోజాలు నల్లగా, వత్తుగా ఉండేలా చేస్తుంది.
సీతమ్మవారి జడబంతి/పట్టుకుచ్చు పూలు
ఆకులు గాయాలకు, నోటిలో పొక్కులకు ఉపయుక్తంగా ఉంటాయి. అందమైన పూలమొక్క. గింజలు పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి.
గన్నేరు
కఫాన్ని, వాతాన్ని నివారిస్తుంది. కుష్టు వ్యాధి నివారణకు పనిచేస్తుంది. చుండ్రు, వ్రణముల బాధ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
మోదుగ

ఈ ఆకులను ఆహారంగా తీసుకున్న ఆవులు ఎక్కువ పాలిస్తాయి. పొట్టలో క్రిములకు, చర్మ సమస్యలకు, పైల్స్‌ నివారణకు పని చేస్తుంది. విషకాటుకు విరుగుడు.
బొగడ / బతుకమ్మ గడ్డిపూలు
రంగు పూలు ఆకర్షణీయంగా ఉంటాయి. పూల రంగు ఎక్కువ రోజుల మన్నుతుంది. వేరు కషాయం దగ్గు నివారణిగా పనిచేస్తుంది.
చామంతి
శరీరానికి చలువ చేయడమే కాకుండా జ్వరం, తాపం, అగ్నిమాంద్యము వంటి వ్యాధుల నుంచి ఉపశమనానికి పనిచేస్తుంది. చక్కని సువాసనను ఇస్తుంది.
కట్లపూలు
నీలి ఆకాశ రంగులో పూలు పూస్తుంది. పూలు కంటికి ఇంపుగా ఉంటాయి. చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి.
నందివర్ధనం
కాండంలో పాలలాంటి లేటెక్స్‌ ఉంటుంది. ఇది చలువ చేస్తుంది. వాపులు, నొప్పులకు నివారణిగా పనిచేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కనకాంబరం
ఉత్తేజాన్ని కలిగిస్తుంది. పువ్వుల నుంచి సహజ రంగులను తీస్తారు. నారింజ, పసుపు రంగుల్లో పూస్తుంది.
బంతిపూలు
యాంటీబయాటిక్‌ గుణాలుంటాయి. వ్యాధి నిరోధక, క్రిమి నిరోధక ఔషధంగా పనిచేస్తుంది. పువ్వుల నుంచి పసుపు రంగు తీస్తారు.
తామరపుష్పం
దగ్గు, చర్మ వ్యాధులు, అతిసారం, జిగట విరేచనాల నివారణకు పనిచేస్తుంది. చల్లదనాన్ని అందిస్తుంది.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.