హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజా వాణి —3

        హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజా వాణి —3
  —————————————-
                      ఇలా అప్రతిహతం గా తెలుగు ప్రజలు హోసూరు లో అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు ..ప్రక్క నున్న రాయ వెల్లూర్ ను ప్రభావితం చేసి ,అక్కడా తెలుగు పునరుజ్జీవనానికి సాయ పడ్డారు .’.ఈ ప్రాంతం లో దాదాపు యాభై దాకా జానపద కళలు వున్నాయి .అవి జీవచ్చవాలై పోయే పరిస్థితి వస్తోందని .ఆరాటం చెందారు .వాటిని మళ్ళీ వెలుగు లోకి తెచ్చి ఆ కళా కారులకు జీవన భ్రుతి కి లోటు లేకుండా చేయాలనే ఆలోచన వచ్చింది .స.వెం .రమేష్ గారు ఇక్కడికి వచ్చి జాన పద కలలను ఒక జాతర గా నిర్వహించాలని సూచించి ,వెంట నిలిచి ,కార్యక్రమానికి శ్రీ కాం చుట్టారు .దానిని ”పల్లె కళల పరస ” అనే పేరుతొ 2007 మార్చ్ 24  ,25 ., తేదీలలో హోసూర్ లో చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు .నాయని కృష్ణ కుమారి ,చిలుకూరి దేవపుత్ర రమేష్ బాబు ,రమేష్ వంటి ప్రముఖులు హాజరై దాన్ని దగ్గరుండి నడిపించారు .ఇది రెండు రోజుల పండుగ గా జరిగింది పరస అంతే జాతర .మనం కళా జాతర అంటాం .ముప్ఫై పల్లె కలలను కళా కారులు ప్రదర్శించ్చారు .దీని పై సావనీర్ కూడా తీసుకొని వచ్చారు .తెలుగు విస్గ్వ విద్యాలయం ,దాతల సహకారం తో రంగ రంగ వైభవం గా పరస జరిగి తెలుగు వారినే కాక అందర్నీ పరవశింప జేసింది .

డా వసంత్ , నారాయణ రెడ్డి, నేను , కృష్ణప్ప , ముని రాజు

                           ఇక్కడి యువ రచయితలను ప్రోత్చాహించే తలంపు తో తెలుగు కధ లను రచించే విధానం పై వర్క్ షాప్ నిర్వహించారు .ఆర్ వి ఎస్ .సుందరం వంటి రచయితలూ వచ్చి అర్ధవంతమైన రీతి లో నిర్వహించారు .హోసూర్ మాండలికం లో కధలు రాయించారు ..వాటిని ప్రచురిన్న్చి రచయితలకు గొప్ప ప్రోత్చాహం కలిగించారు .హోసూర్ సామెతలు ,నానుడులు ,పద బంధాలు శిధిలం కాకుండా వాటిని జాగ్రత్త గా సేకరించి భద్ర పరిచే కార్య క్రమం చే బడు తున్నారు ..ఇదే మన తరగని ఆస్తి .విజ్ఞాన సంపద .తరతరాల నుండి వస్తున్న నిధి .దాని విలువ అపూర్వం అనంతం .దాన్ని కాపాడు కోవాలి .మన తరం లో చేయ్క్క పొతే భవిష్యత్ తరాలు అసలు చెయ్యలేవు . వారికి అందుబాటు లో కూడా వుండవు దీన్ని బాధ్యత గా డాక్టర్ వసంత్ లాంటి యువకులు
సేకరిస్తున్నారు .
                          అనుక్షణ ఆలోచనా పరుడైన స.వెం .రమేష్ గారికి ఒక కొత్త ఆలోచన వచ్చింది .దక్షిణ రాష్ట్రాలయిన తెలుగు ,కన్నడ ,తమిళ మళయాళ మొదలైన అయిదు రాష్ట్రాల జాన పద కలాజాతర చేసి అందర్నీ తెలుగు జన జీవన స్రవంతిలో కలపాలి .అంతే అది వెంటనే కార్య రూపం దాల్చింది .తమిళనాడు లోని తిరుచు నాపల్లి అనే తిరుచి లో ఏర్పాటు చేశారు ..ఇదీ పల్లె కళల పరస పేరుతొ జరిగింది .అప్పటి దాకా విడి విడిగా వున్న పదిహేడు తెలుగు జాతులను సమావేశ పరిచి రమేష్ గారు వారందర్నీ ఒకే వేదిక మీదకు తెచ్చ్చారు .వారిలో ఐక్యత సాధించి ముందడుగు వేశారు తిరుచి లో అంతా రెడ్లు .బాగా సంపన్నులు .ఇదివరకు అంతా తెలుగే ఇప్పుడు మారింది .వాసవి మహల్ లో తిరుచ్చి కోట ఆకారం లో వేదిక ఏర్పాటు చేశారు .కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ,ఇతర రాష్ట్రాల మంత్రులు అందరు హాజ రైనారు .”దక్షిణ భారత పల్లె కళల పండుగ ”అని తెలుగు అక్షరాలతో వేదిక మీద అతి పెద్ద బాన్నెర్ కట్టారు ..”మా తెలుగు తల్లి కి మల్లె పూదండ ”పాటతో కార్యక్రమ ప్రారంభమయింది .కూచిపూడి నాట్యం తో కళా సంరంభం ప్రారంభమైది . మహా సంబరం గా జరిగాయి కళా వేడుకలు .జనం మెచ్చి వేలాది రూపాయలు కళా కారులకు ఇష్ట పూర్తిగా చదివించారు .ఆ ఉత్చాహం వర్ణనా తీతం .అంతా కన్నుల పండగే .ఒక్క క్షణం వృధా పోలేదు వచ్చిన వారందరికీ పెళ్లి భోజనాలను మించిన భోజనాలు వసతి కల్పించారు .స్థానిక రెడ్డి సంఘం మొత్తం ఖర్చు భరించి రెండు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసింది .మొత్తం 400 మంది కళా కారులు పాల్గొన్నారు .తమిళులు నోరు వెళ్ళ బెట్టి చూశారట .తెలుగు ఇంత ప్రమాదమా ?అని ముక్కున వేలు వేసు కొన్నారట .ప్రమాదం అంటె వాళ్ల భాషలో అద్భుతం అని అర్ధం ..ఇలా చేయటం వల్ల తెలుగు వారికి ఏమి ఒరిగింది అనే సందేహం రా వచ్చు .తెలుగు భాష ,సంస్కృతి ఎంత ప్రాచీనమైనవో    ,యెంత కళా సంపద తెలుగు వారికి ఉన్నదో ,ఎన్నెన్ని కళా రూపాలు తెలుగు లో వున్నాయో ఒకే వేదిక మీద తెలుగు వారి తో సహా అందరు చూసి తెలుసు కున్నారు .తల్లి భాష తెలుగు పట్ల పూజ్య  భావం ,gouravam,ఆరాధన కలిగాయి తెల్లుగు మాత్రుభాషీయుల ఉత్చాహం చాలా గొప్పది అనే అభిప్రాయం సర్వత్ర్ గోచరించింది .దీనిని చూసిన వారంతా తమ జిల్లాలో ఇలాంటి జాతర చేయమని మరీ మరీ కోరారట .అంతా స్పందన లభించింది .హోసూర్ ఏం ఎల్ ఏ..గోపీనాద్ గారు దీని కోసం చాలా shraminchaarata  ..ఆయన తెలుగు వాడే .తమిళ అసెంబ్లీ లో తెలుగు లోనే మాట్లాడు తారట .ఇదంతా రమేష్ గారి ప్రోత్చాహం ,హోసూర్ తెలుగు సంఘాల నిర్వహణ సామర్ధ్యం ..ప్రజల సహకారం ..
                                     హోసూర్ గురించి మరిఒన్ని సంగతులు నాల్గ భాగమైన చివరి భాగం లో తెలియ జేస్తాను
                                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —20 -07 -11 .క్యాంపు బెంగళూర్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు. Bookmark the permalink.

1 Response to హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజా వాణి —3

  1. satya's avatar satya says:

    దుర్గా ప్రసాద్ గారు, మీ దగ్గర స.వెం. రమేష్ గారి ఈ-మెయిల్ కాని, ఫోన్ నంబర్ కాని ఉంటే ఇవ్వగలరు. ఆయన్న్ను ఒకసారి కలవాలనుకుంటున్నాను.

    Like

Leave a reply to satya Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.