సినీ గీతా మకరందం -1
వేగాన్ని పాటలో చూపిన గీతం
తెలుగు చిత్ర జగత్తులో’’క్లాసిక్ ‘’అని మొదటగా పేరొందిన సినిమా మల్లీశ్వరి .అందులో పాటలు ,మాటలు, సంగీతం, అభినయం, దర్శకత్వం అన్నీ ఉన్నత స్తాయిలో ఉన్నాయి .అందుకే ఆ హోదా అందుకోంది .బి నాగి రెడ్డి దర్శకత్వ ప్రతిభకు నిలువు టడ్డం గా నిలిచిన సినిమా .కృష్ణ శాస్త్రి మాటా ,పాటా,సవ్య సాచిత్వం గా సాగిన చిత్రం .రసాలూరు రాజేశ్వర రావు సంగీత స్వరమాదురులు కురిసిన సినిమా .భానుమతి అందాలే కాక నటనకు గీటురాయిగా నిలిచింది ఘంట సాల స్వర మాధుర్యం శిఖరాయ మానం గా ఉన్నచిత్రం .అన్నీ కల బోసి ఒక మధుర రసం మామిడి పండుగా రూపొందిన చిత్రం మల్లీశ్వరి .
ఇందులో ఎన్నో పాటలున్నా ,అన్నీ అద్భుతమే అయినా ఏదీ రెండోదానికి తీసి పోనట్లున్నా నా మనసును ఆ నాడేకాదు ఈనాడూ ఆకర్షించే పాట మల్లీ ,నాగరాజులు సంతకు వెళ్లి రెండెడ్ల బండీ లో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఘంట సాల ,భానుమతుల యుగళ గీతం
అంటే బండీ పాట అత్యద్భుతం .ఆకాశం లో మేఘాలు నల్లగా ముసురుకొన్నాయి .ఇకనో ఇప్పుడో వర్షం వచ్చేట్లుంది .ఇంటికి పోవాలనే తొందర నాయికా నాయకులకు ఉంది .చీకటి పది పోతోంది .ఇంటి వద్ద పెద్దలేమను కొంటారో అని భయం .వర్షం భారీగా వస్తే తమ పరిస్తితి ఏమిటిఅని కంగారు ఇద్దరిలో ఉంది .త్వర త్వర గా ఇంటికి చేరిపోవాలి .అప్పుడు వికసించింది పాట.గిత్తల ఉరుకులు మబ్బుల బారుల పయనం లను రాజేశ్వర రావు స్వరకల్పనలో రూపం ధరించేట్లు చేశాడు .ఆ పరుగు వేగం అంతాపాట లో ధ్వనింప జేశాడు .ఆ తర్వాత ఎన్నో సినిమాలలో ఇలాంటి పాటలోచ్చినా దీని ముందు అన్నీ బలా దూరే దేవదాసు లో నాగేశ్వర రావు పట్నం నుంచి గుర్రబ్బండీ లో వచ్చే పాట ఉన్నా దీని తర్వాతే .అంత ఆకర్షణ గా విరిసింది ఈ పాట.భానుమతి ఘంట సాల ల కమనీయ గాత్రం రాజేశ్వర రావు భావానికి అనుగుణం గా పరిగెత్తి ఒక మధురాను భూతిని కలిగించింది
‘’- ఏయ్ పరుగులు తీయాలి .-ఒ గిత్తలు ఉరకలు వెయ్యాలి
ఊరు చేరాలి –మన ఊరు చేరాలి
ఓ –హోరుగాలి కారు మబ్బులు –మూగే లోగా, ముసిరే లోగా –ఊరు చేరాలి మన ఊరు చేరాలి .
గల గల గల కొమ్ముల గజ్జెలు –గణగణ గణ మెడలో గంటలు
వాగులు దాటి వంకలు దాటి –ఊరు చేరాలి
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో –అవిగో
ఊగే గాలుల తూగే తీగలు అవిగో –
కొమ్మన మూగే కోయిల జంటలు
జుమ్మున మూగే తుమ్మెదాగుంపులు
అవిగో అవిగో –అవిగో అవిగో –ఆ ఆ ఆ
ఇదీ పాట.ఎద్దుల కొమ్ముల గజ్జెల మోత ,మెడలోని గంటల మోతా వినిపించటమే కాదు కనీ పించేట్లు చేశారు రాజేశ్వర రావు .దాన్ని చిత్రాను వాదం చక్క గా చేశారు రెడ్డిగారు .వాగులు ,వంకలూ దాటాలన్న ఆదుర్దా .త్వరగా ఇంటికి చేరాలనే అతి తాపత్రయం అంతా ప్రతిధ్వనిమ్ చింది ఇక్కడ .మరి వీళ్ళను మరీ తొందర పెట్టాయి తెల్లని కొంగలు బారులు తీరి గూళ్ళకు చేరటానికి వీలై నంత వేగం తో పోతున్నాయి .వీటిని భయ పెడుతూ నల్లని మబ్బులు బారులు బారులుగా ఆకాశం లో కనీ పిస్తూమరీ తొందర చేస్తున్నాయి .అవి ఎక్కడో లేవు .అవిగో అక్కడే ఉన్నాయి బాబోయ్ అని వెన్ను చరుపుగా ఉన్నాయి .కోయిలలన్నీ కొమ్మల మీద మూగుతుంటే ,తేనే టీగలు జుం ఝుం అంటూ ముసురుతూ భయ పెడుతున్నాయి .కనుక గీత రచయితా కృష్ణ శాస్త్రి పల్లె వాతా వరణం లో దేన్నీ వదల కుండా భావాన్ని పొందు పరిస్తే దాని కనుగుణం గా స్వరాల జల్లు కురిపిస్తూ బండీ వేగాన్ని ,జోడెద్దుల జోరు తో జత కలిపి పరుగులు తీయించారు .ఇలా అన్నీ సమ పాళ్ళలో కుదిరి ,అనుకొన్న ఎఫెక్ట్ కు ఏంతో దోహదం చేసి ‘’,ఓ ఓ,ఏఏ ,ఆ ఆ ‘’లు పాత లో వేగాన్ని పెంచటానికి ఏంటో సహకరించాయి .పాటను చిరంజీవి ని చేశాయి .ఇందులో అందరూ అందరే .అందరి సమిష్టి కృషి తో ఈ గీతంన భూతో గా నిలిచి పోయింది ,’’హాట్స్ ఆఫ్ టువన్ అండ్ అల్ ఇన్ దిసాంగ్ . మరో గీతా మకరందం లో మళ్ళీ కలుద్దాం ..
‘’‘’మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12–13-ఉయ్యూరు

