మామేనల్లుడు చిశ్రీనివాకు సుస్తీ చేసిందని తెలిసి మద్రాస్ కు వెళ్లి చూసి రావాలనుకోన్నాను మంగళ వారం ఉయ్యూరు లో పోస్ట్ ఆఫీస్ లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ లో గురువారం పినాకిని మద్రాస్ కు శుక్రవారం తిరుగు ప్రయాణానికి టికెట్లు కొన్నాను ..ప్రయాణం అంటే మా ఇంట్లో హడావిడి ఎక్కువ .
గురువారం ఉదయం అంటే ఈరోజు ఉదయం ఆరింటికి బెజవాడలో పినాకిని బయల్దేరుతుంది .దాన్ని అందుకోవటానికి ఉయ్యోఒరు నుండి స్టేషన్ కు ఉదయం పావు తక్కువ నాలుగు నుండి బస్ లున్నాయి పరగడుపుఏమీ పెట్ట కుండా మా ఆవిడ పంపదు కనుక రాత్రి నిద్ర లేకుండా గడిపి,తెల్ల వారుఝామున రెండున్నరకే నేను లేస్తే మూడింటి కల్లాలేచింది .నెను స్తవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసే సరికి కాఫీ చేసి ఇచ్చింది తాగిసంధ్యా వందనం పూర్తీ చేశాను పూజ చేద్దామంటే ఇవాళ ఊరికి వెళ్తున్నాను కనుక దేవుడి పులికాపు చేద్దామని రాత్రే నాతో దేవుల్లను చింతపండు నీళ్ళలో నానేయించింది ..పల్లు తోముకొని రాత్రి రుబ్బి ఉంచిన మినప పిండి మిర్చి అల్లం వగైరాలతో వేడి వేడిగా పునుగులు చేసి నాకు పెట్టి దారిలోతినటానికి కొన్ని పాక్ చేసి ఇచ్చింది .అం తా పూర్తయ్యేసరికి సరికి పది నిమిషాలు తక్కువ నాలుగు అయింది .. మా అబ్బాయి రమణ బైక్ మీద నన్ను సెంటర్ కు తీసుకొని వెళ్లి 222సిటి బస్ ఎక్కించి ఇంటికి వెళ్ళాడు అది వెంటనే బయల్దేరి అయిదు నిమిషాలు తక్కువ అయిదింటికి బెజవాడ రైల్వే స్టేషన్ చేరింది ఒక గంట గడిస్తే తప్ప పినాకిని వచ్చి బయల్దేరదు.ఒకనంబర్ కె వస్తుంది కనుక హాయిగా కూర్చుని వచ్చేపోయే బండ్లను చోస్తోఒ గడిపాను .సరిగ్గా పినాకిని అయిదున్నర కు వచ్చింది .యెక్కి కూర్చున్నాను .ఉదయమ్ పూజ చేసుకో లేదు కనుక పుస్తకాలు తీసి పూజ చదువుకొన్నాను .సరిగ్గా ఆరింటికి బయల్దేరింది .
ఆయ్యప్పలె ఎక్కారు .నెత్తి మీద ఇరుమూద్ద్లు మేడలో దండలు నల్లని వస్త్ర ధారణా తో స్టేషనంతా సందడే సందడి ఱైలు ఆగిన ప్రతి స్టేషన్ లోను అయ్యప్ప స్వాములు గుంపులు గుంపులుగా ఎక్కారు వాళ్లకు వీడ్కోలు చెప్పటానికి బంధు మిత్రులు తన్దోపతందాలుగావచ్చారు .ఈహడా విడి సూల్లూర్రు పేట దాకా సాగింది .నిద్ర పట్టలేదు .
పదిన్నరకు నెల్లూరు లో మా శ్రీమతి మూట కట్టించిన టిఫిన్ మళ్ళీ లాగించి మంచి నీళ్ళు తాగాను . .బండీ అంతా జనమే జనం .నెను నాతో శ్రీ తల్లా వఝల పతంజలి శాస్త్రిగారి రచన ”భమిడి పాటి కామేశ్వర రావు ”చదవటం మొదలు పెట్టాను ..నేను ఇదివరకు నిది తెలుసుకొని అనేక విషయాలను పతన్జలిగారు చక్కగా క్రోడీకరించి చెప్పారు ఆయన జీవితం లో పడిన ఆర్ధిక ఇబ్బందులు వాటిని అధిగమించి మొక్క వోని ధైర్యం తో ఆయన ముందుకు సాగిన వైనంచాలాగోప్పగా రాశారు మాస్టారి ని సంపూర్ణం గా విష్కరించే పని చేశారు .సుమారు ఒక నలభై పేజీలే చదివాను మిగతాది తీరిగ్గాచదవాలి .ఇన్త మంచి పుస్తకాన్ని జనవరి లోనే నేను కొనుక్కున్నాఇంత చదవలేక పోయి నందుకు సిగ్గు పడ్డాను ఇప్పటికైనా చదువుతున్నందుకు ఆనందించా . ఇప్పటిదాకా ప్రయాణం హాయిగా సాగింది ..
నాయుడు పేట దాటాం ఽక్కది నుంచి ”రాజా వారి సత్రం ”అనే స్టేషన్ వచ్చింది సత్రం అని తెల్లుగు లోను హిందీ లోను బాగానే రాశి ఉంది ఇంగ్లీష్ లో ”ఛత్రం”అని రాసి ఉంది ఇది తమాషా ఽఅ స్టేషన్ పేరే ఒక తమాషా .. చీరాల అని తెలుగు లో ఉంటె chiralaఅని ఇంగ్లీష్ లో ఉనతమ్ వింత .. బండిని లూప్ లైన్లో పెట్టారు మద్రాస్ నుంచి వచ్చే మూడు రైళ్లకు క్రాసింగ్ ఇచ్చారు దీనితో మా బండి గంటన్నర ఆలస్యం గా బయల్దేరింది .సత్రమ్ నుండి సూళ్ళూరు పేట కు ఒంటెద్దు నడకే .ఇక పేట నుంచి చెన్నై సెంట్రల్ దాకామల్ల్లీ ఊరుకో ఉరుకు ంఅధ్యాహ్నమ్ ఒకటిం బావు కు చేరాల్సిన బండి మూడుం బావుకు ముద్దు ముద్దు ఆ స్టేషన్ లో అడుగు పెట్టింది ..పాపమ్ మా మేనకోడలి కొడుకు బాలాజీ ఒంటి గంటకే స్టేషన్ కు వచ్చి మా బందీకోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నాడు .న్ను దిగాఅనె తన బైక్ మీద ఇంటికి చేర్చాడు .ఇన్తికొచ్చె సరికి పావుతక్కువ నాలుగు ..ఇన్త్లొ మా మేనల్లుడు శ్రీనివాస్ కూడా వచ్చి నాకోసం కూర్చున్నాడు .ఉయ్యోరు నుండి తెచ్చిన స్వీటు హాటు మా మేనకోదలుకల కు ఇచ్చి భోజనం చేశా .వన్త అంటి చేసిన బంగాళాదుంప వేపుడు వేగలేదు కాని పొట్ల కాయ కూతు అదిరింది .సామ్బారు అదరహ ఱసమ్ భేష్ .తిని సాయంత్రం ఆరు వరకు పంచారామ విశేషాలు డొక్కాసీతమ్మ గారి పై సరస భారతి కార్యక్రమ వివరాలు ,పౌరామి నటి సత్యనారాయణ వ్రతం గుడిలో కార్తీక దీపాలు చెప్పాను నిద్ర పోలేదు .ఇన్తతి ఓపిక ఎలావచ్చిన్దినాకు అని వీళ్ళంతా బోలెడు ఆశ్చర్యం .
శ్రీనివాస్ ఆరోగ్య విషయాలు అడిగి తెలుసు కొన్నాను చాలా భాగం నయ మిది అనిచెప్పాడు ఆరు నెలలు మందు వాదాలన్నాడు బరువుతగ్గాడు .యెమైనా కుదుట పడ్డందుకు మహా సంతోషం గా ఉంది ..దారిలొ రెండు మూడు సార్లు మా రమణ ఫోన్ చేసివాకాబు చేస్తూనే ఉన్నాడు .కాఫీ తాగి నేను బాలాజీ ”పూర్విక ”అనే సెల్ షాప్ కు వెళ్లి సేల్త్రాన్ఫోన్లు చూశాంఽయిదు వేలు ఖరీదు పండగ అఫార్లున్తాయని కోన కుండా వచ్చాం
సాయంత్రం అయిదున్నరకు తణుకు నుండి స్పందన మామ గార మూర్తి గారు ఫోన్ చేశారు ఽఅ నాడు నేను మాట్లాడిన విషయాలు బాగున్నాయని ,రసరాజు గారికి నేను పంపిన పుస్తకాలు అందాయని చెప్పి రసరాజు గారు తన ప్రక్కనే ఉన్నారని మాట్లాడమని చెప్పారు మాట్లాడాను ఽఅ రోజు తణుకు లో నా ప్రసంగం చాలా బాగుదని ,పుస్తకాలు అందాయని చదివి మల్లీరాస్తానని తన పుస్తకాలు కూడా నాకు పంపిస్తున్నానని చెప్పి ఇలాకలుసుకోన్నండుకుసంతోశం గా ఉందని మూర్తిగారి ఆత్మీయత చెప్పలేదని అన్నారు ఱాత్రి ఎనిమిదింటికి భోజనం చేశాను మా అక్కయ్య అల్లుడు చంద్ర శేఖర్ తో కలిసి ఇలా ఈ రోజు గడిచి పోయింది భలే అనుభవాన్ని మిగిల్చింది ..
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ – 5-12-13-కాంప్ -మద్రాస్ .

