జీవ పరిణామం అంటే ఏమిటి ?(what is evolution ?)
‘’వాట్ ఈజ్ ఇవల్యూషన్ ‘అనే పుస్తకాన్ని ఎర్నెస్ట్ మేయర్ రచించాడు .ఇది 2001 లో విడుదలైన పుస్తకం .మేయర్ ను ప్రపంచ ప్రసిద్ధ జీవ పరిణామ శాస్త్ర వేత్త గా భావిస్తారు .అయన రాసిన పుస్తకాలన్నీ అత్యంత ప్రతిభా శీలం గా ఒరిజినల్ గా అంతర్ ద్రుష్టి తో రాసినవే .ఇరవై వ శతాబ్ద జీవ శాస్త్ర రుషి అంటారాయన్ను .ఇరవయ్యవ శతాబ్ది జీవ శాస్త్ర మేధావులలో ఒకనిగా ఆయన్ను పరిగణిస్తారు .’’ఇరవయ్యవ శతాబ్దపు డార్విన్ ‘’గా ఆయన్ను కీర్తిస్తారు .ఫసిఫిక్ ద్వీప పక్షులపై ప్రత్యెక పరిశోధన చేశాడు మేయర్ .అమెరికా లోని హార్వర్డ్ విశ్వ శ్వ విద్యాలయం లో ‘’professor of Emerittus in the museum of comparative zoolozy ‘’గా పని చేశాడు .డజనుకు పైగా పుస్తకాలు రాశాడు ఆయ5-7-1904 లో జన్మించి 3-2-2005న శతమాన జీవి గా జీవించి ణ జర్మన్ అమెరికన్ .ఆయనకు డార్వి -వాలేస్ మెడల్ ,డేనియల్ జిరాద్ ఇలియట్ మెడల్లభించాయి క్రాఫోర్డ్ ప్రైజ్ ను పొందిన ఘనుడు మేయర్ .
-.
పైన పేర్కొన్న పుస్తకం లోని ముఖ్య విషయాలను తెలుసుకొందాం .డార్విన్ చెప్పిన ‘’కామన్ డిసేంట్ బై మాడిఫికేషన్’’సిద్ధాంతాన్ని ఏర్నేస్స్ట్ మేయర్ ఆమోదించాడు .జీవ శాస్త్రం లో ప్రతిదీ పరిణామం అనే వెలుగు లోనే చూడాలన్నాడు .కణజాలం ను నింపే ద్రవాన్ని కోలోమిన్ అంటారని చెప్పాడు .’’Evolution is best understood as the genetic turn over of the individuals of every population from generation to generation ‘’ అని వివరించాడు .అయితే జనాభా(పాప్యులేషన్ ) అంటే ఏమిటి ?ప్రతి తెగ అనేక స్తానిక జనాభాలతో ఏర్పడి ఉంటుంది .ఒక తీరు జనాభాలో తరగతి కి ఇది విభేదించి ఉంటుంది .ప్రతి ఒక్క జీవి మరొక దానితో భేదిస్తుంది ఇదే జనాభా అన్నాడు .
ముందుగా డార్విన్ చెప్పిన ముఖ్యమైన అయిదు సూత్రాలను తెలుసుకొందాం .1-the constsncy of species 2-the descent of all organisms 3-gradualness of evolution 4-the multiplication of species 5-natural selection పరిసరాలకు అనుగుణం గా స్పెసీస్ ప్రవర్తించే ఏర్పాటును ‘’నిచీ ‘’అంటారు పరిణామం అనేది ఒక దిశా నిర్దేశనమే అన్నాడు మేయర్ .మానవ పరిణామం గూర్చి చెబుతూ ‘’ఏపులు ‘’ఆసియా ఏపులు ఆసియా ఏపులు అని రెండురకాలని అన్నాడు .మానవ శరీర నిర్మాణం అధ్యయనం చేస్తే అది ఆఫ్రికన్ ఏపులకుసమానం గా ఉంటుంది .మానవ మాలిక్యూల్స్ చింపాంజీ వాటి తో సదృశం గా ఉంటాయి .ఆఫ్రికన్ ఏపులుమనిషికి దగ్గర స్వరూపం లో ఉన్నాయి .హిమోగ్లోబిన్ ,ఎంజైములు ప్రోటీన్లు మొదలైనవి చిమ్ప్ లో ఉన్నట్లే బాగా పోలి ఉంటాయి అంటాడు ఎర్నెస్ట్ .వీటనన్నిటినీ పరిశీలిస్తే ‘’Africa was the cradle of ma n kind’’అని ఖచ్చితమైన అభిప్రాయాన్ని చెప్పాడు .
మానవుడు మిగిలిన జంతువుఅలకు భిన్నం గా ఉంటాడు .అతనిది ఒక ప్రత్యేకత .మానసిక శాస్త్రవేత్తలు దాదాపు రెండు దశాబ్దాలుగా చిమ్ప్ లకు భాషలను నేర్పే ప్రయత్నం చేస్తున్నారు .కాని అవి వ్యర్ధ ప్రయత్నాలయ్యాయి వ్యాకరణాన్ని స్వీకరించే నాడీ మండలం వాటిలో ఏర్పడలేదు .అందుకే అవి భూత, భవిష్యత్తుల గురించి మాట్లాడలేవు
.మానవ మేధ అన్నిటికన్నా గొప్పది .ఉష్ణ రక్తం ఉన్న వెన్నెముక జంతువులలో బుద్ధి ఎక్కువగా ఉంటుంది అన్నాడు మేయర్ .కొన్ని ప్రాధమిక జీవ రాశులు ఇతర గ్రహాలపై ఏర్పడి ఉండవచ్చు .కాని అధిక మేధా సంపద గల జంతు జాలం మాత్రం భూమి మీదనే 3,00,000 ఏళ్ళ కిందటే ఏర్పడింది అని స్పష్ట పరిచాడు ఎర్నెస్ట్ .ఆయన చెప్పిన మరో గొప్ప విషయం ఆయన మాటల్లోనే చెబితే బాగుంటుంది –‘’even though if something parallel to the origin of human intelligence ,should indeed have happened somewhere in the infinite universe ,the chance that we would be able to communicate it must be considered as zero .yes ,for all purposes man is alone ‘’
జీవ పరిణామం అంటే ఒక నిజం అంటే అనుమానం లేదు .ప్రాణి ఉత్పత్తి జరిగి న నాటి నుంచి ఇది జరుగుతూనే ఉంది .అని తన పుస్తకాన్ని ముగిస్తాడు’’ జీవ శాస్త్ర మేయర్ ‘’ అయిన ఎర్నెస్ట్ మేయర్
30-9-2002 .నాటి నా అమెరికా డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-13-ఉయ్యూరు
—