ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-2(చివరి భాగం )
ఖజు రాహో దేవాలయాల్లో నే కాదు ఖాట్మండు దేవాలయం లో కూడా ఇలాంటి శిల్పాలున్నాయి .వీటిని ‘’థియోలాజికల్ లైటనింగ్ కండక్టర్స్’’అన్నారు .ఇవి చెడును కంటితో చూడకుండా చేస్తాయని నేపాలీల భావన .అవి జీవితం లో యవ్వన దశకు ప్రబోధకాలని ,ఆదశలో తప్పని సరిగా శృంగారాన్ని అర్ధం చేసుకొని ,అందులోని అందాన్ని పొందాలని సూచన గా భావిస్తారు .అది మాత్రమె కాదు ముసలితనం లో మానవులు ఆ భావనకు దూరం కావాలని క్రమంగా విసర్జించాలని సూచనా ఉంది .ఖజురాహో దేవాలయాలలో ముఖ్యమైనది శివాలయం .ఈ శృంగార భంగిమల శిల్పాలు అంతరాలయానికి వెలుపల ఉన్న భాగాల పైనే ఉంటాయి .మానవ పునరుత్పత్తికి ఇవి సంకేతాలు .
‘’డివైన్ ఎక్టసి –ది స్టోరి ఆఫ్ ఖజురాహో ‘’అనే పుస్తకం రాసిన శోభితా పుంజా దీన్ని ‘’దైవ పార వశ్యం ‘’(డివైన్ ఎక్స్ట సి )అన్నది ఖజురహో శిల్పాలను చూసి .అది దైవ వివాహానికి ప్రతి రూపాలన్నది .అంటే శివ పార్వతుల వివాహ దర్పణం అని చెప్పింది .శివ రాత్రి నాడు ఈ దేవాలయానికి వేలాది భక్తులోచ్చి దర్శనం చేసుకొని పులకిస్తారు .ఇక్కడున్న అన్నిదేవాలయాలో ఇదొక్కటే శివ పూజకు ఉపయోగిస్తున్న దేవాలయం .మహా శివ రాత్రి నాడు శివ పార్వతీ కల్యాణం ఇక్కడ నిర్వహిస్తారు .హరహర మహా దేవా ఉచ్చారణతో ఆ ప్రాంతమంతా మారు మోగుతుంది .క్రైస్తవ చర్చిలలో కూడా ఆరాధన మానవ జీవితం లాగే ఉండాలని ఉంది .ఖజురహో శివాలయం లో కల్యాణం తరువాత దేవుడికి దేవేరికి గర్భాదాన కార్యక్రమానే పూజారి నిర్వహించటం విశేషం .ఇది తెల్లారే వరకు జరిగే ఉత్సవం .
శోభితా పుంజాచెప్పిన దాన్ని బట్టి ఆది దేవులు జగత్తుకు మాతా పితలు అయిన శివ పార్వతులు జీవిత పరమార్దానికి ప్రతీకలు .విరుద్ధ ప్రకృతుల కలయికలు .మన భాషలో పురుష స్త్రీ సంగమానికి చిహ్నాలు .అవేక్కడో బయట ఉన్నవికావు మానవ అంతరంగం లోఉన్న భావనలే మగా ఆడా .ఖజురహో శిల్పాలు దొంగ చాటుగా చూసేవేమీ కాదు .అవి రాయిలో ఉన్న జీవన ధర్మాలు .శృంగారాన్ని అణచుకో వద్దని చెప్పే సందేశాలు .సెక్స్ సరదాకి ,వినోదానికి కాదని వివరించే విధానాలు .సెక్స్ ప్రధాన మైనదే అని దాన్ని తొసిరాజా అనె పధ్ధతి పనికి రాదనీ వివరించేవి .దాన్ని పవిత్ర భావం తో ఆరాధనగా చేయాలి అనే సందేశం ఇచ్చేవి .
అమెరికా విశ్లేషకుడు రాబర్ట్ ఏ .జాన్సన్ రాసిన ‘’అండర్ స్టాండింగ్ ది సైకాలజీ ఆఫ్ రొమాంటిక్ లవ్ ‘’పుస్తకం లో ‘’the great paradoxes in romantic love is that it never produces human relationship as long as it stays romantic .It produces drama during adventures ,wondrous ,intense love scenes jealousies and betrayals but pe0ple never seem to settle into relationship with each other a flesh and blood human beings until they are out of the romantic love stage ,until they love each other instead of being in love ‘’అని చాలా అర్ధ వంతమైన విషయాలు రాశాడు . రొమాంటిక్ ప్రేమను విసర్జించమని దీని భావం మాత్రం కాదు .అది మనం చేయలేం .మన వల్లకాదు కూడా .శివ పార్వతుల పురాణకధలు కూడా దీనినే సూచిస్తాయని మరువ రాదు .శివ పార్వతులు కోరికకు వ్యతిరేకులు కారు .దాని ప్రాధాన్యాన్ని కాదనీ అనలేదు .కాముడనే పేరున్న మన్మధుడు తపస్సు చేసుకొంటున్న శివుని చలింప చేయటానికి బాణం వేస్తె శివుడు మూడో కంటితో భస్మం చేశాడు .కాని శివపార్వతుల కల్యాణం తర్వాత పార్వతి కోరిక మేరకు మన్మధు డిని సృస్తికార్యం ఆగి పోరాదని భావించి బతికించాడు .ఇక్కడే భారతీయులు పవిత్ర తకు ఇంద్రియ భోగానికి మధ్య సమతుల్య్తః సాధించారు .అదే ఆదర్శం గా ఖజురహో లో చెప్పారు .
రజనీష్ కూడా సెక్స్ జ్ఞాన వృద్ధి కి మార్గం అన్నాడు .ఇండియాలోని తాంత్రిక విధానాలను పాశ్చాత్యులు తప్పుగా అర్ధం చేసుకొన్నారు . తాంత్రికుల ఆవాసం శ్మశానమే .అది చావును ఎప్పుడూ గుర్తు చేస్తుందని వారి విశ్వాసం .తాంత్రికం లో భయాన్ని జయించే చర్యలే ఉంటాయి .చావు ఉన్నతికి ఒక మార్గమని నమ్ముతారు.తాను భూత భవిష్యత్ వర్తమానాల్లో ఉంటానని తాంత్రికుని విశ్వాసం .మురికి ,కాలుష్యం లపై భయాన్ని తొలగించటం .వీరి ప్రవర్తన ,పద్ధతులు హిందువులకు అంగీకారం కాదు .పాశ్చాత్య దేశాలలో మారుమూల గ్రామాల్లో ఇంకా సెక్స్ అంటే భయపడుతూనే ఉన్నారు .కొందరు దాన్ని అధిగమించి ముందుకు రాలేక పోవటమూ ఉంది .కాని సెక్స్ అనేది భయపడాల్సింది కాదు .అది ఆత్మ సాక్షికి శుద్ధ స్వరూపం .మెరుపు లోని కాంతి వంటిది .సృష్టికి కారణమైన ఇద్దరి మధ్యా ఉన్న తామర తూడు దారం లాఉన్న సంబంధం .
‘’ఇంటిమేట్ రిలేషన్స్ ‘’పుస్తకం లో సుదీర్ కాకర్ సెక్స్ అనేది అందులో పాల్గొన్న ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం ఆన్నాడు .కొందమంది స్త్రీలకూ అది అయిష్టం గా బాధాకరం గా అనిపించ వచ్చు కొందరు స్త్రీలు భర్త కొడతాడేమో నని అయిస్ట మైనా అందులో పాల్గొన్నా సంతృప్తి పొందారు. ఇది మరీ మురికి వాడలలోని దంపతుల పరిస్తితి .మర్మాంగాల పేర్లు చెప్పటానికే సిగ్గూ బిడియం పడతారు .పూర్వం ఇండియా లో బహి రంగా ముద్దు నిషిద్ధం .ఇప్పుడు కాస్త స్వేచ్చ వచ్చింది .ఇంద్రియ సుఖం లో మనవాళ్ళు పవిత్రతను ఆశించారు .ఒకప్పుడు కండోం లను వ్యతిరేకించిన వారు ఇప్పుడు దారి లోకి వచ్చారు .గాంధి గారు ఇంద్రియ నిగ్రహం పై ఎన్నో ప్రయోగాలు చేశాడు కొన్ని విమర్శలోచ్చినా ఆయన అంతస్సాక్షిని శంకించ లేము. .రామాయణం లో సీత ఒక బలహీన ఆబల అని కొందరి భావన .కాని పార్వతి అలా కాదు శక్తి శ్వరూపిణి.
శివుడు శక్తి లేనిదే ఏ పనీ చేయలేడు ఆశక్తియే పార్వతీ దేవి .వారిద్దరూ ఒకే నాణానికిబొమ్మా బొరుసు వంటి వారు .ఇ .ఒకరు లేక పోతే ఇంకొరు లేరు .కనుక పార్వతి మహిళలకే ప్రతీక మాత్రమె కాదు ,ఆమె పురుషునికీ ప్రతేకయే వారిద్దరిది అర్ధనారీశ్వర సంబంధం అని మర్చి పోరాడు .పాశ్చాత్య దేశాలలో దేవుడంటే పురుషుడిగానే చూపిస్తారు .చర్చిలలో ఫాదర్స్ ఉంటారుకాని మదర్స్ ఉండరు .కాని ఎందరో క్రిస్టియన్ పౌరాణిక మహిళలు ఉన్నా ,మహిళా క్రిస్టియన్ మతాధికారులు ఇటీవలి కాలం వరకు లేరు .ప్లాటో నుండి అరిస్టాటిల్ వరకుఫిలాసఫర్ లలో ఆడవాళ్ళు కు స్థానమే లేదు .బెర్ట్రాండ్ రసెల్ రాసిన ‘’హిస్టరీ ఆఫ్ వేస్త్రెన్ ఫిలాసఫీ ‘’పుస్తకం లో ఒక్క మహిళ పేరు కూడా లేక పోవటం బాధ కలిగిస్తుంది .’’ది పాషన్ ఆఫ్ దివేస్త్రెన్ మైండ్ ‘’లో రిచార్డ్ టర్నాస్’masculinity of thought as fundamental to the women struggle to establish our human autonomy from nature .The evolution of the western mind has been driven by a heroic impulse to forget an autonomous rational human self by separating itself from the primordial unity with nature ‘’అని రాశాడు .ఇటీవలి కాలం లో మగాడు ‘’మ్రుగాడు ‘’గా మారి ప్రవర్తిస్తున్న తీరు ఏక పక్షం గా మగాడు తీసుకొనే నిర్ణయాలను ఎత్తి చూపాడు .ఇవన్నీ ఆలోచిస్తే మనం ఖజురహో- శివ పార్వతుల లోక కల్యాణానికి ఒక ప్రతీకాత్మక ప్రత్యెక నిదర్శనమని తెలుస్తోంది .మహిళకు మగవాడికి భావాత్మక సమతుల్యాన్ని పరస్పర గౌరవాన్ని ఖజురహో దేవాలయాలు సందేశం గా తెలియ జేస్తున్నాయి .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-14-ఉయ్యూ

