డిం .టిం.ప్ర.జ.-4
డిం –గురూ !ఎండలు పెరుగుతున్నాయేకాని తగ్గటం లేదు ?
టిం –రెండో ఎండాకాలం అంటున్నారందుకనే .బాబు పేరు ఇంగ్లీష్ లో ‘’Chandra babu ‘’అని రాస్తారుకడా .అది ‘’ చండ్ర బాబు ‘’గా కూడా చదువుతాం .కనుక చండ్ర నిప్పులు కక్కుతున్నాడు సూర్యుడు .అందుకే వరుణుడు దగ్గరికొచ్చి కూడా భయం తో పారిపోతున్నాడు .ఇలా ఉంటె ఖరీఫ్ పంటకూడా అనుమానమే .
డిం –నిజమే గురూజీ !
టిం –పాపం బాబు అధికారానికి వచ్చిన ప్రతిసారి ఇలాదురద్రుస్టం వెంటాడటం బాధగానే ఉంది .ఈ సారైనా అన్నీ కలిసోస్తాయనుకొంటే విధి వెక్కి రెక్కిస్తోంది .సమర్ధుడైన నాయకుడికి దేవుడు పరీక్క్షలు పెడుతూ పరిశీలిస్తున్నాడు .లెట్ అస్ హోప్ బెటర్ .
డిం –ఈ మధ్య బాబు మోడీ ఎక్కడికి వెడితే అక్కడికి వెడుతున్నాడు?
టిం –అంటే నక్షత్రకుడిలా వెంట పడుతున్నడనే గా నీ భావం ? తప్పదు నాయనా !రాష్ట్రం బాగు పడాలంటే ఇలా వెంటపడి కంటపడి పని సాధించుకోవాల్సిందే .రాకెట్ లాంచింగ్ కు ముందు రోజునా ,రాకెట్ ప్రయోగానికి కాసేపు ముందూ మోడీని రెండు సార్లు కలిసి చేయాల్సిన పని లిస్టు తో మోదీ ని బాది పారేశాడు బాబు .
డిం –శ్రీహరి కోట రాకెట్ విజయమైంది కదా గురూ !
టిం –అవున్రా శిష్యా !అక్కడ మోడీ మాట్లాడిన మాటలు ఎంతో స్పూర్తి నిచ్చేవిగా దార్శనికం గా ఉత్సాహాన్నిచ్చేవిగా ఉన్నాయి .అ హాలీ వుడ్ సినిమా ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే చంద్రయాన్ కు మనం నాలుగొందల యాభై కోట్లే ఖర్చు చేశామని గుర్తు చేసి వెన్ను తట్టాడు శాస్త్ర వేత్తలను .అంతేకాదు సార్క్ దేశాల అవసరాలకు తగిన రాకెట్ ప్రయోగం చేయమని గొప్ప సూచనా చేశాడు .బహుశా తోలి ప్రధాని నెహ్రు తర్వాత ఇంత ఆలోచన చూపిన వాడు మోడీ అని పించాడు .జియో పొజిషన్ ఇప్పుడు అమెరికా చేతుల్లో ఉంటె దాన్ని సార్క్ చేతుల్లోకి తీసుకొవాల్సిన అవసరాన్ని చెప్పిన ప్రాజ్నుడని పించాడు .అదే దేశానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు .హాట్స్ ఆఫ్ టు మోడీ .
డిం –గురూజీ ఏదో మూడ్ లోకి వెళ్లి పోయారు ?
టిం –నిజమేరా మంచి చేస్తే మెచ్చాలి .చెడు చేస్తే బుద్ధి చెప్పాలి .అందుకే ముసలాయన ఆద్వాని ‘’మొదటి టెస్ట్ లోనే మోడీ ట్రిపుల్ సెంచరి సాధించాడు ‘’అని మెచ్చాడు .
డిం –నిన్న మమత ఎంపి ఏదో ప్రేలాడట ?
టిం –అవును .మార్క్సిస్ట్ పార్టీ ఆడవాళ్ళను రేప్ చేయిస్తానన్నాడు తపన్ పాల్ .ఇంకా అలా మాట్లాడిన వాడిపై చర్య తీసుకోకుండా ఉంచటం మమత కు మంచిది కాదు .చివరికి ఆయన భార్యే క్షమాపణ చెప్పింది భర్త తరఫున .ఇప్పటికైనా మమత తీవ్ర చర్య తీసుకోక పోతే పరువు కలకత్తా కాళికి బలి అయి పోతుందని గుర్తించాలి .ఇప్పుడే విన్న వార్త .ఏదో మొక్కు బడిగా క్షమాపణ చెప్పాడట ఆ ప్రబుద్ధుడు .
డిం –విప్పుల విషయం లో కొప్పులు పట్టుకొంటున్నారు నాయకులు ?
టిం –అవును .జగన్ పార్టీ వాళ్ళు ధిక్కరించి ఓటేస్తే అనర్హత వేటు పడుతుందని మైసూరా అంటూంటే అదేమీ ఉండదు హాయిగా గోడ దూకేయండి అని తెలుగు సోమిరెడ్డి అభయం ఇస్తున్నాడు .ఏది ఏమైనా ఈ కప్పల తక్కెడ తూకం కొద్దికాలం తప్పదు .స్వార్ధం యెంత పనైనా చేయిస్తుంది .
డిం –డిగ్గీ ఈ మధ్యేదో వాగి లేమ్పలేసుకొన్నాడు?
టిం –అది ఆయనకు మామూలే .రాహుల్ కు దమ్ములేదని నాయకత్వ లక్షణాలు పూజ్యం అని ,పార్టీ దారుణ వైఫల్యం పొందటానికి అతనే కారణమనీ కూశాడు .కాని వెంటనే ప్లేట్ మార్చేసి తాను అలా అనలేదని పేపర్ వాళ్ళ సృష్టే అని దబాయించాడు .శాంతం పాపం అని లేమ్పలేసుకొన్నాడు .ఏమైనా తాగిన వాడు నిజం బాగా చెబుతాడు అన్నట్లు డిగ్గీ నిజాన్ని నిర్భయం గా బైట పెట్టాడు .
డిం –షార్ లో మోడీ హుషార్ అన్నారు ?
టిం –ఇరవై ఆరుసార్లు విజయవంతం గా ప్రయోగం చేసన సంస్థను చూస్తె ఎవరికైనా అంత హుషార్ వస్తుంది ప్రధాని మంచివిషయానికి సహజ స్పందనే అది .శాస్త్ర సాంకేతిక వేత్తల ఉమ్మడి కృషి ఫలితమే ఇది .అంతా స్వంత పరికరాల విజ్ఞానం తో సాధించిన అద్భుత విజయమే కదా .అందుకే అంత ఆనందపడ్డాడు ప్రధాని మోడీ .అయినా ‘’ఇది నా మనసుకు చాలటం లేదు ‘’అని చెప్పి మార్గ నిర్దేశామూ చేశాడు .ఇన్నాళ్ళకు దేశ భవిష్యత్తు ఒక ప్రాజ్నుడి చేతిలో దూర ద్రుష్టి ఉన్న వాడి చేతిలోకి వచ్చినందుకు మనం గర్వ పడాలి శుభం భూయాత్ .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-14-ఉయ్యూరు

