ఆంగ్ల కవిత్రయాన్ని అవపోసన పట్టిన కేతలీన్ రైన్
ఆమె బ్రిటన్ దేశపు కవి విమర్శకురాలు ,విద్యావేత్త మీదు మిక్కిలి విలియం బ్లేక్, యేట్స్ ,కాల్ రిడ్జి కవి త్రయాన్ని అధ్యయనం చేసి అధారిటీ అనిపించుకొని ,ఆధ్యాత్మక భావనలకు ఆలవాలం గా నిలిచి ముఖ్యం గా ప్లాటోనిజం నియో ప్లాటోనిజం లపై సాధికారమైన అవగాహన కలిగిన మహిళ. ఆమెయే కాతలీన్ రైన్ .
రైన్ 1908 జూన్ పద్నాలుగున బ్రిటన్ లోని ఎసేక్స్ లో ఇల్ ఫోర్డ్ లో జన్మించింది .తల్లి స్కాట్ లాండ్ స్త్రీ .తండ్రి రుర్హాం వాసి .మొదటి ప్రపంచ యుద్ధకాలం లో నార్త్ అంబర్ ల్యాండ్ లో అమ్మ తరఫు బంధువుల దగ్గర గడిపింది .అక్కడి పరిసరాలు ఆమె లో కవిత్వ ధారకు సహకరించాయి. పులకించిన ప్రకృతిని చూసి కవిత్వం ఉప్పొంగి వచ్చేది .వారి భౌతిక జీవితాలలో కవిత్వానికి స్థానమే లేదని గ్రహించింది .ఈ విషయాలను తన జీవిత చరిత్ర ‘’ఫేర్ వెల్ హాపీ ఫీల్డ్స్ ‘’లో రాసు కొన్నది .ఉదయం సాయంత్రం బైబిల్ ను శ్రద్ధగా చదివి బట్టీ పట్టి స్పూర్తి పొందింది .కవిత్వం అంటే జీవిత సారం అని భావించింది .తండ్రి హైస్కూల్ లో ఇంగ్లీష్ మేస్టార్ అవటం తో ధిసీస్ కోసం వర్డ్స్ వర్త్ కవిత్వాన్ని ఎంచుకొన్నాడు .షేక్స్ పియర్ అన్నా వీరాభి మానం ఉండేది ఆయనకు .కనుక చిన్న పిల్లగా ఉండగానే తండ్రి తో షేక్స్పియర్ నాటకాలకు వెళ్లి చూసేది . వ్యాకరణం, శబ్ద శాస్త్రం మీద విపరీత మైన అభిమానమేర్పడింది .కవిత్వాన్ని ముఖతా చెప్పటం ఆమెకు ఎంతో ఇష్టం గా ఉండేది .నార్త్ అంబర్ లాండ్ ను ఈడెన్ గా భావించి పులకించేది .తనకు కవిత్వం భగవంతుడిచ్చిన వరం అని అనుకొన్నది .అదేమీతను కనీ పెట్టిన విద్యకాదన్నది .కవిత్వ వాతావరణం లో పెరగటం వలన కవికావాలనే ద్రుష్టి ఏర్పడిందని చెప్పింది .కవులు ఈ ప్రపంచానికి చెందని వారుగా వేరే స్థాయిలో ఉండేవారుగా ఆమె తండ్రి భావించేవాడు .అయిదవ గాస్పెల్ మీద ద్రుష్టి పెట్టమని చెప్పేవాడు. తల్లి ఆమె కవిత్వాన్ని ప్రోత్సహించేది .
ఇల్ ఫోర్డ్ కౌంటి హైస్కూల్ లో బాటనీ జువాలజీ లైన నేచురల్ సైన్స్ లను చదివింది .1929లో కేం బ్రిడ్జి లో మాస్టర్ దిగ్రీపొందింది .అప్పుడు ఆమెకు జాకబ్ బ్రౌన్స్కి ,విలియం ఎంప్ సన్ వంటి కవులు రచయితలతో పరిచయ మేర్పడింది .కబ్బాలిష్ రచయిత ఉపాధ్యాయుడు అయిన షిమాన్ హల్వేలి తో జీవితాంతం స్నేహం నెరపింది.1930 లో హాగ్ డేవిస్ ను పెళ్ళాడి ,వదిలేసి చార్లెస్ మద్గే ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కనివదిలేసి గావీన్ మాక్స్ వెల్ ను ఆరాధించింది .అతను ‘’రింగ్ ఆఫ్ బ్రైట్ వాటర్ ‘’నవలా రచయిత . దీన్ని సినిమాగా కూడా తీశారు .,దీనికి ప్రేరణ రైన్ రాసిన కవిత ‘’ది మారేజ్ ఆఫ్ సైక్’’.ఆమె పెంపుడు కుక్క ‘’మిజ్బి ‘’మరణానికి మాక్స్స్ వెల్ బాధ్యుడని ,హోమో సెక్సువల్ అని భావించిశాపనార్ధాలు పెట్టి అతడిని వదిలేసింది . పాపం అతను కొద్ది రోజుల్లోనే కేన్సర్ వచ్చి చనిపోయాడు .ఇలా జరగటానికి అతని మరణానికి తనే కారకురాలని తెలుసుకొని పశ్చాత్తాప పడింది .భర్త మరణం తర్వాత పిల్లలిద్దరితో పెన్ రిత్ లో కాపురముంది .పిల్లల పెళ్ళిళ్ళు చేసింది .ఒకరికి నియో ప్లాటోనిస్ట్ అయిన టేలర్ వరాసు లతో బాంధవ్యం ఏర్పడింది . ఇదే టేలర్ పై పరిశోధనకు దారి చూపింది .ఒక ప్రమాదం లో రైన్ లండన్ లో 2003 జులై ఆరున 95వ ఏట మరణించింది .
స్టోన్ అండ్ ఫ్లవర్ అనే మొదటి కవితా సంపుటిని 1943లో ప్రచురించింది .తర్వాతా ‘’లివింగ్ ఇన్ టైమ్స్ ,ది పైతోనేసేస్ ,కలేక్తేడ్ పోయెమ్స్ వరుసగా ప్రచురించింది .’’హు ఆర్ వుయ్ ‘’అనే క్లాసిక్ రచన చేసింది .’’బ్లేక్ అండ్ ట్రడి షాన్ ‘’పేరా రెండు భాగాలుగా రాసింది . అమెరికాలోని వాషింగ్ తాన్ లో నేషనల్ గాలేరీ ఆఫ్ ఆర్ట్స్ లో విలియం బ్లేక్ పైన అన్ని విషయాలను సాకల్యం గా చర్చించి అద్భుతమైన ఉపన్యాసాన్ని 1968లో చేసి అందరిని ఆకట్టుకొని బ్లేక్ పై తనకున్న ఆరాధనను ఆయన గొప్పతనాన్ని ఎన్నో ఉదాహరణ లతో అనర్గళం గా మాట్లాడి ఆశ్చర్య పరచింది .సాంప్రదాయ ఫిలాసఫీకి భిన్నం గా బ్లేక్ చేసిన సిద్ధాంతాల పూర్వా పరాలను సమీక్షించింది .
మూడు భాగాలలో వచ్చిన ఆమె స్వీయ జీవిత చరిత్ర ఆమె మన తో మాట్లాడుతూ కబుర్లు చెప్పేంత గొప్పగా ఆకర్షణీయం గా ఉంటుంది .బాల్జాక్ రాసిన ‘’కజిన్ బెట్టె’’ను ‘’లాస్ట్ ఇల్లూజిన్స్ ‘’(lost illusions)ను అద్భుతం గా ఇంగ్లీష్ లోకి అనువదించింది .త్రైమాసిక పత్రిక అయిన ‘’స్టడీస్ ఇన్ కంపారటివ్ రెలిజియన్ ‘’కు వ్యాసాలను రాస్తూనే ఉంది .ఈ పత్రిక రెలిజియస్ సింబాలిజం ట్రాఫిడిషల్ పెర్స్పెక్టివ్ నెస్ అంటే మతాత్మిక ప్రతీకాత్మతకు సాంప్రదాయ దర్శన శాస్త్రానికి ప్రాముఖ్యత నిస్తుంది .’’టేమనాస్ ‘’అనే పత్రికన మరి ముగ్గురితోకలిసి స్థాపించింది .ఇదే తర్వాత అకాడెమీ గా మారి వివిధ విశ్వ విద్యాలయలాలో జరిగే ఫిలాస ఫి విషయాలను పర్య వేక్షించింది .కవిత్వం లో ప్లాటో నిజాన్న్న్ నియో ప్లాటో నిజాన్ని గూర్చి సమగ్ర చర్చ చేసింది .పద్దేనిమోదో శతాబ్దికి చెందిన ఇంగ్లీష్ ప్లాటోనిస్ట్ అయిన థామస్ టేలర్ పై గొప్ప అధ్యయనం చేసి రాసి పుస్తక రూపం లోకితెచ్చింది .
గిర్ట న్ కాలేజి లో 1955నుంచి ఆరేళ్ళు రిసెర్చ్ ఫెలో గా ఉంది .మిత్ అండ్ లిటరేచర్ ను హార్వర్డ్ యూని వర్సిటి లో లేక్చరర్ లకు ప్రొఫెసర్ లకు వేసవి తరగతుల్లో బోధించింది .సిగో లో ఉన్న యేట్స్ స్కూల్ లో బ్లేక్ మీద యేట్స్ మీద ఎన్నో ప్రసంగాలు చేసింది .కేం బ్రిడ్జిలో ప్రొఫెసర్ గా అనేక విశిస్ట రచనలు చేసిన కాతేలీన్ రైన్ కాల్ రిడ్జి ,బ్లేక్ యేట్స్ ల పై పూర్తీ అధారిటీ ఉన్న ఆమె . ఇంగ్లాండ్ అమెరికా ,ఫ్రాన్స్ దేశాలు రైన్ కు ఎన్నో విశిష్ట గౌరవాలిచ్చి సత్కరించాయి .అమెరికన్ పోయెట్రి అసోసియేషన్ ‘’విన్సెంట్ మిల్లె ప్రైజ్ ‘’నిచ్చి సత్కరించింది .హారియట్ మన్రో అవార్డ్ ,ఆర్ట్స్ కౌన్సిల్ అవార్డ్ ,ఆస్కార్ బ్లూ మెంతల్ అవార్డ్ ,కాల్మొండలీ ఆవార్డ్ ,స్మిత్ లిటరరీ అవార్డ్ ,క్వీన్స్ గోల్డ్ మెడల్ ,ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ,లి ఆర్డర్ దేశ ఆర్ట్స్ అవార్డుల వంటి ఎన్నో ప్రముఖ పురస్కారాలను అందుకొన్నది .
పది హీను కవితా సంపుటాలను కేతలీన్ వెలువరించింది .పద్నాలుగు వచన గ్రంధాలను రాసి ముద్రించింది .’’ఫేర్ వెల్ హాపీ ‘’,ది లాండ్ అన్ నోన్ ,’’,’’దిలయన్స్ మౌత్ ‘’,ఆటో బయాగ్రఫీస్ ‘’పేరిట స్వీయ జీవిత చిత్రణ చేసుకొన్నది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-14-ఉయ్యూరు

