బ్రాహ్మణాల కధా కమా మీషు-15
ఉప బ్రాహ్మణాలు
సామ వేదానికి ఉన్న తలవ కార ,తాండ్య బ్రాహ్మణాలలో యజ్న యాగాదులను గురించి చెప్పారు .చాన్దోగ్యం వీటి గురించి చెప్పక పోయినా వివాహాది సంస్కారాలగురించి చెప్పింది .మిగిలినవి పేరుకు బ్రాహ్మణాలేకాని అవీ యజ్న యాగాదులను గురించి చెప్పలేదు అందుకని వాటిని ఉప బ్రాహ్మణాలు అన్నారు .అవే సామ విధాన బ్రాహ్మణం ,దేవతాధ్యాయ బ్రాహ్మణం ,సంహితోపషత్ బ్రాహ్మణం ,వంశ బ్రాహ్మణం .మొదటి దానిలో వచ్చే జన్మ లో శాశ్వత సుఖ ప్రాప్తికోసం కృషి చేయాలని ,ఈలోకం లో దుఖాలతో బాధ పడరాదని ధర్మాన్ని అతిక్రమించకుండా ప్రయత్నించాలని ,ఏకోరిక తీరాలో ఆకోరికకు సామలు కూడా చెప్ప బడ్డాయి .
రెండవ దానిలో ఏ సామకు ఎవరు దేవత, అది దేవతలో ,చెప్పారుకనుక ‘’దైవత బ్రాహ్మణం ‘’అయింది .గానం చివర విని పించే ధ్వనిని బట్టి సామలను కని పెట్టి ,వాటి దేవతలను చెప్పింది .అనేక రాకాల ఛందస్సులు ,రంగులు ,దేవతలు పేర్కొన బడ్డారు .ప్రతీకను ఉపాసించే విధానాలకు బీజం ఇందులో ఏర్పడి నట్లు భావించాలి .మూడవ దాని లో మంత్రం సముదాయాన్ని సంహిత అంటారని మనకు తెలుసు .కాని ఇందులో సంహిత అంటే గానం అని అర్ధంఅని గ్రహించాలి సామ వేదం లో రుక్కులే గానం చేయబడి సామలు అని పిలువ బడ్డాయని మనం చెప్పుకొన్నాం .ఉపనిషత్ అంటే ఇక్కడ ‘’రహస్యం’’ అని అర్ధం .సామ గానం లో ఉండే విశేషాలను రహస్యాలను తెలియ జేసేదికనుక ‘’సంహితోపని షత్ బ్రాహ్మణం అని అన్నారు .నాల్గవ ఉప బ్రాహ్మణమే వంశ బ్రాహ్మణం .వేదాధ్యయనం గురు శిష్య పరంపరగా రావాలని సామల గానం గురువు అనుగ్రహం వలననే పొందాలని ,ఇలా ఈ పరంపరను కాపాడుకొస్తున్న మహర్షుల వివరాలను ఈ బ్రాహ్మణం తెలియ జేసింది .అందుకే వంశ బ్రాహ్మణం అయింది .ఈ నాలుగు ఉప బ్రాహ్మణాలు కురుక్షేత్ర తూర్పు భాగం లో క్రీ పూ అయిదవ శతాబ్ది లో ఏర్పడ్డాయని భావిస్తారు .
మొదటిది అయిన సామ విధాన బ్రాహ్మణానికి సాయనుడు ‘’వేదార్ధ ప్రకాశిక ‘’అనే భాష్యం రాస్తే ‘’పదార్ధ మాత్ర వివ్రుతి’’ అనే భాష్యాన్ని భారత స్వామి చెప్పాడు .ఈయన సామ సంహితకూ భాష్యం రాశాడు .హోసల రాజు రామ నాధుడి పాలనలో శ్రీ రంగం లో సామ సంహితకు భాష్యం రాసి నట్లు తెలుస్తోంది .తరువాతే ఈ బ్రాహ్మణానికి వ్యాఖ్య రాసి ఉంటాడు .రెండవది అయిన దేవతాధ్యాయ బ్రాహ్మణానికి వ్యాఖ్య అవసరమే లేదు .అయినా సాయనుడు భాష్యం రాసినట్లు చెప్తున్నారు .మూడవది అయిన సంహితో పని షత్ బ్రాహ్మణం మొదటిఖండం వరకు సాయణ భాష్యాం తో దొరుకుతోంది .చివరిదైన వంశ బ్రాహ్మణానికి సాయన భాష్యం దొరుకు తోంది .ఈ నాలుగింటిలోని విశేషాలను ఇప్పుడు తెలుసుకొందాం
ఆడ పిల్లను మనకు నచ్చిన వాడిడికి ఇచ్చి పెళ్లి చేయాలనీ చెప్పింది మొదటి బ్రాహ్మణం .దీనికి ఒక మార్గమూ సూచించింది పిల్ల తండ్రి అమా వాస్య రాత్రి నాలుగు దారుల కూడలి లో అమ్మాయిని కూర్చో బెట్టి ‘’ఏ హ్యూషు బ్రవాణితే ‘’ అనే సామ ను మూడు సార్లు అభిషేకం చేయాలి .ఇలా మూడు అమావాస్యల్లో మూడు సార్లు చేస్తే పిల్లకు ఇష్టమైన వాడితో పెళ్లి అవుతుంది అని కిటుకు చెప్పింది .
రెండవ దానిలో ఛందస్సుకు సంబంధించ ఎన్నో వివరాలున్నాయి .వేదం, సావిత్రీ దేవి, సత్యం నన్ను కాపాడు గాక అని ‘’బ్రహ్మ సత్యం చ పాతు మాం ‘’అనే సామ చాలా ప్రాముఖ్యమైనది .అంటే జ్ఞానం సావిత్రీ దేవి శాశ్వత సత్యం మనల్ని ఎప్పుడూ కాపాడాలని అర్ధం .నాల్గవ బ్రాహ్మణం లో సామ గానం చేసే వాళ్ళకు ,సామగాన విశేషాలు తెలుసుకోవాలను కొనే వారికి చింతామణి లాంటిది .యోగ్యుడైన శిష్యుడు దొరక్క పోతే గురువు విద్యనూ తన దగ్గరే ఉంచుకోవాలని అయోగ్యుని చేతిలో ఉంచరాదని చెప్పింది .నాల్గవ దానిలో సామ గాన మహర్షుల పూర్తీ వివరాల తో బాటు ,వంశ క్రమం ,చెప్పి ఏ సందేహం వచ్చినా తీర్చే విధం గా ఉంది .
సామం గొప్పతనం
సామ విధాన బ్రాహ్మణం లో సామ యొక్క గొప్ప తనం చెప్ప బడింది .మొదట బ్రహ్మం అనే పదార్ధం మాత్రమె ఉంది .దాని నుంచి హిరణ్య గర్భుడు ఉదయించాడు .ఆయన మనసు లో నుంచి ప్రజా పతి ఉద్భ వించాడు .ప్రజాపతి అంటే మనస్సు .అతడు చరాచర సృష్టిని చేశాడు .తన సృష్టికి సామ ను జీవన సారం గా ఇచ్చాడు .సప్త స్వరాలతో కూడిన సామమే దేవతలకు ,పితరులకు ,మానవ ,పశు పక్ష్యాడులకు జీవనోపాయం కనుక సామను ‘’అన్నం ‘’అని అన్నారు .సామ స్వరూపం వాక్కు .వాక్కు రూపమే రుక్కు .సమానం కనుక సామ అయింది .అంటే అనేక రకాల ఛందస్సులకు ఇది సమానం .సామ తత్వాన్ని తెలుసు కొంటె ఇహ లోకం లో ప్రతిష్ట పెరుగుతుంది .దీని అంతరార్ధం ఏమిటంటే -చక్కని గానమే సామం .దానికి సప్త స్వరాలు మూలం .భావంతో సాహిత్యాన్ని జోడించి గానం చేస్తే అమృతం లాగా ఆప్యాయం అవుతుంది .గానామృతం తో పరవశించని ప్రాణి సృష్టిలో లేదు. లోకానికి గాన ప్రాశస్త్యాన్ని ప్రసాదించింది భగ వంతుడే కనుక గానం యొక్క గొప్ప తనం ఇందులో తెలుప బడింది .
ఒకప్పుడు దేవతలు ప్రజాపతి చెప్పినట్లు యజ్న యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు .అయితే దేవతలా కన్నా తక్కువైన అజులు,ప్రుష్ణులు ,మొదలైన ఋషులు ,వైఖానసులు అనే మంత్రం ద్రష్టలు ,మానవులు వెళ్లి తమకు స్వర్గం చేరే మార్గాన్ని చెప్పమని తమ తండ్రి ప్రజాపతి ని అడిగారు. ‘’స్వాధ్యయనం ‘’అంటే యజ్ఞాలలో విధింప బడ్డ సామలను గానం చేయటం ,తపస్సు వల్లస్వర్గ ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు .వీరందరూ సామాధ్యయనం చేసి స్వర్గం పొందారు .
తపస్సు
శరీరాన్ని వేడెక్కించి ఇంద్రియాలను అదుపు లో ఉంచుకోవటానికి చేసే సాధనే తపస్సు .ఇందులో క్రుచ్చ్రం ,అతి క్రుచ్రం ,క్రుచ్చాతి క్రుచ్చ్యం అని మూడు రకాలున్నాయి .వీటిగురించి వివరాలు తరువాత తెలుసుకొందాం
సశేషం –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-14-ఉయ్యూరు

