
లండన్(ఏజెన్సీస్): వచ్చే ఏడాది పార్లమెంట్ స్క్వేర్ వద్ద ప్రతిష్టించనున్న మహాత్మా గాంధీ విగ్రహం కోసం ఒక స్వచ్ఛంద సంస్థ సుమారు 10 లక్షల పౌండ్లను విరాళంగా సేకరించనున్నది. బ్రిటన్‌కు చెందిన ఛారిటీ కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన గాంధీ స్టాచ్యూ మెమోరియల్ ట్రస్టును ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్ ఏర్పాటు చేశారు. వచ్చే వారం నుంచి ప్రజల నుంచి విరాళాలను సేకరించనున్నారు. మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణం కోసం దాదాపు 10 లక్షల పౌండ్లు అవసరమవుతాయి. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా, ఎంత తక్కువ మొత్తమైనా విరాళంగా ఇవ్వవచ్చు. ఇది ప్రజా విగ్రహం’’ అని మేఘనాథ్ దేశాయ్ మంగళవారం సాయంత్రం లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన ఏషియన్ బిజినెస్ అసోసియేషన్ సమావేశంలో ప్రకటించారు. ‘‘విగ్రహానికి తామే మొత్తం నిధులిస్తామంటూ చాలా మంది ముందుకు వస్తున్నారు. కాని ఏ ఒక్క కోటీశ్వరుడో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో పేరు ప్రతిష్టలకోసం పాకులాడకూడదు. అది ప్రజల ఆస్తి కావాలి’’ అని లండన్ కు చెందిన విద్యావేత్త, రచయిత అయిన దేశాయ్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని 2015 జనవరి 30న మహాత్ముని వర్ధంతి నాడు ఆవిష్కరించాలని యోచిస్తున్నట్లు దేశాయ్ చెప్పారు. ‘‘నరేంద్ర మోడి(భారత ప్రధాని) ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నాను’’ అని కూడా ఆయన చెప్పారు.
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D